ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల కదలికలు, అధికార పక్షం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర రాజకీయాలను నిత్యం వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న నూతన రాజకీయ వ్యూహాలు, ఆయన అడుగులు ఏ విధంగా మారుతున్నాయనే అంశంపై రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా చర్చిస్తున్నారు. వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని పలు ఆసక్తికర అంశాలపై చర్చించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  దాని అధినేత జగన్  తమ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజల్లో నిత్యం ఉండేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు నాయకత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ప్రజాక్షేత్రంలో గళం విప్పేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ పథకాల అమలుతీరు, ఎన్నికల హామీల వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా వైఎస్సార్‌‌సీపీ అడుగులు వేస్తోంది. జగన్  ప్రవేశపెడుతున్న ఈ కొత్త స్కెచ్ వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడం, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాలను రూపొందించడం ఈ వ్యూహంలో ప్రధాన భాగాలు. ఎన్నికల ఫలితాల ద్వారా వచ్చిన రాజకీయ వెనకడుగును అధిగమించడానికి, నాయకత్వ శైలిలోనూ, ప్రజా సమస్యల స్పందనలోనూ మార్పులు తీసుకువస్తున్నారు. ఈ వ్యూహం వల్ల పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండినప్పటికీ, అధికార పక్షం నుంచి వచ్చే ప్రతిఘటనను సమర్థవంతంగా ఎదుర్కొనే సవాలు కూడా జగన్ ఎదుట నిలిచింది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయడం ద్వారా మళ్లీ ప్రజల్లో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పార్టీ భావిస్తోంది. ఈ రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రానున్న కాలంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. జగన్ అనుసరిస్తున్న కొత్త రాజకీయ వ్యూహాలు ఫలితమిస్తే, అది రాష్ట్రంలో బలమైన ద్విముఖ పోరుకు దారితీసే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడడం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టడంలో ఈ వ్యూహాలు ఎంతవరకు విజయవంతమవుతాయనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ, ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల లేదా భవిష్యత్ ఎన్నికలపై గణనీయమైన ముద్ర వేయడం ఖాయం.     [ Vasthava Vedika, Kanthamaneni Ravi Shankar, Dolendra Prasad, TOne News, Telugu one, YSJagan, CM Chandrababu, Naralokesh, YSRCP, TDP,  Telugu One, Telugu News ]
కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ఎంపీ విజయసాయిరెడ్డి, వరుస ప్రెస్ మీట్లతో ఒకదాని వెంట ఒకటిగా సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఆయన వైజాగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన విషయాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చెప్పిన విషయం, ప్రస్తావించిన అంశం, వెల్లడించిన వివరాలను అలా ఉంచితే..   పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.  విజయసాయిరెడ్డి  కొత్త పార్టీ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది పక్కనపెడితే..  వైసీపీ అధినేత  జగన్‌  సమావేశాల కంటే సాయిరెడ్డి ప్రెస్‌మీట్లే ప్రజల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  వివిధ అంశాలపై వైఎస్ జగన్ సుదీర్ఘంగా ప్రసంగించడమే కాకుండా, గణాంకాలు, పోలికలపైనే ఎక్కువ దృష్టిపెడుతుంటారు. దీంతో ఆయన విలేకరుల సమావేశాలు సాగదీతగా, రొడ్డకొట్టుడు ప్రసంగాలుగా మీడియా ప్రతినిథులు చెబుతుంటారు. అంతే కాకుండా జగన్ ప్రెస్ మీట్లలో గణాంకాల విషయంలో ఫ్యాక్చువల్ ఎర్రర్స్ సర్వసాధారణమి  చెబుతారు.దీంతో ఆయన మాట్లాడే విషయంలోని తప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవ్వడమే కాకుండా, జగన్ ను కూడా ట్రోల్ మెటీరియల్ గా మర్చేస్తుండటం కద్దు. అయితే అందుకు భిన్నంగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశాలు రంజుగా, పసందుగా, పదునుగా, స్ట్రాటజిక్ గా సాగుతుంటాయి.  గణాంకాల జోలికి పోకుండా, ప్రజలను,  మీడియాను ఇట్టే ఆకట్టుకునే సంచలన రాజకీయ విమర్శలకు విజయసాయి ప్రాధాన్యత ఇస్తారు.   ఉదాహరణకు చెప్పాలంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం, మత మార్పిడులు, వైసీపీలో సజ్జల ఆధిపత్యం, పార్టీలో అంతర్గతంగా ఆయన సాగిస్తున్న అరాచకం, తననే స్వయంగా కొట్టారంటూ సజ్జలపై సంచలన ఆరోపణలు,   విశాఖపట్నం వర్సెస్ మావిగున్   వంటి వాటిని ఆయన ప్రస్తావిస్తూ, ఇటు మీడియానూ, అటు ప్రజలనూ ఏకకాలంలో ఆకట్టుకోగలుగుతున్నారు. అన్నిటికీ మించి దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికీ, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ జగన్ కు సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డి.. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలను సహజంగా జనం నమ్ముతున్నారు. కేవలం సంచలన వ్యాఖ్యలుగా కొట్టిపారేయకుండా, అందులో వాస్తవం ఉండే ఉంటుందన్న కోణంలో చర్చ జరుగుతోంది.  ఈ కారణంగానే జనం విజయసాయి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు? ఏ సంచలన విషయాలు వెల్లడిస్తారు? అని ఆసక్తిగా చూస్తున్నారు.   [Vijayasai Reddy Jagan, AP Politics, Visakhapatnam, Press meet, YSR Congress Party, Vijayasai, New Party, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  బందర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని ఎప్పుడు వార్తల్లో ఉంటుంటారు. తనదైన వాగ్ధాటితో  ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు రేకెత్తడానికి దోహదపడుతుంటారు. అసలు పేర్ని నాని పరిచయం అక్కర్లేని పేరు.  అయితే తాజాగా ఆయన తన సహజ శైలికి భిన్నంగా ఇటీవల ఎక్కడ లేని అసహనాన్నీ ప్రదర్శించారు. విషయమేంటంటే..   ఇటీవల బందర్ లో ఆయన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కార్యకర్తలతో పేర్ని నాని భేటీ అవ్వడం కొత్తేం కాదు. చాలా మంది నేతల కంటే చాలా చాలా ఎక్కువ సార్లు ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతుంటారు. వారిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంటారు. అలా నింపడానికి ఆయనకున్న వాగ్ధాటి దోహదపడుతుంటుంది. అందుకే పేర్ని నాని సమావేశం ఏర్పాటు చేశారంటే కార్యకర్తలు ఉత్సాహంగా ఆ భేటీకి తరలి వస్తుంటారు. అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది.  అందుకు కారణమేంటంటే.. ఐదేళ్ల వైసిపి హయాంలో   తన సొంత సామాజిక వర్గానికి, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదంటూ  ఈ సమావేశంలో కార్యకర్తలు పేర్ని నానిని నిలదీశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నోసార్లు సామాజిక సమీకరణలను తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందిన పేర్ని నాని.. కార్యకర్తలు నిలదీయడంతో సహనం కోల్పోయారు. పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలకు కులాలేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన కార్యకర్తలపై ఒక్క సారిగా సామాజిక సమీకరణాలంటారేంటి అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. సామాజికవర్గం పేరు చెప్పుకుని ఎదిగిన నాని ఒక్కసారిగా ఇలా రివర్స్ అవ్వడమేంటంటూ విస్తుపోయారు.  తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేతకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సొంత పార్టీ నేతలకు నిలదీస్తుంటే.. వారిని సముదాయించడం చాతకాక, మంత్రి కొల్లు రవీంద్రపై నోరు పారేశసుకున్నారు.  తెలుగుదేశం పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని, తాను మాత్రం కేవలం విధేయత చూపిన వాళ్లకే పదవులు ఇచ్చాననీ పరోక్షంగా కొల్లును విమర్శిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతోంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. పేర్ని తీరు, వ్యాఖ్యలు.. బందర్ లో వైసీపీ సీన్ అయిపోయిందా? లేక వైసీపీలో పేర్ని నాని సినిమా అయిపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  బందర్ నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి బలోపేతం అయ్యిందనీ, ఇందు కోసం మంత్రి కొల్లు రవీంద్ర చురుకుగా వ్యవహరిస్తున్నారనీ, ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పార్టీని నడిపించడంలో విఫలమైన నాని, డిఫెన్స్ లో పడి.. అసహనంతో రగిలిపోతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దానికి తోడు.. తన రాజకీయ వారసుడిగా ఎదుగుతాడని ఆశించిన పేర్ని కిట్టూ కూడా ప్రజాక్షేత్రంలో ఆకట్టుకోవడంలో విఫలం కావడం కూడా పేర్ని నాని అసహనానికి కరాణంగా చెబుతున్నారు.   [Perni Nani, Machilipatnam, Kollu Ravindra, Y CP , AP Politics, Andhra Pradesh Politics, Restlessness, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
  మెగాస్టార్ చిరంజీవి.. ఏ విషయంపైనైనా స్పందించడంలోను, తోటి వారిని అభినందించడంలోను ముందుంటారు. ఈ కోవలోనే  రీసెంట్ గా  ఎంతో మంది ప్రాణాలు కాపాడిన పైలెట్  'స్మిత్ మచ్చర్' గురించి ట్వీట్ చెయ్యడం జరిగింది. ఎక్స్ లో 'తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్  మచ్చర్  గారికి నా హృదయపూర్వక అభినందనలు.ఇజ్రాయెల్‌కి వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోను సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలని ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం.   ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు.జై హనుమాన్ అని ట్వీట్ చెయ్యడం జరిగింది. సినిమాల పరంగా చూసుకుంటే చిరు ప్రస్తుతం 'కాకా' తో బిజీగా ఉన్నాడు.     [Chiranjeevi Tweet About smit machchhar, Chiranjeevi Latest Tweet, Chiranjeevi Latest Movie, Smit machchhar, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]
Hanuman Ansh is now set for a Telugu release on October 9, putting it directly against Trivikram Srinivas’ upcoming film AK 47. The clash is particularly interesting because Trivikram was initially associated with the Telugu release of Hanuman Ansh as its presenter. Trivikram’s association with the film ended after differences over the Telugu release plans, following which Hombale Films stepped in and acquired the Telugu rights. The film, which was originally planned for a September release, was later pushed to October 9. The Hindi version of Hanuman Ansh has already turned out to be a major success, collecting Rs.400 crores, creating strong interest around its Telugu release. The film’s unexpected box-office performance has also given the dubbed version a market of its own. Interestingly, the film will now arrive on the same day as Trivikram’s AK 47, starring Venkatesh. With Trivikram having initially been attached to Hanuman Ansh and later moving ahead with his own film, the box office clash has naturally become a talking point in the Telugu film industry. Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
కొన్ని సినిమా జోడీలు ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో అలాగే గుర్తుండిపోతాయి. అలాంటి జోడీల్లో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంట ఒకటి. 2008లో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట.. ఆ తర్వాత మళ్లీ కలిసి నటించలేదు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈసారి ప్రేమకథతో కాకుండా ఓ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌తో జతకట్టారు. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే కొత్త ఓటీటీ ఒరిజినల్‌కు సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ‘నా వైఫ్ మిస్సింగ్’ టైటిల్‌కు తగ్గట్టుగానే కథ మొత్తం ఓ మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది. ఇందులో వరుణ్ సందేశ్ బాలు అనే బ్యాంకు ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. తన భార్య కనిపించడం లేదంటూ అతడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత పోలీసులు విచారణ మొదలుపెట్టడంతో అసలు భార్య ఏమైంది? ఆమె ఎక్కడికి వెళ్లింది? ఈ మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. గ్లింప్స్‌లో కనిపించే కొన్ని సన్నివేశాలు కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో వరుణ్ సందేశ్ పోషించిన పాత్ర పేరు కూడా బాలు కావడం విశేషం. ఇప్పుడు ‘నా వైఫ్ మిస్సింగ్’లోనూ ఆయన బాలు పాత్రలోనే కనిపించనున్నారు. అయితే అప్పటి లవ్ స్టోరీకి పూర్తి భిన్నంగా ఈసారి సస్పెన్స్, క్రైమ్ నేపథ్యంలో కథ సాగనుంది. శ్వేతా బసు ప్రసాద్ వరుణ్ సందేశ్ భార్య పాత్రలో నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ జంట మళ్లీ కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్‌తో పాటు ప్రవీణ్, మోహిత్, జబర్దస్త్ సత్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘నా వైఫ్ మిస్సింగ్’ అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. మరి భార్య నిజంగానే మిస్సయ్యిందా? ఆమె అదృశ్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్ వచ్చే వరకు ఆగాల్సిందే.     [Naa Wife Missing, Varun Sandesh, Shweta Basu Prasad, Varun Sandesh Shweta Basu Reunite, Kotha Bangaru Lokam Pair, Naa Wife Missing OTT, Naa Wife Missing Aha, Varun Sandesh New Movie, Shweta Basu Prasad New Movie, Telugu Crime Thriller, Aha Original Movie]
ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు గాని, నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరని సినిమా వాళ్లే ఒక ఫేమస్ సినిమాలో డైలాగ్ రాసారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులని మోసం చేసిన మేకర్స్ ఉంటారేమో గాని, మేకర్స్ ని మోసం చేసిన ప్రేక్షకులు లేరు అనే కొటేషన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం. గాంధీ జయంతి తో పాటు వీకెండ్ కావడంతో థియేటర్స్ అన్ని ప్రేక్షకులతో కళకళ లాడుతున్నాయి. ముఖ్యంగా మల్టిప్లెక్స్ లో అయితే వయసుతో తారతమ్యం లేకుండా  జాతర వాతావరణం. దీంతో అక్కడ పని చేసే స్టాఫ్ ముఖాల్లో సంతోషం ఒక రేంజ్ లో ఉంది. కానీ థియేటర్ నుంచి బయటకి వచ్చిన ప్రేక్షకుడి ముఖం మాత్రం డల్.  మేకర్స్ ప్రకటనలు, ప్రమోషన్లు చూసి థియేటర్ల వైపు అడుగులు వేసిన సినీ ప్రియులని  కంటెంట్ లేని సినిమాలు తీవ్రంగా అసంతృప్తికి గురిచేశాయి. ఫహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్', సందీప్ కిషన్ 'సిగ్మా', గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన 'అనకాపల్లి' లాంటి చిత్రాలతో పాటు భారీ నిర్మాణ విలువలతో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్‌ మూటగట్టుకున్నాయి.    స్టార్ కాస్టింగ్, అగ్ర నిర్మాణ సంస్థల బ్యాకింగ్ ఉన్నప్పటికీ, సరైన కథాబలం మరియు స్క్రీన్‌ప్లే లోపించడంతో ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. నేడు విడుదలైన నాలుగు ప్రముఖ చిత్రాల సగటు బాక్సాఫీస్ రేటింగ్‌లు 2.0/5 నుండి 2.75/5 మధ్యకే పరిమితమవ్వడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ఫస్ట్ హాఫ్‌లో కొంత వినోదాన్ని పంచినప్పటికీ, ప్రిడిక్టబుల్ కథ మరియు వీక్ సెకండాఫ్ కారణంగా 2.25/5 నుండి 2.75/5 రేటింగ్స్ కే పరిమితమైంది. కథలోని ప్రధాన భావోద్వేగాలు ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ కాకపోవడమే దీనికి ప్రధాన కారణం.మరోవైపు తమిళ ప్రముఖ నటుడు విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన 'సిగ్మా' చిత్రం హీస్ట్ డ్రామాగా తెరకెక్కినప్పటికీ, కథనంలో పట్టు లేక బాక్సాఫీస్ వద్ద 2.25/5 రేటింగ్ తో నిరాశపరిచింది.  ఇది కూడా చదవండి: ఎందుకు ఇట్లా చేసిండ్రు: 'సిగ్మా' టాక్ వెనక ఉన్న అసలు నిజాలు! సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా లాంటి నటీనటుల ప్రతిభను ఈ సినిమా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. అలాగే క్రైమ్, తీవ్రమైన యాక్షన్ ఎలిమెంట్స్‌తో వచ్చిన 'అనకాపల్లి' కూడా నేటి ప్రేక్షకుల అభిరుచికి తగిన రీతిలో లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి నైరాశ్యాన్నే మూటగట్టుకుంది. ఇంప్యూర్ అనే మరో మూవీ కూడా ఒక ఉదాహరణ. ఈ విధమైన నెగెటివ్ వాతావరణంలో కొద్దిగా ఉపశమనం కలిగించిన చిత్రం 'తెల్లకాగితం'. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిన్న సినిమాకు 2.5/5 రేటింగ్‌తో పాటు పాజిటివ్ టాక్ లభిస్తోంది. ప్రథమార్ధంలో అమాయకత్వంతో కూడిన కామెడీ మరియు యూత్‌కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పెద్ద సినిమాలు కంటెంట్ లేక బోల్తా పడుతున్న వేళ, చిన్న చిత్రమైన 'తెల్లకాగితం' బాక్సాఫీస్ వద్ద కొంతవరకు ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో మేకర్స్ కేవలం పబ్లిసిటీపైనే కాకుండా స్క్రిప్ట్ బలంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ వారం బాక్సాఫీస్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.  మరి దీన్ని బట్టి ఏం అర్ధమయ్యింది. వరుస సెలవుల మధ్య అరడజను సినీ పండుగ వచ్చిందని ప్రేక్షకుడు, సినీ ప్రేమికుడు సంబరపడుతుంటే వాళ్ళ నమ్మకాన్ని నీటి బుడగ చేసారు.   [This week Released Telugu Movies Reviews, This week Released Movies Public Talk, Sigma Movie Public Talk, Sigma Movie Review Telugu, Dont Trobule The dont Trobule, sigma Movie Review In Telugu, Sigma Movie Review, Sundeep Kishan Sigma Movie Review]
Jason Sanjay’s directorial debut Sigma opened in theatres on Friday, October 2, with his family turning up to support him on the big day. Vijay’s wife Sangeetha Sornalingam and daughter Divya Sasha made a rare public appearance as they arrived at Chennai’s Kamala Cinemas for an early screening of the film. Videos from the theatre showed Sangeetha and Divya making their way inside, with Sangeetha acknowledging photographers. Jason Sanjay was also seen accompanying his mother and sister at the theatre. Following the screening, an emotional moment between Jason and his mother, as the two hugged amid cheers, was captured on camera. The appearance has drawn attention given how rarely Sangeetha and Divya are seen in public. Recent reports have also focused on developments surrounding Vijay and Sangeetha’s relationship, although neither has publicly confirmed the reports surrounding their marriage. Sangeetha’s appearance at Sigma keeps the focus, however, on her support for her son as he begins his journey as a filmmaker. Sigma, starring Sundeep Kishan and Faria Abdullah, marks Jason Sanjay’s debut as a writer-director. The young filmmaker had earlier said that Vijay would not be involved in the film’s promotions, as he wanted the attention to remain on the movie rather than his father’s star status. At the film’s promotional event, Jason thanked his mother, father and sister for their support.  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 1854–1878 మధ్య జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను దర్శకుడు రాహుల్ పంచుకుంటున్నారు. తాజాగా ‘రణబాలి’ పాత్రను తీర్చిదిద్దడం వెనుక ఉన్న స్ఫూర్తి గురించి ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి అనే యోధుడి పాత్రలో కనిపించనున్నారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన రాయలసీమ ప్రాంతానికి చెందిన వీరుడిగా ఈ పాత్రను చూపించబోతున్నారు. అయితే రణబాలి పాత్రను ఒకే వ్యక్తి జీవిత కథ ఆధారంగా రూపొందించలేదని, ముగ్గురు రాయలసీమ వీరుల స్ఫూర్తిని తీసుకుని పాత్రను తీర్చిదిద్దినట్లు దర్శకుడు రాహుల్ వెల్లడించినట్లు సమాచారం. దీంతో విజయ్ పోషిస్తున్న ఈ పాత్రలో చారిత్రక నేపథ్యంతో పాటు కల్పిత అంశాలు కూడా మిళితమై ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక రష్మిక మందన్న ఈ సినిమాలో జయమ్మ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు తన తల్లి పేరు పెట్టినట్లు గతంలో దర్శకుడు రాహుల్ తెలిపారు. 19వ శతాబ్దానికి చెందిన మహిళగా జయమ్మ పాత్రను రూపొందించినప్పటికీ.. నేటి మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఆమె క్యారెక్టర్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. విజయ్, రష్మిక జంటగా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత కలిసి నటిస్తున్న మూడో సినిమా ఇదే కావడం మరో ప్రత్యేకత. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో విలన్‌గా కనిపించనుండగా.. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్, యాక్షన్ సన్నివేశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘రణబాలి’ అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు రణబాలి పాత్ర వెనుక ఉన్న ఈ ముగ్గురు రాయలసీమ వీరులు ఎవరు? వారిని దర్శకుడు ఎలా సినిమాలోకి తీసుకొచ్చారు? అనే విషయాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.     [Ranabaali, Ranabaali Movie, Vijay Deverakonda Ranabaali, Rahul Sankrityan, Ranabaali Character, Rayalaseema Warriors, Vijay Deverakonda New Movie, Rashmika Mandanna Ranabaali, Ranabaali Release Date, Ranabaali Movie Updates]
  ఇళయ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ చేపట్టి సందీప్ కిషన్ తో  తెరకెక్కించిన మూవీ 'సిగ్మా'. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి మాట్లాడటంతో పాటు విజయ్ కొడుకు డైరెక్టర్ గా డెబ్యూ మూవీ కావడంతో ప్రాజెక్ట్ పై క్రేజ్ అనేది ఏర్పడింది. అయితే షోస్ పడినప్పటి దగ్గర నుంచి  మేకింగ్ అద్భుతంగా ఉందనే ప్రశంసలు వస్తుంటే, మరోవైపు నెగెటివ్ టాక్ కూడా వినిపిస్తుంది.  ఇందుకు ప్రధాన కారణం కథ, కథనం.. ఏ లాంగ్వేజ్ లో చూసుకున్న సిగ్మా లాంటి  కథలు చాలా వచ్చాయి.  పైగా క్లైమాక్స్ లో  ఏం జరుగుతుందో సినిమా ఫస్ట్ సీన్ లోనే తెలిసిపోతుంది. ప్రిడిక్టబుల్ సీన్లు, సెకండాఫ్ ప్రొసీడింగ్స్ నెమ్మదించాయి. స్క్రీన్‌ప్లేలో ఎలాంటి ట్విస్ట్‌లు లేవు.  కానీ జేసన్ సంజయ్ మేకింగ్ శైలి, షాట్ డివిజన్, సందీప్ కిషన్  టైమింగ్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయని. జాసన్ , సందీప్ మరో కథతో సెల్ల్యులాయిడ్ పైకి వచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని    సినీ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది కూడా చదవండి: Sigma Movie Review Telugu: సిగ్మా మూవీ రివ్యూ    రివ్యూస్ కూడా తెలుగు, తమిళ నాట నెగిటివ్ గానే వస్తున్నాయి. మరి తొలి రోజుతో పాటు వీకెండ్ లో ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. లండన్, కెనడాలో జాసన్ ఫిలిం మేకింగ్ లో శిక్షణ పొందాడు.    [Sigma Movie Public Talk, Sigma Movie Review Telugu, sigma Movie Review In Telugu, Sigma Movie Review, Sundeep Kishan Sigma Movie Review, Sigma Movie, Jasan Sanjay, Telugu Cinema News, Tollywood CInema News, Tollywood]      
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తనదైన బోల్డ్ కామెడీతో సంచలనాలు సృష్టించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. ఆయన సినిమాల్లో కామెడీతో పాటు సమాజంలో కనిపించే కొన్ని అంశాలను వ్యంగ్యంగా చూపించే విధానం ప్రత్యేకంగా ఉండేది. అలాంటి సినిమాల్లో ‘ఆరుగురు పతివ్రతలు’ కూడా ఒకటి. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో బోల్డ్ కంటెంట్, రియలిస్టిక్ కామెడీతో ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. పెళ్లి, వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు, భార్యాభర్తల మధ్య అపార్థాలు, వివాహేతర సంబంధాలు, బలవంతపు పెళ్లిళ్లు వంటి పలు అంశాలను ఈవీవీ తనదైన కామెడీ శైలిలో ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా ఆరుగురు మహిళల జీవితాల చుట్టూ కథను నడిపిస్తూ.. వారి పెళ్లిళ్లు, భర్తలతో ఎదురైన సమస్యలు, వ్యక్తిగత అనుభవాలను కథలో భాగంగా తెరకెక్కించారు. అప్పట్లో ఇలాంటి అంశాలను కామెడీతో కలిపి చూపించడం కొత్తగా అనిపించడంతో సినిమాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో అమృత, లహరి, చలపతిరావు, ఎల్‌బీ శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు అప్పట్లో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రీ-రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రీ-రిలీజ్‌పై ప్రకటన రావడంతో సోషల్ మీడియాలో కూడా ఆసక్తి మొదలైంది. దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. రీ-రిలీజ్‌ను అక్టోబర్ 29న నిర్వహించనున్నట్లు తాజా సమాచారం. పాత సినిమాల రీ-రిలీజ్‌లకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో ‘ఆరుగురు పతివ్రతలు’కు ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈవీవీ సత్యనారాయణ కెరీర్‌లో ‘ఆరుగురు పతివ్రతలు’కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పొచ్చు. అప్పటి ప్రేక్షకులను నవ్వించడంతో పాటు అప్పటి వరకు పెద్దగా చర్చకు రాని కొన్ని వైవాహిక అంశాలను కూడా సినిమాలో ప్రస్తావించారు. ఇప్పటికీ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, కామెడీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో కనిపిస్తుంటాయి. దీంతో ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి వస్తుండటంతో ఈవీవీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.   [Aaruguru Pativratalu Re Release, Aaruguru Pativratalu Movie, EVV Satyanarayana, Allari Naresh, Aaruguru Pativratalu Re Release Date, EVV Cult Classic, Telugu Movie Re Release, Allari Naresh Movies, EVV Satyanarayana Movies, Aaruguru Pativratalu 2026]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరిగి చాలామంది కఠినమైన డైట్ ప్రణాళికలను అనుసరిస్తున్నారు. వారం పొడవునా తక్కువ కేలరీలు, పోషకాలు ఉన్న ఆహారాన్ని తింటూ తమ శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకుంటారు. అయితే వారం చివర్లో లేదా ప్రత్యేకమైన సందర్భాలలో చాలామంది తమకు అత్యంత ఇష్టమైన ప్రాసెస్డ్ ఫుడ్, నూనెలో వేయించిన తినుబండారాలు, తీపి పదార్థాలు మరియు ఫాస్ట్ ఫుడ్‌ను ఆస్వాదించడానికి  చీట్ డే  (Cheat Day) లేదా  చీట్ మీల్  క్రమాన్ని ఎంచుకుంటారు. వారం మొత్తం పడిన కష్టానికి ఇది ఒక రివార్డులా అనిపించినప్పటికీ, ఒక్కసారిగా అత్యధిక కేలరీలు, అధిక మోతాదులో సోడియం (ఉప్పు), సంతృప్త కొవ్వులు (Saturated Fats) మరియు ప్రాసెస్డ్ చక్కెరలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన హృదయనాళ వ్యవస్థ (Cardiovascular System) పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఒకేసారి భారీగా కేలరీలు చేరుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు హఠాత్తుగా పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళాలలో తాత్కాలికంగా వాపు (Inflammation) ఏర్పడి, రక్తనాళాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్క చీట్ మీల్ వల్ల రక్తపోటు (Blood Pressure) తాత్కాలికంగా పెరగడమే కాకుండా, గుండె రక్తాన్ని పంప్ చేయడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. నిపుణుల పరిశోధనల ప్రకారం, వారంలో క్రమం తప్పకుండా తీసుకునే కఠినమైన డైట్ కంటే, చీట్ డే సమయంలో ఒకేసారి పరిమితికి మించి ఎక్కువ కేలరీలు తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ లేదా కుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉన్నవారు చీట్ మీల్స్ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తే అది తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అయితే చీట్ డేస్ అనేవి కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తాయి. డైట్ క్రమంలో ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉండటం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి పరిమితమైన చీట్ మీల్స్ తోడ్పడతాయి. కానీ దీనిని ఆరోగ్యకరంగా నిర్వహించడం చాలా అవసరం. చీట్ డే రోజున ఆకలిని తట్టుకోలేక ఒకేసారి పెద్ద మొత్తంలో తినడానికి బదులుగా, పోర్షన్ కంట్రోల్ (పరిమిత పరిమాణం) పాటించడం అత్యంత ముఖ్యం. ఉదాహరణకు చీట్ మీల్‌లో అధికంగా ఆయిల్ ఉన్న పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్ వంటి ప్రాసెస్డ్ పదార్థాలకు దూరంగా ఉంటూ.. ఇంటి వద్ద తక్కువ నూనెతో శుభ్రంగా తయారుచేసిన ఇష్టమైన వంటకాలను ఎంచుకోవచ్చు. అలాగే ఆహారాన్ని నమిలి మెల్లగా తినడం వల్ల తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన భావన కలిగి గుండెపై అదనపు భారం పడకుండా ఉంటుంది. చీట్ మీల్ తీసుకున్న తర్వాత రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, అధికంగా ఉన్న సోడియం సమర్థవంతంగా బయటకు వెళ్లిపోతాయి. అంతేకాకుండా చీట్ మీల్ తిన్న తర్వాత కొద్దిసేపు తేలికపాటి నడక లేదా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. ఆహారాన్ని ఎంజాయ్ చేయడం ఎంత ముఖ్యమో, దాని పరిమితులను గుర్తించి గుండెను కాపాడుకోవడం అంతకంటే ప్రధానం. కఠినమైన డైటింగ్ మినహాయింపుల పేరుతో గుండె ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా, సమతుల్య ఆహారం మరియు క్రమబద్ధమైన వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.     Cheat day impact on heart health, high calorie cheat meal risks, junk food effect on heart, cheat meals cardiovascular risk, fitness cheat day heart warning.
ప్రతిరోజూ ఉదయం ఉడకబెట్టిన గుడ్డు తినడం చాలామందికి అలవాటు. శారీరక బలానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోడిగుడ్డును అత్యంత చౌకైన , సమర్థవంతమైన ఆహారంగా నిపుణులు చెబుతుంటారు. అయితే  చాలామంది గుడ్డు తినేటప్పుడు తెల్లసొనను మాత్రమే తిని, పచ్చసొనను తీసి పక్కన పడేస్తుంటారు. పచ్చసొన తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లేదా చెడు కొవ్వు పెరిగిపోతుందని, గుండె ఆరోగ్యానికి మంచిది కాదని, బరువు పెరుగుతారని రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అలాగే చిన్న పిల్లలకు పచ్చసొన ఇస్తే అరగదని భావించేవారు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ కేవలం శాస్త్రీయ ఆధారం లేని అపోహలు మాత్రమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  నిజానికి గుడ్డులోని అసలైన పోషక నిధి పచ్చసొనలోనే దాగి ఉంటుంది. పచ్చసొనలో ఉన్న ముఖ్యమైన పోషకాలు , వాటి ప్రాముఖ్యత గుడ్డులోని సంపూర్ణ పోషక విలువలు మన శరీరానికి అందాలంటే పచ్చసొనను తీసివేయకుండా పూర్తిగా తినడం ఎంతో అవసరం. పచ్చసొనలో లభించే ప్రధానమైన పోషకాలు మన శరీరానికి ఏ విధంగా తోడ్పడతాయో వివరంగా తెలుసుకుంటే.. మెదడు అభివృద్ధికి.. గుడ్డు పచ్చసొనలో కోలిన్ అనే పోషక పదార్థం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది మెదడు సరైన రీతిలో పనిచేయడానికి , జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. విశేషమేమిటంటే, ఎదుగుతున్న చిన్న పిల్లలలో మెదడు వికాసానికి , నరాల వ్యవస్థ నిర్మాణానికి కోలిన్ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. నరాల బలానికి, రక్తకణాల తయారీకి విటమిన్ బి12.. పచ్చసొనలో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొత్త రక్తకణాలు తయారవ్వడానికి, శరీరం చురుగ్గా ఉండటానికి , నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. సాధారణంగా మనం తినే శాఖాహారంలో ఈ విటమిన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహార లోపాలను భర్తీ చేసుకోవడానికి గుడ్డు పచ్చసొన ఒక గొప్ప ఆహార మూలంగా పనిచేస్తుంది. కంటి చూపుకు, రోగనిరోధక శక్తికి విటమిన్ ఏ..  ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సాయపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, పలురకాల ఇన్ఫెక్షన్లు , వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరుకు సెలీనియం..  గుడ్డు పచ్చసొనలో సెలీనియం అనే ముఖ్యమైన ఖనిజ లవణం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి , శరీరంలో జీవక్రియల వేగాన్ని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. గుడ్డును పూర్తిగా ఎందుకు తినాలి? గుడ్డు తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది, కానీ పచ్చసొనలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ , మేలైన పోషకాలన్నీ నిండి ఉంటాయి. కేవలం తెల్లసొన మాత్రమే తింటే గుడ్డు నుంచి వచ్చే పూర్తి పోషకాహార ప్రయోజనాలను మనం కోల్పోయినట్లే అవుతుంది. అందుకే అనవసరమైన భయాలు, అపోహలు పక్కన పెట్టి రోజువారీ ఆహారంలో గుడ్డును పచ్చసొనతో సహా పూర్తిగా తీసుకోవడం వల్ల  ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతుంది.                      *రూపశ్రీ.  
చేతులు వణకడం, కాళ్లలో బలహీనంగా అనిపించడం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం వంటి సమస్యలను చాలామంది సాధారణ నీరసంగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి నరాల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు సంకేతాలు కావచ్చు. నరాల బలహీనతకు కారణాలు ఏమిటి? నరాలపై ప్రభావం చూపించే సమస్యలు ఏంటి? చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నొప్పి, వణుకు, బలహీనత ఎందుకు వస్తాయి? నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం, జీవనశైలి పాటించాలి? ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ నరాల బలహీనతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అలాగే నరాల ఆరోగ్యానికి ఉపయోగపడే సంప్రదాయ పద్ధతిలో అశ్వగంధ, వాము, దాల్చిన చెక్క, లవంగాలతో తయారు చేసుకునే చిట్కా గురించి కూడా తెలుసుకోవచ్చు. నరాల బలహీనత, నరాల నష్టం, తాత్కాలిక నీరసం మధ్య తేడా ఏమిటి? నరాలు దెబ్బతిన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? నరాల ఆరోగ్యానికి మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎందుకు అవసరం? వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నరాలకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. నరాల ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)