ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనకు బయలు దేరారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. పార్లమెంటు సమావేశాలలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జరుగుతున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సదస్సు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించకుంది.   నవంబరు 30 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతుండటం విశేషం.  డీలిమిటేషన్,  మహిళా రిజర్వేషన్ బిల్లులు గతంలో తగినంత మెజారిటీ లభించక ఆమోదం పొందని నేపథ్యంలో ఈసారి వీటిని ఆమోదింపజేసుకునే దిశగా కేంద్రం ప్రయత్నాలు  ముమ్మరం చేసింది. అందులో భాగంగానే భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చించి, అందరికీ ఆమోదయోగ్యంగా ఈ బిల్లుల్లో సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు.   డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, సీట్ల సమతుల్యత వంటి అంశాలపై చర్చలు, ఆందోళనలు వినిపిస్తున్న తరుణంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగడం విశేషం. ఈ బిల్లులపై మిత్రపక్షాలకు కేంద్రం ఎలాంటి స్పష్టత ఇస్తుంది, ఏయే అంశాలపై ఏకాభిప్రాయం కుదురుతుందనే దానిపై అందరి  దృష్టీ నిలిచింది. రాజ్యాంగ సవరణ అవసరమైన బిల్లుల ఆమోదం నేపథ్యంలో ఎన్డీయే కూటమి   పార్టీల అభిప్రాయాలు, అభ్యంతరాలపై సమగ్రంగా చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేందుకే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.   దక్షిణాది రాష్ట్రాలు, ప్రాంతీయ అంశాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, కూటమి భాగస్వాముల మధ్య జరిగే సంప్రదింపులు కీలకంగా మారాయి.   ఇది కూడా చదవండి: ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్: వైసీపీ సైలెన్స్.. విభేదాల ప్రచారానికి ఎండకార్డ్.! ఢిల్లీ సమావేశం ముగిసిన తర్వాత ఈ భేటీలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలు వెలువడే అవకాశం ఉంది. నవంబరు 30న పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే నాటికి  డీలిమిటేషన్, విమెన్ రిజర్వేషన్ బిల్లుల విషయంలో ఒక స్పష్టత వస్తుందని పరిశీలకులు అంటున్నారు.  ఎన్డీయే సమావేశంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఏ విధమైన స్పష్టత వస్తుంది, తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ప్రజలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మీకు నచ్చవచ్చు:  ప్రొటోకాల్ పక్కన పెట్టి, భద్రతను తోసిరాజని: బాబుతో పవన్ భేటీ: రాజీనామా వదంతులకు ఫుల్ స్టాప్.! పవన్ కల్యాణ్ కేబినెట్ భేటీకి గైర్హాజరుపై చర్చోపచర్చలు.! [Chandrababu Naidu Pawan Kalyan  Delhi Tour, NDAmeeting, PM, Invites, Delimitation,Women  Reservation Bills, TeluguOne] 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఎన్డీయేకు మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే జగన్ కు మాటతప్పడం, మడమ తిప్పడం అలవాటేననీ, బయటకు ఎన్ని కబుర్లు చెప్పినా బీజేపీకి నచ్చని విధంగా ఆయన వ్యవహరించే అవకాశం లేదనీ పరిశలకులు పలు సందర్భాలలో విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగినట్లుగానే జనగ్ డీ లిమిటేషన్ బిల్లుకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు. అయితే అలా మద్దతు పలకడానికి ఒక షరతు  విధించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ షరతుకు బీజేపీ అంగీకరిస్తేనే లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఉంటుందని అంటున్నాయి.  పార్లమెంటులో రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న దామాషా ప్రాతినిధ్యాన్ని కాపాడాలన్నదే ఆ షరతు అని చెబుతున్నాయి.  ఇప్పటికే లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సమీకరణాలు కీలకంగా మారిన సమయంలో, ప్రాంతీయ పార్టీల వైఖరి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: అప్పుడు బొద్దింకలకు జై: ఇప్పుడు మోడీకి జైజై.. కన్ఫ్యూజన్ లో జగన్.!​ విపక్ష కూటమిలోని ఇతర పార్టీలు ఈ బిల్లుపై విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో వైసీపీ మద్దతు పలకడానికి ముందుకు రావడం గమనార్హం.  వైసీపీకి రాజ్యసభలో నలుగురు, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉండటంతో.. వైసీపీ మద్దతు ఎన్డీయేకి కీలకంగా మారింది.  అది పక్కన పెడితే..కేంద్రం ఇప్పటికే ప్రస్తుత దామాషా ప్రాతినిథ్యానికి భంగం కలగకుండా సీట్లను పెంచే ఫార్ములాపై కేంద్రం కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. అందుకే వైసీపీ ఆ షరతు విధించిందనీ, ఒక వేళ కేంద్రం అటువంటి కసరత్తు చేసి ఉండకపోయినా వైసీపీ కేంద్రానికి మద్దతుగా నిలబడి ఉండేదనీ, గతంలో జరిగిన సంఘటనలను ఉటంకిస్తూ పరిశీలకులు చెబుతున్నారు.   మీకు నచ్చవచ్చు: కాళ్లు మొక్కబోయిన జగన్.. వద్దన్న మోదీ ఏపీ రాజకీయాల్లో మోదీ వ్యూహాలు...జగన్ సైలెంట్ స్ట్రాటజీ ఎటువైపు?​ [YCP, Support, NDA,  Delimitation Bill, Jagan, Condition, TeluguOne]
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీలో అంతర్గత సమన్వయం వంటి అంశాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్  పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్ణయాల నుంచి ప్రభుత్వ హామీల అమలు వరకు అనేక అంశాలపై టీపీసీసీ అధ్యక్షుడు తన అభిప్రాయాలను వెల్లడించారు. గతంలో కాంగ్రెస్‌లో ప్రతి చిన్న నిర్ణయానికీ ఢిల్లీ నాయకత్వం వైపు చూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పార్టీ నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ పెరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అక్కడక్కడా వినిపించే భిన్నాభిప్రాయాలను పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. బీసీలకు 52 శాతం ప్రాతినిధ్యం.. కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో సామాజిక న్యాయం, ముఖ్యంగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం కీలకంగా మారిందని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. 43 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పార్టీ పరంగా బీసీలకు 52 శాతం ప్రాతినిధ్యం కల్పించామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, మంత్రుల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో జాప్యం, వాటి ప్రస్తుత పరిస్థితిపై కూడా రాజకీయ చర్చ కొనసాగుతోంది. నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి, నిర్మాణ లోపాలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, కేంద్ర సంస్థల విచారణ విషయంలో బీజేపీ వైఖరిని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ సంబంధాలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కూడా బలంగా వినిపించారు. 90 వేల ఉద్యోగాలు.. హామీల అమలుపై కాంగ్రెస్ వాదన.! ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన హామీల అమలు కూడా తుది దశకు చేరుకుంటోందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. 90 వేల ఉద్యోగాల కల్పనపై వస్తున్న విమర్శలకు ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామకాల వివరాలే సమాధానమని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనతను అధిగమించేందుకు పటిష్టమైన అభ్యర్థుల అన్వేషణ జరుగుతోందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రజల మద్దతుకు నిదర్శనమని ఆయన పేర్కొన్న నేపథ్యంలో, రాబోయే ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాలపై భవిష్యత్తు ప్రభావం.! మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి అద్దం పడుతున్నాయి. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగ నియామకాలు, సాగునీటి ప్రాజెక్టుల వివాదాలు రాబోయే ఎన్నికల్లో కీలక అంశాలుగా మారనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పార్టీ బలాన్ని పెంచుకోవడంతో పాటు, అంతర్గత విభేదాలకు తావులేకుండా నాయకుల మధ్య సమన్వయం కొనసాగించడం కాంగ్రెస్‌కు సవాలుగా మారనుంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలంటే ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందే ఫలితాలే కీలకం కానున్నాయి. మొత్తంగా, బీసీ రాజకీయాలు, పార్టీ స్వేచ్ఛ, ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాలపై విమర్శలు.. ఇలా తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు వన్ న్యూస్ ‘ది జర్నలిస్ట్’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తప్పక కుండా ఇంటర్వ్యూను వీక్షించండి. మీకు నచ్చవచ్చు: మనిషి 1400 ఏళ్లు బతకగలడా..వృద్ధాప్యానికి ఏఐ చెక్ పెట్టనుందా.! మీకు నచ్చవచ్చు: మిస్ యూనివర్స్ 2026 విజేతగా జెన్నిఫర్ బారెటో..తొలి వివాహితగా చరిత్ర.!      [ Telugu One News, TPCC Chief Mahesh Kumar Goud, The Journalist Interview, Telangana Congress, CM Revanth Reddy, TCongress Pary, Tone News ]
ALSO ON TELUGUONE N E W S
అమ్మాయిలే కదా అని తీసిపారెయ్యకండి. అందులోను తెలుగు అమ్మాయిలు. ఆస్కార్ దాకా వెళ్తారు. ఏంటి ఆస్కార్ నా అని షాక్ అయ్యారా. అదుర్స్ లో చారి( బ్రహ్మానందం) అన్నట్టుగా  అంత షాక్ ఎందుకు ఆస్కార్ నే. మరి డీటెయిల్స్ చూసెయ్యండి తెలుగు అమ్మాయి తెరకెక్కించిన ఓ చిన్న సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన ‘పంకజ’ కేవలం సినిమా పండగల్లో ప్రశంసలు అందుకోవడమే కాదు.. ఆస్కార్ బరిలో నిలిచే అర్హతను కూడా సాధించింది. మరో విశేషం ఏంటంటే. హాలీవుడ్ దిగ్గజాలు స్పైక్ లీ, విల్లెమ్ డాఫో అండగా నిలవడం!పంకజ’కి దర్శకత్వం వహించింది అనూయా స్వామి. న్యూయార్క్ యూనివర్సిటీ (NYU)లో ఫిల్మ్ మేకింగ్ చదువుతున్న సమయంలో ఆమె రెండో ఏడాది ప్రాజెక్ట్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. బెంగళూరులో పుట్టి పెరిగిన అనూయా.. తనకు తెలిసిన జీవితాలు, తన చుట్టూ చూసిన మనుషుల కథలని  తెరపైకి తీసుకొచ్చారు. ఈ సినిమా రేన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ అవార్డును గెలుచుకోవడంతో 99వ ఆస్కార్ అవార్డుల పరిశీలనకు అర్హత సాధించింది. అంతకుముందు సన్‌డాన్స్ సహా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమై గుర్తింపు తెచ్చుకుంది.   కథ ఏంటంటే? బెంగళూరులోని మురికివాడల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. పంకజ అనే మహిళ తన భర్త కనిపించకుండా పోవడంతో.. చిన్న కూతురు లల్లితో కలిసి అతడి కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో పేదరికం, అధికార వ్యవస్థలోని సమస్యలు, సామాన్యుల కష్టాలు, తల్లీకూతుళ్ల అనుబంధం వంటి అంశాలను దర్శకురాలు చూపించారు. ఇది కూడా చదవండి: శ్రీకాంత్ చెల్లెలు తెలుగులో ఫేమస్ నటి.. స్టార్ హీరోలతో సినిమాలు.. తెలుసా ఆమె ఎవరో! పంకజ పాత్రలో హర్షిణి బోయళ్ల నటించగా.. చిన్నారి లల్లి పాత్రలో పద్మశ్రీ కనిపించారు. కేవలం 14 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా.. చిన్న కథలోనే బలమైన భావోద్వేగాలను పలికించే ప్రయత్నం చేసింది. హాలీవుడ్ దిగ్గజాల మద్దతు ‘పంకజ’కు ఇప్పుడు హాలీవుడ్ నుంచి కూడా అండ లభించింది. ప్రముఖ దర్శకుడు స్పైక్ లీ, నటుడు విల్లెమ్ డాఫో ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న భారతీయ నిర్మాత గునీత్ మోంగా కపూర్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. స్పైక్ లీతో అనూయాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె NYUలో చదువుతున్న సమయంలో ఆయనకు టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఇప్పుడు అదే స్పైక్ లీ తన సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండటం ఆమెకు ఎంతో ప్రత్యేకమైన అనుభవం.   తెలుగు అమ్మాయిల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దర్శకురాలు అనూయా స్వామి, ప్రధాన పాత్రధారి హర్షిణి బోయళ్ల ఇద్దరూ తెలుగు మాట్లాడే అమ్మాయిలే. బెంగళూరులో పుట్టి పెరిగిన వీరు తెలుగు, కన్నడ సంస్కృతుల మధ్య పెరిగారు. ఆ అనుభవమే ఈ ద్విభాషా చిత్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పటికే 40కి పైగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ‘పంకజ’.. ఇప్పుడు ఆస్కార్ ప్రచారంలో ఉంది. అయితే ఆస్కార్‌కు అర్హత సాధించడం, తుది నామినేషన్ దక్కించుకోవడం రెండూ వేర్వేరు దశలు. మరి ఈ చిన్న సినిమా ఆస్కార్ ప్రయాణంలో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!   మీకు నచ్చవచ్చు వెంకటేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! మైత్రి మూవీ మేకర్స్ భారీ స్కెచ్!     [pankaja, Guneet Monga, Harshini Boyalla, oskar]  
మనకి ఆశ్చర్యానికి కలిగించే జనరల్ విషయాలు తెలిస్తేనే  అవునా అంటు షాక్ అవుతాం. అలాంటిది మన అభిమాన సినీ నటుల ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ అయితే.. అది కూడా హీరో శ్రీకాంత్ చెల్లలు కూడా ఫెమస్ సినీ నటి అని తెలిస్తే... ఇన్నాళ్లు మనంత సినీ అమాయకులు లేరని అనుకుంటాం. మరి మీరు అమాయకులో, తెలివిగల వాళ్ళో చెక్ చేసుకోండి. ఆ నటి మరెవరో కాదు.. అనితా చౌదరి. స్టిల్ ఇప్పటికి ముగ్గురు స్నేహితులు కలిస్తే     ఛత్రపతిలో అంధురాలి క్యారక్టర్ లో చెప్పిన సూరీడు డైలాగ్ ఏదో ఒక రూపంలో సరదాగా తచ్చాడుతునే ఉంది, మీమ్స్ కైతే లెక్కే లేదు.  ఆ తర్వాత తెలుగులో చాలా చిత్రాల్లో నటించి మెప్పించారు.   ఇది కూడా చదవండి: వెంకటేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: బర్త్ డే కానుకగా రీ రిలీజ్ అవుతున్న మీ ప్రియమైన మూవీ!  ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్ .  నటించిన అనితా చౌదరి, రాజా, మురారి, సంతోషం, ఆనందం, నువ్వే నువ్వే, గోల్ మాల్, ఛత్రపతి, ఉయ్యాల జంపాల, మన్మథుడు, నిన్నే ఇష్టపడ్డాను, కేరింత, గురు, జాంబి రెడ్డి ఇక దాదాపు 50కి పైగా చిత్రాల్లో  సందడి చేసింది.  అనితా చౌదరి శ్రీకాంత్‌కి చెల్లెలు వరుస ఎలా అవుతుందంటే అనితా చౌదరి భర్త పేరు   కృష్ణ చైతన్య. ప్రేమ వివాహం. శ్రీకాంత్‌కి కృష్ణ చైతన్య దగ్గరి బంధువు కాగా, వీరి వివాహాన్ని శ్రీకాంతే దగ్గరుండి జరిపించారట. ఈ విషయాన్ని అనితా చౌదరి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.    మీకు నచ్చవచ్చు  రొమాంటిక్ థ్రిల్లర్ మీ కోసమే ఓటిటిలోకి వచ్చేసింది. ఎంజాయ్!   వృషకర్మ హిట్టు కాబోతుందా!    [Srikanth,  anitha chowdary, Tollywood, Chathrapathi]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న RC17 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. RC17 కోసం మేకర్స్ అధికారికంగా కాస్టింగ్ కాల్ ప్రకటించారు. ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్న పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 16 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న నటీనటులకు అవకాశం కల్పించనున్నారు. అంటే కేవలం యువతకే కాకుండా వివిధ వయసుల వారికి కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉండబోతోంది. ఆసక్తి ఉన్నవారు తమ పోర్ట్‌ఫోలియోలను 'src17casting@gmail.com' అనే ఈమెయిల్‌కు పంపించాలి. అలాగే 9110564651 అనే వాట్సాప్ నంబర్‌కు కూడా వివరాలు పంపించవచ్చు. అయితే ఈ నంబర్‌కు ఫోన్ కాల్స్ చేయకూడదని, కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే పంపాలని మేకర్స్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పంపించవద్దని కూడా కాస్టింగ్ పోస్టర్‌లో ప్రత్యేకంగా సూచించారు. ఆడిషన్స్‌కు సంబంధించిన సమయాలను కూడా ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: RC17 హీరోయిన్ ఎవరు.? ఇక RC17 విషయానికి వస్తే.. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ బ్యానర్లపై తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో ఈ కొత్త సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మొత్తానికి రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో నటించాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. 16 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, మహిళలు తమ పోర్ట్‌ఫోలియోలను పంపించవచ్చు. మీకు నచ్చవచ్చు:  రామాయణ ఎఫెక్ట్.. జటాయు రాక్‌ విజిటర్స్ డబుల్ అయ్యారు.! సిరివెన్నెల దాచుకున్న పాటలకు ప్రాణం.. ఆ సినిమాలో ఉపయోగిస్తున్నారు.!       [RC17 Movie, Casting Call, Ram Charan, Sukumar, Mythri Movie Makers]
ఆదర్శ కుటుంబం ఫలితంతో డల్ గా ఉన్న ఫ్యాన్స్ అప్ కమింగ్ మూవీ జనవరి 12 విడుదలతో హిట్ కొట్టి సినీ మార్కెట్ లో  తల ఎత్తుకొని తిరగాలని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ తలలు నెక్స్ట్ మంత్ లోనే ఎగరేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇది మా ఘన చరిత్ర అని. పైగా థియేటర్స్ లో డాన్స్ లు సైతం.అది కూడా ఫుల్ ఎనర్జీతో. వెంకటేశ్,  ఐపిఎల్  పంజాబ్ ఓనర్, సినీ నటి  ప్రీతి జింటా కాంబోలో వచ్చిన  ‘ప్రేమంటే ఇదేరా’  4K నాణ్యతతో రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రచార ప్రకటన వెలువడింది. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13 న  థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఒకప్పుడు ఈ సినిమా చూసి అభిమానులు ఆస్వాదించిన ప్రేమ, భావోద్వేగాలు, అందమైన పాటలు ఇప్పుడు మరింత మెరుగైన విజువల్ క్వాలిటీతో వెండితెరపై కనిపించనున్నాయి. పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం దక్కనుంది. పాటలతో ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు ‘ప్రేమంటే ఇదేరా’ కి సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రమణ గోగుల అందించిన పాటలు అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలను ఇష్టపడే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు.వెంకటేశ్, ప్రీతి జింటా కెమిస్ట్రీ, సంగీతం, ప్రేమకథ కలగలిపి  ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అందుకే రీ రిలీజ్ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇది కూడా చదవండి: సౌత్ ఇండియా హిట్ డైరెక్టర్లందరిపై మైత్రి మేకర్స్ కన్ను: ఆ స్కెచ్ వేసింది అందుకోసమే!   పాత సినిమాలకు మళ్లీ థియేటర్లలో ఆదరణ ఇటీవలి కాలంలో పాత హిట్ సినిమాలను కొత్త టెక్నాలజీతో రీ-రిలీజ్ చేయడం టాలీవుడ్‌లో మంచి ట్రెండ్‌గా మారింది. తమ అభిమాన హీరోల సినిమాలను మళ్లీ థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.   ఇప్పుడు ‘ప్రేమంటే ఇదేరా’ కూడా అదే బాటలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈసారి థియేటర్లలో వెంకీ అభిమానులు సందడి చెయ్యడం షురూ. మీరు కూడా వాళ్ళతో కలిసి తెలుగు సినిమా అందించిన ప్రేమ, పరువపు సువాసనని తనివితీరా ఆస్వాదించండి. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించాడు. 1998 అక్టోబర్ 30 న థియేటర్స్ లోకి వచ్చింది! మీకు నచ్చవచ్చు పక్కా రొమాంటిక్ థ్రిల్లర్ మీ కోసమే ఓటిటిలోకి వచ్చేసింది: మిస్ అయితే మాత్రం...  రామాయణ తెరకెక్కించిన విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!     [Venkatesh, Preity Zinta, Premante Idhera, Jayanth C paranzee,Tollywood]
బిజినెస్ మెన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు' యాటిట్యూడ్ కి సంబంధించిన  డైలాగ్ ఒకటుంటుంది సూర్య భాయ్ అంటే పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అని. ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా అంతే. ఓన్లీ నిర్మాణ సంస్థ కాదు బ్రాండ్. చాలా కాలం తర్వాత మైత్రి  బ్యానర్ నేమ్ చూసి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తున్నారు. ప్రస్తుత ఏఐ కాలంలో ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం అదే రూట్ కి జై కొడుతున్నారనే ఒక్క మాట చాలు మైత్రి క్యాపబిలిటీ చెప్పడానికి,.   ఇక ఇండస్ట్రీలో హీరోల క్రేజ్ ఒకవైపు ఉంటే.. హిట్ డైరెక్టర్లకు ఉండే డిమాండ్ మరోవైపు ఉంటుంది. ఒక దర్శకుడు వరుసగా రెండు హిట్లు కొడితే చాలు.. ఆయనతో సినిమా చేయడానికి నిర్మాతలు క్యూ కడుతుంటారు. అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో అందరికంటే ఒక అడుగు ముందే ఉంటోంది. సౌత్ ఇండియాలో ఏ భాషలో ఏ దర్శకుడు హిట్ కొట్టినా.. వెంటనే అతడితో సినిమా చేసేందుకు రంగంలోకి దిగుతోంది. భారీ అడ్వాన్సులతో క్రేజీ డైరెక్టర్లను తమ బ్యానర్‌కు లాక్ చేసుకుంటోంది. ప్రశాంత్ నీల్ నుంచి లోకేష్ వరకు! కన్నడ నుంచి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మైత్రి సంస్థకు ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. ఆయనతో ఎన్టీఆర్ హీరోగా భారీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. మరోవైపు తమిళంలో సంచలన విజయాలతో దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్‌ను కూడా మైత్రి తన కాంపౌండ్‌లోకి తీసుకొచ్చింది. అల్లు అర్జున్ హీరోగా లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న AA23 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.   ఇక నెల్సన్, వెట్రిమారన్ వంటి తమిళ దర్శకులతోనూ మైత్రి అడ్వాన్సుల ఒప్పందాలు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళం, మలయాళం.. ఎక్కడా తగ్గడం లేదు! తమిళ ఇండస్ట్రీలో సిబి చక్రవర్తి, ఆర్.రవికుమార్, అధిక్ రవిచంద్రన్ వంటి దర్శకులతోనూ మైత్రి సినిమాలు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి:ఎక్కడున్నారు ఓటిటి లవర్స్: పక్కా రొమాంటిక్ థ్రిల్లర్ మీ కోసమే అందులో ఉంది!    మలయాళంలోనూ మైత్రి తన పరిధిని విస్తరిస్తోంది. 'మంజుమ్మెల్ బాయ్స్'తో సంచలనం సృష్టించిన చిదంబరం, 'ఆవేశం'తో ఆకట్టుకున్న జీతూ మాధవన్ వంటి దర్శకులతో ప్రాజెక్టులు సెట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. మైత్రి ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకప్పుడు తెలుగు సినిమాలకే పరిమితమైన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఇతర దక్షిణాది భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కొత్త కాంబినేషన్లు, విభిన్న కథలపై కూడా దృష్టి పెడుతోంది. మైత్రి సంస్థ అధికారికంగా ప్రకటించిన ప్రాజెక్టులతో పాటు, దర్శకులతో ఒప్పందాలకు సంబంధించిన కొన్ని వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడికావాల్సి ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ అనుసరిస్తున్న వ్యూహం చూస్తుంటే సౌత్ ఇండియాలోనే బలమైన నిర్మాణ సంస్థగా ఎదగాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.   మరి ఇంతమంది క్రేజీ దర్శకులతో మైత్రి నిర్మాతలు ఎలాంటి సినిమాలు తెరకెక్కిస్తారు? ఏ హీరోలతో కొత్త కాంబినేషన్లు సెట్ చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా కంటిన్యూగా ఒకటికి నాలుగు సినిమాలు చేస్తు తెలుగు సినిమాని, తెలుగు సినిమాని నమ్ముకున్న వాళ్ళని రక్షిస్తూ వస్తున్న  మైత్రి మూవీ మేకర్స్ కి సినీ లాల్ సలాం.   మీకు నచ్చవచ్చు మూవీలో కామన్ మాన్  ఫోన్ నెంబర్ చూపించారు: ఇప్పుడు పోలీస్ కేసు! ఈ ముద్దుగుమ్మ దృష్టిలో  ప్రేమంటే అదేనంట: మరి మీకు!   [Mythri Movie Makers, South Indian Directors Vetri Maaran, Lokesh Kanagaraj, Kollywood]  
ప్రేమకథలకు యూత్‌లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. కథలో భావోద్వేగాలు, రొమాన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే భాషతో సంబంధం లేకుండా సినిమాలు విజయాలు అందుకుంటాయి. అలాంటి ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘హైకూ’. ఏగన్, శ్రీదేవి అపళ్ల, ఫెమీనా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మనోహర్ (ఏగన్) కోయంబత్తూరులో ఇంజినీరింగ్ చదువుతుంటాడు. అక్కడే కొడి (శ్రీదేవి అపళ్ల)తో ప్రేమలో పడతాడు. ఆమె ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో కులం, ఆర్థిక స్థితి వంటి విషయాలు వారి ప్రేమకు అడ్డంకులుగా మారతాయి. మంచి ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో మనో చెన్నైకి వెళ్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగి, మనో ఒంటరిగా మిగిలిపోతాడు. ఆ సమయంలో అతని జీవితంలోకి నివేద (ఫెమీనా జార్జ్) వస్తుంది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ అరుళ్‌తో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడటానికి మనో సహాయం చేస్తాడు. ఆ తర్వాత నివేద అతనికి దగ్గరవుతుంది. అయితే మనో మనసులో కొడి ఇంకా ఉందని నివేద గుర్తిస్తుంది. తాను ఎంతగా ప్రేమిస్తున్నా అతను గతాన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నాడో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కొడి, మనో మధ్య ఏం జరిగింది? వారిద్దరూ ఎందుకు విడిపోయారు? అనే విషయాలు బయటపడతాయి. ఇద్దరు అమ్మాయిలు హీరో జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు అనే అంశాన్ని దర్శకుడు యువరాజ్ చినసామి చూపించే ప్రయత్నం చేశారు. ప్రేమలో డబ్బు, కులం, చదువు వంటి అంతరాలను ప్రస్తావిస్తూ కొన్ని చోట్ల రొటీన్‌కు భిన్నంగా కథను నడిపించారు. కథలో కొంత కొత్తదనం ఉన్నా, నెమ్మదిగా సాగే కథనం నిరాశపరుస్తుంది. కాలేజీ నేపథ్యంలో వినోదానికి అవకాశం ఉన్నప్పటికీ కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. భావోద్వేగాలను పండించడానికి చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోవు. కొన్ని ప్రేమ సన్నివేశాలు ఇప్పటికే చూసిన సినిమాలను గుర్తు చేస్తాయి. ప్రధాన పాత్రల్లో నటించిన ఏగన్, శ్రీదేవి అపళ్ల, ఫెమీనా జార్జ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రీయుశ్ గురుస్వామి కెమెరా పనితనం, సిద్ధూ కుమార్ సంగీతం, శక్తి ప్రణీష్ ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తాయి. మొత్తంగా ‘హైకూ’లో కొత్త ఆలోచన ఉన్నప్పటికీ, రొటీన్ సన్నివేశాలు, నెమ్మదైన కథనం కారణంగా ఓ మోస్తరు ప్రేమకథగా మిగిలిపోయింది.  [Haiku Movie Review, Haiku Telugu Review, Haiku Netflix Review, Aegan Haiku Movie, Sridevi Apalla Haiku, Femina George Haiku, Haiku Movie Rating, Yuvaraj Chinnasamy, Haiku Movie Story]
ప్రెజెంట్ ఓటిటి సినీ ప్రేమికులందరు, మరి ముఖ్యంగా రొమాంటిక్ జోనర్స్ ని ఇష్టపడే వాళ్లంతా, ఒక టీంలాగా ఏర్పడి 'సాయవనం' గురించి ఎవరకి చెప్పద్దు. చెప్తే మనం పొందే ఆ ఆనందం వాళ్ళు కూడా పొందుతారని అనుకుంటున్నారు. ఎందుకంటే పక్కా రొమాంటిక్ డ్రామా.కానీ మేము అలా కాదు మీ కోసం సాయవనం గురించి డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాం. ఈ రోజే సిద్ధం కండి. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు పెద్దగా సందడి చేయవు. కానీ ఓటీటీలోకి వచ్చాక మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా కొత్త తరహా కథలు, సస్పెన్స్, ఊహించని మలుపులతో సాగే థ్రిల్లర్ సినిమాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అలాంటి సినిమానే 'సాయవనం'. కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఈ తమిళ థ్రిల్లర్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.  అడవిలో జరిగే కథ.. ఆసక్తికరమైన మలుపులు! 'సాయవనం' కథ విషయానికి వస్తే.. దట్టమైన అడవి నేపథ్యంలో సాగుతుంది. సీత అనే మహిళ తన కుటుంబం, సంప్రదాయాలు, సామాజిక విలువలను గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటుంది. కానీ అనుకోకుండా ఆమె జీవితంలోకి కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. సీత భర్త ముత్తు ఓ రోజు లారీ కొనుగోలు చేయడానికి వెళ్లి కనిపించకుండా పోతాడు. దీంతో ఆమె ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ సమయంలో సురుళి అనే వ్యక్తి ఆమె జీవితంలోకి వస్తాడు. కొంతకాలానికి ముత్తు తిరిగి రావడంతో కథ అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సీత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలేంటి? తన ఆత్మగౌరవం కోసం ఆమె ఎలాంటి పోరాటం చేసింది? అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. ఇది కూడా చదవండి: సినిమాలో ఫోన్ నంబర్ చూపించారు:నిజ జీవితంలో వేధింపులు..ఇప్పుడు పోలీస్ కేసు!   నటీనటులు, సాంకేతిక బృందం ఈ సినిమాలో సీత పాత్రలో దేవనంద షాజిలాల్ నటించగా.. ముత్తు పాత్రలో సౌందర రాజా కనిపించారు. సురుళి పాత్రలో సంతోష్ దామోదరన్ నటించారు. వీరితో పాటు అప్పుకుట్టి, జానకి జయరామన్, వెట్రివేల్ రాజా, మాథ్యూ మాంప్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డామర్ సినిమా బ్యానర్‌పై సంతోష్ దామోదరన్ నిర్మించగా.. పాలీ వర్గీస్ సంగీతం అందించారు.   ఆహాలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ గతంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్లు, సర్వైవల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. మొత్తానికి కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన 'సాయవనం' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. రొమాంటిక్  థ్రిల్లర్ కాబట్టి మీరు మిస్ కారని తెలుసు!   మీకు నచ్చవచ్చు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్: మరో రామాయణ తీస్తారా!  ప్రేమంటే అర్ధం తెలుసా మీకు: వామ్మో ఈ హీరోయిన్ మాత్రం భలే అర్ధం చెప్పింది!   [saayavanam, Devananda Shajilal, Soundara Raja, Aha, Kollywood]  
ఒక సినిమా హిట్ అయితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రావడం సహజం. కానీ ఆ సినిమా వల్ల షూటింగ్ జరిగిన ప్రాంతానికి కూడా పర్యాటకులు పెరిగితే? ఇప్పుడు ‘రామాయణ’ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. కేరళలోని జటాయు రాక్‌కు ఈ సినిమా షూటింగ్, అందులో చూపించిన సన్నివేశాల వల్ల సందర్శకుల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని కేంద్ర పర్యాటక శాఖ అధికారి వెల్లడించారు. కేరళలోని కొల్లం జిల్లాలో ఉన్న జటాయు ఎర్త్స్ సెంటర్‌ను జటాయు రాక్ అని కూడా పిలుస్తారు. అక్కడ కొండపై భారీ జటాయువు శిల్పం ఉంటుంది. రామాయణం ప్రకారం సీతను రావణుడి నుంచి కాపాడే ప్రయత్నంలో జటాయువు పోరాడి పడిపోయిన ప్రాంతంగా దీనికి గుర్తింపు ఉంది. సినిమాలో కూడా జటాయువు, రావణుడి మధ్య జరిగే పోరాటాన్ని చూపించడంతో ఈ ప్రదేశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. గోవాలో జరిగిన WAVES ఫిల్మ్ బజార్‌లో కేంద్ర పర్యాటక శాఖ జాయింట్ సెక్రటరీ హరికిషోర్ ఎస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘రామాయణ’ షూటింగ్ తర్వాత జటాయు రాక్‌ను సందర్శించే వారి సంఖ్య దాదాపు రెండింతలు అయిందని తెలిపారు. అంటే సినిమా ద్వారా ఒక ప్రాంతానికి ఎంత పెద్ద ప్రచారం లభిస్తుందో ఈ ఉదాహరణ చెబుతోంది. ఇదే కార్యక్రమంలో భారత్‌ను అంతర్జాతీయ సినిమా షూటింగ్‌లకు అనువైన గమ్యస్థానంగా మార్చే అంశాలపై కూడా చర్చ జరిగింది. విదేశీ చిత్ర బృందాలకు అనుమతులు సులభంగా లభించేలా సింగిల్ విండో ఫిల్మింగ్ పోర్టల్, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు, స్థానిక టెక్నీషియన్ల నైపుణ్యం వంటి అంశాలను అధికారులు వివరించారు. ఇది కూడా చదవండి: రామాయణ టీమ్‌తో అమిత్ షా ప్రత్యేక భేటీ.! అంతేకాదు, గతంలో హిట్ అయిన సినిమాల్లో కనిపించిన పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కూడా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. అలాంటి ప్రాంతాలను గుర్తించి సినిమా పేరుతో ప్రచారం చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘బొంబాయి’ సినిమాలోని ‘ఉరికే చిలకా’ పాట చిత్రీకరించిన బేకల్ ఫోర్ట్‌ను ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా నటించారు. జటాయువు పాత్రకు అనుపమ్ ఖేర్ గొంతు అందించారు. జటాయువు, రావణుడి మధ్య వచ్చే పోరాట సన్నివేశం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సన్నివేశం చూసిన ప్రేక్షకులు నిజమైన జటాయు శిల్పాన్ని చూడాలని ఆసక్తి చూపిస్తున్నారని పర్యాటక రంగ అధికారులు చెబుతున్నారు. మీకు నచ్చవచ్చు:  సిరివెన్నెల దాచుకున్న పాటలకు ప్రాణం.. ఆ సినిమాలో ఉపయోగిస్తున్నారు.! 14 ఏళ్ళ తర్వాత నాగార్జున రికార్డుకు ఎసరు.!       [Ramayana Movie, Jatayu Rock, Jatayu Earths Center, Kerala Tourism]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఇవి అలవాటు చేసుకోండి..! వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అలసట పెరగడం, బరువు పెరగడం, ముఖంలో కాంతి తగ్గడం చాలా మందికి ఎదురయ్యే సమస్యే. కానీ గంటల తరబడి జిమ్‌లో కష్టపడకుండా లేదా కఠినమైన డైట్లు చేయకుండా, మన రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఎప్పటికీ ఉత్సాహంగా, ఫిట్‌గా, యవ్వనంగా ఉండొచ్చు.  ఆ అలవాట్లు ఏమిటో అవి వయసు పెరిగినా యవ్వనంగా ఉండటంలో ఎలా సహాయపడతాయో వివరంగా  తెలుసుకుంటే.. ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా ప్రశాంతంగా రోజును ప్రారంభించాలి. ఫోన్ చూస్తే వెంటనే అనవసరపు ఆలోచనలు, ఒత్తిడి మొదలవుతాయి. కనీసం మొదటి 15 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. లేవగానే టీ లేదా కాఫీ తాగే బదులు ఒకటి రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. తర్వాత కాసేపు ఉదయపు ఎండలో నిలబడి కనీసం 10 నిమిషాలు నడవాలి. ఇది శరీరానికి కొత్త శక్తిని ఇచ్చి, బద్ధకాన్ని తగ్గిస్తుంది. భోజనం చేసేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూడకూడదు. ఆహారాన్ని గమనిస్తూ నెమ్మదిగా నమిలి తింటే కడుపు నిండిన భావన సమయానికి తెలిసి, అతిగా తినకుండా ఉంటాము. ఇది కూడా చదవండి   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది.. జిమ్‌కు వెళ్లే సమయం లేకపోయినా రోజంతా శరీరానికి కదలిక ఉండేలా చూసుకోవాలి. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవడం, భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వంటి చిన్న అలవాట్లు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. కడుపు పూర్తిగా నిండేంత వరకు కాకుండా 80 శాతం నిండగానే తినడం ఆపేయాలి. అలాగే ప్లేట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో జంక్ ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్ కనిపించేలా ఉంచుకోకుండా, పండ్లు , నీళ్ల బాటిళ్లను కళ్ల ముందు ఉంచుకోవాలి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్‌గా మంచి ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది. ఒకేసారి పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాలని గట్టి నిర్ణయాలు తీసుకుని తర్వాత వదిలేయడం కంటే, రోజుకు కొంచెం కొంచెంగా చిన్న అలవాట్లు మార్చుకోవడం ఉత్తమం. అలాగే ఒకరోజు తప్పు జరిగినా నిరుత్సాహపడకుండా మరుసటి రోజు మళ్లీ కొనసాగించడం ముఖ్యం. రాత్రి పడుకునే కనీసం గంట ముందు ఫోన్, టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. గాఢ నిద్ర సరిగ్గా లభిస్తే మరుసటి రోజు శరీరం ఉత్సాహంగా ఉంటుంది, అనవసరమైన ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి.                                                                                                                                            *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి      అసలు కారణాలు..!                                   జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..!
మగాళ్ల రహస్యం..  భార్యకు,  కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..! మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన  నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే.. అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని.. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు.. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు. చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు.. కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి  రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి.. సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు. భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు.. చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు. భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు.. భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు. సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి.. పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!                                    ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
చలికాలం రాగానే వాతావరణం చల్లగా మారుతుంది, ఎండ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలామంది సన్‌స్క్రీన్ వాడటం ఆపేస్తారు. కానీ మన చర్మం థర్మామీటర్ చూసి స్పందించదు, కాంతికి స్పందిస్తుంది. మిద్దె మీద లేదా ఆరుబయట కొన్ని గంటలు గడిపితే చల్లని గాలిలో కూడా ముఖం, చేతులు నల్లబడతాయి. నిపుణుల ప్రకారం, సన్ ట్యాన్ వేడి వల్ల కాదు, అతినీలలోహిత కిరణాల (UV rays) వల్ల వస్తుంది. వేడిని మనం అనుభవించగలం కానీ UV కిరణాలను అనుభవించలేం. చలికాలంలో UVB కిరణాలు తక్కువగా ఉన్నా, వృద్ధాప్య ఛాయలు మరియు ట్యానింగ్‌కు కారణమయ్యే UVA కిరణాలు మాత్రం చురుకుగానే ఉంటాయి. ఇవి మేఘాలను మరియు కిటికీ అద్దాలను కూడా దాటుకుని చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల చర్మం తనను తాను కాపాడుకోవడానికి మెలనిన్ (melanin) ఉత్పత్తి చేస్తుంది, అదే ట్యాన్‌గా మారుతుంది. చలికాలపు ఎండ బయటకు కనిపించినంత అమాయకంగా ఉండదు. చల్లని గాలి వల్ల వేడి హెచ్చరిక తెలియక మనం ఎండలో ఎక్కువ సమయం గడిపేస్తాం. స్పష్టమైన రోజుల్లోనే కాకుండా పలుచని మేఘాలు ఉన్నప్పుడు కూడా గణనీయమైన UV కిరణాలు కిందకు వస్తాయి. మంచు, నీరు, లేదా ప్రకాశవంతమైన ఉపరితలాలు UV కిరణాలను తిరిగి చర్మంపై ప్రతిబింబిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లినప్పుడు UV తీవ్రత మరింత పెరుగుతుంది. 2024లో ప్రచురించబడిన ఒక అధ్యయన సమీక్ష ప్రకారం, UVA కిరణాలు మరియు దృశ్య కాంతి మేఘాలు, కిటికీ అద్దాల గుండా ప్రయాణించగలవు, అలాగే మెలస్మా వంటి నల్లటి మచ్చల సమస్యలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ చర్మతత్వానికి చలికాలపు ఎండ వల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. ముదురు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కమిలిపోదు కానీ సులభంగా ట్యాన్ అవుతుంది మరియు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చలికాలపు ఎండ ముఖం, చేతులు, మెడను నల్లబర్చడమే కాకుండా, మెలస్మా (బుగ్గలు, నుదురుపై గోధుమ లేదా బూడిద రంగు మచ్చలు)ను తీవ్రతరం చేస్తుంది మరియు మొటిమల మచ్చలను ఎక్కువకాలం ఉంచుతుంది. 2022లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం, దృశ్య కాంతి మరియు దీర్ఘ తరంగ UVA కిరణాలు మెలస్మాకు ముఖ్య కారణాలుగా నిలిచాయి, అయినప్పటికీ మెలస్మా ఉన్నవారిలో ఎక్కువమంది సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు సరిగ్గా పాటించడం లేదని తేలింది. అందుకే చలికాలంలోనూ ప్రతిరోజూ ఉదయం కనీసం SPF 30 మరియు PA+++ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ వాడటంలో సంఖ్య కంటే వాడే పద్ధతి, మోతాదు చాలా ముఖ్యం. ముఖం మరియు మెడ కోసం సుమారు రెండు వేళ్ల పొడవు (two finger lengths) అంత సన్‌స్క్రీన్ తీసుకోవాలి. బయట ఉన్నప్పుడు ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటం మంచిది. టోపీ, సన్‌గ్లాసెస్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి మరియు చేతుల వెనుక భాగం, చెవులు, మెడను కూడా కవర్ చేసుకోవాలి. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడాలి. ఉష్ణోగ్రత కంటే వాతావరణ యాప్‌లో UV ఇండెక్స్ చూసి ప్రణాళిక వేసుకోవాలి. ఇది కూడా చదవండి:జలుబు, పొడి దగ్గు వేధిస్తోందా? ఇంట్లోనే ఈ సులభ పరిష్కారాలు విటమిన్ D కోసం గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు; అలా చేస్తే పిగ్మెంటేషన్ మరియు చర్మ సమస్యలు పెరుగుతాయి. విటమిన్ D లోపం గురించి ఆందోళన ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం, ముదురు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ D ఉత్పత్తి కావడానికి ఎండలో ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి అంచనా వేయడం సరికాదు.  అలాగే, విస్తరిస్తున్న లేదా తగ్గని నల్లటి మచ్చలు, ఆకారం లేదా రంగు మారుతున్న పుట్టుమచ్చలు, చర్మం కాలిపోవడం లేదా పొట్టు ఊడటం, లేదా సన్‌స్క్రీన్ వాడినా పెరుగుతున్న పిగ్మెంటేషన్ కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చలికాలంలోనూ రోజూ సన్‌స్క్రీన్ రాయడం, చర్మాన్ని కప్పి ఉంచడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్, మిరపకాయ బజ్జీ కూర.. సింపుల్ టిప్స్‌తో పర్ఫెక్ట్ గ్రేవీ!                              ఈజీగా చేసుకునే, రుచికరమైన పొట్లకాయ పచ్చిశనగపప్పు, కూర విధానం           Winter Sun Tan, Sun Tan In Winter Causes, Dermatologist Skincare Tips, Winter Sunscreen Tips, UV Rays In Winter, Prevent Tanning In Cold Weather, Skincare Tips In Telugu.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. మజ్జిగలో ఈ మూడు పొడులు కలిపి తీసుకోండి!   జుట్టు రాలడం, పలుచబడటం, జుట్టు ఒత్తుగా పెరగకపోవడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే బయట ఉపయోగించే నూనెలు, షాంపూలతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ముఖ్యం. ముఖ్యంగా పోషకాలు సమృద్ధిగా ఉండే సహజ ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మునగాకు పొడి, కరివేపాకు పొడి, మెంతుల పొడిని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి? మునగాకులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మెంతులు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి? ఈ సహజ పదార్థాలను రోజువారీ ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలి? అలాగే చిరుధాన్యాలు (Millets) మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఏమిటి? రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు లభిస్తాయి? సంప్రదాయ ఆహారపు అలవాట్లు, సహజంగా పండించిన ఆహార పదార్థాల ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ నేచురల్ ఫార్మింగ్ నిపుణులు  గున్న రాజేందర్ రెడ్డి (Gunna Rajender Reddy) గారు వివరించారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన సహజ ఆహారాలను మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యం, సహజ ఆహారం, మునగాకు, కరివేపాకు, మెంతులు, చిరుధాన్యాల పయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ ఆహార పదార్థాలు పోషకాలను అందించవచ్చు. అయితే 90 రోజుల్లో జుట్టు తప్పనిసరిగా ఒత్తుగా పెరుగుతుందని హామీ ఇవ్వలేము. జుట్టు అధికంగా రాలుతున్నట్లయితే కారణాన్ని గుర్తించేందుకు వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూ ఉండాలని అనిపించడం చాలామందిలో కనిపిస్తుంది. ఎక్కువ పని చేసినప్పుడు లేదా సరిగ్గా తిననప్పుడు ఇలా అనిపిస్తే అది సాధారణమే. కానీ కడుపు నిండా తిన్నాక కూడా పదేపదే ఆకలి వేస్తుంటే మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అది మన అలవాటా లేక శరీరంలో  ఏదైనా సమస్య గురించి అలా లక్షణం రూపంలో బయటకు తెలుస్తోందా అన్నది తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు.  అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి. అవేంటో తెలుసుకుంటే.. అలవాట్లు.. మన రోజువారీ ఆహారపు అలవాట్లు, తినే సమయం, తినే ఆహారం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఆకలి వెనుక శరీరంలోని హార్మోన్లు లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సాధారణ ఆకలికి, అనారోగ్య సంకేతానికి మధ్య తేడాను గుర్తించాలి. డయాబెటిస్.. డయాబెటిస్ ఉన్నవారిలో పదేపదే ఆకలి వేయడం ఒక సాధారణ లక్షణం. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీర కణాలకు చేర్చడానికి ఇన్సులిన్ అవసరం. డయాబెటిస్‌లో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కణాలకు తగినంత శక్తి అందదు. దాంతో ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి తోడు ఎక్కువ దాహం, తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గినప్పుడు కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది. అప్పుడు చెమట పట్టడం, వణుకు, తలతిరగడం, కంగారుగా అనిపించడం లాంటివి కలగవచ్చు. థైరాయిడ్.. థైరాయిడ్ సమస్య వల్ల కూడా ఆకలి పెరగవచ్చు. థైరాయిడ్ గ్రంథి అవసరం కంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే స్థితిలో శరీర జీవక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల ఆకలి పెరిగినా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువ చెమట పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, కొన్ని రకాల మందుల వల్ల కూడా ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడి ఎక్కువ ఆకలి వేయవచ్చు. ఇది కూడా చదవండి   మునగాకు లడ్డూ రోజూ 2 తింటే.. శరీరానికి ఇన్ని పోషకాలా.! ఆకలితో పాటు బరువు తగ్గడం.. ఎప్పుడూ ఆకలి వేస్తూ దానితో పాటు బరువు తగ్గడం, ఎక్కువ దాహం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది. అవసరమైన రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటే అసలు కారణం తెలుస్తుంది.                                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   అవిసె గింజలు ఎలా తింటే ఎక్కువ మేలు సరైన పద్ధతి ఇదే!                                   ఇదిగో ఈ ఆహారాలు తింటే గట్ హెల్త్ సేఫ్ గా ఉంటుంది..!