ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు పులివెందుల పెట్టని కోట. ఐదు దశాబ్దాలకు పైగా పులివెందులలో వైఎస్ కుటుంబానిదే హవా. వైఎస్ అనంతరం జగన్ కు పులివెందుల పెట్టని కొటగా నిలుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ కోట బద్దలైంది. స్థానిక సమరంలో పులివెందులలో వైసీపీ చతికిల పడింది.   పులివెందుల గడ్డపై తెలుగుదేశం పట్టు సాధించింది. స్థానిక  సమరంలో జగన్ అధినేతగా ఉన్న వైసీపీ అక్కడ కనీసం నామినేషన్లు కూడా దాఖలు చేయలేక చేతులెత్తేసింది.   స్థానిక సమరంలో పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.   వేంపల్లి, వేముల, చక్రాయపేట, తొండూరు, సింహాద్రిపురం తదితర మండలాల్లో జరిగిన పరిణామాలు పూర్తిగా కూటమికి అనుకూలంగా మారాయి. వివిధ మండలాల్లోని స్థానిక సంస్థల స్థానాలను తెలుగుదేశం అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో పాటు, జడ్పీటీసి స్థానాల్లోనూ బలమైన ముద్ర వేశారు. దశాబ్దాలుగా ఏకపక్షంగా ఉంటూ వచ్చిన రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా పూర్తిగా రివర్స్ అయ్యాయనడానికి ఇదే నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2024 ఎన్నికల్లోనే  పులివెందులలో జగన్‌ మెజారిటీ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అప్పటి నుంచీ నియోజకవర్గంలో జగన్ పట్లు, వైసీపీ బలం తగ్గుతూ వస్తోంది.  తాజాగా స్థానక సమరంలో వైసీపీ కాడె వదిలేయాల్సిన పరిస్థితికి చేరుకుంది.   క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడంలోనూ, వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలోనూ కూటమి నాయకత్వం విజయం సాధించిందంటున్నారు పరిశీలకులు.  ఎన్నడూ లేనివిధంగా పులివెందుల గడ్డపై పచ్చజెండా స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది.  పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను, 64 స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.    అలాగే  7 జడ్పీటీసీ స్థానాలకు గాను తెలుగుదేశం మూడు స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది.   పులివెందులలో తెలుగుదేశం ఈ స్థాయిలో బలోపేతం అవ్వడం ఎవరి ఊహకూ అందనిది.  పులివెందులలో జగన్ స్వయంగా క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, అక్కడ స్థానిక తెలుగుదేశం జోరును అడ్డుకోవడంలో విఫలమయ్యారు.   స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ ఫలితాలు వస్తే, అటువంటి చోట్ల పార్టీ నాయకులకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టిక్కెట్లు ఇవ్వబోనని జగన్ గతంలో బహిరంగంగా  ప్రకటించారు. అయితే, ఇప్పుడు స్వయంగా తన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే  మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో జగన్ ఇప్పుడు ఏం అంటారు? ఏం చేస్తారు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది.  [Jagan Pulivendula Forte Broken, AP Local Body Elections, TDP Sweep  Pulivendula, Jagan Stronghold, AP Politics, TeluguOne] 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  జగన్‌కు దూకుడుగా, ప్రత్యర్థలను రెచ్చగొట్టేలా, అవమానపరిచేలా పరుష పదజాలం ఉపయోగించే నేతగా, ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు ఒకింత వివాదాస్పదమే అయినా జగన్ ది అటువంటి వాటిని ఖాతరు చేసే తీరు కాదు.   2019 ఎన్నికల ముందు వరకూ ఆయన తన ప్రసంగాలలో, ఎన్నికల ప్రచారంలో బోలెడు సార్లు గీత దాటి విమర్శలు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చేయాలి అంటూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఏకవచన ప్రయోగాలతో  ఆయన దూకుడు ప్రదర్శించారు. అయితే, 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో వైసీపీ అవమానకరరీతిలో  ఘోర పరాజయాన్ని చవిచూసిందో.. అప్పటి నుంచీ జగన్ నెమ్మది నెమ్మదిగా తన పాత పంథాలోకి వెడుతున్నారు.  రప్పా రప్పా, సినిమా చూపిస్తా వంటి వ్యాఖ్యలు, హెచ్చరికలతో  పాత జగన్  కనిపించేలా వ్యవహరిస్తున్నారు.   తాజాగా.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పులివెందులలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పలు సవాళ్లు విసిరారు. వాటిలో  తాను ఇప్పటికే  నేపథ్యంలో పులివెందుల ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, జగన్ మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికే చొక్కా చేతులు పైకి మడిచి సిద్ధంగా ఉన్నాననీ, ఎవరినైనా, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  తాను పులివెందులలో ఓటు వేస్తాననీ, ఎవరైనా తనను అడ్డుకోవాలనుకున్నా, ఇంకేమైనా చేయాలనుకున్న ప్రయత్నించి చూడాలని సవాల్ విసిరారు.  అయితే పులివెందులలో జగన్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థులను రెచ్చగొట్టడం కంటే.. సొంత క్యాడర్ ను తాను నిలబడతానన్న సంకేతం ఇవ్వడానికే చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో  పులివెందులలో జగన్ పలుకుబడి, వైసీపీ ప్రతిష్ట ఒకింత మసకబారిన పరిస్థితులు కనిపిస్తుండటంతోనే జగన్ ఈ రీతిలో క్యాడర్ లో ఉత్సాహిం నింపడానికీ, తాను ఉన్నానన్న భరోసా ఇవ్వడానికీ చేసి ఉండొచ్చని అంటున్నారు. అయితే ఇటువంటి దూకుడు వ్యాఖ్యలు నిజంగా పులివెందులలో వైసీపీ క్యాడర్ లో జోష్ నింపుతాయా అంటే అదే పరిశీలకులు అనుమానమేనంటున్నారు. 2024 ఎన్నికల పరాజయం తరువాత.. రాష్ట్రాన్ని వదిలి బెంగళూరులో మకాం వేసిన జగన్ చుట్టపు చూపుగా మాత్రమే ఏపీకి వస్తున్న పరిస్థితుల్లో ఆయనపై క్యాడర్ నమ్మకముంచే అవకాశాలు అంతంత మాత్రమేని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   [Jagan Comments Pulivendula Local Body Elections, YCP, AP Politics, Andhra Pradesh, Telugu One]
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది. పులివెందుల మండల పరిధిలోని ఐదు ఎంపీటీసీ స్థానాలనూ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మండలంలోని మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం కూడా టీడీపీ ఖాతాలో చేరే అవకాశాలు స్పష్టమయ్యాయి. దీంతో పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏకగ్రీవాల్లో పుష్పనాథ్‌రెడ్డి కీలక పాత్ర.! పులివెందుల మండలంలోని కొత్తపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు పుష్పనాథ్‌రెడ్డి ఐదు ఎంపీటీసీ స్థానాల ఏకగ్రీవంలో కీలక పాత్ర పోషించారు. కొత్తపల్లి ఎంపీటీసీ స్థానానికి తాను ప్రాతినిధ్యం వహించడంతో పాటు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి సూచనల మేరకు మిగిలిన నాలుగు స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టి, అన్ని స్థానాలనూ ఏకగ్రీవం చేసుకునే దిశగా కృషి చేశారు.  ఆయన ప్రయత్నాలు ఫలించడంతో మండలంలోని ఐదు స్థానాలూ టీడీపీకి దక్కాయి. పులివెందుల మండల పరిధిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఐదుగురు ఎంపీటీసీలు మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి నియామక పత్రాలను అందుకున్నారు.ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఈ. కొత్తపల్లి నుంచి మాడెం పుష్పనాథ్‌రెడ్డి, ఎర్రబల్లి-2 నుంచి కడపన శ్యామలాదేవి, ఎర్రబల్లి-1 నుంచి పండిటి రాజశేఖర్, రాగిమానుపల్లి నుంచి బండి సునీత, అచ్చవెల్లి గంగనపల్లి నుంచి మహమ్మద్ షరీఫ్ ఉన్నారు.  ఎంపీపీ ఎన్నికపై ఆసక్తి.! పులివెందుల మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాలనూ టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో త్వరలో జరగనున్న ఎంపీపీ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఐదు స్థానాలూ ఒకే పార్టీకి దక్కడంతో ఎంపీపీ పదవి కూడా టీడీపీకే దక్కే అవకాశం ఉంది.పులివెందులలో గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి చెందిన పార్టీ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో, ఎంపీపీ పీఠాన్ని టీడీపీ దక్కించుకోనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీపీ ఎన్నిక పూర్తయితే మండల పరిషత్‌లో అధికార మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది.       [ Pulivendula Politics, YS Jagan Mohan Reddy, TDP, Telugu Desam Party, Chandrababu Naidu, B Tech Ravi, Kadapa Political News, Pulivendula MPTC Elections, MPTC Unopposed Elections, TDP Victory, Pulivendula MPP Election, Kadapa Local Body Elections, Andhra Pradesh Politics, Coalition Alliance, Madem Pushpanath Reddy ]
ALSO ON TELUGUONE N E W S
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్‌ పెళ్లి వార్తలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. వీరిద్దరి వివాహానికి సంబంధించిన వార్తలు కొంతకాలంగా ప్రచారంలో ఉండగా.. తాజాగా చెన్నైలో జరగనున్న రిసెప్షన్‌ ఆహ్వాన పత్రిక బయటకు రావడంతో చర్చ మరింత పెరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ వంటి ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందినట్లు సమాచారం. కావ్య మారన్‌ తండ్రి, సన్‌ గ్రూప్‌ అధినేత కళానిధి మారన్‌, ఆమె తల్లి కావేరి మారన్‌ స్వయంగా పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వానాలు అందిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ తదితరులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. తమిళనాడు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌కు కూడా ఆహ్వానం అందించినట్లు వార్తలు వచ్చాయి.  సినీ రంగం నుంచి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అజిత్‌ కుమార్‌, ఆయన భార్య షాలిని, శివకార్తికేయన్‌, ఆయన భార్య ఆర్తి, ఏఆర్‌ రెహమాన్‌, దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ఆయన భార్య స్నేహా రెడ్డి, నటుడు ప్రసన్న తదితరులకు ఆహ్వానాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్‌కు రజనీకాంత్‌ దగ్గరి బంధువు కావడం కూడా ఈ వేడుకపై ఆసక్తిని పెంచుతోంది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన మరికొందరు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే పూర్తి అతిథుల జాబితా అధికారికంగా వెల్లడికాలేదు. ఇక పెళ్లి వేడుకల విషయానికి వస్తే.. అనిరుధ్‌, కావ్య మారన్‌ల వివాహం నవంబర్‌ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో ప్రైవేట్‌ వేడుకగా జరగవచ్చని పలు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం నవంబర్‌ 21న చెన్నైలో భారీ రిసెప్షన్‌ నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వెల్లడించింది. గ్రీస్‌లో జరిగే పెళ్లికి సంబంధించిన తేదీలు, వేదిక వివరాలను మాత్రం ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పింక్‌ విసిల్‌ మ్యాన్‌ సంస్థకు చెందిన రంజని అయ్యంగార్‌ రూపొందించిన ఈ ఆహ్వానాన్ని ఐవరీ, పౌడర్‌ బ్లూ రంగులతో ప్రత్యేకమైన పెట్టెలో అందంగా సిద్ధం చేశారు. ఎంబాస్‌ చేసిన స్టేషనరీ, సున్నితమైన డిజైన్లు, పాతకాలపు శైలిని గుర్తుచేసే క్రెస్ట్‌ సీల్‌తో ఈ ఆహ్వాన పత్రిక బరోక్‌ శైలిలో ఆకట్టుకుంటోంది. అనిరుధ్‌ సంగీత ప్రపంచంలో, కావ్య మారన్‌ వ్యాపార, క్రికెట్‌ రంగాల్లో ప్రముఖులు కావడంతో.. వీరి వివాహ వేడుక ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన సెలబ్రిటీ ఈవెంట్లలో ఒకటిగా నిలుస్తోంది.     [Anirudh Ravichander Wedding, Kavya Maran Wedding, Anirudh Kavya Maran Reception, Anirudh Wedding Guest List, Kavya Maran Reception Invite, Narendra Modi, Allu Arjun, Rajinikanth, Vijay, Greece Wedding November 2026]
S Krishna, who has co-written several blockbusters with Anil Ravipudi, is stepping into direction with High, a youthful entertainer that explores how far people go in pursuit of happiness. The makers have locked November 27 for its worldwide theatrical release, unveiling a comic-book-inspired poster introducing the film's ensemble cast and unconventional premise. Produced by Krishna alongside Harish Peddi and Sekhar Divvela under Imagespark Entertainment and Myra Creations, the film also sees Krishna take on writing and acting responsibilities. Ananya Sharma, Pallavi Dora, Krishna Kamal, Sai Krishna and Revanth play key roles. Rather than following a single character's journey, High connects multiple lives shaped by their individual definitions of a high. One character pursues money and alcohol, another takes dangerous bets for love, while a young woman fights to protect her self-respect. Their stories explore the emotional and psychological consequences of these choices, with the film ultimately placing greater value on self-respect and responsible decisions than destructive pursuits. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మమ్ముట్టి.. నాలుగు దశాబ్దాల క్రితం నుంచే అసలు సిసలైన పాన్ ఇండియా కట్ అవుట్ గా అభిమానుల గుండెల్లో శాశ్వత షెల్టర్ ని సంపాదించాడు. తెలుగు నాట కూడా భారీ ఫాలోయింగ్ తన సొంతం. ఆయన వయసు గురించి చెప్పుకుంటుంటే ఏది ఒక బాబు ఒక సారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో నువ్వు చెప్తుంది ఎంత? ఆ కట్ ఎంత ఉన్నట్టు కనిపిస్తుంది అనే పరిస్థితి. ఏది ఏమైనా మనం మాత్రం పూర్తి మ్యాటర్ మాట్లాడుకుందాం. పనిలో పనిగా ఆ సీక్రెట్ ఏంటో చూద్దాం.       మమ్ముట్టి వయసు ప్రస్తుతం 75 సంవత్సరాలు. కానీ ఆయన రూపం, గంభీరమైన బాడీ లాంగ్వేజ్, యంగ్ లుక్ చూస్తుంటే ఏడు పదుల వయసు దాటిందంటే ఎవరూ నమ్మలేరు. సోషల్ మీడియాలో ఆయన ఫొటోలు కనిపించినప్పుడల్లా అభిమానులు "రివర్స్ ఏజింగ్" అంటూ ఆశ్చర్యపోతుంటారు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా పాతికేళ్ల కుర్రాడిలా నిత్య నవయవ్వనంతో కనిపించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ కుతూహలంగా ఉంటుంది. మమ్ముట్టి ఈ అద్భుతమైన ఆరోగ్యానికి, గ్లోయింగ్ స్కిన్‌కి ప్రధాన కారణం ఆయన కఠినంగా పాటించే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి. "నటుడికి తన శరీరమే మొదటి ఆయుధం, దాన్ని రోజూ జాగ్రత్తగా కాపాడుకోవాలి" అనేది ఆయన ప్రాథమిక నమ్మకం. ఫిట్‌నెస్ ప్రయాణంలో అత్యంత కీలకమైనది ఆహారపు అలవాట్లు. చాలామంది సెలబ్రిటీలలాగా ఆయన కార్బోహైడ్రేట్లను పూర్తిగా దూరం పెట్టరు. శరీరానికి సరిపడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అవసరమని బలంగా నమ్ముతారు. అలాగే ఆయన పాటించే మరో ప్రధాన సూత్రం 'పోర్షన్ కంట్రోల్'. అంటే నచ్చిన పదార్థాలన్నీ తింటారు, కానీ చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తింటారు. తెల్లన్నం, మైదా, ప్రాసెస్ చేసిన చక్కెర, అధిక నూనెలో వేయించిన జంక్ ఫుడ్‌ను దాదాపుగా పక్కన పెట్టేస్తారు. ఆయన ఆహారంలో ఓట్స్, మిల్లెట్స్, కూరగాయలు, నానబెట్టిన బాదంపప్పులు, గుడ్లు, చేపలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది కూడా చదవండి: వైరల్ ట్రెండ్ లోకి జైలర్ 2 : మూర్తి అంకుల్ తో కలిసి ముత్తువేల్ టీ ప్రయత్నం!   రోజూవారి డైట్ ప్లాన్ పరిశీలిస్తే, ఉదయం అల్పాహారంగా ఓట్స్ గంజి, గుడ్డు తెల్లసొన, బొప్పాయి ముక్కలు, నానబెట్టిన బాదం తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో సాధారణ బియ్యం అన్నం బదులుగా ఓట్స్‌తో తయారు చేసిన పుట్టును, తక్కువ మసాలాలు ఉన్న చేపల పులుసును ఇష్టంగా తింటారు. వేయించిన చేపలను తినడం ఆయన దాదాపు 10 ఏళ్ల క్రితమే పూర్తిగా మానేశారని ఆయన పర్సనల్ చెఫ్ గతంలో వెల్లడించారు. ఇక రాత్రి పూట ఓట్స్ లేదా గోధుమ దోశలతో పాటు కోడిమాంసం లేదా చేపల కూరతో చాలా తేలికపాటి భోజనం పూర్తి చేస్తారు. స్నాక్స్ సమయాల్లో నట్స్, అవకాడో, ఎటువంటి వెన్న లేదా నూనె లేని పాప్‌కార్న్ తీసుకుంటారు. ఆహారంతో పాటు వ్యాయామం విషయంలోనూ మమ్ముట్టి ఏనాడూ నిర్లక్ష్యం వహించరు. జిమ్‌లో గంటల తరబడి కఠినమైన వర్కౌట్లు చేయడం కంటే స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తారు. కండరాల బలాన్ని కాపాడుకోవడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తారు. "ఆరోగ్యకరమైన శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, మనస్సుకు మరియు శరీరానికి తగినంత విశ్రాంతి కూడా అంతే అవసరం" అని మమ్ముట్టి చెప్తారు. అందుకే షూటింగ్ షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజూ సరిపడా నిద్రపోయేలా తన కాలాన్ని ప్లాన్ చేసుకుంటారు. న్యాయవాదిగా ఎల్.ఎల్.బి పూర్తి చేసి, ఆ తర్వాత నటనపై మక్కువతో సినీ రంగానికి వచ్చి 400కు పైగా చిత్రాల్లో నటించిన ఈ మెగాస్టార్, ఈనాటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. క్రమశిక్షణ, సమతుల్య ఆహారం, నిరంతర వ్యాయామం, తగినంత విశ్రాంతి కలగలిపిన ఈ సింపుల్ లైఫ్‌స్టైలే ఆయనని 75 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిలా మెరిసేలా చేస్తోంది.   [Mammootty Fitness Secrets And Diet Plan, Mammootty fitness secrets, Mammootty diet plan, Mammootty anti aging tips, Mammootty workout routine, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]    
ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత మరోసారి వార్తల్లో నిలిచారు. ‘సొంతం’, ‘జెమిని’, ‘బిల్లా’, ‘సింహా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఆమె లుక్‌లో వచ్చిన మార్పులు, ఫిట్‌నెస్‌పై పెంచుకున్న శ్రద్ధతో నమిత మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే చర్చ మొదలైంది.  నమిత కెరీర్‌ ప్రారంభంలో వరుస అవకాశాలు, విజయాలు రావడంతో తనలో అహంకారం పెరిగిందని గతంలో చేసిన తప్పుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. తన ప్రవర్తన వల్ల తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇబ్బంది పడ్డారని, పరిశ్రమలోని కొందరు తనను హెచ్చరించడంతో తప్పు తెలుసుకుని మారానని ఆమె వెల్లడించారు. కెరీర్‌లో తప్పుడు కథలను ఎంచుకున్న సందర్భాల నుంచి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు.  ఇక నమిత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 2017లో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్నారు. 2022లో కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కుటుంబ జీవితానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. గతంలో తనకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్న నమిత ఇప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి కొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  అయితే నమిత సినిమాల్లోకి తిరిగి రావడం గురించి ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆమె కొత్త సినిమా అంగీకరించినట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలతో అలరించిన ఈ నటి.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎలాంటి పాత్రలను ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. నిజంగానే రీఎంట్రీ ఇస్తే, తెలుగు ప్రేక్షకులను మళ్లీ వెండితెరపై పలకరిస్తారా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.     [Namitha Comeback, Actress Namitha, Namitha New Look, Namitha Fitness Transformation, Namitha Telugu Movies, Namitha Second Innings, Namitha Latest News]
  ఐరన్ షర్ట్ నలగకుండా 'జైలర్ 2 'తో ముత్తువేల్ పాండియన్ ఉరఫ్ రజినీ సృష్టించిన సంచలనం తెలిసిందే. త్వరలోనే 600 కోట్ల క్లబ్ లో చేరిందనే గుడ్ న్యూస్ రాబోతుంది. ఇక మూవీలో ముత్తు వేల్ తో పాటు ప్రేక్షకులకి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ని అందించిన క్యారక్టర్ మూర్తి అంకుల్. తనని తాను కింగ్ గా భావించి చివరకి మనం బొంగు అని తెలుసుకునే క్యారక్టర్ లో మూర్తి సూపర్ గా చేసాడు. ఇది కూడా చదవండి: ఇరుముడి దర్శకుడితో బాలయ్య మూవీ: ఫ్యాన్స్ ఏమంటున్నారంటే!   https://x.com/murugesh_ariyal/status/2115220403379654685?s=20 రీసెంట్ గా రజినీ, మూర్తి కలిసి టీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ గా మారడమే కాదు నవ్వుల జడివానని తెప్పిస్తుంది. ఫ్యాన్స్ అయితే మూవీలో ఈ సీన్ ని పెట్టాల్సిందని నవ్వుకుంటూనే కామెంట్స్ చేస్తున్నారు.   [Jailer 2 team on viral tea video, Jailer 2 Collections, Rajinikanth, Jailer 2 tea kadai video, Jailer 2 viral scene, Nelson Dilipkumar, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]
ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా టీజర్‌ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పాత్ర చిత్రణపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేతాజీకి మనవడి వరుసయ్యే చంద్రకుమార్‌ బోస్‌ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. టీజర్‌లో చరిత్రను వక్రీకరించేలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్‌ 23న విడుదలైన ‘ఫౌజీ’ టీజర్‌లో 1942 నాటి బెర్లిన్‌ నేపథ్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ మధ్య సంభాషణను చూపించారు. ఈ సన్నివేశంలో నేతాజీ.. ‘ఫౌజీ’లోని కల్పిత పాత్ర గురించి ప్రస్తావించినట్లు కనిపిస్తుంది. నిజమైన చారిత్రక వ్యక్తిని కల్పిత పాత్రను పరిచయం చేయడానికి ఉపయోగించడం సరికాదని, దీనివల్ల నేతాజీ వారసత్వాన్ని తక్కువ చేసినట్లవుతుందని చంద్రకుమార్‌ బోస్‌ అభ్యంతరం తెలిపారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాసిన లేఖలో టీజర్‌ను పరిశీలించి, దీనిపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. అభ్యంతరకరమైన కంటెంట్‌కు సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. టీజర్‌ను వెంటనే తొలగించి, చారిత్రక అంశాలను సరిచేసిన తర్వాత మళ్లీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులైన సెన్సార్‌ బోర్డు సభ్యులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖ ప్రతిని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా పంపించారు. అయితే, ప్రభాస్‌పై కానీ, చిత్రబృందంపై వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని.. నేతాజీకి సంబంధించిన చారిత్రక అంశాలను గౌరవంగా చూపించాలన్నదే తమ ఉద్దేశమని చంద్రకుమార్‌ బోస్‌ తన అభిప్రాయాల్లో స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించి టీజర్‌లో అవసరమైన మార్పులు చేస్తే ప్రభాస్‌, చిత్రబృందానికి తన శుభాకాంక్షలు ఉంటాయని తెలిపారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ 2027 మార్చి 19న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. ఈ వివాదంపై చిత్రబృందం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.     [Prabhas Fauzi, Fauzi Teaser Controversy, Chandra Kumar Bose, Netaji Subhas Chandra Bose, Hanu Raghavapudi, Fauzi Movie News, Prabhas Upcoming Movie]
కొన్ని కాంబినేషన్స్ గురించి జస్ట్ న్యూస్ రావడం ఆలస్యం, అభిమానులు, ప్రేక్షకులే నిర్మాతలుగా మారి ఆ కాంబోలో మూవీ చేసెయ్యాలనే పట్టుదలతో ఉంటారు. ఇప్పుడు ఇరుముడి ఫేమ్ శివ నిర్వాణ, గాడ్ ఆఫ్ మాసెస్ కాంబో న్యూస్ కూడా అలాంటిదే.   శివ నిర్వాణ  చారిత్రాత్మక నగరమైన మైసూర్ లో 'బాలకృష్ణ'ని  కలిసాడు.మైసూర్‌లో జరిగిన ఈ ప్రత్యేక భేటీలో బాలకృష్ణకు శివ నిర్వాణ ఒక సరికొత్త కథను వినిపించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్‌కి ,మాస్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను శివ నిర్వాణ సిద్ధం చేశారని, దానిని బాలయ్యకు వినిపించగా ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందనే వార్తలు సినీ వర్గాలని ఉర్రూతలూగిస్తున్నాయి. ఇప్పటికే తనదైన మాస్ అండ్ కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్న కథాంశాలని  ఎంచుకుంటూ దూసుకెళ్తున్న బాలకృష్ణ కెరీర్‌లో ఈ క్రేజీ కాంబినేషన్ వస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందనే అంచనాలు అభిమానుల్లో తారాస్థాయికి చేరాయి. అయితే, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఆయన లైనప్‌లో ఉన్న చిత్రాలన్నీ పూర్తి కాగానే, ఈ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశాలు ఉంటాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: శ్రీనిధిశెట్టి కాళ్ళకి మొక్కిన త్రివిక్రమ్: కారణం ఇదేనా!    అభిమానులు అయితే మాత్రం ఈ న్యూస్ వినిపించడం ఆలస్యం 'ఇరుముడి' సబ్జెట్ లో బాలయ్య ని ఉహించుకుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే కల్మషం లేని అభిమానుల  ఊహలు అంతరిక్షంలోకి జెట్ స్పీడ్ వేగంతో వెళ్లే రాకెట్ కంటే స్పీడ్. ప్రస్తుతానికైతే బాలయ్య 'దాదా' తో బిజీ. క్రిస్మస్ కి వరల్డ్ వైడ్ రిలీజ్.     [Shiva Nirvana Meets Balakrishna, Nandamuri Balakrishna, Shiva Nirvana, Irumudi movie, Balakrishna new film, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]
సినిమాల్లో కొందరు నటీనటులు గ్లామర్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అయితే ఒక నటిగా తనలోని అసలైన ప్రతిభను బయటకు తీసే పాత్రలు దొరికినప్పుడు ఆ అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రస్తుతం అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ కూడా అలాంటి అనుభవాన్నే పొందినట్లు చెబుతోంది. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్‌ తెరకెక్కిస్తున్న ‘వెట్టువం’ సినిమాలో తన పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని, తనలోని అసలైన నటిని బయటకు తీసుకొచ్చిందని ఆమె వెల్లడించింది. ‘వెట్టువం’ తమిళంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ డ్రామా. ఆర్య, దినేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పా. రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శోభిత రథి అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలకు భిన్నంగా, చాలా శక్తివంతమైన వ్యక్తిత్వం ఉన్న మహిళగా ఇందులో కనిపించనున్నట్లు ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. సాధారణంగా తన పాత్రల్లో పైకి ప్రశాంతంగా కనిపిస్తూ, లోపల ఎన్నో భావాలను దాచుకునే మహిళలను పోషించిన శోభిత.. ఈ సినిమాలో మాత్రం చాలా స్వేచ్ఛగా, ధైర్యంగా తన భావాలను వ్యక్తపరిచే పాత్రను చేయడం విశేషం. ఈ పాత్ర కోసం శోభిత మల్లఖంబ్‌, కలరిపయట్టు వంటి సంప్రదాయ యుద్ధకళల్లో శిక్షణ కూడా తీసుకుంది. తన పాత్ర నవ్వడం, అరవడం, ఎదిరించడం, పోరాడటం వంటి విభిన్న లక్షణాలను కలిగి ఉంటుందని ఆమె వివరించింది. ఇప్పటివరకు తెరపై తాను కనిపించిన విధానానికి భిన్నంగా ఈ పాత్ర ఉండటం వల్ల నటిగా తనకు కొత్త అనుభవం లభించిందని తెలిపింది. ముఖ్యంగా మహిళలను శక్తివంతమైన వ్యక్తులుగా చూపించే దర్శకుడు పా. రంజిత్‌తో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని శోభిత పేర్కొంది. ఇప్పటికే ‘గూఢచారి’, ‘మేజర్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శోభిత.. ‘వెట్టువం’తో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం తాను గతంలో కంటే ఎక్కువగా శ్రమించానని, తన నటనా ప్రయాణంలో ఇది అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్టుల్లో ఒకటని ఆమె అభిప్రాయపడింది. మరి తెరపై రథి పాత్రలో శోభిత ఏ స్థాయిలో మెప్పిస్తుంది? ఈ సినిమా ఆమె కెరీర్‌కు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుంది? అన్నది చూడాలి.     [Sobhita Dhulipala, Vettuvam Movie, Sobhita Vettuvam Role, Pa Ranjith, Arya Vettuvam, Dinesh Actor, Sobhita Latest Interview, Kalaripayattu Training, Mallakhamb Training]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మన ఇంట్లో వంటగది ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ, ఒక్క కిచెన్ సింక్ సరిగా లేకపోతే ఇల్లు మొత్తం మురికిగా ఉన్న భావన కలుగుతుంది. ఉదయం మిగిలిపోయిన టీ నుంచి రాత్రి భోజనం గిన్నెల వరకు, రోజంతా లెక్కలేనంత నీళ్లు, వ్యర్థాలు సింక్ నుంచే వెళ్తాయి. చాలా మంది మిగిలిపోయిన నూనె, టీ ఆకులు, పిండి, బియ్యం లేదా చిన్న చిన్న ఆహారపు ముక్కలను సులభంగా పోతుందని సింక్‌లో పడేస్తుంటారు. ఆ సమయంలో నీటితో పాటు అన్నీ కొట్టుకుపోయినట్లు అనిపించినా, పైపులలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన మరియు సింక్‌లు మూసుకుపోయే తీవ్ర సమస్యలకు దారితీస్తాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మరియు సింక్‌ను ఎల్లప్పుడూ మెరిపించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా పాత్రలను సరిగా శుభ్రం చేయకుండా నేరుగా సింక్‌లో కడగడం వల్ల ప్లేట్లు, ప్యాన్‌లపై మిగిలిపోయిన నూనె, నెయ్యి, మసాలాలు పైపుల లోపల అడ్డుపడతాయి. పిండి కలిపిన తర్వాత మిగిలిపోయిన పిండిని లేదా బియ్యం కడిగిన నీటిని సింక్‌లో పోయడం వల్ల పైపుల లోపల మలినాలు గట్టిగా పేరుకుపోతాయి. పనికిరాని నూనె లేదా నెయ్యిని పొరపాటున కూడా సింక్‌లో పోయకుండా, ఒక సీసాలో లేదా పాత్రలో పోసి చెత్తలో పారవేయాలి. అలాగే టీ ఆకులు, కాఫీ పొడిని కంపోస్ట్ లేదా తడి వ్యర్థాలలో వేయాలి తప్ప సింక్‌లో ఫ్లష్ చేయకూడదు. బియ్యం, పాస్తా, నూడుల్స్, గుడ్డు పెంకులు, పండ్లు మరియు కూరగాయల తొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ సింక్‌లో వేయకుండా తడి వ్యర్థాలతో పాటు పారవేయడం చాలా ముఖ్యం. ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, టాయిలెట్ సీట్ల కంటే కిచెన్ స్క్రబర్‌లలో ఎక్కువ క్రిములు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రబర్లు తడిగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా వేగంగా పెరిగిపోతుంది. కాబట్టి స్క్రబర్లను ఎప్పుడూ పొడిగా ఉంచడం మరియు ప్రతి మూడు వారాలకు ఒకసారి వాటిని కొత్తవాటితో మార్చడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే మీ వంటగది సింక్ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, మెరిసిపోతూ ఉంటుంది.     Kitchen Sink Cleaning Mistakes, How To Make Kitchen Sink Shine, Stainless Steel Sink Care, Remove Sink Stains, Kitchen Cleaning Hacks, Odor Free Kitchen Sink, Home Maintenance Tips.
దీపావళి పండుగ అనగానే ప్రతి ఇంట్లోనూ సందడి నెలకొంటుంది. దీప కాంతుల మధ్య రకరకాల పిండి వంటలు, నోరూరించే మిఠాయిలు, నూనెలో వేయించిన కారాలు, సమోసాలు, కచోరీలు వంటి వాటితో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. అయితే పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే మన ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. పండుగ రోజుల్లో విపరీతంగా నూనె పదార్థాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దీపావళికి జిడ్డు పదార్థాలకు దూరంగా ఉంటూ, కేవలం 5 నిమిషాల్లో ఎంతో రుచికరమైన, కరకరలాడే ఆరోగ్యకరమైన స్నాక్‌ను తయారు చేసుకునే అద్భుతమైన అవకాశం ఫుడ్ ప్రియుల కోసం అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎంతో ప్రసిద్ధి చెందిన కంటెంట్ క్రియేటర్ పల్లవి చిబ్బర్ పరిచయం చేసిన నూనె లేని, అధిక ప్రోటీన్లు కలిగిన స్ప్రౌట్స్ కెనాప్స్ చాట్ ప్రస్తుతం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేకమైన రెసిపీ తయారీ విధానం చాలా సులభం. ఎలాంటి నూనె లేదా డీప్ ఫ్రై అవసరం లేకుండా కేవలం 5 నిమిషాల్లో ఈ హెల్తీ చాట్‌ను ఎవరైనా ఇళ్లలోనే సిద్ధం చేసుకోవచ్చు. దీనికోసం మార్కెట్లో లభించే టార్టిల్లా వ్రాప్స్‌ను తీసుకొని చిన్న రౌండ్ సర్కిల్స్‌గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మఫిన్ మోల్డ్స్‌లో ఉంచి, సుమారు 10 నిమిషాల పాటు క్రిస్పీగా మారే వరకు బేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల నూనె చుక్క కూడా లేకుండా అద్భుతమైన కరకరలాడే కప్‌లు సిద్ధమవుతాయి. పండుగ రోజుల్లో అధిక బరువు లేదా కొలెస్ట్రాల్ గురించి ఆందోళన చెందకుండా ఈ జీరో ఆయిల్ స్నాక్‌ను ఆస్వాదించవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన మొలకెత్తిన గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, చాట్ మసాలా, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్ప్రౌట్స్ మిశ్రమం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావలసిన అధిక ప్రోటీన్లను, పోషకాలను ఇది అందిస్తుంది. ముందుగా సిద్ధం చేసుకున్న కెనాప్ కప్‌లలో ఈ స్ప్రౌట్స్‌ మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో అందంగా నింపాలి. ఆపై దానిపై కొత్తిమీర చట్నీ, చింతపండు చట్నీ వేసి, అద్భుతమైన లుక్ మరియు రుచి కోసం తాజా దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకోవాలి. పుదీనా, చింతపండు చట్నీల కలయిక ఈ చాట్‌కు మరింత వన్నె తెస్తుంది. ఈ స్నాక్‌ను అతిథులకు వెంటనే సర్వ్ చేస్తుంటే పెరుగును ఉపయోగించడం మంచిది. ఒకవేళ ముందుగానే ఈ స్నాక్‌ను సిద్ధం చేసి పెట్టుకోవాలనుకుంటే మాత్రం పెరుగు వేయకుండా పొడిగా ఉంచుకోవాలి, లేదంటే కెనాప్స్ మెత్తబడిపోయి క్రిస్పీనెస్ కోల్పోతాయి. నూనె చుక్క లేకుండా ప్రొటీన్లు నిండిన ఈ టేస్టీ చాట్‌తో ఈసారి మీ దీపావళి వేడుకలను మరింత ఆరోగ్యకరంగా మరియు ఆనందంగా మార్చుకోండి. కుటుంబ సభ్యులందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ సరికొత్త నో ఆయిల్ స్నాక్ మీ పండుగ అనుభూతిని రెట్టింపు చేస్తుంది.     Oil Free Sprouts Canapes, Healthy Diwali Snacks, High Protein Chaat Recipe, Zero Oil Festival Recipes, Sprouts Chaat Ideas, Guilt Free Diwali Food, Healthy Weight Loss Snacks.
మనలో చాలామందికి కడుపులో గందరగోళం లేదా విరేచనాలు (Diarrhea) అయినప్పుడు పెద్దలు చెప్పే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం సర్వసాధారణం. అందులోనూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో ఉన్న ఒక విచిత్రమైన చిట్కా ఏంటంటే.. కొద్దిగా పొడి టీ ఆకులను (Dry Tea Leaves) నీటితో కలిపి మింగితే చాలు, కేవలం 10 నిమిషాల్లోనే లూజ్ మోషన్స్ అణగిపోతాయని కొందరు గట్టిగా నమ్ముతుంటారు. ఇలాంటి దేశీయ లేదా ఇన్‌స్టాంట్ ట్రిక్స్ ఎంతవరకు నిజం? ఇది ఆరోగ్యానికి సురక్షితమేనా? అనే అంశంపై ప్రముఖ వైద్య నిపుణులు ఇస్తున్న సలహాలు ఏంటో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. వైద్య నిపుణుల స్పష్టమైన అభిప్రాయం ప్రకారం, పొడి టీ ఆకులను నేరుగా తినడం లేదా మింగడం అనేది విరేచనాలను నివారించడానికి ఎలాంటి శాస్త్రీయంగా నిరూపితమైన చికిత్స కాదు. సాధారణంగా టీ ఆకులలో 'టానిన్' (Tannin) అనే మూలకం ఉంటుంది. ఇది కొంతవరకు సంకోచ గుణాలను (Astringent properties) కలిగి ఉండటం వల్ల తాత్కాలికంగా పొట్టపై ప్రభావం చూపవచ్చు. అయితే దీనిని పూర్తి స్థాయి నమ్మకమైన వైద్య పరిష్కారంగా అసలు పరిగణించలేమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. లూజ్ మోషన్స్ లేదా విరేచనాలు అయినప్పుడు కేవలం మల విసర్జనను తాత్కాలికంగా ఆపడం ఒక్కటే ముఖ్యం కాదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. దానికంటే అత్యంత ప్రాముఖ్యమైనది శరీరంలో నీరు, లవణాలు (Electrolytes) కోల్పోకుండా కాపాడుకోవడం. ఎందుకంటే విరేచనాల వల్ల శరీరం తీవ్రమైన నీటి నిల్వలను, సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కోల్పోతుంది. దీనిని నివారించడానికి ఓఆర్ఎస్ (ORS - Oral Rehydration Solution) ద్రావణం తాగడమే ఏకైక అత్యుత్తమ మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు వైద్యులు ఎప్పుడూ సిఫార్సు చేస్తుంటారు. మరి పొడి టీ ఆకులు నేరుగా తీసుకోవడం వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే.. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. టీలో కెఫీన్ (Caffeine) ఉండటం వల్ల ఇది కొన్ని సందర్భాలలో మూత్రవిసర్జనను పెంచి శరీరాన్ని మరింత తీవ్రమైన నిర్జలీకరణానికి (Dehydration) గురిచేసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, సున్నితమైన కడుపు తత్వం ఉన్నవారిలో లేదా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారిలో ఇలాంటి ప్రయోగాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నిరూపితం కాని చిట్కాలను గుడ్డిగా నమ్మి ఓఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా టీ ఆకులను వాడే పొరపాటు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులలో డీహైడ్రేషన్ ముప్పు అత్యంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా శ్రేయస్కరం.     Dry Tea Leaves For Diarrhea, Curing Loose Motions With Tea, Home Remedies For Diarrhea Myths, Chewing Tea Leaves Side Effects, Stomach Infection Remedies, Expert Health Facts, Digestive Care Tips.
గర్భం దాల్చాలని ప్రయత్నించే మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. కేవలం ఆహారం తీసుకోవడం, డాక్టర్ చెప్పిన విటమిన్లు వేసుకోవడం మాత్రమే కాకుండా, రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం వల్ల గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి. గర్బం దాల్చాలని అనుకునే  చాలా మంది మహిళలకు తెలియని కొన్ని ముఖ్యమైన , లోతైన విషయాలను వివరంగా  తెలుసుకుంటే.. సర్కాడియన్ రిథమ్  బాలెన్స్.. శరీరంలో సర్కాడియన్ రిథమ్ ను అంతర్గత గడియారం అని అంటారు. ఇది బాలెన్స్డ్ గా ఉండటం  చాలా ముఖ్యం. రాత్రి వేళల్లో ఆలస్యంగా పడుకోవడం లేదా షిఫ్ట్ డ్యూటీల వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా ప్రొలాక్టిన్ , మెలటోనిన్ హార్మోన్లు అండం విడుదల కావడాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వారు రాత్రి పూట కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల గాఢమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. పడుకునే గదిలో లైట్లు పూర్తిగా ఆరిపోయేలా లేదా డిమ్ గా ఉంచుకోవడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది. ప్లాస్టిక్ కు దూరం..  రోజూ వాడే ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్, నాన్-స్టిక్ పాన్ల వాడకం వల్ల శరీరంలోకి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అనే రసాయనాలు ప్రవేశిస్తాయి. ఇవి హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి అండం నాణ్యతను తగ్గిస్తాయి. దీనికి బదులుగా గాజు లేదా స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను వాడడం చాలా మంచిది. ప్లాస్టిక్ డబ్బాలలో వేడి వేడి ఆహారాన్ని నిల్వ చేయడం పూర్తిగా మానేయాలి. ప్యాక్డ్, జంక్ ఫుడ్.. శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ లేదా అంతర్గత మంట కూడా సంతానోత్పత్తిని అడ్డుకుంటుంది. ప్యాకెట్లలో లభించే జంక్ ఫుడ్, మైదా ఉత్పత్తులు, పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను పెంచుతాయి. దీనికి బదులుగా యాంటీ ఆక్సిడెంటల్ గుణాలు ఎక్కువగా ఉండే నల్ల ద్రాక్ష, దానిమ్మ, బ్లూ బెర్రీస్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి అండం నాణ్యతను పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కార్టిసాల్ హార్మోన్.. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ప్రెగ్నెన్సీకి సహకరించే ఇతర హార్మోన్లను అణచివేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కేవలం యోగా ఒక్కటే కాకుండా, ప్రకృతితో గడపడం, సూర్యరశ్మిలో కాసేపు నడవడం వంటివి చేయాలి. ఉదయం పూట ఎండలో పదిహేను నిమిషాలు గడపడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి అందుతుంది, ఇది హార్మోన్ల సమతుల్యతకు ఎంతో అవసరం. పెల్విక్ ఆరోగ్యం.. పెల్విక్ ఫ్లోర్ కండరాల ఆరోగ్యం  గురించి చాలా మంది పట్టించుకోరు. గర్భాశయానికి రక్త సరఫరా సక్రమంగా జరగాలంటే ఈ కండరాలు ఆరోగ్యంగా ఉండాలి. రోజూ తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల పొత్తికడుపు భాగానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. కాఫీ, టీ.. కాఫీ, టీల వాడకాన్ని కొద్దిగా తగ్గించడం మంచిది. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల అండం విడుదలయ్యే వేగం మందగించే అవకాశం ఉంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తూ, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే గర్భధారణ మార్గం చాలా సులభం అవుతుంది. ప్రతి మహిళ శరీరం భిన్నంగా ఉంటుంది కాబట్టి,  ఆరోగ్య పరిస్థితికి తగినట్లుగా నిపుణుల సలహా తీసుకోవడం కూడా ఎంతో మంచిది.                                                                                                                       *రూపశ్రీ.
మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, నిద్రలేమి వంటి సమస్యలు మన రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కొందరిలో నిరంతర ఆందోళన, బాధ, నిరాశ కారణంగా పనిపై ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపవచ్చు. అసలు మానసిక ఒత్తిడికి, శరీర ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటి? డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కోవడానికి సైకోథెరపీ ఎలా సహాయపడుతుంది? ఈ వీడియోలో డాక్టర్ శారదా దేవి గారు మానసిక ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు, సైకోథెరపీ ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. మందులు మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్సలో సైకోథెరపీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? మనసు, శరీరం మధ్య సంబంధం ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. సైకోథెరపీ అంటే ఏమిటి? మానసిక సమస్యలను అర్థం చేసుకోవడానికి, ఆలోచనలు మరియు భావోద్వేగాలను ఆరోగ్యకరంగా నిర్వహించుకోవడానికి సహాయపడే చికిత్సా విధానాల్లో సైకోథెరపీ ఒకటి. మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడటం ద్వారా సమస్యలకు కారణమయ్యే ఆలోచనా విధానాలను గుర్తించడం, ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధతులను నేర్చుకోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం వంటి అంశాల్లో సహాయం పొందవచ్చు. సైకోథెరపీ ఎవరికి, ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది? చికిత్స ద్వారా మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు? అనే విషయాలను ఈ వీడియో వివరిస్తుంది. డిప్రెషన్, ఆందోళన, భయం ఎందుకు కలుగుతాయి? నిరంతర ఆందోళన, భయం, నిరాశ, భావోద్వేగ ఒత్తిడి వంటి సమస్యలు వ్యక్తి ఆలోచనలను, ప్రవర్తనను, రోజువారీ పనులను ప్రభావితం చేయవచ్చు. డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను సాధారణ బాధ లేదా తాత్కాలిక ఒత్తిడితో సమానంగా చూడకూడదు. వీటి వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. సమస్యలను గుర్తించడం, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం తీసుకోవడం ఎందుకు ముఖ్యమో డాక్టర్ శారదా దేవి గారు వివరిస్తారు. మానసిక ఒత్తిడికి, శారీరక ఆరోగ్యానికి సంబంధం ఏమిటి? మనసుపై ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో కూడా కొన్ని మార్పులు సంభవించవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి నిద్ర, రోగనిరోధక వ్యవస్థ, రక్తపోటు వంటి ఆరోగ్య అంశాలపై ప్రభావం చూపవచ్చు. అయితే అధిక రక్తపోటు (BP)కు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి ఒక్కటే దానికి కారణమని భావించకూడదు. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టవచ్చు. నిద్రలేమి ఎందుకు వస్తుంది? నిద్ర ఎందుకు ముఖ్యం? తగినంత నిద్ర లేకపోవడం వల్ల అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు నిద్రను దెబ్బతీయవచ్చు. ఈ విధంగా మానసిక ఆరోగ్యం, నిద్ర ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. నిద్రలేమిని నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాలను గుర్తించి తగిన సహాయం పొందడం అవసరం. సైకోసిస్, స్కిజోఫ్రెనియా వంటి సమస్యల గురించి తెలుసుకోండి మానసిక ఆరోగ్య సమస్యలు ఒకే రకంగా ఉండవు. డిప్రెషన్, ఆందోళన, సైకోసిస్, స్కిజోఫ్రెనియా వంటి పరిస్థితుల లక్షణాలు, వాటికి అవసరమైన చికిత్సలు వేర్వేరుగా ఉంటాయి. వీటి గురించి సరైన అవగాహన పెంపొందించుకోవడం, అపోహలకు దూరంగా ఉండటం, బాధితులను గౌరవంగా చూడటం ఎంతో ముఖ్యం. అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం సరైన మార్గం. శారీరక, భావోద్వేగ, సామాజిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి, సంబంధాల్లో ఇబ్బందులు, జీవితంలో ఎదురయ్యే మార్పులు మన మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని గుర్తించడం, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం, విశ్రాంతికి సమయం కేటాయించడం, అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవడం ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకోవాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డాక్టర్ శారదా దేవి గారి వివరణ ద్వారా సైకోథెరపీ ప్రాముఖ్యత, మనసు-శరీరం మధ్య సంబంధం, ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు, నిద్ర ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి. గమనిక: ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిర్ధారణకు లేదా వ్యక్తిగత చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి లేదా అధిక రక్తపోటు సమస్యలు కొనసాగితే వైద్య నిపుణులను సంప్రదించండి. వైద్యుల సలహా లేకుండా సూచించిన మందులను ఆపవద్దు.