ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత మరోసారి వార్తల్లో నిలిచారు. ‘సొంతం’, ‘జెమిని’, ‘బిల్లా’, ‘సింహా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఆమె లుక్‌లో వచ్చిన మార్పులు, ఫిట్‌నెస్‌పై పెంచుకున్న శ్రద్ధతో నమిత మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే చర్చ మొదలైంది.
నమిత కెరీర్ ప్రారంభంలో వరుస అవకాశాలు, విజయాలు రావడంతో తనలో అహంకారం పెరిగిందని గతంలో చేసిన తప్పుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. తన ప్రవర్తన వల్ల తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇబ్బంది పడ్డారని, పరిశ్రమలోని కొందరు తనను హెచ్చరించడంతో తప్పు తెలుసుకుని మారానని ఆమె వెల్లడించారు. కెరీర్‌లో తప్పుడు కథలను ఎంచుకున్న సందర్భాల నుంచి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు.
ఇక నమిత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 2017లో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్నారు. 2022లో కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కుటుంబ జీవితానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. గతంలో తనకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్న నమిత ఇప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి కొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే నమిత సినిమాల్లోకి తిరిగి రావడం గురించి ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆమె కొత్త సినిమా అంగీకరించినట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ నటి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి పాత్రలను ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. నిజంగానే రీఎంట్రీ ఇస్తే, తెలుగు ప్రేక్షకులను మళ్లీ వెండితెరపై పలకరిస్తారా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
[Namitha Comeback, Actress Namitha, Namitha New Look, Namitha Fitness Transformation, Namitha Telugu Movies, Namitha Second Innings, Namitha Latest News]






