Home

»

Latest News

ఇరుముడి దర్శకుడితో బాలయ్య మూవీ: ఫ్యాన్స్ ఏమంటున్నారంటే!

Oct 28, 2026 12:03PM


కొన్ని కాంబినేషన్స్ గురించి జస్ట్ న్యూస్ రావడం ఆలస్యం, అభిమానులు, ప్రేక్షకులే నిర్మాతలుగా మారి ఆ కాంబోలో మూవీ చేసెయ్యాలనే పట్టుదలతో ఉంటారు. ఇప్పుడు ఇరుముడి ఫేమ్ శివ నిర్వాణ, గాడ్ ఆఫ్ మాసెస్ కాంబో న్యూస్ కూడా అలాంటిదే. 

 శివ నిర్వాణ  చారిత్రాత్మక నగరమైన మైసూర్ లో 'బాలకృష్ణ'ని  కలిసాడు.మైసూర్‌లో జరిగిన ఈ ప్రత్యేక భేటీలో బాలకృష్ణకు శివ నిర్వాణ ఒక సరికొత్త కథను వినిపించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్‌కి ,మాస్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను శివ నిర్వాణ సిద్ధం చేశారని, దానిని బాలయ్యకు వినిపించగా ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందనే వార్తలు సినీ వర్గాలని ఉర్రూతలూగిస్తున్నాయి. ఇప్పటికే తనదైన మాస్ అండ్ కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్న కథాంశాలని  ఎంచుకుంటూ దూసుకెళ్తున్న బాలకృష్ణ కెరీర్‌లో ఈ క్రేజీ కాంబినేషన్ వస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందనే అంచనాలు అభిమానుల్లో తారాస్థాయికి చేరాయి. అయితే, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఆయన లైనప్‌లో ఉన్న చిత్రాలన్నీ పూర్తి కాగానే, ఈ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశాలు ఉంటాయనే మాటలు వినిపిస్తున్నాయి.


ఇది కూడా చదవండి: శ్రీనిధిశెట్టి కాళ్ళకి మొక్కిన త్రివిక్రమ్: కారణం ఇదేనా! 

 

అభిమానులు అయితే మాత్రం ఈ న్యూస్ వినిపించడం ఆలస్యం 'ఇరుముడి' సబ్జెట్ లో బాలయ్య ని ఉహించుకుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే కల్మషం లేని అభిమానుల  ఊహలు అంతరిక్షంలోకి జెట్ స్పీడ్ వేగంతో వెళ్లే రాకెట్ కంటే స్పీడ్. ప్రస్తుతానికైతే బాలయ్య 'దాదా' తో బిజీ. క్రిస్మస్ కి వరల్డ్ వైడ్ రిలీజ్.  

 

[Shiva Nirvana Meets Balakrishna, Nandamuri Balakrishna, Shiva Nirvana, Irumudi movie, Balakrishna new film, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com