విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం వైసీపీపై ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు నుంచి కూడా విజయసాయి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో కూడా విజయసాయి సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నాయి.   వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయసాయి,  ఇప్పుడు  పరివర్తన రాజనీతి పార్టీ  పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.   దేశభక్తి, ప్రజా సంక్షేమం,  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తన పార్టీ పనిచేస్తుందని విజయసాయి పార్టీ ప్రకటన సందర్భంగా చెప్పారు. పార్టీ అధికారిక ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడమే తమ   లక్ష్యమని ప్రకటించారు.  ఈ పరిణామం వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా, పార్టీ నేతకు అధినేతకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు  సొంత కుంపటి పెట్టుకోవడం ఆ పార్టీకి ఏదో మేరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తమౌతోంది.   ఇది కూడా చదవండి:  జయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.! పార్టీలో అసంతృప్తితో ఉన్న, అలాగే ఆయనతో సత్సంబంధాలు కలిగిన కొందరు నేతలు భవిష్యత్తులో వైసీపీని వీడి విజయసాయి పంచన చేరే అవకాశలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  అదలా ఉంచితే..  కొత్త పార్టీ ద్వారా ఆయన ఏ మేరకు ప్రభావం చూపగలరు, ప్రజాదరణను ఏ విధంగా సంపాదించుకుంటారు అనే విషయంలో కూడా రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రానున్న కాలంలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ)  ప్రయాణం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఏ మేరకు ఎలా  ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చెప్పిన ముహూర్తానికి చెప్పినట్లుగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయసాయి, ముందు ముందు రాష్ట్ర రాజకీయాలలో  ఏ మేరకు ప్రభావం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్త మౌతోంది.   మీకు నచ్చవచ్చు:  వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి   విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.? [Effect of Vijayasai Reddy New Party onYCP, Parivarthana Rajaneethi Party, PRP, Political Impact, AP Politics, Telugu One]
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్తపార్టీని అధికారికంగా ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన పార్టీ పెరును ఆయన ప్రకటించారు. విజయవాడ ఏ కన్నెన్షన్ వేదికగా బుధవారం (నవంబర్ 11) సరిగ్గా 11 గంటల 11నిముషాలకు ఆయన తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. తన  కొత్త పార్టీ పేరు పీఆర్పీ (పరివర్తన రాజనీతి పార్టీ)గా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాలలో మరో కొత్తపార్టీ ఆవిర్భవించింది.   గతంలో వైపీపీలో కీలక నేతగా చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి, ఆ తరువాత ఆ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన  రాజ్యసభ సభ్యత్వానికి  రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా సందర్భంగా ఇక రాజకీయాలకు దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయం మార్చుకుని, యూటర్న తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు.   తన కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన ఆయన ఈ  సందర్భంగా పార్టీ జెండా, ఎజెండాను  ఆవిష్కరించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలకు స్వస్తి పలకడంతో పాటు, రెండు కుటుంబాల ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలకడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.  దేశభక్తి, ప్రజా సంక్షేమం,  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పీఆర్పీ  పనిచేస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దే ఫ్యాక్టరీగా తమ పార్టీ పని చేస్తుందన్న విజయసాయిరెడ్డి,  రాష్ట్రంలో కరువు కాటకాలు, కరెంటు కోతలు లేని పరిస్థితులను సృష్టించడం, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం తమ ధ్యేయమన్నారు. ఇది కూడా చదవండి:  వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి ఇక ఎన్నికల హామీల విషయంలోనూ ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడం, చదువుల భారాన్ని తగ్గించి వంద శాతం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు,  విజయసాయిరెడ్డి నూతన పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది.  ఇప్పటికే పలువురు అసంతృప్త నేతలు ఆయన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.  రానున్న రోజుల్లో ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాలపై చూపే ప్రభావంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేచింది.  మీకు నచ్చవచ్చు: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!​ తెలుగుదేశం, వైసీపీ దొందూదొందే.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. విజయసాయిరెడ్డి.! [Vijayasai Reddy New Party PRP, Parivarthana Rajaneethi Party, Andhra Pradesh Politics, Vijayawada Convention Center, Gen Z Leaders, Telugu One]
తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన ముద్ర వేస్తూ తొలి ప్రయత్నంలోనే తన టీవీకే పార్టీని గెలిపించుకుని, తొలి ప్రయత్నంలోనే  ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి సుమారు 35 శాతానికి పైగా ఓటు బ్యాంకును సాధించారు. విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఇటీవల కాలంలో టీవీకే ప్రభుత్వానికి చెందిన కొందరు నేతల వివాదాస్పద ప్రవర్తన పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తోంది. గతంలో ఒక మంత్రి డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వివాదంలో చిక్కుకోగా, తాజాగా తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్,  సిట్టింగ్ ఎమ్మెల్యే రవిశంకర్ దురుసు ప్రవర్తన వివాదంగా మారింది. తిరుచిరాపల్లి జిల్లాలో తమ ప్రాంతంలోని తాగునీటి ఎద్దడి, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్లిన కార్తీక్ కుమార్ అనే  వ్యక్తిపై డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ భౌతిక దాడికి దిగారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి తన వద్దకు వచ్చిన వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకోవడం  దుమారానికి దారితీసింది. ఇది కూడా చదవండి: చంద్రబాబుతో భేటీ: విజయ్ విక్టరీ సింబల్.. దక్షిణాది పొలిటికల్ సినేరియో మార్పునకు సంకేతమా.? ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో టీవీకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో హింసాత్మక మరియు ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి పలకాలని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేల తీరు ఆయన ఆశయాలకు గండికొడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం కొద్ది నెలలు మాత్రమే అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి విజయ్, తప్పు చేసే ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుని గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ పని తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో చూపుతున్న వేగం, నిరాడంబరత ప్రజలను ఆకట్టుకుంటున్నప్పటికీ, టీవీకే ఎమ్మెల్యేల తీరు, వారిపై వెల్లువెత్తుతున్న విమర్శలు పార్టీకే కాదు, వ్యక్తిగతంగా విజయ్ కూడా నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గీత దాటిన ఎమ్మెల్యేలపై విజయ్ కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.  మీకు నచ్చవచ్చు:  తమిళనాడు సీఎం విజయ్ పై ఎన్నికల కేసు: ఈ నెల 14న తీర్పు.! విడాకుల కేసు: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్ వైఫ్.! [TVK MLAS Crossing Line, Tamilnadu Government, CM Vijay, Deputy Speaker Ravi Shankar,  Controversy, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
  -సినిమా పేరు: ఇట్లు అర్జున -న‌టీన‌టులు: అనీష్, అనస్వర రాజన్, ముఖేష్ రిషి, కలైయరసన్, ఇలంగో కుమరవేల్, బ్రహ్మాజీ, -వెన్నెల కిషోర్ తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: రాజా మహాదేవన్ -ఎడిటింగ్: కోటి కె  -మ్యూజిక్: థమన్  -నిర్మాత‌: వెంకీ కుడుముల -బ్యానర్: వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ -సమర్పణ: కింగ్ నాగార్జున  -రచన,దర్శకత్వం: మహేష్ ఉప్పల -రిలీజ్ డేట్ : నవంబర్ 13 ,2026    కింగ్ నాగార్జున, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ప్రమోషన్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న నయా మూవీ ఇట్లు అర్జున..డెబ్యూ హీరో అనీష్, అనశ్వర రాజన్ హీరో, హీరోయిన్. ఈ రోజు సెల్యులాయిడ్ పై సైన్ చేశారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.   కథ పెద్దన్న(ముకేశ్ రుషి) నేర ప్రవృతి గల సామ్రాజ్యనికి అధిపతి. ఆడ, మగ నేర స్వభావం గల వాళ్ళందర్నీ కుటంబవ్యవస్గగా మార్చుకొని తన ఆధీనంలోనే( గేటెడ్ కమ్యూనిటీ) గా  ఉంచుకుంటాడు.1000 కోట్ల హవాలా డబ్బుతో కొడుకు కోసం సొంత రాజకీయ పార్టీ పెట్టాలనే లక్ష్యంతో ఉంటాడు. అర్జున( అనీష్) దొంగతనాలు చేసుకుని బతికే కుటుంబానికి చెందిన వ్యక్తి..అలా అని అసాంఘిక శక్తి కాదు. మంచి వ్యక్తే.. మాటలు రావు. చిన్నప్పటి నుంచే తన అపార్ట్మెంట్ లోనే ఉండే కీర్తి(అనశ్వర రాజన్) ని ఇష్టపడుతుంటాడు. కీర్తి ఒక క్రిస్టియన్.చాలా మంచి అమ్మాయి.  నైట్ పార్టీలకి వెళ్తూ సరదాగా బతకాలని ఉన్నా కూడా, ఆడపిల్ల చాలా హుందాగా  బాధ్యతగా, పద్దతిగా ఉండాలని తల్లి అంటుంటుంది. ఈ మూడు పార్శ్యాల మధ్య ఏం జరిగిందనేదే ఇట్లు అర్జున.  ఎనాలసిస్   మూవీ మొత్తం చాలా రిచ్ గా ఉంది. కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగినా, మెయిన్ పాయింట్ విషయంలో కొంచం కన్ఫ్యూజ్.అలా కాకుండా అర్జునకి సంబంధం లేకుండానే 1000 కోట్ల హవాలా డబ్బులో తన ప్రేయసి కీర్తితో కలిసి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే ఎస్టాబ్లిష్ తోనే మూవీని ఎండ్ చెయ్యాలసింది. ఎందుకంటే కీర్తిని తీసుకొని 1000 కోట్ల హవాలా డబ్బు కాజేసిన వ్యక్తి ఇంటికి అర్జున్ వెళ్ళడు కదా!. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మొదటి పావుగంట వచ్చిన సన్నివేశాలతో కొత్త రకం స్క్రీన్ ప్లే తో మూవీ చూస్తున్నామని విషయం అర్ధమవుతుంది. అందుకు తగ్గట్టుగానే సన్నివేశాలు వచ్చి మెస్మరైజ్ చేసాయి. తెలుగు తెరపై చాలా రోజుల తర్వాత మెరిసిన ఫార్మేట్ అని కూడా అనుకోవచ్చు. కీర్తి, అర్జున మధ్య వచ్చిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. అందుకు తగ్గట్టే సాంగ్స్ సైతం ఉన్నాయి. పెద్దన్న ఎపిసోడ్ ని బాగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. వెన్నెల కిషోర్ ట్రాక్ కూడా మరింతగా ఉండాల్సింది. ఉన్నంతలో మెస్మరైజ్ చేసాయి. బ్రహ్మ( నెగిటివ్ క్యారక్టర్) బ్రహ్మాజీ సీన్స్ సైతం కథకి హెల్ప్ అయ్యాయి.  1000 కోట్ల హవాలా డబ్బులో కీర్తి, అర్జున ఇరుక్కునే ప్రాసెస్ మొత్తం కూడా సూపర్. ఇంటర్వెల్ బ్లాంగ్ పేలింది. సెకండ్ హాఫ్ లో చూసుకునే కథనం మొత్తం చాలా ఫాస్ట్ గా, క్యూరియాసిటీగా సాగింది. పోలీస్ క్యారక్టర్ ఎపిసోడ్ తో పాటు అర్జున, కీర్తి మధ్య మదించిన టోటల్ ఎపిసోడ్ బాగుంది. పైన ఫస్ట్ లోనే చెప్పుకున్నట్టు హవాలా డబ్బు విషయంలో అర్జునకి ఏం తెలియదనే ఎస్టాబ్లిష్ చేసి, కీర్తిని కూడా పెద్దన్న దగ్గరే బందీగా ఉంచాల్సిందేమో. ఏది ఏమైనా చివర్లో కొన్ని సీన్స్ సిల్లీగా తేలిపోయాయి. ఉదాహరణకి అర్జున శరీరంలో బుల్లెట్స్ దిగినా మాములుగా చూపించడం. అదే విధంగా క్లైమాక్స్ లో   కీర్తికి తన ప్రేమని వ్యక్తపరిచే ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్, భూమిక ల ఖుషి ట్రైన్ ఎపిసోడ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. దాంతో క్యూరియాసిటీ పెరిగేది. ఈ సబ్జెట్ కి అది అవసరం కూడా. నటీనటులు, సాంకేతిక నిపుణల పని తీరు మొదటి సినిమా అయినా అనీష్ అన్ని రకాల వేరియేషన్స్ లో అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేసాడు. డాన్స్, ఫైట్స్, ఎంటర్టైన్ మెంట్ తాలూకు బాడీ లాంగ్వేజ్ ని, భావజాలాన్ని ప్రదర్శించడంలో భారీగానే సక్సెస్ అయ్యాడు. తెలుగు తెరకి ఇంకో మంచి హీరో దొరికినట్టే. అనస్వర రాజన్ మరో సారి తన క్యూట్ పెర్ఫార్మ్ తో మెప్పించింది. కొన్ని సన్నివేశాల్లో అయితే ఆమె పెర్ఫార్మ్ నిండు పున్నమి వెన్నెలని తలపించింది.ముకేశ్ రుషి, బ్రహ్మాజీ తో పాటు మిగతా అన్ని క్యారెక్టర్స్ లలో చేసిన వాళ్ళందరూ తమ నటనతో కథకి ప్రాణం పోశారు. ముఖ్యంగా బ్రహ్మ గా చేసిన విలన్ క్యారక్టర్ అయితే తెలుగులో బిజీ అవ్వడం ఖాయం. వెన్నెల కిషోర్ మరో సారి నవ్వుల్లో ముంచెత్తాడు. ఫొటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. థమన్ ఆర్ ఆర్, సాంగ్స్ కూడా అదే పరిస్థితి. తనదైన మ్యూజిక్ మాయాజాలంతో ఇట్లు అర్జున్ కి అదనపు వన్నె తీసుకొచ్చాడు. వెంకీ కుడుమల నిర్మాణ విలువలు చాలా హుందాగా, రిచ్ గా ఉన్నాయి, మహేష్ దర్సకుడిగా భారీగా సక్సెస్ అయ్యాడు. తనదైన టేకింగ్ తో ప్రతి సన్నివేశాన్ని పరుగెత్తించాడు. రచయితగా కొన్ని లాజిక్స్ మర్చిపోయాడు. బలాలు 1 . అనీష్, అనశ్వర రాజన్ తో ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ 2 .డైరెక్షన్  3 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్  4 . ఫొటోగ్రఫీ  బలహీనతలు 1.లాజిక్ లేని కొన్ని సీన్స్  ఇట్లు అర్జున కథనంలో కొన్ని లాజిక్స్ ని మిస్ అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది.   రేటింగ్ 2 .5 /5                                                                         అరుణాచలం
‘ఈ నగరానికి ఏమైంది’.. యూత్‌కు బాగా కనెక్ట్ అయిన కల్ట్ మూవీస్‌లో ఇదొకటి. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలు, కామెడీ, ఎమోషన్స్‌తో తరుణ్ భాస్కర్ ఈ సినిమాను ఓ ప్రత్యేకమైన అనుభూతిగా మలిచారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా 'ENE Repeat' పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నవంబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ‘బతుకమ్మ’ పాట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ పాటను రూపొందించారు. బతుకమ్మ పండుగ అంటే కేవలం పూలను పేర్చి పూజించడం మాత్రమే కాదు.. ఆడపడుచుల ఆనందం, కుటుంబ సభ్యుల కలయిక, స్నేహితుల సందడి, ఆటపాటల సమాహారం. ఈ పండుగలో ఉండే అసలైన రంగులను పాటలో చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ పాటలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఒక అమ్మాయి తనకు ఎలాంటి భర్త కావాలో చెబుతున్నట్టుగా చంద్రబోస్ సాహిత్యం సాగుతుంది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఓ అమ్మాయి మనసులోని కోరికలను పాట రూపంలో చెప్పించడం మంచి ఆలోచన. ఈ పాటకు ప్రధాన ఆకర్షణ శ్రేయా ఘోషల్ గాత్రం. ఎన్నో భాషల్లో అద్భుతమైన పాటలు పాడిన ఆమె.. తన మధురమైన గొంతుతో ఈ పాటకు ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చారు.  ఇది కూడా చదవండి: 50 ఏళ్ల ‘ఊరుమ్మడి బతుకులు’.. స్టార్ హీరోలు లేకుండానే జాతీయ అవార్డు కొట్టిన తెలుగు సినిమా.! ఇక వివేక్ సాగర్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరుణ్ భాస్కర్ సినిమాలకు ఆయన అందించే సంగీతంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ఇప్పుడు బతుకమ్మ పాటలో కూడా తెలంగాణ జానపద వాతావరణానికి తగ్గట్టుగా బాణీలను అందించారు.  దీనికి చంద్రబోస్ సాహిత్యం తోడవడంతో పాటకు మరింత అందం వచ్చింది. ముఖ్యంగా పండుగ సంబరాలను గుర్తుచేసే సంగీతం, శ్రేయా ఘోషల్ వాయిస్ కలిసిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ పాట లిరికల్ వీడియోలో శివాత్మిక అందంగా కనిపిస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆమె లుక్, హావభావాలు పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. పండుగ వాతావరణంలో ఆమె కనిపిస్తున్న తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఏలేటి ఈశ్వర్ పెంటీ కొరియోగ్రఫీ కూడా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మీకు నచ్చవచ్చు: శోభన్ బాబుకు స్టార్‌డమ్ తెచ్చిన మూవీ.. 'తాసిల్దార్ గారి అమ్మాయి' వెనుక ఇన్ని విశేషాలా.? చచ్చిపోకముందే వెళ్లిపోండి.. ‘పైర్’ కథ వింటే కన్నీళ్లు ఆగవు.!     [ENE Repeat Movie, Bathukamma Song, Shivathmika, Shreya Ghoshal, Vivek Sagar]  
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే హడావుడి వేరే లెవల్. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నా.. బిజినెస్ విషయంలో మాత్రం అప్పుడే సందడి మొదలైంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా థియేట్రికల్ హక్కుల గురించి టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియా హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థల మధ్య పోటీ నెలకొనగా.. చివరకు ఏషియన్ సినిమాస్ ఈ డీల్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. తాజా ట్రేడ్ సమాచారం ప్రకారం.. చిరంజీవి ‘కాకా’ నైజాం థియేట్రికల్ హక్కులను ఏషియన్ సినిమాస్ సుమారు రూ.35 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా రికవరబుల్ అడ్వాన్స్ పద్ధతిలో ఈ డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ హక్కుల కోసం మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు కూడా పోటీ పడినట్లు సమాచారం. అయితే చివరకు ఏషియన్ సినిమాస్ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక కేవలం నైజాం మాత్రమే కాకుండా ఆంధ్రా, సీడెడ్, కర్ణాటక హక్కులకు కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ కలిపి దాదాపు రూ.130 కోట్ల రేంజ్ లో జరుగుతోందనే ప్రచారం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇది కూడా చదవండి: శేఖర్ మాస్టర్‌ వీడియో.. యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఇదే.! చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో చిరంజీవి కదిరి కాళిదాసు అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన కూతురిగా మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. నివేదా పేతురాజ్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాకు సంక్రాంతి విడుదల మరో పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. 2027 జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మీకు నచ్చవచ్చు: 50 ఏళ్ల ‘ఊరుమ్మడి బతుకులు’.. స్టార్ హీరోలు లేకుండానే జాతీయ అవార్డు కొట్టిన తెలుగు సినిమా.! చచ్చిపోకముందే వెళ్లిపోండి.. ‘పైర్’ కథ వింటే కన్నీళ్లు ఆగవు.!       [Kaaka Nizam Rights, 35 Crore Deal, Chiranjeevi, Bobby Kolli, Asian Cinemas]  
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కథాంశంతోనే రూపొందిన 'పుష్పక విమానం' సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి రోనక్ ప్రధాన పాత్రలో నటించగా, భరణి శంకర్ కీలక పాత్ర పోషించారు. సతీశ్ మల్లిడి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నవంబర్ 12 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తొలి నాలుగు ఎపిసోడ్స్‌ను విడుదల చేశారు. ఇకపై ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ అందుబాటులోకి రానున్నాయి. 'పుష్పక్' (సాయి రోనక్) ఒక మధ్యతరగతి యువకుడు. చదువులో అంతగా రాణించకపోయినా ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. మాటకారితనంతో పాలసీలు చేయించడంలో ముందుంటాడు. అయితే ఉద్యోగం తర్వాత అతని ఆలోచనలన్నీ సావిత్రి (మధు దామరాజు) చుట్టూనే తిరుగుతుంటాయి. ఆమె పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటుంది. ఎనిమిదేళ్లుగా పుష్పక్ తన ప్రేమను వ్యక్తం చేస్తున్నా సావిత్రి మాత్రం అతనిపై కోపంగానే ఉంటుంది. మరోవైపు పుష్పక్ తమ్ముడు సంకేత్, ధనిక కుటుంబానికి చెందిన సారాను ప్రేమిస్తుంటాడు. ఆమె తండ్రి దగ్గర అవమానం ఎదురవడంతో బాగా డబ్బు సంపాదించి తిరిగి వస్తానని సంకేత్ సవాల్ చేసి వెళ్తాడు. ఇదిలా ఉంటే పుష్పక్ నివసించే డార్విన్ కాలనీని ఖాళీ చేయించేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. వారికి పోలీస్ అధికారి ప్రభు సహకరిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అజ్ఞాత వ్యక్తి (భరణి శంకర్) పుష్పక్‌కు పరిచయమవుతాడు. కాలనీ చివరన ఉన్న ఓ పాడుబడిన భవనంలోని లిఫ్ట్ అతని జీవితాన్ని మార్చేస్తుందని చెబుతాడు. మొదట ఆ మాటలను పట్టించుకోని పుష్పక్, అనుకోకుండా ఓ రాత్రి ఆ భవనానికి వెళ్తాడు. చాలా కాలం క్రితం ఆ ప్రాంతాన్ని తాకిన ఉల్కా శకలాలకు, అక్కడి లిఫ్ట్‌కు సంబంధం ఉంటుంది. ఆ లిఫ్ట్‌లోకి అడుగుపెడితే గతంలోకి వెళ్లే అవకాశం ఉందని అతనికి తెలుస్తుంది. ఆ తర్వాత పుష్పక్ ఏం చేస్తాడన్నదే మిగతా కథ. తన జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి గతంలోకి వెళ్లే అవకాశం వస్తే ఏం చేస్తాడు అనే ఆలోచనతో ఈ కథను రూపొందించారు. ప్రేమించిన అమ్మాయిని ఒప్పించడం, కుటుంబ పరిస్థితిని మార్చడం, తండ్రి గర్వపడేలా చేయడం, తమ్ముడి ప్రేమను గెలిపించడం, కాలనీని కాపాడుకోవడం.. ఇలా హీరో ముందు అనేక లక్ష్యాలను ఉంచారు. అయితే అసలు టైమ్ ట్రావెల్ అంశం నాలుగో ఎపిసోడ్ చివర్లోనే మొదలవుతుంది. అప్పటివరకు కథనం ఎక్కువగా హీరో ఉద్యోగం, ప్రేమ వ్యవహారం, ఇతర పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఈ ఎపిసోడ్స్‌లో పెద్దగా ఆసక్తికరమైన మలుపులు కనిపించవు. సాయి రోనక్ తన పాత్రకు తగ్గట్టుగా చురుగ్గా నటించారు. మిగతా ప్రధాన పాత్రధారులు కూడా తమ పరిధిలో బాగానే చేశారు. అయితే కొన్ని ఉప పాత్రలు, వాటికి సంబంధించిన సన్నివేశాలు సహజంగా అనిపించవు. భరణి శంకర్ పాత్రను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా, ఆ దిశగా ప్రయత్నం పూర్తిస్థాయిలో కనిపించదు. సాయితేజ ఫొటోగ్రఫీ, ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ నేపథ్య సంగీతం, సాజత్ అలీ ఎడిటింగ్ ఓ మోస్తరుగా ఉన్నాయి. మొత్తంగా తొలి నాలుగు ఎపిసోడ్స్‌ను చూస్తే టైమ్ ట్రావెల్ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, దాన్ని తెరపైకి తీసుకొచ్చే విషయంలో కథనం వేగం పుంజుకోలేదు. పాత్రలు, వాటి సమస్యల పరిచయానికే ఎక్కువ సమయం కేటాయించారు. నాలుగో ఎపిసోడ్ చివర్లో అసలు కథ మొదలవుతుందనే ఆసక్తి కలుగుతుంది. రాబోయే ఎపిసోడ్స్‌లో టైమ్ ట్రావెల్ అంశాన్ని ఎలా ఉపయోగించుకుంటారు? పుష్పక్ తన గతాన్ని మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు? అనే విషయాలపై సిరీస్ ఆసక్తి పెంచాల్సి ఉంది.      [PushpakaVimanam, SaiRonak, JioHotstar, TeluguWebSeries] 
గీతాంజలి... ఎలాంటి మలినం అంటుకొని, కల్మషం లేని ప్రేమ మా దగ్గర కూడా ఉంటుందని  తెలుగు సినిమా ఎప్పుడు గర్వంతో  చెప్పుకునేలా చేసిన మూవీ. సృష్టి, పునర్ సృష్టి, కంటే ఇద్దరు యువతి యువకుల మధ్య పుట్టే పవిత్రమైన ప్రేమ గొప్పదని కూడా చెప్పిన ఈ మూవీ రేపు వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ కాబోతుంది.   తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, తరతరాలకు గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అలాంటి అపురూప దృశ్యకావ్యాలలో  'గీతాంజలి' ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటుంది. 1989 మే 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ ప్రేమకథ, సరిగ్గా 37 ఏళ్ల తర్వాత మళ్ళీ వెండితెరపై మాయాజాలం చేయడానికి సిద్ధమైంది. దీంతో అక్కినేని నాగార్జున అభిమానులు, సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.    ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా తెరకెక్కించిన ఏకైక చిత్రం 'గీతాంజలి' కావడం దీనికున్న ప్రత్యేకత. 1988 అక్టోబర్ 12న మొదలైన ఈ చిత్ర షూటింగ్ కేవలం 60 రోజుల్లోనే పూర్తయినా, అది తెరపై సృష్టించిన ప్రభంజనం మాత్రం దశాబ్దాల పాటు చెక్కుచెదరలేదు.   చావుకు దగ్గరవుతున్న ఇద్దరు యువ ప్రేమికుల మధ్య చిగురించే స్వచ్ఛమైన ప్రేమని , జీవితం పట్ల వారికి ఉండే ఆశను మణిరత్నం ఒక కవిత్వంలా తెరపై ఆవిష్కరించారు. ఊటీలోని మంచు కొండల నడుమ ప్రకాష్(నాగార్జున) గీతాంజలిల అల్లరి, వారి మధ్య సాగే సున్నితమైన భావోద్వేగాలు నేటి తరం ప్రేక్షకులను సైతం కట్టిపడేస్తాయి.  ఇది కూడా చదవండి :రామాయణపై మహేష్ కొడుకు గౌతమ్ ఇచ్చిన రివ్యూ ఇదే!   ఈ సినిమా విజయంలో ఇళయరాజా అందించిన సంగీతం, వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం, పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణం మూడు ప్రధాన స్తంభాలుగా నిలిచాయి. "ఆమనీ పాడవే", "ఓ ప్రియా ప్రియా", "ఓ పాపా లాలీ", "జగడ జగడ జగడం", ఒళ్ళంతా జల్లంత కావాలిలే ఇలా అన్ని సాంగ్స్  ఇప్పటికీ ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్‌లో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ సినిమా 37వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డును గెలుచుకోవడమే కాకుండా, ఏకంగా 6 నంది పురస్కారాలను, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది.   ఇటీవల కాలంలో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న తరుణంలో, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ క్లాసిక్ చిత్రాన్ని 4K హంగులతో మళ్ళీ థియేటర్లలోకి తీసుకురావడం విశేషం. నాలుగు రోజుల క్రితం విడుదలైన రీ-రిలీజ్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 4 లక్షల 34 వేలకు పైగా వ్యూస్ రావడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. నాగార్జున కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడటం పాత తరానికి ఒక నోస్టాల్జియా అయితే, యువతరానికి ఒక అద్భుతమైన సినీ అనుభూతి. నిజంగా తెలుగు సినిమా ఉన్నంతవరకు 'గీతాంజలి' అనే ఈ అపురూప ప్రేమ దృశ్యకావ్యం అభిమానులు, ప్రేమికులు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. పైగా నాగార్జున శివ లాంటి కల్ట్ మాస్ తర్వాత పూర్తి లవర్ బాయ్ గా, అరుదైన వ్యాధికి గురైన పేషేంట్ గా చేసి మెప్పించాడు. ఇది వరల్డ్ హిస్టరీలోనే ఏ హీరో చేయని సాహసం. అందుకే నాగ్  ని కింగ్ అంటారు.హైదరాబాద్,  గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కర్నూల్ లో వంద రోజులు హౌస్ ఫుల్స్ తో ఆడింది.   మీకు నచ్చవచ్చు:అద్భుతమైన హిందీ సాంగ్స్ ఎందుకు వినిపించడం లేదు! మీకు నచ్చవచ్చు: Goat మూవీ రివ్యూ    [Geethanjali, Nagarjuna, Girija, manirathnam, ilayaraja]
భారతదేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’లో అల్లు స్నేహారెడ్డి కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆమె కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.  ఫ్యాషన్, కళలు, సంస్కృతిపై ప్రత్యేక ఆసక్తి కలిగిన అల్లు స్నేహారెడ్డి ఈ కార్యక్రమంలో భాగం కావడం విశేషం. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని మరింత మందికి చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  భారతదేశంలోని చారిత్రక మెట్ల బావుల (స్టెప్‌వెల్స్) విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, వాటి అద్భుతమైన నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యత, నీరు, కళలు, నాగరికత మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు స్నేహారెడ్డి భాగస్వామ్యం భారతీయ కళా వారసత్వంపై మరింత అవగాహన పెంచడంతో పాటు, మన సంస్కృతి మూలాలను గౌరవించేలా ప్రజలను ప్రోత్సహించనుంది.  బావోలి ఆర్ట్ సంగం 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 10 వరకు జరగనుంది. ఈ వేడుకలో భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.       [Allu Sneha Reddy, Baoli Art Sangam, Stepwell Art Biennale, India, Heritage]  
వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రామాయణ తన దూకుడుని ప్రదరిస్తున్న విషయం తెలిసిందే. అభిమానులైతే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే భారతీయ సినిమాగా నిలవాలని ఆ రాముడ్నే ప్రార్థిస్తున్నారు. ఇక  సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని సినిమాలపై ఇచ్చే రివ్యూలు హాట్ టాపిక్‌గా మారుతుండే విషయం తెలిసిందే.  ఈ కోవలోనే  తాజాగా రామాయణని  గౌతమ్ ఏకంగా 4.5 రేటింగ్ ఇవ్వడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లెటర్‌బాక్స్డ్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఈ దృశ్య కావ్యంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా చూశాక తన మనసు పూర్తిగా కరిగిపోయిందని, మాటలు రావడం లేదని, సీజీఐ, స్క్రిప్ట్, డైరెక్షన్, నటీనటుల అభినయం అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి.  ఇది కూడా చదవండి: ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన హిందీ పాటలు: ఇప్పుడు ఎందుకు వినిపించడం లేదు? అసలు కారణాలివే! రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఎప్పటిలాగే అద్భుతమైన నటన కనబరచగా, రావణాసురుడిగా  రాకింగ్ స్టార్ యష్ నటన మాత్రం నన్ను విపరీతంగా ఆకట్టుకుందని, ఆయన అభినయం అసాధారణంగా, నెక్స్ట్ లెవెల్‌లో ఉందని, సినిమా అక్కడక్కడా కొద్దిగా సాగదీసినట్లు అనిపించినప్పటికీ, ఆ నిడివి పెద్ద మైనస్‌గా మారలేదని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అని ఆయన స్పష్టం చేశారు.   భారతీయ సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పే ఒక నిజమైన నిదర్శనం ఈ చిత్రమని గౌతమ్ అభివర్ణించారు.   మీకు నచ్చవచ్చు: కరీనా కపూర్ vs ఖురాన్ వచనాలు మీకు నచ్చవచ్చు: Goat Movie Review Telugu: Goat మూవీ రివ్యూ    [Gautham Ghattamaneni, Ramayana, Ranbir Kapoor, Yash, Nitesh Tiwari, sai pallavi]
విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ అనే మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 18న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మెహర్ తేజ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మానవ ప్రవర్తనలోని విభిన్న కోణాలు, నేర ప్రవృత్తి, మనిషి తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాల నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోంది.  ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా స్టైలిష్, సరికొత్త లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన రుహానీ శర్మ నటిస్తుండగా, నిహారిక ఎన్‌ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేష్ కాకుమాను, కిరీటి దమరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది కూడా చదవండి: 'చార్లీ చాప్లిన్'గా టాలీవుడ్ హీరో.. ఫస్ట్ లుక్ అదిరింది.! ఈ సినిమాకు ఘిబ్రాన్ సంగీతాన్ని అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. జిజు సన్నీ సినిమాటోగ్రఫీ, నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విశాల్ అబాని ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆసక్తికరమైన కథాంశం, అల్లరి నరేష్ సరికొత్త అవతారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ‘ఆల్కహాల్’ డిసెంబర్ 18న ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: అసలు ఈ విడాకుల కథ ఏంటి?.. భార్యాభర్తల మధ్య గొడవేంటి.? శోభన్ బాబుకు స్టార్‌డమ్ తెచ్చిన మూవీ.. 'తాసిల్దార్ గారి అమ్మాయి' వెనుక ఇన్ని విశేషాలా.?       [Alcohol Release Date, Allari Naresh, Ruhani Sharma, Meher Tej, Naga Vamsi]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
చలికాలం వచ్చిందంటే చాలు వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుందనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కరకరలాడే స్నాక్స్ తినాలనిపించడం సహజం. అయితే ఎప్పుడూ తినే పచ్చిమిర్చి బజ్జీలకు భిన్నంగా ఈసారి సరికొత్తగా క్యాప్సికం బజ్జీలను ట్రై చేయండి. ఇవి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా కారంగా ఉండవు కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా రెండు నుంచి నాలుగు వరకు ఆరగించవచ్చు. ఈ రుచికరమైన స్నాక్‌ను చాలా తక్కువ సమయంలోనే ఎంతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన రెసిపీ కోసం ముందుగా నాలుగు పెద్ద క్యాప్సికంలను తీసుకుని శుభ్రంగా కడగాలి. మధ్యలో ఉండే తొడిమ భాగాన్ని పూర్తిగా కట్ చేసి తీసివేయాలి. మార్కెట్లో దొరికే చిన్న క్యాప్సికంలను నేరుగా వాడవచ్చు కానీ, ఇంటి వద్ద పెద్దవి అందుబాటులో ఉంటే వాటిని రెండు లేదా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసిన తర్వాత లోపల ఉండే తెల్లని భాగం మరియు గింజలను పూర్తిగా తొలగించాలి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న క్యాప్సికం ముక్కలను ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీలకు కావలసిన పిండి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో 150 గ్రాముల జల్లించిన శనగపిండిని వేయాలి. దీనికి అదనంగా రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపడం వల్ల బజ్జీలకు అద్భుతమైన క్రిస్పీనెస్ వస్తుంది. మసాలా రుచి కోసం పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, పావు టీ స్పూన్ వాము పొడిని చేర్చాలి. వామును నేరుగా వేయకుండా మెత్తని పొడిలా చేసి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చివరగా తగినంత ఉప్పు వేసి అన్ని పదార్థాలను కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోస్తే పిండి పల్చగా అయిపోయే ప్రమాదం ఉంది. పిండి మరీ జారుడుగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. చివరగా చిటికెడు వంట సోడా వేయడం వల్ల బజ్జీలు గుల్లగా బాగా పొంగుతాయి. మరోవైపు కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత సిద్ధం చేసుకున్న క్యాప్సికం ముక్కలను పిండిలో బాగా డిప్ చేసి వేడి నూనెలో వేయాలి. ఇది కూడా చదవండి:మోకాళ్లు అరిగిపోయాయా లేక గాలి బుడగలా? కటకట శబ్దాల వెనుక సైన్స్ ఇదే! మధ్యమధ్యలో తిప్పుతూ మీడియం మంటపై బజ్జీలను మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. వేగిన వాటిని అదనపు నూనె పీల్చుకోవడానికి కిచెన్ టిష్యూ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. అన్ని బజ్జీలను ఇదే విధంగా వేయించుకున్నాక, అవి వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా తీసుకుని మధ్యలో పొడవుగా గాటు పెట్టాలి. ఇప్పుడు అసలైన స్టఫింగ్ కోసం మధ్యలో కొద్దిగా కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వేయించి పెట్టుకున్న పల్లీలను ఉంచాలి. చివరగా కొద్దిగా నిమ్మరసం పిండితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ క్యాప్సికం బజ్జీలు కేవలం రుచికరమైన స్నాక్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. క్యాప్సికంలో ఉండే పోషకాలు చలికాలంలో వేధించే కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. రోడ్డు పక్కన దొరికే వాటికంటే పరిశుభ్రంగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని తింటే ఆరోగ్యం సొంతం కావడంతో పాటు సాయంత్రం వేళ వేడి వేడి టీతో తింటుంటే ఆ మజాయే వేరు. కాబట్టి ఈ వింటర్ సీజన్‌లో మీ కుటుంబ సభ్యులకు ఈ స్పెషల్ బజ్జీలను చేసి పెట్టండి. మీకు నచ్చవచ్చు:బ్రెయిన్ పవర్, మజిల్ గేయిన్ కోసం క్రియేటిన్ వాడొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే! దగ్గు సిరప్‌తో పసిపిల్లల ప్రాణాలకే ప్రమాదమా? వైద్యాధికారులు ఏం చెబుతున్నారు?         Capsicum Bajji Recipe, Winter Evening Snacks, Stuffed Capsicum Fritters, Hot Snacks For Cold Weather, Indian Street Food Recipes, Cooking Guide, Food Articles In Telugu.
ప్రకృతి మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రసాదించింది. సాధారణంగా మనం పండిన బొప్పాయి పండును ఎంతో ఇష్టంగా తింటాము, కానీ పూర్తిగా పండని పచ్చి బొప్పాయిలో కూడా మన ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన పోషకాలు దాగి ఉన్నాయి. పచ్చి కాయలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి ఎక్కవ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. బరువు తగ్గడం నుంచి చర్మాన్ని కాపాడుకోవడం వరకు ఇది ఎంతో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో పచ్చి బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో  పపైన్  అనే జీర్ణ ఎంజైమ్ అత్యధిక సాంద్రతలో లభిస్తుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులోని ఫైబర్ జీర్ణశయాన్ని శుభ్రపరచి, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దరిచేరనీయకుండా చేస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు పచ్చి బొప్పాయిని సలాడ్స్ రూపంలో తీసుకోవడం చాలా మంచిది. ఇందులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్, స్టార్చ్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావనాన్ని కలిగిస్తూ, అతిగా తినే అలవాటును నియంత్రిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ ఇది దోహదపడుతుంది. పచ్చి బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని లోపల నుండి యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. పచ్చి బొప్పాయిలోని ఫైబర్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను తగ్గించి కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది. ఇది కూడా చదవండి:ఫెడ్డీ మెర్క్యురీ 80వ జయంతి: మాజీ ప్రేమికురాలు మేరీ ఆస్టిన్ బయటపెట్టిన అరుదైన దుస్తులు! ఇందులోని విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేస్తాయి. పచ్చి బొప్పాయిలో ఉండే లాటెక్స్ ఎంజైమ్ శరీరం లోపలి భాగాలను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే దెబ్బతిన్న కణాలను మరమ్మతు చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. పచ్చి బొప్పాయి కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో క్యారెట్లు, టమాటాల కంటే ఎక్కువ మొత్తంలో కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్ ఎ గా రూపాంతరం చెంది, కంటి చూపును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే శరీరంలో వాపును తగ్గించడంలో, గాయాలను వేగంగా మాన్పడంలోనూ ఇది సహకరిస్తుంది. మీకు నచ్చవచ్చు:బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తింటున్నారా? ఈ 7 హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!                                వేస్ట్ అని పారేసే అరటిపండ్లతో హోమ్‌మేడ్ ఐస్‌క్రీమ్.. సింపుల్ కిచెన్ ట్రిక్ ఇదే!       Raw Papaya Benefits, Green Papaya Health Uses, Digestion Improvement Tips, Weight Loss Foods, Natural Health Remedies, Doctor Health Advice, Health Tips In Telugu.  
ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టమవ్వడం, ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే చాలామంది దీనిని సాధారణ గుండెపోటు అనుకుంటారు. కానీ ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన మరో అత్యంత ప్రమాదకరమైన వైద్య సమస్య. అదే పల్మనరీ ఎంబాలిజం. మన శరీరంలో రక్తం గడ్డకట్టడం అనేది గాయాలైనప్పుడు రక్తస్రావాన్ని అరికట్టే సహజమైన ప్రక్రియే అయినప్పటికీ, కొన్నిసార్లు ఈ రక్తం రక్తనాళాల్లో అవసరం లేకుండానే గడ్డకడుతుంది. ముఖ్యంగా కాళ్లలోని లోతైన రక్తనాళాల్లో ఏర్పడిన ఇలాంటి రక్తపు గడ్డలు విడిపోయి, రక్తప్రవాహం ద్వారా నేరుగా ఊపిరితిత్తులకు చేరుకుంటాయి. అక్కడ రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన ధమనుల్లో ఇవి తీవ్రమైన అడ్డంకులను సృష్టిస్తాయి. దీనివల్ల శరీరంలోని అవయవాలకు అందాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి. ఈ ప్రాణాంతక సమస్య వెనుక అనేక కారణాలు దాగి ఉన్నాయి. ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కాళ్లలో రక్తప్రసరణ నెమ్మదించి రక్తం గడ్డకట్టే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా సుదీర్ఘ విమాన లేదా బస్సు ప్రయాణాలు చేసేవారిలో, పెద్ద శస్త్రచికిత్సల తర్వాత సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకునేవారిలో మరియు ఆసుపత్రిలో ఎక్కువ రోజులు మంచానికే పరిమితమయ్యే రోగులలో ఈ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, గతంలో రక్తం గడ్డకట్టిన చరిత్ర ఉన్నవారు, గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాతి కాలంలో, కొన్ని రకాల హార్మోన్ల మందులు వాడేవారు మరియు ఊబకాయంతో బాధపడేవారిలో కూడా పల్మనరీ ఎంబాలిజం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పల్మనరీ ఎంబాలిజం బారిన పడినప్పుడు శరీరంలో కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. బాధితులకు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది తలెత్తుతుంది. లోతుగా ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఛాతిలో పదునైన నొప్పి వస్తుంది, గుండె సాధారణం కంటే చాలా వేగంగా కొట్టుకోవడం, విపరీతమైన దగ్గు రావడం, కొన్ని సందర్భాల్లో దగ్గుతో పాటు రక్తం పడటం వంటి ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇక మరింత తీవ్రమైన దశలో తల తిరగడం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం మరియు రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడం వంటి సంకేతాలు కూడా ఎదురవుతాయి. అయితే ఈ లక్షణాల తీవ్రత ప్రతి రోగిలోనూ ఒకేలా ఉండాలని నియమం లేదు, కొందరిలో ఇవి చాలా సూక్ష్మంగా కూడా ఉండవచ్చు. ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణకు తీవ్రమైన అడ్డంకి ఏర్పడటంతో గుండె కుడి భాగంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. రక్తం గడ్డ కట్టిన పరిమాణం, అది ఎక్కడ అడ్డుపడింది మరియు రోగి యొక్క మొత్తం ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ సమస్య యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సరైన సమయంలో వైద్య సహాయం అందకపోతే ఇది అత్యంత ప్రాణాంతకంగా మారుతుంది. అందువల్ల వైద్యులు రోగి యొక్క లక్షణాలు, ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరాన్ని బట్టి ప్రత్యేక రక్త పరీక్షలు, సీటీ పల్మనరీ యాంజియోగ్రఫీ (CTPA) మరియు అల్ట్రాసౌండ్ వంటి అధునాతన పరీక్షల ద్వారా దీనిని నిర్ధారిస్తారు. ఇది కూడా చదవండి:కల్పవృక్షం కొబ్బరితో అద్భుత ఆరోగ్య లాభాలు! బరువు తగ్గాలనుకునే వారు ఇది తెలుసుకోవాల్సిందే! ఈ సమస్యను గుర్తించిన వెంటనే రక్తపు గడ్డ పరిమాణం మరింత పెరగకుండా, అలాగే కొత్త గడ్డలు ఏర్పడకుండా నివారించడానికి వైద్యులు యాంటికోగ్యులెంట్స్ అనబడే రక్తం పలుచబడే మడ్డలను సూచిస్తారు. అత్యంత తీవ్రమైన మరియు క్లిష్టమైన పరిస్థితుల్లో గడ్డను పూర్తిగా కరిగించే ప్రత్యేక మందులు లేదా ఇతర శస్త్రచికిత్స విధానాలు అవసరమవుతాయి. వ్యాధి తీవ్రతను ముందే గుర్తించడం ద్వారా ప్రాణాలను రక్షించుకునే అవకాశం మెరుగవుతుంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని నివారించడానికి కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఎక్కువసేపు ఎటువంటి కదలిక లేకుండా ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నడవాలి. సుదీర్ఘ ప్రయాణాలు చేసే సమయంలో కాళ్లను ఎప్పుడూ కదిలిస్తూ ఉండాలి. ప్రధాన శస్త్రచికిత్సల తర్వాత వైద్యుల సలహా మేరకు వీలైనంత త్వరగా నడక ప్రారంభించాలి. ముఖ్యంగా అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:మహిళలు చేసే చిన్న తప్పుతో ప్రాణాలకే ముప్పు! గైనకాలజిక్ క్యాన్సర్ల ముందస్తు సంకేతాలివే! మహిళల్లో పెరుగుతున్న PCOD, థైరాయిడ్ సమస్యలు! అధిక కెఫిన్ వెనుక ఉన్న షాకింగ్ నిజం!       Pulmonary Embolism, Blood Clots In Lungs, DVT And Lung Clots, Medical Emergency Symptoms, Cardiovascular Health, Doctor Health Advice, Health Tips In Telugu.
ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే చాలామంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయసు పెరిగిన తర్వాత మాత్రమే వచ్చే సమస్యగా భావించే ఆర్థరైటిస్ ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. అసలు చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రావడానికి కారణాలేంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అంటే ఏమిటి? ఈ సమస్యకు వ్యాయామానికి ఉన్న సంబంధం ఏమిటి? కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కీళ్లు మన శరీర కదలికలకు ఎంతో కీలకం. నడవడం, మెట్లు ఎక్కడం, కూర్చోవడం, నిలబడటం వంటి రోజువారీ పనులన్నీ కీళ్ల సహకారంతోనే సాధ్యమవుతాయి. అయితే శారీరక శ్రమ తగ్గడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు కీళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మోకాళ్లపై ఒత్తిడి పెరిగినప్పుడు నొప్పి, బిగుతుగా అనిపించడం, కదలికల్లో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. కీళ్ల నొప్పులు రాకుండా ఉండటానికి, మోకాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజువారీ వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో Dr. Bhaskarకీళ్ల ఆరోగ్యం, ఆర్థరైటిస్, రుమటాయిడ్  ఆర్థరైటిస్ గురించి ముఖ్యమైన విషయాలను వివరించారు. అలాగే మోకాళ్ల కదలికలు మెరుగుపడటానికి, కండరాలు బలపడటానికి, కీళ్లపై ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఐదు వ్యాయామాల గురించి తెలియజేశారు. ఈ ఐదు వ్యాయామాలను ఎలా చేయాలి? వాటిని రోజువారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? కీళ్ల నొప్పులతో బాధపడేవారు వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఎలాంటి వ్యాయామాలను ఎంచుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇది కూడా చదవండి    పిండికూరతో కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. డాక్టర్ ఏం చెబుతున్నారు కీళ్ల నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన వ్యాయామాలు సరిపోవు. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే తమకు తగిన వ్యాయామాలను ఎంచుకోవాలి. నొప్పి పెరిగేలా బలవంతంగా వ్యాయామాలు చేయకూడదు. కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మోకాళ్ల నొప్పుల పట్ల అవగాహన పెంచుకోవడానికి డాక్టర్ భాస్కర్ అందిస్తున్న ఈ విలువైన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి. మరిన్ని ఆరోగ్య విషయాలు, నిపుణుల సలహాలు, ఉపయోగకరమైన సమాచార వీడియోల కోసం TeluguOne Healthను ఫాలో అవ్వండి.
మనం రోజూ తినే ఆహారంలో కొన్ని కాంబినేషన్స్ ట్రై చేస్తుంటాం. కానీ ఏ ఆహార పదార్థాన్ని వేటితో కలిపి తింటే మన శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయనే విషయం మీద చాలామందికి స్పష్టత ఉండదు. మనం తినే వాటిలో కొన్ని కాంబినేషన్ లు ఆరోగ్యానికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అలాంటి కొన్ని అరుదైన , అత్యంత ప్రయోజనకరమైన ఫుడ్  కాంబినేషన్ లు ఏవో.. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో  గురించి  వివరంగా తెలుసుకుంటే.. పుచ్చకాయ.. ఉప్పు.. ​మనలో చాలా మందికి పుచ్చకాయ అనగానే గుర్తుకు వచ్చేది కేవలం తియ్యటి రుచి మాత్రమే. అయితే పుచ్చకాయ ముక్కల మీద కొద్దిగా ఉప్పు చల్లుకొని తింటే దాని రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా రెట్టింపు అవుతాయి. పుచ్చకాయలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఉప్పులో సోడియం లభిస్తుంది. ఈ రెండు కలిసి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా ఎండకాలంలో లేదా వర్కవుట్లు చేసిన తర్వాత ఈ కాంబినేషన్ శరీరాన్ని తక్షణ శక్తితో పాటు హైడ్రేట్ గా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. బాదం..డార్క్ చాక్లెట్.. ​బాదం పప్పులను డార్క్ చాక్లెట్ తో కలిపి తీసుకోవడం మరొక మంచి అలవాటు. బాదం పప్పులో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు , విటమిన్ ఈ లభిస్తాయి. అలాగే డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉండే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఈ రెండింటి కలయిక శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది , గుండె సంబంధిత సమస్యలు రాకుండా రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓట్స్.. పెరుగు.. ​ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తినడం చాలా మందికి అలవాటు. అయితే ఈ ఓట్స్ ను పెరుగుతో కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఓట్స్ లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అలాగే పెరుగులో మంచి బ్యాక్టీరియాను అందించే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ రెండు కలిసి కడుపులోని జీర్ణక్రియను మెరుగుపరచడంలో , గట్ హెల్త్ ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి ఈ ఆహార కాంబినేషన్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..! గ్రీన్ టీ.. నిమ్మరసం.. ​బరువు తగ్గాలనుకునేవారు లేదా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేవారు గ్రీన్ టీ తాగడం సాధారణం. అయితే గ్రీన్ టీ లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగితే దాని ప్రయోజనాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లను శరీరం వేగంగా గ్రహించేలా సహాయపడుతుంది. సాధారణంగా గ్రీన్ టీ తాగడం వల్ల అందే పోషకాలు నిమ్మకాయ కలవడం వల్ల మరింత మెరుగ్గా పనిచేస్తాయి. పసుపు పాలు.. మిరియాల పొడి.. ​మన ఇంట్లో తరచూ చేసుకునే పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం మన సాంప్రదాయం. అయితే ఈ పసుపు పాలలో చిటికెడు మిరియాల పొడి కూడా కలిపితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. మిరియాలలో పైపరిన్ అనే గుణం ఉంటుంది. ఇది పసుపులోని కర్క్యుమిన్ అనే మూలకాన్ని శరీరం త్వరగా , పూర్తిగా గ్రహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఎముకల నొప్పులు , ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ​ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఏ ఆహారాన్ని ఏ పదార్థంతో కలిపి తినాలో తెలుసుకొని పాటిస్తే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ అద్భుతమైన ఆహార కాంబినేషన్  లను  దైనందిన జీవితంలో భాగం చేసుకొని పూర్తి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.                                                                                                                                                   *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు    ఇలా చేస్తే చాలు... పిల్లలు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలంటే ఇష్టపడతారు..!                                 ​