తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ సీన్ రివర్సైంది.  రాజకీయ పార్టీలకు లభించే ఫండ్స్ విషయంలో ఏపీ, తెలంగాణలోని పార్టీలు సైతం ముందు వరుసలో ఉన్నాయి. అయితే.. తెలంగాణతో పోలిస్తే ఏపీకి దక్కిన వాటా చాలా ఎక్కువ. కానీ, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొలిటికల్ పార్టీల మధ్య మాత్రమే చూస్తే ఆసక్తికరమైన సంగతులు బయటపడ్డాయి. ఏపీలోని అధికార కూటమిలో భాగమైన టీడీపీకి 83 కోట్లు డొనేషన్ల రూపంలో లభించగా.. జనసేనకు 25 కోట్లు ఫండ్ల రూపంలో వచ్చాయి. అయితే.. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన విరాళాలు వంద కోట్లు కాగా.. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లభించినవి కేవలం 83 కోట్లు మాత్రమే కావడం ఆసక్తికరంగా మారింది. ఇక, జనసేనకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం పలువురు 25 కోట్ల రూపాయల మేర అందించారు.  ఏపీలోని పొలిటికల్ పార్టీలకు దక్కిన విరాళాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది వైసీపీకి వచ్చిన డొనేషన్లు. అధికారంలో లేకపోయినా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 140 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్‌ కింద విరాళంగా లభించాయి. ఇదేఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పవర్‌లో లేకపోయినా విరాళాల సేకరణలో ఏ స్థాయిలో పవర్‌ఫుల్‌గా వైసీపీ మారిందో అన్నదానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సైతం జరుగుతోంది.   పార్టీల వారీగా టీడీపీకి వచ్చిన విరాళాలను ఓసారి పరిశీలిస్తే.. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా టీడీపీకి 40 కోట్లు లభించాయి. నాట్కో ఫార్మా 7 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వగా.. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ 5 కోట్లను డొనేషన్ల రూపంలో ఇచ్చింది.  తమిళనాడుకు చెందిన క్రిస్ట్రీ ఫ్రైడ్‌గ్రామ్ ఇండస్ట్రీ, బెంగళూరు బేస్‌డ్‌గా నడిచే యునైటెడ్ టెలీ లింక్స్, ప్రకాశం జిల్లా కేంద్రంగా కార్యకాలాపాలు సాగించే ప్రియా ఆక్వా ఫామ్స్ తలో రెండు కోట్లు ఫండ్స్ రూపంలో అందించాయి. జనసేనకు మాత్రం ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కార్పొరేట్ల పరంగా చూస్తే నాట్కో ఫార్మా కోటి రూపాయలు, ఆర్వీఎం కన్‌స్ట్రక్షన్స్ మూడు కోట్లు, డీవీకే కన్‌స్ట్రక్షన్స్ 2 కోట్లు డొనేషన్ రూపంలో అందించాయి.  వ్యక్తుల పరంగా చూస్తే షాద్‌నగర్‌కు చెందిన రవికుమార్ ఆకుల జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు. ఏపీలో అలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం రివర్సైంది. ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నప్పుడు విరాళాల సేకరణలో మంచి దూకుడు చూపించిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత వెనుకబడింది. పైగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారిందన్న వాదన విన్పిస్తోంది. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్‌కు కేవలం 15 కోట్ల రూపాయల మేర మాత్రమే డొనేషన్లు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.  
వైసీపీలో నోరున్న నాయకులలో ఒకరిగా మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు గుర్తింపు పొందారు. అందులో సందేహం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన మాటల వల్ల పార్టీకి మేలు కంటే  కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన వైసీపీ నాయకులు, శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. అసలాయన మాటలు చూస్తుంటే అహంకారం తలకెక్కిందా? లేక అజ్ణానమా అంటూ రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన 2029 ఎన్నికలలో వైసీపీదే అధికారం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలేమిటన్న విషయంపై పార్టీలో ఇప్పటి వరకూ ఆత్మ విమర్శ జరగలేదు. 2019 ఎన్నికలలో 151 స్థానాలతో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పరిమితం కావడానికి కారణాలేమిటన్నది వైసీపీ అగ్రనేతలకు ఇంకా అర్థమైనట్లు కనిపించదు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం చూస్తుంటే ఆ పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించదు.  వాస్తవానికి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నిత్యం జనంలో తిరిగినందుకే జగన్ 2019 ఎన్నికలలో అధికారంలోకి రాగలిగారు. సరే పాదయాత్ర సందర్భంగా నవరత్నాలు సహా అడుగుకో హామీ గుప్పించి జనాన్ని మాయ చేశారు అదీ ఓ కారణమేననుకోండి, వాటికి తోడు వైఎస్ వివేకాహత్య, కోడికత్తి దాడి సంఘటనలను తనకు అనుకూలంగా జగన్ సానుభూతిగా మలచుకోవడం మరో ప్రధాన కారణం. అయితే ఒక సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జనానికి ముఖం చాటేశారు. ఎప్పుడైనా బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినా రోడ్డుకిరువైపులా పరదాలు కట్టుకుని జనాన్ని చూడటం తనకు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించారు.  ఇక పోతే ఐదేళ్ల జగన్ హయాంలో అభివృద్ధి పడకేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల మాటే వినిపించలేదు. ఆ ఐదేళ్ల కాలంలో జరిగిందంతా.. దోపిడీ, దుర్మార్గం, అణచివేత, కక్షసాధింపు మాత్రమే.   ఆ ఐదేళ్ల జగన్ పాలన మొత్తం ప్రత్యర్థి పార్టీల నేతలపై కక్ష సాధింపులతోనే గడిచిపోయింది. అందుకే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. దాని ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు. ఆ విషయాన్ని అంగీకరించడం పక్కన పెడితే కనీసం అర్ధం చేసుకోవడానికి కూడా జగన్, ఆయన పార్టీ నేతలూ సుముఖంగా లేరు.  ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్  పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు, ఆయన కేబినెట్ సహచరులు నిత్యం జనంలో ఉంటున్నారు. సంక్షేమంతో పాటు, అభివృద్ధీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అటువంటప్పుడు జనం జగన్ పాలనను ఎందుకు కోరుకుంటారు? అని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   అదలా ఉంచితే రాజకీయ విశ్లేషకులు మాత్రం  అంబటి వంటి నాయకులు ప్రజల తీర్పును అవహేళన చేసే విధంగా ఇలాగే తమ వాచాలతను ప్రదర్శిస్తూ పొతే.. వైసీపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమంటున్నారు. స్వోత్కర్ష, పరనింద మాని వాస్తవాన్ని అంగీకరించి, తమ పాలనలో జరిగిన తప్పు లను అంగీకరించి జనంలోకి రాకుండా ఇదే విధానం కొనసాగిస్తే వైసీపీ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోవడం తధ్యమని విశ్లేషిస్తున్నారు. 
తెలుగు రాష్ట్రాలలో ప్రత్యర్థులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినది నారా చంద్రబాబునాయుడే అని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు.. ఈ సంప్రదాయానికి తెరలేపారు. అప్పటి నుంచీ అది కొనసాగుతూ వస్తోంది. ఆ క్రమంలోనే నారా చంద్రబాబు జగన్ కు ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడూ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ , ఇప్పుడు పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ కూడా ఏటా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. దీంతో జగన్ కు కూడా అనివార్యంగా ఈ సంప్రదాయాన్ని పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  ఆ క్రమంలోనే ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు. దీనిపై జగన్ ను నెటిజనులు ట్రోల్ చేయడంతో వైసీపీయులు జగన్ లోకేష్ కు రిప్లై ఇవ్వకపోవడంపై వివరణ ఇచ్చారు. లోకేష్ జగన్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలుసుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటూ గారు అనే మర్యాద వాచకం లేకుండా ట్వీట్ చేశారనీ, అందుకే జగన్ ఆయనకు ధన్యవాదాలు చెప్పలేదని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.  దీనిపై తెలుగుదేశం వర్గీయులు లోకేష్ జగన్ ను గారూ అనకపోవడానికి కారణం ఉందంటూ రిటార్డ్ ఇచ్చారు. గత ఏప్రిల్ లో ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా జగన్ ఆయనను విష్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మాత్రమే పేర్కొన్నారని గుర్తు చేశారు. తన తండ్రి సమకాలీనుడైన వ్యక్తికి గౌరవం ఇవ్వాలని తెలియని జగన్ ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వలేదని లోకేష్ ను ఎలా అనగలరని పేర్కొన్నారు.  అందుకే టిట్ ఫర్ టాట్ లా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే సంబోధిస్తూ జన్మదిన శుభాకంక్షలు చెప్పారంటున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
  ఈ జనరేషన్ యంగ్ స్టార్స్ లో సంక్రాంతి హీరోగా శర్వానంద్(Sharwanand)కి పేరుంది. బిగ్ స్టార్స్ సినిమాలతో పోటీపడి మరీ.. 2016 సంక్రాంతికి 'ఎక్స్‌ప్రెస్ రాజా', 2017 సంక్రాంతికి 'శతమానం భవతి'తో హిట్స్ కొట్టాడు. ఇప్పుడు 2026 సంక్రాంతికి కూడా స్టార్స్ తో పోటీకి సై అంటూ 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో థియేటర్లలో అడుగుపెడుతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. (Nari Nari Naduma Murari)   'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్ చూస్తేనే.. ఇది ఇద్దరు హీరోయిన్ల మధ్యలో నలిగిపోయే హీరో కథ అని అర్థమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ టీజర్ ఉంది. ప్రేయసి, మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తిగా శర్వానంద్ కనిపిస్తున్నాడు. (Nari Nari Naduma Murari Teaser)   "పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి వెళ్తున్నాను" అంటూ సత్యకి శర్వానంద్ చెబుతున్న డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. "నా పేరు లవకుశ.. లవ్ కోసం ఎంత దూరమైనా వెళ్తా" అనే డైలాగ్ తో సత్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్న శర్వానంద్, సాక్షి వైద్య ప్రేమించి పెళ్లికి రెడీ అవుతారు. అయితే అదే ఆఫీస్ కి టీమ్ లీడ్ గా శర్వానంద్ ఎక్స్ గర్ల్ ఫెండ్ అయిన సంయుక్త మీనన్ ఎంట్రీ ఇస్తుంది. దీంతో శర్వానంద్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనే కోణంలో టీజర్ ని రూపొందించారు. టీజర్ చూస్తుంటే.. సినిమా సరదాగా, యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అర్థమవుతోంది.   Also Read: దివ్య దృష్టి మూవీ రివ్యూ   సరైన ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ పడితే.. శర్వానంద్ మ్యాజిక్ చేసేస్తాడు. పైగా 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు కావడంతో కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో ఓ అంచనాకు రావొచ్చు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 సాయంత్రం 5:49 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. 'సామజవరగమన' స్థాయిలో కామెడీ వర్కౌట్ అయితే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది.    
As the year 2025 is coming to an end, the year end lists about who is on top and who is trailing behind will be interesting to look out. This year, the pan-Indian tag evolved from a buzzword into a baseline requirement for superstardom. We’ve seen established icons reinvent themselves and rising stars seize the throne with sheer box-office volume. At the heart of it all is Rashmika Mandanna, who has officially moved from being "National Crush" to the "National Powerhouse." Here is a look at how the leading ladies of Indian cinema fared in 2025, ranked by their overall impact.  1. Rashmika Mandanna   Rashmika has had a relentless year, emerging as the most prolific leading lady in the country. Her success is anchored by the historic performance of Chhaava, where her portrayal of Maharani Yesubai Bhonsale earned her massive critical acclaim and a staggering global gross of approximately ₹808 crore. While experimental films like The Girlfriend and Kuberaa saw mixed commercial results, her presence in the blockbuster Thamma and the record-breaking carry-over success of Pushpa 2: The Rule solidified her 40-60% success rate across five diverse releases. She ends the year as the undisputed No. 1 in terms of visibility and cumulative earnings. 2. Kalyani Priyadarshan   Kalyani dominated the South and made significant inroads into the North with the Malayalam superhero hit Lokah: Chapter 1 – Chandra. Earning over ₹300 crore, she proved that female-led genre films have a massive market. While her other films did not really end up as successes, Lokah put her on the Pan-India Map as a superhero and lady who delivered first ever 300 crore grosser for Malayalam Cinema.  3. Rukmini Vasanth The biggest surprise of 2025, Rukmini Vasanth, skyrocketed to the top tier thanks to Kantara: Chapter 1. As the leading lady of the year’s highest-grossing Indian film till Dhurandhar final numbers are out, she rocked the nation. Her portrayal of Kanakavathi has made her the most sought-after talent for 2026. She did face a flop at the box office with Sivakarthikeyan's Madharaasi but things are looking up for her as she has NTR-Neel in the mix with many more biggies.  4. Kriti Sanon Kriti had a creatively fulfilling 2025, topping IMDb's "Most Beautiful" lists while delivering a variety of roles. From the success of Tere Ishk Mein to her ventures into production with Do Patti, she has maintained a steady 75% success rate, balancing commercial appeal with performance-heavy scripts. 5. Alia Bhatt Though she had fewer releases this year, Alia remains the industry's critical darling. Projects like Jigra and her continued international presence kept her at the top of the "A-list." With last minute postponement of YRF Spy Universe's Alpha and her most awaited reunion with her hubby Ranbir Kapoor in Love and War, make her 2026 more interesting.  6. Shraddha Kapoor Riding the massive wave of the Stree franchise, Shraddha remains the queen of the youth demographic. While she didn't flood the theaters with releases, her commercial viability is not for test this year. Drug Scandal did loom over her but real impact on her box office impact will only be known next year.  7. Deepika Padukone Deepika Padukone became a mother and then controversial for her eight hours work only clause. She got ousted from films like Kalki 2 and Spirit, interestingly, both starring Prabhas. She did land an important role in Allu Arjun and Atlee grand fantasy film. She did bring up conversations about the pay-parity and working hours amongst the actors.  8. Aneet Padda   The breakout "Gen Z" star of the year, Aneet's performance in the romantic drama Saiyaara was a sleeper hit, collecting over ₹570 crore worldwide. She exits 2025 with a reputation as the new face of emotional storytelling. She has a huge line-up of films that would release in 2026 and 2027.  9. Triptii Dimri Continuing her "Animal" momentum, Triptii was seen in several mid-budget hits in 2025. She has become the go-to choice for directors looking for a blend of intensity and glamour, maintaining a solid 50% success rate as she transitions into more solo-lead roles. She is looking at Prabhas starrer Spirit to propel her market further.   10. Sreeleela The "Dhamaka" girl had a year of immense activity, but unfortunately, not all of it translated into box-office gold. Sreeleela remains one of the most hardworking stars, but 2025 was a year of disappointment at the box office. Her reunion with Nithiin in Robinhood failed to set the box office on fire, and  her lead roles in Junior and Mass Jathara struggled to collect decent amounts. She is hopping that 2026 will be better as she is debuting in Hindi and working with Pawan Kalyan in Ustaad Bhagat Singh.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ప్ర‌పంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న విష‌యం తెలిసిందే. దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నం ఎంత ఉందో, ప్ర‌మాదం కూడా అంతే ఉంద‌నేది వాస్త‌వం. ఇటీవ‌ల కొంద‌రు సినీ ప్ర‌ముఖులు ఈ విష‌యంలో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. వారిలో టాలీవుడ్ హీరోలు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్ కూడా ఉన్నారు. దీంతో వీరిద్ద‌రూ విడివిడిగా ఢిల్లీ హై కోర్టును ఆశ్ర‌యించారు. ప‌ర్స‌నాలిటీ రైట్స్‌పై పిటిష‌న్లు వేశారు. దీనిపై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.  వారి అనుమ‌తి లేకుండా ఫోటోల‌ను, వీడియోల‌ను వాణిజ్య‌ప‌రంగా వాడుకోవ‌డాన్ని ఢిల్లీ హైకోర్టు సీరియ‌స్‌గా తీసుకుంది. కొన్ని సోషల్ మీడియా సంస్థలకు, ఈ కామర్స్ సంస్థలకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పేరు, ఫోటోలు, వాయిస్, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం అక్రమంగా వినియోగించడం, మార్ఫింగ్ ఫోటోలతో తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతోందని పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అవమానకరమైన పోస్టులు విచ్చలవిడిగా ఉన్నాయని న‌టుల త‌ర‌ఫు న్యాయ‌వాది సాయి దీపక్ త‌న వాదనలు వినిపించారు. ఈ కేసులో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. విచారణ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. ఫిర్యాదు అందిన వెంటనే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ కేసులో మరింత లోతైన విచారణ అవసరమని భావించిన న్యాయస్థానం, తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది. 
చిత్ర ప‌రిశ్ర‌మ‌కు, తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య స‌త్సంబంధాలు ఉన్నాయి. అయితే వాటిని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. దీనికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. త్వ‌ర‌లోనే ఏపీ ప్ర‌భుత్వం.. సినీ ప్ర‌ముఖుల‌తో ఒక స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ స‌మావేశాన్ని ప‌క్కా ప్ర‌ణాళిక‌తో జ‌రుపుతామ‌ని ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్ల‌డించారు. మొద‌ట సినిమాటోగ్ర‌ఫీ, హోంశాఖ ఉన్న‌తాధికారుల ఆధ్వ‌ర్యంలో స‌మావేశం జ‌రుగుతుంది. చిత్ర ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న సాంకేతిక‌, ప‌రిపాల‌నాప‌ర‌మైన స‌మ‌స్య‌ల గురించి అధికారులు చ‌ర్చిస్తారు.    దీని త‌ర్వాత పరిశ్రమలోని అగ్ర నిర్మాతలు, దర్శకులతో ప్రభుత్వం నేరుగా భేటీ అవుతుంది. అధికారులు అందించిన నివేదిక ఆధారంగా ఆచ‌ర‌ణ యోగ్య‌మైన ప‌రిష్కారాల‌ను ఈ స‌మావేశంలో ఖ‌రారు చేస్తారు. ప్ర‌స్తుతం చిత్ర ప‌రిశ్ర‌మ‌తోపాటు ప్రేక్ష‌కులు ఎదుర్కొంటున్న అధిక టికెట్ ధ‌ర‌ల విష‌యంలో ఒక నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ విషయంలో నెలకొన్న గందరగోళానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీ వ్యయంతో రూపొందే సినిమాల విషయంలో టికెట్ రేట్ల పెంపుదలపై ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించనున్నారు. ప్రతిసారీ ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒక స్థిరమైన నిబంధనలు తెచ్చే అవకాశం ఉంది.   ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సమావేశం గురించి వివరిస్తూ.. “చిత్ర పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం సానుభూతితో వింటోంది. ముఖ్యంగా చిన్న సినిమాల మనుగడ, పెద్ద సినిమాల పెట్టుబడి భద్రత రెండూ మాకు ముఖ్యమే. త్వరలోనే ఈ సమావేశానికి సంబంధించిన తేదీలను అధికారికంగా ప్రకటిస్తాం” అని పేర్కొన్నారు. అనుకున్న ప్ర‌కారం ఈ స‌మావేశం స‌క్సెస్ అయితే థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు, పంపిణీదారుల‌కు, ప్రేక్ష‌కుల‌కు మంచి జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. 
  తారాగణం: ఇషా చావ్లా, సునీల్, కమల్ కామరాజు, తులసి తదితరులు దర్శకత్వం: కబీర్ లాల్ ఓటీటీ: సన్ నెక్స్ట్   ప్రేమ కావాలి, పూల రంగడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఇషా చావ్లా.. కాస్త విరామం తర్వాత చేసిన సినిమా 'దివ్య దృష్టి'. టైటిల్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్.. నేరుగా ఓటీటీలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? (Divya Drushti Review)   కథ: భవ్య, దివ్య (ఇషా చావ్లా) ట్విన్ సిస్టర్స్. వీరికి 'డిజెనరేటివ్ ఐ డిసీజ్' ఉంటుంది. దీని వల్ల క్రమంగా కంటిచూపు కోల్పోతారు. మొదట భవ్య కంటిచూపు కోల్పోతుంది. అయితే అనూహ్యంగా ఆమె తన ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోతుంది. భవ్యది ఆత్మహత్య అని అందరూ నమ్ముతారు. దివ్య మాత్రం ఇది హత్యే అనే అనుమానంతో.. తానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ విషయంలో తన భర్త(కమల్ కామరాజు) నుంచి కూడా పెద్దగా సపోర్ట్ ఉండదు. మరోవైపు తన కంటి చూపు కూడా తగ్గుతూ వస్తుంది. అయినప్పటికీ దివ్య రిస్క్ చేసి, ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు తెలిసిన నిజాలేంటి? భవ్య మరణానికి కారణం ఎవరు? దివ్యను వెంటాడుతున్న అదృశ్య వ్యక్తి ఎవరు? ఇందులో సునీల్ పాత్ర ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: దివ్య దృష్టి.. టైటిల్ బాగుంది.. స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది. త్వరలో కంటిచూపు కోల్పోనున్న ఒకమ్మాయి.. తన సోదరి మరణం వెనకున్న మిస్టరీ తెలుసుకోవాలి అనుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలతో.. అసలు దీని వెనుక ఎవరున్నారు? తర్వాత ఏం జరగనుంది? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ ప్రేక్షకులకు రెండు గంటల పాటు కదలకుండా కూర్చునేలా చేయవచ్చు. కానీ, ఆ విషయంలో దివ్య దృష్టి టీమ్ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దివ్య ఒక ఈవెంట్ లో ఉండగా.. కంటిచూపు లేని భవ్య, తాను అపాయంలో ఉన్న విషయాన్ని తెలపడం కోసం సోదరికి కాల్ చేస్తుంది. ఆ తర్వాత కాసేపటికే ఉరి వేసుకొని చనిపోతుంది. దీంతో ఇంట్రెస్టింగ్ గానే సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే సినిమాకి కీలకమైన ఇన్వెస్టిగేషన్ మాత్రం అంత ఎఫెక్టివ్ గా లేదు. చాలా సీన్స్ ఆడియన్స్ ని మిస్ లీడ్ చేయడానికే అన్నట్టుగా ఉన్నాయి. ఆ విషయం చూసే ఆడియన్స్ కి కూడా అర్థమవుతుంది.  అదృశ్య వ్యక్తి ట్రాక్ కూడా అంత ప్రభావవంతంగా లేదు. ఆ వ్యక్తి చాలా డేంజర్ అన్నట్టుగా మాటల్లో చెప్పించారు కానీ.. అతను రివీల్ అయ్యాక దానికి తగ్గ సన్నివేశాలు పడలేదు. పైగా ఆ ట్రాక్ కాస్త గందరగోళంగానూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో సినిమా స్టార్టింగ్ సీన్స్ తర్వాత, కాస్త ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. ముఖ్యంగా చివరి 30 నిమిషాల్లో సినిమా పుంజుకుంది. అయితే విలన్ ని రివీల్ చేసే సీన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది.  ఇన్వెస్టిగేషన్ సీన్స్ సిల్లీగా, హీరోయిన్ కి అన్నీ కన్వీనెంట్ గా జరిగినట్టుగా ఉంటాయి. అలాగే, ఒక చిన్న పాప వచ్చేసి.. ఇతనే విలన్ అని రివీల్ చేసి, అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పేయడం కూడా సిల్లీగా ఉంది.  హీరోయిన్ ఇన్వెస్టిగేట్ చేస్తుండగా.. కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటే.. ఆమె థ్రిల్ అవ్వడమే కాకుండా, చూసే ఆడియన్స్ కూడా థ్రిల్ అవ్వాలి. కానీ, ఇందులో హీరోయిన్ పెద్దగా కష్టపడకుండానే.. అందరూ ఆమెకి అన్నీ విషయాలు చెబుతుంటారు. దాంతో కిక్ లేకుండా పోయింది. అదే సినిమాకి మైనస్ అయింది. టెక్నికల్ గా కూడా సినిమా గొప్పగా లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు కీలకమైన కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాల పనితీరు సోసో గానే ఉంది.    ఫైనల్ గా.. దివ్య దృష్టి.. స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ, దానిని తెరపైకి ఆసక్తికరంగా తీసుకురావడంలో తడబడ్డారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారు.. అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి ట్రై చేయొచ్చు.   Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  
The most awaited song “Gippa Gippa” from the film Trimukha, starring Sunny Leone, Yogesh, Sahithi Dasari, and Akriti Agarwal, has been officially released and is creating a massive buzz everywhere. Released as a perfect New Year blast and bonanza, Gippa Gippa is ruling social media platforms like crazy, with audiences playing it on repeat and showering it with tremendous love. The song’s energetic vibe and grand presentation have struck an instant chord with viewers. Expressing their happiness, the producers shared that the overwhelming response to the song has exceeded expectations. They emphasized that the success clearly reflects Sunny Leone’s immense craze and star power, which is evident from the phenomenal reaction across digital platforms. With Gippa Gippa taking the internet by storm, Trimukha has undoubtedly raised the excitement levels among audiences to a whole new level. Movie is releasing on 2nd January, 2026.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   
  'సీతారామం', 'హాయ్ నాన్న' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ప్రస్తుతం 'డెకాయిట్' అనే సినిమా చేస్తోంది. ఇది 2026 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగులో హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్.. ఇప్పుడు స్టార్ హీరోకి సిస్టర్ గా కనిపించనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది.   పుష్పరాజ్ గా పాన్ ఇండియాని షేక్ చేసిన అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ ఫిల్మ్ చేసున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ సహా పలువురు పలువురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకే సినిమాలో ఇంతమంది హీరోయిన్స్ నటించడం ఏంటని కొంతకాలంగా చర్చనీయాశంగా మారింది. ఇక ఇప్పుడు మృణాల్ రోల్ కి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. (AA22)   Also Read: 2025 చివరి బాక్సాఫీస్ వార్.. ఛాంపియన్ ఎవరు..?   ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో మృణాల్ కనిపించనుందట. ఇది సినిమాకి కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. బ్రదర్-సిస్టర్ బాండింగ్ నేపథ్యంలో వచ్చే సీన్స్ హత్తుకుంటాయట. ఈ ట్రాక్ మూవీ మేజర్ హైలైట్స్ లో ఒకటిగా నిలవనుంది అంటున్నారు. అసలే అల్లు అర్జున్-అట్లీ కాంబో, దానికితోడు కథకి కీలకమైన పాత్ర కావడంతో.. సిస్టర్ రోల్ చేయడానికి మృణాల్ సిద్ధపడినట్లు సమాచారం.  
భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు తమ నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. కొందరు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో ఒక సుస్థిరమైన ముద్ర వేశారు. ఆయా నటీనటులు వెళ్లిపోయినా వారు చేసిన సినిమాలు, వారి అభినయం ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. నటీమణుల విషయానికి వస్తే.. భారతీయ చిత్ర పరిశ్రమకి ఎంతో మంది నటీమణులు వచ్చారు. వారిలో కొందరు తమ అసమాన నటనతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. వారిలో తమిళనటి మనోరమకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకే భాషకు పరిమితం కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. అన్ని సినిమాల్లో నటించిన ఏకైక నటీమణిగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు మనోరమ.   1937 మే 26న తమిళనాడులోని మన్నార్‌గుడిలో జన్మించారు మనోరమ. ఆమె అసలు పేరు గోపిశాంత. 11 ఏళ్ళ వయసులో పాఠశాల చదువును ఆపేసి నాటక రంగంలోకి ప్రవేశించారు. ఆ సమయంలోనే ఆమె పేరును మనోరమగా మార్చారు. అలాగే ఆమెకు ఆచి అనే పేరు కూడా ఉంది. 1958లో నటిగా సినిమాల్లోకి వచ్చిన ఆమె 50 ఏళ్ళ కెరీర్‌లో 1000కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించగల మనోరమ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. సినిమా పరిశ్రమకు ఆమె చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఒక నేషనల్‌ అవార్డుతోపాటు, ఒక ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు. అలాగే ఉత్తమ నటిగా ఏడు తమిళనాడు స్టేట్‌ అవార్డులు పొందారు.    తాజాగా ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కబోతోంది. ప్రభుత్వం దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోనుంది. చెన్నయ్‌లో ఆమె నివసించిన వీధికి ఆమె పేరునే పెట్టాలని దక్షిణ భారత నటీనటుల సంఘం ఒక ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. టి.నగర్‌లో ఉన్న నీలకంఠ మెహతా వీధిలో ఆమె ఎక్కువ కాలం నివసించారు. మనోరమ జ్ఞాపకార్థం ఆ వీధి పేరును ‘మనోరమ స్ట్రీట్‌’గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. వెయ్యి సినిమాలకు పైగా నటించి చరిత్ర సృష్టించిన ఏకైక మహిళగా పేరు తెచ్చుకున్న మనోరమ పేరును ఒక వీధికి పెట్టడం అనేది ఆమెకు నిజమైన నివాళిగా చెప్పుకోవచ్చు. 
  2025 ముగింపుకి వచ్చేసింది. డిసెంబర్ చివరి వారంలో స్టార్స్ సందడి లేదు కానీ.. పలు ఆసక్తికర సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ డిసెంబర్ 25న అర డజనుకు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి వీటిలో ఈ ఏడాది చివరి విజేతగా నిలిచే సినిమా ఏది?   లుక్స్ పరంగా టాలీవుడ్ హృతిక్ రోషన్ గా పేరు తెచ్చుకున్న రోషన్ మేకా.. డిసెంబర్ 25న 'ఛాంపియన్'(Champion)తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా నిర్మించిన ఈ సినిమా.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కంటెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాకి ఏకంగా రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన బైరాన్‌పల్లి గ్రామ చరిత్ర ఆధారంగా ఇది తెరకెక్కింది.   ప్రేమ కావాలి, లవ్‌లీ వంటి విజయవంతమైన సినిమాలతో కెరీర్ ని ప్రారంభించిన ఆది సాయికుమార్.. ఆ తర్వాత ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది.. ఇప్పుడు 'శంబాల‌'(Shambhala)తో తన లక్ ని టెస్ట్ చేసుకోబోతున్నాడు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ఫిల్మ్.. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకుంది. మంచి ధరకు అన్ని రైట్స్ అమ్ముడై.. విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.    తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీని చూడబోతున్నామనే నమ్మకాన్ని ప్రచార చిత్రాలతో కలిగించింది 'దండోరా'(Dhandoraa). శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాపై కూడా పాజిటివ్ బజ్ నెలకొంది.   హారర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆ జానర్ లో వస్తున్న మూవీ ఈషా(Eesha). త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్‌ రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో బాగా భయపెట్టింది. ఇటీవల చిన్న సినిమాలతో హిట్లు కొడుతున్న బ‌న్నీవాస్‌, వంశీ నంద‌పాటి ఈ సినిమాని విడుదల చేస్తుండటం విశేషం.   ఈ వారం 'పతంగ్'(Patang) రూపంలో యూత్ ఫుల్ కామెడీ ఫిల్మ్ కూడా రాబోతుంది. టీజర్, ట్రైలర్ మెప్పించాయి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పకుడు కావడం ఈ సినిమాకి కలిసొచ్చే మరో అంశం.   వీటితో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన 'వృషభ'(Vrusshabha), కన్నడ స్టార్ సుదీప్ నటించిన 'మార్క్'(Mark) కూడా డిసెంబర్ 25నే వస్తున్నాయి.   ఈ వారం విడుదలవుతున్న అన్ని సినిమాలు.. కంటెంట్ పరంగా నమ్మకం కలిగిస్తున్నాయి. మరి వీటిలో విన్నర్ ఏది? అనేది త్వరలోనే తేలిపోనుంది.    
  పుష్పతో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశముంది. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటనే సస్పెన్స్ నెలకొంది. త్వరలోనే ఈ సస్పెన్స్ కి తెర పడనుందని తెలుస్తోంది.   నిజానికి 'పుష్ప-2' తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో సినిమాలు కమిట్ అయ్యాడు అల్లు అర్జున్. అయితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిపోయింది. సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ ఊసే లేదు. 'పుష్ప-3' చేయాల్సి ఉంది కానీ, దానికింకా టైం ఉంది. అందుకే బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటనేది పెద్ద మిస్టరీలా మారింది. నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసుకోవడం ఫ్యాన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం ఆరంభంలో అల్లు అర్జున్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.   Also Read: షాకింగ్.. రాజమౌళి లాస్ట్ మూవీ వారణాసి..!   కాగా, బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు ఫ్యామిలీకి చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనుందట. సౌత్ స్టార్ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడని వినికిడి. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఈసారి అల్లు అర్జున్ ఏ జానర్ సినిమా చేయబోతున్నాడు? వంటి విషయాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం.  చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది.  కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి,  శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు.   ఈ సందర్బంగానే  ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. జాతీయ గణిత దినోత్సవాన్ని  భారత ప్రభుత్వం డిసెంబర్ 2011లో అధికారికంగా ప్రారంభించింది.  రామానుజన్ గణిత  విభాగానికి చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది . మరుసటి సంవత్సరం 2012 దేశవ్యాప్తంగా జాతీయ గణిత సంవత్సరంగా జరుపుకున్నారు, గణిత అభ్యాసం,  పరిశోధనలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశగా జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రణాళికలు వేసుకోవడం,  ప్రోత్సాహం అందించడం, కృషి చేయడం.. అలాగే గణిత శాస్త్రానికి చేస్తున్న సేవలను గుర్తించి, ఆయా వ్యక్తులను గౌరవించడం వంటివి జరుగుతాయి. డిసెంబర్ 22.. డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ జన్మదినం. ఆయన కృషి వందేళ్లు గడిచిన  తర్వాత కూడా నేటి మోడరన్  గణితాన్ని ప్రభావితం చేస్తోంది. గణితంలో ఆయన చేసిన పరిష్కారాలు,  సమస్యలు,  ప్రపంచం మీద ఆయన ప్రభావం మొదలైనవి గుర్తించడానికి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఇది ఆయనకు  నివాళిగా మాత్రమే కాకుండా, విద్యార్థులు,  పరిశోధకులు గణితాన్ని ఆవిష్కరించడం,  సాంకేతికత,  శాస్త్రీయ విచారణకు కేంద్రంగా గణితాన్ని  ప్రోత్సహించడానికి ఒక మంచి వేదిక అవుతుంది. సుధీర్ఘ ప్రయాణం.. భారతదేశానికి, గణిత శాస్త్రానికి  అనుబంధం ఆధునిక చరిత్రది కాదు..  అనేక శతాబ్దాల ముందే ఈ అనుబంధం ఉంది. భారతదేశం గణిత శాస్త్రానికి చేసిన కృషిని క్రీస్తుపూర్వం 1200 నుండి క్రీస్తుపూర్వం 1800 వరకు గుర్తించవచ్చు. అంకగణితం, బీజగణితం,  త్రికోణమితిలో గణనీయమైన పరిణామాలతో పాటు.. దశాంశ సంఖ్యా వ్యవస్థ, సున్నా,  ప్రతికూల సంఖ్యలను  వాడటం వంటి ప్రాథమిక భావనలు భారతదేశంలో పుట్టాయి.   దాదాపు నాల్గవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న భారతీయ గణిత శాస్త్రంలోని క్లాసికల్,  స్వర్ణ యుగాలలో ఆర్యభట్ట, వరాహమిహిర, బ్రహ్మగుప్త,  భాస్కర II వంటి పండితుల నుండి ముఖ్యమైన ఆవిష్కరణలు జరిగాయి. ఇంత సుధీర్ఘమైన బారత గణిత చరిత్రలో  శ్రీనివాస రామానుజ్ కూడా ప్రముఖుడు అని చెప్పడానికి ఆయన జయంతి రోజున గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామానుజ్ వారసత్వం.. గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణి,   భిన్నాలలో రామానుజన్ తన మార్గదర్శకులకు ఎప్పుడూ  గుర్తుండిపోతారు. నాటి కాలంలో ఆయనకు అధికారం, శిక్షణ అన్నీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ   స్వతంత్రంగా దాదాపు 3,900 ఫలితాలను సంకలనం చేశాడు. వాటిలో చాలా వరకు  తరువాత కాలంలో  అసలైనవని,  చాలా  లోతైనవిగా నిరూపించబడ్డాయి.  ఆయన విధానం, పద్దతులు ఇరవయ్యవ శతాబ్దపు గణిత శాస్త్రంలోని కీలక రంగాలను పునర్నిర్మించాయి.  ఇరవై ఒకటవ శతాబ్దంలో పరిశోధనలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.                                   *రూపశ్రీ.  
ప్రతి విషయంలోనూ నిజం మాట్లాడితేనే రిలేషన్ బాగుంటుందని కొందరు అనుకుంటారు. నిజాయితీ ఉన్నప్పుడు, నిజం మాట్లాడినప్పుడే ఆ వ్యక్తి జెన్యూన్ అని చెబుతూ ఉంటారు కూడా. అయితే ఎప్పుడూ నిజం మాట్లాడటం వల్ల రిలేషన్స్ లో  గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. భార్యాభర్తలలో ఎవరైనా ఏదైనా నిజం చెప్పినప్పుడు.. అది గొడవకు దారితీస్తే  వెంటనే వినిపించే మాట.. నీకు నిజం చెప్పాను చూడు.. నాది బుద్ధి తక్కువ అని. దీన్ని బట్టి అన్నిసార్లు నిజం చెప్పడం అంటే గొడవలను కోరి తెచ్చుకోవడమే అని అర్థం.  కొన్ని సందర్భాల్లో అబద్దాలు చెప్పడం వల్ల రిలేషన్ లో గొడవలు రావడానికి బదులు ఆ బంధం బలపడే అవకాశం,  ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మూడు రకాల అబద్దాలు చెప్పడం వల్ల రిలేషన్ పాడవకుండా దృఢంగా మారుతుందని అంటున్నారు. ఇంతకీ ఆ అబద్దాలేంటో ఎందుకు మేలు చేస్తాయో తెలుసుకుంటే.. పొగడ్తలు.. మెచ్చుకోలు..  లైఫ్ పార్ట్నర్  లేదా స్నేహితుడు కొత్త హెయిర్ కట్, కొత్త పెయింటింగ్ లేదా కొత్త డ్రెస్ లేదా ఏదైనా సరే.. ఏదైనా  కొత్తగా చేసినప్పుడు ఒకవేళ అది నచ్చకపోతే..  మొహం మీద బాలేదని చెప్పడం కంటే బాగుందని మెచ్చుకుంటే మేలు. నిజం చెప్పి వారిని బాధపెట్టే బదులు,  వారికి ఒక చిన్న ప్రశంస ఇవ్వవచ్చు. "వావ్" లేదా "సూపర్" లాంటి పదాలతో పొగడ్త ఇవ్వడం వల్ల ఎదుటివారు సంతోషపడతారు. దీనివల్ల ఇద్దరి మధ్య బందం బలపడుతుంది. ఎప్పుడైనా తను చేసింది బాలేదని అర్థమైనా.. ఆ రోజు నన్ను బాధపెట్టడం ఇష్టం లేక ఇలా అన్నారు కదా.. అనే ఒక ఆలోచన ఎదుటివారి దృష్టిలో మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. మద్దతు.. తప్పులు అందరూ చేస్తారు. అయితే ఏదో ఒక సందర్భంలో.. ఒకరు ముందు ఒకరు వెనుక చేయవచ్చు. ఆ మాత్రం దానికి మనిషిని నిందించకూడదు. మరీ ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం వ్యక్తిని ఎప్పుడూ నిందించకూడదు. ఒకవేళ నలుగురిలో ఏదైనా తప్పు జరిగినా, అందరి ముందు దోషిలా నిలబడే పరిస్థితి వచ్చినా మనిషిని వెనకేసుకురావాలి.  సపోర్ట్ గా నిలబడాలి. అలా సపోర్ట్ గా ఉండటానికి నలుగురిలో అబద్దం చెప్పినా తప్పు లేదు. భరోసా.. మనకు బాగా కావలసిన వాళ్లు, మన స్నేహితులు, మనతో చనువుగా ఉండేవారు ఎప్పుడైనా జీవితం గురించి ఇబ్బందిగా, బాధగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వెంటే మనకు కూడా బాగా బాధ కలుగుతుంది.  భవిష్యత్తు గురించి వాళ్ల మనసులో భయం కనిపించినప్పుడో లేదా దేని గురించైనా ఏమవుతుందో అని బాధపడుతున్నప్పుడో  వారికి ఊరట కలిగే విధంగా మాటలు చెప్పడం చాలా ముఖ్యం.  అలాంటప్పుడు ధైర్యం చెప్పడం,  భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వడం,  భవిష్యత్తు గురించి ఆశ కలిగేలా మాట్లాడటం చాలా ముఖ్యం. వారిలో ఆశాభావం పెరిగి వారు ఆత్మవిశ్వాసం కలుగుతుంది అంటే అలాంటి సందర్భాలలో అబద్దం చెప్పినా తప్పేం లేదు. చివరగా చెప్పేది ఏంటంటే.. అబద్దం అనేది ఎవరినీ మోసం చేయాలని,  బాధపెట్టాలని కాదు.. ఇతరులు సంతోషిస్తారని, బాధ నుండి బయటకు రాగలుగుతారని అనిపిస్తే అబద్దం చెప్పడంలో తప్పేం లేదనేది పెద్దలు కూడా చెప్పే మాట. కానీ మనిషి జీవితాన్ని ఇబ్బందులలోకి తోసేలా.. నమ్మించి మోసం చేసేలా అబద్దాలు ఎప్పటికీ ఆడకూడదు.                                *రూపశ్రీ.
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది. అంతే కాదు.. ప్రేమ లేని బంధాలు ఎక్కువ కాలం నిలబడవు కూడా. ఇద్దరు వ్యక్తులను అన్ని పరిస్థితులలో నిలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  అయితే బార్యాభర్తల బందంలో చాలా మంది ప్రేమ లేదని అంటూ ఉంటారు.  కొందరేమో ప్రేమ లేకపోయినా కేవలం బందం కోసం ఒక యంత్రంలా బ్రతికేస్తుంటారు. అలా ఉన్న బంధాలలో జీవం ఉండదు. భార్యాభర్తల బందంలో ప్రేమ ఉన్నప్పుడు అది చాలా కాలం ఎంతో అన్యోన్యంగా ఉండేలా చేస్తుంది. అయితే భార్యాభర్తల బందాన్ని బలంగా ఉంచే చిట్కాలు కొన్ని ఉన్నాయి.  ఇవి ఇద్దరి మధ్య ప్రేమను పెంచి ఇద్దరిని మరింత దగ్గర చేస్తాయి.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..  నిజాయితీగా ఉండాలి.. నిజాయితీ అనేది సంబంధానికి బలమైన పునాది. చిన్న విషయాలకు కూడా అబద్ధం చెప్పడం వల్ల సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడూ నిజం చెప్పాలి.   లైప్ పార్ట్నర్ ఫీలింగ్స్ ను కూడా గౌరవించాలి.  నిజాయితీ నమ్మకాన్ని పెంచుతుంది,  ప్రేమను మరింత పెంచుతుంది. ప్రేమ.. మాటల్లో కాదు చేతల్లో.. చాలామంది మాటల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అదే నిజమైన ప్రేమ అనుకుంటారు. కానీ నిజమైన ప్రేమ అనేది చేతల్లో చూపించాలి. ఒకరికొకరు సమయం కేటాయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం,  చిన్న చిన్న విషయాలలో కూడా కేరింగ్ గా ఉండటం వంటివి ఇద్దరి మధ్య ప్రేమను బలపరుస్తుంది. చిన్న సంతోషాలు.. ప్రేమను, సంతోషాన్ని పంచుకోవడానికి పెద్ద పెద్ద విజయాలు, పెద్ద సమయాలు,  పెద్ద ప్లానింగ్ లు అవసరం లేదు.  చిన్న చిన్న సందర్భాలను కూడా ఇద్దరూ కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. అభిరుచులను షేర్ చేసుకోవడం,  చిన్న సర్‌ప్రైజ్ లు, చిన్న బహుమతులు లాంటివి ఇద్దరి మధ్య బంధాన్ని బలంగా మారుస్తాయి. కమ్యూనికేషన్.. నేటి కాలంలో సంబంధాలలో కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే చాలా పెద్ద గొడవలకు కారణం అవుతోంది.   ఆనందాలు, బాధలు, సమస్యలు,  సంతోషకరమైన విషయాలను  ఒకరితో ఒకరు పంచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏ విషయాన్ని అయినా ఆరో్గ్యకరంగా డిస్కస్ చేసుకున్నప్పుడు ఇద్దరి మధ్య మంచి బంధం ఉంటుంది. ఇగో.. బందాలను దెబ్బ తీసే అతిపెద్ద శత్రువు ఇగో..  చిన్న కోపతాపాలు లేదా కోపంలో మాట్లాడే మాటలు కూడా సంబంధాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి క్షమించడం నేర్చుకోవాలి. భార్యాభర్తలు ఏ గొడవలు జరిగినా ఇద్దరూ ఒకరినొకరు క్షమించడం నేర్చుకున్నప్పుడే బంధం నిలబడుతుంది.  ఇగోను పక్కన పెట్టినప్పుడే ఇద్దరూ సంతోషంగా ఉండగలుగుతారు.                                                 *రూపశ్రీ.
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది. అంతే కాకుండా ఆహారాన్ని వేడి చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు.  ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, వంట చేయడానికి, ఆహారాన్ని తిరిగి వేడి చేయడానికి ఇలా చాలా రకాలుగా సిల్వర్ పాయిల్ వాడతారు. అయితే ఇన్ని రకాలుగా ఉపయోగించే సిల్వర్ ఫాయిల్ ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుందని తెలుసా? అందరూ సిల్వర్ ఫాయిల్ వల్ల ఎన్ని ఉపయోగాలో అనుకుంటారు. కానీ సిల్వర్ పాయిల్ ను వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అసలు సిల్వర్ ఫాయిల్ ను ఎందుకు వాడకూడదు? సిల్వర్ ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. అల్యూమినియం ఫాయిల్ ఎందుకు ప్రమాదం.. అల్యూమినియం ఫాయిల్ లో వేడి ఆహారం లేదా నిమ్మకాయ,  టమోటా లేదా స్పైసీ సాస్ వంటి ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలను ప్యాక్ చేసినప్పుడు అందులో మైక్రోస్కోపిక్ అల్యూమినియం కణాలు ఆహారంలోకి విడుదల అవుతాయి. ఆమ్ల గుణం ఉన్న పదార్థాలు వాడినప్పుడు ఇలా విడుదల అయ్యే తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. దీని వల్ల అల్యూమినియం శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో సాధారణ స్థాయిల కంటే ఎక్కువ అల్యూమినియం ఉన్నప్పుడు అది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అల్యూమినియం ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలు.. మెదడు, నాడీ వ్యవస్థ.. అల్యూమినియం ఒక న్యూరోటాక్సిన్. అంటే ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరంలో అల్యూమినియం అధిక స్థాయిలో ఉండటం వల్ల మెదడు కణాలపై ప్రభావం పడుతుంది. మెదడులో అల్యూమినియం పేరుకుపోవడం వల్ల  అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం పెరగడం జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకలు, మూత్రపిండాలు.. శరీరంలో అల్యూమినియం అధికంగా చేరడం వల్ల కాల్షియం,  ఫాస్ఫేట్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది ఎముక సాంద్రత తగ్గడానికి దారితీస్తుంది.  ఇది ఎముక బలహీనతకు దారితీస్తుంది. మూత్రపిండాల ప్రాథమిక విధి శరీరం నుండి అదనపు అల్యూమినియంను తొలగించడం. కానీ అధిక అల్యూమినియం మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. వేడి, ఆమ్ల ఆహారం.. అల్యూమినియం లీచింగ్ అనేది ఉష్ణోగ్రత,  ఆహారం  స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నిమ్మకాయ, టమోటా,  వెనిగర్ వంటి వేడి ఆహారం లేదా ఆమ్ల ఆహారాలను ఫాయిల్‌లో ప్యాక్ చేసినప్పుడు అల్యూమినియం కణాలు ఆహారంలోకి వేగంగా లీచింగ్ అవుతాయి. వంట కోసం ఫాయిల్ ఉపయోగించినప్పుడు కూడా ఈ లీచింగ్ తీవ్రమవుతుంది. ప్రత్యామ్నాయాలు.. అల్యూమినియం ఫాయిల్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా గాజు, సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లను ఉపయోగించాలి. ఫాయిల్ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే, చల్లని,  పొడి ఆహారాన్ని మాత్రమే ప్యాక్ చేయడం మంచిది.  ఆమ్ల ఆహారాలను అల్యూమినియం ఫాయిల్ తో డైరెక్ట్ గా టచ్ చేయకూడదు.  మరీ ముఖ్యంగా ఎల్లప్పుడూ ఫుడ్-గ్రేడ్ బటర్ పేపర్‌ను ఉపయోగించాలి. ఆ తరువాత దాన్ని సిల్వర్ పాయిల్ లో ప్యాక్ చేయాలి.                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపి నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది.  భారతదేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హై బీపి తో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు  ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. ఉప్పు డేంజర్ ఇందుకే.. ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది.  దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి.  గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం,  మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.  అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది.  దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు. బ్రెడ్, బన్.. బేకరీ.. రోజూ బ్రెడ్ లేదా బన్   వంటివి తినేవారు చాలామంది ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు.  మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు.  కానీ ఈ బ్రెడ్ లేదా బన్ లు  శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థంలో చాలా సోడియం,  సుగర్ ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్స్ లో లభించే స్నాక్స్, బిస్కెట్స్,  చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా,  బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. వీటిలో చాలా ఎక్కువ.. టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్‌విచ్ స్ప్రెడ్‌లు,  ప్యాక్ చేసిన చట్నీలు,  ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు..   వీటి షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడి్స్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా  ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్‌లు, క్రాకర్లు,  బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్‌లో కూడా ఎక్కువ  మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు. చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్‌లు,  ఫ్లేవర్డ్ బటర్ లో  కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది.   అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం,  టెక్చర్ కోసం  కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాలలో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పు తో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి.   కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపి తగ్గుముఖం పడుతుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని అంటారంటే వీటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  అయితే అతి సర్వత్ర వర్జయేత్ అనే మాటకు తగ్గట్టు పల్లీలు అయినా సరే.. ఎక్కువగా తినడం చాలా చెడ్డదని ఆహార నిపుణులు అంటున్నారు. రుచిగా ఉంటాయి కదా అని పల్లీలను అతిగా తింటే.. ఆరోగ్యానికి మేలు చేయకపోగా చేటు చేస్తాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పల్లీలు అంటే తెగ ఇష్టపడేవారు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.  పల్లీలను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. బరువు.. పల్లీలు అతిగా తింటే బరువు కూడా అతిగా పెరుగుతారట.  పల్లీలలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి.  100గ్రాముల పల్లీలలో దాదాపు 567కేలరీలు ఉంటాయట.  ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటే కేలరీలు కూడా పెరిగి బరువు పెరగడం కూడా వేగంగా జరుగుతుందట. జీర్ణ సమస్యలు.. పల్లీలు వేడి కలిగించే గుణం కలిగి ఉంటాయి. వీటిలో ఫైటేట్ లు ఉంటాయి.  పల్లీలు ఎక్కువగా తింటే ఉబ్బరం,  గ్యాస్,  కడుపులో యాసిడ్ ఫీలింగ్,  గుండెల్లో మంట వంటివి పెరుగుతాయి. పోషకాలు.. వేరుశనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పోషకాల శోషణకు ఆటంకం కూడా కలుగుతుంది. ముఖ్యంగా వీటిలో పైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  దీన వల్ల శరీరంలో ఐరన్,  జింక్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎన్ని తినాలి.. ఆరోగ్య నిపుణులు,  ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తినడం మంచిది.  అంతకంటే ఎక్కువ తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...