
నభా నటేష్.. సెల్యులాయిడ్ పై తను పెర్ఫార్మ్ చేస్తుంటే అభిమానులు వెంటనే సింగర్స్ గా మారిపోయి 'కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. రాసే నీకే ముందుగా మదిలో మాట తియ్యగా' అనే అద్భుతమైన మెలోడీని పాడుకుంటూ ఉంటారు. అంత హృద్యంగా నభా పెర్ఫార్మ్ ఉంటుంది.ఇస్మార్ట్ శంకర్ తో పాటు ప్రీవియస్ మూవీ నాగబంధం లాంటి సినిమాలే జస్ట్ శాంపిల్ పీసెస్.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక "అధికారిక ప్రకటన" ఇప్పుడు నెట్టింట విపరీతమైన చర్చకు దారితీసింది. మొదట "అధికారిక ప్రకటన" అని చూడగానే అభిమానులు, సినీ ప్రేక్షకులు ఏదో పెద్ద సినిమానో, లేక తీవ్రమైన వ్యక్తిగత విషయమో అనుకుని ఆందోళన పడ్డారు. కానీ లోతుగా చదివిన తర్వాత అసలు విషయం వేరే ఉందని అర్థమైంది. నభా నటేష్ తన తల్లికి బహిరంగ క్షమాపణ చెబుతూ ఒక హృద్యమైన, అదే సమయంలో సరదాగా సాగే నోట్ పంచుకుంది.
ఎన్నో ఏళ్లుగా తన తల్లి చెప్పిన మాటలను, సలహాలను పట్టించుకోకుండా తాను చేసిన పొరపాటును ఆమె ఈ పోస్ట్‌లో నిజాయితీగా ఒప్పుకున్నారు. "నాకే ఎక్కువ తెలుసు" అని ఎన్నో ఏళ్లుగా భావించానని, కానీ ఇప్పుడు ఆ నిజాన్ని ఒప్పుకోక తప్పడం లేదని నభా తన మనసులోని మాటను బయటపెట్టారు. ముఖ్యంగా "మా అమ్మ చెప్పేది కరెక్టే" అంటూ ఆమె రాసిన వాక్యం ఇప్పుడు ప్రతి ఇంట్లోని పరిస్థితిని గుర్తు చేస్తోంది.
.webp)
రోజువారీ జీవితంలో ఏం తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, అతిగా ఆలోచించడం ఎప్పుడు ఆపాలి అనే విషయాల నుంచి మొదలుకొని, ఆఖరికి కడుపు నొప్పి వచ్చినా లేదా కడుపు సహకరించనప్పుడు ఏం చేయాలన్న దానికి అమ్మ దగ్గరే ఖచ్చితమైన సమాధానం ఉంటుందని నభా స్పష్టం చేశారు. అయినప్పటికీ తాను మాత్రం మొదట అడగాల్సిన అమ్మను పక్కన పెట్టి, ఇంటర్నెట్లో గూగుల్‌లో వెతకడం, సోషల్ మీడియాలో రీల్స్ చూడటం, అవసరమైతే స్నేహితులను అడగడం వంటి పనులు చేసి ఏవేవో చిట్కాలు ప్రయత్నిస్తుంటానని సరదాగా చెప్పుకొచ్చారు.
ఈ పోస్ట్‌లో అందరినీ ఎక్కువగా ఆకట్టుకున్నది ఆమె చెప్పిన క్షమాపణ తీరు. అందరి ముందూ ఈ విషయాన్ని ఒప్పుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నా, ఈసారి కూడా అమ్మే కరెక్ట్ అని, అమ్మ మాట విననందుకు ఇదే తన బహిరంగ క్షమాపణ అని నభా పేర్కొన్నారు. అంతేకాకుండా, అమ్మ "నేను ముందే చెప్పాను కదా!" అనేలోపే ముందే సారీ చెప్పేస్తున్నానంటూ సరదాగా ముగించారు. కొన్ని క్షమాపణలు చెప్పడం మరికొన్నింటి కంటే కష్టమని, ముఖ్యంగా అమ్మ చెప్పిందే మొదటి నుంచి సరైనదని ఒప్పుకోవాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజీలతో ఆమె పెట్టిన క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తించింది.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అసలు ఏమైందని ఆరా తీస్తుండగా, మరికొందరు ఇది ఏదైనా సినిమా ప్రమోషన్ కోసమా అని సరదాగా ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు నభా తెలుగులో ఇంత చక్కగా రాయడం చూసి ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో అమ్మాయిల పరిస్థితి ఇంతేనంటూ యువతులు, నెటిజన్లు ఈ పోస్ట్‌కి బలంగానే కనెక్ట్ అవుతున్నారు.
ఇటీవల కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న నభా నటేష్, ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ "స్వయంభూ"లో ఆమె సుందరవల్లి అనే క్యారక్టర్ లో కనిపించనుంది. అలాగే తన మాతృభాష కన్నడ సినీ రంగంలోనూ విశాల్ ఆత్రేయ దర్శకత్వంలో ధ్రువ సర్జా సరసన నటిస్తూ మరో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
మీకు నచ్చవచ్చు:జనరల్ రైలులో విజయ్ ఆంటోనీ!
మీకు నచ్చవచ్చు:సినిమాకి ఆ ప్రేక్షకులు ఎందుకు దూరమయ్యారు? వాళ్ల పుణ్యమేనా!
[Nabha Natesh , public apology to mother, Swayambhu, Tollywood]




