తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను మరింత పటిష్టపరిచే దిశగా అధిష్ఠానం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి బాధ్యతలను యువ నాయకుడు బీఎం సందీప్‌కు అప్పగిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది.    పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్రతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి రానున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ పార్టీని సమన్వయం చేసే తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.    గతంలో ఈ బాధ్యతలను నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఈ మార్పు జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సంస్థాగత పదవి నుంచి తప్పుకున్న ఆమె, గతంలో రాష్ట్రంలో అందించిన విశేష సేవల పట్ల అధిష్ఠానం ప్రత్యేక ప్రశంసలు కురిపించింది.    కొత్త ఇన్‌ఛార్జి రేసులో పలువురు సీనియర్ జాతీయ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మాణిక్‌రావు థాక్రే వంటి ఉద్ధండుల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, అనూహ్యంగా అధిష్ఠానం బీఎం సందీప్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.    ఈ పరిణామం సరిగ్గా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలో జరగడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ యంత్రాంగాన్ని మరింత ఉత్సాహపరిచేందుకు, క్షేత్రస్థాయిలో సమన్వయం సాధించేందుకు ఈ నాయకత్వ మార్పు దోహదపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు  ఇతర రాజకీయ సవాళ్లు ఎదురుకానున్న తరుణంలో, కొత్త ఇన్‌ఛార్జి నియామకం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంతో సఖ్యతను పెంపొందిస్తూ, పార్టీని విజయపథంలో నడిపించడంలో బీఎం సందీప్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మీకు నచ్చవచ్చు: Under 19 Asia Cup: పాక్‌పై చివరి బంతికి భారత్  థ్రిల్లింగ్ విక్టరీ..కప్ మనదే.! [ BM Sandeep Telangana Congress In-charge, Telangana Congress news, AICC new appointments 2026, TPCC updates, Mallikarjun Kharge decisions ]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు వైయస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన కీలక నేత విజయసాయి రెడ్డి, ఇప్పుడు సొంత పొలిటికల్ జర్నీ ప్రారంభించిన సంగతి విదితమే.   వైసీపీ అధినేత జగన్ కు అత్యంత నమ్మకమైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా, రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ఆయన,  పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) పేరుతో నూతన రాజకీయ పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు. వైయస్ కుటుంబ నీడ నుంచి బయటపడి, తనకంటూ ఒక స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. కొత్త పార్టీ ఆవిర్భావ వేదికపై విజయసాయి రెడ్డి ఊహించిన విధంగానే వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ మత విశ్వాసాలను ప్రస్తావిస్తూ, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే రాజకీయ ప్రయోజనాల కోసం రెడ్డి సామాజిక వర్గ మద్దతును ఆశిస్తున్నారంటూ   ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. సాయిరెడ్డి చేసిన ఈ విమర్శలకు,  ఆయన కొత్త పార్టీకి వైసీపీ నుంచి ఎవరు, ఎలాంటి సమాధానం ఇస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.   ఇది కూడా చదవండి: విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.? సాయిరెడ్డి పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే ఆయన సొంత పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడారు. విజయసాయి పేరు నేరుగా  ప్రస్తావించకుండా  జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నంత కాలం కొంతమంది వ్యక్తులు తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటారని విమర్శించారు. జగన్ కల్పించిన నమ్మకం, విశ్వసనీయత వల్లే వారికి రాజకీయ వేదిక లభించిందని, కానీ నేడు వారు పార్టీ కంటే తామే గొప్ప అని భ్రమపడుతున్నారని చెవిరెడ్డి అన్నారు.   జగన్ లేకపోతే వ్యక్తిగతంగా వారికి ఎటువంటి గుర్తింపు, విలువ లేవనే విషయాన్ని   గ్రహించలేకపోతున్నారని అన్నారు. ఇలాంటి ప్రాధాన్యత లేని, ప్రభావం చూపలేని చిన్న పార్టీల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఇసుమంతైనా ఉండదన్నారు.   మీకునచ్చవచ్చు:  విజయసాయి కొత్త పార్టీ: వైసీపీకి జరిగే నష్ట మేంటి.. రాష్ట్ర రాజకీయాల్లో పీఆర్పీ ప్రభావమెంత.? విజయసాయి కొత్త పార్టీ: వైసీపీ బీ టీమ్ అంటూ చర్చలు.! [Vijaya Sai Reddy  PRP Party, Chevireddy Reaction, YCP TeluguOn]  
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం వైసీపీపై ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు నుంచి కూడా విజయసాయి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో కూడా విజయసాయి సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నాయి.   వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయసాయి,  ఇప్పుడు  పరివర్తన రాజనీతి పార్టీ  పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.   దేశభక్తి, ప్రజా సంక్షేమం,  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తన పార్టీ పనిచేస్తుందని విజయసాయి పార్టీ ప్రకటన సందర్భంగా చెప్పారు. పార్టీ అధికారిక ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడమే తమ   లక్ష్యమని ప్రకటించారు.  ఈ పరిణామం వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా, పార్టీ నేతకు అధినేతకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు  సొంత కుంపటి పెట్టుకోవడం ఆ పార్టీకి ఏదో మేరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తమౌతోంది.   ఇది కూడా చదవండి:  జయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.! పార్టీలో అసంతృప్తితో ఉన్న, అలాగే ఆయనతో సత్సంబంధాలు కలిగిన కొందరు నేతలు భవిష్యత్తులో వైసీపీని వీడి విజయసాయి పంచన చేరే అవకాశలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  అదలా ఉంచితే..  కొత్త పార్టీ ద్వారా ఆయన ఏ మేరకు ప్రభావం చూపగలరు, ప్రజాదరణను ఏ విధంగా సంపాదించుకుంటారు అనే విషయంలో కూడా రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రానున్న కాలంలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ)  ప్రయాణం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఏ మేరకు ఎలా  ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చెప్పిన ముహూర్తానికి చెప్పినట్లుగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయసాయి, ముందు ముందు రాష్ట్ర రాజకీయాలలో  ఏ మేరకు ప్రభావం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్త మౌతోంది.   మీకు నచ్చవచ్చు:  వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి   విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.? [Effect of Vijayasai Reddy New Party onYCP, Parivarthana Rajaneethi Party, PRP, Political Impact, AP Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి స్పందించే మెగాస్టార్ చిరంజీవి మరోసారి చిత్ర పరిశ్రమ తరఫున కీలకమైన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. దాని ద్వారా సెలబ్రిటీల ముఖాలు, గొంతులను అనుమతి లేకుండా ఉపయోగించడం, డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కళాకారుల వ్యక్తిగత గుర్తింపు, గౌరవం, సృజనాత్మక హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఈ వినతిపత్రాన్ని అందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర హోం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు ఉద్దేశించి దీనిని సమర్పించారు. ఇటీవల అమిత్ షాతో జరిగిన సమావేశంలో AI దుర్వినియోగం వల్ల సినీ, టెలివిజన్ కళాకారులకు ఎదురవుతున్న సమస్యలను చిరంజీవి వివరించారు. ఈ అంశంపై లిఖితపూర్వకంగా వినతిపత్రం ఇవ్వాలని అమిత్ షా సూచించడంతో తాజాగా కిషన్ రెడ్డికి అందజేశారు. ఇందులోని అంశాలను సంబంధిత మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి సమన్వయం చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ వినతిపత్రంలో పలు కీలకమైన అంశాలను చిరంజీవి ప్రస్తావించారు. కళాకారుల ముఖం, గొంతు, వ్యక్తిగత గుర్తింపును వారి అనుమతి లేకుండా డిజిటల్ రూపంలో ఉపయోగించకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు. AI ద్వారా ఒక వ్యక్తి రూపాన్ని, గొంతును తిరిగి సృష్టించే ముందు వారి అనుమతి తప్పనిసరి చేయాలని సూచించారు. అలాగే దురుద్దేశంతో రూపొందించే డీప్‌ఫేక్ వీడియోలపై తగిన శిక్షలు విధించడం, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను నిర్ణీత సమయంలో తొలగించే వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు చేశారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని కూడా కోరారు. కేవలం సినీ ప్రముఖులే కాకుండా సాధారణ ప్రజలు, మహిళలు, చిన్నారులు కూడా AI దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల కష్టంతో సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు, వ్యక్తిగత గౌరవం క్షణాల్లో దెబ్బతినే పరిస్థితులు వస్తున్నాయని వివరించారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు అండగా నిలవడం, హెల్త్ కార్డులు, వైద్య సహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో కళాకారుల హక్కుల పరిరక్షణ కోసం ముందుకొచ్చారు. "సాంకేతికత సృజనాత్మకతను పెంపొందించాలి.. మనిషి గౌరవాన్ని దెబ్బతీయకూడదు" అనే సందేశంతో ఈ అంశంపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. Chiranjeevi, Chiranjeevi Latest News, AI Deepfake Misuse, Chiranjeevi Kishan Reddy Meeting, Kishan Reddy, Amit Shah, AI Protection for Actors, Celebrity Digital Rights, Deepfake Videos, Telugu Film Industry News
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47'. ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా.. త్రివిక్రమ్ మార్క్ మాటలు, కుటుంబ నేపథ్యంలోని కథ ప్రేక్షకులకు నచ్చాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలనే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నవంబర్ చివరి వారంలోనే 'ఆదర్శ కుటుంబం' నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందని టీవీ9 కథనం పేర్కొంది. అయితే ఇప్పటివరకు స్ట్రీమింగ్ తేదీపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.  ఇక ఈ సినిమాలో వెంకటేష్ చిట్టిబాబు అనే మధ్యతరగతి వ్యక్తి పాత్రలో కనిపించారు. చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించే ఆయన భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి నటించారు. భార్య కోరికల కారణంగా అప్పులపాలైన చిట్టిబాబు కుటుంబం అనూహ్యంగా ఓ లగ్జరీ విల్లాలోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వారికి ఎదురయ్యే పరిణామాలు, ఓ గ్యాంగ్‌స్టర్‌తో చిట్టిబాబుకు ఉన్న సంబంధం ఏమిటన్నది కథలో ఆసక్తికరమైన అంశాలు. నారా రోహిత్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా.. థమన్ సంగీతం అందించారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. నారా రోహిత్, శ్రీనిధి శెట్టితో పాటు నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటించారు. థియేటర్లలో చూడలేకపోయిన వెంకటేష్ అభిమానులు ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.       [Venkatesh, AadarshaKutumbamOTT, Netflix, TrivikramSrinivas, SrinidhiShetty]
సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం సాధారణమే. కానీ ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకుల సినిమాలు ఒకేరోజు థియేటర్లలోకి రావడం మాత్రం అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో అలాంటి ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ నటించిన సినిమాలు నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో ఈ తండ్రీకొడుకుల బాక్సాఫీస్ పోటీపై ఆసక్తి నెలకొంది. మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన చిత్రం 'ఓం' (O.M). తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనుండగా.. సాయిపల్లవి పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఆకాశంలో ఒక తార'. సాత్విక వీరవల్లి ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంస్థలపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో శ్రుతి హాసన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ 20న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇలా ఒకే రోజు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ రెండు సినిమాలు వేర్వేరు భాషల్లో, విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకవైపు ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్‌లో వస్తున్న 'ఓం'పై అంచనాలు ఉండగా.. మరోవైపు తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'తో వస్తున్నారు. మరి నవంబర్ 20న తండ్రి సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటుందా? కొడుకు సినిమా పైచేయి సాధిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.     Mammootty, Dulquer Salmaan, Mammootty vs Dulquer, OM Movie 2026, Aakasamlo Oka Tara, Dhanush OM Movie, Mammootty New Movie, Dulquer Salmaan Telugu Movie, November 20 Movie Releases, Father Son Box Office Clash
థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసే ప్రేక్షకులకు ఈ వారం మంచి వినోదం అందబోతోంది. నవంబర్ 16 నుంచి 22 వరకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషలకు చెందిన ఆసక్తికరమైన చిత్రాలు కూడా ఈ వారం డిజిటల్ ప్రేక్షకులను అలరించనున్నాయి. ముఖ్యంగా నవంబర్ 20న ఒకేసారి పలు సినిమాలు ఓటీటీలోకి రాబోతుండటం విశేషం.  ముందుగా తెలుగు సినిమాల విషయానికి వస్తే.. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'క్రేజీ కల్యాణం' నవంబర్ 20 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ ప్రధాన పాత్రల్లో విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన 'అనుమాన పక్షి' కూడా అదే రోజు సన్ నెక్స్ట్‌లో అందుబాటులోకి రానుంది. మరోవైపు చైత్ర ఆచార్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ '418' నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.  ఇక ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌ల విషయానికి వస్తే.. నవంబర్ 18న జియో హాట్‌స్టార్‌లో 'మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్' అనే తమిళ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 20న సోనీ లివ్‌లో అశోక్ సెల్వన్, ప్రీతి ముఖుందన్ నటించిన తమిళ చిత్రం 'అన్బిల్ అవన్' రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 20 నుంచి తమిళ చిత్రం 'హైకూ', హిందీ వెబ్‌సిరీస్ 'ఢిండోరా సీజన్ 2' స్ట్రీమింగ్ కానున్నాయి. జీ5లో 'టీన్ తిగాడా' కూడా అదే రోజు అందుబాటులోకి రానుంది.  ఇక నవంబర్ 16న జియో హాట్‌స్టార్‌లో 'క్వీన్' అనే హిందీ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. నవంబర్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'క్యాంపస్ డైరీస్ సీజన్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా నవంబర్ 18న 'ది ఒడిస్సీ' ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి రానుంది. ఇలా ఈ వారం అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కలిపి సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులకు మంచి వినోదం లభించనుంది.       [OTTReleases, CrazyKalyanam, AnumanaPakshi, 418, Haiku]
15 ఏళ్ళ క్రితం ఎక్కడ చూసినా ఒకటే పాట వినిపించేది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు.. వయసుతో, భాషతో సంబంధం లేకుండా అందరూ ఆ పాటను పాడుకునేవారు. అదే ‘వై దిస్ కొలవెరి డి’. ధనుష్ సింగింగ్, అనిరుధ్ మ్యూజిక్, సులభంగా పాడుకునే లిరిక్స్ తో.. ఈ పాట ఓ సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ పాట విడుదలై 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2011 నవంబర్ 16న యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట అప్పట్లో ఇంటర్నెట్‌ను ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ఉన్నంతగా సోషల్ మీడియా విస్తరించని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం విశేషం. మరి అసలు ఈ పాట ఎలా పుట్టింది? అనిరుధ్, ధనుష్ కలిసి అనుకోకుండా చేసిన ప్రయోగం ఎలా ఓ సంచలనంగా మారింది? ‘కొలవెరి డి’ పాట తమిళ సినిమా ‘3’ కోసం రూపొందింది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్, శ్రుతి హాసన్ జంటగా నటించారు. ప్రేమలో విఫలమైన ఓ యువకుడి భావోద్వేగాలను సరదాగా వ్యక్తం చేసే పాట కావాలని ఐశ్వర్య సూచించడంతో అనిరుధ్ ట్యూన్ సిద్ధం చేశారు. అప్పటికి అనిరుధ్ వయసు కేవలం 21 ఏళ్లు. సంగీత దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి సినిమా. ఈ పాట ట్యూన్‌ను కొద్ది నిమిషాల్లోనే కంపోజ్ చేశారట. అనిరుధ్ వేసిన ట్యూన్ విన్న ధనుష్ సరదాగా కొన్ని పదాలు పాడటం మొదలుపెట్టారు. అలా వచ్చిన ‘వై దిస్ కొలవెరి డి’ అనే లైన్ పాటకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఇది కూడా చదవండి: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. మెగాస్టార్‌తో రితికా సింగ్ మాస్ స్టెప్పులు.! ఇక లిరిక్స్ విషయానికి వస్తే.. ధనుష్ ఓ ఇంటర్వ్యూలో ఈ పాటను కేవలం ఆరు నిమిషాల్లో రాసినట్లు వెల్లడించారు. రోజువారీ జీవితంలో మనం ఉపయోగించే సాధారణ ఇంగ్లిష్ పదాలనే పాటలో పెట్టానని చెప్పారు. ఇంగ్లిష్ పదాలు ఉన్నప్పటికీ వాటిని తమిళ యాసలో పాడటం వల్లే పాటకు ప్రత్యేకమైన ఫ్లేవర్ వచ్చిందని వివరించారు. ఈ పాటను మొదట్లో ప్రత్యేకంగా సింగిల్‌గా విడుదల చేయాలనే ఆలోచన లేదట. సినిమా ఆల్బమ్‌లో భాగంగా మాత్రమే ఉంచాలనుకున్నారు. అయితే పాటకు సంబంధించిన రఫ్ వెర్షన్ అనుకోకుండా ఇంటర్నెట్‌లోకి వెళ్లి వైరల్ కావడం మొదలైంది. దీంతో స్పందనను గమనించిన ధనుష్, అనిరుధ్.. వెంటనే పాటను పూర్తి చేసి అధికారికంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని ధనుష్ గతంలో వెల్లడించారు. అలా 2011 నవంబర్ 16న ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు హంగామా. కొన్ని రోజుల్లోనే లక్షలాది వ్యూస్.. ఆ తర్వాత మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో ఎక్కడ చూసినా ఈ పాటే కనిపించేది. అప్పట్లో వైరల్ అనే పదానికి నిజమైన అర్థం చూపించిన పాటల్లో ఇదొకటిగా నిలిచింది. ‘కొలవెరి డి’ క్రేజ్ తమిళనాడుకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ పాటను ప్రశంసించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ‘కొలవెరి డి’ పాట సృష్టించిన సంచలనం ‘3’ సినిమాకు కూడా భారీ హైప్ తీసుకొచ్చింది. కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఈ పాట అనిరుధ్‌కు సంగీత దర్శకుడిగా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ధనుష్‌కు గాయకుడిగా, గేయ రచయితగా దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. అప్పట్లో ఓ చిన్న స్టూడియో సెషన్‌లో సరదాగా పుట్టిన పాట.. తర్వాత ప్రపంచవ్యాప్తంగా మారుమోగడం నిజంగా అరుదైన విషయం. మీకు నచ్చవచ్చు: ‘వారణాసి’ నుంచి అఫీషియల్ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్కి బ్లాస్టింగ్ న్యూస్.! ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!       [Why This Kolaveri Di, 15 Years, Dhanush, Anirudh Ravichander]
  '90s  ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో మౌళి ప్రస్తుతం 'DNK' (దొంగ నా కొడుకు) తో థియేటర్స్ లో ఉన్న విషయం తెలిసిందే. మౌళి  ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ బాక్సాఫీస్‌పై కన్నేశాడనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.    తమిళంలో 'గుడ్ నైట్', 'లవర్', 'టూరిస్ట్ ఫ్యామిలీ' వంటి వరుస సూపర్ హిట్ చిత్రాలను నిర్మిస్తూ, కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే కాకుండా వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'మిలియన్ డాలర్ స్టూడియోస్' బ్యానర్‌లో మౌళి తన మూడో సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అచ్చమైన మధ్యతరగతి భావోద్వేగాలను, నేచురల్ హ్యూమర్‌ను ఏ మాత్రం కృత్రిమత్వం లేకుండా తెరకెక్కించడంలో ఈ నిర్మాణ సంస్థకి  ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్ ఉంది. అలాంటి క్రేజీ నిర్మాణ సంస్థతో మౌళి చేతులు కలపడం ఆయన కెరీర్‌లో ఓ సరికొత్త మైలురాయిగా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.   ఇది కూడా చదవండి: హిందుస్థాన్ ఎవరి సొంతం కాదు: లెజండ్రీ సింగర్ కీలక వ్యాఖ్యలు!    ఇప్పటివరకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు టాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మౌళి, ఈ కోలీవుడ్ ప్రాజెక్ట్‌తో నేరుగా తమిళ ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. కేవలం నటనపరంగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మౌళి, ఈ తమిళ ప్రవేశంతో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ న్యూస్ ప్రస్తుతం రూమర్ హోదాతోనే సరిపెట్టుకుంటూ ఉంది సుమి.   మీకు నచ్చవచ్చు:ఎంత పని చేసింది సాయిపల్లవి తల్లి.. ఫ్యాన్స్ షాక్! మీకు నచ్చవచ్చు:ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చిన ప్రీతి ముకుందన్: డేట్ లాక్ చేసుకోండి!    [Mouli, Dnk movie, Million Dollar Studios, Kollywood entry, Tollywood]
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన మ్యూజిక్‌తో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ సంగీత దర్శకుడు.. అతి తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలై 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనిరుధ్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. 15 ఏళ్ల క్రితం ఇదే రోజున తన తొలి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చిందని అనిరుధ్ గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు, అద్భుతమైన అనుభవాలు ఉన్నాయని తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పాటలు రూపొందించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. అంతేకాదు.. ఇండిపెండెంట్ మ్యూజిక్, అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేయడం, వివిధ భాషల్లో పాటలు పాడటం వంటి అనుభవాలను కూడా గుర్తుచేసుకున్నారు. ఇక ఈ 15 ఏళ్లలో దేశంలోని ప్రముఖ దర్శకులు, నటులు, నిర్మాతలతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని అనిరుధ్ తెలిపారు. స్ట్రీమింగ్ రికార్డులు సృష్టించడం, కోట్లాది మంది శ్రోతలకు తన సంగీతాన్ని చేరువ చేయడం, ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహించడం మర్చిపోలేని అనుభవాలని పేర్కొన్నారు.  చార్ట్‌బస్టర్ పాటలతో పాటు వేలాది మంది అభిమానులు తన పాటలను గొంతెత్తి పాడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ ఏడాది కూడా అనిరుధ్‌కు చాలా ప్రత్యేకం. ఆయన సంగీతం అందించిన 'LIK', 'జననాయగన్', 'DC', 'పారడైజ్', 'జైలర్ 2' సినిమాలు 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇది కూడా చదవండి: హీరో కావాలని వచ్చారు.. ఆరు సార్లు అవకాశాలు చేజారినా చివ‌ర‌కు 650 సినిమాల్లో నటించిన గిరిబాబు.!  ఈ సందర్భంగా అనిరుధ్ మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, సవాళ్లు ఎదురైనా ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా పనిచేశామని తెలిపారు. సంగీతంపై మొదటిరోజు ఉన్న ప్రేమే ఇప్పటికీ తమను ముందుకు నడిపిస్తోందని చెప్పారు. తన పాటలను మళ్లీ మళ్లీ వింటూ, పాడుతూ ఆదరిస్తున్న అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  ఇటీవలే కావ్య మారన్‌ను వివాహం చేసుకున్న అనిరుధ్.. 15 ఏళ్ల ప్రయాణం పూర్తయిన ఇంకా సాధించాల్సిన కలలు ఎన్నో ఉన్నాయని, తన అత్యుత్తమ సంగీతం ముందుందని పేర్కొన్నారు. అనంతరం మళ్లీ స్టూడియోలోకి అడుగుపెడుతున్నానంటూ తన సందేశాన్ని ముగించారు. మీకు నచ్చవచ్చు: ‘కాకా‘లో స్పెషల్ సాంగ్: మెగాస్టార్‌తో రితికా సింగ్ మాస్ స్టెప్పులు! త్రిష పెంపుడు కుక్క బర్త్‌డే సెలబ్రేషన్స్: గెస్ట్‌గా ఎవరొచ్చారో తెలిస్తే షాక్ అవుతారు.!       [AnirudhRavichander, Anirudh15Years, AnirudhMusic, AnirudhEmotionalPost, AnirudhLatestNews]
రజినీకాంత్ ఫ్యాన్స్ రజినీని చూసినప్పుడల్లా 'స్టైలు, స్టైలు రా.. నీది సూపర్ స్టైలు రా అంటూ డాన్స్ చేసినట్టుగా ఇప్పుడు సేమ్ ప్రముఖ గాయకుడు 'దిల్జిత్ దోసాంజ్' ని చూసి అదే విధంగా పాడుకుంటున్నారు. పంజాబీ సూపర్‌స్టార్ దిల్జిత్ దోసాంజ్ తన కచేరీల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సంగీతంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్న ఆయన, ఇటీవల తన లైవ్ షోల సమయంలో ఎదురవుతున్న వివాదాలు, ఆంక్షలపై చాలా స్పష్టంగా, నిర్భయంగా స్పందిస్తున్నారు. ఇండోర్‌లో జరిగిన ఒక కచేరీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి.  కళాకారుల స్వేచ్ఛకు వస్తున్న ఆటంకాలపై ఆయన దివంగత ప్రఖ్యాత కవి రాహత్ ఇండోరి (Rahat Indori) పంక్తులని  ఉటంకిస్తూ తీవ్రమైన రీతిలో బదులిచ్చారు. ఈ భూమి మీద, ఈ దేశం మీద ప్రతి ఒక్కరి రక్తమూ కలిసి ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇండోర్ వేదికగా జరిగిన ఈ భారీ కచేరీకి ముందు పలు రకాల సవాళ్లు ఎదురయ్యాయి.  నిర్వహణకు సంబంధించి చివరి నిమిషంలో క్లియరెన్స్ అడ్డంకులు, చివరకి  బాంబు బెదిరింపుల వంటి ఉద్రిక్త పరిస్థితులను లెక్కచేయకుండా దిల్జిత్ వేదికపైకి దూసుకువచ్చారు. మరోవైపు, బాలల పరిరక్షణ అధికారులు (District Child Protection Officer) నవంబర్ 6వ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఆయన పాడాల్సిన పాటలలో 'పాటియాలా పెగ్', 'ఫైవ్ తారా', 'కేస్', 'జాట్ ఉఠ్ ఫైర్ కర్దా' వంటి మొత్తం 4 ప్రముఖ పాటలపై ఆంక్షలు విధించారు. 2019 నాటి పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఆదేశాల ఆధారంగా హింసను, మద్యం మరియు మాదకద్రవ్యాలను ప్రోత్సహించే సాహిత్య శైలిని చిన్నపిల్లలపై ప్రభావం చూపకుండా నియంత్రించాలనే నిబంధనను తెరపైకి తెచ్చారు. అయితే, ఈ ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దిల్జిత్ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తూనే గట్టి కౌంటర్ ఇచ్చారు.   ఇది కూడా చదవండి: సాయిపల్లవి తల్లి దుమారం: మరి అభిమానించి అందలం ఎక్కిస్తే ఇలాగే చేస్తారు!    ఈ ఆంక్షల పట్ల స్పందిస్తూ, "ఈ నేలలో ప్రతి ఒక్కరి రక్తమూ కలిసి ఉంది. ఇది ఎవరి తండ్రి జాగీరూ కాదు" అనే రాహత్ ఇండోరి ప్రసిద్ధ కవిత్వాన్ని మైక్ ముందు గట్టిగా వినిపించారు. ఎవరూ కూడా  తమని ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వకుండా ఆపలేరని, గతంలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదురైనప్పటికీ, తన 'దిల్-లుమినాటి ఇండియా టూర్' (Dil-Luminati India Tour) ప్రదర్శనలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తానని ఆయన తేల్చిచెప్పారు.  డిసెంబర్ 20వ తేదీన భారత్ నుంచి బయలుదేరేలోగా షెడ్యూల్ చేసిన అన్ని నగరాల్లోనూ షోలను దిగ్విజయంగా ముగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కచేరీల చుట్టూ కేవలం పాటల ఆంక్షలే కాకుండా కొన్ని సంస్థల నుంచి తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. బజ్‌రంగదళ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సంఘాలు కచేరీల్లో జరిగే మద్యం విక్రయాలు, మిశ్రమ లింగ సీటింగ్ ఏర్పాట్లను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ కార్యక్రమాలు మాదకద్రవ్యాల వినియోగాన్ని పెంచుతాయని, కొన్ని అవాంఛనీయ ధోరణులకు దారితీస్తాయని వారు ఆరోపణలు గుప్పించారు. అయినప్పటికీ, వేలాదిగా తరలివచ్చిన అభిమానుల కేరింతల మధ్య దిల్జిత్ తన ప్రదర్శనను విజయవంతంగా ముగించారు. సంగీతం ఎవరికైనా ఒక్కటేనని, ప్రేమను పంచడమే తన ఏకైక లక్ష్యమని ఆయన నిరూపిస్తున్నారు. అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, లక్నో, చండీగఢ్, కోల్‌కతా తదితర ప్రధాన నగరాల్లో డిసెంబర్ అంతటా ఆయన ఈ మ్యూజికల్ టూర్‌  కొనసాగించనున్నాడు.     మీకు నచ్చవచ్చు:పెంపుడు కుక్క విషయంలో త్రిష కీలక నిర్ణయం! మీకు నచ్చవచ్చు:వంద సిగరెట్లు తాగి దొరికిపోయిన హీరోయిన్ తల్లి!   [Diljit Dosanjh, Indore concert, Hindusthan, Dil Luminati Tour India, Bollywood]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రస్తుత కాలంలో రసాయనాలతో కూడిన బ్యూటీ ఉత్పత్తులకు బదులుగా సహజసిద్ధమైన పద్ధతులను పాటించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ చర్మ సంరక్షణలో  రోజ్ వాటర్  ఎప్పటి నుంచో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. సహజసిద్ధమైన గులాబీ రేకుల నుంచి సేకరించే ఈ జలంలో చర్మానికి ఎంతో మేలు చేసే హైడ్రేటింగ్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి.  ఇది ముఖంపై పేరుకుపోయే దుమ్ము, ధూళిని సమర్థవంతంగా తొలగించి చర్మాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని రోజ్ వాటర్ అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడటంతో పాటు నిద్రపోయే సమయంలో చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. చర్మంపై ఉండే సహజమైన pH స్థాయిలను సమతుల్యం చేయడంలో రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం అతిగా పొడిబారడం లేదా ఎక్కువ జిడ్డు కారడం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారానికి కనీసం రెండు సార్లు రోజ్ వాటర్‌ను చర్మానికి రాసుకోవడం ద్వారా చర్మంలో అధికంగా సెబమ్ ఉత్పత్తి కాకుండా నియంత్రించవచ్చు. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా మార్చి ముఖంపై మొటిమలు, మశూచి మచ్చలు రాకుండా రక్షణ కల్పిస్తుంది. సెన్సిటివ్ లేదా చికాకు కలిగించే చర్మం ఉన్నవారికి ఇది ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ప్రశాంతతను చేకూరుస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై వచ్చే ముడతలు, గీతలు మరియు సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో రోజ్ వాటర్‌లోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సహాయపడతాయి. ఇది చర్మంలో కొల్లాజెన్ స్థాయిలను కాపాడుతూ, చర్మాన్ని యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో లభించే ఖరీదైన మేకప్ రిమూవర్లకు ప్రత్యామ్నాయంగా రోజ్ వాటర్‌ను ఉపయోగించవచ్చు. ఇది ఎలాంటి హాని చేయకుండా సులభంగా మేకప్‌ను తొలగించడమే కాకుండా, అలసిపోయిన చర్మానికి తక్షణ ఉత్సాహాన్ని ఇస్తుంది. కంప్యూటర్లు, మొబైల్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు, ఉబ్బరం (Puffiness) వంటి సమస్యలకు రోజ్ వాటర్ చక్కటి పరిష్కారం. ఫ్రిజ్‌లో చల్లబరచిన రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్స్ లేదా దూదిని ముంచి పది నిమిషాల పాటు కనురెప్పలపై ఉంచుకోవడం ద్వారా కళ్లకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, రోజ్ వాటర్ వాసన పీల్చడం లేదా దీని సువాసన మైండ్ రిలాక్సేషన్‌కు తోడ్పడి తలనొప్పిని దూరం చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి:స్టెంట్‌లు, బైపాస్ సర్జరీల వల్ల ఆయుష్షు పెరుగుతుందా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది? రోజ్ వాటర్‌లో ఉండే సహజ క్రిమినాశక మరియు అనాల్జేసిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చర్మాన్ని రక్షిస్తాయి. కొన్ని రకాల కంటి ఆరోగ్య సమస్యలకు ఉపయోగించే ఆయుర్వేద కంటి చుక్కలలో కూడా రోజ్ వాటర్‌ను సురక్షితంగా వాడతారు. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం ఎరుపెక్కినా లేదా మంట పుట్టినా, ఈ జలాన్ని ముఖంపై స్ప్రే చేయడం ద్వారా తక్షణ చల్లదనం లభిస్తుంది. ఇది కేవలం బాహ్య అందాన్నే కాకుండా చర్మ కణాలకు లోపలి నుంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మీ రోజూవారీ చర్మ సంరక్షణ దినచర్యలో (Skincare Routine) రోజ్ వాటర్‌ను చేర్చుకోవడం ద్వారా శాశ్వతమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. కెమికల్స్ లేని స్వచ్ఛమైన రోజ్ వాటర్‌ను టోనర్‌గా, ఫేస్ మిస్ట్‌గా లేదా ఫేస్ ప్యాక్‌లలో కలుపుకుని ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. క్రమమైన పద్ధతిలో దీన్ని వాడటం ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా మీ ముఖం మృదువుగా, నిండుగా మరియు కాంతివంతంగా మారుతుంది. మీకు నచ్చవచ్చు:నేచర్ ప్రిస్క్రిప్షన్: డాక్టర్లు సైతం సిఫారసు చేస్తున్న ,అద్భుతమైన ప్రకృతి రహస్యం!                                   సరికొత్త క్యాన్సర్ చికిత్సలు: వైద్య రంగంలో నూతన మైలురాళ్ళు ఇవే!       Rose Water Benefits, Glowing Skin Tips, Natural Face Care, Hydrating Skincare, Beauty Remedies, Skin Care Routine, Health Tips In Telugu.
మనలో చాలామంది చిన్నతనంలో పెద్దలు చెప్పిన మాటను ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. అదేమిటంటే, పిల్లలు గణితంలో (మ్యాథ్స్) రాణించాలన్నా, లెక్కలు సులభంగా చేయాలన్నా విధిగా బెండకాయలు తినాలని పెద్దలు గట్టిగా నమ్ముతుంటారు. దీనివల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని, లెక్కలు ఇట్టే వచ్చేస్తాయని ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బెండకాయలను తినిపిస్తుంటారు.  అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బెండకాయలు తింటే నేరుగా గణితం లేదా లెక్కలు బాగా వస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇప్పటివరకు శాస్త్రీయంగా దీన్ని ఎవరూ నిరూపించలేదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం సమాజంలో ఎప్పటినుంచో నాటుకుపోయిన ఒక ప్రాచుర్యం పొందిన నమ్మకం మాత్రమేనని తేల్చిచెప్పారు. అయితే, బెండకాయలు తింటే నేరుగా మ్యాథ్స్ రాకపోయినా, వీటిలో ఉండే అద్భుతమైన పోషకాలు మాత్రం మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బెండకాయల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్ మరియు మెగ్నీషియం వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీర జీవక్రియలు సక్రమంగా జరిగేలా తోడ్పడటంతో పాటు, నాడీ వ్యవస్థను, మెదడు కణాలను ఉత్తేజితం చేస్తాయి. బెండకాయల వల్ల మెదడు మరింత చురుగ్గా, యాక్టివ్‌గా పనిచేయడానికి సహాయపడుతుంది కాబట్టి, బహుశా దీనివల్లే పిల్లలకు జ్ఞాపకశక్తి పెరిగి చదువుపై, గణితంపై ఏకాగ్రత కుదిరి ఉంటుందని, దాంతోనే  బెండకాయ తింటే లెక్కలు వస్తాయి  అనే నానుడి ప్రచారంలోకి వచ్చి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయంగా లెక్కలతో సంబంధం లేకపోయినా, మన దైనందిన ఆహారంలో బెండకాయలను చేర్చుకోవడం ద్వారా శరీరానికి లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బెండకాయల్లో ఉండే విటమిన్  సి  ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీర రోగ నిరోధక శక్తిని (Immunity) విపరీతంగా పటిష్టం చేస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్  కె  చిన్నపాటి గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేసి, తీవ్రమైన రక్తస్రావం కాకుండా రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా, ఎముకలను దృఢంగా ఉంచడంలోనూ, కంటి చూపును మెరుగుపరచడంలోనూ విటమిన్  ఎ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇది కూడా చదవండి:శీతాకాలంలో, పచ్చి బఠానీలు తింటే బరువు తగ్గవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు? డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి బెండకాయ ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. వీటిలో ఉండే అధిక పీచు పదార్ధం (Fiber), మ్యుసిలేజ్ రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Levels) చాలా సమర్థవంతంగా అదుపులో ఉంచుతాయి. మనం తీసుకున్న ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్‌గా మారి రక్తంలో నెమ్మదిగా కలిసేలా ఇవి సహకరిస్తాయి, దీనివల్ల షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగే ప్రమాదం తప్పుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో, గట్ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బెండకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. జీర్ణాశయ గోడలను రక్షించి అసిడిటీ, అల్సర్లు వంటి సమస్యలను దూరం చేయడంలోనూ ఇవి ముందుంటాయి. శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారికి కూడా బెండకాయలు చక్కటి ఆహారమనే చెప్పాలి. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఆహారపు మోతాదు నియంత్రణలో ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు కూడా బెండకాయల్లో ఉండే ఫోలేట్ పిండం యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి, లెక్కలు వస్తాయో లేదో అనే విషయంతో సంబంధం లేకుండా, అనేక పోషక విలువులు నిండిన ఈ కూరగాయను మీ డైట్‌లో క్రమం తప్పకుండా భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఇంజెక్షన్లతో పనిలేదు, ఇకపై మాత్రలతోనే బరువు తగ్గింపు: పూర్తి వివరాలు ఇవే!                                   ఉదయం పూట, వ్యాయామాలు చేసేవారికి, బ్లడ్ షుగర్ ఎందుకు పెరుగుతుంది?       Ladys Finger Math Myth, Okra Health Benefits, Bhindi Brain Power, Food Myths Debunked, Nutrition Facts, Doctor Health Advice, Health Tips In Telugu.
 జీవితంలో నిజమైన విజయం ప్రశాంతత కావాలా.. ఇదిగో ఈ సూత్రాలు పాటించండి.. ! జీవితంలో మనం ఎంచుకునే మార్గం, ఎదుర్కొనే సవాళ్లు మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు మన వ్యక్తిగత జీవితంపైనే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజంపై కూడా ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మనం ఏ పనిచేసినా కాస్త ఆలోచించి, సరైన దిశలో అడుగులు వేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత టెక్నాలజీ పెరిగిపోయిన డిజిటల్  కాలంలో ఉరుకులు పరుగుల జీవితం వల్ల చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. కెరీర్ ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశయాలను చేరుకోవాలనే ఆతురతలో పడి తమ ఆరోగ్యాన్ని ,  మనశ్శాంతిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే  జీవితంలో నిజమైన విజయం సాధించాలన్నా,  ప్రశాంతత కావాలన్నా కొన్ని జీవన సూత్రాలు పాటించాలి.  అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతారు.  ఆ జీవన సూత్రాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. మానసిక ఆరోగ్యం.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మనిషికి చాలా ప్రధానమైనది. రోజూ కొంత సమయాన్ని వ్యాయామం, యోగా లేదా ధ్యానం కోసం కేటాయించడం ద్వారా ఒత్తిడిని దూరంగా ఉంచుకోవచ్చు. అలాగే, మనకు నచ్చిన అలవాట్లను ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పుస్తకాలు చదవడం లేదా క్రియేటివిటీ ఫ్రూవ్ చేసుకునే  పనులలో నిమగ్నం కావడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకుండా, వాటిని ఒక అనుభవంగా భావించి ముందుకు సాగడమే నిజమైన జీవన శైలి గా భావించాలి. పాజిటివ్ దృక్పథం.. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం, చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలు కలిగి ఉండటం మనల్ని మానసికంగా బలంగా మారుస్తుంది. ప్రతి రోజూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి. అప్పుడే జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుంది. ప్రవర్తన.. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నా, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలన్నా మన ప్రవర్తన , ఆలోచనా విధానం ఎంతో ముఖ్యం. ఎప్పుడూ అహంకారం, గర్వం,  ఇతరుల పట్ల చిన్న చూపు చూడటం వంటివి అస్సలు చేయకూడదు. ఇది కూడా చదవండి  చేతికి డబ్బు రాగానే ఈ పనులు చేయండి.. లేకపోతే బాధపడతారు..! ఆందోళన.. చాలామంది రేపు ఏమవుతుందో అనే భయంతో .. ఆందోళన చెందుతూ ఉంటారు.  దీని వల్ల వర్తమానంలో చేతిలో ఉన్న కాలాన్ని భయపడుతూ, ఆందోళనగా గడిపేస్తారు.  దీని వల్ల ఎలాంటి ప్రశాంతత,  చేయాలనుకున్న పనుల పట్ల ఏకాగ్రత ఉండవు. అందుకే భవిష్యత్తును గురించి అతిగా ఆందోళన చెందకుండా వర్తమానంలో జీవిస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి.                                                                                                                         *రూపశ్రీ.  
మనం చేసే ప్రతి చిన్న పనీ మన భవిష్యత్తును నిర్ణయించినట్లే, మనం రోజూ ఆచరించే ప్రతీ అలవాటు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి జబ్బుల కంటే మన చెడ్డ అలవాట్లే మనల్ని నెమ్మదిగా బలహీనపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. ధనం పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం కోల్పోతే అదే అసలైన దరిద్రం. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన పూర్వీకులు కొన్ని సులువైన జీవన సూత్రాలను చెప్పారు. వాటిని సరిగ్గా పాటిస్తే జీవితం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. ఆ ముఖ్యమైన ఐదు ఆరోగ్య సూత్రాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే..  సరైన ఆహార నియమం.. మన శరీరం జీర్ణవ్యవస్థపైనే మన ఆయుర్దాయం ఆధారపడి ఉంటుంది. కడుపులో ఉన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే మళ్లీ మళ్లీ తినడం విషం తినడంతో సమానమని పెద్దలు చెబుతారు. ఆకలి లేకపోయినా కేవలం సమయం అయిపోయిందన్న ఒకే ఒక్క కారణంతో బలవంతంగా తినడం మనం చేసే అతి పెద్ద తప్పు. శరీరం చెప్పే ఆకలి సంకేతాలను వినడం నేర్చుకోవాలి కానీ గడియారపు ముళ్లను చూస్తూ తినకూడదు. ఆకలి ఉంటేనే, శరీరం కోరితేనే మితంగా, రుచిగా కాక ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.  నిద్ర.. ఈ కాలంలో చాలామంది రాత్రంతా మేలుకోవడం, తెల్లవారితే అతిగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నారు. అయితే అతిగా నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకపోవడం రెండు పద్ధతులూ శరీర నాశనానికి దారితీస్తాయి. తెల్లవారుజామునే నిద్రలేవడం వల్ల మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, బద్ధకం దరిచేరదు. సూర్యుడితో పాటు నిద్రలేచి ప్రకృతితో మమేకమైతే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. క్రమబద్ధమైన నిద్ర శారీరక శక్తిని పునరుద్ధరిస్తుంది. శారీరక శ్రమ.. నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత శారీరక కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. శరీరాన్ని కదిలించకుండా కేవలం ఒకే చోట కూర్చుని పనిచేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. వ్యాయామం, యోగ, చిన్నపాటి నడక, ఇంటి పనులు వంటి సహజ కదలికలు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. జిమ్‌లకు వెళ్లి విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ రోజూ శరీరానికి తగిన శ్రమ ఇచ్చేలా చూసుకోవడం చాలా అవసరం. ఇది కూడా చదవండి    వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..! మానసిక ప్రశాంతత.. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అతిగా కోపగించుకోవడం వల్ల శరీరంలోని ప్రాణశక్తి లోపలి నుంచే క్షీణించిపోతుంది. కోపం మన ఆరోగ్యాన్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు. మనసుపై నిగ్రహం లేకపోతే ఏ పనీ సరిగ్గా చేయలేము. డబ్బు కంటే మనసు నిండుగా, సంతోషంగా ఉండటమే అసలైన ఐశ్వర్యం. యోగ, ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శుచి , పరిశుభ్రత.. కేవలం మన ఇల్లు మాత్రమే కాకుండా మన శరీరం, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మూలస్తంభం. శరీరం, చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండటం మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. అలాగే మన ఆలోచనలు, మాటలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ ఐదు సూత్రాలు ఏవీ కొత్తవి కావు, మన దైనందిన జీవితంలో ఎంతో సులభంగా పాటించదగినవే. వీటిని రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే ఏ అనారోగ్య సమస్యలూ దరిచేరవు. జీవనశైలిలో చిన్న మార్పుతోనే పెద్ద మార్పును సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించవచ్చు.                                                                                                                                                 *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు.. ఈ 5 పండ్లతో ఎన్నో లాభాలు!  
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి చాలామంది వాకింగ్ ను ఎంచుకుంటారు. అయితే, వాకింగ్ చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ, దానిని నిలకడగా కొనసాగించడంలో చాలామంది విఫలమవుతుంటారు. వర్షం వచ్చిందని, చలికాలం అని, లేదా ఆ రోజు మూడ్ బాలేదని, బిజీగా ఉన్నామని రకరకాల కారణాలతో నడకను మధ్యలోనే ఆపేస్తుంటారు. అసలు వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని ఆ ముఖ్యమైన రహస్యం ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. ఉత్సాహం కాదు.. సరైన ప్లానింగ్ ముఖ్యం.. చాలామంది ఫిట్‌నెస్ విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. మొదటి రోజే ఉత్సాహంతో నలభై ఐదు నిమిషాలు లేదా గంటపాటు నడవాలని నిర్ణయించుకుంటారు. అలా మొదటి రోజు కష్టపడి నడిచాక, రెండో రోజు కాళ్ల నొప్పితో బాధపడతారు. మూడో రోజు పని ఒత్తిడి, నాలుగో రోజు వాతావరణం బాగోలేకపోవడంతో వాకింగ్ కు స్వస్తి చెబుతారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఫిట్‌నెస్ సాధించడంలో ఎక్కువ మోటివేషన్ ఉన్నవారు కాదు, మంచి అలవాట్లు ఏర్పరచుకున్నవారే విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. వేగం కాదు.. ఈ లాజిక్ ముఖ్యం.. గుండె ఆరోగ్యం కోసం వేగంగా నడవాలని,  హార్ట్ పాయింట్లు అని ఈ మధ్య చాలామంది వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఎంత వేగంగా నడిచాం లేదా ఎంతసేపు నడిచాం అనేది ముఖ్యం కాదు, ప్రతీరోజూ నడకను కొనసాగించామా లేదా అనేదే చాలా కీలకం. ఈ క్రమంలోనే వాకింగ్ ప్రారంభించాలనుకునేవారి కోసం ఒక సులభమైన , అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే.. ఈజీగా.. హుషారుగా.. మొదటగా మొదటి మూడు వారాలు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నడవాలి. కేవలం ఐదు నిమిషాలు నడవడం వల్ల గుండెకు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవచ్చు, కానీ మన మెదడుకు ఒక కొత్త అలవాటును నేర్పించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. మొదటి మూడు వారాలు ఐదు నిమిషాలు నడిచిన తర్వాత, ఆ సమయాన్ని మరో ఐదు నిమిషాలు పెంచి పది నిమిషాలు చేయాలి. ఆ తరువాత మరో మూడు వారాలకు పదిహేను నిమిషాలు, ఇలా క్రమంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలకు పెంచుకుంటూ పోవాలి. ఇది కూడా చదవండి   మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​ ఇక్కడ ప్రధాన లక్ష్యం మొదట్లోనే శరీరాన్ని అలసటకి గురి చేయడం కాదు, నడకను ఒక మంచి అలవాటుగా మార్చుకోవడం. అలవాటు ఏర్పడిన తర్వాత ఫిట్‌నెస్ అనేది దానంతట అదే మన సొంతం అవుతుంది. చిన్న చిన్న చిట్కాలు.. వాకింగ్ కు మార్గాలు.. నడకను ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమం తప్పకుండా సాగించడానికి కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఎంతో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందే మరుసటి రోజు ఉదయం వాకింగ్ కి వేసుకునే దుస్తులను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే వాటిని పక్కనే ఉంచుకోవడం మంచిది. అలాగే షూస్‌ను మంచం పక్కనే ఉంచాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల మనం అలసత్వాన్ని గెలవడం కంటే అసలు అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. హ్యాబిట్ స్టాకింగ్.. హ్యాబిట్ స్టాకింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని పాటించవచ్చు. ఉదయం నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా వాకింగ్ కి వెళ్ళిపోవాలి. వాకింగ్ పూర్తయిన తర్వాతే స్నానం చేసేలా దినచర్యను మలచుకోవాలి. ఒక పాత అలవాటుకు మరో కొత్త అలవాటును ఇలా జోడించడం వల్ల పనులు మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, ఇంట్లోనే ఐదు నిమిషాల పాటు నడవాలి కానీ వాకింగ్ అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించకూడదు. మొదలు పెట్టిన రోజే పది కిలోమీటర్లు నడవడం కంటే, ఏడాది పొడవునా ప్రతీరోజూ పది నిమిషాల చొప్పున నడవడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మన గుండెకు కావాల్సింది ఏదో ఒక్కరోజే చేసే  ప్లానింగ్ కాదు.. ప్రతీరోజూ కొనసాగించే ప్లానింగ్ కావాలి. ఈ చిన్నపాటి నియమాలను పాటిస్తూ, వాకింగ్ ను జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు  మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!                                 మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!