తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. ఆయనను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధికారిక ప్రకటన చేసింది.  పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేసే దిశగా ఈ కీలక బాధ్యతలను ఆయనకు తెలుగుదేశం హైకమాండ్ అప్పగించింది. ప్రస్తుతం  ప్రభుత్వంలో అత్యంత కీలక మంత్రిత్వ శాఖలను   నిర్వహిస్తున్న  నారా లోకేష్ కు  పార్టీలోనూ అత్యున్నత స్థాయి బాధ్యతలు అప్పగించింది.  నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత  పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.  ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత.. ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కూడా నారా లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని నిర్ణయించారు.  పార్టీ సంస్థాగత నిర్మాణంలో లోకేష్ చేసిన కృషిని గుర్తించిన తెలుగుదేశం హైకమాండ్ ఆయనకు మరింత స్వేచ్ఛ నిచ్చి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువేళ్లేందుకు అవకాశం ఇచ్చింది. అందుకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ ను నియమించింది.   పార్టీ అంతర్గత వ్యవహారాలు, కమిటీల నియామకం, జిల్లాల వారీగా పార్టీ బలోపేతం వంటి అంశాల్లో లోకేష్ పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఆకర్షించడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం వంటి వాటిపై లోకేష్ దృష్టి పెడతారని అంటున్నారు.    చంద్రబాబు నాయుడు పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న తరుణంలో, పార్టీ బాధ్యతలను లోకేష్ పంచుకోవడం వల్ల సమతుల్యత ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు. కాగా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ పట్ల  తెలుగుదేశం శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ  నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే లోకేష్‌కు ఈ పదవి అదనపు బలాన్ని ఇస్తుందన్న అభిప్రాయం పార్టీ వర్గాలో బలంగా వ్యక్తం అవుతోంది.  ఇలా ఉండగా..  తెలుగుదేశం హైకమాండ్ జాతీయ కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుల జాబితాను కూడా విడుదల చేసింది. యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ.. అనుభవజ్ఞులను పొలిట్‌బ్యూరోలో కొనసాగిస్తూ సమతూకంతో  కమిటీలను రూపొందించింది.  ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్‌ కొనసాగించింది. 29 మందితో పొలిట్‌బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని తెలుగుదేశం ప్రకటించింది.  జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని నియమించింది. అంతేకాకుండా ఉపాధ్యక్షులుగా 18, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించింది.  
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనను బహిష్కరించాలని మత్స్యకారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు  హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుండి ఇటీవల నాలుగు బోట్లు మాయం అయ్యాయి. గతంలో తమిళనాడుకు చెందిన కొన్ని బోట్లు అక్రమంగా చేపల వేట సాగిస్తుండగా, స్థానిక మత్స్యకారులు వాటిని పట్టుకుని హార్బర్‌లో  ఉంచారు.  అయితే, ఆ బోట్లు అనుమానాస్పద స్థితిలో మాయం కావడంతో మత్స్యకారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ బోట్ల అదృశ్యం వెనుక రాజకీయనేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దీంతో మత్స్యకారులు పొలిటికల్ లీడర్ల పర్యటనలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.   మత్స్యకారుల ప్రధాన డిమాండ్ ఏమిటంటే, మాయమైన బోట్ల వ్యవహారం పూర్తిగా తేలే వరకు   రాజకీయ పార్టీలకు, వాటి కార్యక్రమాలకు, అలాగే రాజకీయ నేతలకు తాము దూరంగా ఉంటామని కుండబద్దలు కొడుతున్నారు.  తమ సమస్య పరిష్కారం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు రావడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇటు అధికార కూటమి నాయకులకు, అటు ప్రతిపక్ష వైకాపా నేతలకు కూడా సహకరించకూడదని ఇసకపల్లి, పట్టపుపాలెం గ్రామాల మత్స్యకారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు  జగన్ జువ్వలదిన్నె పర్యటన ఉంటుందా? రద్దౌతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా మత్స్యకార గ్రామాల్లో  సామాజిక కట్టుబాట్లు చాలా బలంగా ఉంటాయి.  రానున్న రోజుల్లో ఈ బోట్ల వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
  - ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనే మన మార్గం  - పార్టీ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి టీడీపీ బలోపేతానికి కృషి చేయండి   "కాఫీ కబుర్లు" కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్చార్జిల‌కు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం  పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జుల‌ శిక్షణ తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలుగుజాతి విశ్వఖ్యాతి అంటే గుర్తుకు వచ్చేది అన్న ఎన్టీఆర్. తెలుగు జాతి శక్తి ఏంటో ప్రపంచానికి చూపించిన వ్యక్తి చంద్రబాబు. వీరిద్దరూ బలమైన సిద్ధాంతాలతోనే విజయం సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని నేతలకు మంత్రి సూచించారు.  సిద్ధాంతాలే నాయకత్వానికి బలం  “ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరించడం అత్యంత కీలకం. కార్యకర్తల మధ్య ఐక్యత, క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మరింత బలపడుతుంది. సిద్ధాంతాలపై ఆధారపడి ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటేనే దీర్ఘకాలిక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయి. సిద్ధాంతపరంగా ఎదిగిన నాయకత్వమే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అని మంత్రి తెలిపారు.  ఆరు ముఖ్య సిద్ధాంతాలు గ్రామ‌స్థాయికి తీసుకెళ్లాలి  “ఎన్ని ప‌నులున్నా సీఎం , నేను ప్రతి వారం ఏదో ఒక‌ ఒక రోజు పార్టీ కార్యాలయంలో గడుపుతూ ప్రజా సమస్యలను వింటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రత్యేక సమయం కేటాయించాలి. పార్టీ ప్రవేశపెట్టిన ఆరు ముఖ్య సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించాలి” అని సూచించారు.  పార్టీతో కార్య‌క‌ర్త‌ల‌ను అనుసంధానం చేసేది మై టీడీపీ యాప్  “ప్రతి బూత్, క్లస్టర్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం అత్య‌వ‌స‌రం. రాజకీయాల్లో కొత్త త‌రాన్ని ప్రోత్సహిస్తూ, సిద్ధాంతపరంగా శిక్షణ పొందిన నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. “మై టీడీపీ” యాప్ ద్వారా కార్యకర్తలు తమ కార్యకలాపాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రతి ఒక్కరి పనితీరును పార్టీ అధినేత పర్యవేక్షిస్తున్నారు. వ్య‌క్తిగ‌త ప‌నులు పూర్తిచేసుకుని కొంత స‌మ‌యం కేటాయించి క్షేత్ర‌స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయండి. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించండి. కష్టపడిన వారికి తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది” అని హామీ ఇచ్చారు.  రెడ్ బుక్ స‌మాజ బాగు కోసం..రాజారెడ్డి రాజ్యాంగంతోఈ విధ్వంసం  “గతంలో దేవాలయంలాంటి  తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై, నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేశారు. కార్య‌క‌ర్త‌ల‌ను హింసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దమనకాండకు పాల్ప‌డ్డారు. అమర్నాథ్ గౌడ్‌, అబ్దుల్ సలాం, తోట చంద్రయ్యల‌ను వెంటాడి మ‌రీ చంపారు. డా.సుధాకర్‌,  కోడెల శివప్రసాద్, మిస్బా అనే చిన్నారిల‌ను వేధించి మ‌ర‌ణానికి కార‌కుల‌య్యారు. అధికారంలో ఉన్న‌ప్పుడు విధ్వంసం-దాడులు-హ‌త్య‌లు-అవినీతితో చెల‌రేగిపోయిన జ‌గ‌న్..అధికారం పోయాక కూట‌మి ప్ర‌భుత్వంపై విష‌ప్ర‌చారాల‌తో విరుచుకుప‌డుతున్నాడు.  ఐక‌మ‌త్యంగా పోరాట స్ఫూర్తితో వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వ‌చ్చే ఫేక్ స‌మాచారాన్ని తిప్పికొట్టండి. నా రెడ్ బుక్‌ సమాజ బాగు కోసం అయితే, రాజారెడ్డి రాజ్యాంగంతో జ‌గ‌న్‌ సమాజాన్ని నాశ‌నం చేయాల‌నుకున్నాడు.  ఏ ఆత్మ చెప్పిందో కానీ మావిగ‌న్ అంటూ క‌ల‌వ‌రిస్తున్నాడు జ‌గ‌న్‌. ``  నేతల మధ్య సఖ్యత ముఖ్యం  “రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే అమరావతికి చట్టబద్ధత వచ్చింది, విశాఖ ఉక్కు పరిరక్షణ జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక నిధుల సాధన వంటి విజయాలు సాధ్యమవుతున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయాలి. కుటుంబంలా ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య కలహాలు వస్తే అంతా క‌లిసి కూర్చుని మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకున్న‌ట్టే, కూట‌మి నేత‌లు కుటుంబంలా  కూర్చొని చ‌ర్చించుకుని విభేదాలు విడ‌నాడ‌లి`` అని సూచించారు.
ALSO ON TELUGUONE N E W S
తెలుగు సినీ చరిత్రలో కమర్షియల్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్న చిత్రాల్లో 'కింగ్' ఒకటి. కింగ్ అంటే కేవలం నాగార్జున స్టైల్, యాక్షన్ మాత్రమే కాదు.. ఆ సినిమాలో ఉన్న హిలేరియస్ కామెడీ కూడా ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా శ్రీహరి, బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చే పెయింటింగ్ సీన్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలో శ్రీహరి పోషించిన 'జ్ఞానేశ్వర్' పాత్ర చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తనేదో గొప్ప పెయింటర్ అని ఫీలైపోతూ, అమాయకమైన మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్యను (బ్రహ్మానందం) పిలిపించి తన చిత్రకళను ప్రదర్శించే సీన్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. గీతలే లేని తెల్ల కాన్వాస్‌ను చూపిస్తూ అందులో ఏదో పరమార్థం ఉందని శ్రీహరి చెప్పే డైలాగులు థియేటర్లో నవ్వుల పూలు పూయించాయి. ఈ కామెడీ ట్రాక్‌లో శ్రీహరి డైలాగ్ డెలివరీ, ఆయన బాడీ లాంగ్వేజ్ హైలైట్‌గా నిలుస్తాయి. పక్కన బ్రహ్మానందం పడే టెన్షన్, ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సీన్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. "నేను గీసిందే పెయింటింగ్.. దాన్ని నువ్వు గుర్తించలేకపోతే నీ తప్పు" అన్నట్టుగా సాగే ఈ సంభాషణలు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. శ్రీహరి అంటే కేవలం సీరియస్ పాత్రలకే కాదు, అద్భుతమైన కామెడీ టైమింగ్‌కు కూడా మారుపేరు అని ఈ సినిమా నిరూపించింది. అందులోనూ బ్రహ్మానందంతో ఆయన కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేసింది. ఈ పెయింటింగ్ ఎపిసోడ్ ఎంత పాపులర్ అంటే, ఇప్పటికీ ఎవరైనా అర్థం లేని పనులు చేస్తే 'ఇది జ్ఞానేశ్వర్ పెయింటింగ్‌లా ఉంది' అని జోకులు వేసుకునేంతలా జనాల్లోకి వెళ్ళిపోయింది. సినిమా వచ్చి ఇన్నేళ్లవుతున్నా, తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో ఈ వీడియోకు వస్తున్న వ్యూస్ చూస్తుంటే తెలుగు వారికి ఈ కామెడీ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. శ్రీహరి గారు మన మధ్య లేకపోయినా, ఇలాంటి మరపురాని పాత్రల ద్వారా ఆయన ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. మరిన్ని నవ్వుల కోసం ఈ వీడియోను మీరూ చూసేయండి. ఇలాంటి నాన్ స్టాప్ కామెడీని ఆస్వాదించాలంటే మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్‌లో 'బద్రి' సినిమా ఒక మైలురాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతోనే రేణూ దేశాయ్ (Renu Desai) టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షరతులతోనే సినిమాల్లోకి.. నిజానికి రేణూ దేశాయ్‌కు నటి కావాలనే కోరిక మొదట్లో లేదట. ఆమెకు డాక్టర్ అవ్వాలని ఉండేది. మోడలింగ్‌లో ఉన్నప్పుడు పూరీ జగన్నాథ్ ఆమెను చూసి 'బద్రి' కోసం సంప్రదించారు. అయితే సూటిగా మాట్లాడే స్వభావం వల్ల, సినిమా ఇండస్ట్రీ తనకు సెట్ కాదని ఆమె భావించేవారట. అందుకే దర్శకుడు పూరీకి కొన్ని షరతులు పెట్టానని ఆమె తెలిపారు. తన పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ తానే సెలెక్ట్ చేసుకుంటానని, తన ఇష్టప్రకారం మేకప్ ఉంటుందని చెప్పగా పూరీ అందుకు అంగీకరించారట. అలా వెన్నెల పాత్రలో రేణూ దేశాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కాంబినేషన్ లో వచ్చిన 'బద్రి' సినిమా అప్పట్లో యూత్ లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ముఖ్యంగా అందులోని డైలాగులు, సాంగ్స్ ఇప్పటికీ ఎంతో ఫేమస్. ఆ తర్వాత వీరిద్దరూ 'జానీ' సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. కాస్ట్యూమ్ డిజైనర్ వర్క్ చేస్తున్నానని, ఎవరూ సెలెక్ట్ కాకపోవడంతో చివరి నిమిషంలో హీరోయిన్ గా ఎంపికయ్యాయని రేణూ దేశాయ్ తెలిపారు. 'బద్రి' తర్వాత 'జానీ' సినిమాలో నటించిన రేణూ, చాలా కాలం వెండితెరకు దూరంగా ఉన్నారు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో ఆమె రీ-ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె రైతుల సమస్యల నేపథ్యంలో ఒక సినిమాను రూపొందించే పనిలో ఉన్నారు.  
    -ఏప్రిల్ 30 నుంచి పెద్ది వాయిదా పడినట్లేనా! -ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాలేదు  -అలాంటి ఈ టైంలో బుచ్చిబాబు పోస్ట్ వైరల్  -మరి బుచ్చిబాబుకి  చరణ్ మరో అవకాశం ఇస్తాడా!   'రైరై రారా' అంటు ఫ్యాన్స్ అందరు 'పెద్ది'(Peddi)రాక కోసం రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. సాంగ్స్ ,ప్రమోషన్స్ చూస్తుంటే చరణ్ ని దర్శకుడు బుచ్చిబాబు(Buchi babu)ఒక రేంజ్ లో చూపించాడనే విషయం క్లియర్ కట్ గా అర్ధమవుతుంది. 'ఉప్పెన' తర్వాత నాలుగు సంవత్సరాల పాటు మరో చిత్రం కోసం డైవర్ట్ అవ్వకుండా పెద్ది కోసమే కాచుకొని కూర్చున్నాడు. దీన్ని బట్టి చరణ్(Ram Charan)కి హిట్ ఇవ్వాలనే తన 'కసి'ని అర్ధం చేసుకోవచ్చు. మరి అంతటి పట్టుదలతో ఉన్న బుచ్చిబాబు రీసెంట్ గా చరణ్ తో మరో అవకాశం ఇవ్వండని అడగటం టూ డే టాక్ ఆఫ్ ది వర్డ్ గా నిలిచింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. రెండు రోజుల క్రితం ప్రతిష్టాత్మకమైన 'ఎస్కైర్ మ్యాగజైన్' చరణ్ పిక్ ని తమ ముఖచిత్రంగా ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ సందర్భగా నిన్న చరణ్ సదరు మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. చరణ్ స్టైలిస్ట్ లుక్ లో ఉన్న ఇంటర్వ్యూ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వీడియోపై బుచ్చిబాబు స్పందిస్తు 'సార్ మరో అవకాశం ఇవ్వండనే కామెంట్ చేసాడు.  also read: Ntr: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే! మీరు ఇదే అనుకున్నారా! మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా.. మళ్ళీ మీ ఇద్దరి కాంబోలో మూవీ తెరకెక్కితే అంతకంటే అదృష్టమా చెప్పండని కామెంట్స్ తో సోషల్ మీడియాకి సరికొత్త ఎనర్జీ తీసుకొస్తున్నారు.   పనిలో పనిగా పలానా జోనర్స్ లో చెయ్యమని సలహాలు ఇవ్వడం కూడా స్టార్ట్ చేసారు. మరి తధాస్తు దేవతులు వాళ్ళ కామెంట్స్ కి తధాస్తు చెప్పారేమో చూడాలి. ఏప్రిల్ 30 నుంచి పెద్ది దూరం జరిగినట్టుగా టాక్. ఏప్రిల్ మిడిల్ లోకి వచ్చినా ఇంతవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడం దూరం అనే మాటకి బలాన్ని ఇస్తున్నాయి.    
- లెజెండరీ సింగర్ 'ఆశా భోంస్లే' మరణం - వివాదంలో చిక్కుకున్న పాక్ మీడియా - 'జియో న్యూస్'ను ప్రభుత్వం బ్యాన్ చేయనుందా? భారతీయ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన లెజెండరీ సింగర్ 'ఆశా భోంస్లే' (Asha Bhosle) మరణ వార్త పాకిస్థాన్‌లోనూ పెను సంచలనంగా మారింది. ఈ వార్తను కవర్ చేసే క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ 'జియో న్యూస్' (Geo News) తీవ్ర వివాదంలో చిక్కుకుంది. అసత్య ప్రచారం చేయడమే కాకుండా, దేశ నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు ఛానెల్‌పై కఠిన చర్యలకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. అసలేం జరిగింది? గత శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆశా భోంస్లేను కుటుంబ సభ్యులు ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆమె ఆదివారం కన్నుమూశారు. సోమవారం ఆమె అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అయితే, ఆమె ఆసుపత్రిలో చేరిన వెంటనే, ఆమె మరణించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేశాయి. ఈ పుకార్లను నిజమని నమ్మిన పాకిస్థాన్ మీడియా సంస్థ 'జియో న్యూస్', ఆశా భోంస్లే మరణించారంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. నిబంధనల ఉల్లంఘన.. భారతీయ కంటెంట్ ప్రసారం పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) నిబంధనల ప్రకారం.. పాక్ మీడియా ఛానెళ్లలో భారతీయ కంటెంట్, ముఖ్యంగా సినిమా క్లిప్ లు, పాటలను ప్రసారం చేయడంపై నిషేధం ఉంది. కానీ, ఆశా భోంస్లేకు నివాళులర్పించే క్రమంలో జియో న్యూస్ ఆమె పాడిన సూపర్ హిట్ పాటలను, భారతీయ సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను ప్లే చేసింది. ఇది పాక్ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. పెమ్రా ఆగ్రహం - షోకాజ్ నోటీసులు తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, భారతీయ వీడియోలను ప్రదర్శించడంపై 'పెమ్రా' తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ జియో న్యూస్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా సరైన సమాధానం ఇవ్వకపోతే ఛానెల్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. సమర్థించుకున్న జియో న్యూస్ ఈ నోటీసులపై జియో న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అజార్ అబ్బాస్ స్పందిస్తూ.. ఒక గొప్ప కళాకారిణి మరణించినప్పుడు ఆమె సాధించిన విజయాలను, ఆమె పాడిన పాటలను స్మరించుకోవడం కనీస ధర్మమని పేర్కొన్నారు. కళకు సరిహద్దులు ఉండవని, ఆమె కృషిని కీర్తించడమే తమ ఉద్దేశమని వారు వాదిస్తున్నారు. ఏదేమైనా, ఈ ఘటన ఇప్పుడు ఇరు దేశాల మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  
- ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో విష్ణుప్రియ భారీ సంపాదన! - అబ్బాయిల వీక్‌నెస్‌ను ఆసరాగా చేసుకుందంటూ విమర్శలు! సోషల్ మీడియా కేవలం వినోదానికి మాత్రమే కాకుండా, కొందరు సెలబ్రిటీలకు ఒక బలమైన ఆదాయ వనరుగా మారింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా వచ్చిన ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్ ద్వారా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు భారీగా సంపాదిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న వారిలో ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) కూడా ఉన్నారు.  అసభ్యకరమైన ఫోటోలతో యూత్ ని చెడగొడుతుందంటూ ఇటీవల ఆమెపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఆదాయం హాట్ టాపిక్ గా మారింది. నెలకు రూ.11 లక్షలు! విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా నెలకు సుమారు రూ. 10 లక్షల నుండి రూ. 11 లక్షల వరకు సంపాదింస్తున్నట్లు తెలుస్తోంది. తన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోలు చూడాలనుకునే వారి కోసం ఆమె నెలకు రూ. 390 నుంచి రూ. 399 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు సుమారు 2700 నుండి 3000 మంది పెయిడ్ సబ్స్క్రైబర్లు ఉన్నారని అంచనా. దీంతో రూ. 11 లక్షల వరకు సంపాదిస్తున్నారు. దీనికి అదనంగా బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా ఆమె భారీగానే ఆదాయాన్ని పొందుతున్నారు. పెరుగుతున్న విమర్శలు - పోలీసు ఫిర్యాదు! విష్ణుప్రియ సంపాదన ఒక ఎత్తు అయితే, ఆమె పోస్ట్ చేసే కంటెంట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అబ్బాయిల వీక్‌నెస్‌ను ఆసరాగా చేసుకుని.. అసభ్యకరమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (AISF) నేతలు ఆమెపై విజయవాడలోని సూర్యరావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేవలం డబ్బు కోసమే ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించడం సమాజానికి హానికరమని వారు పేర్కొన్నారు. సోషల్ మీడియా ట్రెండ్, వివాదాలు! గతంలో కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించిన గ్లామర్ ట్రీట్, ఇప్పుడు నేరుగా సోషల్ మీడియా ఖాతాల్లోకి వచ్చేసింది. విష్ణుప్రియ తన ఫిట్‌నెస్ వీడియోలు, గ్లామర్ ఫోటోషూట్‌లతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అయితే, సబ్‌స్క్రిప్షన్ పేరిట ఘాటు ఫొటోలతో డబ్బు సంపాదించడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని అంటుంటే, మరికొందరు సెలబ్రిటీగా బాధ్యత ఉండాలని సూచిస్తున్నారు. విష్ణుప్రియ చుట్టూ జరుగుతున్న ఈ వివాదం భవిష్యత్తులో సోషల్ మీడియా సబ్‌స్క్రిప్షన్లపై ఎలాంటి నియంత్రణలకు దారితీస్తుందో చూడాలి.   https://www.instagram.com/p/DW_dfH0FExT/
  -ఎన్టీఆర్ బర్త్ డే మే 20 న టైటిల్ అనౌన్స్ మెంట్  -అప్డేట్స్ కోసమైతే ఫ్యాన్స్ ఎదురుచూపులు  -ఇంతకీ ఆ టైటిల్ ఇదేనా! సినీ సర్కిల్స్ లో ప్రెజెంట్ అత్యంత విలువైన, అమూల్యమైన న్యూస్ లో ఎన్టీఆర్(Ntr),త్రివిక్రమ్(Trivikram)కాంబో ఒకటి. ఈ కాంబోలో తెరకెక్కబోతున్న శివ,పార్వతుల పుత్రుడు కుమారస్వామి అలియాస్ సుబ్రహ్మణ్యుడు, అలియాస్ షణ్ముఖుడు, కార్తికేయుడి కథ ఏ విధంగా ఉండబోతోందనే ఎగ్జైట్మెంట్  రోజు రోజుకి అభిమానుల్లో, మూవీ లవర్స్ లో టన్నుల కొద్దీ పెరుగుతూనే ఉంది. వాళ్ళందరి ఎగ్జైట్మెంట్ ని మరింత పెంచేలా విత్ ఇన్ షార్ట్ డేస్ లో ఒక విలువైన సమాచారం రాబోతుందనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో మనం కూడా చూసేద్దాం. ఎన్టీఆర్ బర్త్ డే మే 20 న అనే విషయం తెలిసిందే. ఆ రోజు టైటిల్ ని ప్రకటించబోతున్నట్టుగా టాక్. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే 'షణ్ముఖుడు'(Shanmukhudu). అవును ఈ టైటిల్ నే మేకర్స్  రిజిస్టర్ చేయించారని ఫిలిం సర్కిల్స్ కోడై కూస్తుంది. సోషల్ మీడియాలోకూడా బాగానే వైరల్ అవుతున్న షణ్ముఖుడు టైటిల్ తో ఫ్యాన్స్ అయితే నిమిషాల్లోనే డిజిటల్ క్రియేటర్స్ గా మారి ఎన్టీఆర్ రూపుకి షణ్ముఖుడు టైటిల్ ని ఫిక్స్ చేసి షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తిగా కంప్లీట్ అయ్యాకే త్రివిక్రమ్ తో జాయిన్ అవుతాడు. త్రివిక్రమ్ కూడా వెంకీ గౌడ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ మూవీ పనులు స్టార్ట్ చేస్తాడు. also read: Vishnupriya: విష్ణుప్రియ కొత్త వీడియో వైరల్.. దేవుడిచ్చిన బాడీ వాళ్ళ కోసమే!  పురాణాల, ఇతిహాసాల నేపథ్యంలో మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుండగా, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ పై   రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. గతంలో ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన 'అరవింద సమేత' తెలుగు సినిమా చరిత్రలో ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే.         
-విష్ణుప్రియపై కేసు నడుస్తున్న విషయం తెలిసిందే  -మరి తను ఏం చెప్తుంది -మళ్ళీ కొత్త వీడియో వైరల్  -చివరకి ఏం తేలనుంది  ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ(Vishnu priya)వ్యవహారం ఇప్పుడు సినీ సర్కిల్స్ తో పాటు రెండు తెలుగు రాష్టాల్లో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలని షేర్ చేస్తూ, సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బు వసూలు చేస్తోందని,తన ఇన్‌స్టా అకౌంట్‌ని బ్లాక్ చేసి , వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని ఏపికి చెందిన ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకి  ఫిర్యాదు చెయ్యడమే ప్రధాన కారణం. దీంతో ప్రస్తుతం  ఆమెపై ఎంక్వైరీ నడుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో విష్ణుప్రియ తన  బాడీపై చేసిన కామెంట్స్‌కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఒక యాంకర్ విష్ణు ప్రియతో చాలా ట్రెడిషనల్‌గా, మంచి తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్నారు. కానీ మీ పోస్ట్‌లు మాత్రం చాలా హాట్‌గా, బోల్డ్‌గా, అబ్బాయిలని రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి కదా, మీ కాస్ట్యూమ్స్ కూడా అదే విధంగా ఉంటున్నాయని అడిగింది. విష్ణు ప్రియ మాట్లాడుతు నేను మోడలింగ్ చేస్తాను.దీంతో ఫోటోషూట్ చేయాల్సి ఉంటుంది. అందుకు నా పోర్ట్‌ఫోలియో రెడీగా ఉండాలి. అందుకే దేవుడిచ్చిన బాడీని ఔట్‌ఫిట్స్‌తో, నేను ఎంతవరకు కంఫర్టబుల్‌గా ఉంటానో అంతవరకు చేస్తు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడం కోసం ఉపయోగిస్తున్నాను. ఒక టెంప్లేట్‌లాగా కూడా   ఉపయోగిస్తున్నాను. Also read: Rajinikanth: మళ్ళీ దర్శకుడు మారాడా! ఏం జరుగుతుంది అసలు  అదంతా నేను చేసే వర్క్‌లో భాగం మాత్రమే. నిజ జీవితంలో నేను చాలా ట్రెడిషనల్‌గానే ఉండటానికి ఇష్టపడతాను. ట్రెడిషనల్‌గా రెడీ అవ్వడం అంటే మళ్ళీ ఆల్మోస్ట్ అబ్బాయిలాగే ఒక ప్యాంటు, షర్టు వేసుకుంటాను.మరీ 'గర్లీ' గా ఉండటం ఇష్టం ఉండదు. రియల్ గా  స్లీవ్‌లెస్, స్ట్రాప్‌లెస్ డ్రెస్సులు వేసుకోను. నాలోని ఆ సైడ్ కేవలం పని కోసమే స్విచ్ ఆన్ అవుతుంది. పని అయిపోయాక మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రియల్ లైఫ్‌లో నేను మీతో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఉంటానని విష్ణుప్రియ మాట్లాడింది. మరి ఆమె చెప్పిన మాటల తాలూకు ప్రెజెంట్ వీడియోనో కాదో గాని ప్రెజెంట్ బాగానే వైరల్ అవుతుంది.           
  -కమల్ నిర్మాతగా రజినీ 173 స్టార్ట్ అయిన విషయం తెలిసిందే  -సుందర్ నుంచి శిబి చక్రవర్తి చేతికి  -ఇప్పుడు మరో దర్శకుడు  -ఎందుకు ఇలా ఎన్ని పనుల్లో ఉన్నా డైలీ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)కి సంబంధించిన కొత్త సినిమా అప్డేట్ గురించి సెర్చ్ చెయ్యడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఏడు పదుల వయసులోను ఇండియన్ సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టే పనిలో బిజీగా ఉన్న రజినీకి ఆ మాత్రం సినీ సెల్యూట్ చేయని వాళ్ళు అభిమాని, మూవీ లవర్స్ నే కాదు. ఇప్పుడు వాళ్ళందరిలో రజిని న్యూస్ ఒకటి ఉదయాన్నే సినీ చర్చలు చేసే స్థాయికి దారి తీసింది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. కూలీతో హిట్ ని అందుకున్న తర్వాత రజినీ లోకనాయకుడు కమల్ హాసన్(Kamalhaasan)నిర్మాతగా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరి ఆలోచనల్లో కూడా పురుడు పోసుకొని కాంబో కావడంతో అంచనాలకి కొలమానాలు లేకుండా పోయాయి. తొలుత ఈ సినిమాకి రజినీకి 'అరుణాచలం' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సుందర్(Sundhar)ని ఎంపిక చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల సుందర్ తనంతట తానుగా తప్పుకున్నాడు. నెక్స్ట్ సిబి చక్రవర్తి(Sibi Chakravarthi)ని ఎంపిక చేసారు. శివకార్తికేయన్ కి 'డాన్' వంటి బిగ్ హిట్ ని అందించిన దర్శకుడు కావడంతో రజినీనీ ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఆసక్తి ఏర్పడటంతో పాటు ప్రాజెక్ట్ కి నయా క్రేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో అశ్వత్ మారిముత్తు(Ashwath Marimuthu)చేరినట్టుగా తమిళ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఫ్రెష్ టాక్.  ఇప్పుడు ఈ న్యూస్ రజినీ ఫ్యాన్స్ ఆలోచనలకి పదును పెడుతుంది. ఎందుకు ఇలా దర్శకుడిని మారుస్తున్నారు, అందుకు గల కారణాలేంటి అనేవి ట్రేడ్ వర్గాలలో సైతం  చర్చకి దారితీస్తున్నాయి. అశ్వత్ మారి ముత్తు నుంచి ఇప్పటి వరకు రెండు చిత్రాలు వచ్చాయి. 2022 లో వెంకటేష్, విశ్వక్ సేన్ తో 'ఓరి దేవుడా' .2025 లో ప్రదీప్ రంగనాధన్, అనుపమ పరమేశ్వరన్ నుంచి వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. టేకింగ్ పరంగా ఈ రెండు చిత్రాలు సూపర్ గా ఉంటాయి. ఏది ఏమైనా సంచలన కాంబో, ఇప్పుడు దర్శకత్వ మార్పుల వార్తలతో కూడా సంచలనంగా మారింది. రజినీ చేస్తున్న 173 వ మూవీ. రజినీ, కమల్ లు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో హీరోలుగా కలిసి ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టి స్టారర్ గా తన హవా స్టిల్ చాటుతూనే ఉంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్  లు అయితే బయటకు బాగా జాలీగా ఉంటూ, అందరిలో కలిసిపోతూ.. ఎక్కడైనా సరే ఇట్టే సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇంట్రోవర్ట్ లు అలా కాదు.. వారు ఎవరి ముందూ ఏమీ ఎక్కువ మాట్లాడలేరు, కనీసం కావలసిన వస్తువులు,  అవసరమైన విషయాల దగ్గర కూడా వారు మాట్లాడలేకపోవడం వల్ల నష్టపోతూ ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ కారణంగా ఇంట్రోవర్ట్ లను చాలా కామెడీ చేస్తుంటారు. వారు సిగ్గుపడుతూ ఉంటారని, మొహమాటం ఎక్కువని కూడా ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. నాణేనికి మరొక వైపు కూడా ఉంటుంది. అదే ఇంట్రోవర్ట్ లలో ఉండే బలం.  వారి వ్యక్తిత్వమే వారికి పెద్ద బలం అని చాలామంది కూడా అంటుంటారు. ఇంతకీ.. ఇంట్రోవర్ట్ లలో ఉండే బలాలు ఏంటో తెలుసుకుంటే.. ఒంటరితనం.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు పునరుత్తేజం పొందుతారు. వారికి జనాల మధ్యలో ఉండటం అనే విషయం  త్వరగా విసుగు తెప్పిస్తుంది. అయితే ఇలా ఒంటరిగా ఎక్కువ గడపడం వల్ల వారికి వారి మీద నమ్మకం, వారి నిర్ణయాల పట్ల నమ్మకం, తమ వ్యక్తిత్వం పట్ల దృఢంగా ఉంటారు. లోతైన మాటలు.. ఇంట్రోవర్ట్ లు  చిల్లర మాటల కంటే అర్థవంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే పనిగా ఏదో ఒకటి మాట్లాడటం అనే దాని కంటే.. అవసరమైనప్పుడు అవసరమైన విషయాలు మాట్లాడటానికే వారు ఆసక్తి చూపిస్తారు. అతి ఆలోచనలు.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా గడపడం ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు ,  నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. తక్కువే.. కానీ బలమైన స్నేహాలు.. ఇంట్రోవర్ట్ లకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారి లిస్ట్ లో చాలా కొద్దిమంది మాత్రమే స్నేహితులు ఉంటారు.  కానీ ఆ కొద్ది మంది చాలా మంచి స్నేహితులై ఉంటారు.  వారి స్నేహం కూడా చాలా బలంగా ఉంటుంది. వారు పెద్దగా మాట్లాడరని అంటుంటారు.. కానీ వారి మనసుకు ఎవరైనా దగ్గరైనా,  ఎదుటి వారి వ్యక్తిత్వం వారికి నచ్చినా.. వారు బాగా మాట్లాడతారు. వినడానికి ప్రాధాన్యత.. ఎక్స్ట్రోవర్ట్ లు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటే.. ఇంట్రోవర్ట్ లు మాత్రం ఎక్కువగా వినడానికే ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.  మౌనంగా ఉంటూ ఎదుటివారి మాటలను, వారి వ్యక్తిత్వాన్ని గమనించడానికి వీరు ఇష్టపడతారు.  వీరిలో పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.                                 *రూపశ్రీ.
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి.  ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, గౌరవంతో , ఉత్సాహంతో జరుపుకోవడం కొనసాగుతుంది. భారతదేశ సామాజిక నిర్మాణాన్ని మార్చడంలో , సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి వాటిని బలోపేతం చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు అందడంలో అంబేద్కర్ చేసిన కృషి చాలా పెద్ది.  అంబేద్కర్ జయంతి సందర్బంగా ఒక్కసారి అంబేద్కర్ గారి జీవితం గురించి గుర్తు చేసుకుంటే.. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో జన్మించారు. ఆయన తన జీవితాంతం సమాజంలో ప్రబలంగా ఉన్న అంటరానితనం, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. అంబేద్కర్ లక్షలాది మందిలో విద్య, హక్కుల పట్ల చైతన్యం కలిగించారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి, దేశానికి ప్రజాస్వామ్య, సమానత్వ వ్యవస్థను అందించారు. అంబేద్కర్ గురించి ఆసక్తికరమైన విషయాలు.. రాజ్యాంగ నిర్మాత.. భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని వ్యక్తం చేసేది భారత   రాజ్యాంగమే..  ఈ బారత రాజ్యాంగ  ప్రధాన రూపశిల్పిగా డాక్టర్ అంబేద్కర్ పరిగణించబడతారు. ఆయన రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా , ప్రధాన రూపశిల్పిగా పిలుస్తారు. విద్యావంతుడు.. అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత విద్యను అభ్యసించారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ మొత్తం 32 డిగ్రీలు పొందారు. ఆయన అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకరు. ఆయన బి.ఏ, ఎం.ఏ, ఎం.ఎస్.సి, పి.హెచ్.డి, డి.ఎస్.సి, ఎల్.ఎల్.డి, మరియు బారిస్టర్ ఎట్ లా వంటి ప్రముఖ డిగ్రీలను పొందారు.  అంతేకాదు.. తొమ్మిది భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 64 సబ్జెక్ట్స్ లో  నిపుణులు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొదటి  న్యాయశాఖ మంత్రి అయ్యారు. సామాజిక సంస్కర్త.. ఆయన తన జీవితాంతం అంటరానితనం, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడి, సమానత్వాన్ని బోధించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి బాబా సాహెబ్ మహాద్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అంటరానివారికి ప్రభుత్వ చెరువుల నుండి నీరు తోడుకునే హక్కు, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం ఆయన ప్రచారం చేశారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా, ఆయన మహిళల విడాకుల , ఆస్తి హక్కులను సాధించడానికి ప్రయత్నించారు. భారతరత్న..  1990లో అంబేద్కర్ గారి మరణానంతరం భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ఈ పురస్కారాన్ని ఆయన సతీమణి సవితా అంబేద్కర్ కు అందజేశారు. సత్యాగ్రహి.. నీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక సత్యాగ్రహి అంబేద్కర్ గారు మాత్రమే. న్యాయ శాఖ మంత్రి..  అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.                            *రూపశ్రీ.  
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని పాటల పల్లకిలో కోయిలలా ప్రయాణిస్తూ వచ్చింది. కానీ సంగీత ప్రపంచాన్ని విషాదం కమ్మేసింది.  ఆమె గాత్రానికి ఇక మౌనంగా ఉండిపోమని విధి శాసించిందేమో.. ఆమె పూర్తీగా తన శ్వాసనే వదిలేసింది.  ప్రముఖ గాయని ఆశా భోస్లే మరణం ఇప్పుడు భారతదేశాన్ని, ప్రపంచాన్ని కూడా   విషాదంలోకి నెట్టివేసింది. వైవాహిక జీవితంలో విషాదం నుండి,  కూతురిని కోల్పోవడం.. ఆమె జీవితంలో ఎన్నెన్నో విషాదాలు కూడా ఉన్నాయి,  ఆమె సాధించిన ఘనతలు ఉన్నాయి.   ఆశా భోస్లే గురించి చాలా మందికి తెలియని విషయాల గురించి తెలుసుకుంటే.. ఆశాభోస్లే ప్రస్తుత వయసు 92 సంవత్సరాలు.. శనివారం ఆమె గుండెపోటుకు గురవడంతో ఆసుపత్రిలో చేరిందని సమాచారం.  ఆయాసం ఎక్కువ కావడం,  ఛాతీ ఇన్పెక్షన్ కారణంగా ఆమె మరణించిందని సోషల్ మీడియా వార్తల సారాంశం. బాలీవుడ్‌లో పెద్ద బ్రేక్ రాకముందు, ఆశా భోస్లే తన 10 ఏళ్ల చిన్న వయసులోనే సినిమాల కోసం మరాఠీ పాటలు పాడుతూ తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారట. గాయనిగా ఆమె ప్రయాణం అక్షరాలా 80 ఏళ్లకు పైమాటే.. ఆశా బోస్లే ను ముద్దుగా ఆశా తాయ్ అని పిలుచుకుంటారు.  ఆమె రష్యన్, మలయ్ బాషలతో సహా  20 కి పైగా భాషలలో 12వేలకు పైగా పాటలు పాడారు. ఇలా ఇన్ని పాటలు పాడిన నేపథ్య గాయనిగా,  అత్యధిక స్టూడియో ట్రాక్ లను రికార్డ్ చేసినందుకు  గిన్నిస్ వర్డ్ రికార్డ్ లో కూడా ఆమె స్థానం సంపాదించారు. 16 ఏళ్ల వయసులో ఆశా బోస్లే  1949లో తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తనకంటే రెట్టింపు వయసున్న 31ఏళ్ల గణప్రతాప్ భోస్లే తో పారిపోయి వివాహం చేసుకున్నారు.  వీరికి హేమంత్,  వర్ష,  ఆనంద్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆశా, గణ ప్రతాప్ 1960లో విడిపోయారు. 1980లో ఆశా బోస్లే తనకంటే ఆరు సంవత్సరాల చిన్న వాడైన ప్రఖ్యాత సంగీత స్వరకర్త ఆర్.డి బర్మన్ ను వివాహం చేసుకున్నారు.  ఆయనను ముద్దుగా పంచమ్ దా అని పిలిచేవారు. వీరిద్దరూ కలిసి దమ్ మారో దమ్.. పియా తు అబ్ తో ఆజా వంటి ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్ లను అందించారు. కొన్ని వార్తా సమాచారాల ప్రకారం ఆశా కూతురు  వర్ష డిప్రెషన్ తో బాధపడుతూ 56 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆమె చిన్న కుమారుడు హెమంత్ 2015లో క్యాన్సర్ తో మరణించాడు. ఆశా ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కూడా, ఆమె పలు దేశాలలో “ఆశాస్” అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను  నడుపుతున్నారు. గానంపై ఉన్న అభిరుచితో పాటు, ఆశా భోస్లే తన వంట నైపుణ్యాలకు కూడా ప్రసిద్ధి చెందారు. ఆమె దుబాయ్, కువైట్, అబుదాబి, దోహా , బహ్రెయిన్ వంటి నగరాల్లో 'ఆశాస్' అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను  నడుపుతున్నారు. ఆశా గారెకి శాస్త్రీయ సంగీతంలో చాలా లోతైన పరిజ్ఞానం ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్‌తో కలిసి 'లెగసీ' అనే ఆల్బమ్‌లో పనిచేసినందుకు ఆమె గ్రామీ నామినేషన్ గెలుచుకుంది. పాప్ , ఫ్యూజన్ ప్రధాన స్రవంతిగా మారడానికి చాలా కాలం ముందే, వాటితో ప్రయోగాలు చేసిన తొలి భారతీయ గాయకులలో ఆమె ఒకరు. ఆశా భోస్లే కూడా నటనారంగంలోకి అడుగుపెట్టి, 2013లో 'మై' అనే మరాఠీ చిత్రంలో తల్లి పాత్రతో రంగప్రవేశం చేశారు. తన విశిష్టమైన కెరీర్‌లో ఆశా భోస్లే అనేక గౌరవాలను అందుకున్నారు. 2000లో భారత ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయగా, 2008లో పద్మవిభూషణ్‌ను ప్రదానం చేసింది. ఆమె జీవితం క్రమశిక్షణ, సాహసోపేతమైన నిర్ణయాలు, నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేయడం వంటి వాటితో ఆమె జీవితం నిండి ఉంది.                              *రూపశ్రీ.
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, 'ముద్రలు' కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే 'ముద్ర' అంటారు. ఈ వీడియోలో TeluguOne Health మనకు కొన్ని ముఖ్యమైన యోగా ముద్రలను మరియు వాటి విశిష్టతను పరిచయం చేస్తోంది: ముఖ్యమైన ముద్రలు - ఉపయోగాలు: జ్ఞాన ముద్ర: జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. వాయు ముద్ర: గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు మరియు పక్షవాతం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శూన్య ముద్ర: చెవి సంబంధిత సమస్యలు మరియు ఎముకల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. పృథ్వీ ముద్ర: శరీరంలో విటమిన్ల లోపాన్ని సరిచేయడానికి, అలసటను తగ్గించి ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సూర్య ముద్ర: బరువు తగ్గాలనుకునే వారికి మరియు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది చక్కటి పరిష్కారం. వరుణ ముద్ర: చర్మ సౌందర్యానికి, రక్త శుద్ధికి మరియు శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. వీటిని ఎలా వేయాలి? ఈ ముద్రలను రోజుకు కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఏ ముద్ర ఏ వేలితో వేయాలి మరియు అది చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన వీడియోల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది. అయితే, ప్రస్తుతం మనం తీసుకునే జంక్ ఫుడ్, ఆల్కహాల్, అధిక ఒత్తిడి మరియు సరైన వ్యాయామం లేకపోవడం వల్ల లివర్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. చాలా సందర్భాల్లో లివర్ 70% నుండి 80% వరకు దెబ్బతినే వరకు మనకు ఎటువంటి బయటి లక్షణాలు కనిపించవు. అందుకే దీన్ని 'సైలెంట్ కిల్లర్' అని కూడా అంటారు. అయితే, మన శరీరం ఇచ్చే కొన్ని ముందస్తు హెచ్చరికలను గమనిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. ఈ ప్రత్యేక వీడియోలో, ప్రముఖ నాడిపతి (Nadipathy) నిపుణులు డాక్టర్ పెన్మెత్స కృష్ణమ్ రాజు (Dr. P Krishnam Raju) గారు లివర్ ఆరోగ్యం గురించి, అది దెబ్బతిన్నప్పుడు శరీరం చూపే లక్షణాల గురించి లోతుగా వివరించారు. ఈ Video లింక్‌ను క్లిక్ చేసి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ప్రధానాంశాలు: అలసట మరియు నీరసం:- ఎటువంటి పని చేయకపోయినా విపరీతమైన నీరసంగా అనిపించడం లివర్ సమస్యకు ప్రాథమిక సంకేతమా? చర్మం మరియు కళ్ళ రంగు:- కళ్లు పసుపు రంగులోకి మారడం (Jaundice) మరియు చర్మంపై దురదలు రావడం వెనుక ఉన్న అసలు కారణాలు. ఆకలి మందగించడం:- ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు వచ్చేలా ఉండటం దేనికి సంకేతం? పొత్తికడుపులో మార్పులు:- కడుపు ఉబ్బరంగా ఉండటం లేదా కుడి వైపున నొప్పి రావడం ఎందుకు జరుగుతుంది? నాడిపతి చికిత్స:- మందులు లేకుండా కేవలం నాడి నిదానం మరియు ప్రకృతి సిద్ధమైన పద్ధతులతో లివర్ సమస్యలను ఎలా నయం చేసుకోవచ్చు? మీరు లేదా మీ కుటుంబ సభ్యులు తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటే, ఈ వీడియో తప్పక చూడండి. కాలేయాన్ని సహజ పద్ధతుల్లో ఎలా శుద్ధి చేసుకోవాలో డాక్టర్ గారి సూచనలను పాటించండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు తెలుసుకోవడానికి మా  TeluguOne Health Youtube Channel సందర్శించండి! మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.