తెలంగాణలో పంచాయతీల పంచాయితీ జోరుగా ఉంది. స్థానిక ఎన్నికల సందర్బంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో రాజకీయ వేడి పెచ్చరిల్లింది. పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలు జరగకపోయినా.. పొలిటికల్ యాక్టివిటీ మాత్రం రసకందాయంలో పడింది. అదలా ఉంచితే.. తెలంగాణలో   పంచాయతీ ఎన్నికల పంచాయితీ పలు గ్రామాలలో ఉద్రిక్తతలకు, మరికొన్ని గ్రామాలలో విషాదాలకూ దారి తీశాయి.  నామినేషన్ల విషయంలో తలెత్తినవిభేదాలతో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, కొన్ని కుటుంబాలలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి.  అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై అంటే సై అంటున్న ఉదంతాలూ  ఉన్నాయి.  నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు. ఈ విషయమై ఇంట్లో  ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన  తల్లి మందుల లక్ష్మమ్మ (40) ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. అయితే ఆమె కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త చెబుతున్నాడు. ఇదే విషయాన్ని ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలోవార్డు మెంబర్‌గా నామినేషన్ వేసినందుకు భర్త మంద లించడంతో లక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.   
ఏపీ టు తెలంగాణ, అమలాపురం టు అమెరికా, ఆమాటకొస్తే ఈ భూమ్యాకాశాల మధ్య ఎక్కడి నుంచి ఎందాకైనా.. విషయం ఏదైనా.. వాస్తవాలను నిగ్గు తేల్చే నిఖార్సయిన వేదిక.. వాస్తవ వేదిక!  జమీన్ రైతు, తెలుగు వన్  సంయుక్త నిర్వహణలో.. జరుగుతోందీ చర్చా వేదిక. ఈ వేదిక ద్వారా అంశమేదైనా... సమాజ హితకరమైన వాడీ వేడీ చర్చ జరుగుతోంది.  జమీన్ రైతు 95 ఏళ్ల నాటి సుదీర్ఘ జర్నలిస్టిక్ అనుభవం గల పత్రిక. ప్రస్తుతం మార్కెట్లో చెలామణిలో ఉన్న ఏ పత్రికకూ ఈ స్థాయిలో అనుభవం లేదన్న విషయం నాటి పాఠకులకు సుపరిచితమే. నేటి కాలానికి తగ్గట్టుగా తమ వాణి వినిపిస్తున్న పత్రిక జమీన్ రైతు. ఇక తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో తెలుగు వారి మధ్య వారధిగా.. వారి వారి అభిప్రాయాలకు గొంతుకగా, వేదికగా కొనసాగుతోంది. అలాంటి తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ..మధ్య ముఖా ముఖీ.. అది సమాజ హితానికి ఓ దిక్సూచి. మార్గనిర్దేశకత్వంలో సవ్యసాచి.  ప్రస్తుతం దేశంలో ఉన్న సుప్రసిద్ధ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయ యవనికపైకి దూసుకొచ్చిన వారే. అలాంటి విద్యార్ధులకు సంబంధించి ఉద్యమాలు ఎలాంటివి? అవిప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు కాలేజీ రాజకీయాల నుంచే రాజకీయాలను మొదలు పెట్టిన హుషారైన కుర్రకారుకూ నేటి యువతకూ గల తేడాలేంటి? వారి ఉడుకురక్తంతో కూడిన ఉద్యమం ఏమై పోయింది? అన్న అంశంపై రెండు భిన్న పార్శ్వాలు ఒకే వేదికపై నుంచి వినిపించే గొంతుక.. ప్రజాభిప్రాయ దీపికగా మారనుందనడంలో సందేహం లేదు. కాబట్టి విజ్ఞులైన పాఠక, ప్రేక్షకులందరూ వాస్తవ వేదిక సెకండ్ ఎడిషన్ గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం విడుదలవుతుంది … చూసి అభిప్రాయ వ్యక్తీకరణ చేయాలని ఆశిస్తూ..  మీ తెలుగు వన్, జమీన్ రైతు.
కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయాలలో ఇసుమంతైనా వెనుకాడకుండా ముందుకు అడుగులు వేస్తున్నది. అయితే వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది నాయకులు, ఎమ్మెల్యేలు వినా మిగిలిన వారంతా పెద్దగా ప్రజల మధ్యకు రావడం లేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం లేదు. ఇది ఎవరో ప్రత్యర్థులు చెబుతున్న మాట కాదు. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో పలు మార్లు చెప్పిన మాట. ఈ విషయంలో ఆయన తన అసంతృప్తిని ఇసుమంతైనా దాచుకోలేదు. బాహాటంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పద్ధతి మార్చుకోవాలని ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నాయ‌కులు పట్టనట్లు వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా గర్హించారు కూడా.  ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెంచేలా వ్య‌వ‌హ‌రించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు.  అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు. చంద్రబాబు చెప్పారు, ఇక తప్పదన్నట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఇలా శచ్చి అలా వెళ్లిపోతున్నారు. ప్రజలతో  మమేకం కావడం లేదు. అదేదో తమకు సంబంధించని ఓ ప్రభుత్వ కార్యక్రమంలా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓ స్పష్టమైన ఆదేశం జారీ చేశారు. అది సత్ఫలితాలను ఇచ్చింది. ఇంతకీ ఆ ఆదేశం ఏమిటంటే..  పింఛ‌న్లు పంపిణీ చేసే కార్య‌క్ర‌మంలో నాయ‌కులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఫొటోలు దిగి వాటిని పార్టీ కార్యాలయ వెబ్ సైట్ లో పోస్టు చేయాలి. కార్యక్రమం ప్రారంభం, ముగింపు ఇలా రెండు సమయాల్లోనూ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులుఫొటోలు దిగా వాటిని పార్టీ ఆఫీస్ వెబ్ సైట్ లో పోస్టు చేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇంత కాలం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తూతూ మంత్రంగా పాల్గొంటున్న వారూ, మొత్తానికే డుమ్మా కొట్టేస్తున్న వారూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీంతో సోమవారం (డిసెంబర్ 1)న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దాదాపు 90శాతం మంది పాల్గొన్నారు. కేవలం పాల్గొనడమే కాదు.. ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ప్రజలలో మమేకం అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు పార్టీ కార్యాలయ వెబ్ సైట్ లో పోస్టు చేశారు. దీంతో పార్టీ కార్యాలయ సిబ్బంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న వివరాలను గణాంకాలతో సహా చంద్రబాబుకు నివేదించారు. ఈ గణాంకాల ప్రకారం తాజాగా జరిగిన  ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ కార్యక్రమంలో  90 శాతం మంది నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు సంతోషం వ్యక్తం చేశారు. నేతలలో వచ్చిన మార్పు ను స్వాగతించారు. మిగిలిన పది శాతం మంది కూడా ముందుకు రావాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో వంద శాతం నాయకులు పాల్గొనాలనీ సూచించారు. 
ALSO ON TELUGUONE N E W S
  -ఫ్యాన్స్ ఆందోళన  -ఏం జరగబోతుంది -ఎందుకు ఎలా జరిగింది  -నిర్మాతలు ఏమంటున్నారు     పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2' (Akhanda 2)తో బాలయ్య(Balakrishna)చేసే శివ తాండవం చూడటానికి అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తు వస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులు ఈ రోజు ప్రదరించబోయే ప్రీమియర్స్ తో ఫలించబోతుండటంతో సుమారు మూడు రోజుల నుంచే థియేటర్స్ ని ముస్తాబు చేసి 'జై బాలయ్య' నినాదాలతో థియేటర్స్ పరిసర ప్రాంగణం మొత్తాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు. కానీ టెక్నీకల్ ఇష్యు వల్ల ఈ రోజు ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం లేకపోవడంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు.     దీంతో ఏపి, తెలంగాణ కి సంబంధించిన చాలా ఏరియాల్లో అభిమానులు ఆందోళనకి దిగినట్టుగా తెలుస్తుంది. సదరు ఆందోళనకి సంబంధించిన విజువల్స్ కూడా యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక అఖండ 2 లేట్ పై మేకర్స్ స్పందిస్తు తదుపరి కొద్ది గంటల్లో సమస్యలని పరిష్కరించగలం. ఓవర్సీస్ షో లకి  ఎలాంటి ఆలస్యం ఉండదు. ఇండియాలో షో లు  రేపటి నుండి ప్రారంభమవుతాయని తెలియజేశారు. దీంతో బాలయ్య శివ తాండవం రేపట్నుంచి ప్రారంభం కానుంది.   also read:  బెనిఫిట్ షో పడకపోవడానికి ప్రధాన కారణం ఇదే
Akhanda 2 makers have suddenly threw a bomb on fans of Nandamuri Balakrishna, stating that the premieres for the film stay canceled, one day before release. In Telangana, the show bookings did not start till 2 hours before premieres and now, the release for tomorrow, 5th December, also expected to be in doubt.  The rumors are rampant about the financial issues of the producers 14 Reels Plus Entertainment and even IVY Entertainments. The issues from old movies have all surfaced at the same time to push them into a whirlpool of problems. Now, the makers are positive that at a rapid pace, all things will be sorted.  Makers have stated that in two to three hours before midnight they would clear all the issues and start Overseas premieres as per schedule. They are ready to move mountains to make sure that the movie will release on time", comment inside sources.  To distributors and exhibitors, they have issued a clarification that movie will definitely release tomorrow. At this moment, they are rushing to close the last minute deals to make the release possible. Boyapati Srinu has directed the film and his combination with NBK has always delivered a huge blockbuster at the BO.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -బెనిఫిట్ షో ఎందుకు పడలేదు -అభిమానుల రియాక్షన్  -ఏం పర్లేదు  -రేపు శివతాండవం     గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరు ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ అఖండ 2(Akhanda 2). ఆల్రెడీ ప్రచార చిత్రాలతో పాటు,మూవీ క్రిటిక్స్ లో   ప్యూర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ కావడంతో సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య చేసే శివ తాండవం ఏ స్థాయిలో ఉంటుందో చూడటానికి అందరు ప్రీమియర్స్ చూడటానికి థియేటర్స్ కి  వెళ్లారు. కానీ ఈ  రోజు ప్రీమియర్స్ ప్రదర్శించడం  లేదని తెలియడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ షాక్ కి గురయ్యారు.     ఈ క్రమంలో ప్రీమియర్స్ పడకపోవడానికి ప్రధాన కారణం టెక్నికల్ ఇష్యు కారణం అని తెలుస్తుంది. రేపు అఖండ 2 ఎంతో గ్రాండ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. ఈ మేరకు చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.ఇక బెనిఫిట్ షోస్ ప్రదర్శించకపోవడం పై అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఈ రోజు బెనిఫిట్ షో పడకపోయినా బాలకృష చేసే శివతాండవం శుక్రవారం నాడు  స్క్రీన్ పై ఒక రేంజ్ లో చూస్తామని సినిమా సూపర్ డూపర్  హిట్ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.   also read:  అఖండ 2 ఫస్ట్ రివ్యూ ఇదే!    అఖండ 2 ప్రీమియర్స్ కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడంతో పాటు బెనిఫిట్ షో కి కూడా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.  
బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణల కాంబోలో తెరకెక్కిన అఖండ 2 సినిమాపై చిత్ర సీమతో పాటు బాలయ్య అభిమానులలోను, సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లతో పాటు ఒక సాంగ్  అఖండ 2పై భారీ అంచనాలను పెంచేశాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 5వ తేదీన  అఖండ 2 చిత్రం విడుదల కానుంది. అన్ని పెద్ద సినిమాల మాదిరిగానే అఖండ 2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు, ప్రీమియర్ షోలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేశాయి. సనాతన ధర్మం, శివతత్వం, అఘోరాల నేపథ్యంతో వస్తున్న అఖండ 2  ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసినట్లు చిత్రం బృందం ప్రకటించింది. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో  అఖండ 2  నిర్మించారు. కాగా ‘అఖండ 2’ మూవీ అసలు అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా? లేదా? అనే అనుమానాలు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళకి అలాగే 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళకి మునుపటి లావాదేవీలలో కొన్ని అప్పులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 90 కోట్లకు పైగా ఫైనాన్సియర్స్‌కి చెల్లించవలసి ఉన్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. ఈ రెండు సంస్థలు ఇదివరకు తీసిన సినిమాల బకాయిలు అధికమై ‘అఖండ 2’పైన ఆ భారం పడ్డట్లు గుసగుసలు. ఈ విషయాలు తేలేవరకు సినిమాను రిలీజ్ కూడా కష్టమే అనుకుంటున్నారు. బాలకృష్ణ బరిలోకి దిగి రాత్రిలోగా విషయాన్ని సధ్దుమణిగేలా చేస్తారని అనుకుంటున్నారు. ఇక ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి బాలయ్య ఫ్యాన్స్‌లో కంగారు నెలకొంది
Akhanda 2 starring God of Masses Nandamuri Balakrishna and directed by Boyapati Srinu, is facing issues with the release in the last minute. The makers have planned to repeat Pushpa 2 The Rule magic and they wanted to conduct premieres on the night before the release on 4th December before 5th December, release.  The makers have had to cancel the premieres in the last minute and they stated that they tried their best but couldn't make it. As per the inside reports, 14 Reels Plus have been facing financial issues and they have to settle the matters before the movie gets smooth release.  While they did try to an extent, the amounts are said to be so high that they are planning to release and then clear. But in the last minute, the issues have mounted huge and with burden being too high, they had to cancel the premieres and they did not even open bookings in Telangana state while AP, Karnataka bookings have opened three days, ago.  The reports suggest that it is hard for even the early morning shows and hence, the bookings are uncertain. The makers will clear late in the night about the morning and noon shows. We have to wait till the final confirmation from the makers. The issues have risen due to previous commitments of the producers, claim reports.  Nandamuri Balakrishna had been actively promoting the film in Hindi, Tamil markets touring to different cities. He had been active in Telugu promotions as well. But this kind of last minute hurdles will definitely bring down the enthusiasm of the movie among the viewers. Let's see how the Bala-Boya combination triumph these hurdles. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
గత ఏడాది డిసెంబర్‌ 4న 'పుష్ప2' చిత్రం ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన దుర్ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో భాస్కర్‌ అనే వ్యక్తి భార్య చనిపోగా, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడు శ్రీతేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అతనికి చికిత్స జరుగుతూనే ఉంది. చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చును అల్లు అర్జునే భరిస్తున్నారని తెలుస్తోంది.  ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌రాజు.. గురువారం శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ను కలిశారు. శ్రీతేజ్‌కు ఎలాంటి చికిత్స అందుతోంది, ఆర్థికంగా ఆ కుటుంబాన్ని అల్లు అర్జున్‌ ఎలా ఆదుకుంటున్నారు అనే విషయాల గురించి వెల్లడించారు. 'గత ఏడాది జరిగిన ఘటన గురించి అందరికీ తెలుసు. ఆ ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ రోజురోజుకీ కోలుకుంటున్నాడు. ఆ సమయంలో భాస్కర్‌ ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ ద్వారా రెండు కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేయించడం జరిగింది. దాని ద్వారా నెలనెలా వచ్చే ఇంట్రెస్ట్‌లో 75 వేల రూపాయల్ని భాస్కర్‌ ఫ్యామిలీ మెయిన్‌టెనెన్స్‌కి, బాబు ట్రీట్‌మెంట్‌కి ఉపయోగిస్తున్నారు. బ్యాలెన్స్‌ అమౌంట్‌తోపాటు ప్రతి ఏడాది ఆ డిపాజిట్‌కి వచ్చే ఇంట్రెస్ట్‌ వీరి ఫ్యామిలీకి వచ్చేలా ఏర్పాటు చేశాం.  బాబు బాగా రికవరీ అవుతున్నాడు. అది సంతోషాన్ని కలిగించే విషయం. భాస్కర్‌ ఫ్యామిలీకి 2 కోట్ల రూపాయలు ఇవ్వడంతోపాటు హాస్పిటల్‌కి సంబంధించి ఇప్పటివరకు అయిన ఖర్చు 70 లక్షల రూపాయలు కూడా అల్లు అర్జున్‌గారే పే చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ నుంచి, అరవింద్‌గారి నుంచి ఎక్స్‌ట్రా సపోర్ట్‌ కోసం నన్ను అడిగారు భాస్కర్‌. మరో ఆరు నెలలు ట్రీట్‌మెంట్‌ కంటిన్యూ చేస్తే మరింత బెటర్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని డాక్టర్స్‌ చెప్పారని భాస్కర్‌ అన్నారు. ఆరు నెలలు కాదు, సంవత్సరం అయినా అక్కడే ఉంచి ట్రీట్‌మెంట్‌ చేయించమని చెప్పాను. దాని గురించి నేను మాట్లాడతాను అని భాస్కర్‌కి ధైర్యం చెప్పాను' అన్నారు.  శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ మాట్లాడుతూ 'ఇన్సిడెంట్‌ జరిగిన రోజు మేం ఏదైతే సపోర్ట్‌ కోరుకున్నామో అది అల్లు అర్జున్‌గారి ద్వారా మా బాబుకి అందుతోంది. బాబు రికవరీ అవుతున్నాడు. మాకు సంతోషంగా ఉంది. అలాగే నేను అడిగిన ఎక్స్‌ట్రా సపోర్ట్‌ కూడా చేస్తామని చెప్పారు' అన్నారు. 
Pushpa 2: The Rise released exactly one year ago and at the premiere show, a stampede had occured in RTC X' roads. Allu Arjun had extended his apology to Bhaskar and his family, who lost his wife and his son Sree Tej had been in serious condition ever since. Now, few questions raised about financial help from the actor.  Producer Bunny Vas revealed that Dil Raju and other big people are looking into the matter and he cannot comment on it. Dil Raju met Bhaskar and his brother, and he released a video byte about the situation. He stated that he took Rs.2 crores from Allu Arjun and the actor even paid Rs.75 lakhs for hospital expenses.  Dil Raju further explained how the Rs.2 crores has been made into a corpus fund that will yield the family, Rs.75,000 per month and rest of the interest will add into the main corpus till Sree Tej recovers and matures. Recently, Bhaskar asked for more amount to cover the expenses of rehab monthly for his child.  The producer stated that he talked to Allu Arjun and Allu Aravind about the issue. Soon, a big amount will be provided to the family to cover these expenses as well. He stated that they are taking every possible step to help youngster Sree Tej to recover fully and they are taking committed steps towards it.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
        -జీవో ఏం చెప్తుంది -అభిమానులు హంగామా స్టార్ట్  -రేట్స్ ఇవే   గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Balakrishna)అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అఖండ 2(Akhanda 2) తెలంగాణ ఏరియాకి సంబంధించిన   బెనిఫిట్ షో, టికెట్ రేట్స్ వివరాలని తెలంగాణ ప్రభుత్వం అధికారకంగా నిర్ణయిస్తూ కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది.     తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో ప్రకారం రిలీజ్ కి ముందు రోజైన 4వ తారీకు న ప్రీమియర్ షో కి రాత్రి ఎనిమిది గంటలకి పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ రేటు 600 రూపాయిలాగా నిర్ణయించింది. అదే విధంగా రిలీజ్ రోజు నుంచి మూడు రోజులు పాటు టికెట్ రేట్స్ పై  మల్టీప్లెక్స్ 100 రూపాయలు, సింగిల్ థియేటర్ కి  50 రూపాయలు పెంచుకోవచ్చని కూడా సదరు జీవో లో పేర్కొంది.     aslo read:  అఖండ 2 ఫస్ట్ రివ్యూ ఇదే!      
Akhanda 2 starring God of Masses Nandamuri Balakrishna and directed by Boyapati Srinu, is the biggest release for Indian and Telugu Cinema along with Ranveer Singh's Dhurandhar. The movie has been promoting the greatness of Indian Sanatana Dharma and the makers wanted price hikes.  Andhra Pradesh Government has granted Rs.600/- for premiere ticket rates and Rs.100/- and Rs.75/- hikes for multiplexes and single screen rates, respectively. After a long delay, Telangana Government has granted hikes at similar level. Premiere ticket rates are fixed at Rs.600/- and Rs.100/-, Rs.50/- for multiplexes, single screens, respectively.  In few hours, bookings will open in Telangana state wide, mainly, in Hyderabad as most number of film fans have been waiting, since long. Currently, makers are promoting the film on cylinders blasting it into the orbit of cinema viewers to guarantee a huge opening.  As the movie is releasing, exactly, on the anniversary of Pushpa 2: The Rise release, the makers are hoping to repeat its success at Pan-India level. Samyuktha Menon, Aadi Pinisetty, Harshali Malhotra are playing other prominent roles in this action packed film. 14 Reels Plus is producing it.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఇటీవలికాలంలో పెద్ద హీరోల సినిమాల రిలీజ్‌కి ఏదో ఒక అడ్డంకి రావడం మనం చూస్తున్నాం. ఆర్థికపరమైన సమస్య కావచ్చు, సామాజిక పరమైన సమస్య కావచ్చు. ఆయా సినిమాల రిలీజ్‌ ముందు రోజు కొన్ని సంస్థలు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ లేటెస్ట్‌ సినిమా 'అఖండ2'కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందనే వార్తలు వస్తున్నాయి. సాక్షాత్తూ మద్రాస్‌ హైకోర్టు.. 'అఖండ2' రిలీజ్‌ని ఆపాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందని చెబుతున్నారు.  వివరాల్లోకి వెళితే.. 2021లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'అఖండ2' చిత్రాన్ని నిర్మించారు 14 రీల్స్‌ ప్లస్‌ అధినేతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఒకరోజు ముందుగానే 'అఖండ2' ప్రీమియర్స్‌ వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలకు ఒక భారీ షాక్‌ తగిలింది.  'అఖండ2' చిత్రం విడుదలను ఆపాలంటూ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తమకు 28 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు 14 రీల్స్‌ ప్లస్‌ అనే పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారని కోర్టుకు తెలిపారు. తమకు చెల్లించాల్సి బకాయిలు మొత్తం ఇచ్చేవరకు అఖండ2 చిత్రం రిలీజ్‌ని నిలిపివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన మద్రాస్‌ హైకోర్టు ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 'అఖండ2' చిత్రం విడుదలను ఆపెయ్యాలంటూ వార్తలు వచ్చినట్టు చెబుతున్నారు. మరి ఈ సమస్య నుంచి 'అఖండ2' నిర్మాతలు ఎలా బయటపడతారు, సినిమాను టైమ్‌కి రిలీజ్‌ చెయ్యగలరా? అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
జ్ఞాపకం అంటే జరిగిపోయిన ఒక సంఘటన తాలుకూ సందర్భాలు, మాటలు,  మనుషులు గుర్తుండిపోవడం.   ఇవి సంతోషం కలిగించేవి అయితే గుర్తు వచ్చిన ప్రతిసారీ సంతోషాన్నే కలిగిస్తాయి. కానీ.. అవి బాధపెట్టే విషయాలు అయితే మాత్రం వాటి ప్రభావం మామూలుగా ఉండదు. కొన్నిసార్లు గత సంఘటనలు,  జ్ఞాపకాలు హృదయంలో లోతైన గాయాన్ని మిగిల్చుతాయి. అలాంటి సమయాల్లో లోలోపలే నలిగిపోతాడు.  చాలా నరకం అనుభవిస్తాడు.  ఒంటరితనం ఫీలవుతాడు. కానీ  ఒంటరిగా అనిపించడం అంటే జీవితంలో చాలా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది.  దీన్నుండి బయటకు రావడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. అంగీకారం.. బాధాకరమైన జ్ఞాపకాల నుండి బయటపడటానికి వాటిని అణచివేయడం కంటే అంగీకరించడం చాలా ముఖ్యం. సత్యాన్ని అంగీకరించడం ముందుకు సాగడానికి మొదటి అడుగు. కాబట్టి జరిగినవి ఏవైనా సరే.. వాటిని అంగీకరించాలి.  ఒకరు మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా,  నష్టం కలిగినా.. ఇలా ఏదైనా సరే..  దాన్ని అంగీకరించి ముందుకు సాగాలి.  ఇలా చేస్తే జ్ఞాపకాలు బాధపెట్టవు. షేరింగ్.. జ్ఞాపకాలు బాధపెట్టినప్పుడు బాధను అందరితో పంచుకోవడం తప్పు. కుటుంబ సభ్యులు,  అర్థం చేసుకునే స్నేహితులు, లేదా కౌన్సిలర్ లతో జరిగింది చెప్పుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను విశ్లేషణ చేసుకుని ఆలోచించే సామర్థ్యం ఉండదు. అదే ఇలా అర్థం చేసుకోగలిగే వారు ఉంటే .. జరిగిన విషయం గురించి మంచి వివరణ, సలహా, ఊరట కలిగే విధంగా మాట్లాడటం వంటివి చేయగలుగుతారు. వ్యక్తీకరణ.. బాధను వ్యక్తీకరించడం కూడా ఒక కళే.. డైరీ రాయడం లేదా కళ-సృజనాత్మకత ద్వారా  భావాలను వ్యక్తపరచడం కూడా ఉపశమనం కలిగిస్తుంది. మనసులో ఉన్న భావాలను కాగితంపై పెట్టడం మంచి చికిత్స. అంతే కాదు.. బాధ నుండి బయటకు రావడానికి ఆ అక్షరాలే సహాయం చేస్తాయి. ధ్యానం, యోగ.. ధ్యానం,  యోగా సహాయం తీసుకోవడం కూడా జ్ఞాపకాల మిగుల్చే బాధ నుండి బయటకు రావడానికి సహాయపడుతుంది. ఇది మనస్సును ప్రశాంతపరచడమే కాకుండా వర్తమానంలో జీవించడం కూడా నేర్పుతుంది. బాధకు సమయం ఇవ్వవద్దు.. బిజీగా ఉండటం,  కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవడం,  ఏదో ఒక కొత్త పనిని చేయడం లేదా నేర్చుకోవడం  వలన జ్ఞాపకాల నుండి దూరం కావడానికి సహాయపడుతుంది.  కొత్త వాటిలో మునిగిపోయినప్పుడు బాధాకరమైన విషయాలు మసకబారుతాయి. అసలు వాటి గురించి ఆలోచించే అంత సమయం ఉండకుండా చూసుకోవాలి. జీవనశైలి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. బాగా తినడం, తగినంత నిద్రపోవడం,  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల  మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు.                                      *రూపశ్రీ.  
  మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..  రాజ్యాంగం ఈ దేశానికి కొన్ని నియమాలు, నిబంధనలు, షరతలు విధించింది. దేశ పౌరులకు కొన్ని హక్కులు, మరికొన్ని సరిహద్దు గీతలు గీసింది.  వీటి నుండి ఏ వ్యక్తి అయినా అతిక్రమించి ప్రవర్తించినా,  ఇతరులకు నష్టం కలిగించినా,  ఇతరులకు అన్యాయం చేసినా.. అందరికీ న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది.  ఈ న్యాయవ్యవస్థ నుండి ప్రజలకు న్యాయం సమకూర్చి పెట్టడానికి వారధులుగా నిలిచేవారే న్యాయవాదులు.  ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన న్యాయవాదుల దినోత్సవాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం సందర్బంగా జరుపుకుంటారు. ఈ సందర్బంగా సమాజంలో న్యాయవాదుల పాత్ర.. న్యాయ వ్యవస్థకు వారి సేవల గురించి తెలుసుకుంటే.. న్యాయానికి వారధులు.. ప్రతి వ్యక్తి  తనకు అన్యాయం జరుగుతోంది అంటే చట్ట బద్దంగా న్యాయాన్ని అర్థించాలంటే దానికి  న్యాయవాదుల సహాయం,  వారి సలహా చాలా అవసరం.  న్యాయవాదులే న్యాయస్థానానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తారు. రాజ్యాంగం ప్రజలకు కేటాయించిన హక్కులను,  రాజ్యంగం పేర్కొన్న నియమాలు, షరతుల ఆధారంగా న్యాయాన్ని చేకూర్చడంలో సహాయపడతారు. కర్తవ్యం.. చాలామంది మేము న్యాయవాదులం అని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా గర్వంగా చెప్పుకోవడం అనేది కేవలం న్యాయవిద్య అభ్యసించి న్యాయవాదులు అయిపోగానే వచ్చేది కాదు.. న్యాయవాదికి అసలైన గౌరవం,  అసలైన గుర్తింపు వచ్చేది బాధితులకు, న్యాయం కోసం తనను ఆశ్రయించిన వారికి న్యాయం జరిగేలా చూసినప్పుడే. అందుకే న్యాయవాది కర్తవ్యం ఏమిటంటే బాధితులకు న్యాయం జరిగేలా చూడటం. అప్పుడే తన  కర్తవ్యాన్ని తను సరిగా నిర్వర్తించినట్టు. వృత్తి-దుర్వినియోగం.. ప్రతి వ్యక్తి తను  చేపట్టే వృత్తి ద్వారానే తన జీవనం సాగిస్తుంటాడు. అలాగే న్యాయవాదులు కూడా తమకు వచ్చే ఆదాయం ద్వారానే తమ జీవితాన్ని సాగిస్తుంటారు.  కానీ చాలా వరకు ఇందులో ఆదాయం గురించి స్పష్టత ఉండదు. తమకు  కేసులు లేకపోతే ప్రైవేటు లాయర్ల జీవనం, వారి కుటుంబ పోషణ సమస్యగా మారుతుంటుంది.  అందుకే కొందరు తప్పటడుగు వేస్తారు.  డబ్బు కోసం న్యాయానికి విరుద్దంగా కూడా ప్రవర్తిస్తారు.  కొన్నిసార్లు న్యాయం వైపు నిలబడ్డామని చెబుతూ అన్యాయం వైపు సమర్థిస్తూ బాధితులను మోసం చేస్తుంటారు.  ఇదంతా చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. కానీ కేసులు, ఆస్తులు,  ఆర్థిక విషయాలు అయితే ఇలాంటివి కోల్పోయిన వ్యక్తులు తిరిగి కోలుకుని మళ్ళీ జీవిత పోరాటంలో పడిపోవచ్చు. కానీ .. మానవ సంబంధాలు,  ప్రాణానికి నష్టం కలిగించిన వ్యక్తులు  ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడకుండా చేయడం వల్ల న్యాయ విద్యను అభ్యసించి దాన్ని దుర్వినియోగం చేసినవారవుతారు. ఇలాంటి వారి వల్ల న్యాయ వ్యవస్థకు చాలా నష్టం జరుగుతుంది. అటు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అందుకే న్యాయ విద్య అభ్యసించడం అంటే ఒక గొప్ప శాస్త్రాన్ని తమ చేతిలో ఆయుధంగా పట్టుకోవడం. న్యాయవాదులు తమ ప్రతిభను నిందితులను కాపాడటానికి బదులుగా బాధితులకు న్యాయం జరిగేలా చేయడానికి వినియోగించాలి. అప్పుడే న్యాయ వ్యవస్థ బలంగా ఉంటుంది.  అన్యాయానికి అడ్డుకట్ట పడుతుంది.                            *రూపశ్రీ.
  కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు. ప్రజలకు న్యాయాన్ని చేకూర్చడంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషిస్తారు.  ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న, భారతదేశంలోని న్యాయవాదుల సంఘం న్యాయవాదుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది . ఇది భారతదేశపు మొదటి రాష్ట్రపతి, భారతదేశ ప్రముఖ న్యాయవాది అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి  గురించి తెలుసుకుంటే.. డాక్టర్ రాజేంద్రప్రసాద్.. రాజేంద్ర ప్రసాద్ డిసెంబర్ 3, 1884న జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో,  కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. మొదట్లో రాజేంద్రప్రసాద్ గారు సైన్స్ విద్యార్థి. 1907లో ఆయన ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసి బోధన వృత్తిలో అడుగుపెట్టారు. 1909లో ప్రసాద్ న్యాయశాస్త్రం అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. 1910లో న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ పూర్తి చేసి, 1915లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని అందుకున్నాడు. మరుసటి సంవత్సరం రాజేంద్రప్రసాద్ గారు బీహార్- ఒడిశా హైకోర్టులో చేరారు. భాగల్పూర్ నగరంలో కూడా న్యాయవాద వృత్తిని చేపట్టారు. న్యాయవాదిగా ఆయన  కెరీర్ చాలా అద్బుతంగా ఉండేది, కానీ 1920లో స్వాతంత్ర్య ఉద్యమానికి సహాయం చేయడానికి ఆయన పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాడు. 1937లో ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. 1950లో రాజ్యాంగం ఆమోదించబడిన తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.  ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి సరైన సలహాలు ఇచ్చి విద్యాభివృద్ధికి దోహదపడినవారు రాజేంద్రప్రసాద్ గారే.. అందుకే ఆయన జయంతిని న్యాయవాదుల దినోత్సవంగా  జరుపుకుంటున్నారు.                             *రూపశ్రీ.  
డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య.  చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు.  చుట్టూ ఉన్న అందరూ సపోర్ట్ చేస్తే తప్ప దీన్నుండి సులువుగా బయట పడలేరు. డిప్రెషన్ కారణంగా నమోదు అవుతున్న మరణాలు కూడా చాలానే ఉంటున్నాయి.  అయితే డిప్రెషన్ లో నలిగిపోతూ ఇక తమ జీవితం అంతే నిరాశలో ఉండేవారికి గుడ్ న్యూస్.. డిప్రెషన్ ను తరిమి కొట్టే అద్బుతమైన మార్గం ఉంది.  కేవలం 7రోజులు చాలు.. జీవితంలో అద్బుతం జరుగుతుంది.  ఈ విషయం స్వయానా పరిశోధకులు,  వైద్యులు స్పష్టం చేస్తున్నారు.  ఇంతకూ 7 రోజులు చేయాల్సిన పనులేంటి? ఇది డిప్రెషన్ తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. ఫోన్ బంద్.. డిప్రెషన్ ఎండ్.. డిప్రెషన్ సమస్యను ఎండ్ చేయడానికి ఫోన్ బంద్ చేయడం అతిగొప్ప మార్గమని వైద్యులు, పరిశోధకులు అంటున్నారు.  ఒక పరిశోధన ప్రకారం కేవలం వారం రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల డిప్రెషన్ లక్షణాలు 24శాతం తగ్గాయని చెబుతున్నారు.  అంతేకాదు.. ఆందోళన సమస్య 16.1 శాతం,  నిద్రలేమి, నిద్రకు సంబంధించిన సమస్యలు దాదాపు 14.5 శాతం తగ్గాయట.  కాబట్టి సోషల్ మీడియాకు వారం రోజులు దూరం ఉంటే ఇన్ని సమస్యలు మంత్రించినట్టు తగ్గుతాయని అంటున్నారు.  సోషల్ మీడియా అంటే స్మార్ట్ ఫోన్,  అందులో నెట్ కనెక్షన్.. ఇవి రెండూ దూరంగా ఉంటే చాలని అంటున్నారు. సోషల్ మీడియా డిటాక్స్ ప్లాన్.. 7రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం అనే ప్లాన్ ను దశల వారిగా ఈ కింది విధంగా ఫాలో కావచ్చు. 1రోజు.. సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాలో.. ఆత్మ పరిశీలన చేసుకుని.. ఆ తరువాత విషయాన్ని ఒక కాగితం మీద కొన్ని లక్ష్యాలు రాసుకోవాలి.  దీనివల్ల ఎవరికి వారికే తాము సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాలి, దాని వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అనే విషయం అర్థం అవుతుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి తమకు తాము రెఢీ అవుతారు. 2వ రోజు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి మంచి మార్గం నోటిఫికేషన్లను ఆప్ చేయడం.  నోటిఫికేషన్ల వల్ల ఫోన్ ను పదే పదే తీయవలసి వస్తుంది. నోటిఫికేషన్లను ఆఫ్ చేయాలి. హోమ్ స్క్రీన్ మీద సోషల్ మీడియా యాప్ లను తీసేయాలి. వాటిని ఫోల్డర్ లలో ఉంచి యాప్ లను తెరిచే అవసరం తగ్గించాలి. 3వ రోజు.. రోజూ ఫోన్ చూస్తూ గడిపే సమయాన్ని కాస్తా మంచి అలవాట్ల కోసం వెచ్చించాలి.  కొంతసేపు పుస్తకం చదవడం,   వ్యాయామం, మంచి అభిరుచి, ఎప్పటినుండో నేర్చుకోవాలని అనుకున్న పనిని నేర్చుకోవడం, ఆర్ట్స్ క్రాఫ్ట్స్,  తోటపని ఇట్లా ఏదైనా సరే.. సోషల్ మీడియాకు దూరంగా మనసును లాక్కెళ్లాలి. 4వ రోజు.. సోషల్ మీడియా నుండి బయటకు వచ్చి చుట్టూ ఉన్న పరిసరాలు,  జరుగుతున్న పరిస్థితులతో మాత్రమే కనెక్ట్ అవుతూ ఉండాలి.  చేసే ప్రతి పనిని మనసుతో ఆస్వాదిస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మెదడు మానిటైజ్ అవుతుంది. మెదడు మీద సోషల్ మీడియా ఒత్తిడి మెల్లిగా తగ్గడం మొదలవుతుంది. 5వరోజు.. మానసికంగా మెరుగ్గా ఉండటానికి ద్యానం, శ్వాస వ్యాయామాలు బాగా సహాయపడతాయి.  అందుకే రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయాలి. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఎలా అనిపిస్తోంది, మనసు ఎలా ఫీలవుతోంది,  ఏ పని తేలికగా అనిపించింది, ఏ పని కష్టంగా అనిపించింది మొదలైనవన్నీ ఒక జర్నలింగ్ రాసుకోవాలి. ఇది జరుగుతున్న మార్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 6వ రోజు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటే ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపడం చాలా మంచిది. అది కూడా నేరుగా వ్యక్తులతో కలిసి సమయాన్ని గడపాలి. ఇది బంధాలను బలపరచడమే కాకుండా,  డిప్రెషన్ వంటి భూతాన్ని పారద్రోలడానికి బంధాలు ఎంతగా సహకరిస్తాయో కూడా అర్థం చేసుకునేలా చేస్తుంది. 7వ రోజు.. వారంలో జరిగిన ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న మార్పును రివైండ్ చేసుకోవాలి.  ఏ చిన్న రిలీఫ్ కనిపించినా చాలా గొప్ప ఫలితం సాధించినట్టే.. ఎందుకంటే ఒక్కసారి గెలుపు రుచి చూస్తే దానికోసం అలాగే కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది. మెల్లిగా సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉండాలో అంత దూరం ఉంటూ కేవలం అవసరం కోసం మాత్రమే లిమిట్ గా సోషల్ మీడియా ఉపయోగించడం నేర్చుకుంటే డిప్రెషన్ భూతాన్ని తరిమి కొట్టేయవచ్చు.                         *రూపశ్రీ.
దోసకాయ తినడానికి  చాలా మంది  ఇష్టపడతారు. సాధారణంగా దోసకాయను  కూరగాయల లిస్ట్ లో చెబుతారు. దోసకాయలో నీరు  సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది,  శరీరం డీహైడ్రేట్ కాకుండా  నివారిస్తుంది. అయితే చాలా మంది దోసకాయను వంటకంగా కాకుండా నేరుగా తినడానికి లేదా  సలాడ్, రైతా లలో జోడించుకోవడానికి ఇష్టపడతారు.  ఇంకొందరు  ఉప్పుతో కలిపి తింటారు. దోసకాయలు ఆరోగ్యానికి చాలా మంచివిగా పరిగణించబడతాయి. కానీ కొందరికి మాత్రం దోసకాయ చేటు చేస్తుందని చెబుతారు.  ఇంతకీ దోసకాయలో ఉండే పోషకాలు ఏంటి? దోసకాయలను ఎవరు తినకూడదు? తెలుసుకుంటే.. దోసకాయ పోషకాలు.. దోసకాయలలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం,  మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు  ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.  దోసకాయలు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయో, అవి కొంతమందికి  హాని కూడా చేస్తాయి.   దోసకాయలు ఎవరు తినకూడదంటే.. దోసకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే కొందరిలో  గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం లేదా తిమ్మిరి వంటి సమస్యలు పెరుగుతాయి. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు లేదా ఇప్పటికే ఎసిడిటీ లేదా ఉబ్బరంతో బాధపడుతున్నవారు దోసకాయలను తక్కువగా తినాలట. లేదంటే  అస్సలు తినకపోవడం మేలట. ఎందుకంటే ఇది వారి సమస్యలను మరింత పెంచుతుంది. దోసకాయలు చల్లదనాన్ని కలిగి ఉంటాయి. ఎవరికైనా ఇప్పటికే దగ్గు, జలుబు లేదా గొంతు నొప్పి ఉంటే వారు  దోసకాయ తినడం మంచిది కాదు. దీని శీతలీకరణ ప్రభావం దగ్గును తీవ్రతరం చేస్తుంది.  జలుబును పెంచుతుంది. కాబట్టి దగ్గు, జలుబు,  గొంతునొప్పి వంటివి ఉన్నవారు దోసకాయ తినకపోవడం మంచిది. కొంతమందికి దోసకాయ తిన్న తర్వాత అలెర్జీ సమస్యలు వస్తాయి. పెదవులు లేదా గొంతు దురద, వాపు, కడుపు నొప్పి,  వికారం వంటి అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. దోసకాయ తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దోసకాయ తినడం మానేయడం మంచిది. దోసకాయ ఒక సహజ మూత్రవిసర్జన పదార్థం. అంటే ఇది మూత్రవిసర్జనను పెంచుతుంది. ఎవరికైనా ఇప్పటికే తరచుగా మూత్రవిసర్జన ఉంటే, దోసకాయ వారి సమస్యను మరింత పెంచుతుంది. అలాంటి వారు చాలా తక్కువ మొత్తంలో లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత దోసకాయ తినడం మేలు. దోసకాయలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా రక్తపోటును కూడా కొద్దిగా తగ్గిస్తాయి. ఎవరికైనా ఇప్పటికే తక్కువ రక్తపోటు ఉంటే దోసకాయను ఎక్కువగా తినడం వల్ల తలతిరుగుడు, బలహీనత లేదా అలసట వస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు దోసకాయలను తక్కువగా తీసుకోవాలి. కొంతమందికి జలుబు సులభంగా సోకుతుంది. ఇలాంటి వారు చల్లని పదార్థాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు.  సులభంగా జలుబుకు గురయ్యే అవకాశం ఉన్నవారు, చేతులు కాళ్ళు చల్లగా ఉంటే లేదా తరచుగా కడుపులో చలి ఉండటం వంటి సమస్యలున్నవారు దోసకాయలు తినడం అస్సలు మంచిది కాదు.                                *రూపశ్రీ.
  శీతాకాలం ఆరోగ్యానికి పరీక్షలు పెట్టే కాలం.  శీతాకాలంలో చలి కారణంగా జలుబు, ఇన్ఫెక్షన్లు,  చర్మం పగలడం,  దురదలు,  ర్యాషెస్, డాండ్రఫ్ వంటివి చాలా వస్తాయి.  ప్రతి సమస్యను తగ్గించుకోగానే మరొక సమస్య రెఢీ అవుతూ ఉంటుంది.  అన్నింటి కంటే ముఖ్యంగా చలి కారణంగా శరీరంలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది. వీటి నుండి ఉపశమనం కోసం చాలామంది అల్లం, వెల్లుల్లి, తులసి వంటి ఔషద గుణాలు ఉన్న పదార్థాలు బాగా వాడుతుంటారు.  అయితే శీతాకాలంలో తులసి టీ తయారు చేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. తులసి అద్బుతమైన మూలిక.. తులసి అద్బుతమైన మూలిక అనే విషయం అందరికీ తెలిసిందే. తులసికి ఆయుర్వేదం నుండి అన్ని రకాల వైద్యాలలో చాలా ప్రాముఖ్యత ఉంది.  తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలో సహాయపడతాయి.  చలికాలంలో ఆరోగ్య సంరక్షణ కోసం తులసిని పుష్కలంగా వాడవచ్చు. సీజన్ సమస్యలకు చెక్.. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే ముక్కు దిబ్బడ,  దగ్గు,  గొంతు నొప్పి వంటి సీజన్ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో తులసి టీ చాలా బాగా సహాయపడుతుంది. శ్వాస సమస్యలు.. చలికాలంలో చల్లని గాలుల కారణంగా చాలామంది శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.  ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలు శీతాకాలంలో విజృంభిస్తుంటాయి.  ఈ సమస్యల కు చెక్ పెట్టడానికి తులసి చాలా బాగా పనిచేస్తుంది. చర్మానికి తులసి.. తులసిలో వేడి గుణాలు ఉంటాయి.  తులసిని తీసుకున్నప్పుడు శరీరంలో వేడి పుడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగ్గా ఉంచుతుంది. చలి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. పొట్ట ఆరోగ్యం.. తులసి టీ తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం,  బరువు తగ్గడం,  కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  పొట్ట ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. షుగర్ సమస్య రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండేవారు రెగ్యులర్ గా తులసి టీ తాగుతూ ఉంటే సుగర్ లెవల్స్ క్రమంగా నియంత్రణలోకి వస్తాయట. తులసిలో ఉండే ఔషద గుణాలు జీవక్రియను మెరుగుపరచడం వల్ల ఇది సాద్యమవుతుందని  అంటున్నారు. తులసి టీ తయారు విధానం.. టీ అనగానే బారతీయులకు పాలు, పంచదార వేసి చేసే పానీయం గుర్తు వస్తుంది.  కానీ తులసి టీ తయారు చేయడానికి పాలు అవసరం లేదు. కావలసిన పదార్థాలు.. తులసి ఆకులు.. నీరు తేనె నిమ్మరసం తయారు విధానం.. ఒక గ్లాసు నీటిలో 5 నుండి 7 తులసి ఆకులు వేయాలి.  దీన్ని బాగా మరిగించాలి.  మరిగిన తరువాత వడపోసుకోవాలి.  ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ నిమ్మరసం,  ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. తేనె,  నిమ్మరసం వేయకపోయినా పర్వాలేదు.  తులసిని నీళ్లలో మరిగించి తాగవచ్చు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...