
మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్న ‘బేబీ డాల్’ చిట్టియాన్ కలైయాన్ ఫేమ్ బాలీవుడ్ గాయని కనికా కపూర్ నుంచి కొత్త పాట ఎప్పుడు వస్తుంది. ఈ సారి మాత్రం అచ్చం కనికా కపూర్ లాగా పాడాలని ఫిక్స్ అయ్యారు. కానీ హఠాత్తుగా ఆమె పర్సనల్ న్యూస్ ఆ అందర్నీ షాక్ కి గురి చేస్తుంది.
ఈ టాలెంటెడ్ సింగర్, తన రెండో భర్త గౌతమ్ హథిరమణితో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వివాహం జరిగిన సరిగ్గా 4 సంవత్సరాలకే ఈ దంపతులు తమ బంధానికి ముగింపు పలుకుతూ వేర్వేరుగా మారుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2022 మే 20వ తేదీన లండన్‌లోని అత్యంత ప్రసిద్ధమైన వి అండ్ ఎ మ్యూజియంలో వీరి వివాహం అత్యంత వైభవంగా, అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సన్నిహితులతో పాటు కనికా మొదటి భర్త ద్వారా సంతానమైన ముగ్గురు పిల్లలు ఆయానా, సమారా, యువరాజ్ కూడా హాజరై సందడి చేశారు.
పెళ్లికి ముందు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. అయితే, ఈ బంధం కేవలం నాలుగు సంవత్సరాల ముచ్చటగానే మిగిలిపోయింది. "ఎంతో ఆలోచించి, లోతుగా మథన పడిన తర్వాతే నేను, నా భర్త గౌతమ్ విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేం ఇద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. భవిష్యత్తులో అతనికి మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ కనికా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక భావోద్వేగ ప్రకటనను పంచుకున్నారు. అంతేకాకుండా, ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత గోప్యతకు ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలని, దయచేసి అనవసర ఊహాగానాలకు తెరదించాలని ఆమె తన శ్రేయోభిలాషులను కోరారు.
ఇది కూడా చదవండి: టబు పెళ్లి చేసుకోకపోవడానికి ఈ హీరోనే కారణం: ఇది పచ్చి నిజం!

ఇది తనకు రెండో వివాహమని, జీవితంలో రెండోసారి కూడా విడాకుల దాకా వెళ్లడం అనేది తనను ఎంతో మానసిక వేదనకు, నిరాశకు గురిచేసిందని కనికా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వివాహంలో ఏం జరుగుతుందనేది ఆ ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పూర్తిగా తెలుస్తుందని, ప్రస్తుతం తాను ముంబైలో తన ముగ్గురు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ, మూడు కొత్త ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నానని తెలిపారు. భవిష్యత్తులో కూడా గౌతమ్‌తో తమ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగానే ఉండాలని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ, కేవలం 4 సంవత్సరాలకే ఈ ప్రముఖ జంట విడిపోవడం బాలీవుడ్ వర్గాల్లో మరియు సంగీత లోకంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
[kanika Kapoor Divorce, kanika Kapoor Divorce Gautam Hathiramani, Kanika Kapoor, Gautam Hathiramani, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]





