Home

»

Latest News

రాధికా ఆప్టే వ్యాఖ్యలపై నిర్మాత ఎస్‌కేఎన్ సీరియస్ ఫైర్!

Nov 4, 2026 4:55PM

సినీ పరిశ్రమలో వివాదాలు ఎప్పుడూ ఒక హాట్ టాపిక్‌గానే మారుతుంటాయి. రీసెంట్ గా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హిట్ బొమ్మ లెజండ్ పై  ప్రముఖ నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు దక్షిణాది సినీ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 


రాధికా ఆప్టే వ్యాఖ్యలపై నిర్మాత ఎస్‌కేఎన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అవకాశాలు పొంది, గుర్తింపు సంపాదించుకున్న తర్వాత అదే పరిశ్రమను, ఇక్కడి కథలను, సంస్కృతిని కించపరిచేలా మాట్లాడటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రతి నటుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని, అయితే నిర్మాణాత్మక విమర్శకు, అవకాశాలు కల్పించిన పరిశ్రమను తక్కువ చేసి చూపడానికి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. తెలుగు, దక్షిణాది చిత్ర పరిశ్రమకు ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు, కథా విలువలు ఉన్నాయని వివరించారు. ఒక ప్రాంతానికి చెందిన వారికి సహజంగా అనిపించే విషయాలు మరో ప్రాంతం వారికి భిన్నంగా కనిపించవచ్చని, అందుకే పరస్పర గౌరవం అవసరమని అభిప్రాయపడ్డారు.


ఇది కూడా చదవండి: బెదిరింపులు: కోట్ల రూపాయిల డిమాండ్.. ఎందుకు అడుగుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

 

నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తామని, కానీ సాంస్కృతిక ఆధిపత్య ధోరణిని అంగీకరించలేమని స్పష్టం చేశారు. అవకాశాలు ఇచ్చిన పరిశ్రమను నటీనటులు కూడా గౌరవించాలని ఎస్‌కేఎన్ తన వ్యాఖ్యల ద్వారా సూచించారు. రాధికా ఆప్టే వ్యాఖ్యలను ఖండిస్తూ ఎస్‌కేఎన్ చేసిన పోస్టుకు కొందరు తెలుగు సినీ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను బయటకు తీసుకొస్తున్నారు. ఓ సినీ వేడుకలో ఎస్‌కేఎన్ మాట్లాడుతూ, తెలుగు మాట్లాడే అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా ప్రోత్సహిస్తామని సరదాగా వ్యాఖ్యానించారు. తెలుగు అమ్మాయిలను సినిమాల్లో తీసుకుంటే తర్వాత ఎదురయ్యే పరిణామాలపై తమకు అనుభవం ఉందని కూడా అన్నారు.

 

[Skn Counter To Radhika Apte, SKN, Radhika Apte, Tollywood controversy, SKN counter to Radhika, Tollywood producer, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com