ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలుపొందిన దానం నాగేందర్.. ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వైనంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 17)  తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి,  ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్ పై  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్య తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లపై విచారణ జరిపిన హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.     పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు..   ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.   [Danam Nagender, High Court verdict, MLA disqualification, Khairatabad MLA, defection case, Telangana news, Telugu One]
ప్రధాని నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా గురువారం (సెప్టెంబర్ 16)న వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రసంగించారు.  గుజరాత్‌  నుంచి కాశీ వరకు మోదీ సాగిన ప్రయాణం  సేవ' కు నిర్వచనం, పర్యాయపదం అన్న చంద్రబాబు..  చిన్ననాటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ, ఏ మాత్రం చలించకుండా దేశం కోసం ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని చంద్రబాబు ప్రస్తుతించారు.  ఫైళ్ల నుంచి కాకుండా నేరుగా సమాజం నుంచి  పాలనా పాఠాలు నేర్చుకున్న ఏకైక నేత మోదీ అన్న ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను   వివరించారు. కోట్లాది మందికి ఉచిత ఆహార ధాన్యాలు, పక్కా గృహాలు, మౌలిక వసతుల కల్పనతో పాటు సాంకేతిక రంగానికి మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావించారు.  స్పేస్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన రంగాలపై ప్రధానికి ఉన్న అవగాహన దేశాన్ని గొప్ప భవిష్యత్ వైపు నడిపిస్తోందని అన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.  మోదీ నాయకత్వంలో భారత్ భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. [Chandrababu Naidu, PM Narendra Modi, Varanasi News, Modi Leadership, TOne News Telugu, Telugu One]
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొంతకాలంగా   ఉత్కంఠను రేకెత్తిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు  ఎన్నికల గుర్తు వివాదం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వర్గం,  తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ వర్గాల మధ్య ఏర్పడిన  విభేదాలు.. పార్టీ గుర్తు  ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది.  పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం గురువారం (సెప్టెంబర్ 16) మధ్యాహ్నం మొదటగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ సమావేశం అనంతరం రితబ్రత మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాము   సమాధానాలు ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ పేరు, అధికారిక గుర్తుపై తమ వద్ద ఉన్న బలమైన వాదనలను కమిషన్ ముందు  ఉంచామని, ఈసీఐపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, తీర్పు తమ వైపే మొగ్గు చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరఫున సీనియర్ న్యాయవాది, ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఈసీఐ ఎదుట తమ వాదనలను గట్టిగా వినిపించారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం కోరిన అన్ని కీలక పత్రాలను తాము  సమర్పించామని తెలిపారు. తాము సమర్పించిన ఆధారాలు, వాదనల ఆధారంగా అంతిమ నిర్ణయం తమకే అనుకూలంగా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.   ఇంతకు ముందు అంటే సెప్టెంబర్ 12వ తేదీన కూడా ఈసీఐ ఇరు వర్గాల వాదనలను విన్నది. ఆ సమయంలో ఎటువంటి తక్షణ నిర్ణయం తీసుకోకుండా, తదుపరి విచారణ నిమిత్తం కొన్ని అదనపు పత్రాలను సమర్పించాలని ఇరు వర్గాలను ఆదేశించింది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ వివాదంపై ఈసీఐ ఒకవేళ తుది నిర్ణయం వెలువరించినప్పటికీ, ఈ పోరాటం ఇక్కడితో ముగిసే అవకాశం లేదు. తీర్పు వ్యతిరేకంగా వచ్చిన వర్గం న్యాయపోరాటం కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  [Trinamool Congress, West Bengal, Mamata Banerjee, Ritabrata Banerjee, ECI, TMC symbol dispute, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'తుడక్కమ్'. జుడే ఆంథోని జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రముఖ నిర్మాత ఆంటోని పెరంబవూర్ కుమారుడు ఆశిష్ జో ఆంటోని కీలక పాత్రలో మెరిసారు. మోహన్ లాల్ అతిథి పాత్రలో కనిపించడం విశేషం. థియేటర్లలో రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక 'జియో హాట్‌స్టార్‌'లో తెలుగు ఆడియోతో సహా స్ట్రీమింగ్ అవుతోంది. రవి బాలచంద్రన్ (సాయికుమార్) వీల్ ఛైర్‌కే పరిమితమైన విలేజ్ ఆఫీసర్. ఆయన కూతురు మీను (విస్మయ మోహన్ లాల్). తల్లిలేని మీనును రవి చాలా గారాబంగా పెంచుతాడు. ఒకరోజు బ్యాంకు పరీక్ష రాయడానికి వెళ్లిన మీను, చీకటి పడినా తిరిగి ఇంటికి రాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి ఆందోళనకు గురవుతాడు.  ఆ రాత్రి బస్సులో ప్రయాణిస్తున్న మీను ప్రమాదకరమైన ఒక సైకో కిల్లర్‌తో గొడవపడాల్సి వస్తుంది. ఒకవైపు నిస్సహాయుడైన తండ్రి ఆందోళన, మరోవైపు కరడుగట్టిన హంతకుడి బారి నుండి రక్షించుకోవాల్సిన అమ్మాయి.. చివరికి మీను ఆ కిల్లర్ నుండి ఎలా బయటపడింది అనేది అసలు కథ. దర్శకుడు జుడే ఆంథోని జోసెఫ్ చాలా పరిమిత పాత్రలతో ఎంతో పట్టుగా కథనాన్ని నడిపించారు. నిస్సహాయుడైన తండ్రి భయం, సైకో కిల్లర్ క్రూరత్వం, ఆత్మరక్షణ కోసం పోరాడే అమ్మాయి ధైర్యం చుట్టూ సీన్స్ అన్నీ చాలా గ్రిప్పింగ్‌గా సాగుతాయి. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేకుండా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.  ముఖ్యంగా సినిమాలో విలన్ పాత్రను డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. దాదాపు సినిమా మొత్తం ఎటువంటి డైలాగ్స్ లేకుండా, కేవలం హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తోనే తీవ్రమైన భయాన్ని కలిగిస్తుంది ఆ పాత్ర. ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తాయి. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జోమన్ జాన్ ఛాయాగ్రహణం ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. ఇది కూడా చదవండి: రాకా స్టోరీ లీక్: గ్లోబల్ మార్కెట్‌ను షేక్ చేయనున్న అల్లు అర్జున్ నటీనటుల విషయానికి వస్తే, మొదటి సినిమానే అయినప్పటికీ విస్మయ మోహన్ లాల్ తన నటనతో, యాక్షన్ సీక్వెన్సులతో ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో సాయికుమార్ నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆశిష్ జో ఆంటోని కూడా తన పరిధి మేర బాగా చేశారు. మోహన్ లాల్ కాసేపు కనిపించినా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. ప్రస్తుత సమాజంలో అమ్మాయిల భద్రత ఎంత ముఖ్యమో చెబుతూ, వారికి ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ఎంత అవసరమో సందేశాత్మకంగా చూపించారు. అనవసరమైన ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్‌గా సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి 'తుడక్కమ్' ఒక మంచి ఛాయిస్. మీకు నచ్చవచ్చు: నా మొగుడికి వంట చేసి పెడతావా? రోజాపై ఫైర్ అయిన నాంచారి.!       [Thudakkam Review Telugu, Thudakkam OTT Review JioHotstar, Vismaya Mohanlal Debut Movie, Jude Anthany Joseph Thudakkam, Thudakkam Movie Telugu Rating]
ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్) బరిలో మన దేశం తరఫున నిలిచే అధికారిక ఎంట్రీ ఖరారైంది. 99వ ఆస్కార్ వేడుకలకు సంబంధించి 'ఉత్తమ అంతర్జాతీయ చిత్రం' (Best International Feature Film) కేటగిరీలో మరాఠీ చిత్రం 'గోంధళ్'ను భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) అధికారికంగా ధ్రువీకరించింది. మహారాష్ట్రకు చెందిన విశిష్ట సంప్రదాయ జానపద కళారూపమైన 'గోంధళ్' నేపథ్యంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సంగీతం, నృత్యం, పౌరాణిక కథాంశాల కలనేతగా సాగే ఈ సంప్రదాయ ప్రదర్శనను దర్శకుడు సంతోష్ దవాఖర్ అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు.  ఈ చిత్రంలో కిశోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేశ్ సోహోని తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచేందుకు భారతీయ సినిమా పరిశ్రమ నుంచి ఏకంగా 33 సినిమాలు పోటీపడ్డాయి. దిల్జిత్ దోసాంజ్ నటించిన 'మై వాపస్ ఆవూంగా', భారీ యాక్షన్ డ్రామా 'బోర్డర్ 2', రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' వంటి ఎన్నో క్రేజీ చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.  ఇది కూడా చదవండి: ఓటీటీలోనూ అదే జోరు.. 'ఇరుముడి'కి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న మూవీ ల‌వ‌ర్స్‌.! అయితే, కమర్షియల్ హంగుల కంటే కథలోని నేటివిటీ, సాంస్కృతిక ప్రాధాన్యతకే జ్యూరీ ప్రాధాన్యమిచ్చి 'గోంధళ్'ను ఎంపిక చేసింది. మరాఠీ చిత్రసీమకు ఇది మరొక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. గతంలో 'శ్వాస్', 'హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ', 'కోర్ట్' వంటి సినిమాలు ఆస్కార్ బరిలో భారత్ తరఫున పోటీపడగా, ఆ ఘనత సాధించిన నాలుగో మరాఠీ చిత్రంగా 'గోంధళ్' రికార్డుల్లోకెక్కింది.  గతేడాది 98వ ఆస్కార్ వేడుకల్లో నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన 'హోమ్‌బౌండ్' టాప్-15 షార్ట్‌లిస్ట్‌ వరకు వెళ్లి దేశానికి మంచి గుర్తింపు తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో సినీ ప్రియులు, విమర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  భారీ బడ్జెట్ సినిమాలను కాదని, మన దేశీ కళారూపాలకు అద్దం పట్టే కథను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ 'గోంధళ్' చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక 99వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం 2027 మార్చి 14న లాస్ ఏంజిల్స్‌లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరగనుంది.  వీటికి సంబంధించిన అధికారిక నామినేషన్లను 2027 జనవరి 21న వెల్లడించనుండగా, ఈసారి 'గోంధళ్' చిత్రం తుది నామినేషన్ల రేసులో నిలిచి గ్లోబల్ వేదికపై మెరుస్తుందో లేదో చూడాలి. మీకు నచ్చవచ్చు: ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకి భారీ నష్టాలు మిగిల్చిన టాప్ సినిమాలు ఇవే!     [Gondhal Marathi Movie, Oscars 2027 India Official Entry, Academy Awards Best International Film, Santosh Davakhar Gondhal, Marathi Cinema Oscars Entry]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రెజెంట్ చేస్తున్న లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'హతః'. తాజాగా ఈ సినిమా అఫీషియల్ టీజర్ విడుదలయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం ఒక్క నిమిషం పదిహేడు సెకన్ల వ్యవధి ఉన్న ఈ టీజర్ చూస్తుంటేనే హార్రర్, మిస్టరీ, అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. టీజర్ ప్రారంభంలోనే "ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. ఏంటిదంతా?" అంటూ ఒక వాయిస్ ఓవర్‌తో వాతావరణం అంతా చాలా సీరియస్‌గా మారిపోతుంది. దానికి తోడు సీనియర్ యాక్టర్ రెహమాన్ గంభీరమైన గొంతుతో "దేవుడు ఉన్నాడంటే నమ్ముతావా?" అని అడిగే ప్రశ్నకు, "నేను నీకు పూర్తి నిజం చెప్పినా.. నన్ను ఒక పిచ్చివాడిలా చూస్తావ్" అంటూ వినిపించే సంభాషణలు సినిమాలోని అసలైన మిస్టరీకి అద్దం పడుతున్నాయి. చీకటి వాతావరణం, మంచు కురుస్తున్న అడవులు, నీటిలో తేలుతున్న మనుషులు, రక్తంతో మెరిసే రహస్య సంకేతాలు, అకస్మాత్తుగా దాడి చేసే వింత జీవి.. ప్రతీ ఫ్రేమ్ కూడా ప్రేక్షకుడిని కుర్చీ అంచున కూర్చోబెట్టేలా డిజైన్ చేశారు. ఈ సినిమాలో రెహమాన్, కుష్లు, తనూజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనూష్ గోరక్ ఈ చిత్రానికి రచయితగా, సినిమాటోగ్రాఫర్‌గా, దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. ఇక జెసిన్ జార్జ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని ప్రతీ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.  ఇది కూడా చదవండి: నాని బాక్సాఫీస్ తాండవం.. ఓవర్సీస్‌లో ‘ప్యారడైజ్’ ర్యాంపేజ్.! KA ప్రొడక్షన్స్, పౌర్ణమి బ్యానర్లపై శివ శంకర్ నాయుడు వై, కిరణ్ అబ్బవరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు. మీకు నచ్చవచ్చు: ట్రిపుల్ రోల్ కింగ్.. టాలీవుడ్‌లో తోపు యాక్టర్ ఎవరు?       [HATAH Teaser Review, Hatah Movie Telugu, HATAH Teaser, Kiran Abbavaram, Anush Gorak, Rahman, Telugu Film News, Telugu News]  
Hatah is the new movie produced by Kiran Abbavaram with Rehman, Kushlu Maddala, Namritha M.V., Tanuja Puttuswamy in leading roles. The movie teaser has been unveiled today with an interesting concept about a Monster attacking on a city. Using this concept Anush Gorak is debuting as a director.  He is said to be brother of Rahasya Gorak, wife of Kiran Abbavaram. He also handled cinematography for the film with Jecin George composing music. Kiran Abbavaram, Y. Shivashankar Naidu are producing the film with Vineela Sahithya, Kushlu as co-producers.  The teaser showcases everyone being afraid by this monster attack. They are unable to crack the real danger behind it all and they are all confused what evoke it. The shot division and quality of visuals is good exciting audiences to watch the film. It looks to have been handled very carefully in found footage style.  Makers have locked Diwali, 6th November release and content looks interesting from this teaser. We have to wait and see, how the film translates on the big screens.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Superstar Rajinikanth has been planning to deliver the biggest blockbuster for Tamil Cinema from past few years. Jailer has been the biggest hit for him and he is bringing Jailer 2, aiming to double the box office prospects. Anirudh Ravichander's theme, One Name, has become a huge hit already setting the bar high.  Now, the makers have decided to introduce the characters of Jailer 2 with Suraj Venjaramoodu's character as Dileep. He is challenging Jailer and as villain, he seems to be carrying forward from the previous one. The night setting and visual is in Nelson Dilipkumar style.    Anirudh's score with a mix of Kerala drums and style act as perfect theme for Suraj's character. The makers have started building momentum for 15th October release. Seems like they will be revealing characters of Mithun Chakraborthy but will they reveal cameos or not, to be seen.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
జీ5 గత వారం ‘పంచనామా’ అనే ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి నిర్మాత, షో రన్నర్‌గా ఉదయభాను వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్‌‌తో వచ్చిన ఈ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్‌ ఈ సిరీస్‌ను ఎక్కువగా వీక్షిస్తున్నారు. వరుసగా మూడు హత్యలు జరగడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం, చివరకు ఈ హత్యల వెనుకున్న కారణాన్ని తెలుసుకోవడం.. వంటి ఆసక్తికరమైన అంశాలతో ‘పంచనామా’ సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా మారింది. ఈ మొదటి సీజన్ క్లైమాక్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎండింగ్ చూస్తే ఇది అంతం కాదు.. ఆరంభం అన్నట్టుగా ఉంటుంది. ఇక వెంటనే రెండో సీజన్ చూసేయాలన్నంత ఇంట్రెస్ట్ కలిగించేలా ఈ మొదటి సీజన్‌ను తెరకెక్కించారు. ఇది కూడా చదవండి: డ్రాగన్‌లో లవ్ సాంగ్.. ఎన్టీఆర్ కోసం రూట్ మార్చిన నీల్.! పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పంచనామా’ కచ్చితంగా నచ్చుతుంది. అందుకే జీ5లో కేవలం వారం రోజుల్లోనే 25 మిలియన్ల డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా భరత్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. కొత్త యాంగిల్‌లో భరత్ తన పాత్రను పోషించారు. మోహన్ శ్రీవత్స మేకింగ్, నరేష్ కుమరన్ ఆర్ఆర్, సందీప్ కాంత్ కెమెరావర్క్ ఇవన్నీ కూడా సిరీస్‌ను నిలబెట్టాయి. ఈ సిరీస్‌లో మేధా రెడ్డి, శివాజీ రాజా, చరణ్ బాబు, రూపా లక్ష్మీ, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ పోషించిన పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీకు నచ్చవచ్చు: తెలుసా నేస్తమా.. 'సింహరాశి'లోని ఈ క్లాసిక్ సాంగ్ మీనింగ్ తెలుసా.?       [Panchanama 25 Million Streaming Minutes, Panchanama Web Series, Panchanama Series Telugu, Telugu Web Series, Udaya Bhanu, Bharath Srinivasan, Telugu News]  
Naresh Vijayakrishna, the highly acclaimed Dr. Navarasaraya, was recently honoured at the historic Raj Bhavan in Goa. The Hon’ble Governor of Goa, H.E. Sri Pusapati Ashok Gajapathi Raju, felicitated the actor on the occasion of Prime Minister Narendra Modi's 76th birthday. The Telugu community of Goa also gave him a grand and enthusiastic welcome. Naresh began his journey in 1972 as a child artiste in Pandanti Kapuram and later delivered huge blockbusters starting with his 1982 lead debut. Celebrating 55 golden years, he shared his vast experiences with the Governor during a special interaction at Lok Bhavan. They discussed his successful films, social service initiatives, and his role as an honorary Colonel. The senior actor stepped away from cinema for a while to serve the public, working tirelessly to restore water bodies in Anantapur and protect Rayalaseema's traditional arts. Since the 2000s, his powerful second innings has seen a massive resurgence. He is now one of the most sought-after actors, juggling multiple big-budget pan-India movies. He has built a remarkably strong connection with today's Gen Z viewers. Because of this modern appeal, young and visionary filmmakers are writing bold, distinctly different roles specifically for him. By constantly exploring new dimensions of his acting talent, he proves that his glorious 55-year journey is far from over. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  ఎప్పుడు పుట్టిందో తెలియదు గాని దర్శకులకి తమ 'ద్వితీయ' మూవీ కలిసి రాదనే నానుడి ఎన్నో ఉదాహారణలతో చాలా బలంగానే వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ నానుడిని  శ్రీకాంత్ ఓదెల విషయంలో సినీ అభిమానులు,సినీ సర్కిల్స్  చర్చించుకుంటున్నాయి.    సాధారణంగా ఏ దర్శకుడికైనా మొదటి సినిమా విజయవంతం అయిన తర్వాత రెండో సినిమాపై సహజంగానే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. 'దసరా' చిత్రంలో తెలంగాణ బొగ్గు గనుల నేపథ్యాన్ని, అక్కడి స్నేహం, ప్రేమ, రాజకీయ కోణాలను ఎంతో రస్టిక్ గా, సహజసిద్ధంగా వెండితెరపై ఆవిష్కరించి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. 69వ శోభా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకలో ఉత్తమ నటుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడితో పాటు ఏకంగా 11 నామినేషన్లతో పలు విభాగాల్లో సత్తా చాటిన 'దసరా' కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో 'ది ప్యారడైజ్' ప్రాజెక్ట్ ప్రకటన నుంచే హాట్ టాపిక్‌గా మారింది. అయితే, టాలీవుడ్ చరిత్రను పరిశీలిస్తే ఎంతోమంది సక్సెస్‌ఫుల్ దర్శకులు తమ రెండో సినిమా వద్ద సరైన కథా ఎంపిక లేక లేదా భారీ అంచనాల ఒత్తిడికి లోనై బాక్సాఫీస్ వద్ద తడబడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' తో ఆ సెంటిమెంట్‌ను తిరగరాస్తారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇటీవల ఈ చిత్రం గురించి దర్శకుడు స్పందిస్తూ, ఇది కేవలం ఒక సాధారణ యాక్షన్ డ్రామా మాత్రమే కాదని, ఒక తల్లి, కొడుకు బంధంతో పాటు ఒక జాతికి సంబంధించిన అత్యంత రివోల్యూషనరీ అండ్ ఎమోషనల్ కథ అని స్పష్టం చేశారు. ప్రేక్షకుల నమ్మకాన్ని కాపాడుకోవడం మరియు వారి అంచనాలను అందుకోవడంలో ఉన్న భయమే ఈ సినిమా మేకింగ్‌లో ఎంతో జాగ్రత్తలు తీసుకునేలా చేస్తోందని, అందుకే ప్రతి సీన్‌ను ఎంతో నిష్టతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.      Also Read: అను ఇమ్మాన్యుయేల్ సంచలన నిర్ణయం: ఇలా జరుగుతుందని ఫ్యాన్స్ ఊహించలేదు   దసరా'  100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి శ్రీకాంత్ ఓదెలను స్టార్ డైరెక్టర్ల సరసన నిలబెట్టడమే కాకుండా, ఆయన ప్రతిభకు తగ్గ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పుడు రాబోతున్న 'ది ప్యారడైజ్' ఆ రికార్డులను తిరగరాస్తూ, టాలీవుడ్‌ను వేధిస్తున్న ద్వితీయ గండం సెంటిమెంట్‌ను చెరిపేసి శ్రీకాంత్ ఓదెలను పాన్ ఇండియా లీగ్‌లో మరో స్థాయికి తీసుకెళ్తుందో లేదో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే గుండెల్లో అగ్గి రాజేసుకుంటూ వచ్చే పట్టుదల, తపన, కృషి అనేవి సెంటిమెంట్ కి విరుగుడు మంత్రాలు.       [Srikanth Odela, Nani, The Paradise Movie, Srikanth Odela About The Paradise Movie, Tollywood Updates, TeluguCinema News, TeluguCinema, Tollywood, Tollywood News]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కలయికలో వస్తున్న మూవీ 'రాకా'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ స్పెక్టకిల్ కేవలం మన దేశంలోనే కాదు, గ్లోబల్ లెవెల్‌లో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఇటీవలే మేకర్స్ వదిలిన "37" అనే మిస్టరీ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేసింది. తాజాగా "Get ready to witness a global triumph!" అంటూ రిలీజ్ చేసిన చిన్న వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముంది. https://x.com/sunpictures/status/2100855265273033145 శతాబ్దాల నాటి వేద కాలపు పౌరాణిక మిస్టరీని, నేటి ఆధునిక ప్రపంచపు సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఒకవైపు వేద కాలపు అడ్వెంచర్, మరోవైపు ఇప్పటి మోడర్న్ టైమ్‌లైన్.. రెండు విభిన్నమైన ప్రపంచాలను అట్లీ తన కళ్ళు చెదిరే విజువల్స్, అల్టిమేట్ మేకింగ్‌తో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2027 చివర్లో గ్రాండ్‌గా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.  హాలీవుడ్ లెవెల్ విజువల్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, సాయి అభ్యంకర్ సంగీతంతో రాబోతున్న 'రాకా'.. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందోనని అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.         [Raaka Global Triumph, Raaka Movie Update, Allu Arjun Raaka, Director Atlee, Sun Pictures, Deepika Padukone, Telugu Film News, Telugu News]  
ZEE5 Telugu’s latest original investigative thriller Panchanama has crossed an impressive 25 million streaming minutes since its premiere on 11th September 2026, reflecting the growing curiosity around the six-episode crime thriller. Led by Bharath Srinivasan and directed by Mohan Srivatsa, the series has drawn attention for bringing together a personal investigation, a layered medical-crime mystery and a steadily expanding conspiracy, giving Telugu OTT audiences another homegrown thriller to engage with. What gives Panchanama its central pull is the way its investigation begins with something deeply personal. When police officer Jai Ram refuses to accept his younger brother Aadi’s death as an accident, his search for answers takes him into a disturbing chain of suspicious deaths, hidden identities and connections that eventually point towards a larger medical syndicate. Rather than treating the investigation as a purely procedural exercise, the series places Jai’s emotional involvement at the heart of the mystery, allowing each new clue to carry a personal consequence. Bharath Srinivasan has emerged as one of the notable aspects of the series, with reviewers particularly observing how naturally he fits the role of a serious, hardened police officer. His restrained body language and controlled performance lend credibility to Jai Ram’s investigative persona, while the character’s emotional connection to the case gives the actor room to move beyond a conventional cop portrayal. Roopa Lakshmi has also attracted attention for a role that offers her substantially different shades from some of her more familiar screen appearances. The series’ technical treatment further establishes its dark crime-thriller atmosphere. Naresh Kumaran’s background score contributes to the tension around the investigation, while Sandeep Kanth N’s cinematography helps create the visual mood required for a story rooted in crime, secrecy and medical conspiracy. The compact format of six episodes, with episodes largely running around the 20–30-minute mark, also keeps the narrative accessible for audiences looking for a thriller that can be consumed in a concentrated viewing stretch. The 25 million streaming-minute milestone arrives at a time when Telugu audiences are increasingly engaging with original stories built specifically for streaming. With Panchanama, ZEE5 Telugu continues to expand that space by bringing a distinctly Telugu investigative narrative to its catalogue while exploring a genre that has traditionally found strong audience interest across Indian OTT platforms. The platform’s growing Telugu slate is creating room for different storytelling formats, from long-form dramas to compact thrillers, while keeping regional storytelling at the centre of its streaming offering. With its combination of mystery, emotional stakes and a medical-crime backdrop, Panchanama adds another distinctive title to ZEE5 Telugu’s expanding original catalogue. Having now crossed 25 million streaming minutes, the series continues its streaming journey on ZEE5, offering audiences a tightly packaged investigation that begins with one unanswered death and gradually opens into a much larger web of secrets. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి వేగవంతమైన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి మరియు అనియంత్రిత ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మధుమేహం లేదా షుగర్ వ్యాధి ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. చాలామందికి రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉన్నప్పటికీ, భోజనం చేసిన వెంటనే అకస్మాత్తుగా షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. దీనిని వైద్య పరిభాషలో  పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ స్పైక్  అని పిలుస్తారు. ఆహారం తిన్న తర్వాత ఒక్కసారిగా చక్కెర స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో తీవ్రమైన అలసట, నిద్రమత్తు, నీరసం రావడమే కాకుండా, తిన్న కొద్దిసేపటికే మళ్లీ తీవ్రమైన ఆకలి వేయడం మరియు తీపి పదార్థాలు తినాలనే కోరిక కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది దీర్ఘకాలంలో గుండె, మూత్రపిండాలు, కళ్లు మరియు నరాల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే భోజనం తర్వాత పెరిగే ఈ షుగర్ స్పైక్స్‌ను అదుపు చేయడానికి కేవలం భారీగా మందులు వాడాల్సిన అవసరం లేదని, మనం రోజువారీగా తీసుకునే భోజన క్రమంలో కొన్ని చిన్నపాటి మార్పులు చేస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు మరియు పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి ప్రధాన కారణం మన ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు లేదా త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటమే. మనం సాధారణంగా అన్నం లేదా చపాతీలతో భోజనాన్ని ప్రారంభిస్తాము, కానీ ఈ పద్ధతిని మార్చడమే మధుమేహ నియంత్రణకు అసలైన రహస్య సూత్రం. ఆరోగ్య నిపుణుల ప్రకారం, భోజనం చేసేటప్పుడు ఒక నిర్దిష్టమైన వరుస క్రమాన్ని ఫాలో అవ్వడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకోవచ్చు. మీ భోజనాన్ని ఎప్పుడూ పీచు పదార్థాలు (ఫైబర్) అధికంగా ఉండే కూరగాయలు మరియు ఆకుకూరల సలాడ్‌తో మాత్రమే ప్రారంభించాలి. పీచు పదార్థం జీర్ణవ్యవస్థలో ఒక సన్నని పొరలా ఏర్పడి, ఆహారం త్వరగా జీర్ణం కాకుండా నిరోధిస్తుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తంలోకి ఒకేసారి కలవకుండా చాలా నెమ్మదిగా విడుదవుతుంది. ఫైబర్ తిన్న తర్వాత, ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, పప్పుధాన్యాలు, పనీర్, చేపలు లేదా నట్స్ వంటి ప్రోటీన్ ఆహారాలు పొట్టను నిండుగా ఉంచి, ఆకలి హార్మోన్లను నియంత్రిస్తాయి. అత్యంత ముఖ్యమైన చివరి దశలో మాత్రమే బియ్యం, చపాతీ వంటి పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) లేదా తీపి పదార్థాలను సరిపడా పరిమాణంలో తీసుకోవాలి. అనగా మొదట ఫైబర్, ఆపై ప్రోటీన్ మరియు ఫ్యాట్స్, చివరగా కార్బోహైడ్రేట్లు తినే ఈ  ఫుడ్ సీక్వెన్సింగ్  పద్ధతి ద్వారా భోజనం తర్వాత పెరిగే షుగర్ స్థాయిలను చాలా వరకు సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. దీంతోపాటు శుద్ధి చేసిన లేదా అధికంగా ప్రాసెస్ చేసిన మైదా, తెల్ల బియ్యం, బేకరీ ఉత్పత్తులు మరియు తీపి పానీయాలను వీలైనంత వరకు తగ్గించడం ఎంతో మేలు చేస్తుంది. టైప్-2 డయాబెటిస్ ప్రారంభ దశలో లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు ఈ చిన్న డైట్ మార్పులతో పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిమిషాల శారీరక వ్యాయామం చేయడం, సరైన నిద్రపోవడం మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా తమ రక్తంలో చక్కెర స్థాయిలను సంపూర్ణంగా అదుపులో ఉంచుకోవచ్చని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. ఈ సరళమైన భోజన నియమం మీ జీవనశైలిని మరింత ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.     [ Diabetes, Blood Sugar Spikes, Postprandial Blood Sugar, Food Sequencing, Fiber Rich Foods, Protein Foods, Low GI Foods, Type 2 Diabetes, Prediabetes, Blood Sugar Control ]
మన భారతీయ వంటింట్లో నిత్యం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో వెల్లుల్లి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. కేవలం వంటకాలకు అద్భుతమైన రుచిని, మంచి సువాసనను అందించడానికి మాత్రమే కాకుండా, అనేక రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి మన శరీరాన్ని కాపాడటంలో వెల్లుల్లి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందని పురాతన ఆయుర్వేద వైద్యం నుండి నేటి ఆధునిక వైద్య శాస్త్రం వరకు స్పష్టం చేస్తున్నాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల లేదా మన రోజువారీ ఆహారంలో దీనిని భాగం చేసుకోవడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా మన శరీరంలో అత్యంత కీలకమైన గుండె మరియు నాడీ వ్యవస్థల పనితీరును అద్భుతంగా మెరుగుపరచడంలో వెల్లుల్లి వహించే పాత్ర అనితరసాధ్యమైనది. మానవ శరీరంలో నాడీ వ్యవస్థ అత్యంత ప్రాధాన్యమైనది. శరీరంలోని అన్ని అవయవాల సమాచార మార్పిడికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. వెల్లుల్లిలో పుష్కలంగా లభించే  అల్లిసిన్  అనే అత్యంత శక్తివంతమైన సమ్మేళనం, విటమిన్ B6 మరియు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు నాడీ వ్యవస్థకు గొప్ప రక్షణ కవచంలా నిలుస్తాయి. ఇవి నరాల బలహీనతను నివారించడమే కాకుండా, నాడుల కణజాలంపై ఒత్తిడి పడకుండా కాపాడుతాయి. క్రమం తప్పకుండా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మెదడులో రక్తప్రసరణ శరవేగంగా మెరుగుపడుతుంది. దీని ఫలితంగా నాడీ వ్యవస్థ పునరుజ్జీవనం పొంది, వయస్సు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి లోపం, ఆల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వంటి ప్రమాదకరమైన నరాల సంబంధిత వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలను బలితీసుకుంటున్న గుండె సంబంధిత సమస్యలకు వెల్లుల్లి ఒక అద్భుతమైన నివారణిగా పనిచేస్తుంది. వెల్లుల్లి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, రక్తప్రసరణను నార్మల్ చేస్తుంది. రక్తపోటు (బిపి) తో బాధపడేవారికి వెల్లుల్లి ఒక సహజసిద్ధమైన మందులా పనిచేస్తుంది. వెల్లుల్లిలోని నైట్రిక్ ఆక్సైడ్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ రక్తనాళాలను సడలించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. దీనివల్ల గుండెపై పడే అధిక ఒత్తిడి తగ్గి, గుండెపోటు (హార్ట్ ఎటాక్) మరియు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇక వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో నిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి. సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. జీర్ణ వ్యవస్థను వేగవంతం చేసి, కడుపులో గ్యాస్ మరియు ఉబ్బరం సమస్యలను నివారిస్తాయి. రోజువారీ జీవితంలో గుండె ఆరోగ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి, నాడీ వ్యవస్థను చురుగ్గా మార్చుకోవడానికి ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో చేర్చుకోవడం శ్రేయస్కరం.     [ Garlic, Garlic Benefits, Allicin, Heart Health, Nervous System, Brain Health, LDL Cholesterol, Blood Pressure, Antioxidants, Immunity ]  
మన అనునిత్య జీవితంలో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, పెరిగే వాయు కాలుష్యం, అధిక వేడి, విపరీతమైన చెమట, అలర్జీలు మరియు బ్యాక్టీరియల్ సంక్రమణల వల్ల చర్మంపై తీవ్రమైన దురద, ఎర్రటి మచ్చలు, దద్దుర్లు మరియు మంట రావడం అత్యంత సాధారణ సమస్యగా మారింది. చర్మంపై దద్దుర్లు వచ్చినప్పుడు నిరంతరం గోకడం వల్ల ఆ ప్రదేశంలో చర్మం మరింతగా దెబ్బతిని, రక్తస్రావం జరగడమే కాకుండా ఇన్ఫెక్షన్ ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఎంతైనా ఉంది. సాధారణంగా ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందేందుకు మనలో చాలామంది మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన క్రీములు లేదా అలోపతి మందులను ఆశ్రయిస్తుంటారు. అయితే వీటివల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ, సుదీర్ఘకాలంలో చర్మం తన సహజత్వాని కోల్పోయే అవకాశం ఉంది. కానీ, మన పూర్వీకులు శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న సహజ సిద్ధమైన, ఇంట్లోనే లభించే దివ్యౌషధం పటిక బెల్లం (మిశ్రీ) అని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పటిక బెల్లానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనిలో ఉండే అద్భుతమైన శీతలీకరణ (కూలింగ్) గుణాలు మరియు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ శక్తులు చర్మానికి అత్యంత వేగవంతమైన ఉపశమనాన్ని అందిస్తాయి. చర్మంపై తీవ్రమైన దురద, మంట, బాహ్య దద్దుర్లు లేదా తామర వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు పటిక బెల్లాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందవచ్చు. ఇది చర్మంపై ఉండే హానికర బ్యాక్టీరియాను సంపూర్ణంగా నశింపజేసి, చర్మ కణాలను శాంతపరుస్తుంది. ప్రతికూల అలర్జీల వల్ల కలిగే తీవ్రమైన అసౌకర్యాన్ని తగ్గించి, చర్మానికి తక్షణ పునరుజ్జీవనాన్ని అందించడంలో పటిక బెల్లం పరమౌషధంగా పనిచేస్తుంది. ఈ పటిక బెల్లం నివారణా పద్ధతిని ఇంట్లోనే అత్యంత సులభంగా తయారుచేసుకోవచ్చు. ముందుగా నాణ్యమైన పటిక బెల్లాన్ని తీసుకుని మెత్తటి పౌడర్‌లా తయారుచేసుకోవాలి. ఈ పటిక బెల్లం పొడికి సమాన నిష్పత్తిలో కొబ్బరి నూనె లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా రోజ్ వాటర్ (పన్నీరు) కలిపి మెత్తని పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. చర్మంపై తీవ్రమైన దురద, మంట లేదా ఎరుపు ఉన్న భాగాలను ముందుగా గోరువెచ్చని నీటితో పరిశుభ్రంగా తుడిచి ఆరబెట్టాలి. అనంతరం తయారుచేసుకున్న ఈ పటిక బెల్లం మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో సజావుగా పూయాలి. ఇలా పూసిన తర్వాత కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు దానిని చర్మంపై అలాగే ఆరనివ్వాలి. పటిక బెల్లంలోని చల్లదనపు గుణాలు చర్మ లోతుల్లోకి ఇంకి, కణాల మంటను మరియు దురదను క్షణాల్లో ఉపశమనం చేస్తాయి. ఆ తర్వాత చల్లటి నీటితో ఆ ప్రాంతాన్ని మెల్లగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ సహజ సిద్ధమైన పటిక బెల్లం చికిత్సను ప్రతిరోజూ రెండు నుండి మూడు సార్లు క్రమం తప్పకుండా పాటిస్తే, తీవ్రమైన దురద సమస్య కేవలం కొన్ని రోజుల్లోనే శాశ్వతంగా నయమవుతుంది. దీనివల్ల చర్మంపై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదా రసాయనాల దుష్ప్రభావాలు ఉండవు. ఎటువంటి ఖర్చు లేని, మన వంటింట్లోనే దొరికే ఈ సులువైన ఆయుర్వేద చికిత్సను పాటించడం ద్వారా రసాయన క్రీముల బారిన పడకుండా మన చర్మాన్ని అత్యంత ఆరోగ్యకరంగా, కోమలంగా మరియు ప్రశాంతంగా కాపాడుకోవచ్చు.     [ Skin Rash, Skin Itching, Misiri, Ayurveda, Natural Skin Care, Skin Allergies, Skin Inflammation, Bacterial Infection, Coconut Oil, Traditional Remedies ]
మన చుట్టూ ఎక్కడ చూసినా కనిపించే కొన్ని మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో కుప్పింటాకుకూడా ఒకటి. దీనినిపిప్పింటాకు, మురిపిండి, హరిత మంజరివంటి పేర్లతో కూడా పిలుస్తారు.  శాస్త్రీయంగా దీనిని Acalypha indica అంటారు. కుప్పింటాకును మన సంప్రదాయ వైద్య విధానాల్లో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగాపిప్పి పన్ను నొప్పి, పంటి సమస్యలు, గజ్జి, దురద, తామర వంటి చర్మ సమస్యలకు సంప్రదాయంగా ఉపయోగించే విధానాల గురించి ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరిస్తున్నారు. కుప్పింటాకు మొక్కలోని ఆకులు, వేర్లు తదితర భాగాలను వివిధ సంప్రదాయ పద్ధతుల్లో ఉపయోగించినట్లు సమాచారం ఉంది. అయితే ఏ ఆరోగ్య సమస్యకైనా స్వయంగా చికిత్స చేసుకోవడం కాకుండా, సరైన వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కుప్పింటాకు మొక్కను ఎలా గుర్తించాలి? పిప్పి పన్ను నొప్పి, చర్మ సమస్యల వంటి వాటికి దీనిని సంప్రదాయంగా ఎలా ఉపయోగిస్తారు? ఈ ఆకు వల్ల చెప్పుకునే ఇతర ప్రయోజనాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నీలిబృంగాది తైలం పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణకు ఉపయోగించే  ఒక అద్భుతమైన మూలికా నూనెగా పేరుగాంచింది. నేటి కాలంలో పెరిగిన కాలుష్యం, మానసిక ఒత్తిడి,  జీవనశైలి సరిగా లేకపోవడం,  రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ నీలిబృంగాది తైలం ఒక సహజసిద్ధమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ నూనె గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నూనె తయారీలో వాడే పదార్థాలు.. ఈ నూనె తయారీలో నీలి, భృంగరాజ్ లేదా గుంటగలగర, ఆమ్లా లేదా ఉసిరి, శతక్రాంత, అజక్షీర అంటే మేక పాలు, మహిష క్షీర అంటే  బర్రె పాలు, గోక్షీర అంటే ఆవు పాలు,  మరియు కొబ్బరి పాలు లేదా నువ్వుల నూనె వంటి శక్తివంతమైన ఆయుర్వేద మూలికలు మరియు పాలను ఉపయోగిస్తారు. ఈ పదార్థాల కలయిక జుట్టుకు , కుదుళ్లకు కావలసిన సమగ్ర పోషణను అందిస్తుంది. ప్రయోజనాలు.. నీలిబృంగాది తైలం క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడం చాలా  తగ్గుతుంది. ఇది కుదుళ్లను దృఢంగా మార్చి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే నీలి , భృంగరాజ్ మూలికలు జుట్టు సహజ రంగును కాపాడటంలో విశేషంగా తోడ్పడతాయి. చిన్న వయస్సులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో , జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జుట్టు పెరగడమే కాకుండా, తలలో వచ్చే చుండ్రు , దురద సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కుదుళ్లలో రక్తప్రసరణను మెరుగుపరచి, వెంట్రుకలు చిట్లడాన్ని , పొడిబారడాన్ని అడ్డుకుంటాయి. ఈ తైలం కేవలం జుట్టుకే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే చలవ చేసే గుణం వల్ల రాత్రి పూట ఈ నూనెతో తలకు మర్దన చేసుకుంటే ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది. కంటి అలసటను తగ్గించి, శిరోభారాన్ని ఉపశమనం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఎలా వాడాలి?  ఈ నూనెను వాడే విధానం కూడా చాలా సులభం. కొద్దిగా తైలాన్ని తీసుకుని కుదుళ్లకు బాగా పట్టించి, మునివేళ్ళతో  సున్నితంగా మర్దన చేయాలి. కనీసం అర గంట నుండి గంట సేపు ఉంచుకున్న తర్వాత మెత్తటి సీకాయ లేదా మైల్డ్ ఆయుర్వేద షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.  సహజమైన పద్ధతిలో జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా , అందంగా మార్చుకోవడానికి నీలిబృంగాది తైలం చాలా మంచి ఎంపిక.                        *రూపశ్రీ.  
టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ విషయాల గురించి యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్.జి.వి. సత్య ఈ వీడియోలో వివరిస్తున్నారు. ముఖ్యంగా చెన్నంగాకు  ( కసువింద, కసుంధి ఆకులు)   గురించి, వీటిని చట్నీ, పొడి లేదా కూర రూపంలో తీసుకోవడం గురించి డాక్టర్ సత్య వివరించారు. టైఫాయిడ్ తర్వాత జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, తీసుకోవాల్సిన ఆహారం, ఆరోగ్య జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. టైఫాయిడ్‌కు సంబంధించిన ఆహారపు అలవాట్లు, చెన్నంగాకు ఉపయోగాలు, జీర్ణక్రియకు సంబంధించిన డాక్టర్ సూచనలు తెలుసుకోవాలంటే పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. టైఫాయిడ్ వంటి అనారోగ్య పరిస్థితుల్లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. మందులను వైద్యుల సూచన లేకుండా ఆపకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)