నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నారా లోకేష్ జీవిత విశేషాలు ఎలాంటివో పరిశీలిస్తే..లోకేష్‌ టీడీపీ పార్టీ జనానికి ఒక ఏడాది తర్వాత జన్మించారు. ఆయన  జన్మదినం 1983 జనవరి 23. అదే టీడీపీ 1982 మార్చి 29న ఆవిర్భవించింది. అంటే పార్టీతో సమానంగా ఆయన జీవితం ఎదుగుతూ వచ్చింది.  ఇటు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడిగా, మరో సీఎం చంద్రబాబు తనయుడిగా లోకేష్ జీవితం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది.  ఇక తల్లి నారా భువనేశ్వరీ దేవి, సతీమణి బ్రాహ్మణి. లోకేష్ కి ఒక కొడుకు దేవాన్ష్. నారా లోకేష్ విద్యాభ్యాసం హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ లో సాగింది. గ్రాడ్యుయేషన్- అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్- ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆపై ప్రపంచ బ్యాంకులో పని చేసిన అనుభవం సైతం సాధించారు.  ఇక రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. లోకేష్ నేరుగా పదవుల్లోకి రాకుండా, పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం తెరవెనుక పని చేస్తూ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంస్థాగత బాధ్యతలు ఎప్పుడు చేపట్టారో చూస్తే.. 2013లో పార్టీలోకి అధికారికంగా ప్రవేశించారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి ఇన్‌చార్జ్‌గా ఉంటూ, వేలాది మంది కార్యకర్తలకు బీమా, ఇతర సౌకర్యాలు అందేలా చూశారు. మంత్రిగా సేవల విషయానికి వస్తే.. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై, చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో గ్రామాల్లో LED లైట్ల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల నిర్మాణం.. ఐటీ కంపెనీలను విశాఖపట్నం, అమరావతికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2019లో అధికారం పోయాక.. మరీ ముఖ్యంగా తాను మంగళగిరిలో ప్రత్యక్ష ఎన్నికల్ల్లో ఓడిపోయాక.. నారా లోకేష్ లో తీవ్ర అంతర్మధనం మొదలైంది. తన బాడీ ఫిట్ నెస్ తో పాటు అన్ని అంశాల్లోనూ దృష్టి సారించారు. 2023లో యువగళం పాదయాత్ర మొదలు పెట్టారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో ఒక మైలురాయి. కొన్ని అనివార్య కారణాల వల్లీ ఈ యాత్ర మధ్యలో ఆగినా దాని ఇంపాక్ట్ పార్టీలో, కేడర్లో చాలా పెద్దగానే ఉందని చెప్పాలంటారు విశ్లేషకులు. 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి, ప్రస్తుతం విద్యా, ఐటీ, మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ పగ్గాలను చేపట్టారు. అసలు పార్టీ పరంగా ఇప్పటి వరకూ లోకేష్ ఏం చేశారో చూస్తే..  పార్టీ సభ్యత్వ నమోదును డిజిటలైజ్ చేయడంలో ఆయన కృషి అమోఘం. ప్రభుత్వ పరంగా పరిశీలిస్తే.. పంచాయతీ రాజ్ శాఖలో చేసిన సంస్కరణలకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇక ఎన్నికల విజయాల పరంగా చూస్తే.. 2019లో ఓటమి ఎదురైనా, పట్టు వదలకుండా ఐదేళ్ల పాటు అక్కడే ఉండి ప్రజలకు చేరువయ్యారు.  2024లో అదే నియోజకవర్గంలో 90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు. నారా లోకేష్ తన విద్యా నైపుణ్యం, ఆధునిక ఆలోచనా ధోరణితో పార్టీని భవిష్యత్ తరాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.లోకేష్ తన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టిందే కార్యకర్తల నుంచి. పార్టీకి ఇదెంత మేలు చేస్తుందంటే.. కార్యకర్తల సంక్షేమంలో లోకేష్ ది కీలక పాత్ర కాబట్టి. పార్టీ అంటే కార్యకర్త కాబట్టి.. ఎంతైనా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఈ నిర్ణయం కార్యకర్తకొక పండగ రోజుగా భావిస్తున్నారంతా.  
  బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది. సుదీర్ఘ కాలం పాటు ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించిన నితీష్ కుమార్ శకం ముగియగా, భారతీయ జనతా పార్టీ కీలక నేత సామ్రాట్ చౌదరి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కీలక పరిణామంతో బిహార్ రాజకీయాల్లో నవశకం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో నితీష్ కుమార్‌ను గద్దె దించే వరకు విశ్రమించనని శపథం చేసిన వ్యక్తి, నేడు ఏకంగా ఆ కుర్చీలోనే కూర్చోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో విభేదించిన సమయంలో సమ్రాట్ చౌదరి ఒక సవాల్ విసిరారు. నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి పీఠం నుండి దించే వరకు తాను ధరించిన తలపాగా (పగడీ) తీయనని, కాషాయ రంగు తలపాగాతోనే ఉంటానని 2023లో ప్రతిజ్ఞ చేశారు. అయితే మారుతున్న సమీకరణల దృష్ట్యా 2024లో బీజేపీ-జేడీయూ పొత్తు కుదరడంతో, అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన తన శపథాన్ని పక్కనపెట్టి అయోధ్యలో శ్రీరాముడికి తన తలపాగాను సమర్పించారు. 57 ఏళ్ల సమ్రాట్ చౌదరి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. వెనుకబడిన వర్గాల్లో (కుష్వాహా సామాజిక వర్గం) ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన తండ్రి శకుని చౌదరి బిహార్ రాజకీయాల్లో సీనియర్ నేతగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తల్లి పల్లవి దేవి కూడా శాసనసభ్యురాలిగా సేవలందించారు. కుటుంబ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన సమ్రాట్, అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సమ్రాట్ చౌదరి రాజకీయ ప్రస్థానం పలు పార్టీల గుండా సాగింది. 1990లలో ఆర్జేడీలో చేరిన ఆయన, రబ్రీదేవి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం జేడీయూలో చేరినప్పటికీ, అక్కడ ఇమడలేక 2017లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ వేగంగా పెరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే, నితీష్ కుమార్ రాజకీయాలకు స్వస్తి పలకడం లేదా కేంద్ర రాజకీయాల వైపు మళ్లడంతోనే సమ్రాట్ చౌదరికి ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. గతంలో నితీష్‌ను వ్యతిరేకించిన నేతకే ఇప్పుడు అధికార పగ్గాలు దక్కడం బీజేపీ వ్యూహాత్మక విజయంగా రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణలను సమన్వయం చేయడంలో సమ్రాట్ కీలకం కానున్నారు. ఈ మార్పు పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. నాడు శపథం చేసిన వ్యక్తి నేడు అదే నితీష్ మద్దతుతో లేదా ఆయన వారసుడిగా రావడం రాజకీయ అవకాశవాదమని ఆర్జేడీ నేతలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా, సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బిహార్‌లో ఎలాంటి అభివృద్ధి పథకాలు చేపడతారో మరియు కుల రాజకీయాలను ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి. సమ్రాట్ చౌదరి నాయకత్వంలో బిహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ మరింత వేగంగా పనిచేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నిరుద్యోగ సమస్య పరిష్కారం మరియు పారిశ్రామిక అభివృద్ధి ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. కొత్త ముఖ్యమంత్రి రాకతో బిహార్ రాజకీయాల్లో స్థిరత్వం వస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం శ్రేణులూ, నేతలూ కూడా లోకేష్ కు పార్టీలో, ప్రభుత్వంలో మరింత కీలక స్థానం కల్పించాలని గత ఏడాదిన్నర పైగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి ఈ విషయాన్ని చంద్రబాబు సమక్షంలోనే కొదరు స్పష్టంగా చెప్పారు కూడా. అలాగే తెలుగుదేశం శ్రేణులైనా ఒక సమయంలో లోకేష్ కు పార్టీలోనే కాదు, ప్రభుత్వంలో కూడా ప్రమోషన్ ఇవ్వాలనీ, ఆయన పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించాలనీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనీ కూడా బాహాటంగానే డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా కడప మహానాడుకు ముందు ఈ డిమాండ్ తెలుగు దేశం శ్రేణుల నుంచి చాలా చాలా గట్టిగా వినిపించింది. ఒక దశలో కడప మహానాడు వేదికగానే లోకేష్ ప్రమోషన్ ప్రకటన ఉంటుందని కూడా గట్టిగా వినిపించింది. అయితే కూటమి పరిమితుల కారణంగా అప్పట్లో చంద్రబాబు లోకేష్ ప్రమోషన్ విషయంపై బాహాటంగా ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా మందలించారు కూడా.ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. తెలుగుదేశం పార్టీకి తొట్ట తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ నియమితులయ్యారు.   నారా లోకేశ్ కు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారికం నియామకం జరిగింది కానీ.. ఆయన చాలా కాలంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాలుగా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో లోకేష్ ముద్రను బలంగా  ఉంది.  ఇక పార్టీ కేడర్ తో లోకేష్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. అన్నిటికీ మించి లోకేష్ యూత్ గా బాగా కనెక్ట్ అవుతారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియామకం పార్టీ పరంగా ఆయన ఇమేజ్ ను మరింత పెంచుతుందనడంలో సదేహం లేదు.   పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న లోకేష్ భావనకు అనుగుణంగానే ఇప్పుడు పార్టీ కమిటీల ప్రకటన కూడా ఉంది.   రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పార్టీ మరింత బలోపేతం కావడానికి, కార్యకర్తలలో మరింత జోష్ నింపడానికి దోహదపడుతుందని తెలుగుదేశం సీనియర్లు గట్టిగా చెబుతున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'సూపర్ స్టార్' అనే పదానికి నిలువెత్తు రూపం రజనీకాంత్. ఆయన తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. కేవలం స్టైల్ మాత్రమే కాదు, భావోద్వేగాలను పండించడంలోనూ, శత్రువుల భ‌ర‌తం ప‌ట్టే యాక్షన్ సీన్లను పండించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, రజనీకాంత్ తన కుటుంబం కోసం సామాన్య వ్యక్తి నుంచి ఒక వీరుడిలా ఎలా మారాడో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన శాంత స్వభావాన్ని వీడి, విశ్వరూపం చూపించిన ఆ సన్నివేశం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ వీడియోలో ఒక రౌడీ ముఠా రజనీకాంత్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన చెల్లెలిని వేధిస్తూ, అవమానకరంగా మాట్లాడుతుంటారు. అంతకుముందు వరకు ఎన్నో అవమానాలను భరిస్తూ, స్తంభానికి కట్టేసి కొడుతున్నా మౌనంగా ఉన్న రజనీకాంత్, తన చెల్లెలి గౌరవానికి భంగం కలుగుతుందన్న తరుణంలో కట్టలు తెంచుకున్న ఆవేశంతో విరుచుకుపడతాడు. ఆ రౌడీలను ఊచకోత కోస్తూ ఆయన చేసిన ఫైట్ చూసి అక్కడున్న వారంతా నిర్ఘాంతపోతారు. రజనీకాంత్ తనలోని ఈ కోణాన్ని ఇన్నాళ్లూ దాచి ఉంచడం చూసి ఆయన తమ్ముడు (పోలీస్ ఆఫీసర్) ఆశ్చర్యపోతాడు. హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య ఉన్న రౌడీల పరిస్థితి చూసిన డాక్టర్లు కూడా, "ఇవి సాధారణ వ్యక్తి కొట్టిన దెబ్బలు కావు, నరనరాల్లో పోరాడే శక్తి ఉన్నవాడు మాత్రమే ఇలా కొట్టగలడు" అని చెబుతారు. దీంతో ఆయన తమ్ముడు, "అన్నయ్య అసలు నువ్వు ఎవరు? బాంబేలో ఏం చేసేవాడివి?" అంటూ నిలదీస్తాడు. ఇన్నాళ్లూ తమ మధ్య ఒక సామాన్యుడిలా ఉన్న అన్నయ్య వెనుక ఇంతటి భీకరమైన గతం ఉందా అని కుటుంబం మొత్తం విస్మయానికి గురవుతుంది. తమ్ముడు తన అన్నయ్యను అనుమానిస్తున్న తరుణంలో, తల్లి జోక్యం చేసుకుని రజనీకాంత్‌కు మద్దతుగా నిలుస్తుంది. "ఈ కుటుంబం కోసం చెప్పులు అరిగేలా కష్టపడుతున్న వాడిని నేరస్తుడిలా నిలబెడతావా?" అని తమ్ముడిని గద్దిస్తుంది. వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి వేస్తే ఏ మగాడైనా ఇలాగే స్పందిస్తాడని, తన కొడుకు చేసిన దానిలో తప్పేమీ లేదని స్పష్టం చేస్తుంది. ఈ సన్నివేశం కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఒక అన్నకు తన కుటుంబం పట్ల ఉన్న బాధ్యతను, ప్రేమను చాటి చెబుతుంది. రజనీకాంత్ సినిమాల్లో యాక్షన్ సీన్లు కేవలం కొట్లాటలు మాత్రమే కాదు, వాటి వెనుక బలమైన సెంటిమెంట్ ఉంటుంది. ఈ వీడియోలో కూడా తన గతాన్ని దాచిపెట్టి కుటుంబం కోసం మౌనంగా దెబ్బలు తిన్న ఒక అన్న, వారి గౌరవం కోసం పులిలా మారడం ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తుంది. రజనీకాంత్ నటన, ఆ పవర్‌ఫుల్ డైలాగులు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి మ‌రిన్ని అద్భుత‌మైన వీడియోల‌ను చూసేందుకు మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
Satya Dev is trying something different with a never-seen-before character in the upcoming film Rao Bahadur. The makers have just released the first single, O Sundari, to kickstart the musical promotions. It is definitely a good attempt by music director Smaran Sai. He has crafted a pure classic composition, and Vijay Yesudas sang it brilliantly, pouring real emotion into the track. Lyricist Rehman also wrote great, meaningful lyrics that fit the mood perfectly. However, while the overall effort and musical rendition deserve high praise, the song seems a bit too classical for the latest Gen Z audiences taste, who usually lean towards more modern, fast-paced tunes. Visually, the song stands out thanks to the neat chemistry between the lead pair. Satya Dev carries his stylish vintage look with ease, and Deepa Thomas brings a graceful presence to the screen. Writer and director Venkatesh Maha always shows a penchant to deliver something unique, and his distinct aesthetic is quite visible here.  With presenter Mahesh Babu and producers Chinta Gopalakrishna Reddy, Anurag Reddy, and Sharath Chandra backing the project, the production values are undeniably strong. While O Sundari is a very well-made classical track, its reach among the regular commercial moviegoers will be interesting to observe.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
As Indian cinema commanded global attention at CinemaCon 2026 in Las Vegas, it was Rocking Star Yash who left a lasting impression with his candid insights into his upcoming film Toxic: A Fairy Tale for Grownups. Joining Ramayana co-producer Namit Malhotra, Yash offered a deeper look into his upcoming project that promises to redefine the gangster genre. Talking bout the film, Yash shared, "For the first time, I think, we have shot that film in English as well. So as a concept of the film, it’s very layered. Once again, it’s not a typical gangster action story. For the face value, it would look like a gangster movie with a lot of action. But it has got deep psychology and it’s got very interesting aspects of human life where you can resonate with. And it’s a very unique way to present a dark character is what I feel.” Opening up about working with the director Geetu Mohandas and the team, Yash said, "It was very exciting and some of the best technicians, my director, Geetu Mohandas, has really given a new take on a gangster film. And I think I enjoyed it. It’s going to be a visual treat as well as something which makes a huge impact on audience psychology as well.” Expanding on the evolution of Indian cinema, Yash described India as “a world in itself — every few hundred kilometers, there’s a different language and culture,” noting how dubbing and pan-India storytelling have bridged audiences across regions. For him, Toxic represents this shift — a film rooted in Indian sensibilities yet designed for a global audience. “It’s one of those films that caters to everyone while offering a very unique experience,” he concluded. Directed by Geetu Mohandas and produced by Monster Mind Creations and KVN Productions, Toxic: A Fairy Tale for Grownups features an ensemble cast of Yash, Nayanthara, Kiara Advani, Huma Qureshi, Rukmini Vasanth, and Tara Sutaria and is slated for a global theatrical release on June 4, 2026.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'రియల్ స్టార్' అనగానే మనకు గుర్తొచ్చే పేరు శ్రీహరి. విలన్‌గా కెరీర్ ప్రారంభించి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించి, ఆపై హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అరుదైన నటుడు ఆయన. శ్రీహరి గారి డైలాగ్ డెలివరీ, గంభీరమైన స్వరం మరియు మాస్ మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. ముఖ్యంగా ఆయన పోలీస్ ఆఫీసర్‌గా లేదా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా చెప్పే డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించేవి. శ్రీహరి గారి డైలాగుల్లో ఒక రకమైన పౌరుషం, స్పష్టత ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆయన నటించిన వివిధ చిత్రాలలోని పవర్‌ఫుల్ సన్నివేశాలను మనం చూడవచ్చు. ముఖ్యంగా అవినీతిపరులైన రాజకీయ నాయకులను, సామాన్యులను పీడించే రౌడీలను ఉద్దేశించి ఆయన చెప్పే సంభాషణలు నేటికీ ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. "నేను పదవి ఉన్నా లేకున్నా ప్రజల మనిషినే" అనే తరహా డైలాగులు ఆయన పోషించిన పాత్రల యొక్క ధీరత్వాన్ని చాటిచెబుతాయి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే క్రమంలో ఆయన పలికే ప్రతి మాట ఒక తూటా లాగా పేలుతుంది. ఆయన చెప్పే డైలాగులు చూస్తే, ఒక సామాన్యుడికి అండగా నిలబడే వ్యక్తి ఎంత శక్తివంతంగా ఉంటాడో అర్థమవుతుంది. శ్రీహరి గారి సినిమాల్లో ఆయన తన బయోడేటాను విలన్లకు వివరించే తీరు చాలా ప్రత్యేకం. "నేషనాలిటీ ఇండియన్.. డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 15.." అంటూ ఆయన తన పుట్టుకను దేశభక్తితో ముడిపెట్టి చెప్పే డైలాగ్ ఎంతో ప్రాచుర్యం పొందింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించడమే కాకుండా, తన గతాన్ని, తన పౌరుషాన్ని నిరూపించుకునే సన్నివేశాల్లో శ్రీహరి నటన అద్వితీయం. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సెంటిమెంట్ పండించడంలోనూ ఆయనది అందెవేసిన చేయి. రౌడీలకు చెమటలు పట్టించే ఆయన, పేద ప్రజల కష్టాలను చూసి చలించే పాత్రల్లో ఒదిగిపోయేవారు. పోలీస్ డ్రెస్ వేసినా, పంచె కట్టినా ఆయన రూపంలో ఒక గాంభీర్యం ఉట్టిపడేది. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, సామాన్యులకు న్యాయం చేయడం వంటి అంశాలపై ఆయన సినిమాల్లోని చర్చలు ఆలోచింపజేసేలా ఉంటాయి. రియ‌ల్ స్టార్ శ్రీహరి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పోషించిన పాత్రలు, పలికిన పవర్‌ఫుల్ డైలాగులు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. 'రియల్ స్టార్' అనే బిరుదుకు ఆయన ప్రతి అంగుళం అర్హుడు. క్రమశిక్షణ, కఠిన శ్రమ, మరియు అద్భుతమైన నటనతో ఆయన సృష్టించిన ప్రభంజనం చిరస్మరణీయం. ఇలాంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగుల‌తో కూడిన మ‌రిన్ని వీడియోలు చూడాల‌నుకుంటే మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
Superstar Mahesh Babu recently released the teaser for Srinivasa Mangapuram, a film that marks the acting debut of his nephew, Jaya Krishna Ghattamaneni. Stepping into the industry with the legacy of his grandfather, the late veteran actor Krishna, Jaya Krishna opts for a gritty romantic drama rather than a conventional, glamorous launchpad, showing solid promise in his initial screen presence. Directed by Ajay Bhupathi, the film is set against the rustic backdrop of Tirupati. The teaser outlines the story of Vasu Babu and Manga, whose vibrant romance is violently disrupted by external forces. The visual palette and the underlying theme of a fierce, blood-soaked fight for love give off a vibe slightly reminiscent of the Hindi film Ishaqzaade. The narrative appears to lean heavily into raw, uncompromising emotion and action rather than a sanitized, breezy romance. Rasha Thadani co-stars as the female lead, offering a lively contrast to the teaser's intense and violent sequences. The central conflict is further grounded by veteran actor Dr. Mohan Babu, who plays the formidable primary antagonist, adding necessary weight to the film's overall dramatic stakes. Backed by the Chandamama Kathalu banner, the film’s technical execution stands out. The textured cinematography and GV Prakash Kumar's pulsing musical score effectively set the dark, rebellious mood. While the teaser relies on familiar tropes, Ajay Bhupathi has not been able to deliver box office success other than RX100 and he would be hoping for this to change that fact.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni) వెండితెరకు పరిచయం అవుతున్న మూవీ 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదలై, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీజర్ విశేషాలు: ఇంటెన్స్ లవ్ డ్రామా టీజర్ ప్రారంభం నుండే అజయ్ భూపతి మార్క్ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తిరుపతి సమీపంలోని 'శ్రీనివాస మంగాపురం' నేపథ్యంలో సాగే ఈ కథలో జయకృష్ణ (శ్రీనివాస్), రాషా తడాని (మంగా) మధ్య కెమిస్ట్రీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. "మంగా నీది కాదు వాసు బాబు" అనే డైలాగ్‌తో సినిమాలో ఏదో బలమైన సంఘర్షణ ఉందని అర్థమవుతోంది. జయకృష్ణ తన తొలి చిత్రంతోనే నటుడిగా మంచి పరిణతిని కనబరిచారు. ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్ రాషా తడాని తన అందంతో పాటు అభినయంతోనూ మెప్పిస్తోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు విలన్ గా నటిస్తుండటం విశేషం. టీజర్ చివరిలో ఆయన కనిపించిన తీరు హైలైట్ గా నిలిచింది. సాంకేతిక హంగులు ఈ సినిమాకు మరో ప్రధాన బలం జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అశ్విని దత్ సమర్పణలో 'చందమామ కథలు' బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. అజయ్ భూపతి మళ్ళీ ఒక పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. మొత్తానికి 'శ్రీనివాస మంగాపురం' టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. జయకృష్ణ ఘట్టమనేని గ్రాండ్ డెబ్యూకి ఇది సరైన ప్లాట్‌ఫామ్ అని చెప్పొచ్చు. ప్రేమ, యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘పెద్ది’ (Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. అయితే, ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నిజానికి ‘పెద్ది’ సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉండగా, ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఏప్రిల్ 30కి కూడా రావడం కష్టమేనని, జూన్ కి వాయిదా పడుతుందని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ తాజా ప్రకటన చేశారు. టాకీ పార్ట్ పూర్తి.. కేవలం ఒక్క పాట మాత్రమే! సినిమా ప్రస్తుత పరిస్థితి గురించి మేకర్స్ వివరిస్తూ.. టాకీ పార్ట్ అంతా పూర్తయిందని తెలిపారు. కేవలం ఒకే ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. ఇప్పటికే సినిమా ఎడిటింగ్ పనులు కూడా పూర్తయ్యాయని, వచ్చిన అవుట్‌పుట్ చూసి తాము చాలా సంతృప్తిగా ఉన్నామని అన్నారు. కంటెంట్ చాలా అద్భుతంగా వచ్చిందని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు. వాయిదాకు గల అసలు కారణం? మరి అంతా బాగున్నప్పుడు విడుదల ఎందుకు వాయిదా వేశారు? అనే ప్రశ్నకు చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. ‘పెద్ది’ వంటి భారీ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు అందించాలన్నదే తమ లక్ష్యమని వారు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజీ పడకుండా, టెక్నీషియన్లకు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రతి ఫ్రేమ్‌ను పర్‌ఫెక్ట్‌గా తీర్చిదిద్ది, థియేటర్లలో ప్రేక్షకులకు ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సినిమాను జూన్‌కు పోస్ట్‌పోన్ చేసినట్లు పేర్కొన్నారు. జూన్‌లో గ్రాండ్ రిలీజ్ వాయిదా పడినప్పటికీ, జూన్‌లో సినిమాను గ్రాండ్ లెవల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖచ్చితమైన విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని టీమ్ తెలిపింది. ఈ వాయిదా ప్రకటనతో మెగా అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ, క్వాలిటీ కోసం తీసుకున్న నిర్ణయం కాబట్టి సానుకూలంగా స్పందిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో ఊరమాస్ గెటప్‌లో కనిపించనుండటం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతోంది. మొత్తానికి ‘పెద్ది’ సినిమా కోసం ఎదురుచూపులు మరికొంత కాలం కొనసాగనున్నాయి. మరి జూన్ నెలలో థియేటర్లలోకి రాబోతున్న ఈ 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.  
ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా ఇటీవ‌ల త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో విడుద‌లైన ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) ప్రేక్ష‌కుల్ని ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ ఒక ఇంట‌ర్వూలో వెల్ల‌డించారు.  ఈ  సినిమా టైటిల్ విషయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ చిత్రానికి మొదట 'ఎల్ఐసీ' (LIC) అని పేరు పెట్టాలని దర్శకుడు భావించారు. అయితే, ఇదే పేరుతో ఇన్సూరెన్స్ రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న 'ఎల్ఐసీ' నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ పేరును వాడుకోవాలంటే ఏకంగా 112 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆ సంస్థ డిమాండ్ చేసిందట. ఒక సినిమా బడ్జెట్ కంటే టైటిల్ కోసమే ఇంత భారీ మొత్తం అడగడంతో విఘ్నేష్ శివన్ వెనక్కి తగ్గి, స్పెల్లింగ్‌లో మార్పు చేస్తూ 'ఎల్ఐకే' (LIK) గా టైటిల్ ఖరారు చేశానని వివరించారు. సినిమా నిర్మాణ ప్రయాణం కూడా పూలబాటలా సాగలేదని విఘ్నేష్ తెలిపారు. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఇంటర్నేషనల్'లో దాదాపు 210 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ తప్పుకోవడంతో బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో ఇద్దరు నిర్మాతలు మారినా, చివరకు ఫైనాన్స్ సమస్యలు ఎదురుకావడంతో షూటింగ్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందట. ఇలాంటి క్లిష్ట సమయంలో విఘ్నేష్ భార్య, లేడీ సూపర్ స్టార్ నయనతార రంగంలోకి దిగి ఈ ప్రాజెక్ట్‌ను నిలబెట్టారు. 'మూకుత్తి అమ్మన్-2' సినిమా కోసం ఆమెకు అందిన భారీ అడ్వాన్స్ మొత్తాన్ని తన భర్త సినిమా కోసం కేటాయించినట్లు సమాచారం. ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న విధంగా సినిమా పూర్తి చేయాలని ఆమె ఇచ్చిన భరోసాతోనే ఈ చిత్రం పూర్తయిందని విఘ్నేష్ ఎమోషనల్ అయ్యారు. చివరకు 100 కోట్ల లోపు బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'లవ్ టుడే' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదల తర్వాత ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతోంది. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రం అంతగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. అయినప్పటికీ, విఘ్నేష్ శివన్ - ప్రదీప్ రంగనాథన్ కాంబోలో వచ్చిన ఈ వెరైటీ కాన్సెప్ట్‌కు యూత్ నుండి కొంత మేర పాజిటివ్ స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Malayalam cinema continues to find strong footing in the Telugu market, and the latest to test these waters is the recent blockbuster Vaazha 2. Producer Sahu Garapati is officially releasing the Telugu dubbed version of the film on April 24th.  Directed by Savin SA, the movie recently crossed the massive 100-crore mark globally, driven largely by its relatable themes of youth struggles, academic pressure, and chaotic brotherhood. The film features a fresh cast of actors including Hashir, Alan Bin Siraj, Ajin Joy, and Vinayak V, supported by familiar faces like Aju Varghese and Alphonse Puthren. While the original Malayalam version succeeded heavily on its hyper-local humor and organic performances, the true test will be how well this specific brand of comedy translates for the Telugu audience. Often, native and dialogue-heavy comedies lose some of their essence during the dubbing process.  However, the core emotional beats regarding family expectations and friendship are quite universal, which the makers will undoubtedly rely on. It remains to be seen if Vaazha 2 can replicate its phenomenal home-state success at the Telugu box office when it hits theaters.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
వరుసగా గాయపడుతున్న మెగా హీరోలు! ఇటీవల రామ్ చరణ్‌కు కంటి సర్జరీ! ఇప్పుడు వరుణ్‌ తేజ్ కు మోకాలి ఆపరేషన్! మెగా ఫ్యామిలీని వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మెగా హీరోలు వరుసగా గాయాల బారిన పడటం అభిమానులను కలవరపెడుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నుండి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) వరకు, ఇటీవల జరిగిన ప్రమాదాలు మెగా కాంపౌండ్‌లో చర్చనీయాంశంగా మారాయి. రామ్ చరణ్‌కు కంటి సర్జరీ! ప్రస్తుతం రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో చరణ్ కంటికి గాయమైంది. కనురెప్పకు గాయమవ్వగా వైద్యులు ఎంతో నైపుణ్యంతో సర్జరీ నిర్వహించారు. చరణ్ త్వరగా కోలుకోవడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వరుణ్ తేజ్‌కు మోకాలి ఫ్రాక్చర్! చరణ్ ఘటన మరువకముందే తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. తన తదుపరి చిత్రం ‘బరి’ కోసం వరుణ్ కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో వాలీబాల్ ప్లేయర్‌గా కనిపిస్తున్న ఆయన, వాలీబాల్ సీక్వెన్సుల ప్రాక్టీస్ సమయంలో కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన మోకాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ కావడంతో, వైద్యులు మేజర్ సర్జరీ చేశారు. సర్జరీ సక్సెస్ అయిందని, ప్రస్తుతం వరుణ్ విశ్రాంతి తీసుకుంటున్నారని నిహారిక కొణిదెల అధికారికంగా ప్రకటించారు. ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆందోళనలో అభిమానులు మెగా హీరోలు తమ పాత్రల కోసం ప్రాణం పెట్టి పనిచేయడం కొత్తేమీ కాదు. కానీ, అతి తక్కువ కాల వ్యవధిలోనే ఇద్దరు హీరోలు మేజర్ సర్జరీలకు గురికావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. యాక్షన్ సీన్ల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. చేసే కొన్ని తప్పులు వారికి ఎలాంటి విజయాన్ని ఇవ్వవు అని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.  ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. వేల సంవత్సరాల కిందటే.. మనిషి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, ఆర్థిక సూత్రాలను ప్రపంచానికి అందించాడు.  అవి ఇవ్పటికీ ప్రజలు ఆచరించే విధంగా ఉన్నాయంటే.. ఆయన ఆలోచన,  ఆయన సిద్దాంతాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో.. సమాజంలో ఉండే కొందరు వ్యక్తులను అవమానించడం వల్ల  ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తును చీకటిలోకి నెట్టుకున్నట్టు అవుతుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఐదుగురు వ్యక్తులను అవమానించడం వల్ల జీవితంలో అసలు విజయాన్ని సాధించలేరని కూడా చెబుతాడు. ఇంతకీ ఎవరిని అవమానించకూడదు? ఎందుకు అవమానించకూడదు? తెలుసుకుంటే.. గురువు.. చాణక్య నీతి ప్రకారం గురువు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటారు, ఎందుకంటే గురువు  అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాడు. గురువు మనకు అక్షరాస్యతను అందించడమే కాకుండా, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి విలువలు కలిగి ఉండాలో.. ఆ విలువలను నేర్పుతాడు. తమ గురువును లేదా మార్గదర్శకుడిని అగౌరవపరిచిన వారు తమ జ్ఞానాన్ని, విజయాన్ని కోల్పోతారని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. తల్లిదండ్రులను.. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్ప శ్రేయోభిలాషులు ఉండరు. తండ్రి కుటుంబానికి రక్షణ కవచం అయితే, తల్లి విలువలకు, ప్రేమకు ప్రతిరూపం. తల్లిదండ్రులకు మానసిక వేదన కలిగించే లేదా వారిని అగౌరవపరిచే పిల్లలు అదృష్టాన్ని, సంతోషాన్ని కోల్పోతారని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని ప్రకారం, పెద్దల కళ్లలో కన్నీళ్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదట. పండితులు.. చాణక్య నీతి ప్రకారం సమాజంలో అపారమైన అనుభవం, బోలెడు జ్ఞానం ఉన్నవారే పండితులు.  అలాంటి పండితుల సాంగత్యం అమూల్యమైనది. పండితులను ఎగతాళి చేయడం లేదా కించపరచడానికి ప్రయత్నించడం మేధో దారిద్య్రాన్ని ప్రతిబింబిస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు. పండితులను అవమానించడం ద్వారా, సరైన సలహా, మార్గదర్శకత్వం పొందే అవకాశాలను కోల్పోయి, చివరికి పతనానికి గురవుతారట. కష్టపడి పనిచేసేవారు, సేవాభావం గలవారు.. ఆచార్య చాణక్యుడు ఎల్లప్పుడూ కష్టానికి గౌరవం ఇవ్వాలని బోధించారు. పారిశుధ్య కార్మికుడైనా, సెక్యూరిటీ గార్డు అయినా, కూలీ అయినా.. సమాజాన్ని నడిపించడానికి కష్టపడే ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులు. ఒకరి ఆర్థిక స్థితి లేదా హోదాను బట్టి వారిని అవమానించడం మనిషిలో అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి ప్రతికూల శక్తే  ఉంటే.. అదే వారి దురదృష్టానికి అతిపెద్ద కారణం అవుతుంది. సాధు స్వభావం ఉన్నవారు.. ధర్మం, సత్యం, నైతికత మార్గాన్ని అనుసరించేవారిని అసంతృప్తికి గురిచేయడం, అవమానించడం చాలా తప్పు. సద్గుణ, సత్ప్రవర్తన గలవారు ఎవరికీ కీడు కోరుకోరు, కానీ వారిని అవమానించడం జీవితంలోని సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. మానసిక సమతుల్యత కావాలన్నా, ఇంట్లో శాంతికి లోటు ఉండకూడదన్నా సాధు స్వభావం గల వారిని గౌరవించడం చాలా అవసరం.                            *రూపశ్రీ.
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్  లు అయితే బయటకు బాగా జాలీగా ఉంటూ, అందరిలో కలిసిపోతూ.. ఎక్కడైనా సరే ఇట్టే సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇంట్రోవర్ట్ లు అలా కాదు.. వారు ఎవరి ముందూ ఏమీ ఎక్కువ మాట్లాడలేరు, కనీసం కావలసిన వస్తువులు,  అవసరమైన విషయాల దగ్గర కూడా వారు మాట్లాడలేకపోవడం వల్ల నష్టపోతూ ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ కారణంగా ఇంట్రోవర్ట్ లను చాలా కామెడీ చేస్తుంటారు. వారు సిగ్గుపడుతూ ఉంటారని, మొహమాటం ఎక్కువని కూడా ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. నాణేనికి మరొక వైపు కూడా ఉంటుంది. అదే ఇంట్రోవర్ట్ లలో ఉండే బలం.  వారి వ్యక్తిత్వమే వారికి పెద్ద బలం అని చాలామంది కూడా అంటుంటారు. ఇంతకీ.. ఇంట్రోవర్ట్ లలో ఉండే బలాలు ఏంటో తెలుసుకుంటే.. ఒంటరితనం.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు పునరుత్తేజం పొందుతారు. వారికి జనాల మధ్యలో ఉండటం అనే విషయం  త్వరగా విసుగు తెప్పిస్తుంది. అయితే ఇలా ఒంటరిగా ఎక్కువ గడపడం వల్ల వారికి వారి మీద నమ్మకం, వారి నిర్ణయాల పట్ల నమ్మకం, తమ వ్యక్తిత్వం పట్ల దృఢంగా ఉంటారు. లోతైన మాటలు.. ఇంట్రోవర్ట్ లు  చిల్లర మాటల కంటే అర్థవంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే పనిగా ఏదో ఒకటి మాట్లాడటం అనే దాని కంటే.. అవసరమైనప్పుడు అవసరమైన విషయాలు మాట్లాడటానికే వారు ఆసక్తి చూపిస్తారు. అతి ఆలోచనలు.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా గడపడం ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు ,  నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. తక్కువే.. కానీ బలమైన స్నేహాలు.. ఇంట్రోవర్ట్ లకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారి లిస్ట్ లో చాలా కొద్దిమంది మాత్రమే స్నేహితులు ఉంటారు.  కానీ ఆ కొద్ది మంది చాలా మంచి స్నేహితులై ఉంటారు.  వారి స్నేహం కూడా చాలా బలంగా ఉంటుంది. వారు పెద్దగా మాట్లాడరని అంటుంటారు.. కానీ వారి మనసుకు ఎవరైనా దగ్గరైనా,  ఎదుటి వారి వ్యక్తిత్వం వారికి నచ్చినా.. వారు బాగా మాట్లాడతారు. వినడానికి ప్రాధాన్యత.. ఎక్స్ట్రోవర్ట్ లు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటే.. ఇంట్రోవర్ట్ లు మాత్రం ఎక్కువగా వినడానికే ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.  మౌనంగా ఉంటూ ఎదుటివారి మాటలను, వారి వ్యక్తిత్వాన్ని గమనించడానికి వీరు ఇష్టపడతారు.  వీరిలో పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.                                 *రూపశ్రీ.
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి.  ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, గౌరవంతో , ఉత్సాహంతో జరుపుకోవడం కొనసాగుతుంది. భారతదేశ సామాజిక నిర్మాణాన్ని మార్చడంలో , సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి వాటిని బలోపేతం చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు అందడంలో అంబేద్కర్ చేసిన కృషి చాలా పెద్ది.  అంబేద్కర్ జయంతి సందర్బంగా ఒక్కసారి అంబేద్కర్ గారి జీవితం గురించి గుర్తు చేసుకుంటే.. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో జన్మించారు. ఆయన తన జీవితాంతం సమాజంలో ప్రబలంగా ఉన్న అంటరానితనం, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. అంబేద్కర్ లక్షలాది మందిలో విద్య, హక్కుల పట్ల చైతన్యం కలిగించారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి, దేశానికి ప్రజాస్వామ్య, సమానత్వ వ్యవస్థను అందించారు. అంబేద్కర్ గురించి ఆసక్తికరమైన విషయాలు.. రాజ్యాంగ నిర్మాత.. భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని వ్యక్తం చేసేది భారత   రాజ్యాంగమే..  ఈ బారత రాజ్యాంగ  ప్రధాన రూపశిల్పిగా డాక్టర్ అంబేద్కర్ పరిగణించబడతారు. ఆయన రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా , ప్రధాన రూపశిల్పిగా పిలుస్తారు. విద్యావంతుడు.. అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత విద్యను అభ్యసించారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ మొత్తం 32 డిగ్రీలు పొందారు. ఆయన అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకరు. ఆయన బి.ఏ, ఎం.ఏ, ఎం.ఎస్.సి, పి.హెచ్.డి, డి.ఎస్.సి, ఎల్.ఎల్.డి, మరియు బారిస్టర్ ఎట్ లా వంటి ప్రముఖ డిగ్రీలను పొందారు.  అంతేకాదు.. తొమ్మిది భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 64 సబ్జెక్ట్స్ లో  నిపుణులు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొదటి  న్యాయశాఖ మంత్రి అయ్యారు. సామాజిక సంస్కర్త.. ఆయన తన జీవితాంతం అంటరానితనం, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడి, సమానత్వాన్ని బోధించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి బాబా సాహెబ్ మహాద్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అంటరానివారికి ప్రభుత్వ చెరువుల నుండి నీరు తోడుకునే హక్కు, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం ఆయన ప్రచారం చేశారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా, ఆయన మహిళల విడాకుల , ఆస్తి హక్కులను సాధించడానికి ప్రయత్నించారు. భారతరత్న..  1990లో అంబేద్కర్ గారి మరణానంతరం భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ఈ పురస్కారాన్ని ఆయన సతీమణి సవితా అంబేద్కర్ కు అందజేశారు. సత్యాగ్రహి.. నీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక సత్యాగ్రహి అంబేద్కర్ గారు మాత్రమే. న్యాయ శాఖ మంత్రి..  అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.                            *రూపశ్రీ.  
వెల్లుల్లితో కొలెస్ట్రాల్‌కు చెక్.. ఇలా వాడితే అద్భుత ఫలితాలు! మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి Dr Chittibhotla Madhusudana Sarma గారు వివరించిన మరిన్ని విషయాలను ఈ VIDEO ద్వార తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ప్రధాన అంశాలు: కొలెస్ట్రాల్ నియంత్రణ: రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను వెల్లుల్లి ఎలా కరిగిస్తుంది? గుండె ఆరోగ్యం: రక్తపోటును (High BP) అదుపులో ఉంచి గుండెపోటు రాకుండా వెల్లుల్లి చేసే మేలు. బరువు తగ్గడం (Obesity): శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో వెల్లుల్లి పాత్ర. మధుమేహం (Diabetes): రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి? సరైన పద్ధతి: వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవాలా లేక వేయించి తీసుకోవాలా? ఏ సమయంలో తీసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది? వెల్లుల్లిని ఔషధంగా వాడేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు మోతాదు గురించి డాక్టర్ గారి సూచనలను ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు. మీ ఆరోగ్యాన్ని సహజ సిద్ధంగా మెరుగుపరుచుకోవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. మరిన్ని ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వాస్తవానికి, రాగి పాత్రలో నీళ్లు తాగడం కొంతమందికి హానికరం కావచ్చని నిపుణులు అంటున్నారు. ఇంతకూ రాగి పాత్రలో నీరు ఎవరు తాగకూడదు? ఎందుకు తాగకూడదు? తెలుసుకుంటే.. రాగి పాత్రలో నీరు ఎవరు తాగకూడదు? రాగి నీరు ఎక్కువ ఆమ్ల గుణాన్ని కలిగి ఉండి, కడుపులోని సున్నితమైన పొరను ప్రభావితం చేస్తుంది. కడుపులో పుండ్లు లేదా గ్యాస్ సమస్యలు ఉన్నవారు రాగి పాత్రలో నీరు  తాగితే మంట, నొప్పి , ఎసిడిటీ పెరగడం జరిగే అవకాశం ఉంటుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థకు రాగి పాత్రలో నీరు మరింత చికాకు పెడుతుంది. ఎసిడిటీ, అజీర్ణం.. ఇప్పటికే ఎసిడిటీ లేదా అజీర్ణంతో బాధపడుతున్న వారికి, రాగి నీరు తాగడం హాని చేస్తుందట. రాగి నీటిలోని కొన్ని పదార్థాలు కడుపులోని యాసిడ్  స్థాయిలను పెంచి, గుండెల్లో మంట, కడుపులో మంట , పుల్లటి త్రేన్పులకు దారితీస్తాయి. పిల్లలకు ఇవ్వకూడదు.. రోజుల వయసున్న శిశువుల నుండి   పసిపిల్లల వరకు.. వారి జీర్ణవ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రాగి నీరు పిల్లలలో తేలికపాటి నుండి తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. అంతేకాకుండా, పిల్లలు తాము తాగే నీటి పరిమాణాన్ని నియంత్రించుకోలేకపోవడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. గర్భవతులు.. గర్భిణీ స్త్రీలు రాగి నీరు చాలా తక్కువ మాత్రమే తీసుకోవాలి.  అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ లేదా ఇతర జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు, ఇవి తల్లికి , పిండానికి హానికరం కావచ్చు.       లివర్, కిడ్నీ వీక్నెస్.. రాగి నీరు తాగాలని అనుకునే వారు ముందు వైద్యుడిని సంప్రదించాలి, ఎందుకంటే ఇది కాలేయం , మూత్రపిండాలపై అదనపు భారాన్ని మోపే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇది శరీరంలో టాక్సిన్లు తొలగించే ప్రక్రియకు ఆటంకం కలిగించి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది.                                     *రూపశ్రీ.
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, 'ముద్రలు' కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే 'ముద్ర' అంటారు. ఈ వీడియోలో TeluguOne Health మనకు కొన్ని ముఖ్యమైన యోగా ముద్రలను మరియు వాటి విశిష్టతను పరిచయం చేస్తోంది: ముఖ్యమైన ముద్రలు - ఉపయోగాలు: జ్ఞాన ముద్ర: జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. వాయు ముద్ర: గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు మరియు పక్షవాతం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శూన్య ముద్ర: చెవి సంబంధిత సమస్యలు మరియు ఎముకల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. పృథ్వీ ముద్ర: శరీరంలో విటమిన్ల లోపాన్ని సరిచేయడానికి, అలసటను తగ్గించి ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సూర్య ముద్ర: బరువు తగ్గాలనుకునే వారికి మరియు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది చక్కటి పరిష్కారం. వరుణ ముద్ర: చర్మ సౌందర్యానికి, రక్త శుద్ధికి మరియు శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. వీటిని ఎలా వేయాలి? ఈ ముద్రలను రోజుకు కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఏ ముద్ర ఏ వేలితో వేయాలి మరియు అది చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన వీడియోల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)