
సాయి ధరమ్ తేజ్ తన అప్ కమింగ్ మూవీ 'సంబరాల యేటి గట్టు' కంటే ముందే అభిమానుల్లో తన వివాహంతో సంబరాలు తీసుకొస్తున్నాడు. ఈ మేరకు 'కిరణ్మయి' తో రెండు రోజుల క్రితం నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
అప్పట్నుంచి 'కిరణ్మయి' బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడం కోసం అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెర్చింగ్ మొదలుపెట్టారు. మరి అదే సోషల్ మీడియాలో వినిపిస్తున్న బ్యాక్ గ్రౌండ్ తాలూకు న్యూస్ ఏంటో చూద్దాం.
కిరణ్మయి వృత్తిరీత్యా ఒక సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కుటుంబం వ్యాపార రంగంలో రాణిస్తుండగా, తండ్రి దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని, అంతేకాకుండా టాలీవుడ్లో పలు సినిమాలకు ఫైనాన్షియర్‌గా కూడా వ్యవహరించారని సమాచారం.
.webp)
అత్యంత సంపన్న కుటుంబం నుండి వచ్చిన కిరణ్మయి వందల కోట్లకు వారసురాలైనప్పటికీ, చాలా సాదాసీదాగా, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు. చిన్ననాటి స్నేహంగా ప్రారంభమైన వీరి పరిచయం కాలక్రమేణా ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కింది.
ఇది కూడా చదవండి: డైమండ్ లాంటి తెలుగు సినిమాలని లైట్ గా తీసుకుంటున్నారు!
హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 10వ తేదీన ఆ ఇద్దరి వివాహం అత్యంత అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. 'సంబరాల ఏటిగట్టు' పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా జనవరి 12న సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.
.webp)
రోహిత్ కేపీ దర్శకుడు కాగా 'హనుమాన్' మూవీ ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలు.
మీకు నచ్చవచ్చు: మహాశక్తి మూవీ రివ్యూ
మీకు నచ్చవచ్చ: సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ
[Sai Dharam Tej woodby Kiranmayi background, sai dharam tej about kiranmayi, Sai Dharam Tej, Sai Durgha Tej fiance, Kiranmayi background,Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]






