
నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ మూవీని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు దర్శకుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారట.
తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం వశిష్ఠ ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. కథలోని ప్రతి అంశాన్ని పక్కాగా సెట్ చేసుకున్న తర్వాతే సెట్స్‌పైకి వెళ్లాలని భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మోక్షజ్ఞను తొలి సినిమాతోనే కొత్తగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో వశిష్ఠ విభిన్నమైన కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా భారీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనుందని, ఇందులో పునర్జన్మలు, మల్టిపుల్ టైమ్‌లైన్స్ వంటి ఆసక్తికరమైన అంశాలు ఉంటాయని టాక్. అంతేకాదు, కథకు తగ్గట్టుగా భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారట.
గతంలో ‘బింబిసార’ సినిమాతో సోషియో ఫాంటసీ జానర్లో తన సత్తా చాటిన వశిష్ఠ.. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం మరోసారి అలాంటి జానర్‌ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఉంది. అదే నిజమైతే తండ్రీకొడుకులను ఒకే సినిమాలో చూడటమనేది నందమూరి అభిమానులకు పండగే.
[Mokshagna Debut Movie Shooting, Balakrishna Son Mokshagna, Mokshagna Movie Shooting Update, Nandamuri Balakrishna, Nandamuri Mokshagna, Director Vassishta, Mythri Movie Makers, Telugu Film News]





