తెలంగాణ రాజకీయాలలో   ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాజకీయ వ్యూహాల ముందు నిలవలేక సతమతమవుతున్నారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.  ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే  రేవంత్ రెడ్డి  ఈ స్థాయి దూకుడు ప్రదర్శిస్తున్నారనుకోవడం సరికాదంటున్నారు. గతంలో  అధికారంలో లేని సమయంలో కూడా రేవంత్ రెడ్డి తగ్గేదేలే అన్నట్లుగానే వ్యవహరించారనీ, అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది.   జైలకు కూడా పంపింది. అయినా  అప్పట్లో ఏ సందర్భంలోనూ రేవంత్ వెనకడుగు వేయలేదు. తన పంథా మార్చుకోలేదు.  అలాంటి పోరాట పటిమ ఉన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు  అధికార బలం,  ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండటంతో  అసెంబ్లీ వేదికగానైనా, బయట బహిరంగ వేదికలైనా ఆయన సంధిస్తున్న విమర్శలు, ఆరోపణలు బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. రేవంత్ దూకుడును అడ్డుకునేందుకు ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాను ఆశ్రయించడానికే పరిమితమౌతున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ దూకుడును అడ్డుకుంటారని హరీష్ రావు వైపు ఆశగా చూస్తున్నారు.  అయితే హరీష్ రావు కూడా  సీఎం రేవంత్ వ్యూహాత్మక ఎత్తుగడలను తిప్పికొట్టడంలో విఫలమౌతున్నారన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమౌతోంది.  హరీష్ రావుపై వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు. అయితే.. ఇటీవల తెరపైకి వచ్చిన  మిల్చీ మిల్క్ డెయిరీ వ్యవహారం, ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చిన వేల ఎకరాల భూముల చిట్టాలో ఆయన పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఆయన పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారంటున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా   పక్కా అధికారిక రికార్డులు, సర్వే నంబర్లు, కచ్చితమైన కాలపరిమితులతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులను నేరుగా బయటపెడుతూ బీఆర్ఎస్ అగ్రనేతల సమగ్రతను సూటిగా  ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ను కష్టకాలంలో ఆదుకుంటూ వచ్చిన  సెంటిమెంట్   రేవంత్ దూకుడు ముందు పని చేయడం లేదు.  ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో వస్తున్న  మార్పులను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కేవలం వాగ్ధాటికి పరిమితం కాకుండా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్‌లతో ప్రభుత్వం ముందుకు వెళ్తుండటంతో  బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  [Harish Rao vs Revanth Reddy, Telangana politics, BRS strategy, Revanth Reddy moves, Touble Shooter, Telugu One]
ఆంధ్రప్రదేశ్ లో  ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను   అస్త్రంగా మలచుకుని అధికార కూటమిపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ తీరుపై పొలిటికల్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా వరుసపెట్టి ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ఈ తరహా రాజకీయ వ్యూహం ఏ మేరకు సఫలమవుతుంద అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే . ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం ఒకే అంశంపై పదే పదే దృష్టి పెట్టడం వల్ల రాజకీయంగా ఆశించిన ప్రయోజనం దక్కుతుందా? అన్న సందేహాలు వైసీపీయులలోనే వ్యక్తం అవుతున్నాయి.  ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది. ఈ అంశాన్ని విడతలవారీగా ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వ తీరును నిలదీసేలా వ్యూహాలు రచిస్తున్నది.. అయితే.. ఈ తరహా నిరంతర ఆరోపణలు క్షేత్రస్థాయిలో ఏ రకమైన ఫలితాలను ఇస్తున్నాయన్న ప్రశ్నకు మాత్రం సంతృప్తికరమైన సమాధానం రావడం లేదు.  వైసీపీ విమర్శలు, ఆందోళనల పట్ల జనబాహుల్యంలో ఎటువంటి ఆసక్తీ కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలుగుదేశం కూటమి పార్టీల నేతలు వైసీపీ ఆరోపణలు, విమర్శలకు దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ హయాంలో   ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోని తీరును ఎత్తి చూపుతున్నారు, ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్న విమర్శలు, ఆందోళన పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే అని ఎదురుదాడికి దిగుతున్నారు.   రాజకీయంగా చూస్తే, వైసీపీ తీరు.. సొంత పార్టీ నేతలు, శ్రేణుల్లోనే గందరగోళం సృష్టిస్తోంది.   ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం ఒకే ఒక్క పరీక్షా విధానంపై మాత్రమే గళమెత్తడం వల్ల రాజకీయ ప్రయోజనం అటుంచి.. నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.   అన్నిటికీ మించి డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ ఆరోపణలు, విమర్శలను అధికార యంత్రాంగం కొట్టి పారేస్తున్నది. వైసీపీ విమర్శించిన ప్రతి అంశంపైనా స్పష్టమైన వివరణ అధికారికంగా ఇస్తూ.. నియామక ప్రక్రియపారదర్శకంగా జరిగిందని ఆధారాలతో సహా వివరణ ఇచ్చున్నది.  దీనివల్ల కూడా వైసీపీ డీఎస్సీపై చేస్తున్న విమర్శలు నీరుగారిపోతున్నాయి.  ఇంకా డీఎస్సీ నియామకాలలో అవకతవకలు అంటూ వైసీపీ దానినే పట్టుకు వేళాడితే.. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ మరింత పలుచన అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [YS Jagan, Mega DSC controversy, YCP political strategy, AP teacher recruitment, ruling and opposition politics, Telugu One]
తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదాలు మరోసారి తారస్థాయికి చేరాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి   మధ్య మాటల యుద్ధం  ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది. అయితే  అసంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆన్ రికార్డ్ యటపెట్టిన భూముల వివరాలతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ చేస్తున్న ఎదురుదాడి ఆత్మరక్షణ యత్నంగా కనిపిస్తోందే తప్ప ప్రజలను నమ్మించడంలో విఫలమైంది. మామూలుగా సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం వేరు.. సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా  సర్వే నంబర్లు, విస్తీర్ణాల ఆధారంగా లెక్కలు బయటపెట్టడం వేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పని చేశారు.   ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని పేద రైతుల భూములను లాక్కున్నారని, దీని వెనుక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీఎం అన్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఈ వివరాలు బయటపెడుతున్నామని, పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్,  లోతైన విచారణ జరిగితే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు.   ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా రేవంత్ వెల్లడించిన వివరాలను ఖండిస్తూనే.. కేసీఆర్ కుటుంబం ఆ భూములన్నీ నిజమే, వాటిని  మేం దాచిపెట్టిందేమీ లేదు, ఎన్నికల అఫిడవిట్లలో స్వయంగా పొందుపరిచినవే అని చెప్పుకుంటోంది. అవన్నీ తమకు తరతరాలుగా వస్తున్న వేల ఎకరాల వారసత్వ భూములున్నాయనీ, తమది జమీందారీ నేపథ్యమని చెప్పుకుంటోంది. అయితే.. ఇక్కడ కేసీఆర్ కుటుంబం మరీ ముఖ్యంగా కేసీఆర్ చిన్న లాజిక్ మరిచిపోయారు. 1973 నాటి భూమి పరిమితి చట్టం  ప్రకారం ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు మించి ఉండటానికి లేదన్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగానో లేదా నిజంగానే అయినా మరచిపోయారు.  దీంతో కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ రేవంత్ ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం పెద్దగా ఫలిచడం లేదని పరిశీలకులు అంటున్నారు.   ఇక పోతే ఆ ఆరోపణల తీవ్రతను తగ్గిండానికి, ప్రస్తుతానికి తప్పించుకోవడానికి కేటీఆర్ పొలిటికల్ అస్త్రంగా సిట్టింగ్ జడ్డి విచారణ అంటూ సవాల్ చేస్తున్నారు.  అయితే..  సిట్టింగ్ జడ్జి విచారణ డిమాండ్ అనేది సమస్యను పక్కదారి పట్టించే, పాతచింతకాయపచ్చడి వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  కేటీఆర్ డిమాండ్ కేవలం కాలయాపనకే తప్ప.. రేవంత్ రెడ్డి ఆరోపణలకు సమాధానం కాదని అంటున్నారు.  అన్నిటికంటే ప్రధానంగా... ఆ భూములు తమవేననీ, వాటిని చట్టబద్ధంగా కొన్నామనీ చెప్పుకుంటున్న కేటీఆర్   భూములు ఎవరి హయాంలో, ఎంత ధరకు  కొన్నారు అన్న వివరాలను వెల్లడించాల్సి ఉంది.  వాటిని కొనుగోలు చేయడానికి వెచ్చించిన నిధులు, అవి వచ్చిన మార్గం, దాని మూలాలు అన్నీ వివరించాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి.. వ్యక్తిగత దూషణలు, ప్రత్యారోపణలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలు ప్రజలలో కల్వకుంట్ల కుటుంబ వాదనను బలహీన పరుస్తాయో తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  అన్నిటికీ మించి అవి వారసత్వ భూములు అన్న ఒక్క మాటతో ఈ వివాదాన్ని ముగించేయడం కల్వకుంట్ల కుటుంబానికి అంత తేలిక కాదు. ఏది ఏమైనా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సృష్టించిన ‘భూ’ కంపం కేసీఆర్ కుటుంబాన్ని, అలాగే బీఆర్ఎస్ పార్టీనీ ఆత్మరక్షణలో పడేసిందన్నది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవమని చెప్పాలి.  [Revanth Reddy, KCR Family Lands, BRS Counter Attack, Telangana Politics, Dharani Portal Row]
ALSO ON TELUGUONE N E W S
  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఏం చేసినా అందులో వైవిధ్యం అనేది ఉండటం పక్కా. సామాజిక సేవ పరంగా కూడా ఆ వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో  ఏ మాత్రం వెనుకాడడు. అందుకు  ఈ రోజు జరుగుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సాక్ష్యం. సినీ, రాజకీయ, సామాజిక ప్రముఖులు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అయితే  చరణ్ మాత్రం కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా, సమాజానికి మేలు చేకూరే ఒక అద్భుతమైన సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశాభివృద్ధిలో మహిళా సాధికారతే కీలకమని నమ్ముతున్న చరణ్, మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఒక బృహత్తర ప్రకటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో  ట్రెండ్ అవుతోంది. మోదీ నిరంతరం దేశం కోసం చేస్తున్న నిస్వార్థ సేవలు, వికసిత్ భారత్ సాధన కోసం ఆయన చూపుతున్న దూరదృష్టి తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని రామ్ చరణ్ తెలిపారు. ఈ స్ఫూర్తితోనే బిజెపి ప్రారంభించిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ అనే మహత్తర కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ అభియాన్ లో భాగంగా రామ్ చరణ్ ఒక కీలకమైన హామీ ఇచ్చారు. రాబోయే కొద్ది నెలల్లో సరిగ్గా 1000 మంది మహిళలకు ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ (నైపుణ్యాభివృద్ధి) శిక్షణ అందించనున్నట్లు ప్రకటించాడు.     Also read: సూర్య కొత్త మూవీ టీజర్ వచ్చేసింది: రామాయణకి పోటీ తప్పదా!  ఈ 1000 మంది మహిళలకు ఇచ్చే నైపుణ్య శిక్షణ వల్ల వారు స్వయం ఉపాధి అవకాశాలను పొంది తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకోగలుగుతారు. కేవలం సోషల్ మీడియా వేదికగా విష్ చేసి ఊరుకోకుండా, ఏకంగా 1000 మంది మహిళల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేయడం చరణ్ యొక్క ఉదారతకు, సామాజిక బాధ్యతకి  అద్దం పడుతోంది.       [Ram Charan, Modi, Upasana, Ram charan Joins Seva Sankalp Abhiyan Pledges Skill Development,Seva Sankalp Abhiyan, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
    హిట్టు నా ఇంటి పేరు.. సూపర్ హిట్ నా ఒంటి పేరు అంటూ కరుప్పు( వీరభద్రుడు), విశ్వనాధ్ అండ్ సన్స్ తో  సూర్య ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. రాబోయే మూవీ కూడా అదే  ఫామ్ ని కంటిన్యూ పక్కా అంటూ అప్ కమింగ్ మూవీ 'సీన్' తో రాబోతున్నాడు. అవును 'జితు మాధవన్' దర్శకత్వంలో చేస్తున్న సూర్య 47వ చిత్రానికి  'సీన్' (Scene) అనే  టైటిల్‌ని  ఖరారు చేస్తూ చిత్రబృందం ఒక గ్లింప్స్ టీజర్‌ ని కాసేపటి క్రితం విడుదల చేసింది.  సుమారు నిమిషం 15 సెకన్లు ఉన్న టీజర్  చూస్తుంటే  సూర్య క్యారక్టర్ ఊహించని షేడ్స్ లో సాగబోతుందనే విషయం అర్ధమవుతూ ఉంది. పక్కా  యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయం తెలుస్తుండటంతో ఈ సారి గత రెండు చిత్రాలకి భిన్నంగా సరికొత్త సూర్య మెస్మరైజ్ చేయడం పక్కా. సూర్య సొంత నిర్మాణ సంస్థ '2D ఎంటర్‌టైన్‌మెంట్స్' మరియు కొత్తగా స్థాపించిన 'ఝగరం స్టూడియోస్' బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నజ్రియా నజీమ్, 'ప్రేమలు' ఫేమ్ నాస్లేన్, ఆనంద్ రాజ్, జాన్ విజయ్ మరియు ప్రముఖ యూట్యూబర్ రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైటిల్ టీజర్ విడుదలైన కేవలం కొద్ది సమయంలోనే యూట్యూబ్‌లో 15 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ దాటేసి సోషల్ మీడియాలో విశేషంగా ట్రెండ్ అవుతోంది. Also Read: భూఆరోపణలపై సరికొత్త ట్విస్ట్: ఇక వాళ్ళకి నిద్ర ఉండదు మలయాళ చిత్రసీమలో తన సరికొత్త మ్యూజిక్‌తో సంచలనాలు సృష్టించిన సుషిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సుషిన్ కి మొదటి తమిళ చిత్రం కావడంతో ఆడియో లవర్స్ మరియు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి దీపావళి కానుకగా నవంబర్ 6, న  రిలీజ్ కానుంది. రామాయణ పార్ట్ 1  కూడా అదే రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇండియా వైడ్ గా మాత్రం 8 న రిలీజ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీన్ vs  రామాయణ గా పిలుచుకోవాల్సిన పరిస్థితి. ఫాహద్ ఫాజిల్ తో 'ఆవేశం' తెరకెక్కించి 150 కోట్ల మార్కుని అందుకున్న జితు మాధవన్ దర్శకుడు.       [Scene Teaser, Suriya, Jithu Madhavan, Nazriya Nazim, Naslen, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ దిగ్గజాలు, అగ్ర కథానాయకులు ప్రధానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవలను కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ అక్కినేని నాగార్జున తదితర ప్రముఖులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ ప్రజాసేవను, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ .. నవభారత నిర్మాణంలో ప్రధాని చూపుతున్న క్రమశిక్షణ, దూరదృష్టి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ దిశగా నడిపిస్తున్న ఆయనకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ సుదీర్ఘ సందేశాన్ని ఇస్తూ.. గత పాతిక సంవత్సరాలుగా ప్రజాసేవకే అంకితమైన మోదీ నాయకత్వం ఎంతో ఆదర్శవంతమైనదని కొనియాడారు. భారత ప్రాభవాన్ని ప్రపంచ స్థాయిలో పెంపొందించడంలో ప్రధాని కృషి అపూర్వమని పవన్ విష్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్‌లో స్పందిస్తూ.. "ఎప్పుడూ విశ్రమించకుండా, నిరంతరం దేశ సంక్షేమమే పరమావధిగా శ్రమించే మహోన్నత నాయకుడు ప్రధాని మోదీ" అని కొనియాడారు. ఆయన స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో నిండుగా ఉందని విష్ చేశారు. కింగ్ అక్కినేని నాగార్జున సైతం ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, దేశాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి ఆయనకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీకి టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు తెలిపిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఈ పోస్టులను రీట్వీట్ చేస్తూ ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై  మీడియా సముఖంగా మాట్లాడుతు 'నాపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. అందులో ఎలాంటి నిజం లేదు.  ఆ వివాదాస్పద భూమికి సంబంధించిన అన్ని హక్కులు తమకే స్పష్టంగా ఉన్నాయి. దానికి తగిన లీగల్ డాక్యుమెంట్లు అన్నీ తమ వద్ద పక్కాగా ఉన్నాయి. తాము ఎలాంటి అక్రమ మార్గాల్లో భూమిలోకి ప్రవేశించలేదు. నేను, మరో వ్యక్తి సునీల్ కలిసి నానక్‌రామ్‌గూడలోని అసలైన రైతుల దగ్గరే  భూములని చట్టబద్ధంగా కొనుగోలు చేసాం.      Also Read: అందర్నీ అలరిస్తుందనే నమ్మకం లేదు: ది పారడైజ్ పై నాని సంచలన కామెంట్స్ భూమి వద్ద ఉన్న గేట్లను తామే స్వయంగా పగులగొట్టారంటూ వస్తున్న ప్రచారమంతా కూడా అవాస్తవం. ఇతరుల ఆస్తులను ఆక్రమించే ఉద్దేశం మాకు ఎంత మాత్రం లేదు.  నిరాధారమైన ఆరోపణలతో కొందరు కావాలనే మా ప్రతిష్టని  దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి  మండిపడ్డారు. ఇక ఈ వీడియోతో చంద్ర శేఖర్ రెడ్డి యాంటీ బ్యాచ్ కి పెద్ద దెబ్బె.   [Allu Arjun, Allu Arjun Father In Law Chandrasekhar Reddy Clarifies Land Dispute, Nanakramguda land dispute, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
మలయాళంలో విలక్షణమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సైజు కురుప్. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘భరత్ నాట్యం’. థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha) లో అందుబాటులోకి వచ్చి డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథ విషయానికొస్తే.. భరత్ నాయుడు (సాయికుమార్) పదవీ విరమణ పొంది కుటుంబంతో సరదాగా గడుపుతుంటాడు. ఆయన పెద్ద కొడుకు శశిధర్ (సైజు కురుప్) ఇంటి వ్యవహారాలు, పొలం పనులు చూసుకుంటుంటాడు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా భరత్ నాయుడికి గుండెపోటు వస్తుంది. ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రి, తనకు ‘రుక్మిణి’ అనే మరో భార్య, ‘అజయ్’ అనే కొడుకు ఉన్నారనే నిజం శశిధర్‌కి చెప్పి వాళ్లను చూడాలని కోరతాడు. తండ్రి చివరి కోరిక అని భావించి శశిధర్ రహస్యంగా ఆ రెండో కుటుంబాన్ని ఇంటికి తీసుకొస్తాడు. కానీ ఊహించని విధంగా తండ్రి కోలుకోవడంతో అసలు డ్రామా మొదలవుతుంది. ఆ రెండో కుటుంబం ఊళ్లో ఎవరి కంటా పడకుండా ఇంటి పైగదిలోనే దాచిపెడుతూ శశిధర్ పడే పాట్లు, ఆస్తి ఎక్కడ చేజారిపోతుందోననే భయం కథను ఎంతో వినోదాత్మకంగా ముందుకు నడిపిస్తాయి. దర్శకుడు క్రిష్ణదాస్ మురళి ఈ కథను ఎక్కడా బోర్ కొట్టకుండా సున్నితమైన హాస్యంతో మలిచారు. ముఖ్యంగా మొదటి భార్య కొడుకు, రెండో భార్య కొడుకును పోలికల విషయంలో కన్ఫ్యూజ్ చేస్తూ నడిపించే ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఆశలు, అవసరాలు మానవ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో సహజంగా చూపించారు. నటీనటుల పనితీరు విషయానికి వస్తే సైజు కురుప్ తన నటనతో మరోసారి మెప్పించారు. ఆస్తిని కాపాడుకోవడానికి పడే తపన, తండ్రి రహస్యం బయటపడకుండా చేసే విన్యాసాల్లో ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా కుదిరింది. సాయికుమార్, అభినవ్ రాధాకృష్ణన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా బబ్లూ సినిమాటోగ్రఫీ, శామ్యూల్ అబీ అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కి సరిగ్గా సరిపోయాయి. నిర్మాణ విలువలు కూడా కంటెంట్‌కి తగ్గట్టుగా కుదిరాయి. మొత్తానికి ‘భరత్ నాట్యం’ ఓ చక్కటి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్. బంధాలు, ఆస్తుల చుట్టూ తిరిగే ఈ కన్ఫ్యూజన్ డ్రామాను కుటుంబ సమేతంగా హాయిగా చూసి ఆస్వాదించవచ్చు.       [Bharath Natyam Review, Aha OTT Telugu, Saiju Kurup, Krishnadas Murali, Malayalam Telugu Dubbed Movie]
  ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో ప్యారడైజ్ మానియా స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి  నాని చేస్తున్న ప్రమోషన్స్  ఆ విధంగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ప్యారడైజ్ ఎలా ఉంటుందో అని ఎవరికీ వారు కథకులు, దర్శకులుగా మారి ఆలోచించుకుంటున్న మంచి టైంలో నాని రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో  నాని మాట్లాడుతు కొన్ని సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి అనే నమ్మకం ఉండదు. మా ప్యారడైజ్ చిత్రం కూడా అలాంటిదే. కేవలం జెన్ జీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన చిత్రమిది’ అంటూ చెప్పుకొచ్చాడు. విడుదలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నాని అభిమానుల్లో సరికొత్త టెన్షన్ ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే రీసెంట్ గా విడుదలైన ‘టాక్సిక్’ చిత్రాన్ని కూడా ఇదే తరహా లో ప్రమోట్ చేసి విడుదల చేశారు. కానీ ఆ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్యారడైజ్ కి కూడా అలాంటి ఫలితం వస్తే పరిస్థితి ఏంటో అని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి.      Also Read: మృతి కేసులో ట్విస్ట్: టాప్ రాజకీయనాయకుడి పేరు బయటకి: 500 కోట్లు డిమాండ్!  ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం ప్యారడైజ్ కోసం నాని చాలా చాలా కష్టపడ్డాడు. మేకర్స్ పరిస్థితి కూడా అదే. కానీ కష్టపడ్డారని ప్రేక్షకులు హిట్ చెయ్యరు. కంటెంట్ బాగుంటే హిట్ చేస్తారు. మరి ప్యారడైజ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం. 'A 'సర్టిఫికెట్ తో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.    [Nani, The Paradise, Nani Viral Comments On The Paradise Movie, Srikanth Odela, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
తమిళ చిత్రసీమలో విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించే చిన్న చిత్రాలకు కొదవలేదు. అలా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మొద రాత్రి’ ఇప్పుడు ఓటీటీ ప్రియులను పలకరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా ప్రముఖ డిజిటల్ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి, ఆ తర్వాత జరిగే శోభనం అనే ఆసక్తికరమైన నేపథ్యంతో ఈ చిత్రాన్ని దర్శకుడు రాజా కరుప్పస్వామి ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. రిషికాంత్, అనిష్మా అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వస్తుండటంతో దక్షిణాది డిజిటల్ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. కథ విషయానికొస్తే.. అసలు పరిచయమే లేని ఒక యువకుడు, యువతి పెద్దలు కుదిర్చిన వివాహబంధంతో ఒకటవుతారు. వివాహానంతరం వారి శోభనానికి ముహూర్తం నిశ్చయమవుతుంది. అయితే ఆ ప్రత్యేకమైన రాత్రి వారి జీవితాల్లోని ఊహించని రహస్యాలు బయటపడటం, దానివల్ల ఉత్పన్నమయ్యే వరుస హాస్య ఘట్టాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి. భారత్ శంకర్ అందించిన స్వరాలు, వినోదాత్మక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. థియేటర్లలో చిన్న సినిమాగా వచ్చి మంచి కలెక్షన్లు సాధించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రం ఓటీటీ విడుదలపై మంచి చర్చ జరుగుతోంది. శోభనం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కామెడీ డ్రామాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది కాబట్టి, ఈ చిత్రం వీకెండ్ వినోదానికి మంచి ఆప్షన్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రధాన భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్, ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తుండటంతో ఈ ఓటీటీ రిలీజ్ పై మంచి స్పందన లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.     [Modha Rathiri OTT Release, Netflix Telugu Movies, Rishikanth, Anishma Anil Kumar, Tamil Romantic Comedy]
Venkatesh and Trivikram Srinivas has come together for Aadarsha Kutumbam - AK47 film after a long time. The movie has Srinidhi Shetty, Nivetha Pethuraj among the cast with Nara Rohith. The movie is produced by Haarika Haasine Creations and it is schduled for 2nd October release.  According to industry talk, a song is presently being shot and is expected to be wrapped up by this weekend. The team would then reportedly need another two to three days for patchwork, with the entire shooting process likely to be completed only around September 24.  That would leave the makers roughly a week for the remaining post-production work before the release. This has now triggered speculation that the film could be pushed by a week to October 9.  The team is said to be waiting for the shooting to conclude before taking a final call on the release date. For now, October 2 remains the officially announced date, while the possible change is only industry gossip. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  యూట్యూబర్ గా రాణించడమంటే అంత తేలికైన విషయం కాదు. అలాంటిది ఆ రంగాన్ని ఎంచుకొని ఎంతో మంది అభిమానాన్ని  సంపాదించుకుంది చిత్తరి వైష్ణవి  సుమారు 50,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్లతో గ్రామీణ జీవనశైలి వీడియోలతో అలరించిన 20 ఏళ్ల వైష్ణవి, 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలోనే దారుణ హత్యకు గురైంది. పెళ్లయిన 10 నెలలకే అదనపు కట్నం వేధింపుల కారణంగా భర్త గందం హరిబాబు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి ఆమెను పొట్టనబెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కేసు నమోదై జైలుకు వెళ్లిన నిందితుడు హరిబాబు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే, బెయిల్‌పై బయట తిరుగుతున్న హరిబాబుపై తాజాగా ప్రతీకార దాడి జరగడం మళ్లీ కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే ఆర్‌ఆర్‌ చౌరస్తాలో  హరిబాబు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కారులో వచ్చిన నిందితులు హరిబాబుపై కత్తులు, వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన 26 ఏళ్ల హరిబాబు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, దారిన పోయే ప్రయాణికులు చూస్తుండగానే నడిరోడ్డుపై ఈ పగతీర్చుకునే హత్య జరగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దాడి చేసిన వెంటనే దుండగులు కారులో వేగంగా పరారయ్యారు. Also Read: శోభిత అక్కినేని ఆసక్తికర పోస్ట్: మన శత్రువులు ఎవరో తెలుసా.. ఫ్యాన్స్ షాక్! గతంలో జరిగిన వైష్ణవి దారుణ హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్‌ఆర్‌ చౌరస్తా పరిసరాల్లోని సిసిటివి (CCTV) కెమెరాల దృశ్యాలను విశ్లేషిస్తూ నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. వైష్ణవి కుటుంబం చుట్టూ తిరిగిన పగ మరియు కట్నం వివాదాలే ఈ వరుస హత్యలకు మూలమని స్థానికులు చర్చించుకుంటున్నారు.     [YouTuber Vaishnavi, YouTuber Vaishnavi Husband Murder, Nizamabad crime news, Haribabu murdered, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
Nani’s The Paradise is gearing up for a theatrical release on September 24, and the actor has begun the film’s promotional tour with director Srikanth Odela. The duo interacted with the media in Chennai as part of the promotions for the highly anticipated action drama. Speaking about the film, Nani said, “The Paradise is the kind of mass film that I am waiting to watch on the big screen. I love films with a strong emotional core, and even though this film has a lot of action, the mother emotion connects with the audience.” He also praised Anirudh Ravichander’s music and said his song with Kayadu Lohar would be another special attraction. Nani also opened up about his character Jadal and expressed confidence that the role would stay with audiences after the film’s release. “People will identify me as Jadal post release. I am confident that everyone will have a blasting theatrical experience,” he said, while promising an intense and emotional theatrical experience. Srikanth Odela revealed that The Paradise revolves around a revolution and an uprising against oppression, with the story drawing from real incidents he witnessed in his hometown. The director stressed that the film combines a grand revolutionary setting with a strong mother-son emotional core. Produced by Sudhakar Cherukuri, the film also stars Kayadu Lohar, Mohan Babu, Raghav Juyal and Sonali Kulkarni in prominent roles, with Anirudh composing the music. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన సాంప్రదాయ వంటకాలలో రుచితో పాటు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆకుకూరల్లో పొన్నగంటికూర అత్యంత విశిష్టమైనది. పూర్వకాలం నుండి మన పెద్దలు ఆకుకూరలను రోటి పచ్చళ్ల రూపంలో తయారు చేసి దినచర్యలో భాగం చేసుకునేవారు. ముఖ్యంగా పొన్నగంటికూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అమితమైన బలం చేకూరడమే కాకుండా, కంటి చూపు అద్భుతంగా మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ దివ్యౌషధాన్ని కేవలం పప్పు లేదా ఫ్రై రూపంలోనే కాకుండా, నోరూరించే పల్లెటూరి శైలి రోటి పచ్చడిగా తయారు చేసుకుంటే ఆ రుచే వేరు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పొన్నగంటికూర రోటి పచ్చడి తింటే నోటికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఒంటికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పోషకాల గని అయిన పొన్నగంటికూర రోటి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం చాలా సులభం. మొదటగా రెండు కట్టల తాజా పొన్నగంటికూరను తెంపుకుని, శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. దీనితో పాటు 10 నుండి 12 పచ్చిమిర్చి, ఒక చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండు, 1 టీస్పూన్ ధనియాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు మరియు తాలింపు కోసం నూనె, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు సిద్ధం చేసుకోవాలి. తయారీ విధానంలోకి వెళితే, ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో తుంచిన పచ్చిమిర్చిని వేసి బాగా వేయించి తీయాలి. ఆ తర్వాత శుభ్రం చేసిన పొన్నగంటికూరను బాణలిలో వేసి, మూతపెట్టి సన్నని మంటపై ఆకు మెత్తబడే వరకు దాదాపు 5 నుండి 7 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఆకు బాగా మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో రోట్లో లేదా మిక్సీ జార్‌లో వేయించిన ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన చింతపండు మరియు రుచికి సరిపడా కల్లుప్పు వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఆ తర్వాత మగ్గించి పెట్టుకున్న పొన్నగంటికూరను కూడా రోట్లో వేసి మరీ మెత్తగా కాకుండా రోటి పచ్చడి శైలిలో నూరుకోవాలి. చివరగా బాణలిలో 2 స్పూన్ల నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు కొద్దిగా ఇంగువతో తాలింపు పెట్టి, ఆ తాలింపును నూరిన పచ్చడిలో కలిపితే కమ్మని పొన్నగంటికూర రోటి పచ్చడి సిద్ధమవుతుంది. పొన్నగంటికూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని రక్తహీనతను నివారించడంలో, ఎముకలను దృఢపరచడంలో మరియు చర్మ కాంతిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కంప్యూటర్లు, మొబైల్స్ ముందు గంటల తరబడి పనిచేసే నేటి తరం వారికి కంటి అలసటను తగ్గించి చూపును మెరుగుపరచడానికి ఈ పచ్చడి ఎంతగానో ఉపయోగపడుతుంది. వారానికి కనీసం రెండుసార్లు ఈ ఆరోగ్యకరమైన పచ్చడిని తింటే జీర్ణవ్యవస్థ మెరుగవ్వడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.     [Ponnaganti Kura, Ponnaganti Kura Pachadi, Roti Pachadi, Eye Health, Vitamin A, Iron Rich Foods, Calcium Rich Foods, Antioxidants, Telugu Recipes, Traditional Indian Food]
మన శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి మెదడు ఆరోగ్యం అత్యంత కీలకమైనది. నేటి వేగవంతమైన జీవనశైలి, నిరంతర మానసిక ఒత్తిడి, సరిగ్గా లేని ఆహార అలవాట్లు మరియు నిద్రలేమి కారణంగా అనేకమంది తీవ్రమైన జ్ఞాపకశక్తి లోపం, ఏకాగ్రత లేకపోవడం మరియు మానసిక అలసట వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు మందగించడం సహజమే అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు మరియు సరైన అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మన మెదడును ఎల్లప్పుడూ అత్యంత చురుగ్గా, పదునుగా మరియు ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మానసిక క్షీణతను నివారించి, జ్ఞాపకశక్తిని రెట్టింపు చేయడానికి ఉపయోగపడే అత్యంత కీలకమైన లైఫ్‌స్టైల్ చిట్కాలను మరియు మెదడు ఆరోగ్యాన్ని పెంచే విధానాలను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. మెదడు ఆరోగ్యంగా మరియు వేగంగా పనిచేయడానికి మనం తీసుకునే ఆహారం ప్రాథమిక పునాదిగా నిలుస్తుంది. మెదడు కణాల నిర్మాణానికి, సమాచార మార్పిడికి అవసరమైన ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభించే వాల్ నట్స్, బాదం, అవిసె గింజలు మరియు చేపలను ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటితో పాటు ఆకుకూరలు, బెర్రీలు, డార్క్ చాక్లెట్ వంటి యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మెదడులోని నాడీ కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా సురక్షితంగా ఉంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గితే మెదడు పనితీరు తక్షణమే మందగిస్తుంది. అందుకే ప్రతిరోజూ సరిపడా నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల ఏకాగ్రత మరియు ఆలోచనా శక్తి గణనీయంగా పెరుగుతాయి. కేవలం మంచి ఆహారం మాత్రమే కాకుండా, శారీరక వ్యాయామం కూడా మెదడు చురుకుదనానికి ఎంతగానో దోహదపడుతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, యోగా, ఈత లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వేగవంతమై, మెదడుకు అవసరమైన అదనపు ఆక్సిజన్ మరియు పోషకాలు అందుతాయి. వ్యాయామం వల్ల మెదడులో  ఎండోర్ఫిన్లు  అనే రసాయనాలు విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాయామంతో పాటు మెదడుకు కూడా క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. సుడోకు, చెస్ ఆడటం, పజిల్స్ పూర్తి చేయడం, కొత్త భాషలు నేర్చుకోవడం లేదా కొత్త సంగీత వాయిద్యాలను సాధన చేయడం వంటి విషయాలు మెదడులోని న్యూరాన్లను నిరంతరం ప్రేరేపించి, జ్ఞాపకశక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా మెదడును పునరుజ్జీవింపజేయడానికి సరైన నిద్ర మరియు మానసిక ఒత్తిడి లేని జీవితం అత్యవసరం. ప్రతిరోజూ రాత్రి సమయంలో 7 నుండి 8 గంటల గాఢనిద్ర పోవడం వల్ల రోజంతా సేకరించిన సమాచారాన్ని జ్ఞాపకాలుగా మార్చే ప్రక్రియ మెదడులో వేగంగా జరుగుతుంది. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల నాడీ వ్యవస్థ బలహీనపడి మతిమరపు పెరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి మెదడు కణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ ధ్యానం (మెడిటేషన్), ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన నియమాలను మీ రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకోవడం ద్వారా మీ మెదడును ఎల్లప్పుడూ చురుగ్గా, పదునుగా ఉంచుకోవచ్చు.     [Brain Health, Memory Improvement, Mental Focus, Omega 3 Foods, Antioxidant Foods, Physical Exercise, Brain Training, Quality Sleep, Stress Management, Healthy Lifestyle]
భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి ప్రమేయం ఎంతవరకు అవసరం.! భార్యాభర్తల బంధం రెండు మనసుల కలయిక, పరస్పర నమ్మకం , ప్రేమతో ముడిపడి ఉన్న ఒక పవిత్రమైన అనుబంధం. ఎంతటి మధురమైన దాంపత్యంలోనైనా చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజం. అయితే, ఈ గొడవలను పరిష్కరించుకోవడానికి మూడవ వ్యక్తిని  బంధంలోకి రానివ్వాలా, వస్తే ఆ ప్రమేయం ఎంతవరకు ఉండాలి అనేది నేటి కాలంలో ప్రతి జంట ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన విషయం. ప్రతి చిన్న విషయానికి మూడవ వ్యక్తిని ఆశ్రయించడం వల్ల కాపురం మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంటుంది.  అసలు భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి అవసరం ఎంతవరకు ఉండాలి, ఏ సందర్భాలలో వారి సలహాలు ఉపయోగపడతాయి, ఏ సమయాల్లో దూరంగా ఉంచాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుంటే..   చిన్న చిన్న గొడవలు, ఇంట్లో జరిగే రోజువారీ అభిప్రాయ భేదాలకు మూడవ వ్యక్తి ప్రమేయం అస్సలు అవసరం లేదు. దంపతుల మధ్య సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఇద్దరే కూర్చుని, ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవడం అత్యుత్తమ మార్గం. ఇంట్లో జరిగే విషయాలు లేదా భాగస్వామి బలహీనతలు మూడవ వ్యక్తికి   తెలిస్తే, వారు మీ వైవాహిక జీవితాన్ని వారి ఆలోచనా కోణం  నుండి తప్పుగా అంచనా వేసే అవకాశం ఉంటుంది . ఎంతటి ఆత్మీయులైనా, సొంత తల్లిదండ్రులైనా సరే, భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవల్లో కలగజేసుకుంటే అది దంపతుల మధ్య ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కొన్ని సందర్భాలలో దంపతులు ఇద్దరూ ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాకపోవచ్చు. మాటలు పూర్తిగా నిలిచిపోవడం, ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేకపోవడం లేదా సమస్య తీవ్రరూపం దాల్చడం వంటి పరిస్థితులలో మూడవ వ్యక్తి ప్రమేయం అవసరమవుతుంది. అయితే ఇక్కడ ఎవరిని మధ్యవర్తిగా ఎంచుకుంటున్నారనేది చాలా ముఖ్యం. ఇద్దరి మేలు కోరేవారు, పక్షపాతం లేకుండా మాట్లాడేవారు, అనుభవజ్ఞులైన పెద్దల ప్రమేయం మాత్రమే వైవాహిక బంధానికి మేలు చేస్తుంది. ఒకరి వైపే మొగ్గు చూపేవారు లేదా మీ గొడవలను ఆసరాగా చేసుకుని ఇద్దరి మధ్య దూరం పెంచే ఆలోచన ఉన్నవారికి ఎప్పటికీ చోటు ఇవ్వకూడదు.  మూడవ వ్యక్తి కేవలం మీ ఇద్దరి మధ్య మళ్లీ మాటలు మొదలవడానికి, బంధాన్ని బలపడేలా చేయడానికి ఒక వంతెనలా మాత్రమే పనిచేయాలి తప్ప, మీ జీవిత నిర్ణయాలను వారు తీసుకునే స్థాయికి అధికారం ఇవ్వకూడదు. నేటి కాలంలో బంధాలలో వచ్చే క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి నిపుణులైన కౌన్సెలర్లు లేదా ఫ్యామిలీ థెరపిస్ట్‌ల సహాయం తీసుకోవడం చాలా మంచిది. వారు ఎలాంటి వ్యక్తిగత పక్షపాతం లేకుండా సమస్య మూలాలను అంచనా వేసి, బంధాన్ని మళ్లీ నిలబెట్టడానికి మంచి పరిష్కారాలను చూపుతారు. బంధువులు లేదా స్నేహితుల కన్నా ప్రొఫెషనల్ కౌన్సెలర్ల ప్రమేయం చాలా సురక్షితమైనది, ఎందుకంటే వారు భార్యాభర్తలకు సంబంధించిన వ్యక్తిగత  విషయాలను రహస్యంగా ఉంచుతారు. మూడవ వ్యక్తి ఎంతటి అత్యవసర పరిస్థితుల్లో జోక్యం చేసుకున్నప్పటికీ, దంపతులు ఇద్దరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, చివరి నిర్ణయం భార్యాభర్తలు ఇద్దరిదే అయి ఉండాలి. ఇంకొకరి ప్రమేయం వల్ల మీ గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతినకుండా చూసుకోవాలి. దంపతుల మధ్య ఉండే రహస్యాలు, బలహీనతలు మూడవ వ్యక్తి వద్ద చర్చనీయాంశం కాకూడదు. చివరగా చెప్పాలంటే, భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి ప్రమేయం అనేది వీలైనంత వరకు తక్కువగా ఉండటమే మంచిది. సమస్య తీవ్రమై, దంపతులు స్వయంగా పరిష్కరించుకోలేని స్థితికి వచ్చినప్పుడు మాత్రమే నిపుణులు లేదా నమ్మకమైన పెద్దల సలహాలు తీసుకోవాలి. ఇద్దరి మధ్య సరైన అవగాహన, ఓపెన్ గా   మాట్లాడుకునే వాతావరణం ఉంటే మూడవ వ్యక్తి అవసరమే రాదు.                      *రూపశ్రీ.  
నీలిబృంగాది తైలం పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణకు ఉపయోగించే  ఒక అద్భుతమైన మూలికా నూనెగా పేరుగాంచింది. నేటి కాలంలో పెరిగిన కాలుష్యం, మానసిక ఒత్తిడి,  జీవనశైలి సరిగా లేకపోవడం,  రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ నీలిబృంగాది తైలం ఒక సహజసిద్ధమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ నూనె గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నూనె తయారీలో వాడే పదార్థాలు.. ఈ నూనె తయారీలో నీలి, భృంగరాజ్ లేదా గుంటగలగర, ఆమ్లా లేదా ఉసిరి, శతక్రాంత, అజక్షీర అంటే మేక పాలు, మహిష క్షీర అంటే  బర్రె పాలు, గోక్షీర అంటే ఆవు పాలు,  మరియు కొబ్బరి పాలు లేదా నువ్వుల నూనె వంటి శక్తివంతమైన ఆయుర్వేద మూలికలు మరియు పాలను ఉపయోగిస్తారు. ఈ పదార్థాల కలయిక జుట్టుకు , కుదుళ్లకు కావలసిన సమగ్ర పోషణను అందిస్తుంది. ప్రయోజనాలు.. నీలిబృంగాది తైలం క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడం చాలా  తగ్గుతుంది. ఇది కుదుళ్లను దృఢంగా మార్చి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే నీలి , భృంగరాజ్ మూలికలు జుట్టు సహజ రంగును కాపాడటంలో విశేషంగా తోడ్పడతాయి. చిన్న వయస్సులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో , జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జుట్టు పెరగడమే కాకుండా, తలలో వచ్చే చుండ్రు , దురద సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కుదుళ్లలో రక్తప్రసరణను మెరుగుపరచి, వెంట్రుకలు చిట్లడాన్ని , పొడిబారడాన్ని అడ్డుకుంటాయి. ఈ తైలం కేవలం జుట్టుకే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే చలవ చేసే గుణం వల్ల రాత్రి పూట ఈ నూనెతో తలకు మర్దన చేసుకుంటే ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది. కంటి అలసటను తగ్గించి, శిరోభారాన్ని ఉపశమనం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఎలా వాడాలి?  ఈ నూనెను వాడే విధానం కూడా చాలా సులభం. కొద్దిగా తైలాన్ని తీసుకుని కుదుళ్లకు బాగా పట్టించి, మునివేళ్ళతో  సున్నితంగా మర్దన చేయాలి. కనీసం అర గంట నుండి గంట సేపు ఉంచుకున్న తర్వాత మెత్తటి సీకాయ లేదా మైల్డ్ ఆయుర్వేద షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.  సహజమైన పద్ధతిలో జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా , అందంగా మార్చుకోవడానికి నీలిబృంగాది తైలం చాలా మంచి ఎంపిక.                        *రూపశ్రీ.  
టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ విషయాల గురించి యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్.జి.వి. సత్య ఈ వీడియోలో వివరిస్తున్నారు. ముఖ్యంగా చెన్నంగాకు  ( కసువింద, కసుంధి ఆకులు)   గురించి, వీటిని చట్నీ, పొడి లేదా కూర రూపంలో తీసుకోవడం గురించి డాక్టర్ సత్య వివరించారు. టైఫాయిడ్ తర్వాత జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, తీసుకోవాల్సిన ఆహారం, ఆరోగ్య జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. టైఫాయిడ్‌కు సంబంధించిన ఆహారపు అలవాట్లు, చెన్నంగాకు ఉపయోగాలు, జీర్ణక్రియకు సంబంధించిన డాక్టర్ సూచనలు తెలుసుకోవాలంటే పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. టైఫాయిడ్ వంటి అనారోగ్య పరిస్థితుల్లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. మందులను వైద్యుల సూచన లేకుండా ఆపకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
అమరాంత్ సీడ్స్.. తోటకూర గింజలు లేదా రాజ్‌గిరా అని వీటిని పిలుస్తారు. ఇవి ఇటీవల కాలంలో సూపర్ ఫుడ్‌గా విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రాచీన కాలం నుండి మన సాంప్రదాయ ఆహారంలో భాగమైన ఈ గింజలు, ఆధునిక ఆరోగ్య నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నాయి. మన నిత్య జీవితంలో తోటకూరను ఆకుకూరగా ఎంతగా ఉపయోగిస్తామో, దాని గింజలలో ఉన్న పోషక విలువలు కూడా అంతకంటే ఎక్కువే. సాధారణంగా కనిపించే ఈ చిన్న గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. అమరాంత్ సీడ్స్ అంటే.. అమరాంత్ సీడ్స్ అనేది 'అమరాంథస్' అనే మొక్క నుండి లభించే గింజలు. తెలుగులో వీటిని తోటకూర గింజలు అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో వీటిని 'రాజ్‌గిరా' లేదా 'రామ్‌దానా' అని అంటారు. అమరాంత్ గింజలను ధాన్యాల జాబితాలో చేర్చినప్పటికీ, వృక్షశాస్త్రం ప్రకారం ఇవి నిజానికి సూడోసిరియల్స్ గా పిలుస్తున్నారు. అంటే బియ్యం, గోధుమల లాగా కాకుండా, ఇవి ఆకుకూరల జాతికి చెందిన గింజలు. అందుకే వీటిలో ఇతర సాధారణ ధాన్యాల కంటే పోషకాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఉండకపోవడం వల్ల ఇది గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆరోగ్యానికి అమరాంత్ సీడ్స్ చేసే మేలు.. పోషకాల గని: అమరాంత్ గింజలలో శరీరానికి కావలసిన అత్యంత ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోస్ఫరస్ , పోటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం ఇతర ధాన్యాలతో పోలిస్తే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్: సాధారణంగా వృక్ష సంబంధిత ఆహారాలలో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం చాలా అరుదు. కానీ అమరాంత్ లో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా 'లైసిన్' అనే అమైనో ఆసిడ్ ఇందులో ఉండటం వల్ల ఇది శరీరంలో ప్రొటీన్ శోషణకు ఎంతగానో తోడ్పడుతుంది. శాఖాహారులకు, కండరాల పుష్టిని కోరుకునే వారికి ఇది సరైన పోషకాహారం. జీర్ణవ్యవస్థ మెరుగుదల: అమరాంత్ గింజలలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కాబట్టి, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం , కొలెస్ట్రాల్ నియంత్రణ: అమరాంత్ లో ఉండే సహజ నూనెలు , ఫైబర్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు గుండె నాళాల్లో పూడికలు ఏర్పడకుండా నిరోధించి, రక్తప్రసరణను నార్మల్ గా ఉండేలా చేస్తాయి. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. బరువు తగ్గడానికి: బరువు తగ్గాలనుకునే వారికి అమరాంత్ సీడ్స్ చక్కని ఎంపిక. తక్కువ క్యాలరీలు, అధిక ప్రొటీన్ , పీచు పదార్థం కలిగి ఉండటం  వల్ల శరీర జీవక్రియ రేటు అంటే మెటబాలిజం  పెరుగుతుంది. కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమై, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది. డయాబెటిస్ నియంత్రణ: ఈ గింజలలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణ ధాన్యాల కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా క్రమబద్ధంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రోజువారీ ఆహారంలో అమరాంత్ ను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి.. అమరాంత్ లో స్క్వాలేన్ , లోనాఫిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు  ఉంటాయి. ఇవి శరీరంలో  ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో తోడ్పడతాయి. శరీర కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఆహారంలో అమరాంత్ సీడ్స్ ఎలా తీసుకోవాలి? అమరాంత్ సీడ్స్ ని వివిధ రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిని వేయించి, పాప్‌కార్న్ లాగా మార్చి పాలు లేదా తేనెతో కలిపి ఉదయపు అల్పాహారంగా తీసుకోవచ్చు. వరి అన్నం లాగే వీటిని ఉడికించి తీసుకోవచ్చు లేదా ఉప్మా రూపంలో వండుకోవచ్చు. అమరాంత్ గింజలను పిండిగా తయారుచేసి  గోధుమ పిండితో కలిపి రొట్టెలు, చపాతీలు తయారు చేసుకోవచ్చు. పాయసం లేదా పానీయాలలో ఉడకబెట్టిన అమరాంత్ గింజలను చేర్చి పౌష్టికాహారంగా తీసుకోవచ్చు. సలాడ్లు లేదా సూప్‌లలో వేయించిన అమరాంత్ గింజలను పైన చల్లుకోవడం ద్వారా పోషక విలువలతో పాటు రుచిని పెంచుకోవచ్చు.                      *రూపశ్రీ.