మునిసిపోల్స్ లో పులివెందులలో వైసీపీకి ఎదురైన ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే పరిషత్ ఎన్నికలలోనూ ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. పులివెందుల మునిసిపాలిటీని కోల్పోయిన రోజుల వ్యవధిలోనూ వైసీపీ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కూడా కోల్పోయింది. . తాజాగా నిర్వహించిన స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పులివెందుల జడ్పీటీసీ   స్థానాన్ని టీడీపీ  భారీ ఆధిక్యతతో గెలుచుకుంది.   ఈ పరిషత్ పోరులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి భారతి ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై నిలకడగా ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. తుది ఫలితం వెలువడేసరికి ఆమె తన  సమీప ప్రత్యర్థి  వైసీపీ అభ్యర్థిపై 1,463 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఫలితం వెలువడగానే కౌంటింగ్ కేంద్రం వెలుపల అలాగే నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కొద్దిరోజుల క్రితమే నిర్వహించిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. పట్టణ ప్రాంతంలో లభించిన ఆ అనూహ్య మద్దతు కాకతాళీయం కాదని, గ్రామీణ ప్రాంత పరిధిలోకి వచ్చే ఈ జడ్పీటీసీ ఎన్నికలలోనూ తెలుగుదేశం విజయం, పులివెందులలో వైసీపీ పట్టు కోల్పోయిందనడానికి తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుసగా మున్సిపాలిటీ, పరిషత్ స్థానాల్లో   వైసీపీ పరాజయం పాలుకావడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర  ఆందోళనకు గురిచేయడమే కాకుండా, వారిలో నిరాశను, నిస్ఫృహను నింపింది.  ఫలితాలు అధికారికంగా వెలువడిన వెంటనే స్థానిక నాయకులు బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయి  తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. స్థానిక స్థాయిలో  సాధించిన ఈ వరుస విజయాలు రాబోయే రోజుల్లో పులివెందుల రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తాయని తెలుగుదేవం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  ఇది కూడా చదవండి: ఎస్కార్ట్ నంటూ నీడలా వెంబడించి: చెవిరెడ్డికి చెమటలు పట్టించి, చుక్కలు చూపించిన సుధారెడ్డి.! వైసీపీకి కంచుకోట అయిన పులివెందులలో చోటుచేసుకున్న ఈ రాజకీయ మార్పు   వెనుక స్థానిక ప్రజల నాడిలో వచ్చిన మార్పే కారణమంటున్నారు.  వరుస ఓటములతో వైసీపీకి తమ సొంత నియోజకవర్గంలోనే ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందా అన్న అంతర్మథనంలో వైసీపీ ఉంది.   రాబోయే రోజుల్లో   పులివెందులలో తెలుగుదేశం పార్టీ తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు. నియోజకవర్గవ్యాప్తంగా   స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు, వరుస పరాజయాల నుంచి కోలుకుని తిరిగి పుంజుకునేందుకు వైసీపీ ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది.   మీకు నచ్చవచ్చు: పోటీ నుంచి వైదొలగిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థలు: మైదుకూరు, చిన్నమండెంలో వైసీపీకి బిగ్ షాక్.! పులివెందులలో ఉద్రిక్తత: పార్నపల్లె వద్ద అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.! [Telugudesham Bags Pulivendula ZPTC, Jagan Bastion, Collapse, YCP, Shock, TeluguOne]
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.    ఒకరిద్దరి ప్రయోజనాల కోసం పార్టీలో తనను అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించినప్పటికీ, తనను మానసికంగా ఇబ్బంది పెట్టేలా పరిస్థితులు సృష్టించారని ఆయన వాపోయారు.    తాను స్వచ్ఛందంగా పార్టీని వీడలేదని, అక్కడి వాతావరణం వల్ల బయటకు వచ్చేలా బలవంతం చేశారని ఆయన స్పష్టం చేశారు. ఏనాడూ లేనివిధంగా పార్టీలో తనను ఇబ్బందులకు గురిచేస్తూ, మానసిక క్షోభ కలిగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు దక్కిన గౌరవం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో కరువైందని ఆయన గుర్తు చేసుకున్నారు. కొందరి తప్పుడు మాటలు నమ్మి తనను దూరం పెట్టారని, ఇది తనను తీవ్రంగా బాధిచించిందని ఆయన పేర్కొన్నారు.    ఎన్నికల సమయంలోనూ, అంతర్గత సమావేశాల్లోనూ తనను కించపరిచేలా వ్యవహరించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 70కి పైగా అవమానాలను మౌనంగా భరించానని, ఇక ఆత్మగౌరవాన్ని చంపుకుని అక్కడ కొనసాగలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.    రాజకీయాల్లో ఎవరికైనా ఆత్మగౌరవం ముఖ్యం అని, దానిని తాకట్టు పెట్టి బతకలేమని ఆయన స్పష్టం చేశారు. కూర్చున్న కొమ్మను నరికేసేలా కొందరు వ్యవహరించిన తీరు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.     ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్న పార్టీలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.    భవిష్యత్తులో నూతన రాజకీయ వేదిక ద్వారా ప్రజల గొంతుకగా మారుతామని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే పాలనను అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.          [ Vijay Sai Reddy, Jagan Mohan Reddy, YSRCP, New Political Party Andhra Pradesh, Andhra Pradesh Politics, Sumathi Reddy, Andhra Pradesh politics, New political party AP ]  
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో   కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు. తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.  మరి కొన్నింటిలో ఆధిక్యంలో ఉంది.  చీరాల మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలలో   వైసీపీ సోదిలోకి కూడా కనిపించలేదు. అనూహ్యంగా అక్కడ తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. చీరాల మునిసిపాలిటీ ఎన్నికలలో ప్రధానంగా తెలుగుదేశం కూటమితో కాంగ్రెస్ హోరాహోరీ తలపడింది. ఇక్కడ వైపీపీ మూడో స్థానానికే పరిమితమైంది.  మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య  శుక్రవారం ప్రారంభించారు.    చీరాల మున్సిపాలిటీలో  తెలుగుదేశం అభ్యర్థులు ముందంజలో ఉండగా, రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. పలు వార్డులలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చింది. అయితే వైసీపీ మాత్రం కనీస పోటీ ఇవ్వలేక చతికిల బడింది. చీరాల మునిసిపాలిటీలో పలు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చారు.  గతంలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాలు, స్థానిక సమీకరణాల ప్రభావం ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చీరాలలో ఆమంచి కృష్ణ ప్రసాద్ కు ఉన్న పట్టు కాంగ్రెస్ కు లాభించిందని అంటున్నారు. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఆమంచి కాంగ్రెస్ లో చేరారు. కాగా.. 2024 ఎన్నికల్లోనూ చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి 41,859ఓట్లు దక్కించుకున్నారు. మూడో స్థానంలో నిలిచారు.  ఇది కూడా చదవండి:  ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.! ఆమంచికి చీరాలలో ఉన్న పట్టు వైసీపీకి మైనస్ గా మారింది. చీరాలలోని ఒక్క వార్డులో కూడా వైసీపీ అభ్యర్థి కనీసం రెండో స్దానానికి చేరుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్ విజయం సాధించిన 25వ వార్డులో వైసీపీ బాగా వెనుక బడింది.    చీరాల మున్సిపాలిటీలోని మెజారిటీ వార్డులను కైవసం చేసుకుంటూ తెలుగుదేశం కూటమి ముందంజలో దూసుకుపోతోంది.  మున్సిపల్ చైర్మన్  ఓటింగ్‌లోనూ తెలుగుదేశం అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యతలో ఉన్నారు. మొత్తంగా కడపటి సమాచారం అందే సరికి చీరాలలో ఎనిమిది  వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే చీరాలలో ఆ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉంది.   మీకు నచ్చవచ్చు:  [Chirala Municipal Election, Congress, Ahead Ycp,  Competition TDP Versus Congress, Andhra Pradesh Politics, Amanchi Krishna Mohan, Effect, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
లెజండ్రీ యాక్టర్ కోట శ్రీనివాసరావు.. సాక్షాత్తు  తెలుగు సినిమానే ఘోర తపస్సు చేసి తన ప్రతిభ ఇండియన్ సినిమాకి తెలియాలని కోట గారు తన ఒడిలో ఉండేలా చేసుకుందేమో. మరి కళారంగంలో ఎన్ని రకాల వాచకాలు, హావభావాలు, బాడీ లాంగ్వేజస్ ఉంటాయో వాటన్నింటిని ఉతికి ఇస్త్రీ చేసిన దిగ్గజ నటుడు. యూట్యూబ్ లో డైలీ కోట గారి సీన్స్ చూసి కానీ నిద్రపోని అభిమానుల ఫిగర్  కౌంట్ కి లెక్కే లేదు.  అసలు కోట గారికి అంతా నటన ఎలా అబ్బిందో గతంలో ఆయన చెప్పిన ఇంటర్వ్యూల ద్వారానే ఒకసారి చూద్దాం.   కోట గారు  తన క్యారక్టర్ ల కోసం చేసే పరిశోధన, దాని ద్వారా నటనకు జోడించే సహజత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. గతంలో ఓ కార్యక్రమంలో కోటా శ్రీనివాస్ మాట్లాడుతూ..  హైదరాబాద్‌కి కొత్తగా వచ్చిన 1994-95 ప్రాంతంలో, పాత్రలను ఎలా మరింత వాస్తవికంగా చూపించాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనకు ఒక ఆలోచన తట్టింది. ఒక స్నేహితుడి సలహాతో, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్లు దొరుకుతాయని చెప్పడంతో, ఆయన కావాలని కల్లు కాంపౌండ్‌లోకి వెళ్లి కూర్చుని డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లను దగ్గరగా పరిశీలించేవారట. కేవలం సంభాషణలను అనుకరించడం కాకుండా, నటనలో ఒక వైవిధ్యాన్ని తీసుకురావాలనే తపనతో తాను ఇటువంటి ప్రయోగాలు చేసేవాడినని ఆయన వివరించారు.ఈ ప్రయోగాల ఫలితమే తన నటనలో తెలంగాణ మాండలికం యొక్క సమ్మిళితం అని కోటా శ్రీనివాసరావు చెప్పారు. ఆ కల్లు కాంపౌండ్‌లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు గమనించిన గొప్ప సంస్కారమే తనను ప్రభావితం చేసిందని, బేసిక్‌గా ఆ మాండలికమే తనను ఇంత గొప్ప నటుడిని చేసిందని ఆయన కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకున్నారు. “ప్రతిఘటన” సినిమాలో తన నటనను అందరూ బాగా చేశారని మెచ్చుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా, ఆయన సినిమాలోని ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను కూడా చెప్పారు. ఇది కూడా చదవండి: నరకానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది: ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్!   “హైదరాబాద్‌కి రైల్ గాడి మీద పోయేటందుకు, టికెట్ కొనేందుకు పైసలు ఉన్న ప్రతివాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది భాయ్ అని అడిగినాం అనుకోండి, హైదరాబాద్ లో ఆడి ఉండే హోటల్ పేరు చెప్తాడు. మరి గింతటి దమాక్ లేనోళ్ళు అందరూ రాజకీయాల్లోకి వస్తే నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలి అని నన్ను చంపుకుతింటారు. నేను ఎవరికి ఇవ్వాలి? వాడి దగ్గర ఉన్న పైసలు చూసి, వాడి దగ్గర ఉన్న సత్తా చూసి ఇవ్వాలి. ఆ రెండూ ఉన్నోడు ఎవడయ్యా అంటే మన ఖాళీ గాడు.   అంటే నేను రౌడీలకి, వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అంటాడు. నువ్వు ముసలోడివి, గభాల్న ఏదైనా అయ్యి నువ్వు పోతే మళ్లా ఎలక్షన్ అది పెట్టాల్సి వస్తది, ఎందుకు ఇప్పుడు అని చెప్పాలి. గా సీట్ నీకు ఇయ్యలేదు అన్నందుకే కదా ఓ లొల్లి పెడుతున్నావ్ ఓ పెద్దాయనా.. నువ్వా పెద్దోడివి అయిపోతివి, లటక్ కను చచ్చినావ్ అనుకో ఏం చేయాలి.? ఫిర్ ఎలక్షన్ పెట్టాలి. ఎవడు పెడతాడు ఆ ఈ పరేషాన్ అంతా. అని డైలాగ్ చెప్పాడు. ఈ డైలాగ్ ఆయన తెలంగాణ మాండలికంపై పట్టును, పాత్రకు ప్రాణం పోసే ఆయన సామర్థ్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తుంది. ఏది ఏమైనా కోట గారు ఒక పరిపూర్ణమైన లెజెండ్.   మీకు నచ్చవచ్చు :నరకానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది: ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్! మీకు నచ్చవచ్చు: రామాయణ రికార్డ్స్ అవుట్! [Kota Srinivasa Rao The Method Actor Whose Craft Demands Courage, kota Srinivasa Rao Journey, Kota Srinivasa Rao, Tollywood actor, Padma Shri recipient,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Ramayana has exploded at the box office after Diwali, delivering a First Monday performance that has rewritten several existing records. Starring Ranbir Kapoor, Yash and Sai Pallavi, the epic opened to huge numbers, but the first working day after the festive weekend revealed the film's extraordinary theatrical potential. The Nitesh Tiwari directorial has reportedly collected over Rs.126 crore gross in India on Monday alone, comfortably surpassing the previous First Monday record of Rs.60 crore held by Dhurandhar 2. The massive jump in collections has taken the film's box-office performance to an entirely different level. Ramayana has also created history on BookMyShow by selling over 1.66 million tickets in just 24 hours. No Indian film has registered such a massive single-day ticket sale on the platform, making this another major milestone for the epic. Interestingly, the film's appeal is not restricted to the Hindi market. Yash's enormous popularity in the South has significantly contributed to its footfalls in the Telugu, Tamil and other southern markets. The scale of the response is reportedly surprising trade experts, as the film is attracting audiences across language boundaries. Also Read: Shocking: Pawan Kalyan and Anna Konidela announce divorce While Ranbir Kapoor and Sai Pallavi have impressed audiences as Lord Rama and Maa Sita, Yash's portrayal of Ravana has emerged as one of the biggest talking points. His mass appeal and screen presence have added another dimension to the film's theatrical pull. With Tuesday's early trends indicating another record-breaking day, Ramayana is showing no signs of slowing down. Produced by Namit Malhotra, Yash and DNEG, the film has become a box-office phenomenon, with Dil Raju's SVC releasing it across the Telugu states. Check Out: Atlee pens an emotional letter to his wife                     Varanasi leaked story is completely fake Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ విషయంలోనూ ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.290 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల విషయంలో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరు మీద రికార్డు ఉంది. ఆ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు సుమారు రూ.225 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ‘వారణాసి’ హక్కుల కోసం రూ.290 కోట్ల డీల్ కుదిరిందనే వార్త నిజమైతే.. పాత రికార్డు సుమారు రూ.65 కోట్ల తేడాతో బద్దలైనట్లే. ఈ హక్కుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు పోటీపడినట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కూడా ఆసక్తి చూపించాయని, చివరకు మైత్రీ మూవీ మేకర్స్ ఈ డీల్‌ను దక్కించుకుందని టాక్. ఒక సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.290 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. ఈ స్థాయి పెట్టుబడిని వెనక్కి తీసుకురావాలంటే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ట్రేడ్ అంచనాల ప్రకారం డిస్ట్రిబ్యూటర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.500 కోట్ల గ్రాస్‌కు చేరే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. దీంతో సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.! మహేశ్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్లోబల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికి సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. బిజినెస్ విషయంలో మాత్రం ‘వారణాసి’ ఇప్పటి నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. మరి థియేటర్లలోనూ ఈ సినిమా అదే స్థాయి సంచలనం సృష్టిస్తుందా అనేది చూడాలి. మీకు నచ్చవచ్చు: రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. అలా అంటారనే ఆరోజు మౌనంగా ఉన్నా.! ఘనంగా ప్రభాస్ పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ.?       [Varanasi Telugu States Rights, Varanasi 290 Crore Deal, Varanasi Theatrical Rights, Mythri Movie Makers, RRR Movie, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, Telugu Film News]  
తమిళ సినీ పరిశ్రమలో హీరోలకు ఉండే అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో స్టార్‌డమ్‌ సంపాదించుకున్న కొందరు రాజకీయాల్లోకి అడుగుపెడుతుంటే.. మరికొందరు మాత్రం తమకు నచ్చిన రంగంలోనే కొనసాగుతున్నారు. ముఖ్యంగా నటుడు విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావడంతో సినీ అభిమానుల్లో మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్నలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై సూర్య స్వయంగా స్పందించి తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. సూర్యకు సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అగరం ఫౌండేషన్‌ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాల కారణంగానే గత కొంతకాలంగా సూర్య రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా తన సినిమా ‘సీన్‌’ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాజకీయ ప్రవేశంపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. అయితే రాజకీయాలను ద్వేషించడం లేదని, వాటిని నిశితంగా గమనిస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలంటే ఆ రంగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని, అందులోని బాధ్యతలు, కష్టనష్టాలను అర్థం చేసుకోవాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది కూడా చదవండి: పవన్‌కళ్యాణ్, అన్నా లెజినోవా సంచలన నిర్ణయం.. పరస్పర అంగీకారంతో విడిపోయిన జంట.! ఇక అగరం ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న పనులను సేవగా పిలవనని, అది తమ బాధ్యతగా భావిస్తామని చెప్పారు. తనకు సమాజంలో గుర్తింపు, స్థానం ఇచ్చిన ప్రజలకు తిరిగి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వీటి వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పినంత మాత్రాన రాజకీయాలను ద్వేషిస్తున్నట్లు కాదని, వాటిని మౌనంగా, నిశితంగా గమనిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు.. సమాజంలో మార్పు రావాలంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూర్య అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ముందుగా ఆ రంగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. సమాజంలో ఉన్న సమస్యలకు మూలం అజ్ఞానమని, దాన్ని తొలగించడానికి విద్య ఒక్కటే మార్గమని అన్నారు. అవినీతిని మూడో వ్యక్తి వచ్చి నిర్మూలించలేడని, ప్రతి ఒక్కరూ తమలో తాము మార్పు తెచ్చుకొని చిన్న చిన్న విషయాల్లోనూ అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పారు. ఇలా రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన సూర్య.. ప్రస్తుతం తనకు రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ఆలోచన లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తానికి విజయ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సూర్య కూడా అదే బాటలో నడుస్తారా? అనే చర్చకు ఆయన తాజా వ్యాఖ్యలతో సమాధానం లభించినట్లయింది. సినిమాలు చేస్తూనే అగరం ఫౌండేషన్‌ ద్వారా విద్యార్థులకు సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తున్న సూర్య.. రాజకీయాల్లోకి మాత్రం ఇప్పట్లో రావడం లేదని తేల్చిచెప్పారు. మీకు నచ్చవచ్చు: రామాయణాన్ని వెనక్కి నెట్టిన స్మాల్ మూవీ: సంచలన కలెక్షన్స్.!     [Suriya Political Entry, Suriya Politics News, Suriya Latest News, Suriya Vijay Politics, Actor Suriya Political Statement, Suriya Agaram Foundation, Suriya Social Service, Suriya Political Career, Suriya Scene Movie, Tamil Cinema News, Thalapathy Vijay Politics]
ప్రియా భవానీ శంకర్.. సెల్యులాయిడ్ పై తను పెర్ఫార్మ్ చేస్తుంటే అందం,అభినయం పోటీపడుతూ ఉంటాయనేది అభిమానుల నమ్మకం. వాళ్ళ నమ్మకం నిజమే అన్నట్టుగా కళ్ళ ముందు ఇంకా 'ఇరుముడి' మూవీలో తాను పోషించిన క్యారక్టర్ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ భామ నుంచి 'డిమోంటీ కాలనీ 3 ' రాబోతుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన హారర్‌ ఫ్రాంచైజీగా పేరుగాంచిన 'డిమోంటీ కాలనీ' నుంచి వస్తుండటంతో అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తాజాగా మేకర్స్ వెల్లడించిన విషయాలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఈ భయానక చిత్రానికి 'డిమోంటీ కాలనీ 3' (Demonte Colony 3) అనే టైటిల్‌ను ఖరారు చేయగా, 'ది ఎండ్‌ ఈజ్‌ టూ ఫార్‌' (The End Is Too Far) అనేది దీనికి సంబంధించిన ఆసక్తికరమైన ఉపశీర్షికగా ఉంది. దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటనని  వెలువరించింది. ఇది కూడా చదవండి: రామాయణాన్ని వెనక్కి నెట్టిన స్మాల్ మూవీ: సంచలన కలెక్షన్స్! ఈ హారర్‌ థ్రిల్లర్‌ని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన అధికారిక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. "నరకానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది.. మీ కోసం ఈ సంక్రాంతికి ఓ పీడకల ఎదురు చూస్తోంది" అంటూ చిత్ర బృందం ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఆసక్తికరమైన క్యాప్షన్ సినిమాపై మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అజయ్‌ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన టేకింగ్, భయానక వాతావరణాన్ని సృష్టించే విధానం ఈ ఫ్రాంచైజీకి ప్రధాన బలమన్న సంగతి తెలిసిందే. కేవలం ప్రియా భవానీ శంకర్ మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో నటుడు అరుళ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముత్తు కుమార్, మీనాక్షి, అర్చన తదితరులు ఇతర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రతిభావంతులైన నటీనటులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల కలయికలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమా అనుభూతిని పంచడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మీకు నచ్చవచ్చు:రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్.. అంతా రంగస్థలం!  మీకు నచ్చవచ్చు: సాయి ధరమ్ తేజ్ ని మోసం చేసిన హీరోయిన్!   [Demonte Colony 3 Sankranthi Release, Demonte Colony 3, Priya Bhavani Shankar, Ajay Gnanamuthu, Sankranthi release, Horror movies, Tamil cinema news, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
దీపావళి వేడుకల్లో టపాసులు కాల్చడంపై నటి రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పండగ పేరుతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భారీ శబ్దాలతో క్రాకర్స్ పేల్చడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మాట్లాడితే తనను ‘యాంటీ హిందూ’ అని విమర్శిస్తారనే ఉద్దేశంతో పండగ రోజు మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు. అర్ధరాత్రి దాటినా టపాసుల మోత మాత్రం ఆగడం లేదు. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇబ్బందులు పడుతున్నారంటూ నటి రేణూ దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల సమయంలోనూ భారీ శబ్దాలతో క్రాకర్స్ పేల్చడంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. తన పోస్ట్‌లో రేణూ దేశాయ్.. ‘‘రాత్రి 11 గంటలైనా ఇంత పెద్ద శబ్దాలతో టపాసులు ఎందుకు పేలుస్తున్నారు? నిన్న నేను ఏదైనా మాట్లాడి ఉంటే నన్ను యాంటీ హిందూ అని పిలిచేవారు. అందుకే మౌనంగా ఉన్నాను. కానీ ఈ రాత్రి 11 గంటలకు ఏ పండగ జరుగుతోంది? ఇంత శబ్దం చేయాల్సిన అవసరం ఏముంది?’’ అంటూ ప్రశ్నించారు. గత మూడు రోజులుగా అర్ధరాత్రి 1, 2, చివరికి 3 గంటల వరకు కూడా టపాసులు పేలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన బెడ్‌రూమ్ సౌండ్‌ప్రూఫ్ కావడంతో తనకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. చుట్టుపక్కల ఉన్నవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: DNK Trailer.. ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్స్.. సీరియస్ సమస్యలతో కామెడీ.! టపాసులు కాల్చి ఆనందించడం తప్పు కాదని, కానీ ఆ ఆనందం ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు. వృద్ధులు, అప్పుడే పుట్టిన పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు పెద్ద శబ్దాల వల్ల ఒత్తిడికి గురవుతారని గుర్తుచేశారు. కనీసం రాత్రి 10 గంటలలోపు టపాసులు కాల్చడం పూర్తి చేయాలని సూచించారు. కాలుష్యం గురించి మాట్లాడితే.. ఏడాది పొడవునా వాహనాలు, పరిశ్రమల వల్ల కాలుష్యం వస్తోంది కదా.. ఒక్కరోజు టపాసులు కాల్చడం వల్ల ఏం అవుతుందని కొందరు వాదిస్తారని కూడా ఆమె ప్రస్తావించారు. అయితే పండగను ఆనందంగా జరుపుకోవడంలో తప్పులేదని, ఆ ఆనందం కోసం తోటి మనుషుల బాధను పట్టించుకోకపోవడం మాత్రం సరైనది కాదని పేర్కొన్నారు. సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకునే రేణూ దేశాయ్.. గతంలోనూ పండగ వేడుకల పేరుతో అర్ధరాత్రి వరకు పెద్ద శబ్దాలతో డీజేలు పెట్టడంపై స్పందించారు. ఇప్పుడు మరోసారి టపాసుల శబ్దాలపై ఆమె చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. పండగ సంబరాలు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జరుపుకోవాలన్న ఆమె విజ్ఞప్తికి నెటిజన్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: ఘనంగా ప్రభాస్ పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ.? ‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!       [Renu Desai Instagram Post, Renu Desai Crackers Controversy, Renu Desai Diwali Post, Renu Desai Instagram, Renu Desai Latest, Renu Desai, Diwali 2026, Deepawali 2026, Telugu News]  
కలెక్షన్ల సునామి అంటే ఇది అంటూ రామాయణ వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు అదే రామాయణకి దీన్ని కూడా కలెక్షన్ల సునామి అనే అంటారని ఒక సినిమా నిరూపిస్తే బాక్స్ ఆఫీస్ తన హోదా చూసి గర్వపడుతుంది కదు.. ఇప్పుడు అదే జరుగుతుంది.  జపాన్‌కు చెందిన టోహో సంస్థ నిర్మించిన భారీ యాక్షన్‌ చిత్రం 'గాడ్జిల్లా మైనస్‌ జీరో' (Godzilla Minus Zero) బాక్సాఫీస్‌ లెక్కలనే తారుమారు చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. నవంబరు 6న విడుదలైన ఈ చిత్రం, హాలీవుడ్ మరియు వరల్డ్ వైడ్ వైడ్ ఆడియెన్స్‌ని  విశేషంగా ఆకట్టుకుంటూ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌ వద్ద 'రామాయణ' ని  వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.  ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సాగిన మొదటి వారాంతంలో (Weekend) 'గాడ్జిల్లా మైనస్‌ జీరో' ఉత్తర అమెరికాలో అద్భుతమైన రీతిలో ఏకంగా 31.6 మిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టింది. 'రామాయణ' మూడు రోజుల్లో 8.7 మిలియన్‌ డాలర్లను మాత్రమే సాధించి ఐదవ స్థానానికి పరిమితమైంది. అంటే, సరిగ్గా ఇదే వీకెండ్‌ లెక్కలను బట్టి చూస్తే 'గాడ్జిల్లా' చిత్రం అమెరికాలో 'రామాయణ' కంటే దాదాపు 260% అధిక వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది కూడా చదవండి: బిగ్ బ్రేకింగ్: రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్: అంతా రంగస్థలంలోనే ఉందా!   ఈ బాక్సాఫీస్‌ యుద్ధంలో అత్యంత ఆసక్తికరమైన మరియు చర్చనీయాంశమైన అంశం సినిమాల బడ్జెట్లే. 'రామాయణ' చిత్రం భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందగా.. దానితో పోలిస్తే కేవలం 9% వ్యయంతో, అంటే సుమారు 19 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తోనే 'గాడ్జిల్లా మైనస్‌ జీరో' తెరకెక్కింది. అంటే ఇండియన్‌ ఎపిక్‌ బడ్జెట్‌లో పదవ వంతు ఖర్చుతో తయారైన ఈ జపాన్ రాక్షస చిత్రం, వసూళ్లలో మాత్రం హాలీవుడ్ మరియు గ్లోబల్ మార్కెట్లని షాక్‌కి గురిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఈ చిత్రం తొలి వారాంతంలో మొత్తం 63 మిలియన్‌ డాలర్ల భారీ డెబ్యూ కలెక్షన్లను సాధించి గ్లోబల్ బాక్సాఫీస్‌ని సైతం శాసించిందని చెప్పవచ్చు.'తకాషి యమజాకి' దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్జిల్లా  2023 నాటి సెన్సేషనల్ హిట్ 'గాడ్జిల్లా మైనస్ వన్' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది. 1949 నాటి యుద్ధానంతర జపాన్‌ నేపథ్యంలో సాగే ఈ కథ, కోలుకుంటున్న దేశంపై పడే మరొక పెను ముప్పును ఉత్కంఠభరితంగా చూపించింది. కేవలం జపనీస్‌ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో విడుదలైనప్పటికీ, ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం చూస్తుంటే 'కంటెంట్' అనేది ఎంత గొప్పదో మరోసారి తెలియచేసింది. అదే విధంగా కాస్త లేట్ అయినా  కంటెంట్ ఉంటే కాసులు వాటంతట అవే వస్తాయనే సత్యాన్ని కూడా నిరూపించింది.     మీకు నచ్చవచ్చు: రామాయణ మూవీ రివ్యూ  మీకు నచ్చవచ్చు:సీతాదేవి రోల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్!   [Godzilla Minus Zero Beats Ramayana,Godzilla Minus Zero Collections, Ramayana box office, North America box office, Godzilla vs Ramayana, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. ఇప్పుడు ‘DNK’(దొంగ నా కొడుకు) అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే టీజర్, పాటలతో ఆసక్తి పెంచిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. మాస్ మహారాజా రవితేజ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్‌లో మౌళి ఓ బాధ్యత లేని యువకుడిగా కనిపిస్తున్నాడు. బెట్టింగ్‌కు అలవాటు పడిన అతడు డబ్బుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంటాడు. బెట్టింగ్‌లో నష్టపోవడంతో ఆన్‌లైన్ లోన్ యాప్స్‌లో అప్పులు చేయడం, గర్ల్‌ఫ్రెండ్ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం మొదలుపెడతాడు. అప్పులు పెరిగిపోవడం.. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో చివరికి దొంగతనాల బాట పడతాడు. తన స్నేహితుడితో కలిసి దొంగతనాలకు ప్లాన్ చేస్తాడు. మరోవైపు వరుస దొంగతనాల వెనుక ఉన్న ముఠా కోసం పోలీసులు వేట మొదలుపెడతారు. దీంతో మౌళి చేసే దొంగతనాలు, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కథలో కామెడీకి కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. ‘లిటిల్ హార్ట్స్’లో తన కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న మౌళి.. ఈ సినిమాలోనూ అదే స్టైల్‌ను కొనసాగించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా డబ్బుల కోసం అతడు పడే పాట్లు, ఇంట్లో తల్లిదండ్రులతో జరిగే సన్నివేశాలు నవ్వులు పూయించేలా ఉన్నాయి. అలీ, రాజిత మౌళి తల్లిదండ్రుల పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఘనంగా ప్రభాస్ పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ.? సుశ్మిత శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మౌళి, సుశ్మిత మధ్య లవ్ ట్రాక్ కూడా సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం చాలామంది యువతను ఇబ్బంది పెడుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్స్ వంటి అంశాలను కథలో భాగం చేయడం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ సీరియస్ సమస్యలను దర్శకుడు శ్రీను కంబాల పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చెబుతోంది. డబ్బుల కోసం తప్పు దారి పట్టిన యువకుడి ప్రయాణం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తుండగా, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ, శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో నవ్విస్తుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: ‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా.? ‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!       [DNK Trailer Telugu, Donga Naa Koduku Trailer, Donga Naa Koduku Movie, DNK Movie, Little Hearts, Mouli, Ravi Teja, Mythri Movie Makers, Telugu Film News]  
మెగాపవర్ స్టార్ 'రామ్ చరణ్' మనసులో నుంచి ఒక మాట వచ్చిందంటే అది ఎంత వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోనే 'ఇట్లు అర్జున' మూవీ ద్వారా డెబ్యూ ఇవ్వబోతున్న 'అనీష్' పేరు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వైబ్రేషన్ క్రియేట్ చేసే పనిలో ఉంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. కింగ్ నాగార్జునతో షిరిడి సాయి, ఓమ్ నమో వెంకటేశాయ వంటి చిత్రాలని నిర్మించిన నిర్మాత మహేష్ రెడ్డి. ఆ మహేష్ రెడ్డి కుమారుడే అనీష్ ఇట్లు అర్జున ద్వారా పరిచయం కాబోతున్నాడు. మహేష్ ఉప్పల దర్శకుడు కాగా వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరించగా, ని నాగార్జున సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతు' నేను నటించిన కల్ట్ హిట్ మూవీ ‘రంగస్థలం’తో ‘ఇట్లు అర్జున’ చిత్రాన్ని బేరీజు వేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక చెవిటి పాత్రలో నటించి చరిత్ర సృష్టించిన ‘రంగస్థలం’ సినిమా కంటే, అనీష్ మూగవాడిగా నటించిన ‘ఇట్లు అర్జున’ చిత్రం మరింత పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెర్రీ ప్రకటించారు. ఇది కూడా చదవండి:మూడు రోజులకి సీన్ కొట్టిన కలెక్షన్స్! కొత్త హీరో అయినప్పటికీ అనీష్ తన నటనతో అద్భుతాలు సృష్టించాడని, డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతో నవరసాలను పండించడం సాధారణ విషయం కాదని ప్రశంసల వర్షం కురిపించారు.  కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో కింగ్ నాగార్జున సాటిలేరని ఆయన సమర్పిస్తున్నారంటేనే ఆ చిత్రంపై భారీ స్థాయిలో నమ్మకం కలుగుతుందని, పరిశ్రమలో కొత్తవారికి దూసుకువచ్చి మరీ అవకాశాలు ఇచ్చే దమ్ము ఒక్క నాగార్జునకే ఉందని ఆయన స్పష్టం చేశారు. దాదాపు ఏడాది క్రితమే అనీష్ తనకు ఈ కథను వినిపించి కొన్ని సన్నివేశాలు చూపించాడని, తన మొదటి సినిమాతో పోలిస్తే అనీష్ పదిరెట్లు అద్భుతంగా నటించాడని చరణ్ కొనియాడారు. 'కాకా' ఫేమ్ అనస్వర రాజన్ హీరోయిన్ గా చేస్తున్న 'ఇట్లు అర్జున' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. మీకు నచ్చవచ్చు:పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులు! మీకు నచ్చవచ్చు:ఆల్ టైం వరల్డ్ రికార్డు కొట్టిన రామాయణ    [Ram Charan Speech Itlu Arjuna Movie event, Ram Charan About Itlu Arjuna hero, Itlu Arjuna movie, Rangasthalam, Nagarjuna Akkineni, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Andhra Pradesh Deputy CM and Janasena Chief Pawan Kalyan and his wife Anna Konidala (Anna Lezhneva) have officially announced their decision to part ways, bringing an end to their 13-year marriage. The announcement has come as a shock to fans and followers of the actor-turned-politician, who have always wished for stability and happiness in his personal life. Having gone through two failed marriages earlier, this marks another difficult chapter in his life. Pawan Kalyan first married Nandini in 1997, but their relationship ended in divorce in 2008. He subsequently fell in love with actress Renu Desai while working together on Badri and Johnny. The couple got married in 2009 and had two children, Akira Nandan and Aadhya. However, their marriage too ended in 2012. He met Anna Lezhneva during the making of Teen Maar in 2011. Their friendship eventually blossomed into love, and the couple got married on September 30, 2013. They have two children together, Polena Anjana Pawanova and Mark Shankar Pawanovich. Anna largely stayed away from the limelight while Pawan continued his acting and political commitments. In their official press note addressed to well-wishers, near and dear ones, the couple stated, "After sharing a significant part of our lives together, we have decided to part ways with mutual understanding and respect." They further clarified that despite the end of their marriage, they would "remain good friends and devoted parents" to their children. Also Read: Varanasi leaked story is fake and here's why! The statement also emphasised that their children's happiness and well-being would remain their shared priority. Requesting privacy during this personal transition, the couple sought "understanding, kindness, and respect for our privacy." They also extended their heartfelt gratitude to everyone who had stood by them throughout their journey. Pawan Kalyan has an enormous fan following, and news of his third marriage coming to an end is something many of his admirers will find difficult to digest. After two previous marriages failed, fans had hoped that his relationship with Anna would stand the test of time. While the couple have chosen to part ways with mutual understanding and respect, the announcement marks the end of another significant relationship in the actor's personal life. Check Out:  DNK Trailer is out now                      Sharwanand Bhogi postponed due to censor issues   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రస్తుత ఆధునిక కాలంలో సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుకోవడం కోసం రసాయనాలతో కూడిన సన్‌స్క్రీన్‌ లోషన్లను విపరీతంగా వాడేస్తున్నాము. అయితే, బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ రియో గ్రాండే డో సుల్ (UFRGS) పరిశోధకులు తాజాగా నిర్వహించిన ఒక అద్భుతమైన శాస్త్రీయ అధ్యయనంలో చర్మానికి ఎలాంటి హాని చేయని సరికొత్త సహజ మార్గదర్శకం వెలుగులోకి వచ్చింది. మొక్కల నుండి సేకరించిన  బ్రాచీసెరిన్  (Brachycerine) అనే సహజ ప్లాంట్ మెటబోలైట్ మానవ చర్మానికి అతినీలలోహిత (UV) కిరణాల నుండి అత్యుత్తమ రక్షణ కల్పించగలదని పరిశోధకులు నిరూపించారు. ఈ ప్రత్యేకమైన సహజ సమ్మేళనం దక్షిణ అమెరికా అడవులలో లభించే ఒకానొక చిన్న చెట్టు ఆకుల నుండి గ్లూకోసైడ్ మోనోటర్పీన్ ఇండోల్ ఆల్కలాయిడ్ రూపంలో వెలికితీశారు. సాధారణంగా సూర్యుడి నుండి వచ్చే యూవీ ఏ (UV A) మరియు యూవీ బి (UV B) కిరణాలు చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అయితే ఈ బ్రాచీసెరిన్ సమ్మేళనం చర్మ కణాలపై జరిపిన ప్రయోగాలలో అతినీలలోహిత కిరణాల వల్ల జరిగే డీఎన్ఏ (DNA) నష్టాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడైంది. అంతేకాకుండా, హానికరమైన సూర్యరశ్మి తగలడం వల్ల చర్మంలోని నరాల ముగింపు సాంద్రత దాదాపు సగానికి పైగా క్షీణించిపోతుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఈ సన్‌స్క్రీన్‌ ఏజెంట్ కేవలం పైపూత రక్షణ మాత్రమే కాకుండా, చర్మపు కణాల లోపలి వరకు జరిగే నష్టాన్ని కూడా నివారిస్తుంది. పరీక్షించిన క్షీరద కణాలపై జరిపిన సైటోటాక్సిసిటీ (Cytotoxicity) పరీక్షల్లో ఈ బ్రాచీసెరిన్ ఎలాంటి విషపూరిత ప్రభావాన్ని చూపలేదని, మానవ వినియోగానికి ఇది అత్యంత సురక్షితమైనదని స్పష్టమైంది. సాంప్రదాయ సన్‌స్క్రీన్‌లలో లభించే రసాయనాలు కేవలం యూవీ కిరణాలను అడ్డుకోవడం లేదా గ్రహించడం మాత్రమే చేస్తాయి. కానీ ఈ మొక్కల ఆధారిత మెటబోలైట్ ఏకకాలంలో యూవీ శోషణతో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలను ప్రదర్శిస్తూ డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్‌ను కలిగి ఉంది. దీనివల్ల చర్మంపై పడే ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని ఇది సమర్థవంతంగా తొలగిస్తుంది. ఇది కూడా చదవండి:జ్వరం లెక్కలు, మారుతున్నాయా? సగటు శరీర ఉష్ణోగ్రతపై తాజా స్టడీ! ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ ఆర్థర్ జెర్మానో ఫెట్ నెటో (Arthur Germano Fett Neto) నేతృత్వంలోని బృందం, ఈ వనరులను అందించే మొక్కలను వెజిటేటివ్ ప్రొపగేషన్ (సహజ శాఖీయ అన్యుత్పాదక పద్ధతి) ద్వారా సులభంగా పెంచవచ్చని తెలిపారు. ఇది భవిష్యత్తులో వాణిజ్యపరంగా విస్తృతమైన, పర్యావరణ హితమైన బ్రాడ్ స్పెక్ట్రమ్ నేచురల్ సన్‌స్క్రీన్‌ల తయారీకి బలమైన పునాది వేయనుంది. రసాయనాలతో కూడిన ఉత్పత్తులకు కాలం చెల్లే సమయం ఆసన్నమైందని, స్వచ్ఛమైన మొక్కల ఆధారిత చర్మ సంరక్షణ వైపు ప్రపంచం అడుగులు వేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చర్మ క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో మరియు ఆరోగ్యకరమైన, సహజసిద్ధమైన రక్షణను అందించడంలో ఈ అద్భుతమైన మొక్కల ఆవిష్కరణ వైద్య మరియు సౌందర్య రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది. మీకు నచ్చవచ్చు:రోజూ మినప్పప్పు తింటే, మీ శరీరానికి అందే అమేజింగ్, ఆరోగ్య ప్రయోజనాలు!​                               వెన్నెముక దృఢంగా ఉండాలా? అయితే ఈ 5 సులువైన అలవాట్లు పాటించండి!     Brachycerein Sunscreen, Plant Derived Skin Protection, Skin Cancer Prevention Tips, Natural UV Shield, Dermatology Research Discoveries, Health Science News, Health Articles In Telugu.
వర్షాకాలం, శీతాకాలం వచ్చిందంటే చాలు చాలా మందిని వేధించే ప్రధాన సమస్య మొండి జలుబు మరియు దగ్గు. ఎంతటి మొండి జలుబునైనా, గొంతు గరగరనైనా ఇబ్బంది పెట్టే ఈ సమస్యల నుంచి సహజంగా ఉపశమనం పొందడానికి మన సాంప్రదాయ వంటకాల్లో చక్కటి పరిష్కారాలున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటకాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అల్లం వంకాయ కూర కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్య పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. పండుగలు, వ్రతాలు, పూజా సమయాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తయారుచేసే ఈ సాత్విక వంటకం ఆలయాల్లో లభించే ప్రసాదాల రుచిని గుర్తుకు తెస్తుంది. ఈ ఆరోగ్యకరమైన కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ అల్లం వంకాయ కూర తయారీకి ప్రధానంగా 500 గ్రాముల తాజా తెల్ల వంకాయలను, 30 నుంచి 35 గ్రాముల తాజా అల్లాన్ని సేకరించాలి. వంటకం తయారీ కోసం ముందుగా బాణలీలో 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయాలి. ఈ కూరకు నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే అసలైన ఆంధ్ర స్టైల్ రుచి వస్తుంది. నూనె వేడెక్కిన తర్వాత 1 టీస్పూన్ ఆవాలు, 2 ఎండు మిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇలా చేయడం వల్ల వంటకానికి చక్కటి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసి ఎర్రగా మారే వరకు వేయించుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తరువాత అర టీస్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఒక రెబ్బ కరివేపాకు వేసి పరిమళం వచ్చేలా వేయించాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం తయారీ వైపు దృష్టి పెట్టాలి. అల్లాన్ని మిక్సీలో బరకగా రుబ్బడం కంటే, రోటిలో వేసి మెత్తగా దంచడం వల్ల దానిలోని రసం పూర్తిగా విడుదలై అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఇలా రోట్లో నూరుకున్న అల్లం ముద్దను తాలింపులో వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వేగిన తర్వాత 2 చీరిన పచ్చిమిర్చిని కలపాలి. అల్లం, పచ్చిమిర్చి మిశ్రమం బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మసాలా పొడులు నూనెలో చక్కగా వేగిన తర్వాత, ముందుగా క్యూబ్స్‌గా తరిగి ఉప్పు నీటిలో ఉంచిన 500 గ్రాముల తెల్ల వంకాయ ముక్కలను వేయాలి. వంకాయ ముక్కలకు మసాలాలు పూర్తిగా పట్టేలా మూత పెట్టకుండా 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం మంటపై వేయించుకోవాలి. ఇది కూడా చదవండి:AI వల్ల మరో ప్రాణం గాల్లోకి.. వైద్యుల హెచ్చరికలను కాదని చాట్‌జీపీటీని నమ్మి మహిళ మృతి! వంకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత, బాణలీపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో వంకాయ మెత్తబడే వరకు ఉడికించాలి. అల్లంలో ఉడికిన వంకాయ ముక్కలు, నూనె వేడితో కూడిన మసాలాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో తాజా అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. వంకాయ పూర్తిగా ఉడికి మెత్తబడిన తర్వాత స్టవ్ ఆపడానికి ముందు గుప్పెడు తాజా కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. చివరగా దండిగా కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఉల్లి, వెల్లుల్లి లేకపోయినా అల్లం కారంతో నోరూరించే ఈ ఆంధ్ర స్టైల్ అల్లం వంకాయ కూర వేడి వేడి అన్నంతో తింటే అమృతంలా ఉంటుంది. చపాతీలు లేదా పూరీలతో కూడా ఇది నూటికి నూ శాతం సరిపోతుంది. ఎంతటి మొండి జలుబునైనా తరిమికొట్టే ఈ అద్భుతమైన సాంప్రదాయ వంటకాన్ని మీ ఇంట్లో కూడా తప్పకుండా ప్రయత్నించి రుచి చూడండి. మీకు నచ్చవచ్చు:సహజంగా, అందమైన కళ్ల కోసం, ఈ 800 ఏళ్ల నాటి ఆయుర్వేద మార్గం ట్రై చేయండి!                              నిపుణులు, హెచ్చరిస్తున్న డయాబెటిస్ తెచ్చే ,4 హానికరమైన ఆహారాలు!     Allam Vankaya Curry, Andhra Ginger Brinjal Recipe, Eggplant Curry For Cold, Traditional Spicy Curries, South Indian Food Recipes, Healthy Home Remedies Food, Food Articles In Telugu.
సాయంకాలం వేళ చల్లటి వాతావరణంలో వేడివేడి టీ త్రాగుతూ, కరకరలాడే స్నాక్స్ తినాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖ్యంగా వర్షాకాలం లేదా చలికాలంలో వేడివేడి వడలంటే ఎవరికైనా నోరూరుతుంది. అయితే శనగపప్పు వడలకు పూర్తిగా భిన్నంగా, కేవలం మినప్పప్పుతో తయారుచేసే ఈ కరకరలాడే మసాలా మినప వడలు దక్షిణాది వంటకాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి.  ఫ్యామిలీ పార్టీలకు, సాయంకాలపు టీ పార్టీలకు ఇది అద్భుతమైన మరియు సరైన ఎంపికగా నిలుస్తుంది. పైన అద్భుతంగా క్రిస్పీగా, లోపల దూదిలా సాఫ్ట్‌గా ఉండే ఈ వడలను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ అరుదైన వంటకం కోసం ముందుగా రెండు కప్పుల పొట్టు మినప్పప్పును శుభ్రంగా కడిగి కనీసం ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత దానిలోని నీళ్లన్నీ పూర్తిగా వడారిన తర్వాత, అందులో నుండి అరకప్పు పప్పును పక్కన పెట్టుకోవాలి. పొట్టు లేని పప్పును ఉపయోగిస్తే నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది కానీ, రాత్రంతా నానబెట్టుకుంటే ఉదయం లేదా సాయంత్రం చేసుకోవడానికి మరింత సులభంగా ఉంటుంది. కడిగిన నీటిని వృధా చేయకుండా, అదే నీటిని తిరిగి వాడుకుంటూ పొట్టును సులభంగా తొలగించవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్‌లో నీళ్లు అస్సలు పోయకుండా, పక్కనపెట్టిన మిగిలిన మినప్పప్పును కొద్దికొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. జార్‌ను సగం వరకు మాత్రమే నింపి, మధ్యమధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్‌లో రుబ్బుకోవడం ద్వారా పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా, ముద్దగా, గట్టిగా తయారవుతుంది. ఈ విధంగా రుబ్బుకున్న గట్టి పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర తరిగేటప్పుడు వాటిలో తడి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, లేదంటే పిండి పల్చబడిపోతుంది. పిండి ఎల్లప్పుడూ గట్టిగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత చేతిని కొద్దిగా నీళ్లతో తడుపుకుని, కొద్దికొద్దిగా పిండిని తీసుకుని వడలుగా ఒత్తుకోవాలి. వడలు సులభంగా రావడానికి తడిపిన కాటన్ క్లాత్‌ను కూడా ఉపయోగించవచ్చు. వడలను మరీ లావుగా కాకుండా కొంచెం పల్చగా ఒత్తుకోవడం వల్ల లోపల వరకు సరిగ్గా ఉడుకుతాయి. ఇది కూడా చదవండి:ఆరోగ్యకరమైన గుండె కోసం, ఉత్తమమైన వంట నూనెలు ఇవే! ఇప్పుడు కడాయిలో నూనెను బాగా వేడి చేసి, మంటను మాత్రం మధ్యస్థంగా (Medium Flame) ఉంచాలి. ఒత్తుకున్న వడలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే గరిటెతో కదపకుండా, పచ్చిదనం కొద్దిగా తగ్గిన తర్వాత అటూ ఇటూ తిప్పుకుంటూ బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. మధ్యస్థ మంటపై నిదానంగా వేయించడం వల్ల వడలు నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా, లోపల వరకు ఉడికి చక్కటి సువాసనను ఇస్తాయి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే బయట త్వరగా రంగు వస్తుంది కానీ లోపల పచ్చిగా అలాగే ఉంటుంది. సరిగ్గా ఈ పద్ధతిని పాటిస్తే కేవలం రెండు కప్పుల పప్పుతో సుమారు 27 నుండి 30 గుల్లటి వడలను సులభంగా తయారు చేసుకోవచ్చు. బాగా కాలిన క్రిస్పీ వడలను నూనె నుండి తీసి సర్వింగ్ ప్లేట్‌లోకి లేదా కిచెన్ టిష్యూపైకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా సరిగ్గా ఇదే పద్ధతిలో వడలను తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడివేడిగా ఉండే ఈ మసాలా మినప వడలను అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ లేదా గుమగుమలాడే సాంబార్‌తో కలిపి తింటే ఆ రుచి వేరుగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో సాయంకాలం వేళ ఈ వడలను తింటే మొండి దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా దెబ్బకు పరారవుతాయని పెద్దలు చెబుతుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వాలెంటైన్ లేదా వీకెండ్ టీ టైమ్‌లో మీ కుటుంబ సభ్యులందరికీ ఈ రుచికరమైన రెసిపీని చేసి ఆశ్చర్యపరచండి! మీకు నచ్చవచ్చు:జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు తగ్గించే అమృతఫలం.. బేరి పండు ఆరోగ్య ప్రయోజనాలు! ఫుడ్ పాయిజనింగ్, రావడానికి అసలు కారణం ఇదే.. అన్నం నిల్వ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!     Masala Minapa Vadalu, Crispy Urad Dal Vada, Evening Snack Recipes, Tea Time Fritters, South Indian Snacks, Traditional Cooking Guide, Food Articles In Telugu.
ఆరోగ్యానికి  శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే  సూత్రాలివి..!   నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిపోయి రకరకాల వ్యాయామాలు, డైట్లు చేయడం సర్వసాధారణమైంది. అయితే సరైన అవగాహన లేకుండా చేసే కొన్ని పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులు హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ప్రాణాలను బలిగొంటున్న సమస్య గుండె జబ్బులు.. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే గుండె సమస్యలకు కూడా కారణం అవుతాయి. అవేంటో,  వైద్యులు వాటి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. నీరు.. రోజూ ఎంత నీరు తాగాలి అనే విషయంలో చాలా మందిలో రకరకాల అపోహలు ఉన్నాయి. రోజుకు ఐదు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగాలని కొందరు ప్రచారం చేస్తుంటారు. కానీ వైద్యపరంగా ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అవసరానికి మించి విపరీతంగా నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం , పొటాషియం స్థాయిల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల హైపోనేట్రిమియా వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంది. కేవలం ఒకటి రెండు లీటర్లకే నీటిని తాగడం  పరిమితం కాకుండా, ఎవరి శారీరక శ్రమ , వాతావరణ పరిస్థితులను బట్టి నీటి మోతాదు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం తాగే కేవలం మంచినీళ్లే కాకుండా, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సూప్స్, టీ, కాఫీ , ఇతర పానీయాలన్నీ కూడా శరీరానికి అందే ద్రవాల జాబితాలోనే లెక్కలోకి వస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మన మూత్రం రంగు చక్కటి సూచికగా పనిచేస్తుంది. మూత్రం మరీ తెలుపుగా లేదా ముదురు పసుపు రంగులో కాకుండా, లేత పసుపు రంగులో ఉంటే శరీరం సరైన హైడ్రేషన్ స్థితిలో ఉన్నట్లు భావించవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని పాటించాలి. ఆహారం.. ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, మనం రోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ , ఇతర ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదయం పూట తినే చాకోస్ లేదా రెడీమేడ్ సీరిల్స్ పాలలో కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం అనుకుంటాం. కానీ వాటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం ఎక్కువగా ఉండి, శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుండటం వల్ల అనారోగ్యకరమైన ఆహారం వైపు మనసు మళ్లుతుంది. దానికి బదులుగా ఉడికించిన గుడ్లు, మల్టిగ్రెయిన్ ఆహారాలు, ఇడ్లీ వంటి ప్రొటీన్తో కూడిన అల్పాహారం ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.  ఇది కూడా చదవండి మనసుపై ఒత్తిడి.. గుండెకు ప్రమాదం! అసలు నిజం ఇదే! అలాగే మనం ఇష్టపడి తినే బిర్యానీ, ఫ్రైస్ , బయట దొరికే టిఫిన్లు ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోతాయి. ఏ ఆహారాన్ని అయినా ఇంట్లో తక్కువ నూనెతో, సహజమైన పద్ధతిలో వండుకుంటే అది ఆరోగ్యకరమైనదే అవుతుంది. హోటళ్లలో లేదా బయట లభించే తినుబండారాలు త్వరగా తయారవ్వడం కోసం ఎక్కువగా నూనెను వాడతారు. వీటిని అప్పుడప్పుడు రుచి కోసం తీసుకోవడంలో తప్పు లేదు కానీ, రోజూ  అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదు. అన్నం తినే విషయంలో కూడా వండే పద్ధతిని మార్చుకోవడం ద్వారా గ్లైసమిక్ ఇండెక్స్ ను తగ్గించవచ్చు. అన్నం వండేటప్పుడు గంజి వార్చడం మన పూర్వీకుల కాలం నుంచి ఉన్న పద్ధతి. దీని వల్ల అన్నంలో గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. ఇది షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుందట. వ్యాయామం.. ఫిట్నెస్ , మారథాన్ల పేరుతో విపరీతంగా శ్రమించడం, అలాగే రోజూ గంటల తరబడి ఒకే పొజిషన్ లో  కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగించి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఆఫీసుల్లో పని చేసేవారు లేదా సుదూర ప్రయాణాలు చేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి కాస్త నడవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎవరి సలహాలనో గుడ్డిగా అనుసరించకుండా, మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటూ సరైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.   మీకు నచ్చవచ్చు   ఆహారం తినేటప్పుడు.. మీకు ఈ జబ్బు ఉందేమో చెక్ చేస్కోండి..!                                                                                                                                            *రూపశ్రీ.
  శరీరంలో కఫం పేరుకుపోవడం వల్ల చాలామంది నిత్య జీవితంలో ఎన్నో రకాల శ్వాసకోశ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మారుతున్న కాలం, వాతావరణంలో వచ్చే మార్పులు, వివిధ రకాల అలర్జీల కారణంగా ముక్కు దిబ్బడ, గొంతులో గరగర, ఛాతీలో కఫం గడ్డకట్టుకోవడం వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రకరకాల మందులు, యాంటీబయోటిక్స్ వాడుతుంటారు.  వీటి వల్ల తాత్కాలికంగా ఫలితం కనిపిస్తుంది కానీ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన ఇంట్లోనే దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో  తయారు చేసుకునే పానీయం  తాగడం వల్ల ఈ సమస్యను  శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.  ఇంతకూ ఈ పానీయం ఏమిటి? దాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి?  ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కఫం.. మన శరీరంలో కఫం అనేది ఊపిరితిత్తులు, గొంతు, సైనస్ లేదా ముక్కు భాగాల్లో ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ఇది ఎక్కడ పేరుకుపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమే కాకుండా శరీరం ఎంతో అలసటకు గురవుతుంది. దీనిని నివారించడానికి వంటింట్లో లభించే నాలుగు ముఖ్యమైన పదార్థాలతో ఒక అద్భుతమైన పానీయం తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు..  తేనె.. తేనెలో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గొంతులో ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. గొంతును ప్రశాంతంగా ఉంచుతూ, పేరుకుపోయిన గట్టి కఫాన్ని పల్చగా మార్చడానికి తేనె ఎంతగానో సహాయపడుతుంది.  అల్లం.. అల్లంలో జింజిరాల్స్ అనే శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇది ఒక సహజమైన డికంజస్టెంట్ లా పనిచేస్తుంది. గొంతులో , చాతిలో పేరుకుపోయిన మందపాటి కఫాన్ని కరిగించి, అది సులభంగా శరీరం నుంచి బయటకు వచ్చేలా చేయడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది వాపులను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మిరియాలు.. మిరియాలు ముక్కు మార్గాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అక్కడ చిక్కుకున్న కఫాన్ని కరిగించి బయటకు పంపడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా, అల్లం , తేనెలోని పోషకాలు శరీరం త్వరగా గ్రహించేలా మిరియాలు సహాయపడతాయి. నిమ్మరసం.. నిమ్మరసంలో విటమిన్ సి  పుష్కలంగా  ఉండటం వల్ల ఇది శరీరానికి మంచి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. కఫానికి కారణమయ్యే అలర్జీలను అరికట్టి, గొంతు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా రక్షణ కల్పిస్తుంది. పై నాలుగు పదార్థాలను ఉపయోగించి ఈ కింది రెండు పద్ధతుల్లో దేనినైనా ఫాలో అవుతూ మంచి ఫలితం పొందవచ్చు.. మొదటి పద్దతి.. ఒక టీస్పూన్ తేనె తీసుకుని, అందులో తాజా అల్లం రసం లేదా అల్లం పొడి కలపాలి. ఆ తర్వాత చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి నేరుగా తీసుకోవాలి. ఇది గొంతులో కఫం ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం ఇస్తుంది. రెండవ పద్ధతి.. ఒక కప్పు నీటిని కొద్దిగా వేడి చేసి, అందులో అల్లం పొడి లేదా తురిమిన అల్లం, చిటికెడు మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం వేయాలి. చివరగా ఒక టీస్పూన్ తేనె జోడించి బాగా కలపాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తేనె కలిపిన తర్వాత నీటిని మరిగించకూడదు. ఈ డ్రింక్ ను గోరువెచ్చగా ఉన్నప్పుడు నెమ్మదిగా తాగితే గొంతుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. పైన చెప్పుకున్న రెమిడీని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే తీసుకుంటే రాత్రంతా పేరుకుపోయిన కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు తీసుకుంటే నిద్రలో కఫం అడ్డుపడకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటిస్తే ముక్కు దిబ్బడ, గొంతు సమస్యలు పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది.                                     *రూపశ్రీ.
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)