
‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. ఇప్పుడు ‘DNK’(దొంగ నా కొడుకు) అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే టీజర్, పాటలతో ఆసక్తి పెంచిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. మాస్ మహారాజా రవితేజ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ట్రైలర్‌లో మౌళి ఓ బాధ్యత లేని యువకుడిగా కనిపిస్తున్నాడు. బెట్టింగ్‌కు అలవాటు పడిన అతడు డబ్బుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంటాడు. బెట్టింగ్‌లో నష్టపోవడంతో ఆన్‌లైన్ లోన్ యాప్స్‌లో అప్పులు చేయడం, గర్ల్‌ఫ్రెండ్ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం మొదలుపెడతాడు.
అప్పులు పెరిగిపోవడం.. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో చివరికి దొంగతనాల బాట పడతాడు. తన స్నేహితుడితో కలిసి దొంగతనాలకు ప్లాన్ చేస్తాడు. మరోవైపు వరుస దొంగతనాల వెనుక ఉన్న ముఠా కోసం పోలీసులు వేట మొదలుపెడతారు. దీంతో మౌళి చేసే దొంగతనాలు, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కథలో కామెడీకి కారణమయ్యేలా కనిపిస్తున్నాయి.

‘లిటిల్ హార్ట్స్’లో తన కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న మౌళి.. ఈ సినిమాలోనూ అదే స్టైల్‌ను కొనసాగించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా డబ్బుల కోసం అతడు పడే పాట్లు, ఇంట్లో తల్లిదండ్రులతో జరిగే సన్నివేశాలు నవ్వులు పూయించేలా ఉన్నాయి. అలీ, రాజిత మౌళి తల్లిదండ్రుల పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఘనంగా ప్రభాస్ పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ.?
సుశ్మిత శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మౌళి, సుశ్మిత మధ్య లవ్ ట్రాక్ కూడా సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం చాలామంది యువతను ఇబ్బంది పెడుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్స్ వంటి అంశాలను కథలో భాగం చేయడం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ సీరియస్ సమస్యలను దర్శకుడు శ్రీను కంబాల పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చెబుతోంది. డబ్బుల కోసం తప్పు దారి పట్టిన యువకుడి ప్రయాణం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తుండగా, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ, శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో నవ్విస్తుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా.?
‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
[DNK Trailer Telugu, Donga Naa Koduku Trailer, Donga Naa Koduku Movie, DNK Movie, Little Hearts, Mouli, Ravi Teja, Mythri Movie Makers, Telugu Film News]






