
లెజండ్రీ యాక్టర్ కోట శ్రీనివాసరావు.. సాక్షాత్తు తెలుగు సినిమానే ఘోర తపస్సు చేసి తన ప్రతిభ ఇండియన్ సినిమాకి తెలియాలని కోట గారు తన ఒడిలో ఉండేలా చేసుకుందేమో. మరి కళారంగంలో ఎన్ని రకాల వాచకాలు, హావభావాలు, బాడీ లాంగ్వేజస్ ఉంటాయో వాటన్నింటిని ఉతికి ఇస్త్రీ చేసిన దిగ్గజ నటుడు. యూట్యూబ్ లో డైలీ కోట గారి సీన్స్ చూసి కానీ నిద్రపోని అభిమానుల ఫిగర్ కౌంట్ కి లెక్కే లేదు. అసలు కోట గారికి అంతా నటన ఎలా అబ్బిందో గతంలో ఆయన చెప్పిన ఇంటర్వ్యూల ద్వారానే ఒకసారి చూద్దాం.
కోట గారు తన క్యారక్టర్ ల కోసం చేసే పరిశోధన, దాని ద్వారా నటనకు జోడించే సహజత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. గతంలో ఓ కార్యక్రమంలో కోటా శ్రీనివాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కి కొత్తగా వచ్చిన 1994-95 ప్రాంతంలో, పాత్రలను ఎలా మరింత వాస్తవికంగా చూపించాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనకు ఒక ఆలోచన తట్టింది.
ఒక స్నేహితుడి సలహాతో, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్లు దొరుకుతాయని చెప్పడంతో, ఆయన కావాలని కల్లు కాంపౌండ్‌లోకి వెళ్లి కూర్చుని డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లను దగ్గరగా పరిశీలించేవారట. కేవలం సంభాషణలను అనుకరించడం కాకుండా, నటనలో ఒక వైవిధ్యాన్ని తీసుకురావాలనే తపనతో తాను ఇటువంటి ప్రయోగాలు చేసేవాడినని ఆయన వివరించారు.ఈ ప్రయోగాల ఫలితమే తన నటనలో తెలంగాణ మాండలికం యొక్క సమ్మిళితం అని కోటా శ్రీనివాసరావు చెప్పారు.

ఆ కల్లు కాంపౌండ్‌లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు గమనించిన గొప్ప సంస్కారమే తనను ప్రభావితం చేసిందని, బేసిక్‌గా ఆ మాండలికమే తనను ఇంత గొప్ప నటుడిని చేసిందని ఆయన కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకున్నారు. “ప్రతిఘటన” సినిమాలో తన నటనను అందరూ బాగా చేశారని మెచ్చుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా, ఆయన సినిమాలోని ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను కూడా చెప్పారు.
ఇది కూడా చదవండి: నరకానికి కౌంట్‌డౌన్ మొదలైంది: ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్!
“హైదరాబాద్‌కి రైల్ గాడి మీద పోయేటందుకు, టికెట్ కొనేందుకు పైసలు ఉన్న ప్రతివాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది భాయ్ అని అడిగినాం అనుకోండి, హైదరాబాద్ లో ఆడి ఉండే హోటల్ పేరు చెప్తాడు. మరి గింతటి దమాక్ లేనోళ్ళు అందరూ రాజకీయాల్లోకి వస్తే నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలి అని నన్ను చంపుకుతింటారు. నేను ఎవరికి ఇవ్వాలి? వాడి దగ్గర ఉన్న పైసలు చూసి, వాడి దగ్గర ఉన్న సత్తా చూసి ఇవ్వాలి. ఆ రెండూ ఉన్నోడు ఎవడయ్యా అంటే మన ఖాళీ గాడు.
.webp)
అంటే నేను రౌడీలకి, వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అంటాడు. నువ్వు ముసలోడివి, గభాల్న ఏదైనా అయ్యి నువ్వు పోతే మళ్లా ఎలక్షన్ అది పెట్టాల్సి వస్తది, ఎందుకు ఇప్పుడు అని చెప్పాలి. గా సీట్ నీకు ఇయ్యలేదు అన్నందుకే కదా ఓ లొల్లి పెడుతున్నావ్ ఓ పెద్దాయనా.. నువ్వా పెద్దోడివి అయిపోతివి, లటక్ కను చచ్చినావ్ అనుకో ఏం చేయాలి.? ఫిర్ ఎలక్షన్ పెట్టాలి. ఎవడు పెడతాడు ఆ ఈ పరేషాన్ అంతా. అని డైలాగ్ చెప్పాడు. ఈ డైలాగ్ ఆయన తెలంగాణ మాండలికంపై పట్టును, పాత్రకు ప్రాణం పోసే ఆయన సామర్థ్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తుంది. ఏది ఏమైనా కోట గారు ఒక పరిపూర్ణమైన లెజెండ్.
మీకు నచ్చవచ్చు :నరకానికి కౌంట్‌డౌన్ మొదలైంది: ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్!
మీకు నచ్చవచ్చు: రామాయణ రికార్డ్స్ అవుట్!
[Kota Srinivasa Rao The Method Actor Whose Craft Demands Courage, kota Srinivasa Rao Journey, Kota Srinivasa Rao, Tollywood actor, Padma Shri recipient,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





