
దీపావళి వేడుకల్లో టపాసులు కాల్చడంపై నటి రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పండగ పేరుతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భారీ శబ్దాలతో క్రాకర్స్ పేల్చడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మాట్లాడితే తనను ‘యాంటీ హిందూ’ అని విమర్శిస్తారనే ఉద్దేశంతో పండగ రోజు మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు.
అర్ధరాత్రి దాటినా టపాసుల మోత మాత్రం ఆగడం లేదు. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇబ్బందులు పడుతున్నారంటూ నటి రేణూ దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల సమయంలోనూ భారీ శబ్దాలతో క్రాకర్స్ పేల్చడంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చకు దారితీసింది.
తన పోస్ట్‌లో రేణూ దేశాయ్.. ‘‘రాత్రి 11 గంటలైనా ఇంత పెద్ద శబ్దాలతో టపాసులు ఎందుకు పేలుస్తున్నారు? నిన్న నేను ఏదైనా మాట్లాడి ఉంటే నన్ను యాంటీ హిందూ అని పిలిచేవారు. అందుకే మౌనంగా ఉన్నాను. కానీ ఈ రాత్రి 11 గంటలకు ఏ పండగ జరుగుతోంది? ఇంత శబ్దం చేయాల్సిన అవసరం ఏముంది?’’ అంటూ ప్రశ్నించారు.

గత మూడు రోజులుగా అర్ధరాత్రి 1, 2, చివరికి 3 గంటల వరకు కూడా టపాసులు పేలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన బెడ్‌రూమ్ సౌండ్‌ప్రూఫ్ కావడంతో తనకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. చుట్టుపక్కల ఉన్నవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: DNK Trailer.. ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్స్.. సీరియస్ సమస్యలతో కామెడీ.!
టపాసులు కాల్చి ఆనందించడం తప్పు కాదని, కానీ ఆ ఆనందం ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు. వృద్ధులు, అప్పుడే పుట్టిన పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు పెద్ద శబ్దాల వల్ల ఒత్తిడికి గురవుతారని గుర్తుచేశారు. కనీసం రాత్రి 10 గంటలలోపు టపాసులు కాల్చడం పూర్తి చేయాలని సూచించారు.

కాలుష్యం గురించి మాట్లాడితే.. ఏడాది పొడవునా వాహనాలు, పరిశ్రమల వల్ల కాలుష్యం వస్తోంది కదా.. ఒక్కరోజు టపాసులు కాల్చడం వల్ల ఏం అవుతుందని కొందరు వాదిస్తారని కూడా ఆమె ప్రస్తావించారు. అయితే పండగను ఆనందంగా జరుపుకోవడంలో తప్పులేదని, ఆ ఆనందం కోసం తోటి మనుషుల బాధను పట్టించుకోకపోవడం మాత్రం సరైనది కాదని పేర్కొన్నారు.
సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకునే రేణూ దేశాయ్.. గతంలోనూ పండగ వేడుకల పేరుతో అర్ధరాత్రి వరకు పెద్ద శబ్దాలతో డీజేలు పెట్టడంపై స్పందించారు. ఇప్పుడు మరోసారి టపాసుల శబ్దాలపై ఆమె చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. పండగ సంబరాలు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జరుపుకోవాలన్న ఆమె విజ్ఞప్తికి నెటిజన్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
ఘనంగా ప్రభాస్ పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ.?
‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
[Renu Desai Instagram Post, Renu Desai Crackers Controversy, Renu Desai Diwali Post, Renu Desai Instagram, Renu Desai Latest, Renu Desai, Diwali 2026, Deepawali 2026, Telugu News]






