Home

»

Latest News

బిగ్ బ్రేకింగ్: రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్: అంతా రంగస్థలం!

Nov 10, 2026 9:40AM

మెగాపవర్ స్టార్ 'రామ్ చరణ్' మనసులో నుంచి ఒక మాట వచ్చిందంటే అది ఎంత వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోనే 'ఇట్లు అర్జున' మూవీ ద్వారా డెబ్యూ ఇవ్వబోతున్న 'అనీష్' పేరు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వైబ్రేషన్ క్రియేట్ చేసే పనిలో ఉంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

కింగ్ నాగార్జునతో షిరిడి సాయి, ఓమ్ నమో వెంకటేశాయ వంటి చిత్రాలని నిర్మించిన నిర్మాత మహేష్ రెడ్డి. ఆ మహేష్ రెడ్డి కుమారుడే అనీష్ ఇట్లు అర్జున ద్వారా పరిచయం కాబోతున్నాడు. మహేష్ ఉప్పల దర్శకుడు కాగా వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరించగా, ని నాగార్జున సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతు' నేను నటించిన కల్ట్ హిట్ మూవీ ‘రంగస్థలం’తో ‘ఇట్లు అర్జున’ చిత్రాన్ని బేరీజు వేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక చెవిటి పాత్రలో నటించి చరిత్ర సృష్టించిన ‘రంగస్థలం’ సినిమా కంటే, అనీష్ మూగవాడిగా నటించిన ‘ఇట్లు అర్జున’ చిత్రం మరింత పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెర్రీ ప్రకటించారు.

ఇది కూడా చదవండి:మూడు రోజులకి సీన్ కొట్టిన కలెక్షన్స్!

కొత్త హీరో అయినప్పటికీ అనీష్ తన నటనతో అద్భుతాలు సృష్టించాడని, డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతో నవరసాలను పండించడం సాధారణ విషయం కాదని ప్రశంసల వర్షం కురిపించారు. 

కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో కింగ్ నాగార్జున సాటిలేరని ఆయన సమర్పిస్తున్నారంటేనే ఆ చిత్రంపై భారీ స్థాయిలో నమ్మకం కలుగుతుందని, పరిశ్రమలో కొత్తవారికి దూసుకువచ్చి మరీ అవకాశాలు ఇచ్చే దమ్ము ఒక్క నాగార్జునకే ఉందని ఆయన స్పష్టం చేశారు.

దాదాపు ఏడాది క్రితమే అనీష్ తనకు ఈ కథను వినిపించి కొన్ని సన్నివేశాలు చూపించాడని, తన మొదటి సినిమాతో పోలిస్తే అనీష్ పదిరెట్లు అద్భుతంగా నటించాడని చరణ్ కొనియాడారు. 'కాకా' ఫేమ్ అనస్వర రాజన్ హీరోయిన్ గా చేస్తున్న 'ఇట్లు అర్జున' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

మీకు నచ్చవచ్చు:పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులు!
మీకు నచ్చవచ్చు:ఆల్ టైం వరల్డ్ రికార్డు కొట్టిన రామాయణ 

 

[Ram Charan Speech Itlu Arjuna Movie event, Ram Charan About Itlu Arjuna hero, Itlu Arjuna movie, Rangasthalam, Nagarjuna Akkineni, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com