తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని పురాతన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ తొలగింపు  అంశంపై వైసీపీ రాజకీయ డ్రామాకు తెరలేపింది.   జాతీయ రహదారి  విస్తరణ పనుల కోసం ఈ ఆలయాన్ని కూల్చివేశారంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా హేరామ్ సేవ్ టెంపుల్స్ అంటూ షేర్ చేసిన పోస్టుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.  జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు.  వాస్తవానికి  రహదారి విస్తరణకురేణిగుంట మండలం పురాతన అభయాంజనేయ స్వామి  ఆలయ భూసేకరణ ప్రక్రియ  జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభమైంది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర   అధికార ప్రతినిధి యామినీ శర్మ ఆధారాలతో సహా వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భూమి అప్పగింతకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని, అప్పుడే పరిహారాన్ని కూడా నిర్ణయించారని ఆమె గుర్తుచేశారు. అంతే కాకుండా, ఈ ఆలయ తరలింపు ప్రక్రియ  గ్రామస్థులు, భక్తుల సమ్మతితోనే శాస్త్రోక్తంగా జరిగింది.  ఆలయ నిర్మాణం కోసం అక్కడకు సమీపంలోనే 50 సెంట్ల ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించడంతో పాటు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఖాతాలో  59.3 లక్షల పరిహార నిధులను కూడా అధికారులు జమ చేశారు.  ఇది కూడా చదవండి:  ఏపీలో ఆగని దాడులు.. మరో ఆలయంలో విగ్రహాల ధ్వంసం!​ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పర్యవేక్షణలో, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ప్రత్యామ్నాయ స్థలంలో బాలాలయం నిర్మించి, మూలవిరాట్టు విగ్రహాలను   ప్రతిష్ఠించిన తర్వాతే పాత నిర్మాణాలను తొలగించారు.  తన ప్రభుత్వ హయాంలో జరిగిన భూసేకరణ ఒప్పందాలను పక్కనపెట్టి, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా జగన్ ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   జగన్ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మీకు నచ్చవచ్చు:  శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం​ తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం! [Controversy, Anjaneyapuramtemple: Nationalhighway, YCP, Politics, Jagantweet, TeluguOne]  
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై త సుప్రియా సూలేను కూర్చోపెట్టే దిశగా ఎన్సీపీ(శరద్ పవార్) వ్యూహాలు రచిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇందుకు తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసం సిల్వర్ ఓల్ లో జరిగిన సమావేశాలు, సంప్రదింపులను ఉదాహరణగా చూపుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్ అయిన శరద్ పవార్.. మహా సీఎం పీఠంపై తన కుమార్తెను కూర్చోపెట్టే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు.  సిల్వర్ ఓక్ లో రహస్య మంతనాలు ఇందుకేనని విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే  తన పార్టీని ఎన్డీయే కూటమిలో చేర్చేందుకు ఆయన సమాయత్తమౌతున్నారు.    నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే  జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ నేపథ్యంలో  తన ఆరోగ్యం,  రాజకీయ వారసత్వం, పార్టీ భవిష్యత్తు వంటి అంశాలపై శరద్ పవాన్ దృష్టి కేంద్రీకరించారని చెబుతున్నారు.  ఇటీవల ప్రధానమంత్రి శరద్ పవార్ కు  ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, సుప్రియ సూలే తదితరులు రాజకీయ వ్యవహారాలు చూసుకుంటారని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా  అజిత్ పవార్ మరణానంతరం మారిన పరిస్థితులు, విలీన చర్చలపై వచ్చిన వాదనలు మహా రాజకీయాలలో మారుతున్న, మారనున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతున్నాయి.  మహారాష్ట్రలో ఇప్పటికే అధికార కూటమిలోని  భాగస్వామ్య పక్షాల మధ్య సమతుల్యత,   పదవుల పంపకం వంటి అంశాలు ఒకింత గందరగోళంలో ఉన్నాయి. ఒకవేళ శరద్ పవార్ వర్గం ఎన్డీయే వైపు మొగ్గు చూపితే, మహారాష్ట్ర అధికార కూటమిలో సమీకరణాలు సమూలంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ కనుక  ఎన్డీయే కూటమిలో చేరితే.. అందుకు శరద్ పవార్ విధించే ఏకైక షరతు సుప్రియా సూలెకు సీఎం పదవి అని పరిశీలకులు అంటున్నారు. ఆ దిశగా బీజేపీతో ఇప్పటికే తెరవెనుక మంతనాలు సాగుతున్నాయని చెబుతున్నారు.  రాష్ట్రంలో శాంతిభద్రతలు, పరిపాలన, అభివృద్ధి అంశాలపై విపక్షాలు, అధికార పక్షాల మధ్య మాటల తూటాలు కొనసాగుతుండగానే, మరోవైపు కొత్త రాజకీయ పొత్తులపై తెరవెనుక చర్చలు జోరుగా సాగుతుండడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  నియోజకవర్గాల పునర్విభజన   భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని శరద్ పవార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.  ఇది కూడా చదవండి:  శరద్ పవార్..రాజకీయ చాణక్యుడు!​ రాబోయే రోజుల్లో పార్లమెంటు సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన చర్చలు, అలాగే మహారాష్ట్ర కూటమిలోని పరిణామాల ఆధారంగా ఈ ఊహాగానాల సాగుతున్నాయి.  మొత్తంగా ఎన్డీయేలో చేరికపై శరద్ పవార్ నిర్ణయం, సుప్రియ సూలే రాజకీయ భవిష్యత్ ఉజ్వలంగా ఉండేందుకు దోహదపడేలా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తానికి మహా రాజకీయాలు  శరద్ పవార్ చుట్టూ తిరిగుతున్నాయి.  ఆయన వ్యూహాలు ఏమేరకు సక్సెస్ అవుతాయి అన్నదానిపైనే  మహారాష్ట్ర పొలిటికల్ సినేరియాలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయన్న దానిపై క్లారిటీ వస్తుంది. మీకు నచ్చవచ్చు: రాజ్యసభ బరిలో శరద్ పవార్ అసలు సినిమా ముందుంది.. ఏక్ నాథ్ షిండే.. శివసేన చీలిక వెనుక కేంద్రం.. ఉద్ధవ్ [Supriya Sule, Sharad Pawar, Maharashtra politics, NDA alliance, delimitation,PawarStrategies, TeluguOne]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు. తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి ఇంటర్వ్యూలో ఆయన పలు రాజకీయ అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.  ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన అధికారిక ప్రోమో తాజాగా విడుదలైంది. బీజేపీ–బీఆర్ఎస్ రాజకీయ సంబంధాలు, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, ఓటు హక్కులు, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం వంటి కీలక అంశాలపై ప్రతిపక్షాలకు ఆయన ఇచ్చిన ఘాటైన సమాధానాల తళుకులు ప్రోమోలో కనిపిస్తున్నాయి. ఇప్పుడే చూడండి.. సంచలన ప్రోమో! తాజాగా విడుదలైన ఈ టీజర్‌లో మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపక్షాల విమర్శలను నేరుగా తిప్పికొడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరును సమర్థించడం కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న పలు కీలక అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఇంటర్వ్యూపై ఆసక్తిని పెంచుతున్నాయి. పూర్తి ఇంటర్వ్యూ బుధవారం రాత్రి 7 గంటలకు తెలుగు వన్ న్యూస్ – ద జర్నలిస్ట్‌లో ప్రసారం కానుంది. ఈ ప్రత్యేక ముఖాముఖిని తప్పక వీక్షించండి.     మీకు నచ్చవచ్చు: మూసీ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ స్పీడ్.. జనవరిలో ఫేజ్‌-1 పనులు ప్రారంభం.! మీకు నచ్చవచ్చు: తూర్పు గాలుల ద్రోణి ప్రభావం..ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.!   [ TPCC Chief Mahesh Kumar Goud, Telangana Congress, TPCC Chief, Revanth Reddy, Congress Strategy, BC Reservations, 52 Percent BC Representation, Tone News The Journalist Interview ]
ALSO ON TELUGUONE N E W S
Yo Yo Honey Singh and Pakistani singer Atif Aslam were spotted dancing together at a wedding in Dubai. Videos of the two singers enjoying the celebrations have gone viral on social media amid the ongoing debate over Pakistani entertainment content in India. The singers attended the wedding of Abidha Chaudhary and Bilal Asif. Wedding host Sadiq Saleem shared pictures and videos of Honey Singh and Atif Aslam dancing to songs by Pakistani singer Abrar-ul-Haq. In his post, Sadiq praised both singers, describing Honey Singh as an icon full of warmth and style, while Atif Aslam was calm and composed. He also revealed that Atif arrived straight from rehearsals for his concert to honour his commitment. The video has surfaced following renewed calls to ban Pakistani shows from streaming in India. The controversy intensified after the trailer of Pakistan's first Netflix original series, Jo Bachay Hain Sang Samait Lo, was released. Also Read: Salman Khan rehearsed two days for a Maatrubhumi song The All Indian Cine Workers Association has reportedly approached Prime Minister Narendra Modi, seeking to stop the series from streaming on Netflix India. Meanwhile, screenings of Pakistani serial Dar-e-Nijaat were also cancelled in Bengaluru following online backlash. Reacting to the contrast, Sadiq pointed out that while a complaint was being filed to stop a Pakistani series from airing, the wedding in Dubai was celebrating music, friendship and togetherness. He concluded that such a moment could happen only in Dubai. Check Out:  Ramayana looking close at an Oscar nomination                       Is Varanasi really postponed or not? Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ వేరు. అందులో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ ముందు వరుసలో ఉంటుంది. ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ సినిమాలతో ఈ ఇద్దరూ ఎలాంటి సంచలనాలు సృష్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ మొదలైంది. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో ‘వారణాసి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రాజమౌళి తర్వాతి సినిమా ఏంటనే ఆసక్తి అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే రాజమౌళి తర్వాతి సినిమా ప్రభాస్‌తో ఉండబోతుందనే ప్రచారం మొదలైంది. వారణాసి తర్వాత మరోసారి ప్రభాస్‌తో కలిసి పనిచేయాలని రాజమౌళి భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ప్రభాస్, రాజమౌళి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ 2’ సినిమాలు ఆయన లైనప్‌లో ఉన్నాయి. వీటితో పాటు ‘సలార్ 2’ కూడా ఉంది. 2028 వరకు చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి, ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్టుకి పూర్తి టైం కేటాయించనున్నారని తెలుస్తోంది. అందుకే కొత్త సినిమాలేవీ కమిట్ కావట్లేదని సమాచారం. ఇది కూడా చదవండి: మహేష్ ఫ్యాన్స్‌కి షాక్.. ‘వారణాసి’ కొత్త రిలీజ్ ప్లాన్ ఇదే.! ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ అంటే అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టడంలో రాజమౌళి పాత్ర ఎంతో కీలకం. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిస్తే ఎలాంటి కథను ఎంచుకుంటారు? ఏ జానర్‌లో సినిమా చేస్తారు? అనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. మొత్తానికి ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్త నిజమైతే అభిమానులకు అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ మరొకటి ఉండదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లైనప్ చూస్తే కొత్త ప్రాజెక్ట్ మొదలవడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. మరి బాహుబలి కాంబో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుందా? లేక ఇది అభిమానుల కోరికగానే మిగిలిపోతుందా? చూడాలి. మీకు నచ్చవచ్చు:  బిగ్ అప్డేట్.. బాలయ్య ‘దాదా’తో బాక్సాఫీస్ జాతర ఖాయం.! ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టైటిల్ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్.!       [Baahubali Combo, SS Rajamouli, Prabhas, Reunion, Varanasi]  
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలామంది నటులు పార్టీలకు, పబ్బులకు అలవాటు పడుతుంటారు. అక్కడే కొందరు చెడు అలవాట్లకు బానిసలవుతుంటారు. అయితే తనకు కూడా విద్యార్థి దశలో ఇలాంటి అనుభవమే ఎదురైందని నటుడు నిఖిల్ సిద్ధార్థ్ తెలిపారు. అప్పట్లో ఆ చెడు అలవాట్లకు నో చెప్పడం వల్లే ఇప్పుడు నటుడిగా మంచి స్థాయిలో ఉన్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘నషాముక్త్ భారత్’ పాదయాత్రలో నిఖిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన నిఖిల్.. తన జీవితంలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘మన చుట్టూ ఉండే కొంతమంది మనల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. పార్టీల్లో, ఫంక్షన్లలో ఇది చేస్తావా? అది తీసుకుంటావా? అంటూ చెడు అలవాట్లు నేర్పించే ప్రయత్నం చేస్తారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పుడు నేను నో చెప్పకపోయుంటే ఇప్పుడు 21 సినిమాలు చేసేవాడిని కాదు’’ అని నిఖిల్ తెలిపారు. తన జీవితంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఎంత కీలకంగా మారిందో ఈ మాటల ద్వారా వివరించారు. సిగరెట్, మద్యం, డ్రగ్స్ వంటి అలవాట్లు వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తాయని నిఖిల్ చెప్పారు. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషంగా ఉండాలంటే ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా స్నేహితుల ఒత్తిడికి లొంగకుండా, మనకు నచ్చని విషయాలకు ధైర్యంగా నో చెప్పడం అలవాటు చేసుకోవాలని ఆయన సందేశం ఇచ్చారు. ఇది కూడా చదవండి: యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు! మొత్తానికి నిఖిల్ చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా ‘నో చెప్పకపోయుంటే 21 సినిమాలు చేసేవాడిని కాదు’ అనే మాట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జీవితంలో ఎదగాలంటే కొన్ని సందర్భాల్లో స్నేహితుల ఒత్తిడికి తలొగ్గకుండా మన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన చెప్పకనే చెప్పారు. మీకు నచ్చవచ్చు:  తరుణ్ భాస్కర్ ఆవేశం వెనుక అసలు కథ ఇదేనా.? ‘భోగి’కి A సర్టిఫికెట్.. సెన్సార్ టాక్ ఎలా ఉందంటే.? https://x.com/Theteluguone/status/2125538691263410554       [Nikhil Siddhartha, Nasha Mukt Bharat, Hyderabad, Kishan Reddy]  
శర్వానంద్‌ను ఇప్పటివరకు చూడని రస్టిక్ మాస్ అవతార్‌లో చూపించబోతున్న దర్శకుడు సంపత్ నంది, ఈసారి హింస, రక్తపాతం విషయంలోనూ తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా ‘భోగి’ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినట్లు వార్తలు రావడంతో పాటు, సెన్సార్ బృందం నుంచి వచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ కూడా ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు A సర్టిఫికెట్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాను వీక్షించిన తర్వాత కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కథ, పాత్రల స్వభావానికి అవి అవసరమని భావించిన చిత్రబృందం వాటిని తొలగించడానికి లేదా మార్పులు చేయడానికి ఇష్టపడలేదట. దీంతో ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే థియేటర్లలో ఈ సినిమాను చూడగలరు. ఇక సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు (154 నిమిషాలు) అని సమాచారం. సినిమాను చూసిన సెన్సార్ బృందం నుంచి వచ్చిన టాక్ ప్రకారం.. ‘భోగి’ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని తెలుస్తోంది. ముఖ్యంగా శర్వానంద్ నటన, సంపత్ నంది టేకింగ్ ఆకట్టుకున్నాయని ప్రచారం జరుగుతోంది. సెకండాఫ్‌లో ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలు మరింత బలంగా ఉంటాయని అంటున్నారు. దర్శకుడిగా సంపత్ నంది తన మార్క్ చూపించారని, చాలా కాలం తర్వాత ఆయన నుంచి మంచి సినిమా వస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ బొగ్గుల గుట్ట అనే ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో సాగుతుంది. కమ్మరి గంగ (శర్వానంద్) ఓ కష్టపడి పనిచేసే యువకుడు. తన ఐదుగురు చెల్లెళ్లను, కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు. అయితే ఆ గ్రామం కొందరు భూస్వాముల గుప్పిట్లో ఉంటుంది. వారి అకృత్యాలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతుంటారు. మరోవైపు ప్రతి అమావాస్య పూజల సమయంలో కొన్ని మిస్టరీ ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఆ ఆచారాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? గ్రామాన్ని పట్టిపీడిస్తున్న మూఢనమ్మకాల వెనుక ఎవరు ఉన్నారు? భూస్వాములతో గంగ చేసే పోరాటం ఎలా సాగుతుంది? అనేదే కథలో ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: భోగి ప్రమోషన్స్‌కి అనుపమ దూరం.. కారణం ఇదేనా.? నిజానికి ‘భోగి’ నవంబర్ 12నే విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ ప్రక్రియలో ఎదురైన సమస్యల కారణంగా సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించారు. దీంతో విడుదల వాయిదా పడటమే కాకుండా, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ప్రభావితమయ్యాయి. తాజాగా సెన్సార్ ప్రక్రియ పూర్తవడంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. మొత్తానికి ‘భోగి’ విషయంలో A సర్టిఫికెట్, సెన్సార్ అభ్యంతరాలు, హింసాత్మక సన్నివేశాలపై వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మరి నిజంగానే సంపత్ నంది తన మార్క్ యాక్షన్, ఎమోషన్స్‌తో శర్వానంద్‌కు భారీ విజయాన్ని అందిస్తారా? ఈ రస్టిక్ రూరల్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో నవంబర్ 27న తేలనుంది. మీకు నచ్చవచ్చు:  ఫస్ట్ AI హీరో.. ఏకలవ్య టీజర్ చూశారా.? ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టైటిల్ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్.!       [Bhogi First Review, Sharwanand, Dimple Hayathi, Sampath Nandi, Anupama Parameswaran]  
సినిమా సక్సెస్ మీట్ అంటే సాధారణంగా దర్శకుడు, నటీనటులు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడం.. నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పడం చూస్తుంటాం. కానీ దర్శకుడు తరుణ్ భాస్కర్ మాత్రం తన తాజా సినిమా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చేసిన ప్రసంగంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ‘నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు’, ‘మోకాళ్లపై పడి సార్, మేడమ్ అని పిలవను’, ‘ఇప్పటి నుంచి డ్యూటీ ఎక్కుతున్నా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు తరుణ్ భాస్కర్ ఇంత ఆవేశంగా మాట్లాడటానికి కారణమేంటి? ఆయన మాటల్లో ఇండస్ట్రీకి ఇచ్చిన సందేశం ఏమిటి? సినిమా విజయంపై మాట్లాడుతూ తరుణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ లెక్కలు వేసుకుంటారని, కానీ ఎలాంటి లెక్కలు లేకుండా ప్రేమించేది ప్రేక్షకులు మాత్రమేనని అన్నారు. తన నేపథ్యం, తన గురించి ఆలోచించకుండా సినిమాను ప్రేమించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్కరినీ ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నారు. ఒక దర్శకుడిగా తనకు ఈ విజయం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. తరుణ్ ప్రసంగంలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఇదే. ఇప్పటివరకు తన సినిమాల్లో డబ్బుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని, డబ్బు వెంటపడొద్దనే భావనతో ఉన్నానని చెప్పారు. కానీ ఇకపై తన ఆలోచన మార్చుకుంటున్నానని, డబ్బునే ఫాలో అవుతానని ప్రకటించారు. తన తదుపరి సినిమా నుంచి ఏ, బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తానని స్పష్టం చేశారు. అంటే ఇప్పటివరకు తనదైన శైలిలో, ఒక ప్రత్యేకమైన ప్రేక్షక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసిన తరుణ్.. ఇకపై మరింత పెద్ద మార్కెట్‌ను టార్గెట్ చేయబోతున్నారన్నమాట. ఇక తనను చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారని తరుణ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఒక అథెంటిక్ వాయిస్ ఎంత దూరం వెళ్లగలదో చూపిస్తానని అన్నారు. ఇప్పటి నుంచి తాను డ్యూటీ ఎక్కుతున్నానని, ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. ‘మోకాళ్లపై పడి ప్రతి ఒక్కరినీ సార్, మేడం అని పిలవను. నాకు జనమే ముఖ్యం’ అంటూ తన వైఖరిని స్పష్టం చేశారు. దర్శకుడిగా అయినా, నటుడిగా అయినా తన పని తాను శ్రద్ధగా చేస్తానని, తనలోని అసలైన గొంతును ప్రేక్షకులకు చూపిస్తానని అన్నారు. ఇది కూడా చదవండి: శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్‌ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.! తరుణ్ భాస్కర్ వ్యాఖ్యలు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మరో చర్చ కూడా మొదలైంది. గతంలో దర్శకుడు వెంకటేశ్ మహా కమర్షియల్ సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తుచేస్తూ కొందరు తరుణ్ ప్రసంగంతో పోలుస్తున్నారు. అయితే ఇద్దరి వ్యాఖ్యల వెనుక ఉద్దేశాలు ఒకటేనని చెప్పలేం. తరుణ్ మాత్రం తన సినిమాల ద్వారా విస్తృత ప్రేక్షకులను చేరుకోవాలని, తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఏ, బీ, సీ సెంటర్లను టార్గెట్ చేస్తాననడం ఆయన కెరీర్‌లో కొత్త దిశకు సంకేతంగా కనిపిస్తోంది. తరుణ్ భాస్కర్ ప్రసంగంలో మరో కీలకమైన మాట కూడా ఉంది. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే దాన్ని సినిమా ద్వారా సరిదిద్దుతానని అన్నారు. అంటే కేవలం కమర్షియల్ విజయాల కోసమే కాకుండా, తన సినిమాల ద్వారా తన అభిప్రాయాలను, ఆలోచనలను కూడా బలంగా చెప్పాలనుకుంటున్నట్లు అర్థమవుతోంది. అయితే ఒక దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న తరుణ్, కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తే తన శైలిని ఎంతవరకు కొనసాగిస్తారన్నది ఆసక్తికరం. మొత్తానికి ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ విజయం తరుణ్ భాస్కర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు తనకు నచ్చిన సినిమాలు చేసిన ఆయన, ఇకపై ప్రేక్షకులందరికీ నచ్చే సినిమాలు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. అయితే సక్సెస్ మీట్‌లో ఇచ్చిన ఈ వార్నింగ్‌ను ఆయన తదుపరి సినిమాతో ఎంతవరకు నిజం చేస్తారు? తన అథెంటిక్ వాయిస్‌ను కమర్షియల్ ఫార్మాట్‌లోనూ వినిపించగలరా? ఇప్పుడు అందరి చూపు తరుణ్ భాస్కర్ నెక్స్ట్ మూవీ మీదే. మీకు నచ్చవచ్చు:  ఫస్ట్ AI హీరో.. ఏకలవ్య టీజర్ చూశారా.? 15 ఏళ్ల సోలో.. నారా రోహిత్ కెరీర్‌లో స్పెషల్ మూవీ.!       [Tharun Bhascker, Viral Speech, ENE Repeat, Ee Nagaraniki Emaindi]  
 బొమ్మ హిట్టు..  ఈ సందర్భంగా ఒక  ఫంక్షన్ జరుగుతుంది. ఆ సినిమా డైరెక్టర్ తనేదో మాయబజార్, పాతాళ భైరవి, గుండమ్మ కథ తెరకెక్కించిన అపర మేధావిలా ఎక్స్ ప్రెషన్ ఇస్తూ స్టేజ్ కింద కూర్చున్నాడు. ఒక సినీ అతిధినో, లేక మరో డైరెక్టర్ నో స్టేజ్ పై ఇక ఆ డైరెక్టర్ ని అద్భుతమైన మూవీ తెరకెక్కించాడని తనకి అందుబాటులోకి వచ్చిన పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. కింద ఉన్న మన లెజండ్రీ దర్శకుడు అదే మేధావి ముసి మూసి నవ్వుని ప్రదరిస్తూ ఉంటాడు.  ఆ టైంలో అతని కళ్ళని క్షుణ్ణంగా పరిశీలించాలి నా సామి రంగ నేను లేకపోతే తెలుగు సినిమా ఏమైపోతుందా అనే భావం తన కళ్ళల్లో క్షుణంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక విచిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఒక దర్శకుడు వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ చేస్తే ఆయన గురించి మాట్లాడేవారే ఉండరు. అదే ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. ఒక్కసారిగా దర్శకుడి పేరు మార్మోగిపోతుంది. అద్భుతమైన దర్శకుడు, విజనరీ, ఇండస్ట్రీని మార్చేసే సత్తా ఉన్న వ్యక్తి అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటారు. మరి ఒక హిట్‌తోనే దర్శకుడి ప్రతిభను కొలవచ్చా? వరుస పరాజయాలు ఎదురైనప్పుడు ఆయన గొప్పతనం ఏమైపోతుంది? సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌కి  ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ప్రేమలో పడిన ప్రేమికులు, కొత్తగా పెళ్లి అయిన మొగుడు పెళ్ళాం కూడా ఒకరికొకరు అంతగా ప్రాధాన్యత ఇచ్చుకోరు. దీంతో దర్శకుడికి వరుస అవకాశాలు వస్తాయి. నిర్మాతలు క్యూ కడతారు. హీరోలు కూడా కథలు వినేందుకు ఆసక్తి చూపిస్తారు. అదే రెండు సినిమాలు ఫ్లాప్ అయితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. గతంలో చేసిన మంచి సినిమాలని  మర్చిపోయి విమర్శలు మొదలుపెడతారు.ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. దర్శకుడి ప్రతిభ అనేది ఒక్క సినిమా విజయంతోనే నిర్ణయమవుతుందా? లేక అతడి ఆలోచనా విధానం, కథను తెరపై చూపించే విధానం, నటీనటుల నుంచి నటన రాబట్టే సామర్థ్యం, విభిన్న కథలను చెప్పగలిగే నైపుణ్యం ఆధారంగా నిర్ణయించాలా? ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఏడాది పాటు థియేటర్లలో ఆడే సినిమాలను తెరకెక్కించిన దర్శకులు ఎందరో ఉన్నారు. వారి సినిమాలు రికార్డులు సృష్టించినా, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందినా.. తమ విజయాల గురించి పదేపదే గొప్పలు చెప్పుకోవడం కనిపించేది కాదు. సినిమా మాట్లాడాలి కానీ దర్శకుడు తన గురించి తాను ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదనే విధంగా వారి వ్యవహారశైలి ఉండేది. ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ మూవీ నుంచి తప్పుకుంది అందుకే: భోగి డైరెక్టర్ సంపత్ నంది   అప్పటి దర్శకులకు సక్సెస్ అనేది బాధ్యతని పెంచే అంశం. ఒక హిట్ వచ్చిందంటే తదుపరి సినిమా మరింత బాగుండాలనే ఆలోచన చేసేవారు. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేసేవారు. అందుకే కొంతమంది దర్శకుల పేర్లు దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. అయితే వరుస ఫ్లాపులు వచ్చినంత మాత్రాన ఒక దర్శకుడిలో ప్రతిభ లేదని చెప్పలేం. సినిమా విజయం వెనుక కథ, స్క్రీన్‌ప్లే, నటీనటులు, నిర్మాణం, మార్కెటింగ్, విడుదల సమయం ఇలా అనేక అంశాలు ఉంటాయి. ఒక్కోసారి మంచి ప్రయత్నం కూడా ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు. అదే సమయంలో సాధారణమైన కథ కూడా అనూహ్యమైన విజయాన్ని అందుకోవచ్చు. కానీ వరుస పరాజయాల తర్వాత కూడా తన తప్పులను విశ్లేషించుకోకుండా, గతంలో వచ్చిన ఒక్క హిట్‌ను చూపిస్తూ గొప్పలు చెప్పుకోవడం మాత్రం సరైన పద్ధతి కాదు. విజయంతో పాటు అపజయాల నుంచి నేర్చుకోవడం కూడా దర్శకుడి ఎదుగుదలలో భాగమే. ఒక్క బ్లాక్‌బస్టర్ ఇచ్చినంత మాత్రాన గొప్ప దర్శకుడు అయిపోరు. అలాగే ఒక్క ఫ్లాప్‌తో ప్రతిభ లేని దర్శకుడిగా ముద్ర వేయలేం. విభిన్న కథలను తెరకెక్కించడం, ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోవడం, కొత్త ప్రయోగాలు చేయడం, విజయాపజయాలను సమానంగా స్వీకరించడం.. ఇవన్నీ ఒక దర్శకుడి స్థాయిని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా తన సినిమాల గురించి తానే గొప్పలు చెప్పుకోవడం కంటే, తన పనితో ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకోవడమే నిజమైన దర్శకుడి లక్షణం. చివరిగా ఒక్క మాట.. హిట్ వచ్చినప్పుడు పొగడ్తలు, ఫ్లాప్ వచ్చినప్పుడు విమర్శలు సహజం. కానీ దర్శకుడి అసలు స్థాయి ఒక్క సినిమాతో తేలిపోదు. ఒకటి కాదు.. ఎన్నో సినిమాల ప్రయాణమే అతడి ప్రతిభకు కొలమానం. హిట్ వచ్చినప్పుడు ఒదిగి ఉండటం, ఫ్లాప్ వచ్చినప్పుడు బాధ్యత తీసుకోవడం.. ఈ రెండూ ఉన్నప్పుడే ఒక దర్శకుడికి నిజమైన గౌరవం దక్కుతుంది.   కాబట్టి దర్శకుడా నీ పోస్ట్ ఋషి లాంటిది. ఋషి లాగే ఉండు. అంటే అడిగిన, అవసరమైన ప్రశ్నలకే సమాధానం చెప్పడం. నీ భావాలని సెల్యులాయిడ్ పై పంచి వీలైనంతగా ప్రజల రూపంలో ఉన్న ప్రేక్షకులకి ఆనందాన్ని, మంచిని పంచడం.   మీకు నచ్చవచ్చు ఆస్కార్ బరిలో రామాయణ: కాకపోతే ఈ గండాలు వెంటాడుతున్నాయి! చిన్నారి ఇన్‌ స్టా రీల్‌కి మహేష్ బాబు ఫిదా!   [Tollywood Directors, Director, Telugu Cinema, Mayabazar, Pathala Bhairavi]  
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్ ప్లాప్ తర్వాత ఎంతో మంది అగ్ర దర్శకుల కథలు విని కూడా ఓకే చేయకుండా వరుణ్ సందేశ్ తో 'ఏమైంది ఈ వేళ' అని చిన్న సినిమాకి దర్శకత్వం వహించిన సంపత్ నంది కి అవకాశం ఇచ్చాడంటే సంపత్ క్యాపబిలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. బేసిక్ గా రైటర్ అయిన సంపత్ ఎల్లుండి శర్వానంద్ తో 'భోగి' అంటు వస్తున్నాడు.   పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినా.. చివరకు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు సంపత్ నంది. అప్పట్లో దీనిపై రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ఇన్నాళ్లకు అసలు విషయం బయటపెట్టారు సంపత్ నంది. ‘భోగి’ ప్రమోషన్లలో భాగంగా పవన్‌తో సినిమా ఎందుకు చేయలేకపోయారో వెల్లడించారు. పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని అనుకున్నామని, కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ప్రాజెక్ట్ పదేపదే ఆలస్యమైందని సంపత్ నంది తెలిపారు. ఒక సందర్భంలో పవన్ తనను మరికొంత కాలం వేచి ఉండగలవా అని అడిగారని చెప్పారు.దానికి తాను ఈలోగా మరో సినిమా పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదా అని అడిగినట్లు వెల్లడించారు. అలా ఎలాంటి వివాదాలు లేకుండానే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా సంపత్ నంది వెల్లడించారు. తాను పవన్ కల్యాణ్‌తో చేయాల్సిన సినిమా వేరే ప్రాజెక్ట్ కాదని, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమానే అని స్పష్టం చేశారు. అప్పట్లో ఈ సినిమా రీమేక్ అనే ప్రచారం జరిగినప్పటికీ, తాను డైరెక్ట్ చేయాల్సిన కథ రీమేక్ కాదని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఆస్కార్ బరిలో రామాయణ స్పీడ్: టాప్ 20 లో చోటు..కాకపోతే ఆ బలమైన చిత్రాలు కూడా పోటీలో!  ఆ తర్వాత నిర్మాతల ద్వారా పవన్ కల్యాణ్ తనతో సినిమా చేయడానికి ఎంతో ప్రయత్నించారని తెలిసిందని సంపత్ నంది చెప్పారు. తమ ఇద్దరి ప్రయాణం అద్భుతంగా సాగిందని, ఎవరినీ ఎక్కువకాలం వేచి ఉండేలా చేయడం పవన్‌కు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. మొత్తానికి ఇన్నాళ్లుగా ఆసక్తిగా మారిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నుంచి సంపత్ నంది ఎందుకు తప్పుకున్నారనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. మరి భవిష్యత్తులో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందేమో చూడాలి.    మీకు నచ్చవచ్చు మాధురి దీక్షిత్ అందం రహస్యం ఇదే: వాడితే మీరు కూడా అలా! ఇది ఎన్టీఆర్ క్రేజ్ అంటే: ఎవరు సాటి రారు!     [Pawan Kalyan, Sampath Nandi,  Sardaar Gabbar Singh, Bhogi, Tollywood]  
సినిమా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, ఎడిటింగ్ వంటి విభాగాల్లో AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా నటుల స్థానంలోనే AIని తీసుకొస్తున్నారు. మనుషులతో సంబంధం లేకుండా AI నటులతోనే వెబ్‌సిరీస్‌లు రూపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ లయన్స్‌గేట్ ప్లే తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. మహాభారతంలో గురువు ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకునే అవకాశం దక్కకపోయినా, స్వయంకృషితో గొప్ప విలుకాడిగా ఎదిగిన ఏకలవ్యుడి కథ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రను ప్రధానంగా తీసుకుని ఏకలవ్య పేరుతో   ఓ వెబ్‌సిరీస్ రూపొందిస్తున్నారు. ఇందులో ఏకలవ్యుడి పాత్ర కోసం ‘యుగ్ ఆర్.ఏఐ’ (Yug R.AI) అనే AI నటుడిని పరిచయం చేశారు. అంటే ఓ మనిషిని నటుడిగా ఎంపిక చేయకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించిన పాత్రనే ప్రధాన నటుడిగా చూపించబోతున్నారు. ఇది భారతీయ ఓటీటీ రంగంలోనే ఓ కొత్త ప్రయోగంగా నిలవనుంది. విభు పురి దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. తొలి సీజన్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఏకలవ్యుడి జీవితాన్ని, గురువు తిరస్కరించిన తర్వాత కూడా పట్టుదలతో విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించిన అతడి ప్రయాణాన్ని ఈ సిరీస్‌లో చూపించనున్నారు. అంతేకాదు, ఈ కథను ఒక్క సీజన్‌కే పరిమితం చేయకుండా మల్టీ సీజన్ ఫ్రాంచైజీగా రూపొందించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ సిరీస్ కోసం లయన్స్‌గేట్ ప్లే సంస్థ గూగుల్ క్లౌడ్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. గూగుల్‌కు చెందిన AI టెక్నాలజీని ఉపయోగించి భారతీయ పురాణ కథలను మరింత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. బడ్జెట్, నిర్మాణ పరిమితుల కారణంగా గతంలో పురాణ కథల్లోని భారీ ప్రపంచాలను పూర్తిస్థాయిలో చూపించడం కష్టమయ్యేది. కానీ AI టెక్నాలజీతో అలాంటి పరిమితులను అధిగమించవచ్చని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సిరీస్‌ను పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది కూడా చదవండి: మహేష్ ఫ్యాన్స్‌కి షాక్.. ‘వారణాసి’ కొత్త రిలీజ్ ప్లాన్ ఇదే.! ఇప్పటివరకు AIని ఎక్కువగా సాంకేతిక విభాగాల్లో ఉపయోగిస్తుండగా, ఇప్పుడు నటనలోనూ దాని వినియోగం పెరగడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఒక AI నటుడు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించగలడు? మనుషుల నటనలో ఉండే సహజమైన భావోద్వేగాలను AI చూపించగలదా? అనే చర్చ మొదలైంది. మొత్తానికి మహాభారతంలోని ఏకలవ్యుడి కథను AI నటుడితో తెరకెక్కించడం ఓటీటీ ప్రపంచంలో కొత్త ప్రయోగమే. ఇప్పటివరకు తెరపై నటీనటులను చూసి అభిమానించే ప్రేక్షకులు, ఇకపై AI నటులనూ ఆదరిస్తారా? అన్నది ఆసక్తికరం.  ఈ సిరీస్ 2027లో లయన్స్‌గేట్ ప్లే యాప్‌లోని టైగర్ టీవీలో ప్రీమియర్ కానుంది. మరి ఏకలవ్యుడి కథతో మొదలవుతున్న ఈ AI ప్రయాణం భవిష్యత్తులో సినిమా పరిశ్రమను ఎంతవరకు మార్చబోతోందో చూడాలి. మీకు నచ్చవచ్చు:  ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టైటిల్ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్.! శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్‌ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.!       [Eklavya Web Series, AI Actor Yug R.AI, Lionsgate Play, Vibhu Puri, Mahabharata]  
'రామాయణ' సాధించిన సంచలన విజయం నభూతో న భవిష్యత్. ఈ విజయాన్ని కట్టబెట్టిన భారతీయ సినీ ప్రేమికుల కళ్ళల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో రామాయణ అరుదైన ఘనతని అందుకుంది. 99వ ఆస్కార్ అవార్డుల బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో టాప్-20లో చోటు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇండియన్ సినీ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పుడు సాధారణ సినిమాలతో కాదు.. హాలీవుడ్‌లో భారీ అంచనాలున్న చిత్రాలతో పోటీపడుతోంది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’, ‘డ్యూన్: పార్ట్ 3’, ‘అవెంజర్స్: డూమ్స్‌డే’, ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’, ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ వంటి చిత్రాలు కూడా ఈ రేసులో ఉన్నాయి. ఇలాంటి అంతర్జాతీయ చిత్రాల సరసన మన పురాణ గాథ నిలవడం విశేషం. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ కూడా ఆస్కార్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో టాప్-20 వరకు వెళ్లింది. ఇప్పుడు ‘రామాయణం’ కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందడం భారతీయ సినిమాకి  గర్వకారణంగా మారింది. ఈ చిత్రానికి ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ DNEG, ReDefine సంస్థలు పనిచేశాయి. ఇది కూడా చదవండి: బయటపడ్డ మాధురి దీక్షిత్ అసలైన ఏజ్: 25 ఇయర్స్ నే అంట..ఆ బ్యూటీ సీక్రెట్ ఇదే! అయితే టాప్-20లో చోటు దక్కించుకోవడం అంటే ఆస్కార్ నామినేషన్ ఖరారైనట్లు కాదు. తదుపరి ఓటింగ్ ప్రక్రియలో ఈ జాబితా నుంచి 10 చిత్రాలని షార్ట్‌లిస్ట్ చేస్తారు. డిసెంబర్ 15న ఆ జాబితా ప్రకటించనున్నారు. అనంతరం తుది నామినేషన్లు జనవరి 21న వెలువడనున్నాయి. మొత్తానికి హాలీవుడ్ దిగ్గజాల మధ్య భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ పోటీ పడుతుండటం విశేషం. మరి ఈ సినిమా చివరి వరకు ఆస్కార్ రేసులో నిలిచి భారతీయ సినిమాకు మరో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.    మీకు నచ్చవచ్చు  గరివిడి లక్ష్మి: ఐదు భాషల్లో సందడి! ఎన్టీఆర్ కి ఉన్న టాలెంట్ ఇండియాలో మరెవరికి లేదు!   [Ramayana, Oscar, Best VFX, Ranbir Kapoor, Bollywood]    
Nitesh Tiwari's Ramayana: Part One has achieved a major milestone on the international awards circuit. The Ranbir Kapoor and Yash-starrer has reportedly advanced to the top 20 contenders in the Best Visual Effects category for the 99th Academy Awards. According to Variety, the Academy's Visual Effects Branch has notified the teams behind the films that have advanced to the next round. Ramayana is among the 20 contenders, although the Academy has not officially published the list. The Indian epic finds itself competing with some of Hollywood's biggest upcoming productions, including Dune: Part Three, Avengers: Doomsday, The Odyssey, Project Hail Mary, Spider-Man: Brand New Day and Disclosure Day. Ramayana's visual effects have been a major talking point since its release. The film features extensive CGI work by DNEG, the eight-time Oscar-winning visual effects studio known for its work on films such as Dune and Interstellar. Also Read: Allu Arjun grandly celebrates Arha's birthday The film has also received recognition at the Critics Choice Awards, where it was shortlisted in the Best Visual Effects and Best Stunt Design categories. Its presence across multiple technical awards platforms has strengthened its international awards-season visibility. Directed by Nitesh Tiwari and produced by Namit Malhotra and Yash, Ramayana: Part One stars Ranbir Kapoor as Lord Rama, Sai Pallavi as Sita and Yash as Ravana. The film's reported entry into the Oscars' top 20 VFX contenders marks another significant achievement for Indian cinema on the global stage. Check Out:   Ramayana gets shortlisted for Critic Choice Awards                       Is Varanasi really postponed or not?   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఇవి అలవాటు చేసుకోండి..! వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అలసట పెరగడం, బరువు పెరగడం, ముఖంలో కాంతి తగ్గడం చాలా మందికి ఎదురయ్యే సమస్యే. కానీ గంటల తరబడి జిమ్‌లో కష్టపడకుండా లేదా కఠినమైన డైట్లు చేయకుండా, మన రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఎప్పటికీ ఉత్సాహంగా, ఫిట్‌గా, యవ్వనంగా ఉండొచ్చు.  ఆ అలవాట్లు ఏమిటో అవి వయసు పెరిగినా యవ్వనంగా ఉండటంలో ఎలా సహాయపడతాయో వివరంగా  తెలుసుకుంటే.. ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా ప్రశాంతంగా రోజును ప్రారంభించాలి. ఫోన్ చూస్తే వెంటనే అనవసరపు ఆలోచనలు, ఒత్తిడి మొదలవుతాయి. కనీసం మొదటి 15 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. లేవగానే టీ లేదా కాఫీ తాగే బదులు ఒకటి రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. తర్వాత కాసేపు ఉదయపు ఎండలో నిలబడి కనీసం 10 నిమిషాలు నడవాలి. ఇది శరీరానికి కొత్త శక్తిని ఇచ్చి, బద్ధకాన్ని తగ్గిస్తుంది. భోజనం చేసేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూడకూడదు. ఆహారాన్ని గమనిస్తూ నెమ్మదిగా నమిలి తింటే కడుపు నిండిన భావన సమయానికి తెలిసి, అతిగా తినకుండా ఉంటాము. ఇది కూడా చదవండి   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది.. జిమ్‌కు వెళ్లే సమయం లేకపోయినా రోజంతా శరీరానికి కదలిక ఉండేలా చూసుకోవాలి. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవడం, భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వంటి చిన్న అలవాట్లు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. కడుపు పూర్తిగా నిండేంత వరకు కాకుండా 80 శాతం నిండగానే తినడం ఆపేయాలి. అలాగే ప్లేట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో జంక్ ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్ కనిపించేలా ఉంచుకోకుండా, పండ్లు , నీళ్ల బాటిళ్లను కళ్ల ముందు ఉంచుకోవాలి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్‌గా మంచి ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది. ఒకేసారి పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాలని గట్టి నిర్ణయాలు తీసుకుని తర్వాత వదిలేయడం కంటే, రోజుకు కొంచెం కొంచెంగా చిన్న అలవాట్లు మార్చుకోవడం ఉత్తమం. అలాగే ఒకరోజు తప్పు జరిగినా నిరుత్సాహపడకుండా మరుసటి రోజు మళ్లీ కొనసాగించడం ముఖ్యం. రాత్రి పడుకునే కనీసం గంట ముందు ఫోన్, టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. గాఢ నిద్ర సరిగ్గా లభిస్తే మరుసటి రోజు శరీరం ఉత్సాహంగా ఉంటుంది, అనవసరమైన ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి.                                                                                                                                            *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి      అసలు కారణాలు..!                                   జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..!
మగాళ్ల రహస్యం..  భార్యకు,  కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..! మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన  నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే.. అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని.. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు.. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు. చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు.. కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి  రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి.. సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు. భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు.. చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు. భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు.. భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు. సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి.. పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!                                    ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
చలికాలం రాగానే వాతావరణం చల్లగా మారుతుంది, ఎండ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలామంది సన్‌స్క్రీన్ వాడటం ఆపేస్తారు. కానీ మన చర్మం థర్మామీటర్ చూసి స్పందించదు, కాంతికి స్పందిస్తుంది. మిద్దె మీద లేదా ఆరుబయట కొన్ని గంటలు గడిపితే చల్లని గాలిలో కూడా ముఖం, చేతులు నల్లబడతాయి. నిపుణుల ప్రకారం, సన్ ట్యాన్ వేడి వల్ల కాదు, అతినీలలోహిత కిరణాల (UV rays) వల్ల వస్తుంది. వేడిని మనం అనుభవించగలం కానీ UV కిరణాలను అనుభవించలేం. చలికాలంలో UVB కిరణాలు తక్కువగా ఉన్నా, వృద్ధాప్య ఛాయలు మరియు ట్యానింగ్‌కు కారణమయ్యే UVA కిరణాలు మాత్రం చురుకుగానే ఉంటాయి. ఇవి మేఘాలను మరియు కిటికీ అద్దాలను కూడా దాటుకుని చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల చర్మం తనను తాను కాపాడుకోవడానికి మెలనిన్ (melanin) ఉత్పత్తి చేస్తుంది, అదే ట్యాన్‌గా మారుతుంది. చలికాలపు ఎండ బయటకు కనిపించినంత అమాయకంగా ఉండదు. చల్లని గాలి వల్ల వేడి హెచ్చరిక తెలియక మనం ఎండలో ఎక్కువ సమయం గడిపేస్తాం. స్పష్టమైన రోజుల్లోనే కాకుండా పలుచని మేఘాలు ఉన్నప్పుడు కూడా గణనీయమైన UV కిరణాలు కిందకు వస్తాయి. మంచు, నీరు, లేదా ప్రకాశవంతమైన ఉపరితలాలు UV కిరణాలను తిరిగి చర్మంపై ప్రతిబింబిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లినప్పుడు UV తీవ్రత మరింత పెరుగుతుంది. 2024లో ప్రచురించబడిన ఒక అధ్యయన సమీక్ష ప్రకారం, UVA కిరణాలు మరియు దృశ్య కాంతి మేఘాలు, కిటికీ అద్దాల గుండా ప్రయాణించగలవు, అలాగే మెలస్మా వంటి నల్లటి మచ్చల సమస్యలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ చర్మతత్వానికి చలికాలపు ఎండ వల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. ముదురు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కమిలిపోదు కానీ సులభంగా ట్యాన్ అవుతుంది మరియు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చలికాలపు ఎండ ముఖం, చేతులు, మెడను నల్లబర్చడమే కాకుండా, మెలస్మా (బుగ్గలు, నుదురుపై గోధుమ లేదా బూడిద రంగు మచ్చలు)ను తీవ్రతరం చేస్తుంది మరియు మొటిమల మచ్చలను ఎక్కువకాలం ఉంచుతుంది. 2022లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం, దృశ్య కాంతి మరియు దీర్ఘ తరంగ UVA కిరణాలు మెలస్మాకు ముఖ్య కారణాలుగా నిలిచాయి, అయినప్పటికీ మెలస్మా ఉన్నవారిలో ఎక్కువమంది సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు సరిగ్గా పాటించడం లేదని తేలింది. అందుకే చలికాలంలోనూ ప్రతిరోజూ ఉదయం కనీసం SPF 30 మరియు PA+++ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ వాడటంలో సంఖ్య కంటే వాడే పద్ధతి, మోతాదు చాలా ముఖ్యం. ముఖం మరియు మెడ కోసం సుమారు రెండు వేళ్ల పొడవు (two finger lengths) అంత సన్‌స్క్రీన్ తీసుకోవాలి. బయట ఉన్నప్పుడు ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటం మంచిది. టోపీ, సన్‌గ్లాసెస్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి మరియు చేతుల వెనుక భాగం, చెవులు, మెడను కూడా కవర్ చేసుకోవాలి. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడాలి. ఉష్ణోగ్రత కంటే వాతావరణ యాప్‌లో UV ఇండెక్స్ చూసి ప్రణాళిక వేసుకోవాలి. ఇది కూడా చదవండి:జలుబు, పొడి దగ్గు వేధిస్తోందా? ఇంట్లోనే ఈ సులభ పరిష్కారాలు విటమిన్ D కోసం గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు; అలా చేస్తే పిగ్మెంటేషన్ మరియు చర్మ సమస్యలు పెరుగుతాయి. విటమిన్ D లోపం గురించి ఆందోళన ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం, ముదురు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ D ఉత్పత్తి కావడానికి ఎండలో ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి అంచనా వేయడం సరికాదు.  అలాగే, విస్తరిస్తున్న లేదా తగ్గని నల్లటి మచ్చలు, ఆకారం లేదా రంగు మారుతున్న పుట్టుమచ్చలు, చర్మం కాలిపోవడం లేదా పొట్టు ఊడటం, లేదా సన్‌స్క్రీన్ వాడినా పెరుగుతున్న పిగ్మెంటేషన్ కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చలికాలంలోనూ రోజూ సన్‌స్క్రీన్ రాయడం, చర్మాన్ని కప్పి ఉంచడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్, మిరపకాయ బజ్జీ కూర.. సింపుల్ టిప్స్‌తో పర్ఫెక్ట్ గ్రేవీ!                              ఈజీగా చేసుకునే, రుచికరమైన పొట్లకాయ పచ్చిశనగపప్పు, కూర విధానం           Winter Sun Tan, Sun Tan In Winter Causes, Dermatologist Skincare Tips, Winter Sunscreen Tips, UV Rays In Winter, Prevent Tanning In Cold Weather, Skincare Tips In Telugu.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. మజ్జిగలో ఈ మూడు పొడులు కలిపి తీసుకోండి!   జుట్టు రాలడం, పలుచబడటం, జుట్టు ఒత్తుగా పెరగకపోవడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే బయట ఉపయోగించే నూనెలు, షాంపూలతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ముఖ్యం. ముఖ్యంగా పోషకాలు సమృద్ధిగా ఉండే సహజ ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మునగాకు పొడి, కరివేపాకు పొడి, మెంతుల పొడిని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి? మునగాకులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మెంతులు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి? ఈ సహజ పదార్థాలను రోజువారీ ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలి? అలాగే చిరుధాన్యాలు (Millets) మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఏమిటి? రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు లభిస్తాయి? సంప్రదాయ ఆహారపు అలవాట్లు, సహజంగా పండించిన ఆహార పదార్థాల ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ నేచురల్ ఫార్మింగ్ నిపుణులు  గున్న రాజేందర్ రెడ్డి (Gunna Rajender Reddy) గారు వివరించారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన సహజ ఆహారాలను మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యం, సహజ ఆహారం, మునగాకు, కరివేపాకు, మెంతులు, చిరుధాన్యాల పయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ ఆహార పదార్థాలు పోషకాలను అందించవచ్చు. అయితే 90 రోజుల్లో జుట్టు తప్పనిసరిగా ఒత్తుగా పెరుగుతుందని హామీ ఇవ్వలేము. జుట్టు అధికంగా రాలుతున్నట్లయితే కారణాన్ని గుర్తించేందుకు వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూ ఉండాలని అనిపించడం చాలామందిలో కనిపిస్తుంది. ఎక్కువ పని చేసినప్పుడు లేదా సరిగ్గా తిననప్పుడు ఇలా అనిపిస్తే అది సాధారణమే. కానీ కడుపు నిండా తిన్నాక కూడా పదేపదే ఆకలి వేస్తుంటే మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అది మన అలవాటా లేక శరీరంలో  ఏదైనా సమస్య గురించి అలా లక్షణం రూపంలో బయటకు తెలుస్తోందా అన్నది తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు.  అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి. అవేంటో తెలుసుకుంటే.. అలవాట్లు.. మన రోజువారీ ఆహారపు అలవాట్లు, తినే సమయం, తినే ఆహారం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఆకలి వెనుక శరీరంలోని హార్మోన్లు లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సాధారణ ఆకలికి, అనారోగ్య సంకేతానికి మధ్య తేడాను గుర్తించాలి. డయాబెటిస్.. డయాబెటిస్ ఉన్నవారిలో పదేపదే ఆకలి వేయడం ఒక సాధారణ లక్షణం. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీర కణాలకు చేర్చడానికి ఇన్సులిన్ అవసరం. డయాబెటిస్‌లో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కణాలకు తగినంత శక్తి అందదు. దాంతో ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి తోడు ఎక్కువ దాహం, తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గినప్పుడు కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది. అప్పుడు చెమట పట్టడం, వణుకు, తలతిరగడం, కంగారుగా అనిపించడం లాంటివి కలగవచ్చు. థైరాయిడ్.. థైరాయిడ్ సమస్య వల్ల కూడా ఆకలి పెరగవచ్చు. థైరాయిడ్ గ్రంథి అవసరం కంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే స్థితిలో శరీర జీవక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల ఆకలి పెరిగినా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువ చెమట పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, కొన్ని రకాల మందుల వల్ల కూడా ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడి ఎక్కువ ఆకలి వేయవచ్చు. ఇది కూడా చదవండి   మునగాకు లడ్డూ రోజూ 2 తింటే.. శరీరానికి ఇన్ని పోషకాలా.! ఆకలితో పాటు బరువు తగ్గడం.. ఎప్పుడూ ఆకలి వేస్తూ దానితో పాటు బరువు తగ్గడం, ఎక్కువ దాహం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది. అవసరమైన రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటే అసలు కారణం తెలుస్తుంది.                                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   అవిసె గింజలు ఎలా తింటే ఎక్కువ మేలు సరైన పద్ధతి ఇదే!                                   ఇదిగో ఈ ఆహారాలు తింటే గట్ హెల్త్ సేఫ్ గా ఉంటుంది..!
అందంగా కనిపించాలని, చర్మం కాంతివంతంగా ఉండాలని చాలామంది రకరకాల Skin Care Products, Beauty Treatments ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, వైరల్ అవుతున్న Skincare Trends చూసి కొత్త కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయడం, రకరకాల Skin Treatments చేయించుకోవడం ఇటీవల ఎక్కువైంది. అయితే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి Skin Care Product మన చర్మానికి సరిపోతుందా? ప్రతి Beauty Treatment సురక్షితమైనదేనా? అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ మౌనిక చర్మ సంరక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే Skin Care Products, Creams, Serums వంటివి ఉపయోగించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రకటనల్లో చూపించే ఫలితాలను ఎంతవరకు నమ్మవచ్చు? మన చర్మతత్వానికి సరిపోని ఉత్పత్తులను ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అనే విషయాలను తెలియజేశారు. అలాగే ముఖంపై ముడతలు తగ్గించుకోవడానికి, యవ్వనంగా కనిపించడానికి ఉపయోగించే Botox Treatment, Facial Fillers గురించి కూడా వివరించారు. ఈ చికిత్సలు అంటే ఏమిటి? వీటిని చేయించుకునే ముందు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? సరైన అర్హతలు లేని వ్యక్తుల దగ్గర చికిత్సలు చేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు? అనే అంశాలను చర్చించారు. ఒకరికి మంచి ఫలితాన్ని ఇచ్చిన Skin Care Product లేదా Treatment మరొకరికి కూడా సరిపోతుందని అనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్కరి చర్మతత్వం, చర్మ సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, ప్రకటనలు చూసి గుడ్డిగా ఉత్పత్తులు కొనడం లేదా చికిత్సలు చేయించుకోవడం మంచిది కాదు. చర్మ సంరక్షణకు సరైన ఉత్పత్తులను ఎలా ఎంచుకోవాలి? సోషల్ మీడియాలో ప్రచారమయ్యే Beauty Products విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం? Botox, Facial Fillers వంటి చికిత్సలు చేయించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? చర్మ సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి? వంటి ముఖ్యమైన సందేహాలకు ఈ వీడియోలో డాక్టర్ మౌనిక సమాధానాలు ఇచ్చారు. అందం కోసం చేసే ప్రయోగాల కంటే చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ చర్మతత్వాన్ని అర్థం చేసుకుని, అర్హత కలిగిన చర్మవ్యాధి నిపుణుల సలహాతోనే Skin Care Products, Treatments ఎంచుకోండి. సోషల్ మీడియా Skincare Trends, Beauty Products, Botox, Facial Fillers గురించి డాక్టర్ మౌనిక ఏం చెబుతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి.  గమనిక: ఈ వీడియో కేవలం సమాచార, అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే Skin Care Products లేదా Beauty Treatments అందరికీ సరిపోతాయని భావించకండి. కొత్త ఉత్పత్తులు ఉపయోగించే ముందు, Botox, Facial Fillers వంటి చికిత్సలు చేయించుకునే ముందు అర్హత కలిగిన చర్మవ్యాధి నిపుణుడి సలహా తీసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)