ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తధ్యం అని ఖరారైపోయింది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహ రచన, ఎత్తుగడలు, ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.  ఈ క్రమంలోనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ కూడా ఈ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఉపఎన్నికలో తమ అభ్యర్థిని రంగంలోకి దించి పార్టీ సత్తా చాటాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. తొలుత ఖైరతాబాద్ బరిలో కల్వకుంట్ల కవిత దిగుతారని ప్రచారం జరిగినప్పటికీ.. టీఆర్ఎస్ గళాన్ని బలంగా వినిపించేందుకు పోటీలో టీఆర్ఎస్ ఉంటుందనీ, అయితే కవిత అభ్యర్థి కారనీ అంటున్నారు.  ప్రణాళికలు రచిస్తోంది. నగర రాజకీయాల్లో తమ గళాన్ని గట్టిగా వినిపించేందుకు ఈ ఎన్నికను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై పోరాడటమే తమ ప్రధాన లక్ష్యమని, అధికార, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ ఉపఎన్నిక సరైన వేదిక అని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.  ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో బలమైన పోటీ ఇస్తామని, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన అజెండాగా ఉంటుందని టీఆర్ఎస్ చెబుతోంది.   కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ ఖైరతాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం వ్యూహాలు రచిస్తున్న తరుణంలో అనూహ్యంగా టీఆర్ఎస్ కూడా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించడంతో పోటీ రసవత్తరం గా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఖైరతాబాద్ ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన తరువాత   ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక సమస్యలపై   డిక్లరేషన్లు ప్రకటించాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద టీఆర్ఎస్ బరిలోకి దిగడానికి నిర్ణయించుకోవడంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికలో చతుర్ముఖ పోటీ అనివార్యం కావడంతో సర్వత్రా ఈ ఎన్నికపై ఆసక్తి ఉత్కంఠ వ్యక్తమౌతోంది.  [Telangana Rakshana Sena, Khairatabad by Eection, Telangana Politics, BRS, Congress, BJP, TRS, Telugu One]
దేశ రాజకీయాకాశంలో గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకదాని వెనుక ఒకటి అన్నట్లుగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థల నిర్ణయాలు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న   విమర్శలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. పుష్కరకాలంగా ఎన్నడూ లేని విధంగా మోడీ సర్కార్ డిఫెన్స్ లో పడుతోంది.    రాజకీయంగానే కాకుండా, వ్యవస్థాగత అంశాలలోనూ మోడీ సర్కార్  సమస్యల సంక్షోభంలో కూరుకుపోతున్నది.   నీట్ పరీక్ష పత్రం లీక్ కావడం నుంచి మొదలై.. తాజాగా ఎన్నికల సంఘంలో తలెత్తిన సంక్షోభం వరకూ వరుసగా జరుగుతున్న పరిణామాలు నైతికంగా మోడీ సర్కార్ ను బలహీనం చేశాయనడంలో సందేహం లేదు. నీట్ వ్యవహారాన్ని తీసుకుంటే.. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది.  ఇక తాజాగా   ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై వస్తున్న విమర్శలు, ఎన్నికల సంఘం కమిషనర్ల మధ్య విభేదాలు.. మోడీ సర్కార్ ను మరింత డిఫెన్స్ లో పడేశాయి.  ఎన్నికల సంఘం పనితీరుపై  వెల్లువెత్తుతున్న విమర్శలు మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలలోని డొల్లతనాన్నీ, ఆధిపత్య ధోరణినీ ప్రస్ఫుటం చేశాయి.  ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్   రాజీనామా డిమాండ్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఓటర్ల జాబితాల సవరణ, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం మోడీ సర్కార్ పునాదులను కదిలిస్తున్న పరిస్థితి గోచరిస్తోంది. నీట్, ఎన్నికల సంఘం వివాదాలు కేంద్ర ప్రభుత్వ పతిష్టను మసకబార్చాయి.  మరోవైపు  వందేమాతరం వివాదం కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే మారింది.  పార్లమెంట్‌లో ఈ గీతాలాపనపై జరిగిన చర్చలు  దుమారాన్ని రేపాయి. ఈ గీతాన్ని పూర్తిగా పాడాలనే నిబంధనలు తేవడం, చివరి చరణాలలోని పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం కావడం దీనికి సంబంధించి కోర్టుల నుంచి వచ్చిన తీర్పులు, ప్రతికూల వ్యాఖ్యలు మోడీ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టాయి.  న్యాయస్థానాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు పాలకుల చర్యలకు అడ్డుకట్ట వేసేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో..  ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే తీరు కూడా వివాదాస్పదంగా మారి కొత్త చర్చకు తెరలేపింది.    ఒకవైపు దేశాభివృద్ధి, మరోవైపు సాంస్కృతిక జాతీయవాదం అనే అజెండాతో  సాగుతున్న  మోడీ సర్కార్‌కు ఈ పరిణామాలు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి.   ఈ వరుస పరిణామాలు ముందుముందు మారనున్న రాజకీయ సమీకరణాలకు సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం సంఖ్యాబలం ఉందన్న ధీమాతో ఇష్ఠారీతిగా నిర్ణయాలు తీసుకోవడం, విధానాలు రూపొందించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఏ ప్రజలైతే చట్ట సభల్లో మోడీ సర్కార్ కు సంఖ్యాబలం ఇచ్చారో.. ఆ ప్రజలే ఇప్పుడు కేంద్ర విధానాలు, నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు.  ముందు ముందు ఈ వివాదాలు ఏ రూపందాలుస్తాయన్నది చూడాలి. మొత్తం మీద వరుసగా మూడు ఎన్నికలలో మోడీ సర్కార్ పై విశ్వాసం ఉంచి అధికారం కట్టబెట్టిన ప్రజ ఇప్పుడు.. అదే మోడీ సర్కార్ పై ఆగ్రహంతో రగిలిపోతోంది. ప్రజాభీష్ఠానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని కుండబద్దలు కొడుతోంది.  ఇప్పుడీ సవాళ్లను మోడీ ఎలా ఎదుర్కొని అధిగమిస్తారన్నది ఆసక్తిగా మారింది.   [Modi Government, Cisises, NEET Leak Controversy, Election Commission, Vandemataram Song, Opposition, Criticism, People Anger]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది దశాబ్దాల సుదీర్ఘ  ప్రస్థానం. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది.  ఇక ఇప్పుడు చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ సైతం అదే బాటలో నడుస్తున్నారు.   పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్ల సమస్యలను పరిష్కరించే విషయంలో లోకేష్  తనను తాను  డోలో 650 మ్యాన్ గా ఆయన అభివర్ణించుకున్నారు.  సాధారణంగా జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలకు  డోలో 650  తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఇదే విషయాన్ని ఉదహరిస్తూ నారా లోకేష్ తాను కూడా పారిశ్రామిక రంగంలో  అదే పాత్ర పోషిస్తున్నానని చమత్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లకు ఇబ్బంది వస్తే.. తనకు ఫోన్ చేస్తారని, తక్షణమే ఆ సమస్యను పరిష్కరించేందుకు తాను ముందుంటానని లోకేష్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పారిశ్రామిక రంగం జోరందుకుంది.  పెట్టుబడుల ప్రవాహం వరదనున తలపిస్తోంది. ఇదంతా లోకేష్ చొరవ ఫలితమే పరిశ్రమల ఏర్పాటులో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడంలో, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడంలో లోకేష్ అనితర సాధ్యమన్న రీతిలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి  పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్ట్‌లను గ్రౌండింగ్ చేసే దశలో ఎలాంటి జాప్యం జరగకుండా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తూ, పనులను పరుగులెట్టిస్తున్నారు.   ఇన్వెస్టర్లకు క్షేత్రస్థాయిలో  ఎదురయ్యే సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, ఇన్వెస్టర్లలో భరోసా నింపుతున్నారు.  పెట్టుబడుల సాధనే ధ్యేయంగా ఆయన అనుసరిస్తున్న విధానం పారిశ్రామిక వర్గాల  ప్రశంసలు అందుకుంటోంది. వ్యాపార ప్రక్రియ వేగవంతంగా సాగేలా చూస్తూ, కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేస్తున్నారు.  తండ్రి చంద్రబాబు నాయుడు రాజకీయ శైలి నుంచి లోకేష్ ఈ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.  ప్రస్తుతం ఏపీలో సరికొత్త పారిశ్రామిక విధానాలు అమలవుతున్న తరుణంలో, ఇన్వెస్టర్లకు నారా లోకేష్ ఇస్తున్న  భరోసా ఏపీ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా, రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకు రావడంలోనూ, ఆ క్రమంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని అక్కడికక్కడే పరిష్కరించడంలోనూ లోకేష్ చొరవ తండ్రి చంద్రబాబును మించి ఉంటుందని పరిశీలకులు చెబుతు న్నారు. లోకేష్ తనకు తాను తగిలించుకున్న డోలో 650 మ్యాన్  ట్యాగ్ ఆయనకు అతికినట్లు సరిపోయిందంటున్నారు.     [AP CM CBN Crisis Man, Nara Lokesh, Dolo 650 Man, AP Investments,  Investor Meet,  Andhra Pradesh Industries, Investments, Troubleshoot, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
The Paradise director Srikanth Odela has confirmed reports that he and Nani did have heated exchanges while working on the film, but made it clear that their relationship goes far beyond what happens on a film set. Speaking at the film’s Media Mulakat, the director described his bond with Nani as something closer to brotherhood. Srikanth acknowledged that there were intense moments between them during the making of The Paradise. However, he said such incidents should not be viewed beyond the context of the work. Nani was the person who brought him into the industry and gave him this career, and their relationship has grown much deeper through their journey together. He further said that whatever happens between them on the sets does not affect their bond outside the film. According to Srikanth, they are brothers and will continue to remain so, regardless of the arguments or disagreements that may happen while making a film. He further thanked Kayadu Lohar for accepting such a bold character.  The director had earlier spoken about how the working relationship between him and Nani had evolved beyond the conventional actor-director equation. At the Media Mulakat, he once again made it clear that he cannot speak about Nani simply as an actor because their relationship has become much more personal. The Paradise demanded an intense working process, with the team shooting through difficult conditions involving mud, rain and harsh sunlight. Nani had also revealed that the team often stayed on the sets without moving to their caravans to ensure the mood of the shoot was not disturbed. Srikanth’s comments now provide context to the reports of differences between the two, while also making it clear that their bond remains intact. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Nani’s The Paradise is witnessing a gradual shift in audience response after its release. The film, which registered Nani’s biggest opening and became his fastest Rs.100 crore grosser, received extreme reactions during the premiere shows. However, Nani says the talk has been getting better with every show. Speaking at the film’s Media Mulakat, Nani acknowledged the unusual response and called The Paradise a “Lambhi Race Ka Ghodha.” He said, “Normally, films tend to get positive responses early and then they tend to go mixed. But our film got extreme reactions and positive talk is growing with each show.” He added that hearing the collections from distributors and seeing the response from audiences has been satisfying. Nani also spoke about the difficult journey behind the film, revealing that the team had to work through harsh mud, rain and sunlight, with everyone putting in double the effort. He said the team even stayed on sets without moving to their caravans so that the mood of the shoot would not be disturbed. He also praised Mohan Babu, saying he fell in love with the veteran’s nature while working with him. Nani concluded by thanking audiences for continuing to support The Paradise and urged them to experience the film in theatres. Director Srikanth Odela thanked the entire cast and crew and said his relationship with Nani has gone beyond that of a director and actor, calling them brothers. Mohan Babu, meanwhile, recalled how Srikanth’s decision to seek Nani’s permission before approaching him for the role initially hurt his ego, but said the director’s conviction and fearlessness won him over. He also praised Nani’s dedication to the craft. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలసి ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారా?.. ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో ఊపేస్తున్న క్రేజీ బజ్ ఇది. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి' షూటింగ్ ను ఇటీవలే మహేష్ బాబు పూర్తి చేశారు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో పని చేయబోతున్నారు అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ పేరు గట్టిగా వినబడుతోంది. ఇటీవల లోకేష్ కనగరాజ్ ఒక బిగ్ ఐడియాతో మహేష్‌ను కలిసి ఓ లైన్ వినిపించారని, దానికి మహేష్ కూడా సానుకూలంగా స్పందించారని ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తోంది. రాజమౌళి సినిమా పూర్తయిన వెంటనే ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. లోకేష్ ఇప్పటికే అల్లు అర్జున్ తో ఓ సినిమా కమిటై ఉన్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న 'రాకా' ఆలస్యమవుతుండటంతో.. ఈ గ్యాప్ లో మహేష్ ప్రాజెక్టును లోకేష్ పట్టాలెక్కిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.  ఇది కూడా చదవండి: అక్కడే నా ఇగో దెబ్బతింది: శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు కామెంట్స్.!        [Mahesh Babu Lokesh Kanagaraj Movie, Mahesh Babu Next After Varanasi, Mahesh Babu Next Movie, Mahesh Babu Varanasi Movie, Mahesh Babu, Lokesh Kanagaraj, Allu Arjun, Telugu Film News, Telugu News]  
Mohan Babu’s gesture at The Paradise Media Mulakat has won appreciation, as the veteran actor extended an immediate helping hand to the son of a lyricist who lost his father. Lyricist Kasarla Shyam introduced the boy at the event and revealed that he had lost his father. Mohan Babu responded instantly by offering to take responsibility for his higher education. Mohan Babu announced that the boy would be given free education in M. Pharmacy at his MBU University. The actor said he has immense respect for writers and lyricists, and this was his way of extending support to the family. He made the announcement on the spot, turning an event meant to celebrate The Paradise into a personal moment of kindness. The veteran actor has often spoken about the importance of writers and their contribution to cinema. At the same event, he also recalled his experience working with director Srikanth Odela and how the young filmmaker’s conviction impressed him. He revealed that his ego was initially hurt when Srikanth told him that he had first sought Nani’s permission before approaching him for the role of Shikanja Malik. Mohan Babu said he eventually admired Srikanth’s fearlessness and commitment to getting the best out of every scene. He also praised Nani’s dedication and revealed that he was impressed by the actor’s willingness to repeatedly perform difficult sequences without complaining. The decision to immediately offer free M. Pharmacy education to the lyricist’s son, however, became one of the most heartwarming moments of the interaction. For Mohan Babu, it was a gesture of respect towards a writer and an opportunity to support a young person who had lost his father. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'ది ప్యారడైజ్'. ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్రలో మోహన్ బాబు నటించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ కి మరోసారి విజిల్స్ పడుతున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా 'ప్యారడైజ్' ప్రెస్ మీట్ లో మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు ఎలాంటి విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడతారు. అలాంటి మోహన్ బాబు.. కొన్ని కొన్ని విషయాలు మాట్లాడాలని అనిపించినా, మాట్లాడలేకపోతున్నాని 'ప్యారడైజ్' ప్రెస్ మీట్ లో అన్నారు. ఏం మాట్లాడినా తమ విద్యాసంస్థల్లో చదువుతున్న వేలాది విద్యార్థులకు చెడ్డపేరు వస్తుందని, అందుకే సైలెంట్ గా ఉంటున్నట్లు మోహన్ బాబు చెప్పారు. ఇక 'ప్యారడైజ్' గురించి మాట్లాడుతూ.. నానిని మేము అప్పుడప్పుడు తలచుకుంటూ ఉంటామని, మా కుటుంబంలో నానిని ప్రేమించేవారు ఉన్నారని మోహన్ బాబు తెలిపారు. అలాగే శ్రీకాంత్ ఓదెల గురించి ఆయన చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి. "దర్శకుడు శ్రీకాంత్ నన్ను కలిసి కథ చెప్పాడు. నువ్వు చెప్తున్నావు సరే, ఇందులో హీరో నాని కదా.. నువ్వు నానిని అడిగావా అన్నాను. మా అన్న పర్మిషన్ తీసుకునే వచ్చాను అన్నాడు. అక్కడ కొట్టింది నాకు ఇగో. నన్ను సినిమాలో పెట్టుకోవడానికి నాని రికమెండేషన్ తో వచ్చావా.. అని మనసులో అనుకున్నాను. ఏదేమైనా నాని పర్మిషన్ తో వచ్చాడు కాబట్టి.. థాంక్యూ నాని" అని మోహన్ బాబు అనడంతో అక్కడ నవ్వులు పూశాయి. అలాగే శ్రీకాంత్ ఓదెలపై ప్రశంసలు కూడా కురిపించారు మోహన్ బాబు. "దర్శకుడిగా శ్రీకాంత్ టాలెంట్ చూసి గర్వించాను. అతని టాలెంట్ గురించి ఎందరికో చెప్పాను." అన్నారు. ఇది కూడా చదవండి: నాని అన్నతో గొడవలు నిజమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.!       [Mohan Babu About Srikanth Odela, Mohan Babu Speech, The Paradise Movie, Nani Paradise, Natural Star Nani, Srikanth Odela, Mohan Babu, Kayadu Lohar, Telugu Film News, Telugu News]  
    టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, తమిళ కమెడియన్ సూరి, హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'ఏళు కడల్ ఏళు మలై'. ఈ క్రేజీ చిత్రాన్ని తెలుగులో 'సంచారి' అనే టైటిల్‌తో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తూ  పోస్టర్లని విడుదల చేసింది. అయితే, ఈ పోస్టర్లు బయటకు రాగానే టాలీవుడ్‌ ప్రముఖ సీనియర్ దర్శకుడు 'ఆ నలుగురు' ఫే మ్ చంద్ర సిద్ధార్థ షాక్ కి గురయ్యాడు.ఎందుకంటే సంచారి'  టైటిల్ ని    తన ఫిల్మోత్సవ్  బ్యానర్‌పై కొన్ని నెలల క్రితమే ఫిల్మ్ ఛాంబర్‌లో అధికారికంగా రిజిస్టర్ చేయించుకున్నారు.దీంతో తన తదుపరి డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం రిజిస్టర్ చేసుకున్న 'సంచారి' టైటిల్‌ ని, ఎలాంటి ముందస్తు సమాచారం లేదా అనుమతి లేకుండా ఒక తమిళ డబ్బింగ్ సినిమాకు వాడేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా టైటిల్ ప్రకటన రావడంపై చంద్ర సిద్ధార్థ తన టీమ్‌తో కలిసి ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను ఆశ్రయించి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాడు సాధారణంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిబంధనల ప్రకారం ఇక్కడ ముందే రిజిస్టర్ అయిన టైటిళ్లను ఇతర డబ్బింగ్ సినిమాలకు కేటాయించరు. దీంతో నివిన్ పౌలీ డబ్బింగ్ చిత్రం ఖచ్చితంగా తమ తెలుగు టైటిల్‌  మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, దర్శకుడు చంద్ర సిద్ధార్థ 'సంచారి' పేరుతో తెరకెక్కించాలనుకుంటున్న కథాంశం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కథ ప్రకారం, ఒక భారీ ఈ-కామర్స్ వ్యాపార సామ్రాజ్యంతో కోట్లు గడించిన ఒక కుబేరుడికి సడెన్‌గా హార్ట్ ఎటాక్ వస్తుంది. తాను బ్రతికేది కేవలం కొన్ని రోజుల వ్యవధి మాత్రమేనని వైద్యులు స్పష్టం చేయడంతో, ఆ కుబేరుడు తన వ్యాపారాన్ని, సిరిసంపదలను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అలా ఒక సాధారణ 'సంచారి'గా మారిన ఆ శ్రీమంతుడు రాయలసీమ ప్రాంతంలో అడుగుపెడతాడు. అక్కడ ప్రమాదంలో ఉన్న ఒక 5 గురు అపరిచితులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే, ఆ 5 మంది అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్లకు మూలకారణం తన సొంత కంపెనీ గతంలో తీసుకున్న కొన్ని కఠినమైన వ్యాపార నిర్ణయాలే అని తెలిసి ఆ కుబేరుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతాడు. ఇది కూడా చదవండి: నాతో అసలు పని లేదు.. అయినా సరే ఆ దర్శకుడు డబ్బులు తిరిగిచ్చేశారు!     ఆ తప్పును దిద్దుకోవడానికి, ఆ రాయలసీమ గ్రామాన్ని రక్షించడానికి ఆ సంచారి ఏం చేశాడనేది ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ పాయింట్. ఒక మనిషి అసలైన విలువ అతడు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తిపై కాకుండా, అతడి వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి అనే భావోద్వేగమైన కాన్సెప్ట్‌తో ఈ స్టోరీ లైన్ అల్లుకున్నారు. ఇలాంటి బలమైన సందేశాత్మక కథకు 'సంచారి' అనే పేరు 100% నూటికి నూరు శాతం సరిపోతుందని, అందుకే ఈ టైటిల్ హక్కుల కోసం తాము ఛాంబర్ ముందుకు వెళ్తున్నామని ఫిల్మోత్సవ్ సంస్థ స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో, నివిన్ పౌలీ సినిమా టైటిల్ మారుతుందో లేదో అని టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.   [Sanchari Movie Title Controversy In Tollywood, Sanchari Title Controversy, Filmofsav Banner , Yezhu Kadal Yezhu Malai, Nivin Pauly,chandra siddardha, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
విజయవాడ అమ్మాయి 'లయ' తెలుగు ప్రేక్షకులు ఎనీ టైం గుర్తుంచుకునేలా ప్రాముఖ్యత గల సినిమాలే చేసి మెప్పించింది. తన పెర్ఫార్మ్ చూస్తుంటే  అప్పుడే విరబూసిన లేలేత  గులాబీ పువ్వు మనతో ఏదో చెప్పాలనుకున్నంత అందంగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఒక సినిమాకి సంబంధించి  కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేక ఇతర కారణాల వల్ల నాకు ఇవ్వాల్సిన పారితోషికం కొద్ది భాగం పెండింగ్‌లో ఉండిపోయింది. సాధారణంగా నాలుగేళ్లు గడిచిపోయాక,  పెళ్లి చేసుకుని పరిశ్రమకు దూరమవుతున్న సమయంలో ఇక ఆ బాకీ తిరిగి వస్తుందని నేను  ఊహించలేదు.2006లో నా  వివాహ మహోత్సవం ఎంతో వేడుకగా జరిగింది.వేడుక ముగిసిన తర్వాత ఒక ప్రత్యేక పార్సిల్ నా ఇంటికి వచ్చింది. దాన్ని ఏదో సాధారణ వివాహ బహుమతి అనుకుని ఓపెన్ చేసి షాక్ అయ్యాను. ఆ కవరులో పెద్ద మొత్తంలో నగదుతో పాటు ఒక భావోద్వేగపూరితమైన లేఖ ఉంది.   ఆ లేఖలో 'అమ్మా లయా, నేను నీకు  ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ బాకీ ఇది. ఆ సమయంలో పరిస్థితుల వల్ల నీకు పూర్తి పారితోషికం ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నీ పెళ్లి సమయానికి నా దగ్గర డబ్బులు సరిపడా ఉన్నాయి. అందుకే ఈ బకాయిని నీకు అందజేస్తున్నాను. దీన్ని నా పెళ్లి కానుకగా, ఆశీర్వాదంగా భావించి స్వీకరించు" అని పేర్కొన్నారు.   ఈ సంఘటనతో తనకు మాటలు రాలేదని లయ చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: అనుమాన పక్షి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు: మరి డిజాస్టర్ అన్నారుగా!      "నేను ఆ డబ్బులను ఎప్పుడో వదిలేసుకున్నాను. 2004లో జరిగిన సినిమాకు 2006లో పెళ్లి చేసుకుని వేరే దేశం వెళ్లిపోతున్న నాకు ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం  లేదు. ఇకపై నాతో ఆయనకు ఎటువంటి పని కూడా లేదు. అయినా సరే, నీతిగా తన బాధ్యతను గుర్తుపెట్టుకుని, ఒక తండ్రిలా భావించి ఆ పారితోషికాన్ని పెళ్లి కానుకగా పంపడం ఆయన గొప్పతనానికి నిదర్శనం" అంటూ చెప్పుకొచ్చింది. ఆ దర్శకుడు  కళాతపస్వి కె. విశ్వనాథ్ అనే పేరు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. 2004వ లో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'స్వరాభిషేకం' అనే చిత్రంలో లయ హీరోయిన్.   [Laya Recalls Remuneration Wedding Gift From Director, Actress Laya, Director K Viswanath,Swarabhishekam Movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందిన 'ది ప్యారడైజ్' మూవీ సెప్టెంబర్ 24న విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే, విడుదలకు ముందు 'ప్యారడైజ్' గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.  నాని, శ్రీకాంత్ ఓదెల మధ్య విభేదాలు వచ్చాయని.. నాని తిడితే శ్రీకాంత్ అలిగాడని.. ఇలా గాసిప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ గాసిప్స్ పై శ్రీకాంత్ స్పందించారు. "ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో నేను కొన్ని చదివాను. నాని అన్నకి కోపం వచ్చింది, నాని అన్న తిట్టాడు, నాని అన్న కొట్టాడు, శ్రీకాంత్ అలిగాడు అని. నాని అన్నకి, నాకు గొడవలు అయ్యాయని కొన్ని చదివాను. అదంతా నిజమే అయ్యుండొచ్చు. కానీ, నాని అన్నతో నా బాండింగ్ దసరాకో, ప్యారడైజ్ కో పరిమితమైంది కాదు. మాది సినిమాని దాటిన ఎమోషన్. ఆయన నన్ను భరించాలి, నన్ను మోయాలి.. వేరే ఆప్షన్ లేదు. మేము తన్నుకుంటాం, తిట్టుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. కొన్ని ఎమోషన్స్ బతుకు దగ్గర ఆగొద్దు, చావుని దాటి చూడాలి. నాని అన్నతో నాది అలాంటి ఎమోషన్." అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఓదెల మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ స్టేజ్ మీద మాట్లాడుతున్న సమయంలో.. ఎదురుగా ఉన్న నాని సైతం ఆ మాటలను నవ్వుతూ ఎంజాయ్ చేయడం విశేషం. ఇది కూడా చదవండి: అంతకుమించి.. ‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.! https://x.com/Theteluguone/status/2103818692547235957       [Srikanth Odela About Clashes With Nani, Srikanth Odela Speech, The Paradise Movie, Nani Paradise, Natural Star Nani, Srikanth Odela, Mohan Babu, Kayadu Lohar, Telugu Film News, Telugu News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్ వాచీలు మరియు స్మార్ట్ రింగ్‌లు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్ని అడుగులు వేసాం, ఎన్ని కేలరీలు ఖర్చు చేశాం, గుండె కొట్టుకునే వేగం ఎంత అనే వివరాలతో పాటు రాత్రి వేళ మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోయాం అనే విషయాలను కూడా ఈ స్మార్ట్ పరికరాలు క్షణాల్లో లెక్కించి చూపిస్తున్నాయి. స్మార్ట్ వాచ్ ధరించి పడుకునే చాలామంది ఉదయాన్నే లేవగానే తమ యాప్‌లో  స్లీప్ స్కోర్  ఎంత వచ్చిందో చూసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. 100 కి 80 లేదా 90 స్కోర్ వస్తే అబ్బా ఈరోజు బాగా నిద్రపోయాం అని సంతోషపడటం, అదే 60 లేదా 70 పాయింట్లు వస్తే తీవ్రమైన అసంతృప్తికి లోనై మనశ్శాంతిని పాడుచేసుకోవడం తరచూ జరుగుతుంటుంది. అసలు డిజిటల్ డివైజ్‌లలో కనిపించే ఈ  100 శాతం స్లీప్ స్కోర్  నిజంగా సాధించడం సాధ్యమేనా, అసలు ఈ స్కోర్లు ఎంతవరకు ఖచ్చితమైనవి అనే విషయాలపై నిద్ర శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు అత్యంత ఆసక్తికరమైన నిజాలను వెల్లడించారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏ మనిషికి కూడా నిద్ర పరికరాలలో 100 శాతం స్లీప్ స్కోర్ రావడం అనేది దాదాపు అసాధ్యం. మానవ శరీరం మరియు మెదడు యొక్క నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనది. మన నిద్ర ప్రధానంగా నాలుగు విభిన్న దశలలో సాగుతుంది. అవి లైట్ స్లీప్, డీప్ స్లీప్, రెమ్ (REM  రఫిడ్ ఐ మూవ్‌మెంట్) స్లీప్ మరియు మనం మధ్యమధ్యలో మేల్కొనే స్వల్ప విరామాలు. ఆరోగ్యకరమైన మనిషి రాత్రి వేళ పడుకున్నప్పుడు ఈ విభిన్న దశల గుండా వరుసగా పదేపదే పయనిస్తాడు. సాధారణంగా ప్రశాంతమైన రాత్రి నిద్రలో డీప్ స్లీప్ అనేది మొత్తం నిద్ర సమయంలో దాదాపు 15 నుంచి 25 శాతం వరకు ఉంటుంది. అలాగే డ్రీమ్ స్టేజ్ అని పిలిచే రెమ్ స్లీప్ 20 నుంచి 25 శాతం వరకు, లైట్ స్లీప్ 50 నుంచి 60 శాతం వరకు విస్తరించి ఉంటుంది. మన మెదడు మరియు శరీరం సంపూర్ణంగా రీఛార్జ్ అవ్వడానికి, కణజాలాలు పునరుద్ధరణ చెందడానికి ఈ నాలుగు దశల సమతుల్యత అత్యంత అవసరం. స్మార్ట్ పరికరాలు మన హృదయ స్పందనల రేటు, శరీర కదలికలు మరియు చర్మ ఉష్ణోగ్రతల ఆధారంగా ఒక అంచనాతో స్కోరును లెక్కిస్తాయి తప్ప, అవి మన మెదడు తరంగాలను నేరుగా కొలవలేవు. ఆస్పత్రులలో చేసే సైంటిఫిక్ 'పాలిసోమ్నోగ్రఫీ' (PSG) స్లీప్ స్టడీ పరీక్షల ద్వారా మాత్రమే నిద్ర యొక్క కచ్చితమైన దశలను లెక్కించగలరు. మన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ లేదా వేలికి ఉన్న స్మార్ట్ రింగ్ రాత్రి వేళ మనం చిన్నగా కదిలినా లేదా హృదయ స్పందనల్లో స్వల్ప మార్పులు వచ్చినా దానిని లేచినట్లుగా లేదా అసౌకర్యంగా ఉన్నట్లుగా భావించి స్కోరును తగ్గించేస్తాయి. దీనివల్ల 100 శాతం స్కోర్ సాధించడం సైంటిఫిక్‌గా వీలుపడదు. పైగా స్మార్ట్ పరికరాల్లో 100 కి 100 స్కోర్ రావాలని నిరంతరం తపించడం వల్ల 'ఆర్థోసోమ్నియా' (Orthosomnia) అనే కొత్త తరహా మానసిక ఒత్తిడికి ప్రజలు గురవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్‌ఫెక్ట్ స్లీప్ స్కోర్ రాకపోవడం వల్ల కలిగే ఈ ఆందోళన వల్ల అసలైన నిద్ర మరింత దూరమైపోతుంది. రోజువారీ జీవితంలో 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కేలింగ్ స్కోర్ లభిస్తే అది అత్యుత్తమమైన ఆరోగ్యకరమైన నిద్రగానే పరిగణించాలి. కాబట్టి డిజిటల్ స్క్రీన్లపై కనిపించే సంఖ్యలు మరియు గ్రాఫ్‌లను చూసి భయపడటం మానేసి, మన శరీరం ఇచ్చే సహజమైన సంకేతాలను గమనించడం అలవాటు చేసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత మీరు రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా, అలసట లేకుండా పనిచేయగలుగుతున్నారా లేదా అనేదే మీ నిద్ర నాణ్యతకు నిజమైన కొలమానం. ప్రశాంతమైన నిద్ర కోసం రాత్రి పడుకోవడానికి 1,2 గంటల ముందే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్లను పక్కన పెట్టడం, చీకటిగా ప్రశాంతంగా ఉండే గదిని ఎంచుకోవడం, రోజూ ఒకే సమయానికి పడుకుని ఒకే సమయానికి లేచే నిద్ర వేళలను పాటించడం అత్యంత ముఖ్యం. డిజిటల్ స్కోర్ల వెనుక పరుగులు తీయడం కంటే సహజమైన జీవనశైలి మార్పులతో ప్రశాంతమైన నిద్రను సొంతం చేసుకోవడమే ఉత్తమమైన మార్గం.     [ Sleep Score, Sleep Trackers, Smart Watch, Smart Ring, Sleep Stages, REM Sleep, Deep Sleep, Polysomnography, Orthosomnia, Sleep Quality ]    
నేటి వేగవంతమైన ప్రపంచంలో చాలామంది బరువు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌లకు వెళ్లడం, కఠినమైన డైటింగ్ పాటించడం, రకరకాల వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గితే అది సంతోషించదగ్గ విషయమే. అయితే మీరు ఎలాంటి డైటింగ్ చేయకుండా, వ్యాయామం చేయకుండా, ఆహార అలవాట్లలో ఎటువంటి మార్పులు చేసుకోకుండానే ఉన్నట్టుండి వేగంగా బరువు తగ్గిపోతున్నారా? అయితే ఈ హెచ్చరిక మీ కోసమే! శారీరక శ్రమ లేకుండానే బరువు తగ్గడాన్ని వైద్య పరిభాషలో  అన్ ఎక్స్‌ప్లైన్డ్ వెయిట్ లాస్  అంటారు. ఇది కేవలం ఏదో సాధారణ అలసట అని భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఇటీవల జరిగిన అనేక వైద్య పరిశోధనలు మరియు అధ్యయనాలు ఈ విధంగా కారణం లేకుండా బరువు తగ్గడం అనేది క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలలో ప్రధానమైనదని స్పష్టం చేస్తున్నాయి. వైద్య నిపుణులు మరియు పరిశోధకుల ప్రకారం, ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో మీ మొత్తం శరీర బరువులో 5 శాతం లేదా అంతకంటే ఎక్కువ బరువు తగ్గితే దానిని తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిగణించాలి. ఉదాహరణకు 70 కిలోల బరువున్న వ్యక్తి ఎలాంటి ప్రయత్నం లేకుండానే 6 నెలల్లో దాదాపు 3.5 నుంచి 4 కిలోల బరువు తగ్గితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. మన శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడం ప్రారంభించినప్పుడు, అవి శరీరంలోని శక్తిని మరియు పోషకాలను వేగంగా గ్రహించడం మొదలుపెడతాయి. క్యాన్సర్ కణాలు ప్రతిరూపాలను తయారు చేసుకునే క్రమంలో కండరాల ప్రోటీన్లను, కొవ్వును వేగంగా కరిగిస్తాయి. దీనివల్ల శరీరం తన కండరాల బలాన్ని కోల్పోయి వేగంగా సన్నబడుతుంది. ముఖ్యంగా పాంక్రియాటిక్ (క్లోమ గ్రంథి) క్యాన్సర్, స్టమక్ (పొట్ట) క్యాన్సర్, ఈసోఫేగియల్ (అన్నవాహిక) క్యాన్సర్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్‌లలో ఈ అకస్మాత్తుగా బరువు తగ్గడం అనేది అత్యంత స్పష్టమైన తొలి లక్షణంగా కనిపిస్తుంది. అధ్యయనాల ప్రకారం, పాంక్రియాటిక్ మరియు పొట్ట క్యాన్సర్ బారిన పడిన బాధితులలో ఏకంగా 80 శాతం కంటే ఎక్కువ మంది వ్యాధి ప్రారంభ దశలోనే తీవ్రమైన బరువు తగ్గుదలకు గురవుతున్నారని ఆధారాలు చెబుతున్నాయి. అంతేకాకుండా బ్లడ్ క్యాన్సర్లు అయిన లింఫోమా మరియు ల్యుకేమియాతో బాధపడేవారిలో కూడా ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా బరువు తగ్గడం, రాత్రి వేళల్లో తీవ్రంగా చెమటలు పట్టడం మరియు నిరంతరం జ్వరం రావడం వంటి లక్షణాలు విస్తృతంగా కనిపిస్తాయి. అనేక రకాల క్యాన్సర్లలో కణితి కణాలు కొన్ని రకాల ప్రొటీన్లు, సైటోకిన్లు మరియు హార్మోన్లను రక్తం లోకి విడుదల చేస్తాయి. ఇవి మెదడులోని ఆకలిని నియంత్రించే కేంద్రాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీనివల్ల ఎంత మంచి ఆహారం కళ్లముందు ఉన్నా తినాలనే ఆసక్తి లేకపోవడం, కొద్దిగా తినగానే పొట్ట నిండిపోయినట్లు అనిపించడం, రుచి మరియు వాసన తెలియకపోవడం వంటి మార్పులు వస్తాయి. ఈ పరిస్థితిని క్యాన్సర్ కాచెక్సియా  అంటారు. దీనివల్ల రోగి వేగంగా బరువు కోల్పోవడమే కాకుండా తీవ్రమైన నీరసానికి లోనవుతాడు. అందువల్ల ఎవరైనా తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గుతుంటే, దానికి తోడు నిరంతర అలసట, పొట్టలో నొప్పి, జీర్ణ సమస్యలు ఉంటే వెంటనే రక్త పరీక్షలు, స్కానింగ్ ద్వారా అసలు కారణాన్ని తెలుసుకోవాలి. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేసే అవకాశాలు 90 శాతానికి పైగా ఉంటాయి కాబట్టి, శరీరంలో వచ్చే ఈ చిన్న మార్పును ఎప్పటికీ తేలికగా తీసుకోకండి.     [ Unexplained Weight Loss, Cancer Symptoms, Cancer Warning Signs, Pancreatic Cancer, Stomach Cancer, Esophageal Cancer, Lung Cancer, Lymphoma, Leukemia, Cancer Cachexia ]    
వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అంటారు. కానీ వయస్సు 40 ఏళ్లకు చేరుకునేసరికి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మునుపటి కంటే త్వరగా అలసిపోవడం, ఉత్సాహం తగ్గడం, చర్మంపై ముడతలు రావడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. అయితే సరైన జీవనశైలి మరియు ఆరోగ్యకరమైన దినచర్యను పాటించడం ద్వారా 40 ఏళ్ల వయస్సులో కూడా 20 ఏళ్ల యువకుడిలా అత్యంత ఎనర్జిటిక్‌గా మరియు కాంతివంతంగా కనిపించడం ఖచ్చితంగా సాధ్యమే. దానికి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఐదు ముఖ్యమైన మరియు అత్యంత సులువైన అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కండరాల బలాన్ని పెంచడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు మరియు శరీరం ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. రెండవది, సరైన నిద్ర. రాత్రి వేళ కనీసం 7 నుంచి 8 గంటల గాఢ నిద్రపోవడం శరీరానికి ఎంతో అవసరం. మనం నిద్రపోతున్న సమయంలోనే మన శరీర కణాలు తమను తాము పునరుద్ధరించుకుంటాయి. సరిపడా నిద్ర లేకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు మరియు తీవ్రమైన అలసట ఆవరిస్తాయి. మూడవది, శరీరానికి తగినంత నీటిని అందించడం. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. నీరు పుష్కలంగా తాగడం వల్ల చర్మం తేమగా ఉండి సహజమైన కాంతితో మెరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నాల్గవది, సమతుల్య ఆహారం తీసుకోవడం. మన ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, గింజలు, ప్రొటీన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర మరియు నూనె పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ బారిన పడకుండా కాపాడి యవ్వనంగా ఉంచుతాయి. ఐదవది, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం. నేటి ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది వృద్ధాప్యానికి ప్రధాన శత్రువుగా మారింది. ప్రతిరోజూ ధ్యానం, ప్రాణాయామం చేయడం లేదా మీకు నచ్చిన హాబీలకు కొంత సమయం కేటాయించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉండి ముఖంలో సహజమైన వర్చస్సు కనిపిస్తుంది. ఈ ఐదు రోజూవారి సరళమైన అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా 40 ఏళ్ల తర్వాత కూడా మీరు నిత్య యవ్వనంతో, అధిక శక్తితో మీ జీవితాన్ని నూతన ఉత్సాహంతో ఆస్వాదించవచ్చు.     [ Health After 40, Healthy Lifestyle, Exercise, Quality Sleep, Hydration, Balanced Diet, Antioxidants, Stress Management, Meditation, Healthy Aging ]    
ఆధునిక కాలంలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే మనస్సులో ఆందోళన, భయం, ఒక రకమైన అశాంతి కలగడం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.  బయటకు  పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ, లోపల ఏదో తెలియని బెంగ మనశ్శాంతిని దూరం చేస్తుంది. దీనికి ఏదో పెద్ద సమస్యే కారణం కావాల్సిన అవసరం లేదు. మనకు తెలియకుండానే మనం పాటించే కొన్ని చిన్న చిన్న జీవనశైలి అలవాట్లే మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆందోళనను పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో వివరంగా తెలుసుకుంటే.. శారీరక శ్రమ లేకపోవడం.. శారీరక శ్రమ లేకపోవడం  మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రోజంతా ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించడమే కాకుండా, మనస్సుకు ఉపశమనం కలిగించే హార్మోన్ల విడుదల తగ్గుతుంది. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం లేదా నడక చేయడం వల్ల మెదడులో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరుస్తాయి. శారీరక చురుకుదనం తగ్గినప్పుడు మనస్సులో నెగిటివ్ ఆలోచనలు పెరిగి ఆందోళనకు దారితీస్తాయి. సోషల్ మీడియా.. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించడం మానసిక అశాంతికి మరో ముఖ్యమైన కారణం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నిరంతరం ఫోన్ స్క్రీన్‌ను చూడటం, ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వంటివి తెలియకుండానే ఒత్తిడిని పెంచుతాయి. డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి నిద్ర లేమికి కారణమవుతుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మెదడు అలసిపోయి, చిరాకు , భయాలు పెరిగే అవకాశం ఉంది. చెడు అలవాట్లు.. మద్యపానం లేదా ఇతర వ్యసనాలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినట్లు అనిపించినప్పటికీ, ఎక్కువ  కాలంలో అవి మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. ఇవి నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి, ఆందోళన తీవ్రతను మరింత పెంచుతాయి. శరీరం ఈ పదార్థాలపై ఆధారపడటం మొదలైనప్పుడు  అశాంతి మరింత తీవ్రమవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు.. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి నచ్చిన పనులపై దృష్టి పెట్టడం, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు , మంచి నిద్రను అలవర్చుకోవడం ఎంతో అవసరం. జీవనశైలిలో చేసుకునే ఈ చిన్న మార్పులు మానసిక ఒత్తిడిని తగ్గించి జీవితంలో ప్రశాంతతను నింపుతాయి.                                                                                                                                                  *రూపశ్రీ.
మధుమేహం ఉన్నవారు రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహారం, జీవనశైలి, ఒత్తిడి నియంత్రణతో పాటు వివిధ సంప్రదాయ పద్ధతుల గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలను Dr. Ch. Madhusudhana Sharma ఈ వీడియోలో వివరిస్తున్నారు. మధుమేహం విషయంలో శరీరంలోని జీవక్రియలు, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటి అంశాల పాత్ర ఏమిటి? సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే కొన్ని సహజ పదార్థాలను ఎలా పరిగణిస్తారు? అనే విషయాలను డాక్టర్ వివరిస్తున్నారు. ఈ వీడియోలో ప్రత్యేకంగా 5 రకాల పొడులు/చూర్ణాల గురించి ప్రస్తావించారు: త్రిఫల చూర్ణం, పసుపు, మెంతులు, పొడపత్రి (మధునాశిని), కాకరకాయ పొడి.  ఈ పదార్థాలను సంప్రదాయ వైద్య విధానంలో ఎలా ఉపయోగిస్తారు? వాటి ప్రత్యేకత ఏమిటి? మధుమేహం ఉన్నవారు వీటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? వంటి అంశాలను వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే, మధుమేహాన్ని కేవలం మందులతో మాత్రమే కాకుండా ఆహారం, జీవనశైలి, శారీరక చురుకుదనం, మానసిక ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలతో కలిపి ఎలా నిర్వహించుకోవాలనే విషయాలపై కూడా వీడియోలో అవగాహన కల్పిస్తున్నారు. డయాబెటిస్ మందులు ఇప్పటికే వాడుతున్నవారు తమంతట తాముగా మందుల మోతాదును తగ్గించడం లేదా ఆపడం చేయకూడదు. ఈ వీడియోలో చెప్పే పొడులు లేదా ఇతర సహజ పదార్థాలను ఉపయోగించే ముందు మీ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. త్రిఫల, పసుపు, మెంతులు, మధునాశిని, కాకరకాయ పొడుల గురించి డాక్టర్ ఏం చెబుతున్నారు? మధుమేహం నియంత్రణలో ఆహారం, జీవనశైలి, ఒత్తిడి నిర్వహణ ఎందుకు ముఖ్యమైనవి? తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్ మందులను వైద్యుల సలహా లేకుండా ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)