Home

»

Latest News

The Paradise: నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్  జోరు: అసలు ఇది రికార్డు కానే కాదు

Sep 10, 2026 3:40PM

 

 

నాచురల్ స్టార్ నాని రేంజ్ ని మరింతగా ఎలివేట్ చేయబోతున్న మూవీగా అభిమానుల్లో , ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకుంది ది ప్యారడైజ్'.  ఏ మాటకా మాట ప్రచార చిత్రాలైతే అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. పైగా నానితో దసరా నిర్మించిన నాని ఓదెల దర్శకుడు. మరి అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.

 సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా  విడుదల కానున్న ఈ చిత్రానికి, ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబరు 23న నార్త్ అమెరికాలో గ్రాండ్ ప్రీమియర్లు ప్రదర్శించబోతున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ చేసారు. ఇప్పుడు  అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే  ప్యారడైజ్' సృష్టించిన సంచలనం చూసి సినీ ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. కేవలం బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే 5000 టికెట్స్ సోల్డ్ అయ్యి  $100K (లక్ష డాలర్లు) ప్రీ-సేల్స్ పూర్తి చేసుకుని నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రంగా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ అరుదైన మైలురాయిని కేవలం సీనిమార్క్ (Cinemark) థియేటర్ నెట్‌వర్క్ నుంచే సాధించడం నాని ఓవర్సీస్ మార్కెట్ స్టామినాని  మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

 


Also Read: Sardar 2: హైలెట్స్ ఇవే.. ఇక లైఫ్ లో వాటి జోలికి వెళ్ళమంటున్న ప్రేక్షకులు!

ఇప్పుడు ఆ ఊపు మరింత పెరిగి, నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ మార్కెట్‌లో 'ది ప్యారడైజ్' మూవీ $150K డాలర్ల ఘనమైన మార్క్‌ను మరిన్ని గంటల్లో దాటబోతుంది.ఈ గణాంకాలు చూస్తుంటే ప్రీమియర్ షోల సమయానికి ఈ కలెక్షన్లు ఊహించని స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ పాన్-ఇండియా హీరోల సినిమాలకు లభించే రేంజ్ రెస్పాన్స్, నాని నటించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కి  దక్కడం విశేషం.

 

 

[Nani, The Paradise, Srikanth Odela, Keerthi Suresh, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News[

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com