ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..? తెలంగాణ రాజకీయ రంగంలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులు అందరూ పాల్గొని, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. గత మూడు రోజులుగా శాసనసభ ప్రాంగణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న హైడ్రామా, నాటకీయ పరిణామాలు మరియు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైఖరిపై ప్రభుత్వం ప్రజల నాడిని పట్టేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫ్లాష్ సర్వే ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నేతల ముందుంచడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, పాలనా విధానాలకు ప్రజల నుంచి పూర్తి స్థాయి సానుకూలత లభిస్తోందని, కాంగ్రెస్ పరిపాలనపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదని సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలు, ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, స్పీకర్ పదవిని కించపరిచేలా జరిగిన వ్యాఖ్యలు  ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద చోటుచేసుకున్న శుద్ధీకరణ వివాదాస్పద ఘటనలను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల, రాజ్యాంగబద్ధ పదవుల పట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో, అలాగే ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎర్రవల్లి ఘటనపై మంత్రులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని, చట్టపరమైన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇంచార్జ్‌లు అందరూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించి బలంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియా  డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ఈ ఫ్లాష్ సర్వే రిపోర్ట్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుండగా, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.       [ CM Revanth Reddy, flash survey, BRS party, CLP meeting, Telangana news, Congress government,Telangana goverment, KCR, KTR, BRS Party, Telugu One, Telugu News ]  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధిక కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం నాలుగవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే వ్యక్తిగత స్థాయిలో, సరిగ్గా మూడేళ్ల కిందట   అప్పటి జగన్ ప్రభుత్వం ఆయనను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసింది. ఏడు పదుల వయస్సులో ఈ అరెస్టు సమయంలో చంద్రబాబు క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేలా చేసిందని చెప్పాలి. ఏకంగా 53 రోజుల పాటు ఆయనను రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో నిర్బంధించింది. ఐసోలేటెడ్ సెల్ లో, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వేధించింది అప్పటి జగన్ సర్కార్. నాటి రోజులను తాజాగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సామాజిక మాధ్యమ వేదికపై తనను అక్రమంగా అరెస్టు చేసిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ షేర్ చేసిన పోస్టులో తనను అరెస్టు చేసిన తీరు దారుణమనీ పేర్కొన్న చంద్రబాబు.. అయితే ఈ ఘటన తనను ఏ మిత్రం కుంగదీయలేదన్నారు. తనను అరెస్టు చేయించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనకు ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదన్న ఆయన అయితే తన విధానం అది కాదన్నారు.  తనను చాలా మంది మెతక అనీ, కఠిన నిర్ణయాలు తీసుకోలేని మృదు స్వభావిననీ చెబుతుంటారు.   కానీ వాస్తవానికి తాను చేసే  ప్రతి పనీ తెలుగు ప్రజల శ్రేయస్సు,  సమాజ హితం కోసమే ఉండాలి అని భావిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలు అంటే  సవాళ్లు విసురుకోవడం, తొడలు కొట్టుకోవడం కాదన్నారు. అలాగే   ఎన్నికల ఫలితాల ఆధారంగా ఒకరినొకరు అరెస్టు చేయించుకోవడం కూడా కాదన్నారు.  తాను ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజిక హితం గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు.  [Chandrababu Naidu, AP Politics, YS Jagan Mohan Reddy, Revenge Politics, Telugu Desam Party, Andhra Pradesh News, Telugu One]
తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గత జగన్ సర్కార్ స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసి గురువారం (సెప్టెంబర్ 10)కి సరిగ్గా మూడేళ్ల అుతున్న సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా  నిజం గెలిచింది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో  జరిగిన  లీడర్‌షిప్ కాంక్లేవ్ సదస్సు వేదికగా ఆయనీ పిలుపు ఇచ్చారు.  సుదీర్ఘ పోరాటాలు, క్లిష్ట పరిస్థితుల్లో శ్రేణులు చేసిన త్యాగాల ఫలితంగానే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కార్యకర్తల శ్రమను ఎప్పటికీ మరువలేమని లోకేష్ పునరుద్ఘాటించారు.  జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో యాభై మూడు రోజుల పాటు అన్యాయంగా నిర్బంధించిన విషయాన్నిగుర్తు చేసిన లోకేష్.. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే  నాడు ఆ అరెస్ట్ జరిగిందన్నారు.  చివరికి న్యాయస్థానాలు,  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి తప్పు జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో నిజమే గెలిచిందని స్పష్టం చేశారు. ఈ చారిత్రక సత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు. ఈ సదస్సు వేదికగా పార్టీ నాయకులకు లోకేశ్  పార్టీ, పర్సనల్, ప్రభుత్వం  అనే  3-పీ  మార్గదర్శకాలను నిర్దేశించారు. నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించడంతో పాటు..  పార్టీ సంస్థాగత పటిష్టత కోసం కార్యకర్తలంతా క్రియాశీలకంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఉన్నత స్థానాలకు ఎదిగే కొద్దీ మరింత వినయంగా ఉంటూ, ప్రతి ఒక్కరితోనూ మానవతా దృక్పథంతో మమేకం కావాలన్నారు.  జగన్ హయాంలో నిరుద్యోగ యువత ఎదుర్కొన్న ఇబ్బందులను ఎత్తి చూపిన లోకేష్. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య   వ్యత్యాసం కూడా తెలియని గత పాలకుల విధానాల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా, క్షేత్రస్థాయిలో   తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, అహంకారాలకు  ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదన్న నారా లోకేష్.. ప్రస్తుతం పార్టీని  టీడీపీ 3.0 వెర్షన్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.  అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం పార్టీ బాధ్యత అని, కష్టకాలంలో నిలబడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు.  [TDP P3 Vertion, Nara Lokesh, Chandrababu Naidu arrest anniversary, Nijam Gelichindi program, Telugu Desam Party, AP Leadership Conclave, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఇప్పుడు ప్ర‌పంచానికి పెద్ద స‌వాలుగా మారింది. అన్ని రంగాలతో పాటు చిత్రసీమను కూడా ఎఐ చుట్టుముడుతోంది. ఇటీవల కాలంలో సాధారణ నెటిజన్లు సైతం సాంకేతికతను ఉపయోగిస్తూ ఊహకందని రీతిలో విజువల్స్ క్రియేట్ చేస్తున్నారు. సరదాగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం మేకర్స్‌కు సరికొత్త సవాల్‌గా మారుతోంది. సోషల్ మీడియాలో ఈ మధ్య ఏఐ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబుతో ఎస్‌ఎస్ఎంబి29 తరహా పౌరాణిక లుక్స్ నుంచి, పాతతరం నటులను సరికొత్త కోణంలో చూపించడం వరకు క్రియేటర్లు తమ నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. బ్రహ్మానందం పాత పాత్రల కలయికతో కొత్త ప్రేమకథలు, 80ల నాటి హీరోల కాలేజ్ లుక్స్ క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. సాధారణ పరిజ్ఞానంతో నెటిజన్లే ఈ స్థాయి విజువల్స్ రూపొందిస్తుంటే, వందల కోట్లు ఖర్చు చేసే నిర్మాతల నుంచి ప్రేక్షకులు మరింత క్వాలిటీ ఆశిస్తున్నారు. టీజర్లు, ట్రైలర్లలో ఏమాత్రం గ్రాఫిక్స్ తక్కువగా ఉన్నా ప్రేక్షకులు వెంటనే నెగెటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల చిరంజీవి 'విశ్వంభర' సినిమా విఎఫ్ఎక్స్ వ్యవహారంలో జరిగిన చర్చలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు తమ రూపాలు, గొంతులను అనుమతి లేకుండా ఏఐ ద్వారా దుర్వినియోగం చేయకుండా చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులు ఇప్పటికే న్యాయపరమైన రక్షణ పొందారు. అయితే సాంకేతికత విస్తృతి దృష్ట్యా ప్రతి ఒక్కరినీ చట్టపరంగా నిరోధించడం కష్టతరంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలోని ఏదైనా సన్నివేశం సరిగ్గా రాకపోతే, నెటిజన్లు ఏఐ సాయంతో అంతకంటే మెరుగైన అవుట్‌పుట్ డిజైన్ చేసి వైరల్ చేసే పరిస్థితి దాపురిస్తోంది. ఇది దర్శకులు మరియు విఎఫ్ఎక్స్ టీమ్‌లకు మానసికంగా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చలపై టాలీవుడ్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికతను ఆహ్వానించాల్సిందేనని కొందరు అంటుంటే, క్రియేటివిటీకి భంగం వాటిల్లకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ సృష్టిస్తున్న ఈ సవాళ్లను అధిగమించాలంటే చిత్ర పరిశ్రమ కేవలం సాధారణ గ్రాఫిక్స్‌పై ఆధారపడకుండా, ఎవరు అందుకోలేని మేటి నాణ్యతతో విజువల్స్ తెరకెక్కించడమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ సినిమా రంగాన్ని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.
  కింగ్ నాగార్జున నుంచి వచ్చిన భక్తి రస చిత్రాలు 'షిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ అభిమానులని, భక్తులని అలరించిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలని నిర్మించింది మహేష్ రెడ్డి. బ్యానర్ పేరు AMR . మహేష్ రెడ్డి ప్రముఖ పారిశ్రామిక వేత్త కూడా. AMR పేరుతో పాటు ఇతర పేర్లతో పలు రాష్ట్రాలలో పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కమలాపురి కాలనీలో ఉన్న ఏఎంఆర్ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ లోని  నివాసం, సంస్థల డైరెక్టర్ల ఇళ్లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో కోల్‌కతా, ఢిల్లీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రత్యేకాధికారులతో కలిసి పాల్గొని, కీలక పత్రాలు, డిజిటల్ లాగ్‌బుక్స్ మరియు బ్యాంక్ లావాదేవీల రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.  ఈ సోదాల వెనుక  60 కోట్లకు పైగా విలువైన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో శ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ (SREI Infrastructure Finance Ltd) మరియు శ్రీ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ (SREI Equipment Finance Ltd) నుంచి పొందిన రుణాల కేటాయింపు, వాటి నిధుల మళ్లింపు (Diversion of Funds), రౌండ్ ట్రిప్పింగ్ మరియు నిధుల ఎవర్ గ్రీనింగ్ వంటి ఆరోపణలపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈ విచారణ ముమ్మరంగా సాగుతోంది.    Also Read: కాకా నుంచి చిరు లీక్స్: ఆ పని చేసింది థమన్ అని నమ్మచ్చా! కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోని దాదాపు 12 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించడం వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.  ఏఎంఆర్ మైనింగ్ సంస్థ మరియు దాని ప్రమోటర్ మహేష్ రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా పెరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2022లో కూడా జమ్మూ కాశ్మీర్ కేసుకి  సంబంధించి 60 కోట్ల అనుమానాస్పద డిపాజిట్ల అంశంలో ఈడీ ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేసింది. అలాగే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ ప్రాంతంలో 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సంఘటనతో కూడా ఈ గ్రూప్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆదాయపన్ను శాఖ (I-T) మరియు ఎన్నికల సంఘం అధికారులు కూడా విచారణ జరిపారు. ఆ సమయంలో ఏఎంఆర్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లోనూ, కాన్ఫిడెన్షియల్ అకౌంట్స్ బుక్స్, ఫైళ్లపై తనిఖీలు జరిగాయి.  Also Read: కాకా నుంచి చిరు లీక్స్... ఆ పని చేసింది థమన్ అని నమ్మచ్చా!    మైనింగ్ డెవలప్‌మెంట్, కాంట్రాక్ట్ మైనింగ్, సాగునీటి ప్రాజెక్టులు (Irrigation Projects), రహదారుల నిర్మాణం మరియు పారిశ్రామిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో బిలియన్ల కొద్దీ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ పట్ల ఈడీ ఆరోపణలు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మహేష్ రెడ్డి ఏఏస్కాట్ బిల్డర్స్, ఏఎంఆర్ ఎనర్జీ, ఏఎంఆర్ వేర్‌హౌసింగ్, వాలిడో ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి అనేక అనుబంధ సంస్థలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికలకు ముందు మరియు ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ మళ్లింపుల్లో వందల కోట్ల రూపాయలు అక్రమంగా చేతులు మారాయనే కోణంలో ఈడీ అధికారులు డిజిటల్ డేటా ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక నేరాల నియంత్రణలో భాగంగా ఈడీ చేపట్టిన ఈ విస్తృత తనిఖీలు మున్ముందు ఏ మలుపు తిరుగుతాయోనని పరిశ్రమల ప్రతినిధులు ఉత్కంఠగా గమనిస్తున్నారు.      [A Mahesh Reddy, Nagarjuna, Shridi Sai, Ed Rides, Om NamoVenkatesaya, Telugu Cinema  News, TeluguNews, Tollywood, Tollywood News, TeluguCinema]      
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక అనూహ్యమైన న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. సరిగమ మ్యూజిక్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో న్యాయస్థానం విధించిన స్టే ఉత్తర్వులను ఇళయరాజా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నా రంటూ ప్రముఖ ఆడియో సంస్థ 'సరిగమ' కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. తమ ఆధీనంలో ఉన్న పాటల కాపీరైట్ హక్కులను అతిక్రమించి, ఆయన వాటిని వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఇళయరాజాపై కఠినమైన కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సరిగమ ప్రతినిధులు కోర్టును అభ్యర్థించారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసి, వాటి విక్రయం ద్వారా లభించే సొమ్ముతో తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్‌లో స్పష్టం చేశారు. దశాబ్దాల సినీ ప్రయాణంలో వేలాది క్లాసిక్ గీతాలకు ప్రాణం పోసిన మేస్ట్రో ఇళయరాజా, గత కొంతకాలంగా తన పాటల కాపీరైట్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనేక వేదికలపై, కాన్సెర్ట్లలో తన అనుమతి లేకుండా పాటలు పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై సామాజిక మాధ్యమాల్లోనూ, సినీ ప్రేక్షకుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సరిగమ సంస్థ వ్యాపార నియమాలను ప్రస్తావిస్తుంటే, మరోవైపు అభిమానులు మాత్రం ఒక దిగ్గజ సంగీతకారుడిపై ఇలాంటి పిటిషన్లు దాఖలు కావడం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఇళయరాజా ఏ విధంగా స్పందిస్తారో, ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారో చూడాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చే తదుపరి ఉత్తర్వులు సినీ సంగీత పరిశ్రమలో కాపీరైట్ హక్కుల వివాదానికి ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.     [Ilaiyaraaja Delhi High Court, Ilaiyaraaja Contempt Petition, Saregama Copyright Dispute, Ilaiyaraaja Legal Notice, Telugu Cinema Music News]
నటీనటులు: సుమంత్, సిద్దు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, మాళవిక నాయర్ సాంకేతిక నిపుణులు: రచన: నాగ మురళీధర్ నామల, సంతోష్ జాగర్లపూడి సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: కృష్ణా ప్రతాప్ ఆర్ ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి నిర్మాతలు: మధు కాలిపు, లక్ష్మణ్   సుమంత్ ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, ఎక్కువగా ఓటీటీ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. 'మహేంద్రగిరి వారాహి' సినిమాతో పాటు, అందులోని కథ పట్ల ఆయన చాలా నమ్మకంతో కనిపించారు. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ అతిథి పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కథ: 1826లో మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు మహేంద్రగిరి సంస్థానీకులను వారాహి అమ్మవారు (Aishwarya Rajesh) శపిస్తుంది. ఆ శాపం వల్ల ఆ వంశంలోని మగవాళ్లు తమ 33వ  పుట్టినరోజు నాడే మిస్టరీగా చనిపోతుంటారు. 1993లో దేవుడిని నమ్మని నాస్తికుడు రాజేంద్ర వర్మ (Siddhu Jonnalagadda) తన గర్భవతి అయిన భార్య (Malavika Nair)తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదంలో హత్యకు గురవుతాడు. అతని తల్లి (మంజు భార్గవి) తన కూతురి కొడుకు నరేంద్ర వర్మ (Vamsee Chaganti)ను దత్తత తీసుకుంటుంది. ఇప్పుడు 2026లో ఆ నరేంద్ర వర్మ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. మరోవైపు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సిద్ధార్థ్ (Sumanth) ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటాడు. అతనికి సత్యం (Vennela Kishore) సహాయం చేస్తుండగా, వాళ్ళ అన్నయ్య రాజీవ్ (Kamal Kamaraju) ఆర్థికంగా అండగా ఉంటాడు. మహేంద్రగిరి వారాహి గుడికి వెళ్తే రాజీవ్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరుగుతుందని సిద్ధార్థ్ తల్లిదండ్రులు నమ్ముతారు. అలా గుడికి వెళ్లిన తర్వాత నరేంద్ర, రాజీవ్ ఇద్దరూ ఒకే తరహాలో చనిపోవడం వాళ్లందరినీ షాక్‌కు గురిచేస్తుంది. అసలు వాళ్లు ఎందుకు చనిపోయారు? ఆ శాపం పోతుందా? నిజంగానే అది శాపమా లేక శాపం పేరుతో ఎవరైనా చేస్తున్న కుట్రా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   విశ్లేషణ: సుమంత్ కొన్ని సన్నివేశాల్లో బాగా నటించినా, షూటింగ్ చాలా గ్యాప్స్ తీసుకుంటూ జరగడం వల్ల అతని నటనలో ఒక ఫ్లో మిస్ అయినట్లు అనిపిస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక సెకండ్ హాఫ్‌లో వచ్చే ముఖ్యమైన సన్నివేశాల్లో ఆయన నటన బాగుంది. తనకు ఇచ్చిన చిన్న పాత్రలో సిద్దు జొన్నలగడ్డ ఆకట్టుకున్నాడు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ల పాత్రలు షాకింగ్‌గా అనిపించినా, వాటికి తగ్గట్లుగా వాళ్ళ పెర్ఫార్మన్స్ పేలలేదు. రాజీవ్ కనకాల బాగానే చేసినా అంతగా ఇంపాక్ట్ చూపలేదు. మిగతా వాళ్లంతా అంతగా గుర్తుండరు. ఈ సినిమా రైటింగ్ చాలా నాసిరకంగా ఉంది. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కు వెళ్లేటప్పుడు సరైన బ్రిడ్జ్ సీన్స్ కానీ, ఆసక్తికరమైన కథనం కానీ లేవు. కథలో ఒక స్ట్రక్చర్ ఉన్నా, ఇలాంటి సినిమాల్లో ఉండే కామన్ ప్లాట్ పాయింట్స్ ఉన్నా, వాటిని కొత్తగా రాసుకుని ప్రెజెంట్ చేయడంలో మేకర్స్ ఎలాంటి కనీస ప్రయత్నం చేయలేదు. నటీనటుల పెర్ఫార్మన్స్‌లు కూడా అంతగా కన్విన్సింగ్‌గా లేవు. శాపం, మరణాల నేపథ్యం చూస్తే ఈ సినిమా కథ 'మురారి' సినిమాను గుర్తుచేస్తుంది. అయితే మురారిలో ఉన్నట్టు వంశీ లేదా కమల్ పాత్రలతో ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలో పూర్తిగా విఫలమైంది. వాళ్ళ మరణాల తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్ కూడా, ప్రేక్షకులకు ఏమీ అర్థం కాదులే అన్న నిర్లక్ష్యంతో రాసినట్లు అనిపిస్తుంది. క్లూస్ సరిగ్గా రివీల్ చేయకుండా, అక్కడక్కడా విసిరేసినట్లుగా ఉండటంతో, ఫైనల్ ట్విస్ట్‌లు వచ్చేసరికి ప్రేక్షకులు బాగా అలసిపోతారు. ఈ ఫైనల్ ట్విస్ట్‌లు చూస్తుంటే ఆదిత్య కరికాలన్ మరణం స్ఫూర్తితో పాటు కొన్ని పాత తరహా కథలను కలిపి రాసుకున్నట్లు అనిపిస్తుంది. బ్రిటీష్ వాళ్ళ ప్రభావం అంత బలంగా ఉన్న ఆ కాలంలో కూడా, ఈ హత్యలను ఒక మిస్టరీలా కొనసాగించాలంటే కథలో ఇంకా చాలా డెప్త్, రైటింగ్‌లో మంచి ఇమాజినేషన్ ఉండాలి. సినిమాటోగ్రఫీ చాలా పూర్ గా ఉంది, మేకర్స్ కనీసం డిఐ (DI) గురించి కూడా పట్టించుకోలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం ఏమాత్రం గుర్తుండదు, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథ స్థాయికి తగ్గట్టుగా లేవు. మలయాళ ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి కథలను తక్కువ బడ్జెట్‌తోనే ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ కథను, నెరేషన్‌ను సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోవడం మేకర్స్ నైపుణ్య లేమిని స్పష్టంగా చూపిస్తుంది. ఈ కథను పర్ఫెక్ట్‌గా స్క్రీన్ మీదకు తీసుకురావాలంటే మంచి టెక్నీషియన్లు, బలమైన రైటింగ్ టీమ్ అవసరం. మొత్తానికి, ఈ సినిమా బాగా నిరాశపరుస్తుంది. ఒక సాలిడ్ ఫిల్మ్ లాగా కాకుండా, దేవుడి నేపథ్యంతో వచ్చే ఇతర ఇన్వెస్టిగేటివ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్స్ కి చీప్ కాపీలా అనిపిస్తుంది.   ప్లస్ పాయింట్స్: సుమంత్ నటన కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్‌లు మైనస్ పాయింట్స్: ప్రొడక్షన్ వాల్యూస్ సాంకేతిక లోపాలు సంగీతం పేలవమైన రైటింగ్ పూర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోని ఎగ్జిక్యూషన్   రేటింగ్: 2/5   చివరి గా: సులభంగా మర్చిపోయే సినిమా.   గమనిక: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనవి. దీనికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకోగలరు.
Cast: Sumanth, Siddhu Jonnalagadda, Meenakshi Goswami, Aishwarya Rajesh, Brahmanandam, Vennela Kishore, Rajeev Kanakala, Malavika Nair Crew:  Written by Naga Muralidhar Namala, Santossh Jagarlapudi Music by Anup Rubens Cinematography by Krishnaa Prathap R Editing by Junaid Siddiqui Directed by Santossh Jagarlapudi Produced by Madhu Kalipu, Laxman Sumanth has been working on different scripts and he resorted OTT movies more often these days. He looked really pumped up with Mahendragiri Varahi film and the kind of story it brought to screen. Siddhu Jonnalagadda, Aishwarya Rajesh, Malavika Nair did cameos in the film and it released on 11th September. Let's discuss about the film in detail.  Plot:  Mahendragiri kin of Mahendragiri kingdom are cursed by Goddess Varahi (Aishwarya Rajesh) for mistreating women 200 years ago in 1826. Men from the kin die at the age of 33, on their birthday, mysteriously. In 1993, Rajendra Varma (Siddhu Jonnalagadda), an Atheist, gets killed while travelling on road with his pregnant wife (Malavika Nair). His mother (Manju Bhargavi) adopts her daughter's son, Narendra Varma (Vamsee Chaganti) and he is in danger in 2026.  Siddharth (Sumanth) runs a YouTube channel against the superstitions and Satyam (Vennela Kishore) helps him while their elder brother Rajeev (Kamal Kamaraju) gives them the money. Siddharth's parents believe going to Mahendragiri Varahi temple will help Rajeev to get married without any issues. They go to the temple but they are shocked when Narendra and Rajeev, both die in similar fashion. Why did they die? Will the curse end? Is it really curse or people using the curse? Watch the movie to know more.  Analysis:  Sumanth is good in parts but he seems to have lost track of his performance due to the longer intervals the shoot stretched. He did well in the second half in very important portions where the story opens up after investigation. Siddhu Jonnalagadda is good in the portion given to him. Brahmanandam, Vennela Kishore get shocking characters but their performance did not match the weight. Rajeev Kanakala is good but lacks impact and all others are forgettable.  Writing in this film is too amatuerish and it keeps jumping from point to point without real bridge scenes or interesting skeleton. There is a structure in the story, few plot points that tend to become common for such films yet the makers did not make any effort in writing and presenting them differently. The performances here are also very unconvincing.  The story does draw comparison with Murari, as the curse portion and deaths do have parallels. Here, the movie fails establishing an emotional connect with Vamsee or Kamal's characters. Even the investigation that happens after their death looks completely written with negligence thinking that the audiences cannot really crack anything. It does not really let the clues be identified rather they just scatter them around and audiences are left exhausted when final twists arrive.  The final twists seem to have been written with Aditya Karikalan's death in mind and then some old order style stories. At a time when the influence of Britishers had been so prominent, still continuing these murders like a mystery needed a lot more depth, imagination in writing. Cinematography is poor, makers did not even care about DI. Music by Anup Rubens is forgettable and production values do not match the story ambition.  At low budgets, Malayalam industry has been trying these sort of stories from some time and here, makers failing to land the story, narrative properly shows the lack of skill. Makers did need to bring in better technicians and writing department to get a cohesive script for this story to land. Overall, the movie just disappoints and looks like a cheap rip-off of other God based investigative supersitious thrillers rather than a solid film.  Positives: Sumanth's performance Few engaging twists Negatives:  Production values Technicial abilities Music Underwhelming Writing Bad Cienmatography  Lethargic execution Rating: 2/5  Bottomline: A Forgettable Film.  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
ప్రస్తుతం తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలో ఓటర్ల ఎన్యుమరేషన్ పత్రాల్లో పేర్ల నమోదులో జరిగిన పొరపాట్ల వల్ల ఎన్నికల అధికారులు టాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రీడా దిగ్గజాలకు 'SIR' నోటీసులు జారీ చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత, విక్టరీ వెంకటేష్, సమంత, విజయ్ దేవరకొండ, ఉపాసనలతో పాటు వివిఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, గోపీచంద్, సైనా నెహ్వాల్ వంటి ప్రముఖులకు నోటీసులు వెళ్లాయి. వీరు స్వయంగా కాకుండా తమ ప్రతినిధులను కూడా విచారణకు పంపవచ్చని అధికారులు వెల్లడించారు.       Telangana SIR, Mahesh Babu, SS Rajamouli, Venkatesh, Vijay Deverakonda, Telugu Film News, Telugu News  
  మన శంకర వరప్రసాద్ గారు రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి చిరు తన 'కాకా' ని ముస్తాబు చేస్తున్న విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య  బాబీ దర్శకుడు కావడం విజయానికి లభించే బోనస్ గా ఫ్యాన్స్ భావిస్తున్నారు. జనవరి 13 రిలీజ్ డేట్ కావడంతో శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.  తాజాగా సంగీత దర్శకుడు థమన్ ఎక్స్ వేదికగా ‘కాకా’ సెట్స్ నుంచి చిరంజీవితో కలిసి దిగిన పిక్ ని అభిమానులతో పంచుకున్నారు.  పిక్ లో  చిరంజీవి, థమన్ ఇద్దరూ ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్ క్షణాల్లోనే అభిమానుల దృష్టిని ఆకర్షించడంతో సోషల్ మీడియాలో షేర్  చేస్తున్నారు. దీంతో సదరు పిక్ వైరల్ అయ్యే పనిలో బిజీగా ఉంది.  ముఖ్యంగా చిరు లుక్. పనిలో పనిగా చిరు క్యారక్టర్ పై పలు రకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. మ్యూజిక్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.     Also Read: త్రివిక్రమ్ క్రేజీ ప్లాన్.. ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు..అసలు మ్యాటర్ ఇదేనా చిరు కూతురుగా అనస్వర రాజన్ అమ్ములు పాప' అనే మెడికల్ కాలేజ్ విద్యార్థిని పాత్రలో నటిస్తోందని మేకర్స్ ఆమె పుట్టినరోజున (సెప్టెంబర్ 8, 2026) ఫస్ట్ లుక్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో అనస్వర వెనుక గోడపై చిరంజీవి సిల్హౌట్ నీడ కనిపిస్తూ, ఆమెను కాపాడే సత్యం పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో క్లూ ఇచ్చారు. దీనితో పాటు నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను వంటి బలమైన తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనగణమన, టాక్సిక్ ఫేమ్ ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పై నిర్మాత వెంకట్ కే నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.      [Kaaka, Chiranjeevi, Thaman, Anaswara Rajan, Telugu Cinema  News, TeluguNews, Tollywood, Tollywood News, TeluguCinema]
Cast: Anand Deverakonda, Vaishnavi Chaitanya, Sivaji, Vasuki, Kalyan Shankar Crew: Written by Aditya Hasan Cinematography by Azeem Mohammad Music by Hesham Abdul Wahab Editing by Navin Nooli Direction by Aditya Hasan Produced by Suryadevara Naga Vamsi, Sai Soujanya Anand Deverakonda and Vaishnavi Chaitanya, the hit pair from Baby, come together again for Epic: First Semester. Directed by Aditya Hasan, this film explores young love and live-in relationships with a London backdrop. The movie released today, and let's discuss it in detail. Plot: Aditya (Anand) is a soft-spoken middle-class boy from Wanaparthy who goes to London for higher studies. There, he meets Kadali (Vaishnavi), an independent and bold girl from Vizag. Their casual connection quickly turns into a live-in relationship. As time passes, ego clashes, intimacy issues, and the struggles of living in a foreign country start to pull them apart. How they deal with these conflicts and how it impacts Aditya's father (Sivaji) forms the rest of the story. Analysis: Anand Deverakonda is perfectly cast as the innocent and slightly awkward Aditya. His conversations with Vaishnavi feel natural, and he handles the emotional beats well. Vaishnavi Chaitanya delivers a strong performance, bringing a required unpredictability to the bold and vulnerable Kadali. Their chemistry remains the film's biggest asset, capturing the tension and tenderness of modern relationships with candor. However, the film’s major drawback is its pacing and writing. While the initial interactions and comedy by Kalyan Shankar are engaging, the narrative becomes severely repetitive in the middle portions. The couple’s conversations circle the same emotional conflicts without moving the story forward. The emotional high points, especially the heartfelt scenes involving Sivaji, arrive too late after the audience's patience has been tested by a sluggish screenplay. Technically, Hesham Abdul Wahab’s music is a standout, elevating many silent and ordinary moments. The cinematography by Azeem Mohammad successfully captures the mood, but Navin Nooli’s editing could have been much sharper. Trimming 15-20 minutes would have vastly improved the film. Overall, Epic has its heart in the right place but falters due to a tedious narrative. Positives: Anand and Vaishnavi's chemistry Good performances by the lead pair and Sivaji Hesham Abdul Wahab's music Negatives: Very slow pace Repetitive and boring screenplay Lack of strong conflict Abrupt ending Rating: 2/5 Bottomline: Epic relies purely on the lead pair's chemistry but tests your patience with a slow, dragging narrative.   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  మాటకి గౌరవాన్ని, బిడియాన్ని,సిగ్గుని, మహత్తుని, హుందాతనాన్ని ఏకకాలంలో తీసుకొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్. ప్రెజెంట్ విక్టరీ వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తెరకెక్కిస్తూ, ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ కి కూడా సిద్దమవుతున్నాడు.  భారతీయ సినీ చరిత్రలో లేటెస్ట్ గా సంచలనాలు సృష్టిస్తూ వెళ్తున్నచిత్రం 'హనుమాన్ అంశ్'. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, నీం కరోలీ బాబా మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. హిందీలో అసాధారణ విజయం సాధించిన ఈ విజువల్ డివైన్ వండర్‌ని ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులోకి తీసుకురాబోతున్నాడు. అంటే రిలీజ్ బాధ్యతలని తీసుకున్నాడు. ఈ విషయాన్ని హనుమాన్ అంశ్ నిర్మాత 'నమ్రతా సింగ్' స్వయంగా వెల్లడించారు. తెలుగు చిత్రసీమలో విలక్షణ కథాంశాలని, ఆధ్యాత్మిక స్పర్శ ఉన్న సినిమాలని ఆదరించే ప్రేక్షకులు ఎక్కువ. ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పించబోతుండటంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆధ్యాత్మికతని, భారతీయ సంస్కృతిని అత్యున్నత రీతిలో గౌరవించే త్రివిక్రమ్ ఈ సినిమా బాధ్యతలను స్వీకరించడం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.   Also read: షాకింగ్ కలెక్షన్స్: మండాడి ఫస్ట్ డే ఎంత వసూళ్లు రాబట్టిందంటే!  తల్లి మరణం తర్వాత భగవంతుని అన్వేషణలో ఇల్లు వదిలి వెళ్లి, ఉత్తర భారతదేశమంతటా ఆధ్యాత్మిక ప్రయాణం సాగించి, చివరకు 'నీం కరోలీ బాబా'గా పరివర్తన చెందిన లక్ష్మీ నారాయణ శర్మ అనే చిన్ననాటి బాలుడి నిజ జీవిత కథే హనుమాన్ అంశ్   "అందరినీ ప్రేమించు, అందరికీ అన్నదానం చేయి, ఎల్లప్పుడూ రామ్ రామ్ స్మరించు" అనేదే బాబా తత్వం. కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఇప్పుడు 200 కోట్ల మార్కుకి కూతవేటు దూరంలో ఉంది. అది కూడా మౌత్ టాక్. దీన్ని బట్టి అర్ధమవుతుంది ఏంటంటే ఎన్ని పబ్లిసిటీ జిమ్మిక్కులు చేసినా కంటెంట్ నే అన్నిటికంటే బలమని.  ఎందుకంటే ప్రేక్షకులు, సినిమా మనకంటే ఎప్పుడు అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటారు.     [Trivikram ,Hanuman Ansh Movie, Telugu Release, Telugu Cinema  News, TeluguNews, Tollywood, Tollywood News, TeluguCinema]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ మధ్య ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. రీసెంట్ గా కేటీఆర్ ‘ది అండర్ 18 వరల్డ్’ (The Under 18 World) అనే యూత్ టాక్ షోలో పాల్గొన్నప్పుడు ఈ క్రేజీ అండ్ క్యూట్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. షో సరదాగా సాగుతున్న సమయంలో, అక్కడున్న చిన్నారులు కేటీఆర్‌కు ఒక క్రేజీ ఛాలెంజ్ విసిరారు. "సార్.. మీ ఫోన్ నుంచి సూపర్ స్టార్ కు కాల్ చేయాలి" అని అడిగారు. దానికి కేటీఆర్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా, ముసిముసి నవ్వులు రువ్వుతూ వెంటనే తన పర్సనల్ ఫోన్ తీసి డార్లింగ్ ప్రభాస్‌కు డైరెక్ట్ కాల్ చేశారు. కట్ చేస్తే.. అక్కడ కాల్ కనెక్ట్ అయింది. అవతలి వైపు నుంచి ప్రభాస్ "గుడ్ ఈవెనింగ్ సార్" అంటూ తన మార్క్ స్వీట్ వాయిస్‌తో ఆన్సర్ చేశారు. ఇక వెంటనే సీన్‌లోకి ఎంటర్ అయిన ఆ చిన్నారులు, కేటీఆర్ ఫోన్ తమ చేతికి తీసుకోని ఒక ఫన్నీ కథ అల్లేశారు. "రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఫోన్ దొరికింది. చూస్తే ఇందులో మీ నెంబర్ ఉంది. ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకోవచ్చా" అంటూ ప్రాంక్ చేశారు. దాంతో ప్రభాస్ కి ఏం అర్థంగాక కాల్ కట్ చేశారు.  ఆ తర్వాత కేటీఆర్ ఫోన్ తీసుకొని, మళ్ళీ ప్రభాస్ కి కాల్ చేసి.. అసలు విషయం చెప్పారు. ఇప్పుడు ఈ క్యూట్ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి నవ్వులు పూయిస్తోంది.        Under 18 World Show, KTR Prabhas Prank Call, KTR Phone Call Prabhas, KTR Prabhas Viral Video, KTR, Prabhas, Telugu Film News, Telugu News  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చిన్నతనం నుంచి మన ఇళ్లలో పెద్దవాళ్లు తరచూ చెప్పే మాటల్లో ఒకటి క్యారెట్లు తింటే కంటి చూపు మెరుగుపడుతుందని. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ల ముందు గంటల తరబడి గడిపే ఆధునిక జీవనశైలిలో కంటి చూపు బలహీనపడటం, కళ్లు పొడిబారడం, తలనొప్పి వంటి సమస్యలు చిన్న వయసులోనే వేధిస్తున్నాయి. ఈ క్రమంలో చూపును కాపాడుకోవడానికి చాలామంది ప్రతిరోజూ ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే రోజువారీగా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు నిజంగా పెరుగుతుందా? దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు ఏమిటి? కంటి ఆరోగ్యానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో వివరంగా తెలుసుకుందాం. క్యారెట్లలో కంటి ఆరోగ్యానికి అత్యంత కీలకమైన  బీటా కెరోటిన్  (Beta Carotene) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరం ఈ బీటా కెరోటిన్‌ను గ్రహించి  విటమిన్ ఏ గా మారుస్తుంది. విటమిన్ ఏ అనేది కంటి రెటీనా సరిగ్గా పనిచేయడానికి మరియు తక్కువ వెలుతురులో లేదా చీకటిలో చూపు స్పష్టంగా కనిపించడానికి అత్యంత అవసరమైన పోషకం. క్యారెట్ జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు ఇందులోని పోషకాలు శరీరంలోకి త్వరగా శోషించబడతాయి. రోజువారీగా ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ ఏ రోజువారీ మోతాదు (RDA) సులభంగా లభిస్తుంది. ఇది కంటి పాప పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో మరియు నైట్ బ్లైండ్‌నెస్ లేదా రేచీకటి సమస్యను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.   అంతేకాకుండా క్యారెట్ జ్యూస్‌లో  లుటీన్  (Lutein) మరియు  జెయాక్సంతిన్  (Zeaxanthin) అనే మరో రెండు శక్తివంతమైన కరోటినాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటికి ఒక సహజమైన సన్‌స్క్రీన్‌లా పనిచేస్తాయి. డిజిటల్ స్క్రీన్‌ల నుండి వెలువడే హానికరమైన నీలి వెలుగు (Blue Light) మరియు సూర్యుడి నుండి వచ్చే గురయ్యే ఆల్ట్రావైలెట్ కిరణాల నుండి కంటి రెటీనాను ఇవి రక్షిస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే  మాక్యులర్ డిజెనరేషన్  (Macular Degeneration) మరియు శుక్లాలు (Cataracts) వంటి తీవ్రమైన కంటి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని క్యారెట్ జ్యూస్ క్రమంగా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కళ్లలోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ మెరుగై కంటి అలసట తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్యారెట్ జ్యూస్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు పోషకాహార లోపం వల్ల వచ్చే చూపు మందగింపును నివారిస్తుంది కానీ, ఇప్పటికే కంటి అద్దాలు వాడుతున్న వారికి చూపును పూర్తిగా సాధారణ స్థితికి తెచ్చి గ్లాసెస్ తీసేస్తుందని భావించడం సరికాదు. క్యారెట్‌లో లభించే బీటా కెరోటిన్ క్రొవ్వులో కరిగే (Fat soluble) విటమిన్ కాబట్టి, క్యారెట్ జ్యూస్‌లో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా బాదం పొడి చేర్చి తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ ఏ గ్రహణశక్తి మరింత పెరుగుతుంది. పరిమితికి మించి కాకుండా ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చూపు స్పష్టత పెరగడమే కాకుండా చర్మం కాంతివంతంగా మారి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.       [Carrots, Carrot Juice, Eye Health, Beta Carotene, Vitamin A, Lutein, Zeaxanthin, Night Blindness, Cataracts, Macular Degeneration]
నేటి వేగవంతమైన జీవనశైలి, సరైన పోషకాహారం లేకపోవడం మరియు శారీరక శ్రమ తగ్గడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్య చాలామందిని వేధిస్తోంది. రక్తం సరఫరా చేసే ధమనులలో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటు వంటి ప్రమాదకర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించుకోవడానికి చాలామంది ఆహార అలవాట్లలో రకరకాల మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయపు టిఫిన్ స్థానంలో ఓట్స్ తినడం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా ప్రాచుర్యం పొందింది. అయితే రోజూ ఓట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ నిజంగా తగ్గుతుందా, దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఓట్స్‌లో శరీరానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన పోషకాలు నిండి ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో  బీటా గ్లూకన్  (Beta Glucan) అనే అరుదైన కరిగే పీచు పదార్థం (Soluble Fiber) అత్యధిక పరిమాణంలో ఉంటుంది. మనం ఓట్స్ తిన్నప్పుడు ఈ బీటా గ్లూకన్ జీర్ణక్రియలో నీటితో కలిసి ఒక చిక్కని జెల్ లాంటి పదార్థంగా మారుతుంది. ఈ జెల్ ప్రేగులలో కొలెస్ట్రాల్ మరియు పిత్త ఆమ్లాలను (Bile Acids) పట్టుకుని, అవి మళ్లీ రక్తంలోకి శోషించబడకుండా శరీరం నుండి బయటకు పంపేలా చేస్తుంది. దీనివల్ల శరీరంలో కొత్తగా తయారయ్యే కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. వైద్య పరిశోధనల ప్రకారం రోజువారీ ఆహారంలో కనీసం 3 గ్రాముల బీటా గ్లూకన్ తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు దాదాపు 5 శాతం నుండి 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. మనం ప్రతిరోజూ ఒక చిన్న కప్పు (సుమారు 40 నుండి 50 గ్రాములు) ఓట్స్ తీసుకోవడం ద్వారా ఈ కావలసిన 3 గ్రాముల బీటా గ్లూకన్ పీచు పదార్థాన్ని సులభంగా పొందవచ్చు. ఓట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఏకంగా 15 శాతం నుండి 20 శాతం వరకు తగ్గుతుందని పలు అంతర్జాతీయ ఆరోగ్య అధ్యయనాలు వెల్లడించాయి. ఓట్స్ కేవలం కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా బరువు అదుపులో ఉంచడంలో కూడా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల పదే పదే ఆకలి వేయడం తగ్గి, అతిగా తినే అలవాటు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఓట్స్‌లో లభించే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ (Glycemic Index) రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఓట్స్ ఒక అద్భుతమైన ఆహార వికల్పంగా మారుతుంది. అయితే ఓట్స్ తినే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం. మార్కెట్లో లభించే ఇన్స్టంట్ లేదా ప్రాసెస్ చేసిన రుచికరమైన ఫ్లేవర్డ్ ఓట్స్‌లో చక్కెర, కృత్రిమ రసాయనాలు మరియు సోడియం ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడానికి బదులుగా మరింత పెంచే ప్రమాదం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ రోల్డ్ ఓట్స్ (Rolled Oats) లేదా స్టీల్ కట్ ఓట్స్ (Steel Cut Oats) ఎంచుకోవడం మంచిది. వీటిని నీటిలో లేదా కొవ్వు తక్కువగా ఉన్న పాలలో ఉడకబెట్టి, సహజమైన తీపి కోసం ఆపిల్ ముక్కలు, బెర్రీలు, వాల్‌నట్స్, బాదం లేదా గుమ్మడి గింజలు చేర్చుకుని తినడం వల్ల గుండె ఆరోగ్యం రెట్టింపు అవుతుంది.     [Oats, Cholesterol, LDL Cholesterol, Beta Glucan, Soluble Fiber, Heart Health, Healthy Diet, Weight Management, Diabetes, Rolled Oats]  
మన ఆహార అలవాట్లు, మారుతున్న జీవనశైలి కారణంగా నేటి రోజుల్లో చిన్న వయసులోనే డయాబెటిస్, రక్తహీనత వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ పెరిగిపోవడం, మరోవైపు రక్తంలో ఐరన్ లోపించి తీవ్రమైన నీరసం రావడం చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండింటికీ పరిష్కారంగా ఎన్నో రకాల మందులు వాడుతున్నప్పటికీ, సహజమైన పద్ధతిలో మన ఇంటి వద్దే దొరికే ఒక ప్రకృతి ప్రసాదించిన ఆకు దీనికి చక్కటి ఉపశమనాన్ని ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ అద్భుతమైన ఆకే  మునగాకు . మన దైనందిన ఆహారంలో మునగాకును భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని రకాల ప్రయోజనాలు చేకూరతాయో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. మునగాకులో లభించే పోషకాలు సాధారణమైనవి కావు. దీన్ని ఒక సూపర్ ఫుడ్‌గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇందులో విటమిన్ సీ, విటమిన్ ఏ, క్యాల్షియం, పోటాషియం, మెగ్నీషియం, ఐరన్ మరియు అమినో యాసిడ్స్ అత్యధిక మోతాదులో సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన ఆంటీఆక్సిడెంట్లు, ఐసోథియోసైనేట్లు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడతాయి. భోజనం చేసిన తర్వాత గ్లూకోజ్ స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నిరోధించడంలో మునగాకు రసం లేదా మునగాకు పొడి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా మునగాకును ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల డయాబెటిస్ బాధితులలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.   అలాగే నేడు చాలామంది మహిళలను వేధిస్తున్న ప్రధాన సమస్య రక్తం తక్కువగా ఉండటం లేదా అనీమియా. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి మునగాకు ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. పాలకూరతో పోలిస్తే మునగాకులో ఏకంగా 3 రెట్లు ఎక్కువ ఐరన్ లభిస్తుంది. శరీరంలో ఐరన్ శోషణకు అవసరమయ్యే విటమిన్ సీ కూడా మునగాకులో పుష్కలంగా ఉండటం దీనికి మరొక గొప్ప ప్లస్ పాయింట్. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున మునగాకు రసాన్ని లేదా ఎండబెట్టి పొడి చేసిన మునగాకు పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల రక్తహీనత నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇది కొత్త రక్తం తయారవ్వడానికి, హిమోగ్లోబిన్ స్థాయిలను వేగంగా పెంచడానికి సహకరిస్తుంది. కేవలం షుగర్, అనీమియా మాత్రమే కాకుండా మునగాకుతో శరీరానికి కలిగే ఇతర ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, కళ్ల చూపును మెరుగుపరచడంలో కూడా మునగాకు సమర్థవంతంగా పనిచేస్తుంది. పాలు, పెరుగు కంటే ఎక్కువ క్యాల్షియం ఇందులో ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి. నిత్యం లభించే ఈ సహజమైన ఆకును మన ఆహారంలో పప్పులోనో లేదా వేపుడు రూపంలోనో చేర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.         [Moringa Leaves, Moringa Benefits, Diabetes, Anemia, Iron Deficiency, Blood Sugar, Healthy Diet, Ayurveda, Superfood, Health Benefits]
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు. బొజ్జ గణపయ్యకు పెట్టే ప్రసాదాలు కేవలం సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, వాటి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఆ కాలానికి తగినట్లుగా, శరీరానికి మేలు చేసే పదార్థాలనే వినాయకుడి ప్రసాదాలుగా మార్చారు. ఆ ప్రసాదాలు ఏమిటి, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. కుడుములు , ఉండ్రాళ్ళు.. వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు. వీటిని నూనె లేకుండా కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉంటాయి. బియ్యపు పిండి, పెసరపప్పు లేదా శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలగలిపి వీటిని తయారుచేస్తారు. బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆవిరి వంటకం కావడం వల్ల జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పొట్టలో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. కొందరు కుడుములను మైదా పిండితో నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు.   బెల్లం , పప్పుధాన్యాల కాంబినేషన్.. అన్ని రకాల ప్రసాదాలలో బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. కుడుముల్లో వాడే శనగపప్పు, పెసరపప్పుల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వర్షాకాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బెల్లం, పప్పుధాన్యాల కాంబినేషన్ శరీరానికి మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. జిల్లేడు కాయలు , మోదకాలు.. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలను బియ్యపు పిండిలో బెల్లం, కొబ్బరి పూరకంతో చేస్తారు. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి, జుట్టుకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి శరీరానికి అవసరమైన శక్తిని త్వరగా అందిస్తుంది. కొబ్బరి , బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, వాత రోగాల నివారణకు  ఈ కాంబినేషన్ చక్కగా తోడ్పడుతుంది. పాయసం , పరమాన్నం.. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే పాయసం నివేదనలో ముఖ్యమైనది. పాలల్లో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ఇందులో వేసే యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పాయసంలో వాడే నెయ్యి శరీరానికి కావలసిన విటమిన్లు ఎ, డి లభించేలా చేస్తుంది , కీళ్ళకు అవసరమైన నూనెను అందిస్తుంది. పులిహోర.. ఏ పండుగైనా పులిహోర లేకపోతే నివేదన పూర్తికాదు. వినాయక చవితి నాడు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెడతారు. చింతపండు, నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో విటమిన్ సి లభించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పుల వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. పులిహోర తాళింపులో వాడే పసుపు సహజమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ అనే అంశం శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో వేసే అల్లం, మిరియాలు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలిని పెంచుతాయి. చలిమిడి , వడపప్పు.. వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం చలిమిడి ,   పచ్చి పెసరపప్పును నీటిలో నానబెట్టి వడపప్పుగా ఇస్తారు. నానబెట్టిన పెసరపప్పులో పీచు పదార్థం, ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి చేసిన బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే చలిమిడి శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో కలిగే అలసటను నివారించడంలో ఈ  కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పండ్ల నివేదన , పత్రీ ప్రభావం.. స్వామివారికి ప్రసాదాలతో పాటు రకరకాల పండ్లను సమర్పిస్తారు. ముఖ్యంగా వెలగపండు, నేరేడు పళ్ళు, అరటిపళ్ళు నివేదిస్తారు. వెలగపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని క్రిములను సంహరిస్తుంది. నేరేడు పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటితో పాటు పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి కూడా ఒక రకమైన ఔషధ గని. పూజ చేసే సమయంలో ఆ పత్రి తాకిడి, వాటి సువాసనల వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విధంగా వినాయక చవితి ప్రసాదాలు కేవలం నైవేద్యం మాత్రమే కాకుండా, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధాలుగా పనిచేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ ప్రసాదాలను తిని, పండుగను భక్తితో పాటు ఆరోగ్యకరంగా జరుపుకోవడం ఆ వినాయకుడు ఇచ్చే అదృష్టం.. !                          *రూపశ్రీ.  
ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. బిజీ జీవనశైలి, వేళపాళ లేని తిండి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది అనతికాలంలోనే అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి గంటల తరబడి జిమ్‌లో కష్టపడాల్సిన పనిలేదు లేదా కఠినమైన ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. మన రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.  అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని సులభమైన ఆహార నియమాలు , చిట్కాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. ప్రోటీన్ ఫుడ్.. ప్రోటీన్ లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. రోజూ తీసుకునే ఆహారంలో గుడ్లు, పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పనీర్, లేదా చికెన్ వంటి వాటిని చేర్చుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల అనవసరంగా చిరుతిళ్లు తినే అలవాటు తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలో కండరాల నిర్మాణానికి , జీవక్రియ రేటును పెంచడానికి తోడ్పడుతుంది. మంచినీరు మ్యాజిక్.. భోజనం చేసే సమయానికి కనీసం అర్ధగంట ముందు ఒక పెద్ద గ్లాసు మంచి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది , భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా నిరోధించవచ్చు. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి , మెటబాలిజం వేగవంతమవుతుంది. దాహం వేసినప్పుడు శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడానికి బదులుగా సాధారణ నీరు లేదా నిమ్మరసం, మజ్జిగ తీసుకోవడం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫైబర్.. రోజువారీ ఆహారంలో పీచు పదార్థం లేదా ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ , ఓట్స్ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా ఫైబర్ నిరోధిస్తుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు. కనుక ప్రతిరోజూ  తినే భోజనంలో సగం భాగం కూరగాయలు లేదా సలాడ్లు ఉండేలా చూసుకోవడం మంచిది. తినేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి.. ఆహారం తినేటప్పుడు టీవీ, మొబైల్ ఫోన్లు చూడటం వంటి పనులు మానుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలి తినడం చాలా ముఖ్యం. ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడు జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది , కడుపు నిండిందనే సంకేతం మెదడుకు త్వరగా అందుతుంది. తొందరపడి తింటే తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తినేసే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్స్.. ప్యాక్ చేసిన ఆహారాలు, బేకరీ తిళ్లు, వేపుళ్లు, , ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీటిలో కేలరీలు, ఉప్పు , ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి ప్రధాన కారణమవుతాయి. అలాగే పంచదార , తీపి పదార్థాలను పూర్తిగా తగ్గించడం వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు చక్కెర కలిపిన స్వీట్లకు బదులుగా ఖర్జూరాలు లేదా తాజా పండ్లను ఎంచుకోవచ్చు. వ్యాయామం ముఖ్యమే.. ఆహార నియమాలతో పాటు రోజుకి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల అనవసరమైన ఆకలి పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణం, కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి సాధన చేయాలి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.. బరువు తగ్గడం అనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు. దీనికి సహనం, నిలకడ చాలా అవసరం. కఠినమైన డైటింగ్స్ చేసి అనారోగ్యం పాలవడం కంటే, ఇటువంటి చిన్న చిన్న మార్పులను జీవనశైలిలో భాగం చేసుకుంటే సులభంగా , శాశ్వతంగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు.                        *రూపశ్రీ.
కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామందిలో భయం, ఆందోళన మొదలవుతాయి. అయితే ప్రతి కిడ్నీ సమస్య తీవ్రమైనదే అని భావించాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సమస్యను గుర్తించి, తగిన వైద్య సలహా తీసుకుంటే కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ TeluguOne Health వీడియోలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు, HOD, నెఫ్రాలజీ, NIMS Hospital, Hyderabad, కిడ్నీ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? కిడ్నీ వ్యాధి ఉందని తెలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ సమస్యలు ఉన్నవారు భయపడాల్సిన అవసరం ఎందుకు లేదు? వంటి ముఖ్యమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోవచ్చు. కిడ్నీ ఆరోగ్యంపై సరైన అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన సూచనలను తెలుసుకోండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలకు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)