LATEST NEWS
  లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ  ఓటర్ అధికార్ యాత్ర చేయనున్నారు.  ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను వ్యతిరేకిస్తూ  బీహార్‌లోని ససారాంలో యాత్రను రాహుల్ ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్లు యాత్ర రూట్ మ్యాప్‌ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు ప్రతిపక్ష నాయకుడు  రానున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార్ యాత్ర ముగియనుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తో సహా యాత్రలో ఇండియా కూటమి నేతలు, కీలక వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. త్వరలో బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రను చేపట్టారు.  దేశవ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో  ఓట్ల దొంగతనం జరిగిందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటర్లను బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ఓటర్ల హక్కుల యాత్రను చేపడుతున్నారు. ఆయన ప్రజా కోర్టుకు చేరుకుని, భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలంటే, ఇక్కడి ఓటర్లను బలోపేతం చేయాలని ప్రజలకు చెబుతారు. బీహార్‌లో ఓటర్ల జాబితాలో సవరణకు వ్యతిరేకంగా, ఓటర్ల చోరీకి వ్యతిరేకంగా పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా మార్చడానికి యాత్ర జరుగుతోందని కాంగ్రెస్ ఇన్‌చార్జి కృష్ణ తెలిపారు  
  తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి  వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 29.6 అడుగులు దాటి ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం 16 అడుగుల మేర ఉన్న గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ 29 అడుగులు దాటింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నదిలో స్నానమాచరించే భక్తులు నది లోపలకి వెళ్లకుండా ఒడ్డునే ఉండి స్నానమాచరించాలని ఆదేశాలు జారీ చేశారు. నది వద్ద లాంచీలు, పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.  
  ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కండక్టర్‌లు  అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఒరిజినల్  కార్డునే చూపించాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిరాక్స్ ఆధార్ కార్డు చెల్లుబాటు కాదు అంటున్నారు. దీంతో కండక్టర్‌ల తీరు మహిళల అసహనం వ్యక్తం చేస్తున్నారు .మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చుని ప్రభుత్వం చెబుతుంటే కండక్టర్ తీరుపై సర్వత్ర విమర్శలు వెలువెత్తున్నాయి. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బోర్డర్ కొంచెం ఏపీలో, కొంచెం తెలంగాణలో ఉండడంతో అవి అంత ర్రాష్ట్ర సర్వీసులుగా గుర్తించారు. దాంతో వాటిలో ఉచితం లేదని అధికారులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి వేలేరుపాడు కుక్కునూరు, మండలాలకు వెళ్లే సర్వీసులన్నీ.. తెలంగాణ నుంచే వెళ్లడంతో స్థానికల్లో అయోమయం ఏర్పడింది. జంగారెడ్డి గూడెం నుంచి భద్రాచలం వెళ్లే బస్సుకి ఫ్రీ టికెట్ లేదని జంగారెడ్డిగూడెం బస్ డిపో డీఎం తెలిపారు.అదే విధంగా అశ్వరావుపేట షటిల్ సర్వీస్‌ ఫ్రీ టికెట్ వర్తించదని డీఎం చెబుతున్నారు. దాంతో జంగారెడ్డిగూడెం నుంచి  వేగవరం, తాడువాయి, దర్భ గూడెం జీలుగుమిల్లి వెళ్లే ప్రయాణికులకు స్త్రీ శక్తి ఎలా ఉపయోగపడుతుందనే అనుమానం నెలకొంది.  
  శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్‌పై  పోలీసులు దేశద్రోహం కేసునమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఈ ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. 29 ఉగ్ర సంస్థలతో మహమ్మద్‌కు సంబంధాలు ఉన్నట్లు విచారణలో ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మరోవైపు ధర్మవరం టెన్ పోలీసు స్టేషన్‌లో పరిధిలోని ఎర్రగుంట్లు వాసి రియాజ్ నో ఇండియా ఐ లవ్ పాకిస్థాన్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టగా అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  కాగా నూర్ మహమ్మద్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఐబీ అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్ క్రియాశీల వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఓ హోటల్ లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్.. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొన్నాది.నూర్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన వాట్సాప్‌ గ్రూపుల్లో నూర్‌ మెంబర్‌గా ఉన్నాడని, అందులోని నెంబర్లకు ఇతని నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వెళ్లాయని.. ముస్లిం యువతను ఉగ్ర సంస్థ వైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు సైతం చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో.. అతని వ్యక్తిగత వివరాల గురించి ఐబీ, ఎన్‌ఐఏ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే..  నూర్‌ వ్యవహారంపై డీఎస్పీ నరసింగప్పకు మీడియాకు కొన్ని విషయాలు తెలియజేశారు. ‘‘నూర్‌ను లోకల్‌ పోలీసులే మొదట అరెస్ట్‌ చేశారు. నిషేధిత ఉగ్రసంస్థలకు చెందిన గ్రూపుల్లో అతను సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించాం. కొన్ని సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నాం. అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నాం’’ అని అన్నారాయన.  ధర్మవరంలో ఉగ్రకదలికలు వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. కోట ఏరియాలో ఉంటున్న నూర్‌ నివాసంలో ఎన్‌ఐఏ సోదాలతో అంతా ఉలిక్కిపడ్డారు. ఓ హోటల్‌లో అతను వంట మనిషిగా పని చేస్తున్నట్లు సమాచారం. నూర్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. 16 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు.
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. అయితే ఎన్డీయే అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతను కూటమి పార్టీలు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలకు అప్పగించాయి. దీంతో మోదీ, షాలు ఎవరిని ఖరారు చేస్తారన్నది ఇప్పటి వరకూ ఎవరికీ అంతుచిక్కడం లేదు. రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నా.. మోడీ షాల మదిలో ఎవరున్నారన్నది ప్రకటన వెలువడే వరకూ ఎవరికీ తెలియకుండా గోప్యత పాటిస్తున్నారు. ఈ సస్పెన్స్ ఒక్క కూటమి పార్టీలలోనే  కాదు కాంగ్రెస్ లో కూడా ఉంది. ఎన్డీయే అభ్యర్థి ఎవరన్నది తేలిన తరువాత కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని నిలబెట్టాలా? వద్దా? ఒక వేళ నిలబెడితే ఎవరిని అన్నది తేల్చుకునే అవకాశం ఉంది.   ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 17) జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎవరన్నది తేలుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. అయితే పరిశీలకులు మాత్రం  బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో  అభ్యర్థిని ఖరారు అయ్యే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగుతుందనీ, అయితే అభ్యర్థి ఎంపిక బాధ్యత మాత్రం మళ్లీ మోడీ, షాలకు అప్పగిస్తుందనీ అంటున్నారు. ఇక మోడీ, షా ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును సోమవారం (ఆగస్టు 18)న ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి దన్ ఖడ్ ఉపరాష్ట్రపతి పదవిని చేసిన రాజీనామా ఆమోదం పొందిన క్షణం నుంచీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి అంటూ పలు పేర్లు తెరమీదకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకూ పలు పేర్లు తెరమీదకు వచ్చాయి.  అయితే ఫైనల్ గా ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అన్న ఫైనల్ డెసిషన్ మాత్రం ఇంత వరకూ జరగలేదు.  అయితే ఈ సస్పెన్స్ మరెంతో కాలం కొనసాగే అవకాశం లేదు. ఉపరాష్ట్రపదవికి నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 చివరి తేదీ కావడంతో సోమ, లేదా మంగళవారం అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఎన్ని పేర్లు తెరమీదకు వచ్చినా ఫైనల్ గా అభ్యర్థిని డిసైడ్ చేసేది మాత్రం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే అనడంలో సందేహం లేదు.  
ALSO ON TELUGUONE N E W S
‘ప్రేమ సంకెళ్ళు’ చిత్రంతో హీరోగా పరిచయమైన నరేష్‌.. ‘నాలుగు స్తంభాలాట’తో చిత్రంతో పెద్ద సక్సెస్‌ సాధించారు. ఆ తర్వాత కామెడీ ప్రధానంగా రూపొందిన చాలా సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్‌ హీరో అనిపించుకున్నారు నరేష్‌. కామెడీ ప్రధానంగా ఉన్న సినిమాలే కాకుండా సెంటిమెంట్‌, ఎమోషనల్‌, యాక్షన్‌ సినిమాల్లో కూడా నటించి ఆల్‌రౌండర్‌ అనిపించుకున్నారు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా సక్సెస్‌ సాధించిన నరేష్‌ తాజాగా నారా రోహిత్‌, శ్రీదేవి జంటగా నటించిన ‘సుందరకాండ’ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌ చేశారు. ఈ సినిమా ఆగస్ట్‌ 27న విడుదల కాబోతోంది. ఈ  సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఒక కొత్త విషయాన్ని తెలిపారు నరేష్‌.  ‘నేను కామెడీ బాగా చెయ్యగలను అనే పేరు ఆల్రెడీ ఉంది. అలాగే రంగస్థలం చిత్రం నుంచి మంచి ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌ కూడా బాగా చెయ్యగలను అనిపించుకున్నాను. నేను చేసే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ పడాలని కోరుకుంటాను. నెక్స్‌ట్‌ నేను చేయబోయే సినిమాల్లో మూడు నాలుగు ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నాను. అలాగే నాలుగు రసాలను పండిరచే ఒక విచిత్రమైన క్యారెక్టర్‌ కూడా చేస్తున్నాను. అన్నింటినీ మించి ఒక పాన్‌ ఇండియా మూవీలో విలన్‌గా నటించబోతున్నాను. అయితే ఆ సినిమాలో హీరో ఎవరు, డైరెక్టర్‌ ఎవరు అనే విషయాలు ఇప్పుడే నేను చెప్పలేను. ఆ సినిమా మాత్రం చాలా బిగ్‌ రేంజ్‌లో ఉండబోతోంది. వివరాలు త్వరలోనే తెలుస్తాయి’ అన్నారు. 
పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, సుజిత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఓజీ’ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా టైమ్‌ ఉన్నప్పటికీ సినిమాకి ఉన్న హై ఎక్స్‌పెక్టేషన్స్‌ని దృష్టిలో ఉంచుకొని వరసగా అప్‌డేట్స్‌ ఇస్తున్నారు మేకర్స్‌. ఇటీవల రిలీజ్‌ చేసిన ఓజస్‌ గంభీరకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు మరో అప్‌డేట్‌తో పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు.  ఈ చిత్రంలోని హీరోయిన్‌ పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ప్రియాంక మోహన్‌ యాజ్‌ కన్మణి అంటూ ఆ పోస్టర్‌పై మెన్షన్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించి వస్తున్న అప్‌డేట్స్‌తో రోజురోజుకీ భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే కొందరు మాత్రం హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండడం సినిమాకి కూడా మంచిది కాదనే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఇటీవలికాలంలో చాలా సినిమాలు భారీ హైప్‌ మధ్య రిలీజ్‌ దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు అభిమానులు ఈ తరహా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన అప్‌డేట్స్‌ చూస్తుంటే సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ క్యారెక్టర్‌ ఒక రేంజ్‌లో ఉండబోతోందనేది అర్థమవుతోంది. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్‌ ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. 
'రతి నిర్వేదం'(Rathinirvedam)ఫేమ్ 'శ్వేతా మీనన్'(Shwetha Menon)గురించి తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు. 1991లో 'మమ్ముట్టి'(mammootty)హీరోగా వచ్చిన 'అనశ్వరం' అనే చిత్రంతో, హీరోయిన్ గా మలయాళ సినీ రంగ ప్రవేశం చేసిన శ్వేతా, ఇప్పటి వరకు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సుమారు వంద సినిమాల వరకు చేసింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని సైతం అందుకుంది. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ కి అధ్యక్షుడుగా ఉన్న 'మోహన్ లాల్'(Mohan Lal)కొన్ని నెలల క్రితం తన పదవికి రాజీనామా చేసాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో పని చేసున్న మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మోహన్ లాల్ రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నాడు. దీంతో నిన్న మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ కి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా అధ్యక్ష పదవికి శ్వేతామీనన్‌ పోటీ చేసింది. ఈ మేరకు నిన్న ఫలితాలు వెలువడ్డాయి. శ్వేతా తన ప్రత్యర్థి దేవన్‌పై ఘన విజయాన్ని అందుకుంది. మూడు దశాాబ్దాల మలయాళ సినీ చరిత్రలో ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళగా కూడా రికార్డుని క్రియేట్ చేసింది. మొత్తం 506 మంది సభ్యులు ఉండగా,298 మందే ఓటు హక్కుని వినియోగించుకున్నారు.  వైస్ ప్రెసిడెంట్‌గా లక్ష్మీ ప్రియ, జాయింట్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్‌, జనరల్‌ సెక్రటరీగా అన్సిబా హాసన్‌ ఎన్నికయ్యారు. గతంలో  అధ్యక్ష పదవిని మోహన్ లాల్ తో పాటు, మమ్ముట్టి, ఎంజీ సోమన్‌ వంటి అగ్రతారలు చేపట్టారు. కొన్ని రోజుల క్రితం శ్వేతా మీనన్ పై మార్టిన్ అనే వ్యక్తి  కోర్టుని ఆశ్రయించాడు .  శ్వేతా మీనన్ అడల్ట్ చిత్రాల్లో నటిస్తు యువతని తప్పుదోవ పట్టిస్తుంది. గతంలో ఆమె మీడియాతో మాట్లాడుతు, డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా చేస్తానని చెప్పిందని మార్టిన్ కోర్ట్ లో పిటిషన్ వేసాడు. అలాంటి ఈ  సమయంలో మలయాళ మూవీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ కి శ్వేతా మీనన్ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  
Coolie starring Superstar Rajinikanth, King Nagarjuna, Shruti Haasan, Soubin Shahir, Upendra, Aamir Khan released on 14th August and created a huge sensation at the box office. It collected a huge Rs.151 crores plus on Day 1 and dominated WAR 2 worldwide. Interestingly, it took charge over even in Telugu States.  On Day 2, being National Holiday, the movie maintained its collections without major dips but WAR 2 took a huge dip. On Day 3, further Coolie maintained its box office status as biggest film among both the releases. Even though WAR 2 has biggest stars like Hrithik Roshan, Jr. NTR movie could not really impress audiences.  The movie needed to deliver on huge expectations with two of the biggest stars coming together, that too, after a failure like Tiger 3, from YRF Spy Universe. The movie needed to infuse life into the Universe but it ended up being a dull film with stunts not enticing audiences to give it a try at the box office.  The Day 3 collections have further low for WAR 2 with National Chains and single screens also not performing up to the mark. Yash Raj Films is struggling to maintain the hype of the franchise after an all-time high like Pathaan. They need to revamp the story ideas, as everything looks familiar in this world.  Coolie while did not receive unanimous positive talk and reception, it is able to attract audiences to theatres as it is maintaining the momentum with star power of all the actors helping it to sustain over the weekend. While it is not going to deliver the eagerly awaited Rs.1000 crores for Tamil Cinema, it is on path to recover investments as brand value of director Lokesh Kanagaraj and composer Anirudh Ravichander is also helping it.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Pawan Kalyan delievered a huge disaster with his long in production, Hari Hara Veera Mallu. Still, his upcoming biggie OG hype has not reduced by a bit. Makers released Fire Storm song which further increased the buzz by multi-folds. Now, they have released first look poster of leading lady Priyanka Arul Mohan.   She is playing the role of Kanmani, from this upcoming action spectacle. The posters showcase a captivating contrast to the film's intense world, with one highlighting her grace and quiet resilience, while the other exudes a serene, homely vibe. The posters also take us back to her looks from blockbuster Doctor.  The makers describe her role as "the calm every storm needs," hinting at a character who will be a grounding force amidst the film's high-octane action. After a successful first song, the team is now preparing to release the second single, with a promo expected soon. Emraan Hashmi, Prakash Raj are playing other prominent roles while Sujeeth is directing it. The makers have stated that the film is shaping up to be a major cinematic event of 2025. DVV Danayya is producing the film, scheduled for a worldwide release on September 25, 2025.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తెలుగు 'బిగ్ బాస్ సీజన్ 6 'లో పాల్గొన్న ప్రముఖ నటి 'కీర్తి భట్'(Kirti Bhatt). ఈ షో ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించుకొని దాదాపుగా 'విన్నర్' అయినంత పని చేసింది. కానీ ఫైనలిస్ట్‏గా నిలిచింది. బుల్లితెరపై 'మనసిచ్చిచూడు, కార్తీక దీపం, మధురానగరి వంటి సీరియల్స్ తో నటిగా తన సత్తా చాటిన కీర్తి మరిన్ని సీరియల్స్ ద్వారా ప్రేక్షకులని తన నటనతో మెస్మరైజ్ చేయనుంది.  రీసెంట్ గా  కీర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు బిగ్‌బాస్‌ సీజన్ 6(Big boss season 6) కంప్లీట్ అయ్యాక, నిర్వాహకులు BB అవార్డ్స్‌ అనే  కార్యక్రమం చేశారు. ఫైనలిస్ట్ గా నిలిచినా నన్ను పిలవలేదు. అప్పుడు నాకు అర్ధమైంది ఏంటంటే, షోలకి వెళ్లాలంటే ఇష్టమొచ్చినట్టు మాట్లాడి కంటెంట్‌ క్రియేట్‌ చేయాలి. గ్లామరస్ గా ఉండటంతో పాటు, ఎక్స్ పోజింగ్ చేయాలి. మంచి రంగు  ఉండాలి. ఇవన్నీ ఉంటేనే షో లకి పిలుస్తారు. అవన్నీ చెయ్యడం నా వల్ల కాదని కీర్తి చెప్పుకొచ్చింది. 2017 లో జరిగిన ఒక కారు ప్రమాదంలో అమ్మ, నాన్న, అన్న, వదిన, అన్నపిల్లలు, ఇలా కుటుంబం మొత్తాన్ని కీర్తి పోగొట్టుకుంది. తను మాత్రం తీవ్రగాయాలతో, కొన్ని రోజుల పాటు కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని, తన నటన ద్వారా అభిమానులని రంజింపచేస్తున్న కీర్తికి, 2023 లో కన్నడ నటుడు విజయ్ కార్తీక్ తో ఎంగేజ్మెంట్ జరగగా, 2017 లో 'ఐస్ మహల్' అనే చిత్రం ద్వారా  కీర్తి నటనా వృత్తిలోకి ప్రవేశించింది.       
తమ వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇంకా కొనసాగుతోంది. సమస్యను పరిష్కరించేందుకు పలు మార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో పూర్తి స్థాయిలో నమ్మెను కొనసాగిస్తున్నారు కార్మికులు. ఫిలిం ఫెడరేషన్‌లో భాగమైన తెలుగు సినిమా డ్రైవర్స్‌ యూనియన్‌ నిర్మాతల పట్ల తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లను నిర్మాతలు దొంగలుగా, మాఫియాగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వారి ఆగ్రహానికి కారణమైంది.  దీనిపై డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులు మాట్లాడుతూ ‘ఒక సింగిల్‌ కాల్‌షీట్‌కు డ్రైవర్‌కు 1195 రూపాయలు ఇస్తున్నారు. మూడేళ్ళకోసారి 30 శాతం వేతనం పెంచడం వల్ల అందులో 50 శాతం నష్టపోతున్నాం. ఇంతటి మహానగరంలో జీవనం సాగించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. దాన్ని దృష్టిలోపెట్టునకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారు కనీసం 50 శాతం వేతనం పెంచాలని సూచించారు. కొందరు నిర్మాతలు మమ్మల్ని దొంగలుగా, మాఫియాగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ నిర్మాతలు చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. అలా చేయకపోతే వారి ఆఫీసుల ముందు ధర్నా చేస్తాం. మేమెంతో కష్టపడి పనిచేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మమ్మల్ని అవమానించడం కరెక్ట్‌ కాదు. దాసరి నారాయణరావుగారు ఏర్పాటు చేసిన ఈ యూనియన్‌ను విచ్ఛిన్నం చెయ్యాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు’ అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.  
సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)మరోసారి 'కూలీ'(Coolie)లో తన వన్ మాన్ షో ని ప్రదర్శించాడు. దీంతో కూలీ రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తొలిరోజు వరల్డ్ వైడ్ గా 151 కోట్ల గ్రాస్ ని సాధించి, ఎంటైర్ తమిళ చిత్రసీమలోనే, ఆ ఘనత అందుకున్న ఫస్ట్ మూవీగా నిలిచింది. రజనీ తన నట జీవితాన్ని ప్రారంభించి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, రికార్డుని నెలకొల్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.  రీసెంట్ గా ఈ విషయంపై పవన్ కళ్యాణ్(Pawan Kalyan)స్పందిస్తు సిల్వర్ స్క్రీన్ పై 'సూపర్ స్టార్ రజనీ' అని టైటిల్ పడగానే, థియేటర్ ఏ విధంగా మారుమోగుతుందో చాలా సార్లు చెన్నైలో చూశాను. తరాలు మారుతున్నా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో  ఆ ఆనందోత్సాహాలు ఏ మాత్రం తగ్గలేదు. అంతటి స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి హీరో రజనీకాంత్ గారు. నటుడిగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి.  కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా తనదైన స్టైల్ ని చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. నడకలో, డైలాగ్స్ పలకడంలో, ప్రత్యేకతని చూపిస్తారు. ఆ స్టైల్ కి నవతరం ప్రేక్షకుల్లోను అభిమానులున్నారు. మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలపై, యోగ సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆయనలో భక్తి భావాన్ని, ధార్మిక విశ్వాసాలని  తెలియచేస్తుంది. నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజనీకాంత్ గారు మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులని మెప్పించాలి. అందుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని  పవన్ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, పవన్ ఒక టాప్ హీరో అయినా రజనీ స్టైల్ గురించి ఒక అభిమానిలా చెప్పాడని పలువురు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ(Narendra Modi),ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)తో పాటు, పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఇండస్ట్రీలో రజనీ యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందలు తెలియచేసారు.      
Legendary director Ram Gopal Varma has been highly active and reactive on social media from a long time. He had been silent about Dog Lovers protest against Supreme Court's order to remove Stray Dogs from Delhi streets. This has resulted in huge protest on Delhi roads against Supreme Orders. Now, he started his campaign against them with videos of strays attacking four year olds and small children.  He started sharing videos of the dog attacks on children and the death of youngsters due to the attacks. He wrote a long note on X and blamed for lack of compassion towards young children. He stated that they are trying to talk for dogs but they lack any sort of regard for justice. They are just crying foul without understanding issue.  He called out rich people who love to grow dogs are unable to see the real problem with compassion. He remarked that Poor should not pay with their blood for rich people's love for their pedigreed pets. He called it as "sentimental indulgence of rich".  RGV wrote, "HEY DOG LOVERS, All you Dog lovers are shouting hoarse about injustice to dogs regarding the Supreme Court’s order. But where were they when a four-year-old child was brutally killed in broad daylight on the streets ..Likewise thousands get attacked every year.  Where was your compassion then? Or is compassion reserved only for those with wagging tails while dead children don’t count? And yes, there is nothing wrong with loving dogs. I love them too. But love your dogs in your own homes, in your luxury bungalows , in your manicured lawns. Love your imported Labradors, your pedigreed Huskies, your high-breed pets bought from breeders and hire staff to look after them. But the truth is this: the dog menace does not exist in your lavish villas. It prowls in the streets and slums. It stalks the alleys where the poor live, where children play barefoot, where no gates or fences protect them. While the privileged stroke their glossy pets, the powerless are left to tend to the wounded and bury their loved ones.  You talk about dog rights. Fine. But what about the child’s rights? The right to live. The right of his parents to see him grow. Do those rights vanish because you love dogs ? Do those rights matter less than your Instagram photos of you cuddling your own pedigreed pets? Here is the truth you don’t want to hear: compassion without balance is injustice . If you truly love dogs, then adopt them, feed them, and protect them in your secure homes. Or force the government to come up with solutions . But don’t burden the streets with your love , where it turns into the death of someone else’s child. The poor should not pay with their blood for the sentimental indulgence of the rich. And realise this truth that a society that values the life of a stray dog over the life of a child has already lost its humanity."  Well, the director does have a point to make and he is making it a point with the videos and campaigning hard against animal activits and lovers protest. He is continuously tweeting about the matter with videos and also wrote 10 points he wanted to make.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కింగ్ 'నాగార్జున'(Nagarjuna)ప్రస్తుతం 'కూలీ'(Coolie)తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. సైమన్ అనే  క్యారక్టర్ లో తొలిసారి నెగటివ్ రోల్ లో, స్టైలిస్ట్ లుక్ తో నటించి అభిమానులతో పాటు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసాడు. గత చిత్రం కుబేర(Kuberaa)లో కూడా 'దీపక్' అనే డిఫరెంట్  క్యారక్టర్ ని పోషించి, స్క్రీన్ ప్రెజెన్స్ చెయ్యడంలో తనకి తిరుగులేదని  నిరూపించాడు.  నాగార్జున తన నెక్స్ట్ మూవీని తమిళ దర్శకుడు 'రా కార్తీక్'(Ra Karthik)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. రా కార్తీక్ ఇప్పటి వరకు 'ఆకాశం', 'నితమ్ ఒరు వానం' వంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ ని తెరకెక్కించాడు. దీంతో నాగార్జునతో చెయ్యబోయే మూవీ ప్రత్యేకతని సంతరించుకుంది. పైగా నాగ్ నుంచి వస్తున్న 100 వ చిత్రం కావడంతో అభిమానులు, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున బర్త్ డే రోజైన అగస్ట్ 29 న ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది. మూవీలో నాగార్జున లుక్ కొత్తగా ఉండబోతుందని, సదరు లుక్ తోనే నాగార్జున చిత్ర  ప్రకటన రోజు కనిపిస్తాడనే సమాచారం కూడా సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) పై నిర్మించనున్నాడు. సుదీర్ఘ కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నపూర్ణ  బ్యానర్ కి ప్రత్యేక పేరు ఉంది. ఈ సంస్థ నుంచి  ఎన్నో హిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియో ప్రారంభించి యాభై ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ సినిమా నాగార్జున చేస్తుండటం విశేషం.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ఆచార్య చాణక్యుడు ప్రతి మనిషికి ఉపయోగపడే ఎన్నో విషయాలను చెప్పాడు. వాటిని చాణక్య నీతి అని పిలుస్తారు.  చాణక్య నీతిలో చెప్పిన ఎన్నో విషయాలు  జీవితంలోని అనేక అంశాలను ఆచరణాత్మకంగా, సరళంగా ఉంచుతాయి. మతం, న్యాయం, సంస్కృతి, పాలన, ఆర్థిక శాస్త్రం, విద్య.. మానవ సంబంధాలు.. ఇలా ఆయన చెప్పని విషయమంటూ ఏదీ లేదు.  ఆయన బ్రతికిన కాలంలో చెప్పిన ఈ విషయాలు నేటికీ అంతే ప్రాముఖ్యంగా ఉన్నాయి. తాను చెప్పిన సూత్రాలను పాటించడం ద్వారా ఎలాంటి పరిస్థితినైనా అధిగమించి విజయపథంలో ముందుకు సాగవచ్చని చాణక్యుడు విశ్వసించాడు. చాణక్య నీతిలో ఒక వ్యక్తి ఎప్పుడూ సిగ్గుపడకూడని ఐదు సందర్భాలను ఆయన ప్రస్తావించారు. ఈ విషయాలేవో తెలుసుకుంటే.. జీవితంలో ఎంతో గొప్ప మార్పు చూడవచ్చు.  ఇంతకూ చాణక్యుడు చెప్పిన ఆ ఐదు సందర్భాలేవో తెలుసుకుంటే.. ధనం, ధాన్యం లావాదేవీలు, జ్ఞానం సంపాదించడం, తినడం, పరస్పర వ్యవహారాల్లో సిగ్గుపడని వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.  ఈ ఐదు విషయాల దగ్గర మొహమాటం పడటం,  సిగ్గు పడటం మానేయాలట. దాని గురించి వివరణ కూడా ఇచ్చారు.. మీరు ఎప్పుడూ సిగ్గుపడకూడని 5 విషయాలు ధనం, ఆహార లావాదేవీలు.. డబ్బు, ధాన్యం విషయంలో సంకోచించకూడదట.  లావాదేవీల్లో సంకోచం ప్రదర్శిస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి అడగడం..  ఎవరికైనా ఇచ్చిన డబ్బును అడగడానికి సిగ్గుపడటం వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని  చాణక్యుడు చెబుతాడు.  ఇలా మొహమాటానికి, సిగ్గుకు పోతే  దగ్గర డబ్బు కొరత ఏర్పడి చివరికి ఏమీ లేని వ్యక్తిగా మారతాడట. జ్ఞానం.. చాణక్యుడి ప్రకారం విద్యను పొందేటప్పుడు ప్రశ్నలు అడగడానికి సంకోచించడం జ్ఞానం సంపాదించడంలో ఆటంకం కలిగిస్తుందట.  నేర్చుకోవడం అనే ప్రక్రియను  అసంపూర్ణంగా చేస్తుందట.  టీచర్ ని నిర్భయంగా ప్రశ్నలు అడగాలి, సందేహ నివృత్తి చేసుకోవాలి అంటున్నారు. అలా చేస్తేనే అభ్యసనం సంపూర్ణంగా ఉంటుంది. జ్ఞానార్జన కూడా సజావుగా జరుగుతుంది.   ఆహారం తినడం.. ఆచార్య చాణక్యుడి ప్రకారం తినడానికి సంకోచించిస్తే కడుపు నింపుకోలేరు. ఎప్పటికీ ఆకలితో ఉన్నట్లేనట. అవసరమైనప్పుడు అంటే ఆకలి వేసినప్పుడు ,  ఎక్కడైనా మంచి భోజనం చేసే అవకాశం వచ్చినప్పుడు మొహమాటం లేకుండా   తినాలట. ఇది మనిషిని సంతోషంగా ఉంచుతుందట. సంభాషణ,  ప్రవర్తన..  చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు పరస్పర కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం,  సంబంధాలలో సంకోచం ఉండటం వల్ల  సంబంధాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు. స్పష్టంగా, మర్యాదగా,  ఓపెన్ గా మాట్లాడటం,  ఓపెన్ గా అభిప్రాయాలు చెప్పడం,  ఇతరులు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని వాటిని స్వీకరించడం   వల్ల  సంబంధాలు బలంగా ఉంటాయట.                           *రూపశ్రీ.
  మన దేశ గుర్తింపు భారతదేశ జాతీయ జెండా. దీనికి మూడు రంగులు ఉన్నాయి కాబట్టి దీనిని త్రివర్ణ పతాకం అని పిలుస్తారు. ఇది దేశ ఐక్యత, గర్వం,  త్యాగానికి చిహ్నం. స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పండుగలు,  కార్యక్రమాలలో జెండా ఎగురవేయడం జరుగుతుంది. ఆగస్టు 15, జనవరి26 వంటి  ప్రత్యేక సందర్భాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు, "భారత జెండా కోడ్"లో నిర్దేశించబడిన కొన్ని నియమాలను పాటించడం అవసరం. జెండా  ఎగురవేయడానికి ప్రభుత్వం  పాటించే  నియమాలను తెలుసుకుంటే.. భారత జాతీయ జెండా ఎలా ఉంటుంది? భారత జాతీయ జెండా మూడు రంగులలో ఉంటుంది. త్రివర్ణ పతాకం పైభాగంలో ముదురు కాషాయ రంగు ఉంటుంది, ఇది ధైర్యం,  త్యాగానికి చిహ్నం. మధ్యలో ఉన్న తెలుపు రంగు శాంతి,  సత్యానికి చిహ్నం.  దిగువన ఉన్న ఆకుపచ్చ రంగు విశ్వాసం,  సస్యశ్యామలతకు  చిహ్నం. మధ్యలో 24 చువ్వలు కలిగిన ముదురు నీలం అశోక చక్రం ఉంటుంది. జెండా ఎగురవేయడానికి నియమాలు, నిబంధనలు.. జెండాను ఎగురవేసేటప్పుడు సగం ఎత్తులో ఎగురవేయకూడదు. ఆదేశాలు లేకుండా త్రివర్ణ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేయకూడదు. జాతీయ జెండాలో ఎటువంటి చిత్రం, పెయింటింగ్ లేదా ఛాయాచిత్రం ఉపయోగించకూడదు. చెరిగిన,  మురికిగా ఉన్న జెండాలను ఎగురవేయకూడదు. జెండాను ఏ విధంగానూ తారుమారు చేయకూడదు. ఎవరికైనా సెల్యూట్ చేయడానికి త్రివర్ణ పతాకాన్ని అవనతం చేయకూడదు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో మాత్రమే జెండా ఎగురవేయాలి. సూర్యాస్తమయం తర్వాత త్రివర్ణ పతాకాన్ని దించాలి. త్రివర్ణ పతాకాన్ని ఎల్లప్పుడూ స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ఎగురవేయాలి. జెండా ఎగురవేసే సమయం స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉదయం 8:30 గంటలకు ప్రధానమంత్రి ఎర్రకోట వద్ద జెండాను ఎగురవేస్తారు. సాధారణ పౌరులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు. జెండా కోడ్‌ను ఎందుకు పాటించాలి? జెండాను గౌరవించడం దేశ గౌరవానికి చిహ్నం. నియమాలను పాటించడం ద్వారా మన జాతీయ జెండా గౌరవాన్ని కాపాడుకుంటాము. జెండా ఎగురవేయడం అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జెండా ఎగురవేయడం జరుగుతుంది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, బ్రిటిష్ పాలకుల జెండాను తొలగించి, త్రివర్ణ పతాకాన్ని కింది నుండి పైకి లాగి ఎగురవేశారు. దీనిని జెండా ఎగురవేయడం అంటారు. ప్రతి సంవత్సరం దేశ ప్రధానమంత్రి ఎర్రకోట ప్రాకారాల నుండి జెండాను ఎగురవేస్తారు. దీనిలో జెండాను తాడు సహాయంతో కింది నుండి పైకి లాగుతారు. జెండా ఎగురవేయడం అనేది కొత్త దేశం యొక్క ఆవిర్భావానికి చిహ్నం. జెండా ఎగురవేయడంలో రెండవ పద్దతి.. ఆగస్టు 15న జెండా ఎగురవేస్తే, జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ రోజున జెండా ఇప్పటికే కట్టబడి ఉంటుంది. జనవరి 26న, రాష్ట్రపతి రాజ్‌పథ్‌పై జెండాను ఎగురవేస్తారు. ఈ రెండింటి మధ్య తేడాలు చాలామందికి తెలియవు.                                           *రూపశ్రీ.
భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం ను జరుపుకుంటుంది . 2025లో ఇది శుక్రవారం నాడు వస్తుంది.  ఆగస్టు 15, 1947న 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశం విముక్తి పొందినందుకు గుర్తుగా స్వాతంత్ర్యదినోత్సవంను  జరుపుకుంటారు.  స్వాతంత్ర్యదినోత్సవం అనేది దేశమంతా కలిసి జరుపుకునే పండుగ. భారతీయులు ఈ రోజును చాలా  ఉత్సాహంగా జరుపుకుంటారు, విద్యాసంస్థలు, కార్యాలయాలు,  ప్రభుత్వ సంస్థలు జెండా ఎగురవేయడం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం మొదలైనవి చాలా గొప్పగా చేస్తాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 2025 78వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 79వ స్వాతంత్ర్య దినోత్సవమా అనే దానిపై గందరగోళం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు,  విద్యాసంస్థలు, వివిధ కార్యాలయాలలో ఇది చాలా గందరగోళం ఏర్పరుస్తుంది.  ముఖ్యంగా ఉపన్యాసాలు,  వక్తృత్వ పోటీలలో ఈ అంశాన్ని ప్రస్తావించే విషయంలో చాలా అయోమయానికి గురవుతూ ఉంటారు. దీనికి చెక్ పెట్టేందుకు.. అలాగే ప్రతి ఏడాది స్వాతంత్ర్యదినోత్సవం నాడు దేశ ప్రభుత్వం ఒక థీమ్ ప్రకటించి దాని లక్ష్యసాధన దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. ఈ ఏడాది థీమ్ ఏంటనేది కూడా తెలుసుకుంటే.. చాలా మంది 1947 (భారతదేశం బ్రిటిష్ వలసవాదుల నుండి స్వాతంత్ర్యం పొందిన సంవత్సరం) ను 2025 నుండి తీసివేస్తారు. దీని వల్ల  78 వస్తుంది. ఈ కారణంగా గందరగోళం తలెత్తుతుంది. వారు మొదటి వేడుకను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఈ తప్పు జరుగుతుంది. కాబట్టి సరైన మార్గం ఆగస్టు 15, 1947 - భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజు - మొదటి స్వాతంత్ర్య దినోత్సవంగా లెక్కించడం. కాబట్టి, 2025 భారతదేశ స్వాతంత్ర్య వేడుక 79వ సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత ప్రభుత్వం ఇంకా అధికారిక థీమ్ ను ప్రకటించలేదు. ప్రతి సంవత్సరం, ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ థీమ్ ను  ఐక్యత, దేశభక్తి, సామాజిక పురోగతి,  భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల సహకారాలపై కేంద్రీకరిస్తుంది. ఈ సంవత్సరం థీమ్ జాతీయ అభివృద్ధి,  సమిష్టి బాధ్యతపై ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి విలువలను అనుసరిస్తుందని భావిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ ప్రజలకు మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను,  వారి విలువలను నిలబెట్టుకోవడాన్ని గుర్తుచేస్తాయి కాబట్టి అవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశం అంతటా వేడుకలు జరుపుకుంటారు, రాష్ట్ర రాజధానులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు,  సంఘాలు జెండా ఎగురవేయడం,  కవాతులు,  సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తాయి. ప్రధానమంత్రికి సాయుధ దళాలు,  ఢిల్లీ పోలీసులు గౌరవ వందనం సమర్పించడంతో అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జాతీయ గీతం,  21 తుపాకీల వందనంతో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపిస్తాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేస్తారు.                                 *రూపశ్రీ.
  ఎవరి ఇంటికైనా వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదని అంటారు.  అందుకే చాలామంది పండ్లు తీసుకెళతారు. ఇలా తీసుకెళ్లే పండ్లలో అరటికే ప్రథమ స్థానం ఉంటుంది.  కేవలం ఇలా తీసుకెళ్లడమే కాదు.. ఏ పూజ అయినా, శుభకార్యం అయినా అరటిపండ్లకే ఓటేస్తారు.  రోజుకొక అరటిపండు తినాలని చాలామంది ట్రై చేస్తారు. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతారు.  అరటిపండ్లు ధర కూడా చాలా తక్కువ. అయితే అరటిపండ్లు చవగ్గా లభిస్తాయని,  అందరికి అందుబాటులో ఉంటాయని చాలా  చులకనగా చూస్తారేమో.. కానీ అరటిపండ్లు తింటే కలిగే లాభాలు తెలిస్తే  షాకవుతారు. అరటి పండు చాలా చవకగా లభించే పండు. కానీ ఒక అరటిపండు తిన్నారంటే దాదాపు గంటకు పైగా ఆకలిని భరించవచ్చు. పైగా ఇందులో పోషకాలు శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి. అందుకే వ్యాయామం చేసేవారు,  జిమ్ చేసేవారు అరటిపండును వ్యాయామానికి ముందు లేదా తరువాత తప్పకుండా తీసుకుంటారు. అరటిపండు లో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు రోగులకు అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. అరటిపండును చిన్న పెద్ద ఎవ్వరైనా తినగలుగుతారు.  వృద్దులకు, దంతాలు లేని వారికి కూడా అరటి ఎంచుకోదగిన పండు.  అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నీరసంగా అనిపించినప్పుడు ఒక్క అరటిపండు తిన్నారంటే శరీరానికి తక్షణ  శక్తి లభిస్తుంది.  అరటిపండులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ ఉంటాయి.  ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. అలసటగా అనిపించినప్పుడు అరటిపండు తినడం ప్రయోజనకరంగా భావించడానికి ఇదే కారణం. అంతేకాదు..  అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అరటిపండు తీసుకోమని చెబుతుంటారు.  అది కూడా శరీరానికి శక్తి లభించాలనే.. అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది గుండెపోటు,  స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది . నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు అరటిపండు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందట. అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.                                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  వయసు పెరిగే కొద్దీ  ఎముకలు పెళుసుగా,  బలహీనంగా మారతాయి. అయితే అనుసరించే జీవనశైలి,  అలవాట్లు బలమైన ఎముకలకు,  శరీరం  సాఫీగా కదలడానికి దోహదం చేస్తాయి. చాలా మంది మోకాళ్ సమస్య వచ్చేవరకు మోకాళ్ల గురించి అస్సలు ఆలోచించరు. కానీ శరీర బరువును మోసేవి కాళ్లు. ఆ భారం ఎక్కువగా మోకాళ్ల మీద ఉంటుంది. అందుకే ఒక వయసు దాటగానే మోకాళ్లు నొప్పులు రావడం,  లేక ఇతర మోకాళ్ల సంబంధ సమస్యలు రావడం జరుగుతుంది.  అయితే మోకాళ్లను సంవత్సరాల తరబడి ఎలాంటి సమస్యలు చట్టు ముట్టకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. ఇవన్నీ లైప్ స్టైల్ అలవాట్లలో భాగమే.. అవేంటో తెలుసుకుంటే.. బరువు.. కొంచెం అదనపు బరువు ఉన్నా అది  మోకాళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి అడుగుతో  శరీర బరువుకు నాలుగు రెట్లు ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వల్ల ఈ ఒత్తిడి తగ్గుతుంది.  దీర్ఘకాలిక గాయం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. మూవ్ మెంట్.. తరచుగా కదలికలు చేయడం వల్ల  మోకాళ్లను సరళంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు  కీళ్ళు కూడా  మంచి స్థితిలో ఉంటాయి. నడక, ఈత, సైక్లింగ్ లేదా యోగా వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు మోకాళ్లకు సున్నితంగా  ఉంటాయి. మోకాళ్ల మీద ఒత్తిడి ఉండదు.  కానీ మోకాళ్లను  బలంగా మారుస్తాయి. కండరాల సపోర్ట్.. దృఢమైన కాళ్ళ కండరాలు, ముఖ్యంగా  హామ్ స్ట్రింగ్స్,  క్వాడ్స్,  మోకాళ్ల నుండి ఒత్తిడిని తగ్గిస్తాయి.  వ్యాయామ నియమావళిలో బాడీ వెయిట్ స్క్వాట్‌లు, లెగ్ రైజ్‌లను చేర్చడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇవన్నీ చేసేటప్పుడు గాయం కాకుండ ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు బిగుతుగా ఉండటం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్స్, ముఖ్యంగా  తొడలు, పిక్కలు,  తుంటిని వదులుగా,  స్ట్రయిట్ గా   ఉంచుతుంది. వ్యాయామం తర్వాత లేదా  రోజు చివరిలో వేగవంతమైన స్ట్రెచింగ్ ను  డైలీ రొటీన్ లో భాగం చేసుకోవాలి. షూస్..  నడవడం లేదా వ్యాయామం చేయడం వంటివి చేసేటప్పుడు  మంచి ఆర్చ్ సపోర్ట్,  కుషనింగ్ ఉన్న బూట్లు ధరించాలి. బాగు్నాయి కదా అని పాత షూస్ ను వర్కౌట్స్ కు సరిపడకపోయినా వేసుకుంటే ఆ తరువాత నష్టాలు ఎదురుచూడాల్సి రావచ్చు. మరొక విషయం ఏమిటంటే.. ఎక్కువసేపు హీల్స్ ధరించకూడదు. ఫోజ్ మార్చుకోవాలి.. ఫోజ్ ను భంగిమ అని కూడా  అంటారు.  సరైన భంగిమ కాకుండా వ్యాయామం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫోజ్ లు పెడుతుంటే అది   వీపును గాయపరచడమే కాకుండా,  మోకాలి అమరికను కూడా దెబ్బతీస్తుంది. నిటారుగా నిలబడాలి, నిటారుగా కూర్చోవాలి. అలాగే వ్యాయామం అయినా వాకింగ్ అయినా, యోగా అయినా వాటికి తగిన విధంగా శరీరాన్ని బ్యాలన్స్ చేయాలి. అలాగే  బరువులు ఎత్తేటప్పుడు కూడా ఫోజ్ చూసుకోవాలి.                        *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
  భారతీయులు  ఆహార ప్రియులు. భారతదేశంలో ఉండే అన్ని వంటకాలు, అన్ని పదార్థాలు మరెక్కడా లభించవని కూడా చెప్పవచ్చు. అయితే భారతదేశంలో ఎక్కువ భాగం ఆహారం నూనె వినియోగం తోనే జరుగుతుంది. నూనె లేకుండా చాలా వంటకాలను అస్సలు తయారు చేయలేరు కూడా.  నూనె భారతీయ  వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తే అది ఆరోగ్యానికి విషంగా మారుతుంది. ఆహారంలో ఎక్కువ నూనెను ఉపయోగిస్తే అది ఊబకాయం, గుండె జబ్బులు,  అనేక ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నూనెలో ఉండే అధిక కేలరీలు శరీరానికి  అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. అందుకే ఇప్పుడు  నూనె లేని ఆహారం అనే ట్రెండ్‌ని  చాలామంది అనుసరిస్తున్నారు. ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  అసలు నో ఆయిల్ డైట్ అంటే ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే.. నూనె లేని ఆహారం అంటే.. నో ఆయిల్ డైట్‌లో ఆహారంలో  నూనె పూర్తిగా తొలగించబడుతుంది. బదులుగా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్,  విత్తనాలు వంటి తృణధాన్యాలు  సహజమైనవిగా  తింటారు. వీటిలో ఇప్పటికే కొంత సహజ కొవ్వు ఉంటుంది. అది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నూనె లేని ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆహారం నుండి నూనెను పూర్తిగా తొలగించినప్పుడు బరువు తగ్గడం సులభం అవుతుంది. ఉడికించిన పప్పులు, కాల్చిన కూరగాయలు,  నూనె లేకుండా చేసిన వాటిని ఆహారంలో చేర్చడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. శుద్ధి చేసిన నూనెలో ఒమేగా-6 కొవ్వులు అధికంగా ఉంటాయి.  దీన్ని  ఆహారం నుండి తొలగిస్తే, శరీరంలో మంట తగ్గుతుంది,  కొలెస్ట్రాల్,  రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నూనె లేని ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది కడుపు, కాలేయం,  క్లోమంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గ్యాస్, ఆమ్లతత్వం,  అపానవాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ఆహారంలో నూనె వాడకపోవడం ద్వారా ముఖంపై మొటిమలు,  మచ్చలు తగ్గుతాయి. దీనితో పాటు శరీరం కూడా డీటాక్స్ అవుతుంది. ఇది ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది. నూనె పదార్థాలు తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.  ఇది తరచుగా ఆకలి, మానసిక స్థితిలో మార్పులు,  అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...