LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి అత్యంత బలమైన అనుకూల ప్రాంతంగా ఉంటూ వచ్చిన రాయలసీమలో 2024 ఎన్నికలలో ఆ పార్టీ దెబ్బతింది.  ముఖ్యంగా వైసీపీకి కొండంత అండగా నిలుస్తూ, ఆ పార్టీకి పెట్టని కోట లాంటి కడన జిల్లాలో కూడా వైసీపీ వెనుక బడింది. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని  మొత్తం పది అసెంబ్లీ స్ధానాలలో ఏడింటిని తెలుగుదేశం కూటమి కైవశం చసుకుంది.  ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వైపీనీ కడప లోక్ సభ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోగలిగింది.  అయితే ఇండియా టుడే ,  సి-వోటర్ సంయుక్తంగా నిర్వహించిన తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు కడప లోక్ సభ స్థానానికి జగన్, ఆయన పార్టీ తిలోదకాలొదిలేయడం ఖాయమని పేర్కొంది.  ఏపీలో ఇప్పుడు గనక  ఎన్నికలు జరిగితే వైసీపీ  కడప పార్లమెంట్ స్థానంలో సైతం పరాజయం పాలౌతుందని సర్వే పేర్కొంది.  ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 4 ఎంపీ స్థానాల సంఖ్య మరో స్థానం పెరిగి 5 కి చేరుకునే అవకాశం ఉందదని సర్వే పేర్కొన్నప్పటికీ, వైసీపీ కంచుకోట అయిన కడపలో ఓటమి మూటకట్టుకోవడం ఖాయమని ఇండియాటుడే సర్వే పేర్కింది,   {India Today survey, Kadapa MP seat, YCP Kadapa Lok Sabha, India Today C Voter AP survey, TDP AP Lok Sabha seats,  AP politics news, Telugu One}
వైసీపీ లో క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్లు కేవలం ప్రజాక్షేత్రంలో పరువు కాపాడుకోవడానికి వేసే ఉత్తుత్తి డ్రామాలు మాత్రమేనని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు.  పార్టీకీ, పార్టీ ప్రతిష్ఠకు తీరని నష్టం జరిగే వివాదాలలో, ఆరోపణలలో నాయకులు చిక్కుకున్నప్పుడు మాత్రమే.. ప్రజాగ్రహం నుంచి దృష్టి మళ్లించడానికి కంటి తుడుపు చర్యగా వైసీపీలో సస్పెన్షన్లు ఉంటాయని అంటున్నారు. పేరుకే సస్పెన్షన్ తప్ప ఆ నేతలకు పార్టీలో ఉన్న స్థానం, వారి హోదాలు అలాగే కొనసాగుతుంటాయి. ఇందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీలు అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్ ల ఉదంతాలే నిలువెత్తు నిదర్శనం అని చెబుతున్నారు.   అనంతబాబు విషయానికి వస్తే... తన వద్ద కారు డ్రైవర్ గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో హతమైతే, అతడి మృతదేహాన్ని తన సొంత కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేశారు ఎమ్మెల్సీఅనంతబాబు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనంతబాబు అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు బెయిలుపై బయట తిరుగుతున్నారు అది వేరే సంగతి. కాగా మృతదేహం డోర్ డెలివరీ విషయంలో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోవైసీపీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే పార్టీ నుంచి సస్పెండైనా ఆయన జగన్ పర్యటనల్లో, పార్టీ సమావేశాలలో యాక్టివ్ గా తిరుగుతూనే ఉన్నారు.  ఒక హత్య కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై శాశ్వత బహిష్కరణ లేదా శాసనమండలి సభ్యత్వ రద్దు దిశగా వైసీపీ ఎటువంటి చర్యా తీసుకోలేదు. కేవలం సస్పెన్షన్ ప్రకటనతో సరిపెట్టి చేతులు దులుపుకుంది.  ఇక దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఆయన సస్పెన్షన్ కూడా ఉత్తుత్తిదే అని పరిశీలకులు అంటున్నారు.  దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు. ఇటీవల శాసనమండలిలో వైసీపీ పక్ష సభ్యుడిగా చర్చల్లో పాల్గొని అనుచిత వ్యాఖ్యలతో మరో సారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు.  ఇలా ఉత్తుత్తి సస్పెన్షన్లతో వైసీపీ ప్రజల దృష్టిలో మరింత పలుచన అవుతోందని పరిశీలకులు అంటున్నారు.  {Token Gesture Suspenssions in YCP, MLC Anantha Babu, Duvvada Srinivas}
రాజకీయాల్లో మళ్లీ సర్వేల వేడి రాజుకుంది. మూడ్ ఆఫ్ నేషన్ పేరిట ఇటీవల ఇండియా టుడే సర్వే నిర్వహించింది. అందులో భాగంగా మూడ్ ఆప్ ఆంధ్రప్రదేశ్ సర్వే కూడా ఉంది. ఆ సర్వే ఫలితం వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఎందుకంటే.. ఇటీవలే.. వైసీపీకి  అనుకూలంగా ఉన్న ఓ సర్వేను ఆ పార్టీ తన సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందనీ, జగన్ మళ్లీ సీఎం అవుతారనీ వైసీపీ చెప్పుకుని తన భుజాలను తానే చరుచుకుని సంబరాలు చేసుకుంది. అయతే..  ఆ సర్వే కు స్పష్టమైన ఆధారాలు గానీ, విశ్వసనీయత గానీ లేవన్న అభిప్రాయం రాజకీయవర్గాలతో పాటు.. వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమైంది. అది పక్కన పెడితే..    ఇండియా టుడే  సర్వే..   ఏపీలో  ప్రస్తుతం ఉన్న  రాజకీయ పరిస్థితులుకి, ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా ఉందంటున్నారు పరిశీలకులు. ఇంతకీ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ఆంధ్ర ఏం చెప్పిందంటే.. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికిప్రజాదరణ ఇసుమంతైనా తగ్గలేదనీ, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం కూటమి మరో సారి ఘన విజయం సాధించి అధికారం చేపడుతుందనీ కుండబద్దలు కొట్టింది. అదే సమయంలో వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని పేర్కొంది.   ఆ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం పాతిక లోక్ సభ స్థానాలలో  తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.  రాష్ట్ర ప్రజలలో  తెలుగుదేశం కూటమి నాయకత్వంపై ఇసుమంతైనా నమ్మకం సడలలేదని సర్వేఫలితం పేర్కొంది.  తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లయినప్పటికీ.. ఆ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న సానుకూలత చెక్కు చెదరలేదని ఇండియా టుడే.. సీవోటర్ సర్వే విస్పష్టంగా తేల్చి చెప్పింది.    ఇక వైసీపీ విషయానికి వస్తే.. ఆ సర్వే మేరకు ఆ పార్టీ గ్రాఫ్ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పెరగలేదు సరికదా మరింత కిందకు దిగజారింది.  గత ఎన్నికల్లో 4 లోక్‌సభ స్థానాలకే పరిమితమైన వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అంతకు మించి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది.   రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి పాలన పట్ల ప్రజలలో  పూర్తిస్థాయి విశ్వాసం కనిపిస్తోందన్నది సర్వే సారాంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, అమరావతి, పోలవరం పనులను పరుగులు పెట్టించడం, అలాగే..  వైసీపీ  హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునఃప్రారంభించి ముందుకు తీసుకెళ్లడం  ప్రజల్లో చంద్రబాబు సర్కార్ పట్ల సానుకూలతను పెంచిందని సర్వే ఫలితం చెబుతోంది.    {Mood of AP. Andhra Pradesh Political Survey, India Today Mood of the Nation AP,  YCP MP Seats, Chandrababu  Governance}  
తెలంగాణ రాజకీయాల్లో  సంచలనం... మజ్లీస్ పార్టీ  అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సొంత పార్టీ ఎమ్మెల్సీనే పార్టీ నుంచి సస్సెండ్ చేశారు. ఏఐఎమ్ఐఎమ్ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి  సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.  .ఇటీవలి కాలంలో హిజాబ్ వ్యవహారానికి సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బాహాటంగానే  అసంతృప్తి అసహనం వ్యక్తి చేసిన సంగతి విదితమే.   మహిళల ఆత్మగౌరవాన్ని ప్రస్తావిస్తూ, ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని ప్రకటనలుచేశారు. పలు వేదికలపై మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి మాట్లాడారు. అయితే అదే సమయంలో..  సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు. ముఖ్యంగా మహిళా సంక్షేమం, గౌరవం గురించి  రహమత్ బేగ్ వ్యవహారంపై పార్టీకి స్పష్టమైన ఆధారాలు లభించడంతోనే అధినేత ఓవైసీ ఈ   చర్య తీసుకున్నారని మజ్లిస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఇమేజ్‌కు భంగం కలిగించే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదన్న స్పష్టమైన సందేశాన్నీ, సంకేతాన్ని అసదుద్దీన్ ఈ సస్పెన్షన్ వేటు ద్వారా ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.     {AIMIM MLC Suspended, Asaduddin Owaisi, Mirza Rahmath Baig,  Hyderabad AIMIM Controversy, AIMIM Action on MLC, Telugu One}
  వైసీపీలో  ఆ పార్టీ అధినేత జగన్ కు  సన్నిహితుడిగా  గుర్తింపు పొందిన నెల్లూరు ఫైర్‌బ్రాండ్ లీడర్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.   తాను భవిష్యత్తులో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిచే అవకాశాలు లేవనీ,  తన రాజకీయ ప్రయాణం అకాలంగా లేదా త్వరలోనే ముగిసిపోయినా  తనకు ఎలాంటి రిగ్రెట్ ఉండదనీ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. నెల్లూరు రాజకీయంలో తనకంటూ ఒక శాశ్వత ముద్ర పడిందన్న అనిల్ కుమార్ యాదవ్.., తన రాజకీయ వారసత్వం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. ఆయన అన్న'తన పొలిటికల్ కెరీర్ కు ప్రీమెచ్యూర్ ఎండ్ అన్న వ్యాఖ్యలు పొలిటికల్ రిటైర్మెంట్ నే సూచిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు  విజయం సాధించిన అనిల్ కుమార్ యాదవ్..  జగన్ కేబినెట్‌లో రెండేళ్ల పాటు మంత్రిగా  ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్‌కు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో  జగన్ చేపట్టిన టిక్కెట్ల మార్పుల ప్రక్రియలో భాగంగా,   నెల్లూరు నుంచి తప్పించి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఈ మార్పు ఆయన రాజకీయ ప్రయాణంలో కోలుకోలేని దెబ్బ తీసింది. నరసరావుపేటలో ఘోర పరాజయాన్ని చవిచూసిన నాటి నుంచి అనిల్ రాజకీయాలకు క్రమంగా దూరమవుతూ వస్తున్నారు. గతంలో పార్టీకి సంబంధించి ప్రతి విషయంలోనూ ముందుండి మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్ ఆ ఓటమి తరువాత దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో వైసీపీలో కీలక పాత్ర పోషించిన పలువురు సీనియర్ నేతలలాగే.. అనిల్ కుమార్ యాదవ్ కూడా సైలెంటైపోయారు.  ఇప్పుడు ఏకంగా రాజకీయ సన్యాసం సంకేతాలు ఇచ్చారు.    (Anil Kumar Yadav Political Retirement, YCP Leader, Former Minister, Nellore politics,  AP political updates, Telugu One)
ALSO ON TELUGUONE N E W S
The Paradise is already one of the most awaited Indian films, but the music is now becoming a major part of its hype. After Aaya Sher exploded into a global chartbuster with over 200 million views, expectations were enormous for the second single. Yesha Nagula has arrived with a completely different flavour — and appears to have matched, if not surpassed, the impact of its predecessor. The biggest strength of the song is how Anirudh Ravichander takes a popular Telangana folk sound and gives it a massive, contemporary treatment without stripping away its native character. The result is an infectious track driven by an instantly identifiable rhythm. It doesn't feel like a conventional film song trying to manufacture a mass vibe; the folk-rooted beat itself provides that energy. Kasarla Shyam has penned the lyrics, while Telangana folk singers Prabha Bangarigalla and Addula Jangireddy bring the required rawness to the vocals. On screen, Nani and Keerthy Suresh match the song's energy, with Aata Sandeep's choreography and director Srikanth Odela's visual staging turning the track into a full-scale spectacle. The song's impact was evident even before its official release. Anirudh performed Yesha Nagula live for the first time at his Dallas concert, where the massive crowd erupted to the track. Nani later joined him on stage, taking the already charged atmosphere to another level. The response has given the song an interesting trajectory even before it reaches theatres. Produced by Sudhakar Cherukuri on a massive scale, The Paradise is scheduled for a worldwide release on September 24, with the growing musical buzz adding another layer to the anticipation around Nani's next big-screen outing.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
  ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ సెప్టెంబర్ 4 న అల్లరి నరేష్ తో కలిసి  'రంభ ఊర్వశి మేనకా'  అనే మూవీతో సందడి చేయడానికి రెడీ అవుతుంది. రెడీ అవుతుండటమే కాదు మేనకా క్యారక్టర్ లో తనే కనిపిస్తుంది. మరి ఈ లెక్కన తన ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. రీసెంట్ గా ఆ చిత్ర ప్రమోషన్స్ లో విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాని హీట్ మోడ్ లో ఉంచుతున్నాయి. విష్ణుప్రియ మాట్లాడుతు ' నాకు బాయ్ ఫ్రెండ్స్ కంటే గర్ల్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ. అంతేకాకుండా నా ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్ పొందిన దాదాపు 5,000 మంది అభిమానుల్లో చాలా మంది అమ్మాయిలే ఉన్నారు. నా గర్ల్ ఫ్రెండ్స్ మరియు లేడీ ఫాలోవర్స్ నా వీడియోలను క్రమం తప్పకుండా చూస్తారు. ఎలాంటి అవుట్‌ఫిట్స్ ధరించాలి, ఎలాంటి స్టైలింగ్ ఫాలో అవ్వాలో కూడా సలహాలు ఇస్తుంటారని విష్ణు ప్రియా  చెప్పుకొచ్చింది. విష్ణు ప్రియకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ (13 లక్షల) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.  Also Read: వైరల్ న్యూస్: స్టార్ హీరోపై జయప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు వెలుగులోకి      [Vishnu priya, Rambha Urvashi Menaka, Girl friends, Bold Comments, TeluguCinemaNews, TeluguCinema,Tollywood]      
Nani participated in Anirudh Ravichander's Live Concert at Dallas and they both performed Yesha Nagula song live. In front of a huge crowd, Anirudh looked very excited and he gave a performance that kept everyone completely entertained. After Yesha Nagula performance, Nani addressed people.  He said, "There was no Anirudh before, there won't be another Anirudh after, we are lucky to be in the one and only Anirudh's era. I had a complete concert experience and it is enthralling. Chinnodu - Bakkodu - Meevodu are bringing Paradise to you. I am sure you will be thrilled to watch it on big screens."  Anirudh stated that he would like give Nani, a new title, "Sher". He stated that he is hundred percent sure that people will address him the same. He sang twice Aaya Sher for the people present at the concert. Yesha Nagula song has become the biggest attraction and the song has been digitally released.  The makers have shot it on Keerthy Suresh to make it even special and Nani did his best. Sudhakar Cherukuri is producing the film and Srikanth Odela is directing it. Kayadu Lohar, Mohan Babu, Raghav Juyal are playing prominent roles in the film releasing on 24th September worldwide.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  తెలుగు సినిమా ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే గాని జయప్రకాశ్ రెడ్డి లాంటి నటుడు తెలుగు సినిమా ఒడిలో చేరి ఉండడనే మాట తెలుగు సినిమా లవర్స్ లో వినపడుతూ ఉంటుంది. తెలుగు సినిమాపై తన ఆధిపత్యాన్ని కూడా చెలాయించిన ఈ లెజండ్రీ  నటనకి సంబంధించి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో, వస్తాయో వాటన్నిటిలో లబ్ధప్రతిష్టుడు.  గతంలో బాలకృష్ణ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మరో సారి  సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతు 'సమరసింహా రెడ్డి షూటింగ్ సమయంలో సెట్‌లో నేను అడుగుపెట్టగానే, కుర్చీలో కూర్చున్న బాలకృష్ణ గారు వెంటనే లేచి నిలబడి “గురువుగారు” అని పిలిచారు. అంత పెద్ద కుటుంబంలో పుట్టి, అంత పెద్ద స్టార్ హీరో అయినా, ఎంత ధనవంతుడైనా కూడా ఎక్కడా అహంభావం ప్రదర్శించలేదు. ఓం నమశ్శివాయ అని ఐదు సార్లు పలకరించమని చెప్పే ఆయన   తీరు బాలకృష్ణలోని నిరాడంబరత, బోళా మనస్తత్వానికి నిదర్శనం. చిన్నపిల్లవాడి మనస్తత్వం కలిగి ఉంటారు. Also Read: వైరల్ కామెంట్స్: మాతృత్వపు ప్రయాణంపై సమంత స్పందన ఇదే  తన తండ్రి నటించిన సినిమాల్లోని క్యారెక్టర్స్ , సంభాషణలు అద్భుతంగా గుర్తుంచుకుని అవలీలగా చెప్పగల హ్యూమన్ కంప్యూటర్. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనే తపన, నేర్చుకున్నది సరిగ్గా ఉందా లేదా అని తిరిగి అడిగి తెలుసుకోవడం వంటి లక్షణాలు బాలకృష్ణ గారికి ఉన్నాయని జయప్రకాశ్ రెడ్డి చెప్పుకొచ్చాడు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎవరు అనాధ, పేదోడు కాదు అనేది ఎంత నిజమో, జయప్రకాశ్ రెడ్డి గారు చనిపోలేదు అనేది అంతే నిజం.     [Jayaprakash Reddy, Balakrishna, TeluguCinemaNews, TeluguCinema,Tollywood]      
సుమంత్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి లీడ్ రోల్స్ లో వస్తున్న లేటెస్ట్ డివైన్ మిస్టరీ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి'. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. వారాహి అమ్మవారి శాపం చుట్టూ తిరిగే ఈ గ్రిప్పింగ్ కథనంలో 150 ఏళ్ల రాజవంశ రహస్యాన్ని హీరో ఎలా చేధించాడనేది ప్రధానాంశం. మహేంద్రగిరి రాజవంశానికి వారణాసి గ్రామదేవత అయిన వారాహి అమ్మవారి శాపం చుట్టుముట్టడంతో మొదలయ్యే అద్భుతమైన దైవిక థ్రిల్లర్ కథ ఇది. సుమారు 150 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ రాజకుటుంబంలో ప్రతీ తరం ఒక విచిత్రమైన, ఘోరమైన మరణాన్ని ఎదుర్కొంటోంది. ఈ చావుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి, అవి నిజంగానే అమ్మవారి ఆగ్రహం వల్ల జరుగుతున్నాయా లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే పాయింట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను నింపుతుంది.  హీరోగా సుమంత్ ఈ రహస్యాన్ని ఛేదించడానికి సిద్ధపడగా, అతనికి ఎదురయ్యే సవాళ్లు, వారాహి దేవి ఉగ్రరూపం, మహేంద్రగిరి సంస్థానం చుట్టూ ఉన్న గూఢమైన మిస్టరీ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. దర్శకుడు సంతోష్ జాగర్లమూడి ఈ కథను ఎంతో ఆధ్యాత్మికంగా, అదే సమయంలో గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలిచారు. అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసింది, అలాగే ప్రతాప్ ఆర్ కృష్ణ విజువల్స్ పవిత్రమైన వారణాసి ఘాట్‌ల నుండి గూఢమైన రాజభవనం వరకు ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతంగా చూపించాయి.  సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం, దైవిక అంశాలతో కూడిన మిస్టరీ థ్రిల్లర్లను ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప అనుభూతిని అందించనుంది.         [Mahendragiri Varahi Trailer, Sumanth, Aishwarya Rajesh, Siddhu Jonnalagadda, Santhosh Jagarlapudi, Telugu Devotional Movie, Telugu Cinema News, Telugu News]  
  సమంత సినీ ప్రస్థానం గురించి అందరకి తెలిసిందే. హీరోయిన్స్ కి కూడా లాంగ్ జర్నీ ఉంటుందని నిరూపిస్తూ కేవలం తన కట్ అవుట్ తోనే రీసెంట్ గా 'మా ఇంటి బంగారం'తో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రస్తుతం తను మాతృత్వ ఘడియల్లో ఉంది. ఈ నేపథ్యంలో  తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో "కొత్త తల్లులు, మీ ప్రయాణం ఎలా సాగుతోంది?" అంటూ ప్రత్యేకంగా ఒక 'ఆస్క్ మీ ఎనీథింగ్' (AMA) సెషన్‌ నిర్వహించారు. ఈ సంభాషణలో పలువురు అభిమానులు గర్భధారణ సమయంలో ఎదురయ్యే శారీరక, మానసిక మార్పుల గురించి మాట్లాడగా, ఒక ఆడ అభిమాని సమంతతో 'ప్రెగ్నెన్సీ వల్ల నేను బరువు పెరుగుతున్నానని చెప్పింది. దానికి సమంత ఎంతో హుందాగా, సరదాగా స్పందిస్తూ 'నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకోగలను, నేను కూడా ఈ ప్రెగ్నెన్సీ ప్రయాణంలో ఇప్పటివరకు ఏకంగా 11 కిలోల బరువు పెరిగాను. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో వచ్చే శారీరక మార్పులను చూసి భయపడకూడదు. ఈ మార్పులన్నింటినీ  మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఆస్వాదిస్తున్నాను. ఈ ప్రక్రియ వల్ల  మునుపెన్నడూ లేనంతగా మానసికంగా, శారీరకంగా బలపడ్డానని సమంత భావోద్వేగంగా సమంత చెప్పుకొచ్చింది.  ToXic: అభిమానుల గోల: గంటకి ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయంటే      [Samantha, Maa Inti Bangaram, Pregency, TeluguCinemaNews, TeluguCinema,Tollywood]  
మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు శివ నిర్వాణ తీసిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఎమోషనల్ థ్రిల్లర్‌గా వచ్చి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడమే కాకుండా, శివ నిర్వాణ మేకింగ్ సత్తాను మరోసారి చాటిచెప్పింది ఈ చిత్రం. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సినిమాల తర్వాత 'ఇరుముడి' అందించిన భారీ విజయంతో ఇప్పుడు శివ నిర్వాణ పేరు సౌత్ ఇండియాలోనే హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ సినిమా చూసిన తర్వాత ఒక సౌత్ స్టార్ ప్రత్యేకంగా స్పందించడమే కాదు.. డైరెక్ట్ తెలుగు సినిమా కోసం ఏకంగా చర్చలు కూడా మొదలుపెట్టేశారు. ఆ హీరో మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్య.  'కరుప్పు', 'విశ్వనాథ్ & సన్స్' సినిమాలతో రెండు వరుస విజయాలను అందుకొని జోష్ లో ఉన్న సూర్య.. శివ నిర్వాణ టాలెంటెడ్ కి ఫిదా అయిపోయారట. 'ఇరుముడి'లో ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ శివ నిర్వాణ ఎంత బ్యాలెన్స్ చేశారో చూసి సూర్య ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు, "నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక సాలిడ్ స్ట్రెయిట్ తెలుగు స్క్రిప్ట్ సిద్ధం చెయ్.. కలిసి పనిచేద్దాం" అని సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. Also Read: కింగ్ 100: ఐడెంటిటీ కోసమే ఇదంతా.. బాలకృష్ణకు పోటీగా నాగార్జున.! సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆ మార్కెట్ ను మరింత పెంచుకునే పనిలో ఉన్నారు. రీసెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో 'విశ్వనాథ్ & సన్స్' చేసినప్పటికీ, అది తమిళ్ లోనే తెరకెక్కింది. అయితే ఈసారి మాత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలోనే శివ నిర్వాణతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  సూర్య లాంటి ఇంటెన్స్ యాక్టర్.. శివ నిర్వాణ లాంటి ఎమోషనల్ డైరెక్టర్ తో జతకడితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పొచ్చు.          [Ravi Teja, Irumudi Movie, Shiva Nirvana, Suriya, Telugu Movie, Vishwanath and Sons, Telugu Cinema News, Tollywood, Telugu News]  
    ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగంలో కేవలం కేజిఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన హీరో యష్. ప్రస్తుతం టాక్సిక్ తో సందడి చేస్తున్నాడు. ఇరవై ఆరున వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అవ్వగా తెలుగుతో పాటు చాలా చోట్ల తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.  కానీ బుక్ మై షో లో మాత్రం ఇండియా వైడ్ గా ఆల్ లాంగ్వేజెస్ గంటకి 12 .07 k టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో కే జి ఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో  యష్ ని అభిమానించడం మొదలుపెట్టిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ పిక్స్ ని పోస్ట్ చేసి సినిమా బాగోకపోతే ఈ విధంగా ఎలా బుక్ అవుతున్నాయని హంగామా చేస్తున్నారు. Also read:  అందుకే కింగ్ అనేది.. హ్యాపీ బర్త్ డే నాగార్జున   బుకింగ్స్ యొక్క ఫిగర్ సెకను సెకనుకి పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 220 కొలత గ్రాస్ తో ఉన్నట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి.     [yash, Toxic,Bookmyshow, Tickets, TeluguCinemaNews, TeluguCinema,Tollywood]                  
అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'KING 100' అఫీషియల్ గ్లింప్స్ విడుదలైంది. రా కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేడు(ఆగష్టు 29) నాగార్జున పుట్టినరోజు సందర్భంగా 'కింగ్ 100' గ్లింప్స్ రిలీజ్ చేశారు. నాగార్జున పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమైంది.  "మనుషుల్లో రెండు రకాలు. డబ్బున్నోళ్లు, డబ్బు లేనోళ్లు. డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు. డబ్బు ఉన్నప్పుడు కింగ్ అంటున్నారు. ఆ ఐడెంటిటీ అనేది డబ్బు కంటే పవర్ ఫుల్. అందుకే ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవడం కోసం నేను పరిగెడుతూనే ఉన్నాను" అంటూ నాగ్ చెప్పే డైలాగ్ సినిమాలోని డెప్త్‌ని తెలియజేస్తోంది. నాగార్జున స్క్రీన్ ప్రజెన్స్, వింటేజ్ విజువల్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ తో..  'కింగ్ 100' గ్లింప్స్ ఎంతో స్టైలిష్ గా ఉంది.  నాగ్ తన 100వ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారని గ్లింప్స్ తో అర్థమవుతోంది. Also Read: నాగార్జున టాప్ 10 మూవీస్ ఇవే! ఇక ఈ 'కింగ్ 100' సినిమాను క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'NBK111' కూడా డిసెంబర్ 24న విడుదల కానున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే డేట్ పై 'కింగ్ 100' కర్చీఫ్ వేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ క్రిస్మస్ కి బాలకృష్ణ, నాగార్జున బాక్సాఫీస్ వార్ కి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.       [Akkineni Nagarjuna, King 100, Birthday Glimpse, Nandamuri Balakrishna, NBK111 Movie, Release Date, Telugu Cinema, Telugu News, Tollywood]  
  ప్రపంచ చలన చిత్ర చరిత్రలో హీరో క్యారక్టరయిజేషన్ కి సంబంధించి కింగ్ నాగార్జున చూపించిన వేరియేషన్స్ మరో హీరో చూపించలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి లవ్, ఎమోషనల్, మాఫియా, రొమాన్స్, కమర్షియల్, ఫ్యామిలీ, ఎంటర్ టైన్ మెంట్, భక్తి రస చిత్రాల్లో తనదైన హవా చాలా బలంగా చాటి చెప్పాడు. ప్రొడ్యూసర్ గా  కూడా తెలుగు సినిమా ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. మరి ఈ ట్రాక్ రికార్డు వరల్డ్ సినిమా హిస్టరీలో ఇంకొకరికి ఉండటం అసాధ్యం.     అందుకే అభిమానులు తెలుగు సినిమా కింగ్ గా పిలుచుకుంటారు. తెలుగు సినిమాని పాన్ ఇండియాకి మూడు దశాబ్దాల క్రితమే పరిచయం చేసిన ఈ మన్మధుడు 'గ్లామర్, ప్రయోగం, విజయం' అనే మూడు మహత్తరమైన పదాల పుట్టుకకి ఆద్యుడు కూడా  ఆగస్టు 29, 1959న జన్మించిన నాగార్జున, 1986లో వచ్చిన 'విక్రమ్' సినిమాతో కథానాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదటి సినిమాతోనే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ప్లాప్స్ ఎదుర్కొని  'మజ్ను', 'ఆఖరి పోరాటం', 'జానకి రాముడు' వంటి వరుస హిట్లతో లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా టాలీవుడ్‌లో తన ముద్ర వేశారు.  తెలుగు సినిమా చరిత్రను 'శివ'కు ముందు, 'శివ'కు తర్వాత అని విభజించేంత గొప్ప సంచలనాన్ని 1989లో సృష్టించాడు.  సైకిల్ చైన్ పట్టుకున్న సీన్ తోనే ఎంటైర్  భారతీయ సినిమా ట్రెండ్‌ ని మార్చివేసాడు. అదే ఏడాది వచ్చిన మణిరత్నం 'గీతాంజలి' క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచి, జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. కమర్షియల్ మాస్ సినిమాలతో పాటు ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే నాగ్, 'హలో బ్రదర్', 'అల్లరి అల్లుడు', 'నిన్నే పెళ్లాడతా', 'మన్మథుడు' వంటి చిత్రాలతో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ని  విపరీతంగా అలరించారు. Also Read: నారాలోకేష్ దగ్గరకి ఇరుముడి పంచాయితీ.. వందల థియేటర్స్ పెంపు    కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా, భక్తిరస చిత్రాల్లో నటించి మెప్పించడం నాగార్జునకే చెల్లింది. 1997లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'అన్నమయ్య' చిత్రం నాగార్జున కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రానికి గాను ఆయనకు జాతీయ చలనచిత్ర ప్రత్యేక పురస్కారం (National Film Award - Special Mention) మరియు నంది ఉత్తమ నటుడి అవార్డు లభించాయి. ఆ తర్వాత 'శ్రీరామదాసు' (2006), 'షిర్డీ సాయి' (2012), 'ఓం నమో వేంకటేశాయ' (2017) వంటి భక్తిరస చిత్రాలతో భక్తుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.  నటుడిగానే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, నిర్మాతగా కూడా నాగార్జున ఎన్నో సంచలన విజయాలను అందించారు. 'సిసింద్రీ', 'నిన్నే పెళ్లాడతా', 'మాస్', 'మనం', 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి చిత్రాలను నిర్మించి బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టారు. ఇప్పటివరకు తన సినీ ప్రస్థానంలో 9 నంది పురస్కారాలు, 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మరియు 2 జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకోవడం ఆయన నటనా పటిమకు నిదర్శనం. ఇప్పటి వరకు 99 చిత్రాల్లో హీరోగా మెప్పించిన నాగార్జున, ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 100వ సినిమా (King 100) సిద్ధం చేస్తూ టాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. మరి నాగార్జునకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అభిమానులని మరిన్ని సంవత్సరాల పాటు తన సినిమాకి రెండు రోజుల ముందు నుంచే బ్యానర్స్ కట్టి థియేటర్స్ లోనే స్టే చేసే భాగ్యాన్ని అందివ్వాలని కోరుకుందాం.        [Nagarjuna, King100, Nag, TeluguCinemaNews, TeluguCinema,Tollywood]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఇంట్లో ఇనా బయటకు వెళ్ళినప్పుడు అయినప్పుడు అయినా దాహం వేయగానే మొదట నీరు తాగుతారు. వర్షాకాలంలో అయితే బయటకు వెళ్ళినప్పుడు నీరు తాగడం తక్కువే అయినా ప్రయాణాల్లో, ఏదైనా ఆహారం తిన్నప్పుడో తప్పనిసరిగా కొన్నిసార్లు బయట నీరు తాగాల్సి వస్తుంది. వర్షాకాలంలో దాహం వేసినప్పుడు బయట దొరికే నీటిని తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు నీటి ద్వారా వేగంగా వ్యాపిస్తాయి. అందువల్ల ఈ కాలంలో తాగే నీటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో బయటి నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే.. మురుగు నీరు కలవడం.. వర్షాల వల్ల బయట డ్రైనేజీ వ్యవస్థలు పొంగిపొర్లుతాయి. పైప్‌లైన్లలో లీకేజీల వల్ల తాగునీటిలో మురుగు నీరు కలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బయట హోటళ్లు, రోడ్డు పక్కన బండ్ల వద్ద ఇచ్చే నీరు ఇలా కలుషితమైనదే అయి ఉండవచ్చు. ప్రమాదకర వ్యాధులు.. కలుషిత నీటిని తాగడం వల్ల కలరా, టైఫాయిడ్, కామెర్లుగా పిలుచుకునే  జాండీస్, గ్యాస్ట్రోఎంటరైటిస్, విరేచనాలు వంటి నీటి ద్వారా వ్యాపించే తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఐస్ క్యూబ్స్ తో జాగ్రత్త..  చాలామంది బయట పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేయించుకుంటారు. కానీ ఆ ఐస్ తయారీకి ఏ నీటిని వాడారో తెలియదు. తరచుగా పరిశుభ్రంగా లేని నీటితోనే ఐస్ తయారు చేస్తారు కాబట్టి బయట తాగే పానీయాల్లో ఐస్ తీసుకోకపోవడమే మంచిది. ఫిల్టర్ నీరు అని నమ్మకండి.. బయట బోర్డు మీద ఫిల్టర్ వాటర్ అని రాసి ఉన్నంత మాత్రాన అది పూర్తిగా సురక్షితం కాకపోవచ్చు. నీటిని శుభ్రం చేసే యంత్రాల నిర్వహణ సరిగ్గా లేకపోయినా అందులో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ ఇంట్లో కాచి చల్లార్చిన నీటిని  బాటిల్ లో వెంట తీసుకెళ్లడం చాలా మంచిది.  ఒకవేళ బయట నీరు తాగాల్సి వస్తే, నాణ్యమైన సీల్ చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. 10,20 ఖర్చు ఎందుకని ఎక్కడంటే అక్కడ నీరు తాగితే.. ఆ తర్వాత హాస్పిటల్స్ కోసం వందలు, వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వాటర్ బాటిల్ వన్ ముందు.. బాటిల్ సీల్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. హోటళ్ళు లేదా రెస్టారెంట్లలో నీరు తాగాల్సి వస్తే వేడి నీటిని ఇమ్మని అడగడం మంచిది. వర్షాకాలంలో ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ఆసుపత్రి పాలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి బయట దొరికే సాధారణ నీటిని తాగే పొరపాటు అస్సలు చేయకూడదు.                      *రూపశ్రీ.
జ్ఞానాన్ని సేకరించండి.. అదే మీ అసలైన ఆయుధం..! మనిషి జీవితంలో సంపద కంటే విలువైనది జ్ఞానం. చాణక్య నీతి ప్రకారం జ్ఞానం మనకు ఎప్పటికీ తోడుగా ఉండే శక్తివంతమైన ఆయుధం. సంపదను కోల్పోవచ్చు, కానీ మనం సంపాదించిన జ్ఞానాన్ని ఎవరూ దోచుకోలేరు. అందుకే ప్రతి ఒక్కరూ జీవితాంతం జ్ఞానాన్ని సేకరిస్తూనే ఉండాలి. మనం చదివే ప్రతి పుస్తకం, తెలుసుకునే ప్రతి కొత్త విషయం మన ఆలోచనా శక్తిని పెంచుతుంది. అలాగే మనం ఎదుర్కొనే ప్రతి అనుభవం కూడా ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఇతరులు చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడం ద్వారా కూడా మన జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను చూసి భయపడడు, వాటికి కారణాలను అర్థం చేసుకుని సరైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తాడు. అందుకే జ్ఞానవంతుడికి కష్టాలు కూడా అవకాశాలుగా మారతాయి. కేవలం పుస్తకాలు చదవడమే జ్ఞానం కాదు, నేర్చుకున్న విషయాలను జీవితంలో ఆచరించడం కూడా ఎంతో ముఖ్యం. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి మనలో ఉండాలి. ప్రశ్నించడం, పరిశీలించడం, ఆలోచించడం ద్వారా జ్ఞానం మరింత పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ మనలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తిని జ్ఞానం అందిస్తుంది. కష్టకాలంలో మనకు సరైన దారి చూపించేది కూడా జ్ఞానమే. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. మనం సంపాదించిన జ్ఞానం మన జీవితంలో ఎన్నో సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. చాణక్యుడు చెప్పినట్లుగా, జ్ఞానం ఉన్న వ్యక్తిని పరిస్థితులు సులభంగా ఓడించలేవు. కాబట్టి ప్రతి రోజూ జ్ఞానాన్ని సేకరించండి, దాన్ని ఆచరణలో పెట్టండి. ఎందుకంటే మన దగ్గర ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే, జీవితంలో మనం అంత బలమైన ఆయుధాన్ని కలిగి ఉన్నట్టే.  
ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం అనేది అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లేదా ఫిట్‌నెస్‌ సాధించడానికి చాలామంది మహిళలు సరదాగా ఆడే సోషల్ స్పోర్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ, దీర్ఘకాలంగా శారీరక శ్రమకు దూరంగా ఉండి ఒక్కసారిగా ఆటల మైదానంలోకి అడుగుపెట్టే మహిళలకు ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గాయాలు, నొప్పులు వారి క్రీడా భాగస్వామ్యానికి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయని ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన నూతన అధ్యయనం స్పష్టం చేస్తోంది. జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ ఇన్ స్పోర్ట్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం, సోషల్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనే శారీరక శ్రమ లేని ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు (20.8 శాతం మంది) గాయాలు లేదా తీవ్రమైన నొప్పుల వల్ల తమ ఆటను సరిగ్గా కొనసాగించలేకపోతున్నారు.లా ట్రోబ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్పోర్ట్ అండ్ సోషల్ ఇంపాక్ట్‌కు చెందిన పరిశోధకురాలు కీరా స్టాలే నాయకత్వంలో విక్టోరియా పరిధిలోని 1,339 మంది శారీరక శ్రమ లేని మహిళలపై ఈ విస్తృత సర్వే నిర్వహించారు. వారంలో కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయని వారిని శారీరక శ్రమ లేని వారిగా పరిగణించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ప్రతి 10 మంది పెద్దలలో దాదాపు 8 మంది కనీస వ్యాయామ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళలే మరింత వెనుకబడి ఉన్నారు. కుటుంబ బాధ్యతలు, సమయాభావం, ఆర్థిక పరిమితులు మరియు తగిన క్రీడా వసతులు లేకపోవడం వల్ల మహిళల్లో శారీరక శ్రమ లోపిస్తోంది. ఈ క్రమంలో వారు సోషల్ స్పోర్ట్స్‌లో చేరినప్పుడు, శరీరం ఒక్కసారిగా ఆ ఒత్తిడిని తట్టుకోలేక గాయాల బారిన పడుతోందని ఈ డేటా చెబుతోంది. ఈ అధ్యయనంలో వ్యక్తమైన మరో సంచలనాత్మక విషయం ఏమిటంటే, శరీరంలో కొన్ని నిర్దిష్ట భాగాలు మాత్రమే ఎక్కువగా ఈ గాయాలకు గురవుతున్నాయి. గాయాల పాలైన మహిళల్లో అత్యధికంగా 39 శాతం మంది మోకాలి నొప్పులు లేదా గాయాలతో బాధపడుతుండగా, 29.9 శాతం మంది నడుము కింద భాగంలో నొప్పితో, మరో 24.7 శాతం మంది మడమల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, ఈ గాయాల బారిన పడటంలో ఆర్థిక అసమానతలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని పరిశోధన ఆధార సహితంగా వెల్లడించింది. సంవత్సరానికి లక్ష డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలు, రెండు లక్షల డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల మహిళలతో పోలిస్తే గాయాల పాలయ్యే అవకాశం మూడు రెట్లు (1.84 నుండి 3.28 రెట్ల ఎక్కువ అవకాశం) ఎక్కువగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.       inactive women fitness injury risks,social sports health hurdles women.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం. శతాబ్దాల నుంచి మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు పిప్పళ్లను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిప్పళ్లు చేసే మేలు.. పిప్పళ్లలో ఉండే కెమికల్ కాంపౌండ్ పైపరీన్ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పిప్పళ్లు చేసే మేలు అపారం. జలుబు, దగ్గు, ఉబ్బసం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పిప్పళ్లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వచ్చేస్తుంది. పిప్పళ్ల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఆయుర్వేదంలో పిప్పళ్లను రసాయన మూలికగా వర్గీకరించారు. అంటే ఇవి శరీరానికి పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని త్రిదోషాలలో ప్రధానమైన కఫ, వాత దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని రగిల్చే గుణం పిప్పళ్లకు ఉంది. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయే సమస్యను, ఆకలి మందగించడాన్ని ఇది నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను బయటకు పంపడంలో ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్లను క్రియాశీలకంగా ఉపయోగిస్తారు. పిప్పళ్ల వల్ల కలిగే మరికొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం..  గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పిప్పళ్లు త్వరితగతిన నివారిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం వేగంగా అరిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల..  యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. బరువు నియంత్రణ..  శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, చెడు కొవ్వును కరిగించడంలో పిప్పళ్లు ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ నివారణి. నొప్పులు , వాపుల నివారణ..  పిప్పళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాతపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలేయ ఆరోగ్యం.. కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి పిప్పళ్లు తోడ్పడతాయి. పిప్పళ్లను నిత్య జీవితంలో తగిన మోతాదులో వాడటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయి కాబట్టి, పిత్త ప్రకృతి ఉన్నవారు లేదా గర్భిణులు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.                        *రూపశ్రీ.  
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం. అయితే, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు , పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో ఉన్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం , తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుంటే.. ఫైబర్.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  పీచు పదార్థం లేదా ఫైబర్ పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్ , బార్లీ వంటి ధాన్యాలలో కరిగే ఫైబర్  ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, శరీరం నుండి దాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. పప్పుధాన్యాలు, గింజలు.. వివిధ రకాల పప్పుధాన్యాలు , గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. శనగలు, పెసలు, రాజ్మా, మినుములు , కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు , పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తాయి. అలాగే నట్స్ అని పిలిచే బాదం, వాల్‌నట్స్ , పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కాకపోతే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది. తాజా కూరగాయలు , ఆకుకూరలు.. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ, వంకాయ, క్యారట్ , బీట్‌రూట్ వంటి కూరగాయలలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి.  వెల్లుల్లి.. వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రపరచడంలో , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ ఒకటో రెండో వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. పండ్లు.. పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ  వంటి పండ్లలో పెక్టిన్ అనే ప్రత్యేకమైన కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.  నిమ్మజాతి పండ్లు.. నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెల్తీ ఫ్యాట్స్.. చేపలు , ఆరోగ్యకరమైన నూనెలు కూడా కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. వంటల కోసం ప్రాసెస్ చేసిన నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి వాటిని పరిమితంగా ఉపయోగించడం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకుండా కాపాడతాయి. ఈ ఆహారాలు తినకూడదు.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు, బేకరీ ఆహారాలు , పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలను తగ్గించాలి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ , సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి. ఆహారాలు మాత్రమే కాదు.. ఇవి కూడా ముఖ్యమే.. కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , మంచి నిద్ర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. సరైన ఆహార నియమాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే కొలెస్ట్రాల్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.                         *రూపశ్రీ.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                          *రూపశ్రీ.