LATEST NEWS
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ ప్రాంతంలో ఓ యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువతి మహబూబ్‌నగర్‌లో మెడిసిన్ పూర్తి చేసి, ఇటీవల వరంగల్‌లో పీడియాట్రిక్స్ విభాగంలో పీజీ పట్టా అందుకున్నారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న ఆమె ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.కొద్ది రోజుల క్రితం ఆమె తన స్నేహితుడైన యువకుడితో కలిసి వరంగల్ నుంచి నగరానికి చేరుకున్నారు.  అనంతరం హఫీజ్‌పేట్‌లోని ఆదిత్య నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రూమ్ తీసుకుని బస చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, గత కొన్ని గంటలుగా కూతురి ఫోన్ నంబర్‌కు ఏమాత్రం స్పందన రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఆ సమయంలో అనుమానం వచ్చి ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేయగా, అది మియాపూర్ పరిధిలోని ప్రాంతంలో చూపించింది.దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియడం లేదని, ఫోన్ కూడా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.తల్లిదండ్రుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.  వారు తెలిపిన సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టగా, అక్కడ యువ వైద్యురాలు అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉండటాన్ని గుర్తించి నిర్ఘాంతపోయారు.ఈ ఘటనపై మియాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జయరాం మీడియాతో మాట్లాడుతూ, మృతురాలితో పాటు ఆ గదిలో ఉన్న యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ మృతికి గల అసలు కారణాలు ఏమిటనే కోణంలో లోతైన దర్యాప్తు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్ట్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్ట్ నివేదిక వస్తేనే ఆమె మృతికి గల అసలు కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న యువకుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.     [ Hyderabad young doctor suspicious death, Miyapur service apartment news, Hafeezpet doctor murder case,Telangana crime news Telugu, Miyapur police station investigation,  Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]  
అహింస మార్గమే మనకు శ్రీరామరక్ష.! గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది. లంగర్ హౌస్‌లోని బాపూఘాట్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పాల్గొని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1948లో మహాత్మా గాంధీ అస్థికలను నిమజ్జనం చేసిన పవిత్ర ప్రాంతమైన మూసీ  ఈసీ నదుల సంగమ స్థలమైన బాపూఘాట్ వద్ద ఈ కార్యక్రమం అత్యంత నివాళులర్పించే రీతిలో కొనసాగింది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వమత ప్రార్థన సమావేశంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, జాతిపిత చూపిన శాంతి, అహింస, సత్యం మరియు మానవతా విలువలు ఎప్పటికీ ఆచరణీయమని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అహింసను ప్రధాన ఆయుధంగా మలచుకుని ముందుకు నడిచిన మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. స్వయం సమృద్ధి, గ్రామ స్వరాజ్యం, సామాజిక సమానత్వం వంటి గొప్ప సిద్ధాంతాలకు గాంధీజీ బలమైన పునాదులు వేశారని కొనియాడారు. తెలంగాణ ప్రజల ప్రభుత్వం గాంధీ మార్గంలోనే నడుస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు, సామాజిక సమన్యాయం, అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని సీఎం పునరుద్ఘాటించారు.   గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా బాపూఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియాన్ని గవర్నర్  సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్ ఇతర ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మునికి తమ నివాళులు అర్పించారు. గాంధీ ఆశయాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ వేడుకలు ఎంతగానో దోహదపడతాయని నేతలు అభిప్రాయపడ్డారు       [  Bapu Ghat, Revanth Reddy, Gandhi Jayanti, Mahatma Gandhi, Telangana news, digital museum,Telugu One, Telugu News, Langar House, Digital Museum ]
 కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.! తెలంగాణ రాష్ట్రంలో ఆటోరిక్షా ఛార్జీలకు సంబంధించి ప్రభుత్వం కొత్త విధానాన్ని ఖరారు చేసింది. పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రయాణికులపై భారం నియంత్రించే విధంగా టారిఫ్‌ను సవరించింది. కొత్త విధానంలో కనీస ఛార్జీ, అదనపు దూరానికి వసూలు చేసే మొత్తం, వెయిటింగ్ ఛార్జీలు, రాత్రి సమయపు రేట్లు, లగేజీ రుసుములకు సంబంధించిన నిబంధనలను స్పష్టం చేశారు. కొత్త టారిఫ్ ప్రకారం ఆటోలో తొలి 1.6 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ఆ దూరం దాటిన తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.14 చొప్పున ఛార్జీ పెరుగుతుంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ రద్దీ, ఇతర పరిస్థితుల కారణంగా ఆటో కొంతసేపు కదలకుండా నిలిచిపోయినా వెయిటింగ్ ఛార్జీ వర్తిస్తుంది. ఈ ఛార్జీని నిమిషానికి 75 పైసలుగా నిర్ణయించారు.రాత్రి సమయంలో ఆటో సేవలను వినియోగించే వారికి సాధారణ టారిఫ్ వర్తించదు.  రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణిస్తే సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని ప్రత్యేక ఛార్జీ కాలంగా నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే సామానుకు సంబంధించి కూడా కొత్త విధానంలో స్పష్టత ఇచ్చారు. సాధారణ పరిమాణంలో ఉండే బ్రీఫ్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్‌తో పాటు 60×40 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణం కలిగిన అటాచ్డ్ కేస్ లేదా బ్యాగ్‌కు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.అయితే నిర్దేశిత పరిమాణం కంటే పెద్దగా ఉండే ప్రతి ప్యాకేజీకి రూ.0.50 లగేజీ ఛార్జీగా వసూలు చేస్తారు.  ఒక ఆటోలో మొత్తం 100 కిలోగ్రాముల వరకు లగేజీని మాత్రమే అనుమతిస్తారు.కొత్త ఛార్జీలకు అనుగుణంగా ఆటోల్లోని డిజిటల్ మీటర్లను కూడా తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. ప్రయాణం ప్రారంభించి మీటర్‌ను ఆన్ చేసిన వెంటనే రూ.30 కనీస ఛార్జీగా నమోదు కావాలి.తొలి 1.60 కిలోమీటర్ల దూరం పూర్తయ్యే వరకు ఇదే కనీస ఛార్జీ కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రతి 100 మీటర్ల దూరానికి రూ.1.40 చొప్పున ఛార్జీ పెరిగేలా మీటర్‌ను రీసెట్ చేయాలి.ప్రయాణికుల నుంచి సరైన ఛార్జీలు వసూలు చేయడంతో పాటు మీటర్లలోనూ కొత్త టారిఫ్ సక్రమంగా ప్రతిబింబించేలా చూడాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. కొత్త విధానం అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు.     [ Telangana auto fare hike, auto minimum charge Rs 30, Telangana transport department, auto charges per km, Hyderabad auto news, CM Revanth reddy, Minister ponnam prabhakar, Telugu One, Telugu News ]
 వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని  సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు. ముందుగా రెక్కీ నిర్వహించాడు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించాడు.. సహచరుల సహకారం తీసుకున్నాడు.. చివరకు ఆయుధాలను చోరీ చేసి వాటిని కలకత్తాలో విక్రయించేందుకు ప్రయత్నించి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు..మాజీ ఆర్మీ ఉద్యోగి హవల్దార్‌ మల్లేష్‌ను పోలీసులు 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చోరీ చేసిన ఆయుధాలను ముందుగానే పరిచయం ఉన్న అక్రమ ఆయుధాల వ్యాపారి అవల్‌ దెయ్‌ అలియాస్‌ ఓబీకి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు కేవలం ఆయుధాల చోరీకే పరిమితం కాలేదని.. దీని వెనుక పెద్ద నెట్‌వర్క్‌ ఉందా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. 2009లో ఆర్మీలో చేరిన మల్లేష్‌కు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిపై ప్రత్యేక శిక్షణ లభించింది.  వివిధ కంటోన్మెంట్లలో పనిచేసిన సమయంలో ఆయుధాగారం బాధ్యతలు కూడా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయుధాల వినియోగం, వాటి నిర్వహణ, ఆయుధాగారంలోని వ్యవస్థపై అతడికి అవగాహన ఏర్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.అయితే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహ రించడంతో పలుమార్లు ఉన్నతాధికారుల క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 16 ఏళ్ల సర్వీస్‌ పూర్తయిన తర్వాత మరో మూడేళ్లు కొనసాగేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఆ అవకాశాన్ని తీసుకోకపోవడంతో తనలో అసంతృప్తి, కక్ష పెరిగినట్లు మల్లేష్‌ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మల్లేష్‌కు గతంలో నేరచరిత్ర కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. 2007లోనే ఆమ్రాబాద్‌, అచ్చంపేట ప్రాంతాల్లో ఇళ్ల దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆర్మీలో చేరడం.. ఆయుధాలపై శిక్షణ పొందడం.. ఆయుధాగారాల బాధ్యతలు నిర్వహించడం.. ఇవన్నీ అతడికి ఆయుధాలపై ప్రత్యేక పరిజ్ఞానాన్ని అందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అక్రమ ఆయుధాలతో మల్లేష్‌కు పరిచయం కూడా పాతదేనని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. 2022లో కలకత్తా బ్యారక్‌పూర్‌లో ఉన్న సమయంలో అక్రమ ఆయుధాల వ్యాపారి అవల్‌ దెయ్‌ అలియాస్‌ ఓబీతో మల్లేష్ కు పరిచయం ఏర్పడింది.. బీర్బల్‌ షా ద్వారా అవల్‌ దెయ్‌తో పరిచయం పెంచుకున్న మల్లేష్‌.. అతడి నుంచి రూ.10 వేలకు తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తుపాకీతో దారి దోపిడీకి ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడని, అనంతరం తుపాకీని స్వగ్రామంలో దాచినట్లు మల్లేష్‌ కన్ఫెషన్‌లో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మల్లేష్ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో 2025లోనే ఆర్మీ ఆయుధాల చోరీ ఆలోచన మల్లేష్‌కు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. వెబ్‌సిరీస్‌లు, బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలను చూస్తూ చోరీకి సంబంధించిన పద్ధతులను పరిశీలించినట్లు విచారణలో వెల్లడైంది. తనకు ఉన్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకుని ఆయుధాలను చోరీ చేసి వాటిని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచనకు వచ్చినట్లు పోలీసులు అనుమాని స్తున్నారు.ఆలోచనకు కార్యరూపం ఇచ్చేందుకు మల్లేష్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నట్లు పోలీసులు చెబుతు న్నారు. జూలై 2026లో పలుమార్లు రెక్కీ నిర్వహించి ఆయుధాగారం చుట్టూ ఉన్న భద్రతా ఏర్పాట్లను పరిశీలిం చినట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? విద్యుత్‌ దీపాలు ఎక్కడ ఉన్నాయి? జవాన్ల కదలికలు ఎలా ఉంటాయి? వంటి అంశాలను పరిశీలిం చినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో శేషులు, ప్రవీణ్‌, వినోద్‌ సహకారం తీసు కున్నట్లు పోలీసులు చెబుతున్నారు.చోరీ తర్వాత ఆయుధాలను మద్రాస్‌ రెజిమెంట్‌ నుంచి బయటకు తరలించేం దుకు మల్లేష్‌ యాక్టివాను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బ్రీజా కారులో వాటిని నాగర్‌కర్నూల్‌లోని తన ఇంటికి తరలించి దాచినట్లు కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో వెల్లడైనట్లు తెలిపారు. అక్కడితో ఆగకుండా.. చోరీ చేసిన ఆయుధాలను ఎలా, ఎవరికి విక్రయించాలన్న దానిపై ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. చోరీ చేసిన ఆయుధాలను కలకత్తాకు తరలించి విక్రయించేందుకు మల్లేష్‌ ముందుగానే ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. బీర్బల్‌ షా ద్వారా అవల్‌ దెయ్‌ అలియాస్‌ ఓబీతో సంప్రదింపులు జరిపి ఆయుధాల విక్రయానికి ఒప్పందం చేసుకున్నట్లు గుర్తించారు. ఇక్కడే కేసు మరో మలుపు తిరిగింది. బీర్బల్‌ షాకు బంగ్లాదేశ్‌ నుంచి కలకత్తాకు వచ్చే వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులకు అనుమానం ఉంది. ఈ పరిచయాల వెనుక అక్రమ ఆయుధాల రవాణా, కొనుగోలు, విక్రయాల వ్యవహారం ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మల్లేష్‌ కస్టడీ విచారణలో బయటపడిన వివరాల ఆధారంగా బీర్బల్‌ షా, అవల్‌ దెయ్‌ అలియాస్‌ ఓబీకి దేశవ్యాప్తంగా అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడికి తరలిస్తున్నారు? గతంలో ఎలాంటి లావాదేవీలు జరిగాయి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం బీర్బల్‌ షా, అవల్‌ దెయ్‌ అలియాస్‌ ఓబీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకుంటే మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీతో పాటు అక్రమ ఆయుధాల క్రయవిక్రయాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.       [ Bolarum weapons theft case, Mallesh, Madras Regiment Hyderabad, Hyderabad Police investigation, Army weapon robbery case,Vinod and Seshu arrest, Madras Regiment, Hyderabad police, CP Sajjanar, DGP C.V.Anand ]  
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆప్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర రాజకీయ దుమారం రేపింది.ఈ నిరసనకు ఎలాంటి అనుమతి లేదంటూ ముందుగానే స్పష్టం చేసిన ఢిల్లీ పోలీసులు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను మోహరించారు. నిరసన స్థలానికి చేరుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలతో పాటు వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతామన్న విపక్ష నేతల మాటలను ఖాతరు చేయకుండా పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.ఈ ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అశాంతి చెలరేగకుండా కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించారు. నిరసన ప్రాంతానికి వెళ్లే పలు మెట్రో స్టేషన్ల ద్వారాలను మూసివేసి, సాధారణ ప్రజల రాకపోకలపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడుకునేందుకే తాము ఈ పోరాటం చేస్తున్నామని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, నిష్పాక్షికత లోపించిందని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రభుత్వం తమ గొంతును అణచివేయాలని చూస్తోందని, నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని ఆరోపించారు. అయితే, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ ఆంక్షలు విధించామని పోలీసులు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విపక్షాల నుంచి వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో రాబోయే పరిణామాలు జాతీయ రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.       [ AAP leaders detained, Jantar Mantar protest, CEC Gyanesh Kumar, Delhi Police, voter rolls controversy, Saurabh Bharadwaj, SIR, AAP MLA Sanjeev Jhanu, Telugu One, Telugu News ]
ALSO ON TELUGUONE N E W S
  క్యారక్టర్ కి తగ్గ పెర్ఫార్మ్ ప్రదర్శించే సౌత్ భామల్లో ఐశ్వర్య లక్ష్మి ఒకరు.భారీ సినిమాలే తన ఖాతాలో ఉన్నాయి. ప్రెజెంట్ సాయిధరమ్ తేజ్ తో 'సంబరాల ఏటిగట్టు' తో బిజీ గా ఉంది. రీసెంట్ గా ఈ భామ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీల 'రాకా' లో ఐశ్వర్య లక్ష్మి ఓ కీలక రోల్ లో, అందునా పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌లో నటించబోతోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్త సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా ప్రచారం కావడంతో సినీ ప్రియులతో పాటు ఆమె అభిమానులు  బిగ్ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇస్తోందని భావించారు.   అయితే ఈ ప్రచారంపై ఐశ్వర్య లక్ష్మి  ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'రాకా' లో నేను ఉన్నాననే వార్తల్లో  ఏమాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఎవరైనా దయచేసి నన్ను ఆ సినిమాలో కాస్ట్ చేయండి (Somebody please cast me in the film)" అని ఆమె ఎంతో నవ్వుతూ, సరదాగా సమాధానమిచ్చారు. ఈ ఒక్క వ్యాఖ్యతో ఆమెపై వస్తున్న ప్రచారానికి పూర్తిగా ముగింపు పడటమే కాకుండా, తన మనసులోని ఆశని చాటుకుంది. ఇది కూడా చదవండి: యూత్ మూవీ పేరిట స్కూల్ పిల్లల మధ్య ప్రేమ, రొమాన్స్: మేకర్స్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?   మరి రాకా మేకర్స్ ఆమె మాటలని పరిగణలోకి తీసుకుంటారేమో చూడాలి. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. ఎనీ క్యారక్టర్ లో మెస్మరైజ్ చేసే సమ్మోహన సినీ రూపం ఐశ్వర్య లక్ష్మి      [Aishwarya Lekshmi Denies Raaka Movie Rumors, Aishwarya Lekshmi, Raaka movie, Allu Arjun Atlee film, Aishwarya Lekshmi statement, Somebody please cast me, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]    
మలయాళం నుంచి వచ్చే క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ కథలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘ఐస్’ (Eyes). ‘ఉయరే’, ‘కాణెక్కాణే’ వంటి సినిమాలను తెరకెక్కించిన మను అశోకన్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. తాజాగా ‘ఐస్’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. క్రైమ్, సస్పెన్స్, సైకలాజికల్ అంశాలతో సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఈ సిరీస్ అక్టోబర్ 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘ఐస్’ కథ ప్రధానంగా మహిళలకు సంబంధించిన కొన్ని కలవరపరిచే కేసుల చుట్టూ తిరుగుతుంది. కని కుసృతి పోలీస్ అధికారిణి టీనా సెబాస్టియన్ పాత్రలో కనిపించనున్నారు. కేసుల దర్యాప్తులో భాగంగా స్టాకింగ్‌కు పాల్పడే వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి పోలీసులతో కలిసి మానసిక ఆరోగ్య నిపుణులు కూడా రంగంలోకి దిగుతారు. ప్రేమ, ఆకర్షణ, అబ్సెషన్, కంట్రోల్ మధ్య ఉండే సున్నితమైన గీత ఎలా భయానికి దారితీస్తుందనే అంశాలను ఈ సిరీస్‌లో చూపించనున్నారు. దీంతో సాధారణ క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా సైకలాజికల్ కోణంలో కథను నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సిరీస్‌లో కని కుసృతితో పాటు నిఖిలా విమల్, శ్రుతి రామచంద్రన్, సనియా అయ్యప్పన్, దేవ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ‘ఉయరే’, ‘కాణెక్కాణే’ సినిమాలకు పనిచేసిన రచయిత ద్వయం బాబీ-సంజయ్ ఈ సిరీస్‌కు స్క్రీన్‌ప్లే అందించారు. డ్రీమ్ క్యాచర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టీఆర్ షంషుద్దీన్ నిర్మించారు. గౌతమ్ శంకర్ సినిమాటోగ్రఫీ, రంజిన్ రాజ్ సంగీతం అందించారు. ఇక ‘ఐస్’ కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో థ్రిల్లర్ కంటెంట్‌ను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకుల్లో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. ట్రైలర్‌లో చూపించిన సస్పెన్స్, క్రైమ్ అంశాలతో పాటు స్టాకింగ్, అబ్సెషన్ వంటి సున్నితమైన అంశాలను కథలో ఎలా చూపించారనేది తెలియాలంటే సిరీస్ విడుదల వరకు వేచి చూడాల్సిందే.
సినిమా.. అంటే ఏంటి? ప్రేక్షకుడికి ఉన్న టెన్షన్ మొత్తాన్ని పోగొట్టి సరికొత్త లోకంలో విహరించేలా చేసే రెక్కల గుర్రం లాంటిది. మెసేజ్ తో పాటు జీవితంలో  ఎలా బతకాలో, బయట ఎలాంటి మనుషులు ఉంటారో కూడా చెప్తు సినీ కళామతల్లికి శతకోటి వందనాలు అనేలా కూడా చేస్తుంది. అలాంటి గొప్ప సినీ పరిశ్రమ  కొంత మంది వల్ల  విమర్శలని ఎదుర్కొంటు తలదించుకోవాల్సిన పరిస్థితి.   ఇటీవలి కాలంలో టాలీవుడ్ తో పాటు భారతీయ సినిమా పరిశ్రమలో ‘యూత్ ఫుల్ ఎంటర్టైనర్’ అండ్ ‘టీనేజ్ లవ్ స్టోరీ’ పేరిట వస్తున్న సినిమాలు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. 14, 15, 16 ఏళ్ల వయస్సున్న బడిపిల్లల మధ్య ప్రేమ, ముద్దులు, రొమాన్స్, మోహం వంటి భావోద్వేగాలను ప్రధాన వస్తువుగా చేసుకుని సినిమాలు చేస్తున్నారు. ఒక రకంగా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేని పరిణితి చెందని వయసుని రెచ్చగొడుతున్నట్టే లెక్క. అసలు ఒకప్పుడు బడిపిల్లలు లేదా కాలేజీ యూత్ కథలు అంటే స్నేహం, చదువు, క్రీడలు, బాధ్యతలు, జీవితంలో గెలవాలనే తపన లేదా స్వచ్ఛమైన ఆకర్షణ చుట్టూ తిరిగేవి. కానీ నేడు సినిమా అంటే కేవలం రొమాన్స్, సెక్స్, శారీరక ఆకర్షణ మాత్రమేనా అన్న అనుమానం ప్రతి సగటు ప్రేక్షకుడికి కలుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం భారతీయ సినీ పరిశ్రమలో గత మూడేళ్లలో విడుదలైన టీనేజ్ డ్రామా సినిమాల్లో దాదాపు 70 శాతానికి పైగా చిత్రాలు తీవ్రమైన శారీరక ఆకర్షణ, ముద్దులు మరియు వయస్సుకు మించిన శృంగార దృశ్యాల చుట్టూనే నిర్మించబడ్డాయి. ఈ తరహా కంటెంట్ కారణంగా 13 నుండి 18 ఏళ్ల వయస్సు గల కౌమారదశలో ఉన్న పిల్లలపై తీవ్రమైన మానసిక ప్రభావం పడుతోందని చైల్డ్ సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. సర్వేల ప్రకారం రోజూ సోషల్ మీడియా లేదా సినిమాల్లో ఇటువంటి కంటెంట్ చూసే పిల్లల్లో 45 శాతానికి పైగా చదువుపై ఏకాగ్రత కోల్పోవడం, వయసుకి   మించిన ప్రవర్తనని  అలవర్చుకోవడం వంటి సమస్యలని ఎదుర్కొంటున్నారు. స్కూల్ వయస్సు అంటే భవిష్యత్తుకు పునాది వేసుకునే సమయం. ఆ వయసులో ఉండే కౌమార భావోద్వేగాలను చాలా సున్నితంగా, బాధ్యతాయుతంగా తెరపై చూపించాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది సినీ మేకర్స్ బాక్సాఫీస్ కలెక్షన్లు, గ్లామర్, కాంట్రవర్సీల కోసం టీనేజ్ లైఫ్ అంటే కేవలం రొమాన్స్ మాత్రమే అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. సినిమా అనేది సమాజంపై, ముఖ్యంగా లేత మనస్సులపై ఎంతటి ముద్ర వేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు పాఠశాల స్థాయి పిల్లల మధ్య శారీరక సాన్నిహిత్యాన్ని, రొమాన్స్‌ని వైభవంగా చూపించడం వల్ల పిల్లలు నిజ జీవితంలో కూడా అదే నిజమని నమ్మే ప్రమాదం ఉందనేది ఫ్యామిలీ ఆడియన్స్ ఆవేదన. కాబట్టి సినిమా మేకర్స్ ఒక్కసారి ఆలోచించాలి. స్కూల్, కాలేజీ వయస్సు పిల్లల జీవితాల్లో చెప్పడానికి ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. వారిలోని సృజనాత్మకత, స్నేహబంధం, లక్ష్యాల సాధన, ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, వాటిని అధిగమించే మార్గాలు వంటి అంశాలపై సినిమాలు తీస్తే అవి ఎంతోమందికి స్పూర్తినిస్తాయి. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్కును చేరుకోవడానికే ప్రాధాన్యత ఇస్తూ, భావితరాల మనస్సులను చెడగొట్టే రొమాంటిక్ సీన్లను రుద్దడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంలో సెన్సార్ బోర్డ్ కూడా కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కూడా చదవండి: తెల్ల కాగితం' ఫస్ట్ డే కలెక్షన్లు ఇవేనా! కోర్ట్ మ్యాజిక్ కంటిన్యూ అవుతుందా! సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది సమాజానికి అద్దం పడుతుంది. రొమాన్స్, సెక్స్ పేరిట టీనేజర్ల అమాయకత్వాన్ని వ్యాపార సరుకుగా మార్చకుండా, ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తేనే చిత్రసీమకు, సమాజానికి మంచిది. తల్లిదండ్రులు, సినీ ప్రేమికులు, సమాజ హితాన్ని కోరే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇదే విషయాన్ని ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. లేదంటే ముందు ముందు కరుడుగట్టిన సినీ ప్రేమికులు సైతం యూత్ సినిమా పేరిట స్కూల్ పిల్లల మధ్య రొమాన్స్ ని బేస్ చేసుకొని సినిమాలు తీస్తే మేకర్స్  ఇంటి ముందు నిరాహారదీక్ష చెయ్యాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్చ్ చేస్తున్నారు.. సో.. సినిమాకి ఉన్న గొప్ప పేరుని నాశనం చేయకండి.   [School Kids Romance In Youth Movies, Teenage love Stories, school romance in movies, youthful cinema impact, censorship in movies, youth movies trend, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]    
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘దసరా’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదల తర్వాత సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో పాటు, కొన్ని రివ్యూలు ప్రతికూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమాపై కావాలనే నెగెటివ్ ప్రచారం జరుగుతోందనే చర్చ కూడా సోషల్ మీడియాలో కనిపించింది. ఇదే అంశంపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే కావాలనే ఒక సినిమాను దెబ్బతీయడానికి ప్రచారం చేయడం మాత్రం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. సినిమాకు వచ్చే రివ్యూలు, రేటింగ్స్‌ వల్ల ప్రేక్షకుల నిర్ణయాన్ని పూర్తిగా మార్చలేరని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు సినిమా నచ్చితే ఎలాంటి ప్రచారం ఉన్నా థియేటర్లకు వస్తారని, కలెక్షన్లపై దాని ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. ‘ది ప్యారడైజ్’ విషయంలో కూడా నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ వసూళ్లు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే సినిమా బాక్సాఫీస్ గణాంకాలపై తమ్మారెడ్డి చెప్పిన వివరాలు ఆయన స్వయంగా వెల్లడించిన లెక్కలుగానే చూడాల్సి ఉంటుంది. మరోవైపు సినిమా గురించి నాని కూడా ప్రేక్షకుల స్పందనను స్వీకరిస్తూ, విమర్శకులు, రివ్యూయర్లు సూచించిన లోపాల నుంచి నేర్చుకున్నానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో సినిమాలను కావాలనే దెబ్బతీయడానికి డబ్బులు ఖర్చు చేసి నెగెటివ్ ప్రచారం చేయించే పద్ధతిపై తమ్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. అలా చేసే వాళ్లను ఉద్దేశించి ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే ‘ది ప్యారడైజ్’పై అలాంటి ప్రణాళికాబద్ధమైన ప్రచారం జరిగిందని తాను ఖచ్చితంగా చెప్పడం లేదని మరో సందర్భంలో స్పష్టం చేసినట్లు సమాచారం. సినిమా గురించి నిజాయితీగా తమ అభిప్రాయాలను చెప్పే రివ్యూలకు, ఉద్దేశపూర్వకంగా సినిమాను దెబ్బతీయడానికి చేసే ప్రచారానికి తేడా ఉందన్నది ఆయన వ్యాఖ్యల సారాంశంగా కనిపిస్తోంది. ఇక ‘ది ప్యారడైజ్’ విషయానికి వస్తే.. నాని నటన, యాక్షన్ సన్నివేశాలు, సాంకేతిక అంశాలను కొందరు ప్రశంసించగా, కథనం, స్క్రీన్‌ప్లే, ద్వితీయార్థంపై మరికొందరు విమర్శలు చేశారు. నాని కూడా ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను స్వీకరిస్తూ సినిమా లోపాలపై వచ్చిన విమర్శలను గమనించానని తెలిపారు. దీంతో ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’పై తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.     [Tammareddy Bharadwaja, Nani The Paradise, The Paradise Movie, The Paradise Negative Reviews, Nani Paradise Movie Reviews, Tammareddy Bharadwaja Comments, Nani Latest Movie, Srikanth Odela The Paradise, The Paradise Movie News, Nani Movie Latest News]
కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఓం: చాప్టర్-1’. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తొలుత ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 16న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. తాజాగా ‘ఓం’ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ధనుష్, మమ్ముట్టి గన్స్ పట్టుకుని ఉన్న కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘ఓం: చాప్టర్-1’లో ధనుష్, మమ్ముట్టితో పాటు సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధనుష్‌కి ఇది మమ్ముట్టితో తొలి కలయిక కావడంతో ఈ కాంబినేషన్‌పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ, ఆర్. కలైవానన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ‘ఓం’ రూపొందుతున్నట్లు ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఎర్రచందనం కోసం అడవుల్లో పనిచేసే కూలీల చుట్టూ కథ సాగనున్నట్లు సమాచారం. పోలీసులు కొందరు కూలీలను అదుపులోకి తీసుకున్న సమయంలో ధనుష్ పాత్ర వారిని కాపాడేందుకు రంగంలోకి దిగే సన్నివేశాలు టీజర్‌లో ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రానికి ‘చాప్టర్-1’ అనే టైటిల్ పెట్టడంతో భవిష్యత్తులో ఈ కథకు కొనసాగింపు ఉండొచ్చనే చర్చ కూడా మొదలైంది. ఇదిలా ఉంటే.. తొలుత అక్టోబర్ 16న విడుదల చేయాలనుకున్న ‘ఓం’ను రజనీకాంత్ ‘జైలర్ 2’తో పోటీ లేకుండా వాయిదా వేసినట్లు ధనుష్ గతంలో ప్రకటించారు. అలాగే దీపావళి సమయంలో సూర్య నటిస్తున్న ‘సీన్’ విడుదలకు ఇప్పటికే తేదీ ఖరారైన నేపథ్యంలో ఆ సీజన్‌లో కూడా తమ సినిమాను తీసుకురావడం లేదని ఆయన తెలిపారు. ఇప్పుడు నవంబర్ 20న కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేయడంతో ధనుష్, మమ్ముట్టి అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.   [Dhanush Om Movie, Mammootty Dhanush Om, Om Chapter 1, Om Chapter 1 Release Date, Dhanush Mammootty Movie, Om Movie New Release Date, Dhanush Latest Movie, Mammootty Latest Movie, Sai Pallavi Om Movie, Sreeleela Om Movie, Rajkumar Periasamy Om, Om Chapter 1 November 20]
'కోర్ట్', తో హిట్ అందుకున్న హర్ష్ రోషన్ ఆ తర్వాత 'బ్యాండ్ మేళం' తో పరాజయాన్ని చవిచూశాడు. దీంతో నిన్న రిలీజైన 'తెల్ల కాగితం' పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.     మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కగా నక్షత్ర హీరోయిన్  ప్రేక్షకులు, మూవీ లవర్స్ నుంచి పాజిటివ్ టాక్ రాబట్టుకుంటున్న  'తెల్ల కాగితం' మొదటి తోజు సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే  90 లక్షలు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ముందు రోజు ప్రీమియర్స్ ప్రదర్శించగా 7 .73 లక్షలు వసూలు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే చిత్ర బృందం ఈ విషయంపై అధికార ప్రకటన చెయ్యాల్సి ఉంది.    రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించగా  అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించాడు. ఇది కూడా చదవండి: సిగ్మా రికార్డు కలెక్షన్స్: మరి టాక్ ఎలా ఉంది! మరి మార్కెట్ లో మరికొన్ని సినిమాలు కూడా పోటీగా ఉన్న నేపథ్యంలో వీకెండ్ తో పాటు రాబోయే రోజుల్లో ఏ మేర కలెక్షన్స్ దక్కించుకుంటుందో చూడాలి.      [Tella Kaagitham First Day Collections, Tella Kaagitham Movie Review, Tella Kaagitham Box Office Report, Harsh Roshan Tella Kaagitham,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]          
కన్నడ సినీ నటి రచితా రామ్‌ పుట్టినరోజు వేడుకల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ 3న తన బర్త్‌డే సందర్భంగా అభిమానులను కలుసుకున్న ఆమె.. వారితో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని రచితా రామ్‌తో సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చిన అతడు.. ఒక్కసారిగా ఆమె రెండు బుగ్గలను గిల్లి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊహించని ఈ పరిణామంతో రచిత కాసేపు షాక్‌కు గురయ్యారు. అయితే వెంటనే తేరుకుని చిరునవ్వుతో మిగతా అభిమానులతో ఫొటోలు దిగుతూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రచితా రామ్‌ను అభిమానులు ముద్దుగా ‘డింపుల్ క్వీన్’ అని పిలుచుకుంటారు. ఆమె అసలు పేరు బిందియా రాము. ప్రముఖ భరతనాట్య కళాకారుడు కేఎస్ రాము కుమార్తె అయిన రచిత.. చిన్ననాటి నుంచే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. బుల్లితెరపై సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. 2013లో ‘బుల్‌బుల్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘రన్నా’, ‘రథవర’, ‘చక్రవ్యూహ’, ‘భర్జరి’, ‘నటసార్వభౌమ’, ‘క్రాంతి’ వంటి సినిమాలతో కన్నడలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇక పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలుసుకోవడం రచితకు ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సరదా అభిమాన చర్యగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం అభిమానం పేరుతో సెలబ్రిటీల అనుమతి లేకుండా తాకడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు తమ అభిమాన తారలను కలిసే సమయంలో వారి వ్యక్తిగత పరిధిని గౌరవించాలని పలువురు సూచిస్తున్నారు. కాగా రచితా రామ్‌ కన్నడ సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. తెలుగులో ‘సూపర్ మచ్చి’లో నటించిన ఆమె.. రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానున్నట్లు కథనం పేర్కొంది. https://x.com/Filmyduniyaaa/status/2106224424718622807     [Rachita Ram, Rachita Ram Birthday, Rachita Ram Fan Video, Rachita Ram Viral Video, Kannada Actress Rachita Ram, Rachita Ram Birthday Celebration, Rachita Ram Fan Pinches Cheeks, Rachita Ram Latest News, Rachita Ram Coolie, Rachita Ram Kaka Movie]
    సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా కాంబోలో విజయ్ సన్ జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సిగ్మా' . నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వగా ప్రచార చిత్రాలతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  సిగ్మా'మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ వివరాల్లోకి వస్తే  ఇండియా గ్రాస్ కలెక్షన్ 2.70 కోట్లుగా నమోదైంది. రెండు భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో తమిళ వెర్షన్ అత్యధిక ఆదరణ పొందింది. తమిళ వెర్షన్ 925 షోల ద్వారా 1.50 కోట్ల నెట్ కలెక్షన్  రాబట్టగా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి 1.00 కోట్ల గ్రాస్ వసూలు, కర్ణాటకలో 25 లక్షలు, కేరళలో 12 లక్షలు మరియు మిగిలిన భారతదేశ వ్యాప్తంగా ₹3 లక్షల వసూళ్లు వచ్చాయి. థియేటర్ల ఆక్యుపెన్సీ విషయానికి వస్తే, ఇండియా వ్యాప్తంగా సగటున 31.1% ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళ వెర్షన్ లో నైట్ షోలకు గరిష్టంగా 51.69% ఆక్యుపెన్సీ రాగా, తెలుగు వెర్షన్ ఈవినింగ్ షోలలో 31.10% ఆక్యుపెన్సీతో నిలకడగా సాగింది.    ఇది కూడా చదవండి: Dont Trouble The Trouble: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!   మూవీ టాక్ విషయానికి వస్తే డైరెక్షన్ బాగున్నా కథ, కధనం ఓల్డ్ ఫార్మేట్ లో సాగాయనే మాటలు వినపడుతున్నాయి.   [Sigma First Day Collections, Sigma box office collection day 1, Sundeep Kishan Sigma worldwide collections, Jason Sanjay directorial debut, Sigma Telugu movie collections]        
ఫాహద్ ఫాజిల్, సారా ఫాలేకర్, రాజమౌళి, రాజమౌళి తనయుడు కార్తికేయ, బాహుబలి నిర్మాతలు నిన్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' తో వరల్డ్ వైడ్ థియేటర్స్ లో అడుగుపెట్టారు. ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కగా  శశాంక్ ఏలేటి దర్శకుడు. విలక్షణమైన ప్రమోషన్లతో వచ్చిన ఈ చిత్రం తొలి రోజే అద్భుతమైన వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే ఇండియా  వైడ్ గా 1,224 షోలలో ప్రదర్శించబడిన1.90 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆల్ ఇండియా స్థాయిలో తొలి రోజు మొత్తం 25.8 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది.ఈ కలెక్షన్లలో తెలుగు వెర్షన్ ఒక్కటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి అత్యధికంగా 1 .40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు లభించాయి. మొత్తం 31.1 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే . కర్ణాటక నుండి 20 లక్షలు, కేరళ నుండి 20 లక్షలు, తమిళనాడు నుండి 7 లక్షలు మరియు మిగిలిన భారతదేశం అంతటా కలిపి ₹3 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది కూడా చదవండి: చిరంజీవి ట్వీట్ వైరల్: హనుమాన్ చాలీసా పఠిస్తూ ఒక్కడే పోరాడాడు       ఇతర భాషా వెర్షన్ల విషయానికి వస్తే, మలయాళంలో 341 షోల ద్వారా 17 లక్షల నెట్ కలెక్షన్ (13% ఆక్యుపెన్సీ) నమోదు కాగా, తమిళ వెర్షన్ 60 షోల నుంచి  లక్షల నెట్ వసూళ్లను అందించింది. ఉదయం షోలలో 23.15 శాతం, మధ్యాహ్నం మ్యాటినీలకు అత్యధికంగా 34.54 శాతం, సాయంత్రం షోలకు 19.46 శాతం మరియు నైట్ షోలకి 27.92 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్ నగరంలో నైట్ మరియు మ్యాటినీ షోలకు ప్రేక్షకుల స్పందన ఎక్కువగా కనిపించిన డోంట్ 'ట్రబుల్ ది ట్రబుల్' వీకెండ్ ని ఎలా ఉపయోగించుకుంటుందో  చూడాలి.   [Dont Trouble The Trouble First Day Collections, Dont Trouble The Trouble Review, Fahadh Faasil, Box Office Collection Day 1, SS Rajamouli, Telugu Cinema, Shashank Yeleti, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]    
  మెగాస్టార్ చిరంజీవి.. ఏ విషయంపైనైనా స్పందించడంలోను, తోటి వారిని అభినందించడంలోను ముందుంటారు. ఈ కోవలోనే  రీసెంట్ గా  ఎంతో మంది ప్రాణాలు కాపాడిన పైలెట్  'స్మిత్ మచ్చర్' గురించి ట్వీట్ చెయ్యడం జరిగింది. ఎక్స్ లో 'తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్  మచ్చర్  గారికి నా హృదయపూర్వక అభినందనలు.ఇజ్రాయెల్‌కి వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోను సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలని ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం.   ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు.జై హనుమాన్ అని ట్వీట్ చెయ్యడం జరిగింది. సినిమాల పరంగా చూసుకుంటే చిరు ప్రస్తుతం 'కాకా' తో బిజీగా ఉన్నాడు.   [Chiranjeevi Tweet About smit machchhar, Chiranjeevi Latest Tweet, Chiranjeevi Latest Movie, Smit machchhar, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భార్యాభర్తలు ఒకరికి ఒకరు టైం కేటాయించుకోవడం ఎందుకు ముఖ్యం.! ​భార్యాభర్తలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవడం దాంపత్య జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఉద్యోగం, వ్యాపారం, పిల్లల చదువులు, ఇంటి పనులు, ఆర్థిక బాధ్యతలతో రోజంతా గడిచిపోతుంటుంది. ఈ హడావుడిలో దంపతులు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మనసులో విషయాలను పంచుకోవడానికి సమయం దొరకడం కష్టం. అయితే, కేవలం ఒకే ఇంట్లో  జీవించడం మాత్రమే కాకుండా, ఒకరికొకరు క్వాలిటీ టైమ్ కేటాయించుకోవడం చాలా అవసరం . భార్యాభర్తలు ఒకరికొకరు టైమ్ కేటాయించుకోవడం వల్ల వైవాహిక బంధంలో జరిగే అద్భుతాలు తెలుసుకుంటే..  కష్టాలలో నిలబెడుతుంది. ఎంతటి కష్టసమయంలోనైనా దంపతులను కలిపి ఉంచేది వారి మధ్య ఉన్న అనుబంధమే. రోజూ కొంత సమయం ఒకరి కోసం ఒకరు కేటాయించుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిపడుతుంది. ఒకరి ఆలోచనలు, ఆశయాలు, భయాలు మరొకరు అర్థం చేసుకోవడానికి ఈ సమయం సహాయపడుతుంది. దీనివల్ల భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి. గొడవలు తగ్గుతాయి.. చాలా కాపురాల్లో వచ్చే చిన్న చిన్న గొడవలకు లేదా విభేదాలకు ప్రధాన కారణం సరిగ్గా మాట్లాడుకోకపోవడమే. రోజూ కాసేపు ఎలాంటి ఫోన్లు, టీవీలు లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల మనసులోని భ్రమలు, అపోహలు తొలగిపోతాయి. భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినడం వల్ల మన సమస్యలను వారు అర్థం చేసుకుంటున్నారనే నమ్మకం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.. ఆఫీసు పని, కుటుంబ బాధ్యతల వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భాగస్వామితో గడిపే సమయం అద్భుతంగా పనిచేస్తుంది. రోజంతా పడిన కష్టాన్ని మరిచిపోయి, భాగస్వామితో కాసేపు నవ్వుతూ మాట్లాడినా లేదా చిన్న నడకకు వెళ్లినా మనసుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. భాగస్వామి ఇచ్చే ధైర్యం ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. జీవితం ఎప్పుడూ కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది.. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచాక చాలామందిలో జీవితం రొటీన్‌గా మారిపోయిందనే భావన వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం చాలా అవసరం. కలిసి కాఫీ తాగడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం లేదా పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వంటివి వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లలకు మార్గదర్శనం.. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులను చూసే విషయాలు నేర్చుకుంటారు. ఇంట్లో భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ, ప్రేమగా సమయం గడుపుతుంటే పిల్లలు కూడా ప్రేమ, అనురాగాలు ఉన్న వాతావరణంలో పెరుగుతారు. ఇది వారిలో మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో వారు కూడా మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మార్పులను గ్రహించవచ్చు.. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, అలవాట్లు మారుతుంటాయి. పెళ్లి సమయానికి ఉన్న భాగస్వామి, కొన్నేళ్ల తర్వాత శారీరకంగా, మానసికంగా మారవచ్చు. తరచూ మాట్లాడుకోవడం వల్ల భాగస్వామిలో వస్తున్న మార్పులను, వారి కొత్త అవసరాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల జీవితంలో ఏ దశలోనైనా ఒకరికొకరు అండగా నిలబడటం తేలికవుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది దాంపత్య జీవితానికి పునాది వంటిది. రోజూ కనీసం ఒక అర గంట పాటు ఫోన్లకు దూరంగా ఉండి,  మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే, ఎలాంటి సమస్యలనైనా సులభంగా దాటవచ్చు. ఎంత బిజీగా ఉన్నా భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మాత్రమే వైవాహిక బంధం సుదీర్ఘకాలం సంతోషంగా, ఆరోగ్యకరంగా సాగుతుంది.                      *రూపశ్రీ.  
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
ప్రతిరోజూ ఉదయం ఉడకబెట్టిన గుడ్డు తినడం చాలామందికి అలవాటు. శారీరక బలానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోడిగుడ్డును అత్యంత చౌకైన , సమర్థవంతమైన ఆహారంగా నిపుణులు చెబుతుంటారు. అయితే  చాలామంది గుడ్డు తినేటప్పుడు తెల్లసొనను మాత్రమే తిని, పచ్చసొనను తీసి పక్కన పడేస్తుంటారు. పచ్చసొన తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లేదా చెడు కొవ్వు పెరిగిపోతుందని, గుండె ఆరోగ్యానికి మంచిది కాదని, బరువు పెరుగుతారని రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అలాగే చిన్న పిల్లలకు పచ్చసొన ఇస్తే అరగదని భావించేవారు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ కేవలం శాస్త్రీయ ఆధారం లేని అపోహలు మాత్రమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  నిజానికి గుడ్డులోని అసలైన పోషక నిధి పచ్చసొనలోనే దాగి ఉంటుంది. పచ్చసొనలో ఉన్న ముఖ్యమైన పోషకాలు , వాటి ప్రాముఖ్యత గుడ్డులోని సంపూర్ణ పోషక విలువలు మన శరీరానికి అందాలంటే పచ్చసొనను తీసివేయకుండా పూర్తిగా తినడం ఎంతో అవసరం. పచ్చసొనలో లభించే ప్రధానమైన పోషకాలు మన శరీరానికి ఏ విధంగా తోడ్పడతాయో వివరంగా తెలుసుకుంటే.. మెదడు అభివృద్ధికి.. గుడ్డు పచ్చసొనలో కోలిన్ అనే పోషక పదార్థం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది మెదడు సరైన రీతిలో పనిచేయడానికి , జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. విశేషమేమిటంటే, ఎదుగుతున్న చిన్న పిల్లలలో మెదడు వికాసానికి , నరాల వ్యవస్థ నిర్మాణానికి కోలిన్ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. నరాల బలానికి, రక్తకణాల తయారీకి విటమిన్ బి12.. పచ్చసొనలో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొత్త రక్తకణాలు తయారవ్వడానికి, శరీరం చురుగ్గా ఉండటానికి , నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. సాధారణంగా మనం తినే శాఖాహారంలో ఈ విటమిన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహార లోపాలను భర్తీ చేసుకోవడానికి గుడ్డు పచ్చసొన ఒక గొప్ప ఆహార మూలంగా పనిచేస్తుంది. కంటి చూపుకు, రోగనిరోధక శక్తికి విటమిన్ ఏ..  ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సాయపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, పలురకాల ఇన్ఫెక్షన్లు , వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరుకు సెలీనియం..  గుడ్డు పచ్చసొనలో సెలీనియం అనే ముఖ్యమైన ఖనిజ లవణం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి , శరీరంలో జీవక్రియల వేగాన్ని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. గుడ్డును పూర్తిగా ఎందుకు తినాలి? గుడ్డు తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది, కానీ పచ్చసొనలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ , మేలైన పోషకాలన్నీ నిండి ఉంటాయి. కేవలం తెల్లసొన మాత్రమే తింటే గుడ్డు నుంచి వచ్చే పూర్తి పోషకాహార ప్రయోజనాలను మనం కోల్పోయినట్లే అవుతుంది. అందుకే అనవసరమైన భయాలు, అపోహలు పక్కన పెట్టి రోజువారీ ఆహారంలో గుడ్డును పచ్చసొనతో సహా పూర్తిగా తీసుకోవడం వల్ల  ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతుంది.                      *రూపశ్రీ.  
చేతులు వణకడం, కాళ్లలో బలహీనంగా అనిపించడం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం వంటి సమస్యలను చాలామంది సాధారణ నీరసంగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి నరాల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు సంకేతాలు కావచ్చు. నరాల బలహీనతకు కారణాలు ఏమిటి? నరాలపై ప్రభావం చూపించే సమస్యలు ఏంటి? చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నొప్పి, వణుకు, బలహీనత ఎందుకు వస్తాయి? నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం, జీవనశైలి పాటించాలి? ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ నరాల బలహీనతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అలాగే నరాల ఆరోగ్యానికి ఉపయోగపడే సంప్రదాయ పద్ధతిలో అశ్వగంధ, వాము, దాల్చిన చెక్క, లవంగాలతో తయారు చేసుకునే చిట్కా గురించి కూడా తెలుసుకోవచ్చు. నరాల బలహీనత, నరాల నష్టం, తాత్కాలిక నీరసం మధ్య తేడా ఏమిటి? నరాలు దెబ్బతిన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? నరాల ఆరోగ్యానికి మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎందుకు అవసరం? వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నరాలకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. నరాల ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
క్యాన్సర్ పేరు వినగానే భయపడాల్సిన అవసరం లేదు. అయితే శరీరంలో చాలాకాలంగా కొనసాగుతున్న కొన్ని అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా, వాటికి కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సాధారణ సమస్యలుగా భావించే కొన్ని లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. నోటిలో తగ్గకుండా ఉండే పుండ్లు, రొమ్ములో కనిపించే మార్పులు, జీర్ణవ్యవస్థలో సమస్యలు, కారణం లేకుండా బరువు తగ్గడం, శరీరంలో అసాధారణ మార్పులు వంటి వాటిని ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి? క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఏ వయసులో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? అంతేకాదు, క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు ఏమిటి? రోబోటిక్ సర్జరీ, ఆంకో-రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, మైక్రోసర్జరీ, బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ వంటి విధానాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి క్యాన్సర్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు, శరీరం ఇచ్చే అసాధారణ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. గమనిక: ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అసాధారణ లక్షణం కొనసాగితే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి.మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)