LATEST NEWS
ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ రాటుదేలుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతగా పార్టీని ముందుండి నడిపించడంలో గతం కంటే ఎంతో మెరుగ్గా సాగుతున్నారు. ప్రభుత్వ అణచివేత చర్యలకు దీటుగా స్పందిస్తున్నారు. కేసులు, అరెస్టులతో భయపెట్టలేరని కుండబద్దలు కొడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ణానేశ్వర్ రాజీనామా డిమాండ్ తో చేపట్టిన ఆందోళన సందర్భంగా రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు వరుసగా అరెస్టు చేశారు. ఎన్నికల సంఘం ముట్టడి సందర్భంగా మంగళవారం, (అక్టోటబర్ 6)జంతర్ మంతర్ వద్ద ఆందోళన సందర్భంగా బుధవారం (అక్టోబర్ 7) అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  దీనిపై రాహుల్ ఘాటుగా స్పందించారు. ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.   ఎన్ని కేసులు నమోదైనా రాజ్యాంగ పరిరక్షణ కోసం  చేస్తున్న ఈ పోరాటాన్ని ఆపేది లేదన్న రాహుల్ వ్యాఖ్యలు.. పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నారనడానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)  జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ను రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు.  ఎఫ్‌ఐఆర్‌ను ప్రజలపక్షాన నిలిచినందుకు దక్కిన మెడల్‌ గా అభివర్ణించడం ద్వారా రాహుల్ ముందుముందు మరింత దూకుడుగా ముందుకు సాగనున్నారని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  అంతే కాకుండా ఎన్నికల సంఘంపై ప్రారంభించిన ఈ పోరాటాన్ని జ్ణానేశ్ కుమార్ రాజీనామాతో లాజికల్ ఎండ్ కు తీసుకువెళ్లే వరకూ విరమించేది లేదని విస్పష్టంగా చాటినట్లేనని అంటున్నారు. [Rahul Gandhi, 100 FIRs arget, Rahul Gandhi FIR, Election Commission Protest, Gyanesh Kumar, INDIA Bloc, Telugu One]
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘం వ్యవహారంపై పొలిటికల్ టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. కొనసాగుతోంది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు నిర్బంధాలు, నిషేధాలకు బెదిరేదే లే.. ఆందోళనలు కొనసాగించే విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంగళవారం (అక్టోబర్ 6) ఈసీ కార్యాలయం వైపు చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడం, అనంతరం రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడం తెలిపిందే. ఇప్పుడు తాజాగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు రాహుల్ గాంధీ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామాలు మరింత ఉత్కంఠకు దారితీశాయి.  ఈ నేపథ్యంలోనే  నిర్దేశిత నిరసన స్థలమైన జంతర్ మంతర్‌కు వెళ్లాలని విపక్షాలు నిర్ణయించాయి. బుధవారం (సెప్టెంబర్ 7) రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సుమారు 300 మంది ఎంపీలు ఈసీని కలవాలని ప్రయత్నించినా అవకాశం దక్కలేదన్నారు. అందుకే జంతర్ మంతర్‌లో నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.  సర్ ప్రక్రియ, ఓటర్ల జాబితాలో మార్పుల విషయంలో తగ్గేదేలే అంటున్న రాహుల్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్న రాహుల్ సహా ప్రతిపక్షాల విమర్శలను ఎన్నికల సంఘం, అధికార బీజేపీ ఖండిస్తున్నాయి.  విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.  అదలా ఉంటే..  మంగళవారం (అక్టోబర్ 6) సాయంత్రం వరకు ఏ రాజకీయ పార్టీ కూడా తమను అధికారికంగా అపాయింట్‌మెంట్ కోరలేదని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఎంపీల బృందం ఈసీని కలవాలని కోరినట్లు పేర్కొంది. అయితే పార్లమెంట్ అనెక్స్‌లో సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదన తమ ప్రోటోకాల్‌కు అనుగుణంగా లేని కారణంగా రిజెక్ట్ చేశామని వివరణ ఇచ్చింది.   [Rahul Gandhi Jantar Mantar Protest, Delhi Protest, CEC Gyanesh Kumar Resign Demand, Election Commission, SIR, INDIA, Telugu One]
తమిళ సినీ పరిశ్రమలో మరో  స్టార్ హీరో  పొలిటికల్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయ్యిందా? అంటే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఔనన్న సమాధానమే వస్తున్నది. స్టార్ హీరో ధనుష్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైందన్న వార్త ఇప్పుడు తమిళనాట పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ధనుష్ రాజకీయ ప్రవేశంపై గత కొద్ది కాలంగా వార్తలు వినవస్తూనే ఉన్నాయి. తమిళనాడులో  కోట్లాది మంది అభిమానులు ఉన్న ధనుష్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు వేగంగా పావులు కదుపుతున్నారని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటికే తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన ధనుష్.. త్వరలోనే  కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుతెలుస్తోంది.  ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణనా లేదు.   గత కొంతకాలంగా ధనుష్‌ రాజకీయ ప్రవేశంపై   పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక  ఇప్పుడు పార్టీ పేరు తెరపైకి రావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన విధివిధానాలు, పార్టీ జెండా,  భవిష్యత్  కార్యాచరణపై   ధనుష్‌  త్వరలోనే  ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.     [Tamil Hero Dhanush political entry, Tamilaga Eluchi Kazhagam, Dhanush New Party, Kollywood Actor, Political Entry, Tamil Nadu Politics,Telugu One]
ALSO ON TELUGUONE N E W S
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దర్శకుడు వశిష్టతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అధికారికంగా ఖరారైన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ సినిమాపై ఇప్పుడు క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసి.. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ కీలక మలుపు తిరిగే సమయంలో బాలయ్య ఎంట్రీ ఉంటుందని, మోక్షజ్ఞకు తండ్రి పాత్రలోనే కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.  అదే నిజమైతే.. ఒకే ఫ్రేమ్‌లో బాలయ్య, మోక్షజ్ఞలను చూడాలనుకుంటున్న నందమూరి అభిమానులకు ఇది భారీ ట్రీట్ అవుతుంది.  గతంలో మోక్షజ్ఞ డెబ్యూ కోసం ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ అనౌన్స్ అయినా అది ముందుకు వెళ్లలేదు. దీంతో ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా విషయంలో నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.  అన్నీ అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్‌లో ప్రాజెక్ట్ లాంచ్.. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మోక్షజ్ఞను వశిష్ట ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారు? బాలయ్య నిజంగానే సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారా? అనేది ఇప్పుడు అసలు ఆసక్తిగా మారింది. ఇది కూడా చదవండి: నానా పటేకర్ రియల్ హీరో.. కార్గిల్ యుద్ధంలో 60 రోజులు ఏం చేశారంటే.?       [Nandamuri Mokshagna Debut Movie Launch, Nandamuri Mokshagna Debut Shooting, Nandamuri Mokshagna, Nandamuri Balakrishna, Director Vassishta, Mythri Movie Makers, Telugu Film News]  
నటనే నానాపటేకర్ కి డై హార్డ్ ఫ్యాన్ అనే మాట అభిమానులు, సినీ ప్రేమికుల నుంచి వినిపిస్తూ ఉంటుంది. అంతలా ఎన్నో అద్దుతుమైన క్యారెక్టర్స్ పోషించి ఎంతో మంది నటులకి నట గురువు అయ్యాడు. డైలాగ్ డెలివరీ కూడా డిఫరెంట్  నానా పటేకర్ తన చివరి కోరికగా పుణె సమీపంలోని డోంజే గ్రామంలో ఉన్న తన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే తుది వీడ్కోలు పొందాలని ఆశించారు. ఆ ఫామ్‌హౌస్‌తో ఆయనకు ఎంతో భావోద్వేగ అనుబంధం ఉండేది. కుటుంబ సభ్యులు ఆయన చివరి ఆకాంక్షను గౌరవిస్తూ అంత్యక్రియల ఏర్పాట్లని  అక్కడే పూర్తి చేస్తున్నారు. పుణె జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గోవా నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక మార్గంలో పుణెలోని ఫామ్‌హౌస్‌కు తరలించి, సాయంత్రం వేళ ప్రభుత్వ లాంఛనాలతో, అధికారిక నివాళులతో అంత్యక్రియలు పూర్తి చేయనుంది. భారతీయ సినిమాకి ఆయన అందించిన అసమానమైన సేవలకు, విశిష్టమైన కళాకృతికి గౌరవసూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించగా, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షెలార్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.     ఇది కూడా చదవండి: 1350 కోట్లు హుష్ కాకి: టామ్ క్రూజ్ ‘డిగ్గర్’ మూవీ డిజాస్టర్ ఫలితం! నానా పటేకర్ కేవలం వెండితెరపై మెరిసే నటుడు మాత్రమే కాదు; ఆయన ఒక నిజమైన సమాజ సేవకుడు. సుమారు 27 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తూ, అందులో వచ్చే ఆదాయంలో అత్యధిక భాగాన్ని కరువు బారిన పడిన రైతులకు, పేద కుటుంబాలకు విరాళంగా ఇచ్చేవారు. నామ్ ఫౌండేషన్ (Naam Foundation) ద్వారా వేలాది మంది రైతు కుటుంబాలకు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 'పరిందా', 'ప్రహార్', 'తిరంగా', 'అగ్నిసాక్షి', 'ఖమోషి', 'అబ్ తక్ ఛప్పన్', 'వెల్కమ్', 'రాజనీతి', 'నటసమ్రాట్' వంటి అనేక చిరస్మరణీయ చిత్రాల్లో ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. 1991లో 'ప్రహార్' చిత్రంతో దర్శకుడిగా, రచయితగా కూడా ఆయన తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.     [Nana Patekar Funeral Pune State Honours, Nana Patekar, Nana Patekar funeral, Nana Patekar death, Nana Patekar Pune farmhouse, State Honours,Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]
సినిమాల్లో సైనికుడి పాత్రలు చేయడం వేరు.. నిజ జీవితంలో సైనికులతో కలిసి యుద్ధ ప్రాంతంలో పనిచేయడం వేరు. నటుడిగా తెరపై ఎన్నో పవర్‌ఫుల్ పాత్రలు చేసిన నానా పటేకర్.. రియల్ లైఫ్‌లో కూడా దేశం కోసం తనవంతు సేవ చేశారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో దాదాపు 60 రోజుల పాటు ఆర్మీ సైనికులతో కలిసి పనిచేశారు. నానా పటేకర్ గురువారం ఉదయం 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు CPR చేసినా ఆయనను కాపాడలేకపోయారు. నానా పటేకర్ మరణవార్తతో ఆయన సినీ ప్రయాణంతో పాటు.. చాలామందికి తెలియని కార్గిల్ అధ్యాయం కూడా ఇప్పుడు మరోసారి చర్చకు వస్తోంది. నిజానికి నానా పటేకర్‌కు ఆర్మీతో అనుబంధం ముందే ఉంది. ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ సినిమా కోసం ఆయన మరాఠా లైట్ ఇన్‌ఫ్యాంట్రీతో దాదాపు మూడేళ్ల పాటు కఠినమైన మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ సినిమాలో ఆర్మీ అధికారి పాత్ర పోషించడమే కాకుండా.. దర్శకత్వం కూడా వహించారు. ఇక 1999లో కార్గిల్ యుద్ధం మొదలైనప్పుడు.. దేశం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నానా పటేకర్ అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను సంప్రదించారు. తాను కమాండో ట్రైనింగ్ తీసుకున్న విషయాన్ని, ఆయుధాల వినియోగంలో తనకు ఉన్న అనుభవాన్ని, జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్‌లో పాల్గొన్న విషయాన్ని ఆయన వివరించారు. ఆ తర్వాత ప్రత్యేక అనుమతితో ఆర్మీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.  అలా 1999 ఆగస్టులో నానా పటేకర్ కార్గిల్ ప్రాంతానికి వెళ్లారు. ద్రాస్, లెహ్, కుప్వారా, బారాముల్లా, సోపోర్ వంటి సున్నిత ప్రాంతాల్లో సైనికులతో కలిసి దాదాపు 60 రోజులు గడిపారు. ఆయన క్విక్ రియాక్షన్ టీమ్‌లో కూడా భాగమయ్యారని స్వయంగా వెల్లడించారు. అయితే అక్కడ తాను చేసిన ఆపరేషనల్ కార్యకలాపాల వివరాలను మాత్రం నానా పటేకర్ బయటపెట్టలేదు. ఈ అనుభవం ఆయనపై ఎంత ప్రభావం చూపిందో చెప్పడానికి మరో విషయం ఉంది. శ్రీనగర్‌కు వెళ్లేటప్పుడు తన బరువు 76 కిలోలు ఉండగా.. తిరిగి వచ్చేసరికి 56 కిలోలకు తగ్గిపోయిందని నానా పటేకర్ గతంలో చెప్పారు. అంటే కార్గిల్‌లో గడిపిన సమయంలో దాదాపు 20 కిలోల బరువు తగ్గారన్నమాట. ఇంతటి అనుభవం ఉన్నప్పటికీ నానా పటేకర్ మాత్రం దాన్ని ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. దేశం కోసం తాను చేయగలిగిన చిన్న పని చేశాననే భావనతోనే ఈ విషయాన్ని చూశారు. అందుకే ఆయన కార్గిల్ అనుభవం కూడా చాలా కాలం పాటు పెద్దగా బయటకు రాలేదు. నానా పటేకర్ మరణం తర్వాత ఆయన నటుడిగా చేసిన సినిమాలు మాత్రమే కాదు.. దేశం కోసం చేసిన ఈ అరుదైన సేవ కూడా గుర్తుచేసుకోవాల్సిన అంశమే. తెరపై సైనికుడి పాత్రలో జీవించిన నానా.. నిజ జీవితంలోనూ సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు గడపడం ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని చూపిస్తోంది. ఇది కూడా చదవండి: ప్యారడైజ్ రిజల్ట్.. శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి చెప్పిన మాట ఇదే.!       [Nana Patekar Kargil War, Nana Patekar Indian Army, Nana Patekar Passed Away, Nana Patekar Death, Nana Patekar Life Story, Nana Patekar Biography, Nana Patekar Movies, Nana Patekar, Telugu Film News]  
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ అంటే తెలియని వరల్డ్ సినీ ప్రేమికుడు ఉండడు. బొమ్మ పడితే బాక్స్ బద్దలవ్వాల్సిందే. దీంతో  వందల మిలియన్ డాలర్ల కలెక్షన్ల సలాం కొడతాయి. కానీ ఇటీవల విడుదలైన తాజా చిత్రం ‘డిగ్గర్’ (Digger) మాత్రం బాక్సాఫీస్ చరిత్రలోనే అనూహ్యమైన అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచి అందరినీ షాక్   కి  గురిచేసింది.  ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు అలెజాండ్రో జి ఇనారిటు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. అత్యంత వీక్ స్టోరీ, నత్తనడకన సాగే నిరాశజనక కథనం, నీరసమైన డైరెక్షన్ కారణంగా ప్రేక్షకులు ఈ సినిమాను ముక్తకంఠంతో తిరస్కరించారు.ఈ సినిమా నిర్మాణ లెక్కలు చూస్తే ఎంతటి భారీ రిస్క్ తీసుకున్నారో స్పష్టమవుతుంది. హాలీవుడ్ వర్గాల అంచనా ప్రకారం, డిగ్గర్ సినిమా నిర్మాణం కోసమే నిర్మాతలు దాదాపు $140 మిలియన్ల నుండి $180 మిలియన్ల వరకు భారీగా ఖర్చు చేశారు. ఇక అంతర్జాతీయంగా ఈ సినిమాను ప్రమోషన్స్ మరియు మార్కెటింగ్ చేయడానికి మేకర్స్ మరొక $100 మిలియన్ల వరకు ధారాదత్తం చేశారు. అంటే ప్రమోషన్లతో కలిపి ఈ సినిమా మొత్తం బడ్జెట్ సుమారు $225 మిలియన్ల నుండి $280 మిలియన్ల మార్కును తాకింది. కానీ, ఇంతటి భారీ వ్యయంతో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ప్రారంభంలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు మాత్రం ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసాయి. ఇది కూడా చదవండి: Nana Patekar: నానా పటేకర్ తొలిప్రేమ వెనుక ఉన్న కన్నీటి కథ! ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన మొత్తం వసూళ్లు కేవలం $20 మిలియన్లు మాత్రమే కావడం గమనార్హం. హాలీవుడ్ సినిమాలకు అత్యంత కీలకమైన, అతిపెద్ద మార్కెట్ అయిన నార్త్ అమెరికాలో ఈ సినిమా కేవలం $8 మిలియన్ల ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టగలిగింది. గ్లోబల్ మార్కెట్‌లో ఇతర దేశాలన్నింటిలో కలిపి కేవలం $12 మిలియన్ల వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి. భారతీయ బాక్సాఫీస్ విషయానికి వస్తే, ఇండియాలో కూడా టామ్ క్రూజ్ కెరీర్‌లోనే ఎన్నడూ లేనంత నీరసమైన స్పందన లభించింది. తొలి రోజు ₹80 లక్షలు, రెండో రోజు ₹50 లక్షలు, మూడో రోజు ₹50 లక్షలు మరియు నాలుగో రోజు కేవలం ₹20 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసి, మొదటి నాలుగు రోజుల్లో కలిపి రూ. 2 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే దక్కించుకుని వాష్ అవుట్ దిశగా చేరింది.     ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్స్ ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రోస్‌కు డిగ్గర్ సినిమా రూపంలో దాదాపు $145 మిలియన్ల నుండి $150 మిలియన్లకు పైగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే ఇది 1350 కోట్లకు పైగానే నష్టమని సినీ ట్రేడ్ సర్కిల్స్  అంచనా వేస్తున్నారు. గడిచిన 20 ఏళ్ల టామ్ క్రూజ్ సినీ కెరీర్‌లోనే అత్యంత ఘోరమైన డిజాస్టర్ ఓపెనింగ్‌గా డిగ్గర్ నిలిచింది.   [Tom Cruise Digger Box Office Disaster Losses, Tom Cruise Digger, Digger Box Office Disaster, Warner Bros Massive Loss, Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]
‘ఇండియన్’ లాంటి క్లాసిక్‌కు సీక్వెల్‌గా వచ్చిన ‘ఇండియన్ 2’ భారీ అంచనాలను అందుకోలేకపోయింది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడినా.. రిలీజ్ తర్వాత మాత్రం తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు అదే ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం రాబోతోంది. నిజానికి ‘ఇండియన్ 2’ రిజల్ట్ తర్వాత ఇక ‘ఇండియన్ 3’ ఉండకపోవచ్చని అందరూ భావించారు. కానీ, మేకర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. చెప్పినట్టుగానే తాజాగా లైకా ప్రొడక్షన్స్ ‘ఇండియన్ 3’ని అధికారికంగా ప్రకటించడంతో పాటు, పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. మూడు గుర్రాలపై ముగ్గురు భారతీయులు వస్తున్నట్టుగా ఆ పోస్టర్ ఉంది. ‘ఇండియన్ 2’ సమయంలోనే పారలాల్ గా ‘ఇండియన్ 3’ షూటింగ్ దాదాపు పూర్తయింది. అందుకే రెండో భాగం షాకిచ్చినా.. మూడో భాగం విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గడంలేదు.  ‘ఇండియన్ 3’లో సేనాపతి రోల్ తో పాటు, అతని తండ్రి 'వీరశేఖరన్' పాత్ర వెనుకున్న హిస్టరీ మెయిన్ హైలైట్ కానుందట. కంటెంట్ పరంగా రెండో భాగంగా కంటే మూడో భాగం బెటర్ గా ఉంటుందని మూవీ టీం నమ్ముతోందట. మరి ‘ఇండియన్ 2’తో దెబ్బతిన్న ఈ ఫ్రాంచైజీని ‘ఇండియన్ 3’ అయినా నిలబెడుతుందా? లేక ప్రేక్షకులు ఈ సీక్వెల్‌ను కూడా పట్టించుకోకుండా వదిలేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ప్యారడైజ్ రిజల్ట్.. శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి చెప్పిన మాట ఇదే.! https://x.com/LycaProductions/status/2108078886416470501       [Senapathy Is Back, Indian 3 Confirmed, Indian 3 Movie, Indian 2 Movie, Kamal Haasan, Shankar, Lyca Productions, Telugu Film News]  
ప్రముఖ నటుడు నానా పటేకర్‌ ఆకస్మిక మరణం భారత సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. 75 ఏళ్ల నానా పటేకర్‌ గురువారం తెల్లవారుజామున గోవాలోని డోనా పౌలా నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయనను మణిపాల్‌ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్‌ చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఉదయం 5.20 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  నానా పటేకర్‌ మరణవార్తతో పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేసిన స్పందన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నానా పటేకర్‌ను ఆయన ‘నటనకు దేవుడు’గా అభివర్ణించారు. ఇంత బలమైన వ్యక్తికి ఇంత అకస్మాత్తుగా ఇలా జరుగుతుందని నమ్మలేకపోతున్నానని పేర్కొన్న ఆర్జీవీ.. నానాను కోల్పోవడానికి కారణమైన ఆయన గుండెపై తనకు కోపం వస్తోందని అన్నారు. చివరికి ‘నటనకు దేవుడైన నానా పటేకర్‌ను చంపేసిన ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది’ అంటూ తీవ్ర భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  నానా పటేకర్‌తో రామ్‌గోపాల్‌ వర్మకు సినీ అనుబంధం కూడా ఉంది. ‘అబ్‌ తక్‌ ఛప్పన్‌’, ‘భూత్‌’, ‘ది అటాక్స్‌ ఆఫ్‌ 26/11’ వంటి చిత్రాల్లో నానా పటేకర్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా వర్మ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో నానా తనదైన శైలిలో పాత్రలకు ప్రాణం పోశారు. అందుకే ఆయన మరణం ఆర్జీవీని వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా కలిచివేసినట్లు తాజా స్పందన చూస్తే అర్థమవుతోంది.  ఇదిలా ఉంటే.. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన నానా పటేకర్‌ సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ‘పరిందా’, ‘క్రాంతివీర్‌’, ‘అబ్‌ తక్‌ ఛప్పన్‌’, ‘నటసమ్రాట్‌’, ‘వెల్‌కమ్‌’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న నానా పటేకర్‌కు 2013లో పద్మశ్రీ కూడా లభించింది. తీవ్రతతో కూడిన పాత్రల నుంచి కామెడీ వరకు తనదైన శైలిలో మెప్పించిన ఆయన.. హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో చెరగని ముద్ర వేశారు.  మొత్తంగా.. నానా పటేకర్‌ వంటి విలక్షణ నటుడిని కోల్పోవడం సినీ ప్రపంచానికి తీరని లోటుగా మారింది. ఆయన నటనను గుర్తుచేసుకుంటూ అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు నానా పటేకర్‌తో ఆయనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి.        [Nana Patekar, Nana Patekar Death, Nana Patekar Dies at 75, Ram Gopal Varma, RGV on Nana Patekar, Nana Patekar Death News, Nana Patekar Heart Attack, Nana Patekar Movies, Bollywood News, Nana Patekar Tribute, RGV Emotional Post]
తొలిప్రేమ.. సక్సెస్ అయితే సంతోషం. లేదంటే జీవితాంతం ఆ బాధ వెంటాడుతోందనే మాటలు తొలి ప్రేమని అనుభవంచిన వాళ్ళ నుంచి వినిపించే మాటలు. ఈ క్రమంలోనే తొలిప్రేమ గురించి నానా పటేకర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న భావోద్వేగపూరితమైన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.    ఒక  షోలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్.. నానా పటేకర్‌ను ఉద్దేశించి ఆయన యుక్తవయసులో ఉన్నప్పుడు ఆయన "తొలి ప్రేమ" ఎవరని చాలా ఉత్సాహంగా ప్రశ్నించారు. సాధారణంగా సినీ తారలను ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఏదో ఒక హీరోయిన్ పేరో లేక పాఠశాల రోజుల్లోని ప్రేమికురాలి పేరో చెబుతుంటారు. కానీ, నానా పటేకర్ ఇచ్చిన సమాధానం మాత్రం అనిల్ కపూర్‌తో పాటు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏ అమ్మాయి పేరో చెప్పకుండా, తన టీనేజ్ వయసులో తనకు ఉన్న ఏకైక తొలి ప్రేమ "రొట్టె (ఆహారం)" మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.   వినడానికి ఇది కాస్త నవ్వు తెప్పించేలా అనిపించినా, ఆ మాట వెనుక ఆయన అనుభవించిన తీవ్రమైన దారిద్య్రం, ఆకలి మంటల భయంకరమైన నిజం దాగి ఉంది. నానా పటేకర్ బాల్యం, కౌమారదశ అంతా దారుణమైన ఆర్థిక ఇబ్బందులతోనే గడిచాయి. రోజుకు కేవలం ఒక్క పూట భోజనంతో కడుపు మార్చుకుని గడిపిన రోజులు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. చేతిలో ఒక్క రూపాయి కూడా లేక, గమ్యస్థానాలకు చేరుకోవడానికి కిలోమీటర్ల కొద్దీ కాలినడకన నడిచిన చేదు అనుభవాలను ఆయన ఎప్పటికీ మరచిపోలేకపోయారు. ఆకలి బాధ, సమాజంలో ఎదురైన అవమానాలు ఆయన మనస్సుపై చెరగని ముద్ర వేశాయి. అందుకే టీనేజ్ వయసులో ఆకర్షణలు, ప్రేమల కంటే కడుపు నిండా ఒక్క రొట్టె దొరకడమే తన జీవితంలో అతిపెద్ద కలగా, ప్రేమగా ఉండేదని నానా ఆవేదనగా చెప్పుకొచ్చారు.    ఇది కూడా చదవండి: రామాయణ నిర్మాతపై దాడి: ఇది ఖచ్చితంగా ఆ సంస్థ పనే!   అంతేకాకుండా, తన జీవితంలో ప్రేమగా అడుగుపెట్టిన ఏకైక అమ్మాయి తన భార్య మాత్రమేనని, పెళ్లికి ముందు తన జీవితంలో ఎలాంటి ప్రేమకథలు లేవని ఆయన చాలా నిజాయితీగా వెల్లడించారు. కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టే ఆయన జీవితాంతం హంగులు, ఆర్భాటాలకు దూరంగా సాధారణ జీవనం గడిపారు. ఈ విషాదకరమైన కథ నానా పటేకర్ పట్ల అభిమానుల్లో ఉన్న గౌరవాన్ని మరింత రెట్టింపు చేస్తోంది.     [Nana Patekar First Love secret story, Nana Patekar First Love, Nana Patekar Anil Kapoor Interview, Nana Patekar Struggle Story, Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]  
After years of uncertainty, Indian 3 is finally moving ahead. Lyca Productions has officially announced the return of Kamal Haasan’s Senapathy with a new post featuring the line, “Senapathy is back with zero tolerance. The resurgence begins in Indian 3. War Mode.” The production house also unveiled new posters, signalling that the long-delayed sequel is now back on track. The announcement comes more than two years after Indian 2 arrived in theatres and turned out to be one of the biggest disasters in Indian cinema. The film faced severe criticism and trolling, with director Shankar coming under particular scrutiny for the execution. However, the Indian 3 trailer, which was attached to Indian 2, offered a far more promising glimpse of Senapathy’s next chapter and left audiences curious about what the third instalment could deliver. The journey to this announcement has reportedly been far from smooth. Indian 3 has been in the edit suite for more than 3 years post Indian 2 release, with the production facing repeated delays and issues between the stakeholders from 2019 for both films. Reports previously suggested that Shankar had sought around Rs. 50 crore to complete the remaining portions of the film and prepare it for release. Lyca Productions was reportedly reluctant to approve the additional expenditure after the losses incurred by Indian 2 and the prolonged production period. The latest announcement indicates that Lyca Productions, Shankar and Kamal Haasan have seemingly reached common ground to take the project forward. While the makers have not yet revealed a release date, the message is clear: Senapathy is returning, and Indian 3 is finally moving towards completion. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఆధునిక వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సరైన పోషకాహారం తీసుకోవడం అత్యంత కీలకమైన అంశంగా మారింది. ముఖ్యంగా శరీర బరువు తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నించే వారికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాల్సిన డయాబెటిస్ బాధితులకు రోజువారీ ఆహారం ఎంతో శ్రద్ధతో ఎంచుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారి కోసం అస్సలు ఒక్క బొట్టు నూనె కూడా వాడకుండా, ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా ఇంట్లోనే తయారుచేసుకునే ఒక అద్భుతమైన సాంప్రదాయ వంటకమే "సొరకాయ జొన్న రొట్టె". ఉదయం అల్పాహారంగా గానీ లేదా రాత్రి వేళ సులభంగా అరిగే రాత్రి భోజనంగా గానీ ఈ రొట్టెను చాలా సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. మన వంటింట్లో లభించే అతి సాధారణమైన పదార్థాలతోనే లంచ్ లేదా డిన్నర్ సమయాల్లో డిఫరెంట్ రుచిని ఆస్వాదించవచ్చు. ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన రొట్టె తయారీకి కావలసిన కొలతలు మరియు పదార్థాలను పరిశీలిస్తే: 1 కప్పు తొక్క తీసి నీళ్లు పిండకుండా సిద్ధం చేసుకున్న సొరకాయ తురుము, 1 కప్పు మంచి జొన్న పిండి, 1/4 కప్పు శనగ పిండి, 1 చిన్నదిగా తరిగిన ఉల్లిపాయ, 2 నుండి 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు తరుగు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు మరియు అవసరమైతే కొద్దిగా కారం తీసుకోవాలి. ముందుగా సొరకాయను బాగా కడిగి తురుముకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే సొరకాయ తురుము నుండి నీటిని అస్సలు పిండకూడదు. ఎందుకంటే సొరకాయలోని సహజ సిద్ధమైన తడిదనమే పిండిని చక్కగా కలపడానికి ఎంతగానో సహాయపడుతుంది. వంట తయారీ విధానంలోకి వస్తే, ఒక వెడల్పాటి గిన్నెలో సొరకాయ తురుము, జొన్న పిండి, శనగ పిండిలను వేసి, వాటికి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ధనియాల పొడి మరియు ఉప్పు చేర్చి మొదట నీళ్లు పోయకుండా సొరకాయ తడితోనే బాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే మాత్రమే కొద్దికొద్దిగా నీరు చిలకరిస్తూ చపాతీ పిండి కంటే కాస్త మృదువుగా ఉండేలా కలుపుకోవాలి. రొట్టెను వత్తడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది; నూనె వాడకుండా ఉండటానికి ఒక కాటన్ తడి వస్త్రాన్ని నీటిలో ముంచి బాగా పిండేసి, ఆ తడి గుడ్డపై పిండి ముద్దను ఉంచి చేతితో సన్నగా రొట్టెలా వత్తుకోవాలి. వేడెక్కిన పెనంపై ఈ తడి గుడ్డలోని రొట్టెను బోర్లించి వస్త్రాన్ని జాగ్రత్తగా తీసివేస్తే రొట్టె పెనంకు అంటుకోకుండా నీట్‌గా వస్తుంది. రొట్టెను రెండు వైపులా తక్కువ మంటపై బంగారు రంగు వచ్చేవరకు చక్కగా కాల్చుకోవాలి. నూనె లేకపోవడం వల్ల రొట్టె ఎండిపోయినట్లు అనిపిస్తే కొద్దిగా నీటి చుక్కలను చిలకరించి మెత్తగా ఉడికించుకోవచ్చు. ఈ సొరకాయ జొన్న రొట్టెలో పీచు పదార్థం (ఫైబర్) అత్యధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ వేగవంతమై కడుపు ఉబ్బరం తగ్గడమే కాకుండా, ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. గ్లూటెన్ రహితమైన జొన్న పిండి మరియు తక్కువ క్యాలరీలు ఉండే సొరకాయ కలయిక వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవు. కొలెస్ట్రాల్ మరియు బరువు సమస్యలతో బాధపడేవారికి, జొన్న రొట్టెలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఈ సొరకాయ జొన్న రొట్టె ఒక ఉత్తమమైన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.       [Sorakaya Jonna Rotte, Bottle Gourd Jowar Roti, Jowar Flour, Bottle Gourd Recipes, Healthy Breakfast, Diabetes Diet, Weight Loss Diet, Oil Free Recipes, Gluten Free Food, High Fiber Foods]
ప్రస్తుత ఆధునిక ఉద్యోగ జీవనశైలిలో డెస్క్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) చేసే ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనితో పాటే మెడ నొప్పి, తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలు కూడా ఆందోళనకర రీతిలో హెచ్చరిస్తున్నాయి. పూర్వం కేవలం వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ ఎముకలు, కండరాల బలహీనతలు నేడు 20 ఏళ్ల లేత వయసులోని యువతను, టీనేజర్లను కూడా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాలు చేసే ఆడా, మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు. వైద్య నిపుణుల పరిశోధనల ప్రకారం, కార్యాలయ ఉద్యోగులు తమ పనివేళల్లో దాదాపు 81.8% సమయం కదలకుండా కూర్చోవడానికే కేటాయిస్తున్నారు. ఈ సుదీర్ఘ గంటల కదలికలేని జీవనశైలి వల్ల సుమారు 65% కంటే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఏదో ఒక రకమైన ఎముకలు, వెన్నెముక లేదా కండరాల నొప్పులకు గురవుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం గంటల తరబడి ల్యాప్‌టాప్, కంప్యూటర్ల ముందు సరైన అవగాహన లేకుండా, వంకరగా తప్పు కోణంలో కూర్చోవడమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ చిన్నదిగా ఉండటం వల్ల ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం లేదా టేబుల్‌పై తక్కువ ఎత్తులో ఉంచి చూసే క్రమంలో తలను ముందుకు వంచుతుంటాం. మానవ శరీరంలో మన మెడకు ప్రకృతిసిద్ధంగా ఒక విశిష్టమైన బాధ్యత ఉంది. అది మన తలను సమతుల్యం చేస్తూ అన్ని దిశల్లోనూ సునాయాసంగా తిప్పడానికి సహాయపడుతుంది. సాధారణంగా మన తల బరువు 10 నుండి 12 పౌండ్లు ఉంటుంది. అయితే, మనం ల్యాప్‌టాప్ చూస్తూ తలను కేవలం 15 డిగ్రీల కోణంలో ముందుకు వంచినప్పుడు, మెడ కండరాలపై పడే విపరీతమైన ఒత్తిడి ఏకంగా 27 పౌండ్లకు పెరుగుతుంది. అదే తలను 60 డిగ్రీల కోణంలో కిందికి వంచితే, మెడపై పడే భారం ఏకంగా 60 పౌండ్లకు సమానమవుతుంది. రోజుకు 8 నుండి 10 గంటల పాటు నిలబడటం కంటే కూర్చోవడం వల్ల నడుము భాగంలోని వెన్నెముక డిస్క్‌లపై దాదాపు 40% అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఈ అదనపు ఒత్తిడి వల్ల మెడ వెనుక భాగంలోని కండరాలు తీవ్ర అలసటకు గురై, క్రమంగా భుజాలు పట్టేయడం, తలనొప్పి రావడం మరియు చేతుల్లో తిమ్మిర్లు రావడం వంటి తీవ్రమైన సమస్యలు మొదలవుతాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే వెన్నెముక తన సహజసిద్ధమైన ఆకారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే, ఈ నొప్పుల నుంచి విముక్తి పొందడానికి ఉద్యోగాలు వదిలేయాల్సిన అవసరం లేదు; కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మొదటిగా, మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ ఎత్తును మీ నేరు కంటి చూపు లెవెల్‌కు సరిపోయేలా 'ల్యాప్‌టాప్ స్టాండ్' సహాయంతో సరిచేసుకోవాలి. దీనివల్ల స్క్రీన్ చూసేందుకు మెడను కిందికి వంచాల్సిన అవసరం ఉండదు. రెండోది, కూర్చునే భంగిమలో మార్పు తెచ్చుకోవాలి. వీపు మరియు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకుంటూ కుర్చీ వెనుక భాగానికి ఆనుకుని సౌకర్యవంతంగా కూర్చోవాలి. అలాగే కూర్చున్నప్పుడు మీ రెండు పాదాలు నేలకు పూర్తిగా సమాంతరంగా ఆని ఉండటం చాలా ముఖ్యం. అన్నింటికంటే కీలకమైన సూత్రం ప్రతి 40 నుండి 45 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం ఇవ్వడం. ఒకే చోట గంటల కొద్దీ కదలకుండా కూర్చోకుండా, కుర్చీ నుంచి లేచి రెండు నిమిషాలు గదిలో నడవాలి. నిపుణుల అధ్యయనాల ప్రకారం, క్రమం తప్పకుండా ప్రతి గంటకూ రెండు నిమిషాల సమయం వెచ్చించి శరీరాన్ని కాస్త కదిలించడం లేదా తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల రాబోయే మెడ, వెన్ను నొప్పుల తీవ్రతను 44% నుంచి 17% కి తగ్గించవచ్చని రుజువైంది. ఆఫీసు సమయంలో చిన్నచిన్న వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడుతుంది. కానీ, మీ మెడ లేదా వెన్ను నొప్పి తీవ్రమై, మెడను సాధారణంగా తిప్పలేకపోవడం, భుజాలు లేదా చేతులు మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అర్హత కలిగిన ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపీ వైద్యుడిని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం శ్రేయస్కరం.       [Neck Pain, Back Pain, Desk Jobs, Work From Home, Poor Posture, Laptop Ergonomics, Spine Health, IT Employees, Stretching Exercises, Physiotherapy]  
చాణక్యుడు చెప్పిన మాట.. దయచేసి ఇలాంటి పరిస్థితులలో మాత్రం మౌనంగా ఉండండి..  మానవ జీవితంలో మాట అనేది ఎంత శక్తివంతమైనదో, మౌనం కూడా అంతే ప్రయోజనకరమైనది. ఎన్నో  సందర్భాల్లో మనం మాట్లాడే మాటల కంటే మౌనంగా ఉండటమే మనకు గొప్ప గౌరవాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. నోటి నుంచి వచ్చిన మాటను తిరిగి తీసుకోలేము. కొన్నిసార్లు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా, సమయం , సందర్భం సరిగ్గా లేకపోతే అది తీవ్రమైన గొడవలకు, మనస్పర్థలకు దారితీస్తుంది. అందుకే  గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు అయిన ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మాటల వల్ల జరిగే సంఘటనల గురించి, మౌనం  గొప్పతనం గురించి వివరంగా చెప్పారు. జీవితంలో ప్రశాంతంగా, విజయవంతంగా ఉండటానికి ఎలాంటి పరిస్థితులలో మౌనంగా ఉండాలో చాణక్యుడు స్పష్టంగా మార్గదర్శనం చేశారు. ఆ ముఖ్యమైన ఆరు సందర్భాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నప్పుడు.. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్న  సమయంలో పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా మధ్యలో దూరి అభిప్రాయం చెప్పడం చాలా ప్రమాదకరం. సమస్యను పరిష్కరించాలనే మంచి ఉద్దేశం  ఉన్నప్పటికీ, అక్కడ ఉన్నవారు మీ మాటలను వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీ మాటలు ఒకరికే అనుకూలంగా ఉన్నాయని భావించి, మిమ్మల్ని కూడా ఆ వివాదంలోకి లాగుతారు. కాబట్టి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు వాతావరణం ప్రశాంతంగా మారే వరకు వేచి చూడటం, మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది. ఎదుటి వ్యక్తి  సలహాను స్వీకరించడానికి  ఇష్టపడనప్పుడు.. ఒక మనిషికి సలహా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉందంటే, ఆ వ్యక్తి దానిని వినడానికి, అర్థం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైనా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసి, మీ మాటలను అస్సలు పట్టించుకోవడానికి ఇష్టపడనప్పుడు, వారికి పదే పదే  చెప్పాలని చూడటం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా అది అనవసరమైన వాదనలకు దారితీస్తుంది. అటువంటి సమయంలో మీ అభిప్రాయాలను వారిపై రుద్దకుండా మౌనంగా వెనక్కి తగ్గడమే వివేకవంతమైన పని. మీ మాటలకు లేదా అభిప్రాయాలకు  గౌరవం లభించని చోట.. మీరు ఎంత మంచి విషయాలు చెప్పినా ఎదుటివారు మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటున్నా, లేదా మీ మాటలను పదే పదే  తోసిపుచ్చుతూ హేళన చేస్తున్నా అక్కడ పదే పదే మాట్లాడటం సరికాదు. ప్రతిసారి మిమ్మల్ని మీరు సరైనవారని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మాటలను  అక్కడితో ముగించి మౌనంగా ఉండటం ద్వారా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి వాదనలోనూ గెలవడం కంటే మన ప్రశాంతతను, గౌరవాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యం. పూర్తి సమాచారం లేదా స్పష్టత లేనప్పుడు.. సగం సగం తెలిసిన విషయాలతో లేదా కేవలం అంచనాలతో సలహాలు ఇవ్వడం చాలా నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా తీవ్రమైన లేదా సున్నితమైన విషయాలలో అవగాహన లేకుండా మాట్లాడితే ఇతరులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే ఒక విషయం గురించి సరిగ్గా తెలియనప్పుడు, దాని గురించి ముందుగా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. నాకు ఈ విషయం పూర్తిగా తెలియదు అని అంగీకరించి మౌనంగా ఉండటమే నిజమైన తెలివితేటలకు నిదర్శనం. ఇతరుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వివాదాల్లో.. ఇతరుల కుటుంబ విషయాలలో బయటి వ్యక్తులకు పూర్తి వివరాలు లేదా వారి మధ్య ఉండే పాత బంధాలు, భావోద్వేగాలు తెలియవు. అడిగి అడగకుండా అటువంటి విషయాల్లో సలహాలు ఇవ్వడం లేదా కల్పించుకోవడం అస్సలు మంచిది కాదు. కాలక్రమేణా కుటుంబ సభ్యులు తమ సమస్యలను తామే పరిష్కరించుకుని ఒకటవుతారు, కానీ ఆ సమయంలో మీరు అన్న మాటలు మాత్రం వారి మనస్సులో అలానే ఉండిపోతాయి. కాబట్టి ఇతరుల ఇంటి సంబంధిత గొడవల్లో మౌనంగా ఉండటమే మంచిది. ఎదుటి వ్యక్తి తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు.. కోపంలో ఉన్న మనిషి సాధారణ స్థితిలో ఆలోచించలేడు. ఆ సమయంలో మనం చెప్పే మంచి మాటలు లేదా ఇచ్చే సరైన సలహాలు కూడా వారికి విమర్శలాగానో లేదా వ్యతిరేకతలాగానో కనిపిస్తాయి. దీనివల్ల కోపం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం ఉండదు. అందుకే ఎదుటివారి కోపం చల్లారే వరకు ఓపికగా, మౌనంగా ఉండాలి. సరైన సమయం చూసి, ప్రశాంత వాతావరణంలో మాట్లాడితే వారు మీ మాటను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్న ఆరు పరిస్థితులలో చాణక్యుడు చెప్పినట్లుగా మౌనాన్ని ఆశ్రయించడం వల్ల మన ప్రశాంతత దక్కడమే కాకుండా, అనవసరమైన చిక్కులు, గొడవలు, ఆత్మీయులతో మనస్పర్థలు రాకుండా చూసుకోవచ్చు. సరైన సమయంలో మాట్లాడటం ఎంత ముఖ్యమో, సరైన సందర్భంలో మౌనంగా ఉండటం కూడా అంతే గొప్ప కళ.                              *రూపశ్రీ.  
డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా కనిపించే కొన్ని సమస్యలు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కూర్చొని లేవగానే తల తిరగడం, నిలబడినప్పుడు తూలినట్లు అనిపించడం, శరీరంలో బలహీనత, కండరాల బలం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తల తిరగడానికి షుగర్ కారణమా? లేక చెవి, మెదడు, మెడకు సంబంధించిన సమస్యల వల్ల Vertigo వస్తుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ డయాబెటిస్ మరియు Vertigo గురించి సులభమైన తెలుగులో ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. షుగర్ పూర్తిగా Zero అవుతుందా? డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయగలమా? Type 1 Diabetes, Type 2 Diabetes మధ్య తేడా ఏమిటి? శరీరంలో Insulin Resistance ఎలా ఏర్పడుతుంది? డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? వంటి సాధారణ సందేహాలకు ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. డయాబెటిస్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా పర్యవేక్షణ, శారీరక చురుకుదనం వంటి అంశాల ప్రాధాన్యతను కూడా తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉండవచ్చు? కండరాల బలం ఎందుకు తగ్గుతుంది? బలహీనత, లైంగిక సమస్యలు వంటి ఇబ్బందులకు డయాబెటిస్‌తో సంబంధం ఉందా? అనే విషయాలను కూడా డాక్టర్ వివరిస్తారు. ఇక తల తిరగడం లేదా Vertigo విషయానికి వస్తే ప్రతి తల తిరుగుడూ ఒకే కారణంతో ఉండదు. Vertigoలో వివిధ రకాలు ఉంటాయి. ముఖ్యంగా తల లేదా శరీరాన్ని ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్‌కు మార్చినప్పుడు అకస్మాత్తుగా తల తిరిగినట్లు అనిపించే BPPV (Benign Paroxysmal Positional Vertigo) గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే చెవికి సంబంధించిన సమస్యలు, Aural Vertigo, మెడకు సంబంధించిన Cervical Spondylosis, శరీర స్థితి (Posture) వంటి కారణాల వల్ల కూడా తల తిరగడం లేదా బ్యాలెన్స్ సమస్యలు రావచ్చని వివరిస్తున్నారు. తల తిరుగుతున్నప్పుడు అసలు కారణాన్ని గుర్తించడం ఎందుకు ముఖ్యమో, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో కూడా ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్‌ను క్రమం తప్పకుండా ఎలా మానిటర్ చేయాలి? శరీరంలో బలహీనత, కండరాల నష్టం రాకుండా ఎలాంటి జీవనశైలి పాటించాలి? Vertigo ఉన్నప్పుడు చెవుల ఆరోగ్యం, శరీర భంగిమ, రోజువారీ అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఉపయోగకరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా Homeopathy Approach గురించి కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు. అయితే డయాబెటిస్ లేదా Vertigo వంటి సమస్యలకు స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఇప్పటికే వాడుతున్న వైద్య చికిత్సను ఆపడం కాకుండా, అర్హత కలిగిన వైద్యుడి సలహాతోనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ కంట్రోల్, డయాబెటిస్‌లో వచ్చే సమస్యలు, తల తిరగడానికి కారణాలు, Vertigo రకాలు, BPPV, చెవి సమస్యలు, Cervical Spondylosis, ఆహారం మరియు రోజువారీ ఆరోగ్య జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్, Vertigo లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు వ్యక్తిగత చికిత్సను వైద్యుల సలహా లేకుండా మార్చకండి లేదా మందులను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఉదయాన్నే  పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజును చురుగ్గా ప్రారంభించడానికి కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు.  అయినప్పటికీ ఇవి శరీరంలో  అసిడిటీ, హార్మోన్ల అసమతుల్యత , ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. వీటి స్థానంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతూనే శరీరంలో ఉన్న అనారోగ్యాలను, జబ్బులను, ఇబ్బందులను తగ్గించగల పానీయం తాగడం చాలా మంచిది.  ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ అంత శక్తివంతమైన ఆ పానీయం ఏమిటో? దాన్ని ఎలా తయారుచేసుకుని తాగాలో.. వివరంగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. ధనియాలు,  జీలకర్ర,  సోంపు ,  వాము  పైన పేర్కొన్న దినుసులలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ​తయారీ విధానం... ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు , పావు టీస్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం అయ్యేంత వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం కాస్త నిమ్మరసం లేదా తేనె కూడా కలపవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కలిగే  ఉపయోగాలు.. ​హార్మోన్ల సమతుల్యత.. మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్, పిసిఓడి , పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం  వంటి సమస్యలకు ఈ పానీయం చాలా మేలు చేస్తుంది. ధనియాలు , సోంపు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. ​జీర్ణవ్యవస్థ మెరుగుదల.. జీలకర్ర , వాము జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ​రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయం.. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో జీలకర్ర , వాము కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం ద్వారా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ​చర్మ సౌందర్యం , డిటాక్సిఫికేషన్.. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. ​కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఈ పదార్థాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు , వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ​ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీరంలో సహజమైన మార్పులను గమనించవచ్చు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్  పానీయాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరంలో చాలా మార్పులు గమనించవచ్చు.                       *రూపశ్రీ.