
‘ఇండియన్’ లాంటి క్లాసిక్‌కు సీక్వెల్‌గా వచ్చిన ‘ఇండియన్ 2’ భారీ అంచనాలను అందుకోలేకపోయింది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడినా.. రిలీజ్ తర్వాత మాత్రం తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.
ఇప్పుడు అదే ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం రాబోతోంది. నిజానికి ‘ఇండియన్ 2’ రిజల్ట్ తర్వాత ఇక ‘ఇండియన్ 3’ ఉండకపోవచ్చని అందరూ భావించారు. కానీ, మేకర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు.
చెప్పినట్టుగానే తాజాగా లైకా ప్రొడక్షన్స్ ‘ఇండియన్ 3’ని అధికారికంగా ప్రకటించడంతో పాటు, పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. మూడు గుర్రాలపై ముగ్గురు భారతీయులు వస్తున్నట్టుగా ఆ పోస్టర్ ఉంది.
‘ఇండియన్ 2’ సమయంలోనే పారలాల్ గా ‘ఇండియన్ 3’ షూటింగ్ దాదాపు పూర్తయింది. అందుకే రెండో భాగం షాకిచ్చినా.. మూడో భాగం విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గడంలేదు.
‘ఇండియన్ 3’లో సేనాపతి రోల్ తో పాటు, అతని తండ్రి 'వీరశేఖరన్' పాత్ర వెనుకున్న హిస్టరీ మెయిన్ హైలైట్ కానుందట. కంటెంట్ పరంగా రెండో భాగంగా కంటే మూడో భాగం బెటర్ గా ఉంటుందని మూవీ టీం నమ్ముతోందట.
మరి ‘ఇండియన్ 2’తో దెబ్బతిన్న ఈ ఫ్రాంచైజీని ‘ఇండియన్ 3’ అయినా నిలబెడుతుందా? లేక ప్రేక్షకులు ఈ సీక్వెల్‌ను కూడా పట్టించుకోకుండా వదిలేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: ప్యారడైజ్ రిజల్ట్.. శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి చెప్పిన మాట ఇదే.!
[Senapathy Is Back, Indian 3 Confirmed, Indian 3 Movie, Indian 2 Movie, Kamal Haasan, Shankar, Lyca Productions, Telugu Film News]





