Read more!

20 మంది తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం..

 

పాక్ సరిహద్దు ఎల్వోసీ లో దాదాపు 20 మంది తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే యూరీ దాడి నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న భారత్.. ఎల్‌ఓసీ దాటి హెలికాప్టర్‌లో వెళ్లి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాదాపు ఇరవై మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ అయితే, ఈ విషయమై భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. యూరి దాడి పైన చాలా సీరియస్‌గా ఉన్నట్లు ప్రకటించారు. యూరి దాడికి ఎలా ప్రతీకారం తీసుకోవాలో ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ అంశం పైన చాలా సీరియస్‌గా ఉన్నట్లు చెప్పారు.

 

ఇదిలా ఉండగా.. కాశ్మీర్ లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం ఆర్మీకి అందింది. బందిపొర జిల్లాలోని అర్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం అందడంతో.. గ్రామానికి చేరుకున్న సైనికులు తనిఖీలు నిర్వహిస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆ ఇంటిని చుట్టుముట్టిన సైనికులు ఒక ముష్కరుడిని మట్టుపెట్టారు. మిగిలిన వారి పని పట్టేందుకు అదను కోసం వేచి చూస్తున్నారు.