Publish Date:Mar 9, 2019
Publish Date:Mar 5, 2019
Publish Date:Mar 2, 2019
Publish Date:May 22, 2015
Publish Date:May 16, 2015

EDITORIAL SPECIAL
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలిచిందే ఒక్క ఎమ్మెల్యే సీటు అంటే... అసలు గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే తమ వైపు ఉన్నాడో లేడో అర్థంగాక అటు జనసేనాని పవన్ కళ్యాణ్, ఇటు జన సైనికులు తలలు పట్టుకుంటున్నారు. జనసేన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తీరు ఆ పార్టీని కలవరపెడుతోంది. ఎమ్మెల్యే రాపాక పేరుకి జనసేనలో ఉన్నా... ఆయన వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా అధికార పార్టీ వైసీపీకి లాభం చేకూర్చేలా ఉంటున్నాయి. ఒకసారి అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ని దేవుడు అని ఆకాశానికెత్తారు. మరోసారెమో జగన్ ఫోటోకి పాలాభిషేకం చేసారు. ఈ చర్యలతో రాపాక పార్టీ మారతారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రాపాక పార్టీ మారలేదు, ఆయన తీరూ మార్చుకోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పెడితే ఓకే.. కానీ తెలుగు మీడియంని పూర్తిగా తొలగించడం ఏంటని పవన్ మండిపడుతున్నారు. తెలుగు బాషని కాపాడాలంటూ.. పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే రాపాక మాత్రం.. అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ  సందర్భంగా.. జగన్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పవన్ కి మద్దతు ఇవ్వట్లేదంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇక తాజాగా రాపాక చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ తాజాగా రైతుల కోసం దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అసెంబ్లీ సమావేశాల కారణంగా పవన్ సభకు హాజరు కాలేదని గతంలో చెప్పిన రాపాక.. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఇతర కారణాల వల్ల పవన్‌ సభకు వెళ్లలేదని చెప్పారు. అంతేకాదు, పవన్‌ ఏ కార్యక్రమం చేసినా.. పదిమంది మాత్రమే వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న విషయానికి ధర్నాలు, సభలు పెట్టడం సరికాదని రాపాక సూచించారు. ముందుముందు పవన్‌ సభలకు ఇంకా ఆదరణ తగ్గిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేసారు. మొత్తానికి రాపాక తీరు చూస్తుంటే జనసేనకి మరింత దూరం జరుగుతున్నారని అర్థమవుతోంది. వైసీపీలో చేరేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి రాపాక పార్టీ మారతారో లేక తన తీరుని మార్చుకుంటారో చూడాలి.
సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే... చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలు నిజమేననిపిస్తున్నాయి. మాట తప్పం... మడమ తిప్పమని చెప్పుకునే జగన్... అధికారంలోకి వచ్చాక అనేక హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నేను విన్నాను... నేను ఉన్నానంటూ చెప్పే సీఎం జగన్... కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గోస మాత్రం వినడం లేదంటున్నారు. ముఖ్యంగా మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మంత్రుల దగ్గర పీఆర్వోలుగా చేరి ఆర్నెళ్లు అవుతున్నా ఇఫ్పటివరకు జీతం ఇవ్వలేదని, కనీసం అపాయింట్ మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదని మాజీ జర్నలిస్టులు ఆవేదనకు గురవుతున్నారు. మంత్రులు తమకు నచ్చినవాళ్లను పీఆర్వోలుగా ఏర్పాటు చేసుకున్నాక అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని జీఏడీకి లేఖలు రాశారు. అలాగే నెలకు 30వేలు వేతనం ఇవ్వాలని సూచించారు. అయితే, 30వేలు సరిపోవని, కనీసం 50వేలు ఇవ్వాలంటూ మరో లేఖ రాశారు. మంత్రుల లేఖలు ఆర్ధికశాఖకు వెళ్లాయి. అయితే, పీఆర్వోలకు 30వేలు సరిపోతాయని ఆర్ధికశాఖ మెలిక పెట్టడంతో ఆ ఫైల్ ఎటూ కదలకుండా అక్కడే ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు ఆర్నెళ్లు కావొస్తున్నా, పీఆర్వోలు మాత్రం మంత్రుల దగ్గర గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఇవాళోరేపో అపాయింట్ మెంట్ ఆర్డర్స్ వస్తాయని, జీతాలు కూడా వస్తాయన్న ఆశతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, ఆర్నెళ్లు దాటినా ఇంకా అపాయింట్ మెంట్లు, జీతాలు రాకపోవడంతో పీఆర్వోలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కనీసం టీ తాగేందుకు కూడా డబ్బుల్లేక... తమ పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమలిపోతున్నారు. అయితే, మంత్రుల పీఆర్వోలకు సంబంధించిన ఫైలు ఇప్పటివరకు సమాచారశాఖకు అందలేదని అంటున్నారు. అక్కడ్నుంచి ఫైలు ముందుకు కదిలితే తప్ప పీఆర్వోలకు జీతాలు వచ్చే అవకాశమే లేదంటున్నారు.  తమ పాలనలో ఉద్యోగులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానంటూ గొప్పుగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి... ఆచరణలో మాత్రం చూపెట్టడం లేదని అంటున్నారు. కనీసం మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోలకే జీతాలు ఇవ్వకపోతే, ఇక మిగతా ఉద్యోగుల బాధలు ఎలా అర్ధమవుతాయని అంటున్నారు. నేను విన్నాను... నేను ఉన్నాననే జగన్మోహన్ రెడ్డికి... సచివాలయంలో మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోల దుస్థితి వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. మరి, మంత్రుల పీఆర్వోల గోస... జగన్ కు ఎప్పుడు వినబడుతుందో... వాళ్ల కష్టాలు ఎప్పుడు తీరతాయో... ఆ దేవుడికే తెలియాలి.
  తీవ్ర నిరాశా నిస్పృహలు.. ఆవేదన.. కూడకట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. భేషరతుగా ఉద్యోగాల్లో చేరొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్ కోర్టుకు పంపగలదని అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి తాము అలా చేయటం లేదని ఊరటనిచ్చారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ.100 కోట్ల రూపాయల ఇస్తున్నారని కూడా ప్రకటించారు. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ పేరిట చార్జీలనూ కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచేశారు. డిసెంబర్ 2 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. సమ్మె కాలంలో తాత్కాలికంగా పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బెదిరించినా.. అవమానించినా.. భరిస్తూ కష్టకాలంలో పని చేశారని భవిష్యత్తులో తప్పకుండా వారి గురుంచి ప్రభుత్వం ఆలోచిస్తుందని హామీ ఇచ్చారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.  ప్రభుత్వం ఎన్నో సంస్థలను కాపాడింది.. ఎంతో మందికి అన్నం పెట్టింది.. అలాంటిది ఆర్టీసీ కార్మికులను బజారున పడేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏముందని..చివరిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని కేబినెట్ చర్చల్లో మంత్రులు తెలిపినట్లుగా కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున.. ఆర్టీసీ సంస్థ తరుపున.. సదరు కార్మికుడికి చెబుతున్నా.. " ఇక ఇప్పటికైనా మీరు తెలుసుకోండి.. అందరి మాటలు నమ్మి మీరు మోసపోకండి.. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాను వెళ్లి ఉద్యోగాల్లో చేరి మంచిగ బ్రతకండి.. మీ సంస్థను బ్రతికించుకోండి " అని పిలుపునిచ్చారు కేసీఆర్. మీరు మా బిడ్డలని ఎన్నడో చెప్పాము అలానే చూసుకుంటాము. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల పొట్టనింపామే కానీ పొట్టలు కొట్టిన దాఖలాలు లేవని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆశా వర్కర్లకు,హోమ్ గార్డులకు ఇలా చాలా మందికి ఎక్కువ వేతనం ఇస్తుంది కేవలం తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు 30% శాతం రిస్క్ అలవెన్సు ఇస్తున్నామని.. ఇండియాలో తెలంగాణ ఒక్కటే దీనిని ఇస్తోందన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వారికి పింఛను ఇవ్వట్లేదని, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇవ్వడం లేదని వివరించారు. యూనియన్ల మాటలు నమ్మి కార్మికులు పెడదారి పట్టారని సంస్థను దెబ్బతీస్తున్నారని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
ALSO ON TELUGUONE N E W S
  "టాలీవుడ్‌లో హీరోగా నాకో గుర్తింపు వచ్చినందుకు మా ఇంట్లోవాళ్లు ప్రౌడ్‌గా ఫీలవుతున్నారు" అంటున్నాడు హీరో కార్తికేయ. ఇటీవలే '90ఎంఎల్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను తను సినిమాల్లోకి రాకముందు ఇంట్లోవాళ్లు ఎలా చూసేవారో, ఇప్పుడెలా చూస్తున్నారో 'తెలుగుఒన్'కు తెలియజేశాడు. "నాకు పాతికేళ్లు దాటిపోయినా కూడా ఇంట్లో చిన్నవాడ్ని కావడం వల్ల చిన్నపిల్లోడిగానే మావాళ్లు చూస్తూ వచ్చారు. నాకో అక్క ఉంది. ఆమె నాకన్నా ఆరేళ్లు పెద్ద. అక్క కూడా నన్ను అమ్మలాగే చూసుకుంటూ ఉంటుంది. మా కజిన్స్ కూడా నాకంటే పెద్దోళ్లు. అందుకని వాళ్లంతా నన్ను చిన్నపిల్లోడిగా చూస్తూ నాకేమీ తెలీదనుకుంటూ ఉంటారు" అని చెప్పాడు కార్తికేయ. అతను సినిమాల్లోకి రాకముందు వరకూ వాళ్లమీద ఆధారపడుతూ వచ్చాడు. "ఏ విషయం కూడా నాకు చూసుకోవడం రాదు, వాళ్లే చూసుకోవాలి.. అన్నట్లే ఉండేది నా పరిస్థితి. అలాగే నన్ను పెంచారు. ఇప్పుడు సడన్‌గా నాకు గుర్తింపు వచ్చి, ఎవరో తెలీనివాళ్లు మా ఇంటికొస్తూ, "మీ అబ్బాయి వస్తే చెప్పండి, మేం సెల్ఫీ తీసుకోవాలి" అని చెప్తుండేసరికి వాళ్లకు వెరైటీగా అనిపిస్తోంది. 'వీడికోసం వాళ్లు అంతగా ఫీలైపోతున్నారేమిటి?' అనుకుంటున్నారు మావాళ్లు. నాకు సెలబ్రిటీ స్టేటస్ రావడం వాళ్లకు కొత్తగా ఉంది. వాళ్లకేమీ అర్థం కావట్లేదు. 'వీడిలో ఏముంది? వీడిలో ఏంచూసి వీళ్లు వస్తున్నారు?' అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు నేనున్న స్థితికి అక్కయ్య కూడా హ్యాపీ. నావల్ల వాళ్లకు కూడా సినిమాలు చూడ్డం అలవాటయ్యింది. ఏ సినిమా ఏంటి అని చెక్ చేస్తున్నారు. అన్ని సినిమాలూ చూస్తున్నారు. 'నువ్విలా చెయ్యి, అలా చెయ్యి' అని చెప్తున్నారు" అని నవ్వుతూ చెప్పాడు కార్తికేయ.
  బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న, ఇంకా పేరుపెట్టని సినిమా బడ్జెట్ ఇప్పుడు ఫిలింనగర్‌లో డిస్కషన్ పాయింట్‌గా మారింది. జనరల్‌గా బోయపాటి మూవీ అంటేనే భారీ బడ్జెట్ ఉంటుంది. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు కూడా భారీ బడ్జెట్‌లో తయారయ్యాయి. వాటిలో 'సింహా' సినిమాకు మంచి లాభాలే రాగా, 'లెజెండ్' సినిమా వ్యయం విపరీతం కావడం వల్లే ఆశించిన రీతిలో నిర్మాతలకు లాభాలు అందలేదనేది ట్రేడ్ విశ్లేషకుల మాట. ఇప్పుడు బాలకృష్ణ కెరీర్ డౌన్‌ట్రెండ్‌లో ఉంది. క్రిష్ డైరెక్ట్ చేసిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు మంచి పేరైతే వచ్చింది కానీ, లాభాలు రాలేదు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'పైసా వసూల్' మూవీ పైసలను వసూలు చేయలేక చతికిలపడితే, కె.ఎస్. రవికుమార్ రూపొందించిన 'జై సింహా' సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నడిచింది. ఇక క్రిష్ దర్శకత్వం వహించగా ఈ ఏడాది మొదట్లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లోని రెండు భాగాలు - 'కథానాయకుడు', 'మహానాయకుడు' సినిమాలు రెండూ - ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. వాటిని నమ్ముకున్న బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న 'రూలర్' మూవీ రిలీజవుతోంది. కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు బయ్యర్ల నుంచి ఆశించిన రీతిలో స్పందన లేకపోవడం గమనార్హం. కలెక్షన్ల మీద ఆధారపడే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్‌లో 'రూలర్'పై అసలు బజ్ లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఓవర్సీస్ నుంచి నిర్మాత సి. కల్యాణ్ కనీసం 4 కోట్ల రూపాయలు ఆశించగా, ఆ మేరకు ఏ డిస్ట్రిబ్యూటర్ నుంచి కూడా స్పందన రాలేదని సమాచారం. దాంతో ప్రైడ్ సినిమా అనే డిస్ట్రిబ్యూటర్‌కు దీని రిలీజ్ బాధ్యతలు అప్పగించారు. ఆ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ బేసిస్ మీద ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఏదేమైనా ఖర్చుపెట్టిన వ్యయంతో పోలిస్తే ఎక్కువ నష్టానికే 'రూలర్'ను 20న విడుదల చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసే సినిమాకు 60 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం సరైనదేనా? అనే చర్చ ఫిలింనగర్ వర్గాల్లో నడుస్తోంది. ఈ మూవీని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి డైరెక్ట్ చేసిన 'జయ జానకి నాయక' సినిమాను నిర్మించింది ఆయనే. దాన్ని కూడా బెల్లంకొండ మార్కెట్ పరిధితో పోలిస్తే, చాలా ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించారు. దాంతో ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌తో ఆయన గట్టెక్కారు. అయినప్పటికీ బాలయ్య, బోయపాటి కాంబో మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి రవీందర్‌రెడ్డి ఏమాత్రం సంకోచించడం లేదు. కారణం.. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు హిట్టవడమే. పైగా కెరీర్‌లో డౌన్ స్టేజిలో ఉన్నప్పుడు వచ్చిన ఆ సినిమాలతోనే బాలయ్య మళ్లీ పుంజుకోగలిగారు. దీంతో ఆ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్‌ను సాధిస్తుందనే అపార నమ్మకంతో 60 కోట్ల బడెజ్ట్ పెట్టడానికి రవీందర్‌రెడ్డి రెడీ అవుతున్నారు. రాంచరణ్‌తో బోయపాటి తీసిన మునుపటి మూవీ 'వినయ విధేయ రామ' ఫ్లాప్ కూడా ఆయనను వెనకడుగు వెయ్యనివ్వడం లేదు. యాక్షన్ డ్రామాగా తయారయ్యే ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమచారం. ఆ ఇద్దరి మునుపటి సినిమాల్లోనూ బాలయ్య డబుల్ రోల్ చెయ్యడం గమనార్హం. పైగా తాజా మూవీలో బాలయ్య చేస్తున్న పాత్రల్లో ఒకటి పోలీసాఫీసర్ అని తెలుస్తోంది. 'రూలర్'లోనూ ఆయన పోలీసాఫీసర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు సినిమాల్లో పోలీస్ పాత్రలు చేస్తుండటం విశేషం. బోయపాటి బలమల్లా ఎమోషనల్ సీన్లు చిత్రీకరించడంలోనే ఉంది కాబట్టి, ఈ మూవీలో అలాంటి సీన్లు మరిన్ని ఉంటాయని సమాచారం. ఆ తరహాలో రైటర్ ఎం. రత్నం రాసిన కథకు బాలయ్య ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో 60 కోట్ల భారీ బడ్జెట్ రికవర్ ఎలా అవుతుందని బాలయ్య ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
టాలీవుడ్‌ ప్రజెంట్‌ టాప్‌ హీరోయిన్లలతో రష్మిక పేరు తప్పకుండా ఉంటుంది. తెలుగులో స్టార్‌డమ్‌ రాకముందు కన్నడ హీరో రక్షిత్‌ శెట్టితో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. తర్వాత అభిప్రాయభేదాలు రావడంతో బ్రేకప్‌ అయ్యారు. ఈ కథ అంతా మన తెలుగు ప్రేక్షకులకూ కాస్తో కూస్తో తెలుసు. తెలుగులో స్టార్‌డమ్‌ రావడంతో కన్నడ హీరోకు రష్మిక టాటా చెప్పేసిందని ఓ గుసగుస. ఇవన్నీ పక్కన పెడితే... ఆ కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి మరో హీరోయిన్‌తో తాజాగా ప్రేమలో పడ్డాడని టాక్‌. తెలుగులో ‘రౌడీ’లో మంచు విష్ణు సరసన నటించిన శాన్వీ శ్రీవాస్తవ గుర్తుందా? ‘లవ్లీ’, ‘ప్యార్‌ మే పడిపోయానే’ సినిమాల్లో ఆది సాయికుమార్‌, ‘అడ్డా’లో సుశాంత్‌ పక్కన హీరోయిన్‌గా నటించింది. ఆమెతో రక్షిత్‌ శెట్టి ప్రేమలో పడ్డాడని శాండిల్‌వుడ్‌ సమాచారం. తెలుగు (‘అతడే శ్రీమన్నారాయణ’)తో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో  విడుదలవుతున్న కన్నడ సినిమా ‘అవనే శ్రీమన్నారామణ’లో రక్షిత్‌, శాన్వి జంటగా నటించారు. దాదాపుగా 200 రోజులు ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. రెండేళ్ళుగా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో రక్షిత్‌, శాన్వి మధ్య ప్రేమ చిగురించిందని టాక్‌. గత అనుభవం దృష్ట్యా ఈసారి ఎంగేజ్‌మెంట్‌ గట్రా ఏం లేకుండా డైరెక్ట్‌గా పెళ్లి చేసుకోవాలని రక్షిత్‌ డిసైడ్‌ అయ్యాడట.
సినిమాలు సినిమాలే! రాజకీయాలు రాజకీయాలే! రాజకీయాల్లో వైఫల్యాలు వచ్చినా సినిమా నటీనటులకు ప్రజల్లో ఉండే క్రేజ్‌ ఏమాత్రం తగ్గదని, చెక్కుచెదరదని చెప్పడానికి గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. రాజకీయాల్లో వైఫల్యాలు పక్కనపెట్టి, సినిమాల్లో సక్సెస్‌ కొట్టిన హీరోలు ఈ దేశంలో ఉన్నారు. రాజకీయాల్లో పవన్‌కల్యాణ్‌ ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నాయనేది పక్కనపెడితే... ఆయన్ను అభిమానించే ప్రేక్షకులు సంఖ్య తక్కువేమీ కాదు. అటువంటి పవన్‌కల్యాణ్‌ రీఎంట్రీ సినిమా ప్రకటనలో ఆయన పేరు లేకపోవడం ఆశ్చర్యమే. తెలుగులో హిందీ హిట్‌ ‘పింక్‌’ను అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో కలిసి ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌ రాజు రీమేక్‌ చేస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్‌’, ‘ఎంసీఏ’కు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్‌, ఈ సినిమాకు దర్శకుడు. ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రొడక్షన్‌ హౌస్‌ ట్వీట్‌ చేసింది. అందులో ఎక్కడా పవన్‌కల్యాణ్‌ పేరు ప్రస్తావించలేదు. సినిమా యూనిట్‌ ఎవరూ పవర్‌స్టార్‌ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ రాజకీయ సభలతో బిజీగా ఉండడమే అందుకు కారణమని సమాచారం. హిందీలో అమితాబ్‌ చేసిన పాత్రను తెలుగులో పవన్‌ చేయనున్నారు. తాప్సీ పాత్రను నివేదా థామస్‌, మరో పాత్రలో అంజలి నటించనున్నారు. జనవరిలో షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారట.
అదేంటి? శివాత్మిక అంటే యాంగ్రీ హీరో రాజశేఖర్, నటి జీవిత దంపతుల రెండో కుమార్తె కదా! ప్రకాష్ కూతురు అంటున్నారు ఏంటి అనే సందేహం వచ్చిందా? నిజమే... నిజ జీవితంలో రాజశేఖర్ కుమార్తె. కృష్ణవంశీ చిత్రంలో మాత్రం ఆమె ప్రకాష్ రాజు కూతురు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా... బ్రహ్మానందం ప్రధాన పాత్రలో దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం 'రంగ మార్తాండ'. ఇందులో శివాత్మిక రాజశేఖర్ నటిస్తోంది. 'రంగ మార్తాండ'లో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ దంపతుల కుమార్తెగా శివాత్మిక కనిపించనుంది. వృత్తిరీత్యా గాయని పాత్ర. 'దొరసాని' తర్వాత శివాత్మిక నటిస్తున్న చిత్రం ఇదే. ఆ సినిమాలో ఆమెకు మంచి పేరు వచ్చింది. లుక్స్ పరంగా, నటన పరంగా ‌ ప్రేక్షకుల నుండి, పరిశ్రమ వర్గాల నుండి మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో అనుకున్న పేరు శివాత్మికకు రాలేదు. 'రంగ మార్తాండ'తో పెద్ద గుర్తింపు లభిస్తుందని ఆమె ఆశిస్తోందట. కథానాయికలను చూపించడంలో కృష్ణవంశీ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా!
ఏపిలో టిడిపిని ఏదో ఒక విధంగా బోనెక్కించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెగ ఆరాటపడుతున్నారు. ఈ వైఖరి శృతిమించి వారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవాలి. తాజా విషయం లోకి వస్తే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రశ్న సంధించారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా గత కాంట్రాక్టర్ కు రూ.2,343 కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు జరిగినట్టుగా తెలిసిందన్నారు. పోలవరం హైడల్ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా రూ.787 కోట్ల రూపాయలను నవయుగ కంపెనీకి చెల్లించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఈ అంశాలు నిజమైతే సంబంధిత వివరాలివ్వాలని విజయసాయిరెడ్డి కోరారు.  తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అంటారే విజయసాయిరెడ్డి విషయం లోనూ ఇదే జరిగింది. ఆయన ఆశించింది ఒకటైతే సంబంధిత మంత్రి ఇచ్చిన వివరణ మరో రకంగా ఉంది. విజయసాయిరెడ్డి ప్రశ్నపై రాజ్యసభలో జలశక్తి శాఖ మంత్రి రతన్ లాల్ కఠారియా బదులిచ్చారు. కేంద్ర జల సంఘానికి ఏపీ ప్రభుత్వం నుంచి అందిన తాజా సమాచారాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టులో 2,346 కోట్ల 85 లక్షల రూపాయల అదనపు చెల్లింపులు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తమ దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు 787 రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లుగా కూడా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే 2019 నవంబర్ 13 వ తేదీ న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ పంపిందని కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియా చెప్పుకొచ్చారు. నిపుణుల కమిటీ అభిప్రాయం కేవలం ప్రాథమిక నిర్థారణ మాత్రమేనని నిధుల విడుదలలో కాని వ్యయంలో కాని ఎటువంటి నిబంధనల ఉల్లంఘింపు జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో పేర్కొన్నదని కేంద్ర మంత్రి చదివి వినిపించారు.  దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం కూడా కాంపిటెంట్ అథారిటీ అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని కూడా రతన్ లాల్ కఠారియా స్పష్టం చేశారు. ఈ అంశాల పై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం దర్యాప్తు కూడా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో అదనపు చెల్లింపులు గురించి కేంద్రమంత సీరియస్ గా లేదని కేంద్ర మంత్రి సమాధానం ద్వారా విజయసాయిరెడ్డికి బోధపడింది. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయమూ ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని రతన్ లాల్ కటారియా విస్పష్టంగా పేర్కొనడంతో సభలో ఉన్నవారు సైతం ఆశ్చర్యపోయారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అదనపు చెల్లింపుల గురించి ప్రస్తావించారేగానీ ఆ ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వమే సదరు లేఖలో పేర్కొన్న విషయాన్ని తెలుగుదేశం నేతలు బయటపెట్టారు. ఈ అంశాన్ని టిడిపి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు సదరు లేఖను తెప్పించుకుని చూసి ఆశ్చర్యపోయారు. ఇదండీ ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్న బూమరాంగైన విచిత్ర సన్నివేశం.
కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుక పోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అలాంటిది కృష్ణాజిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. నిజానికి రాజకీయ చైతన్యానికి మారుపేరు కృష్ణా జిల్లా అని అంటూ ఉంటారు. కానీ అక్కడ రాజకీయంగా ఎప్పుడూ ఏదో ఒక కలకలం జరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు గన్నవరం నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేశారు. ఆయనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి వీరిద్దరూ ఒకనాడు మంచి స్నేహితులు అయినప్పటికీ రాజకీయాల్లో ఇరువురి మధ్య వైరం పెరిగింది. వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన గుడివాడ ఎమ్మెల్యే పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చొరవ చూపడంతో ఎట్టకేలకు వీరిరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ మోహన్ టిడిపికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన వాట్సప్ లో పంపించిన లేఖ ఆ తర్వాత చేసిన వ్యతిరేక వ్యాఖ్యల పై టిడిపి హైకమాండ్ సీరియస్ గా స్పందించింది. వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ తన పై టిడిపి సస్పెండ్ వేటు వేయడానికి ముందే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారని తెలుసుకున్న గన్నవరం పార్టీ శ్రేణులు యార్లగడ్డ వెంకట్రావు నివాసం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వెంకటరావుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి బాలశౌరిలు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయనను జగన్ తో కూడా మాట్లాడించారు. వంశీని పార్టీలో చేర్చుకునేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ యార్లగడ్డ వెంకట్రావును వదులుకునేందుకు మాత్రం ససేమిరా ఇష్టపడలేదు. ప్రస్తుతానికి వంశీ శాసన సభలో తటస్థ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు. అవసరమైనపుడు ఆయనతో రాజీనామా చేయించి తిరిగి గన్నవరం నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలా లేదా అనేది నిర్ణయం తీసుకుందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించింది. ఇదిలా వుంటే జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్తవారొచ్చినా పాతవారిని వదులుకోకూడదు అనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానంగా కనిపిస్తుంది. తను ఇచ్చిన మాట ప్రకారం యార్లగడ్డ వెంకట్రావుని వెంటనే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా జగన్ నియమించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఘన చరిత్రే ఉంది. ఇలాంటి బ్యాంకు చైర్మన్ గా నియామకం కావడం వెంకట్రావు కూడా సంతృప్తినిచ్చింది. ఆయనకు పదవి ఇవ్వడంతో పాటు వల్లభనేని వంశీకి కూడా ఎలాంటి తలనొప్పి లేకుండా జగన్ లైన్ క్లియర్ చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నారు. అలాగే గన్నవరం నియోజక వర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న యార్లగడ్డ వెంకట్రావు కూడా న్యాయం చేశారని వారు చెప్పుకుంటున్నారు. ఇక పెడన లోనూ ఇదే విధానాన్ని సీఎం జగన్ అనుసరించారు. ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకు పార్టీ టిక్కెట్ ని ఆశించి భంగపడిన ఉప్పాల రాంప్రసాద్ కి కూడా సంతృప్తి కలిగేలా వ్యవహరించారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని రాంప్రసాద్ కు కట్టబెట్టారు. నిజానికి పెడనకు గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన జోగి రమేష్ కు చివరి నిమిషంలో పార్టీ టికెట్ ఇచ్చారు. అప్పట్లో రాంప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎంపీ బాలశౌరి రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించారు. అధికారం లోకొచ్చిన తర్వాత రాంప్రసాద్ కు న్యాయం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని ఉప్పాల రాంప్రసాద్ కు ఇచ్చారు. దీంతో జోగి రమేష్ కి కూడా పెడన నియోజకవర్గంలో పార్టీ పరంగా తలనొప్పి తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న వారికి సీఎం జగన్ న్యాయం చేయడంతో పాటు పార్టీలోకి రావాలనుకునే వల్లభనేని వంశీ వంటి ఎమ్మెల్యేలకు మార్గం సుగమం చేస్తున్నారు. ఈ పరిణామం పై పార్టీ కేడర్ లో కూడా ఎటువంటి సందిగ్ధం లేకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. మరి ఆ వ్యూహాలు మున్ముందు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి.
  కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలుస్తాయి. అక్కడి ప్రజాప్రతినిధులు ఒకరి పై ఒకరు చేసుకునే ఆరోపణలు రాజకీయంగా వేడి రాజేస్తాయి. రాజకీయపరంగా విమర్శలు.. ప్రతివిమర్శలు..ఉంటేనే రాజకీయం కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా రాజకీయ విమర్శలన్ని ఆస్తులు.. అవినీతి ఆరోపణల చుట్టూ తిరుగుతుంటాయి. చివరికీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగించడమే కాదు రాజకీయంగా ఇరకాటంలో పడవేస్తుంటాయి. ఇలాంటి వ్యవహారాలు గతంలో కూడా చాలానే జరిగాయి.  రాష్ట్ర విభజన అనంతరం.. చొప్పదండి నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొడిగ శోభపై కూడా ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలే ఎక్కుపెట్టాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధికి ఎమ్మెల్యే మాములు వసూలు చేసే వారని.. కమీషన్ లేనిదే సంతకాలు పెట్టేవారు కాదంటూ.. ఆరోపణలొచ్చాయి. ఇది రెండేళ్ళ క్రితం నాటి కథ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆమె స్థానంలో సుంకె రవిశంకర్ తెరమీదకొచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. అవినీతి ఆరోపణలతో చొప్పదండి నియోజక వర్గ రాజకీయాలు మళ్లీ రెండేళ్లు వెనక్కి వెళ్లాయి. రవిశంకర్ పై కూడా అక్రమాస్తులకు సంబంధించి ఆరోపణలు రావడంతో చర్చ మొదలైంది. శోభకు ఎదురైన పరిస్థితులే ఇప్పుడు రవిశంకర్ కు ఎదురవుతున్నాయి. మరిప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నాడనే డిస్కషన్ కార్యకర్తల్లో మొదలైంది.  మరోవైపు ప్రతిపక్షాలకు తమ పార్టీ నుంచే ఎవరో ఒకరు లీకులిస్తున్నారనే అనుమానాలు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో కలుగుతున్నాయి. ఎక్కడి నుంచి లీకయిందనే విషయం తెలిసినా బయటకు చెప్పలేకపోతున్నారు. దీనిని ఉపయోగించుకొని కాంగ్రెస్ తన వద్ద ఉన్న సమాచారంతో ఎమ్మెల్యే పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. ఎమ్మెల్యే రవిశంకర్ పాత ఎమ్మెల్యేనే ఫాలో అవుతున్నారనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ నేతల సైతం కౌంటర్ ఎటాక్ చేయడం మొదలెట్టారు. తమ ఎమ్మెల్యే నీతి నిజాయితీని శంకిస్తే సహించేది లేదంటూ మండిపడుతున్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలను పక్కనబెడితే ఇదంతా అధికార పార్టీ నుంచే కాంగ్రెస్ కు సమాచారం వెళుతుందని అనుకుంటున్నారు. ఓవరాల్ గా చొప్పదండిలో వస్తున్న అవినీతి ఆరోపణల విషయం మాత్రం ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. దీంతో ఆ పదవిలో ఉండేవాళ్లు ఇదేం ఖర్మరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు.
  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగిన నాయకులు.. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన రవీందర్ రెడ్డి పక్కా టీఆర్ఎస్ కాండిడేట్ అని చెప్పుకోవచ్చు. 2004 లో రాజకీయ అరంగేట్రం చేసిన రవీంద్రరెడ్డి ఇంతవరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే స్థానానికి ఆరుసార్లు పోటీ చేయగా నాలుగు సార్లు గెలిచారు, రెండుసార్ల ఓడిపోయారు. 2008 ఉప ఎన్నికల్లో ఓసారి, 2018 ఎన్నికల్లో మరోసారి పరాజయం పాలయ్యారు. మిగతా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఇతర పదవులు పదోన్నతులు మాత్రం పొందలేకపోయారు. పార్టీ అధిష్టానంలో ఆయన పట్టు సాధించలేకపోవడం ఒక కారణమైతే జనంలో వ్యతిరేకత పెరగడం మరో కారణంగా మారింది. దీంతో గత ఎన్నికల్లో రవీందర్ రెడ్డి పరిస్థితి ఆశాజనకంగా లేదని నిఘా వర్గాలు ముందుగానే సంకేతాలిచ్చాయి. అభ్యర్థిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఎల్లారెడ్డి స్థానం గెలిచే అవకాశం లేదని గులాబీ బాస్ కు ముందస్తుగా వర్తమానం కూడా అందింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఎల్లారెడ్డిలో మాత్రం పరాజయం పాలైంది. ఇక్కడ కాంగ్రెస్ కు చెందిన నల్లమడుగు సురేందర్ చేతిలో సుమారు 34 వేల ఓట్ల తేడాతో రవీందర్ రెడ్డి పరాజయం పాలయ్యారు.  రాష్ట్రమంతటా అనుకూల పవనాలు వీచినప్పటికీ ఎల్లారెడ్డిలో మాత్రం ఎదురుగాలి తగలడంతో పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. ఇది కేవలం రవీందర్ రెడ్డి స్వయంకృతాపరాధమేనని తేల్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నల్లమడుగు సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమో.. తన మనుగడ కోసమో తెలీదు కానీ నల్లమడుగు సురేందర్ గులాబీ గూటిలో చేరడంతో ఎల్లారెడ్డి రాజకీయం రంజుగా మారింది. స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో టిఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ రెడ్డి తన ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 15 ఏళ్లుగా తన వెంట ఉంటున్న అనుచరుల కోసం గట్టిగా పని చేయాలని ఆయన భావించారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన వర్గీయులకు టికెట్లు ఇప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ వర్గాన్ని ఢీకొనేందుకు సొంతంగా ప్రతి మండలంలో తన అనుచరులను రంగంలోకి దింపారు. ఈ ఇరువర్గ పోరు కారణంగా నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఎల్లారెడ్డి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నాగిరెడ్డిపేట ఎంపిపి కుర్చినీ స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. మిగతావన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడినప్పటికీ వారంతా ఎమ్మెల్యే సురేందర్ వర్గీయులు కావడం విశేషం. అప్పటి నుంచి రవీందర్ రెడ్డి తన పంథా మార్చారు. మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని భవిష్యత్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. వారి అనుచరుడిగా చలామణి అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.  ప్రధానంగా తాను హరీశ్ రావు వర్గియుడనని చాటుకునే ప్రయత్నాలను ఏనుగు రవీందర్ రెడ్డి ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని తన వర్గీయులను హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు. ఇటీవల వరుసగా 3 రోజుల పాటు తన వారిని తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కల్పించారు. ఎల్లారెడ్డి, లింగంపేట, సదాశివనగర్, గాంధారి మండలాలకు చెందిన నాయకులను పరిచయం చేసి ఇదంతా తన వర్గమని చూపించారు. హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇలా దూకుడు పెంచారు. దీంతో పాటు ఎల్లారెడ్డిలో తన వర్గీయులతో ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేక శిబిరం నడుపుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే పార్టీ సమావేశాలు చర్చలు రవీందర్ రెడ్డి శిబిరంలోనే జరుగుతున్నాయి. అధికారికంగా ఎమ్మెల్యే సురేంద్ర నడుపుతున్న ఆఫీస్లో ఈయన వర్గీయులెవరూ కనిపించడం లేదు. రవీందర్ రెడ్డి వర్గీయులు ఇంత వరకు ఎమ్మెల్యే ఆఫీసు గడప కూడా తొక్కలేదు,అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, ఎమ్మెల్యే నిర్వహించే పార్టీ సమావేశాలు సభలకు హాజరవడం లేదు, రవీందర్ రెడ్డి వచ్చినపుడు మాత్రమే వారు ఎల్లారెడ్డిలో దర్శనమిస్తున్నారు, అది కూడా రవీందర్ రెడ్డి వెంట ఆయన ఉన్నంత సేపు హడావుడి చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇరువర్గాల పోరు నానాటికీ ముదురుతున్నట్టు కనిపిస్తోంది.  ఇక త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వర్గపోరు ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అయ్యాక తొలిసారి జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు ఆందోళనకు చెందుతున్నారు. కౌన్సిలర్ ల టికెట్ లు మొదలు వారిని గెలిపించుకునే వరకు ఇటు నల్లమడుగు సురేందర్, అటు ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించే సూచనలున్నాయి. ఇప్పటికే రవీందర్ రెడ్డి తన అనుచరుల్ని మున్సిపల్ చైర్మన్ చేయాలని భావిస్తున్నారు, ఆ అభ్యర్థి పేరు కూడా ఖరారు చేశారు. దీనిపై హరీశ్ రావు ద్వారా అంతర్గత ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సురేంద్ర మాత్రం కేటీఆర్ ద్వారా తన పరువు ప్రతిష్ట కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. మొదటి నుంచి హరీశ్ రావు అనుచరుడిగా ఉన్న రవీంద్రరెడ్డిపై సహజంగానే కేటీఆర్ కు సానుభూతి లేదు. దీనికి తోడు ఆయన ఇటీవల హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వెంట తిరగడంతో కేటీఆర్ దృష్టిలో బలంగా నాటుకుపోయారు. ఈ వర్గపోరు కారణంగా ఏనుగు రవీందర్ రెడ్డిని మరింత దూరం చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్ పావులు కదుపుతున్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదని కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే అయోమయంలో స్థానిక గులాబీ దళం ఉండగా అన్నీ కలిసొస్తే హరీశ్ రావు నీడను మళ్లీ అందలం ఎక్కుతాననే ఆశ విశ్వాసం మాత్రం ఏనుగు రవీందర్ రెడ్డికి ఉంది. మరి ఎవరి ఆశలు నెరవేరుతాయో ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాలి.
రెండు మాసాలు సమ్మె చేశారు.. రెక్కాడితే కానీ డొక్కాడదని తెలిసి కూడా ఫలితం కోసం ముందడుగు వేశారు. ప్రభుత్వానికి.. విపక్షాలకి.. మధ్య కార్మికులు అనిగిపోయారనే విధంగా అనుకునే స్థాయిలో సమ్మె ముగింపు దారితీసింది. ఇదిలా ఉండగా.. సూర్యాపేట డిపో , ఎల్.కృష్ణ అనే ఆర్టీసీ కండెక్టర్.. సమ్మె కాలంలో తాను అనుభవించిన క్షోభను..మనోవేధనను ఒక లేఖలో సీఎం కేసీఆర్ గారికి రాసాడు. ఆ లేఖలో ఇలా రాసాడు." గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి , తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదామనుకున్నా..కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా అనే విధంగా తీవ్ర మానసిక వేదనకు గురై.. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మీకు మాట తప్పడం మాయ మాటలు చెప్పి మోసం చేయడం తెలుసని మా కార్మికలోకం లేటుగా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు.. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దీనికి కారణం లేకపోలేదు సార్.. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సారూ ఉన్నారు కదా అనుకున్నాను. ఆంధ్రా పాలకులు నిజంగా మోసం చేశారేమో మనల్ని ఈయన బాగా చూసుకుంటారని అనుకున్నా కానీ సార్.. 20 మందికి పైగా కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సార్ అప్పుడనిపించింది సార్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణ కేవలం మీలాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని కలలో కూడా ఊహించలేదు సార్.. కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యమైంది. సార్ నా చెల్లెళ్లు ఏడుస్తుంటే.. రోజూ నా సోదరులు బాధపడుతుంటే.. తట్టుకోలేకపోతున్నా.. సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం సార్ నా ఆర్టీసీ అక్కాచెల్లెళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది. సార్ నేను సూర్యపేట డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మీలాంటి ఒక్క మోసకారి, ఒక్క మాటకారి, ఒక్క మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా నా పేరు ఎల్ కృష్ణ, నా స్టాఫ్ నెంబర్ 176822, సూర్యాపేట డిపో సార్ నాది, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను మీ సంస్థ నుండి నాకు రావలసిన బకాయిలు ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి. అయ్యా సీఎం సార్ గారూ మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకొండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి, పాపం సార్ ఆర్టీసీ వాళ్లు మిమ్మల్ని చాలా అభిమానించారు సార్. కానీ మీరు ఇలా చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు. సార్ ఆర్టీసీ కార్మికులు వాళ్లకొచ్చే రూ.16,000 రూపాయల జీతం తీసుకుని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బతుకుతున్నారు సార్.మీరు వాళ్ళకేమీ ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీ మీద గౌరవంతో ప్రాణాలిచ్చే వారు సార్. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను, కనీసం మా తల్లితండ్రులను అయినా సంతోషంగా ఉండేటట్లు నెలనెలా వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ నివ్వండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి.. మా కేసీఆర్ అని ఓటు వేశారు సార్. ప్రతి రోజూ ఈ అరెస్ట్ లేంది, ఈ లాఠీ దెబ్బలు ఏంది సార్, నా ఆర్టీసీ సోదరులు ఏం తప్పు చేశారని ఇంకా ఎంతమందిని ఆత్మహత్యలూ చేసుకునేటట్టు చేస్తారు. అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మాభిమానాన్ని చంపుకునే ఉద్యోగం చేయలేను, అందుకే నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు, మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని, నీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లితండ్రులకు వృద్ధాప్య పింఛను ఒకటి ఇవ్వండి. పేరు మీద సెంటు భూమి లేదు కాబట్టి మూడెకరాల పొలం, అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్ లో చదువు, నాకు ఉండటానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వండి ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్నా సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు. ఇట్లు ఎల్ కృష్ణ, స్టాఫ్ నెంబర్ 176822, ఆర్టీసీ కండక్టర్ సూర్యాపేట డిపో. " ఇలా తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ గారికి పంపించాడు. ఇలా అందరూ రాస్తే రోజు పుస్తకాలు చదవడం మానేసి లెటర్లు చదువుకోవాలని కొందరు అంటుంటే.. అలా చదివితేనైనా మానవత్వం అనేది పుట్టుకొస్తది మా కేసీఆర్ కి అని కొందరు అంటున్నారు.
  2019 ఎన్నికల్లో శ్రీ కాకుళం జిల్లాలో ఫ్యాన్ గాలి బలంగానే వీచింది. సిక్కోలులో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 8 చోట్ల వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వీచిన వ్యతిరేక పవనాలు సిక్కోలును తాకాయి. దీంతో టిడిపి డీలా పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీ నేతల్లో మంచి జోష్ కనిపించింది. ఇక సిక్కోలులో పార్టీకి తిరుగులేదనే తీరులో ఉన్నారు నేతలు. మెజారిటీ సీట్లు సాధించమన్న ధీమా వారిలో ఏర్పడింది. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చి 6 నెలలు గడవక ముందే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నాయని లోకల్ టాక్.  వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధర్మాన కుటుంబం పెద్ద దిక్కుగా చెప్పాలి. పార్టీ ఆవిర్భావ సమయంలో జిల్లాలో వైసీపీ జెండా చేపట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని వదిలేసి ధర్మాన కృష్ణదాస్.. వైయస్ జగన్ కు బాసటగా నిలిచారు. అంతేకాదు ఆ పార్టీకి మేమున్నామంటూ కృష్ణదాస్ భార్య పద్మప్రియ పార్టీ జిల్లా బాధ్యతలు స్వీకరించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కృష్ణదాస్ కుటుంబానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సముచిత స్థానం కల్పించారు.తన క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా క్రిష్ణదాసును నియమించారు. దీంతో విధేయతకు జగన్ పట్టం గట్టారన్న భావన పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది.  ఇక రాజకీయ అనుభవం విషయానికొస్తే ధర్మాన సోదరుల్లో ప్రసాదరావు సీనియర్.. గతంలో ధర్మాన ప్రసాదరావు , క్రిష్ణదాసు వేర్వేరు పార్టీలు ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రసాదరావు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. మొన్నటి ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో, క్రిష్ణదాస్ నరసన్నపేట అసెంబ్లీ స్థానంల్లో విజయం సాధించారు. సీనియర్ కాబట్టి ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పీఠం దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ జగన్ వ్యూహాత్మకంగా ఈ సోదరుల్లో పెద్దవాడైన కృష్ణదాస్ కి మంత్రి కుర్చీ వేశారు.అంతే అప్పటి నుంచి ఈ ధర్మాన సోదరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.  సిక్కోలులో ఏదైనా ప్రభుత్వం  పథకాన్ని లేదా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జిల్లా కేంద్రంలో శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. అందులో జిల్లా మంత్రిగా ఉన్న కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం సహజం. అయితే కృష్ణదాస్ అటెండవుతున్న కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొడుతుండటం కొత్త చర్చకు దారితీస్తుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలు జారీ, సన్న బియ్యం పంపిణీ, అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ, వైయస్ఆర్ వాహన మిత్ర వంటి పలు కార్యక్రమాలనూ జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళంలో అట్టహసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ప్రసాదరావు జాడ కనిపించలేదు.  ఇటీవల జరిగిన ఓ పరిణామం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు తెరతీసింది. జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమితులైన కొడాలి నాని నవంబర్ 14 న సిక్కోలు పర్యటనకు వచ్చారు. అయితే జిల్లా కేంద్రానికి వచ్చిన కొడాలి నాని స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. అదే సమయంలో మంత్రి క్రిష్ణదాస్ సైతం కొడాలి వెంట ప్రసాదరావు ఇంటికెళ్లారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఈ అన్నదమ్ములిద్దరి మధ్య మరింత దూరం పెంచాయని స్థానికంగా కొందరు చెప్పుకుంటున్నారు. ఈ జిల్లాలో మంత్రి క్రిష్ణదాస్ ఉండేమి లాభం? స్పీకర్ తమ్మినేని తప్ప మిగతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలెవరూ తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చేయడం లేదు అంటూ కొడాలి నాని చురకలంటించారు. అక్కడితో ఊరుకోకుండా అక్కడే ఉన్న కృష్ణదాస్ వైపు చూస్తూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ కూడా తమ్మినేని గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయనను చూసైనా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న మంత్రి కృష్ణదాస్ అక్కడ్నించి వెళ్లిపోయారు. బయటకు వెళుతున్న సమయంలో కృష్ణదాస్ ను ధర్మాన ప్రసాదరావు చిరునవ్వుతొ ఆపి అన్న బయటకు వెళ్లాల్సిన దారి అటుకాదు ఇటూ అంటూ కాస్త వెటకారం ప్రదర్శించారు. అప్పటికే ఆవేశంతో ఉన్న క్రిష్ణదాసు ఆ దృశ్యాలను కెమెరాలో క్లిక్ మనిపిస్తున్న మీడియా వారిపై మండిపడ్డారు.  వాస్తవానికి కృష్ణదాస్ కి సున్నిత మనస్కుడని పేరుంది. అయితే ఇసుక వారోత్సవాలకు హాజరైన మంత్రి కృష్ణదాస్ తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు. టిడిపి నేతలను ఉద్దేశించి అసభ్య పదాలు వాడేశారు. కృష్ణదాస్ నోటి వెంట అలాంటి మాటలు రావటం చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. అయితే లోతుగా ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈ అన్నదమ్ముల మధ్య కొడాలి నాని ఆజ్యం పోశారని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చర్చించుకుంటుంది.నిజానికి మంత్రి కృష్ణదాస్ కు సిక్కోలులో సహాయనిరాకరణ జరుగుతోందనే చర్చ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. జిల్లా కేంద్రంలో జరుగుతున్న మంత్రి పర్యటనల్లో నరసన్నపేట కార్యకర్తల మినహా ప్రసాదరావు అనుచరులెవరూ కనిపించటం లేదు. ఈ తరుణంలో ధర్మాన సోదరుల మధ్య పెరుగుతున్న అంతరం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఆందోళన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
  అనగనగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నిబ్బరంగా సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంది. కానీ కూతురు మాత్రం ప్రతి చిన్న కష్టానికీ కంగారుపడిపోయేది. ఏం చేయాలో పాలుపోక తెగ బాధపడిపోయేది. ‘ఇక ఈ కష్టాలను భరించడం నా వల్ల కాదమ్మా!’ అని ఓ రోజు తన తల్లితో తెగేసి చెప్పింది కూతురు. తల్లి, కూతరి వంక ఒక్క నిమిషం చూసింది. ఆ తరువాత మారుమాట్లాడకుండా ఆమెను వంటింట్లోకి తీసుకువెళ్లింది. తల్లి తనకేం చెప్పాలనుకుందో తెలియని అయోమయంలో కూతురు ఆమెను అనుసరించింది.   వంటింట్లోకి వెళ్లిన తల్లి ఒక మూడు పాత్రలు తీసుకుంది. ఒకదానిలో బంగాళదుంప, మరోదానిలో కోడిగుడ్డు, ఇంకోదానిలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది. తల్లి చేస్తున్న పని చాలా అసంబద్ధంగా తోచింది కూతురికి. అయినా మారు మాటాడకుండా చూస్తూ నిల్చొంది. ఒక పది నిమిషాలు అయిన తరువాత... ‘ఒకో గిన్నెలో ఏం జరిగిందో గమనించు’ అంటూ అడిగింది తల్లి. ‘గమనించడానికి ఏముంది! బంగాళదుంప వేడి నీటికి మెత్తబడిపోతుంది. కోడిగుడ్డు గట్టిపడిపోతుంది. కాఫీ గింజలతో కాఫీ తయారవుతుంది’ అంది కూతురు ఎగతాళిగా. ‘కదా! పైకి గట్టిగా కనిపించే బంగాళదుంప కాస్త వేడినీరు తగలగానే ఇట్టే మెత్తబడిపోయింది. చేయి తగిలితే చాలు చితికిపోయే కోడిగుడ్డేమో వేడినీటికి గట్టిపడిపోయింది. ఇక కాఫీ గింజలు మాత్రం తన చుట్టూ ఉన్న నీటిని తన ఉనికితో నింపేశాయి,’ అని చెప్పుకొచ్చింది తల్లి. తల్లి చేసిన వింత చేష్ట వెనుక ఏదో మంచిమాట దాగి ఉంటుందని అప్పటికి అర్థమైంది కూతురికి.   ‘మనం కూడా ఇంతే! అప్పటివరకూ ధైర్యంగా ఉన్నవారు కూడా కష్టాలు రాగానే ఇట్టే డీలా పడిపోతారు.. ఆ బంగాళదుంపలా. మరికొందరేమో కష్టాలు ఎదురయ్యేసరికి మొద్దుబారిపోతారు. అప్పటివరకూ సున్నితంగా ఉన్నవారు కూడా రాయిలా మారిపోతారు- కోడిగుడ్డులా. కానీ చాలా కొద్ది మంది మాత్రమే కష్టాలకు ఎదురీదుతారు. ఆ కష్టాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ల స్వభావంతో, వారి చుట్టూ ఉన్న వాతావరణమే పూర్తిగా మారిపోతుంది... కాఫీ గింజల్లాగా! ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు?’ అని అడిగింది తల్లి. కూతురు మారు మాట్లాడకుండా చిరునవ్వుతో కాఫీని ఒక రెండు కప్పుల్లోకి సర్ది, ఒకదాన్ని తన తల్లికి అందించింది. మరోదాన్ని తను ఆస్వాదించేందుకు సిద్ధపడింది... జీవితాంతం!   - నిర్జర.
  కడుపు ఆకలి, నాలిక ఆకలి అంటూ రెండు వుంటాయి. అలాగే మెదడు ఆకలి అని కూడా ఉంటుంది అంటున్నారు నిపుణులు. మన మెదడు ని మంచి కండిషన్లో ఉంచే ఆహారాన్ని తీసుకోవటం ద్వారా దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చుఅంటున్నారు. సాదారణంగా ఎక్కువ ఆకూ కూరలు, కూరగాయలు, పళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికి తెలుసు. అయితే మన మెదడు చురుకుగా పని చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని రకాల ఆకుకూరలని, పళ్ళని, కూరగాయాలని తీసుకోవాలిట. క్యాబేజి, కాలిఫ్లవర్, కాకరకాయ, టమాటా, గ్రీన్ పీస్, సోయాబీన్ వంటివాటిని మన ఆహారంలో నిత్యం ఉండేలా చూసుకోమంటున్నారు ఈ అద్యాయన కర్తలు...... ...రమ  
  01. For walls, the best bet would be to use wallpaper. Apart from giving them a new look, it would also revive the spirit of your home and prove to be cost-efficient. Another option would be to create your own wall art. For this, use lots of stencil patterns, wallpaper borders and chalkboards and create interest in the room’s outer edges. 02. Use mirrors for decorating the rooms. This is because they help brighten up a room and also create the illusion of space. Keeping a mirror at the back of artistic belongings helps in highlighting them from all sides. 03. Instead of fixing an imperfection, which would prove to be a costly affair, look for ways to hide or cover it. A dark spot on the floor can be hidden with a rug. Similarly, peeled off paint, on the wall, can be covered with a nice wall hanging. 04. For the cabinets, opt for repainting, rather than replacement. Painting would refresh the look of your cabinets and make them look cleaner and livelier than before. 05. If your house is situated in a picturesque location, the best bet would be to explore the beauty of nature completely. For this, remove the curtains on the windows and maximize the view. Natural beauty draws attention and makes a house, a strikingly pleasant place to be in. 06. Nothing looks better than a neat, well-organized house. Systematize everything in such a way that there is no clutter and everything, right from shoes to clothes to books, is placed in allotted shelves or drawers. 07. Greenery and flowers are the best bet to beautify a house. Use a mixture of silk and fresh flowers to decorate your house. You can also highlight a specific area with potted flowers and herbs. This is an inexpensive, yet impressive way to decorate a house. 08. Use a lot of fabrics - cover the dining room chairs, put slipcovers on fading couches, make fresh pillows covers, redo the old curtains and get new blankets and quilts covers. A new bed linen is also worth a thought. All these items would do a lot to refurbish the look of your house. 09. Remember, paint creates a dramatic effect. You can paint the walls and the floor of your house with vibrant colors, to liven it up. 10. For the lighting, illuminate your house by using hand decorated lamp shades. Get them from a discount store and place them in the dark nooks and corners of your house.    
సీఎం జగన్ కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చింది టిడిపి. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడని మాటలను అన్నట్లుగా చెబుతూ సీఎం జగన్ సభను తప్పుదోవ పట్టించారని ఈ నోటీసుల్లో పేర్కొంది టిడిపి. నిన్న ( డిసెంబర్ 12న ) తెలుగుదేశం పార్టీ అభ్యర్దులు సభకు వచ్చే సమయంలో జరిగిన ఘర్షణపై ఈరోజు ( డిసెంబర్ 13న ) కూడా సభలో వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ ఘర్షణపై స్పందిస్తూ ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలను.. ఆయన వాడిన భాషను తీవ్రంగా తప్పు పట్టారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని కించపరుస్తూ ఏ రకంగా దూషిస్తారని.. దానికి ఏం సమాధానం చెప్తారని  సభలో గట్టిగా నిలదీశారు జగన్. ఇదే సందర్భంలో నిన్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు కూడా అధికారి పార్టీ సభ్యులు స్పీకర్ అనుమతితో వాటిని సభలో ప్లే చేశారు. ఈ సందర్భంగా ప్రతి పక్షాలు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరాలని దీనిపై వారు చింతిస్తున్నారనే ప్రకటన చేసినట్లయితే ఈ విషయాన్ని ముగిస్తారని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని కించపరిచే విధంగా చంద్రబాబు నోటి నుంచి అటువంటి పదాలు రాలేదని సభను పక్కదోవ పట్టించటానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, చేయనటువంటి వ్యాఖ్యలను చేశారని, దీనిపై విచారణ చేయాలి, చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు ప్రివిలైజ్డ్ నోటీసులు ఇచ్చారు. అయితే సభలో ఉన్న ఇతర సభ్యుల దగ్గర నుంచి కూడా అభిప్రాయాన్ని తీసుకుని తదుపరి ఎటువంటి చర్యలకు వెళ్ళాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
అసంబ్లీలోకి వెళ్లకుండా టీడీపీ అధినేత చంద్రబాబును అడుగడుగునా అడ్డుకున్నా పట్టువీడని విక్రమార్కుడిలా ఆయన లోపలికి వెళ్లారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా ముందుకు వెళ్తూ ప్రజల కోసం నిరంతరం పోరాడతామని బాబు స్పష్టం చేసారు. ప్రతిపక్ష నాయకుడిని కూడా గౌరవించే పరిపాలన ఉండాలే కానీ ఒక ఉన్మాది పరిపాలనలాగా ఉండకూడదని బాబు మండిపడ్డారు. తనని అసెంబ్లీలోకి ఎందుకు అనుమతించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్ నాన్సెన్స్ అని తప్ప తాను తప్పుగా మాట్లాడలేదని.. తనకు లోపలికి వచ్చే హక్కు లేదా అని గట్టిగా నిలదీశాను తప్ప ఇంకోటి కాదన్నారు బాబు. దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బాబు వెల్లడించారు. తనకు పౌరుషంగా మాట్లాడం తెలుసని.. నేరాలు చేసి జైలుకు వెళ్లడాలు తెలియదని.. అలాంటివి తమకు అలవాటు లేదని బాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం కోసం తానూ జీవితాంతం పని చేశానని చెప్పుకొచ్చారు. తాను గట్టిగా మాట్లాడిన మాట వాస్తవం కానీ.. లోపలకు రానివ్వకుండా అడ్డుపడి లోపలికి రానివ్వకపోతే ఎవరికయినా బాధ ఉంటుందని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అసెంబ్లీలోకి రానివ్వకుండా చేస్తున్నారనే బాధ ఎవరికైనా ఉంటుందని.. అందుకే గట్టిగా చెప్పాను తప్ప మరొకటి లేదని బాబు తెలియజేసారు.
సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పాలసీలకు అనుగుణంగా యంత్రాంగం నడుచుకోవడం కామన్. అయితే, తమ పార్టీ అధికారంలో ఉందని చెప్పుకోవడానికి ఆ పార్టీ రంగులను అక్కడక్కడా కనిపించేలా వేయడం కూడా సర్వసాధారణమే. కానీ అది శృతిమించినప్పుడే విమర్శలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే జరుగుతోంది. బడి, గుడి అని తేడా లేకుండా అన్నింటినీ వైసీపీ రంగులతో నింపేస్తున్నారు. దాంతో, ఏ ప్రభుత్వ భవనాన్ని చూసినా నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగులే కనిపిస్తున్నాయి. చివరికి చెత్త కుండీలను కూడా వదలకుండా వైసీపీ రంగులతో నింపేస్తున్నారు. అయితే, ఇలా ప్రభుత్వ భవనాలను వైసీపీ రంగులతో నింపేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీయే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఈ రంగుల రాజకీయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఇలా ప్రభుత్వ భవనాలను వైసీపీ రంగులతో నింపేయడంపై జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు  తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.   గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ పై విచారణపై జరిపిన ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది.  
  Consumption of sugarcane juice can make the skin more healthy and beautiful. Also helps in detoxification or removal of toxins in the body. Included also, to prevent the appearance of wrinkles in the skin.   Sugarcane juice is very good for the major organ of the body which is the liver as it helps in treating the jaundice which is a liver function disorder. Jaundice causes yellow pigmentation of the skin and skin membranes because of the increasedlevel of bile pigment called bilirubin.   To get fast recovery from the jaundice and liver functioning disorders, sugarcane juice acts as a best home remedy for such ailments.   Sugarcane contains a large amount of glucose along with other compounds. The glucose and other electrolytes make it an instant pick-me-up. Not only does it give you that instant boost of energy, but if drunk when cold, it helps cool down the body during the harsh summers.   Sugar cane is not bad for diabetes after all. Sugarcane has glucose but also has a low glycaemic index than instant sugar, making it the perfect energy drink for diabetics. Not only does it give them essential amounts of sugar but also does so safely. So, if you are a diabetic and crave something sweet, sip on a glass of sugarcane juice for that instant fix.   Sugarcane juice contains calcium, magnesium, potassium, iron, and manganese. These minerals are good for health and lower the risk of prostate and breast cancer.
  జుట్టుకి మనం ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందం గురించి పెద్దగా శ్రద్ధపెట్టని వారు సైతం చీటికీ మాటికీ జుట్టుని సరిచేసుకోక మానరు. ఆ జుట్టు రాలిపోతున్నా, తెల్లబడుతున్నా కంగారుపడని మానవుడూ ఉండడు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ఈ మధ్యనే జుట్టు గురించి కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. అవేమిటంటే... ఉక్కుకంటే గొప్పది మన వెంట్రుకలు, అంతే సన్నగా ఉండే ఉక్కతో సమానమైన బలం కలిగి ఉంటాయని చదివే ఉంటాము. కానీ ఉక్కుకంటే వెంట్రుకే గొప్పది అని చెప్పడానికి ఓ కారణం ఉంది. అదే స్థితిస్థాపకగుణము (elasticity). ఒక వెంట్రుకని దాదాపు ఒకటిన్నర రెట్లు లాగిన తరువాత కానీ అది తెగదు. మరే లోహంలోనూ ఇలాంటి గుణం కనిపించదు. చిత్రమేమిటంటే నిదానంగా లాగేకన్నా గబుక్కున జుట్టుని లాగినప్పుడే అది మరింత బలంగా కనిపిస్తుందట.   కారణం తెలిసింది ఒక పక్క దృఢంగా ఉంటూనే మరోపక్క సాగతీత గుణాన్ని కలిగి ఉండటం వెనుక కారణం ఏమిటా అని పరిశోధన మొదలుపెట్టారు. జుట్టులో ఉండే రెండు సూక్ష్మమైన వ్యవస్థలే దీనికి కారణం అని తేలింది. అవే కార్టెక్స్, మాట్రిక్స్లు! ఒక చిన్నపాటి కార్టెక్స్లో వేలాది ‘alpha helix chains’ అనే కణాలు ఉంటాయి. చుట్టలు చుట్టలుగా ఉన్న ఈ కణాలు జుట్టుని లాగినప్పుడు విచ్చుకుంటాయి. అంటే జుట్టుని లాగినా కూడా తెగకుండా నిలిపి ఉంచుతాయన్నమాట. మాట్రిక్స్ వ్యవస్థలో ఇలాంటి ఏర్పాటు ఏదీ లేకపోయినా, జుట్టు గట్టిదటానికి తోడ్పడుతుంది. అంటే ఈ రెండు వ్యవస్థలూ కలిసి జట్టు పాడవకుండా కాపాడతాయన్నమాట.   తడి జుట్టుని దువ్వకూడదా! జుట్టు దృఢత్వానికి కారణం తెలిసింది సరే! మరి అది ఉష్ణోగ్రతలకి ఎలా ప్రభావితం అవుతుందో కూడా చూడాలనుకున్నారు. అందుకోసం నీటిలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు కార్టెక్స్, మాట్రిక్స్ల పనితీరుని గమనించారు. జుట్టులోకి అధికశాతం తేమ చేరినప్పుడు దానిలోని సాగతీత గుణం కొంత తగ్గి, వెంట్రుకలు త్వరగా తెగిపోతున్నట్లు తేలింది. అంటే తడిగా ఉన్న జుట్టుని దువ్వకూడదంటూ ఇప్పటివరకూ పెద్దలు చెబుతూ వస్తున్న మాట నిజమేనన్నమాట! అలాగే 60 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతల వద్ద వెంట్రుకలు శాశ్వతంగా దెబ్బతినిపోవడాన్ని కూడా గమనించారు. చీటికీ మాటికీ హెయిర్ డ్రయ్యర్ల వంటి పరికరాలు వాడద్దంటూ వినిపించే హెచ్చరికలు కూడా నిజమే అని అర్థమవుతోంది. పరిశోధకులు కనుగొన్న ఈ కొత్త విషయాలు జుట్టు విషయంలో కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయని ఆశిస్తున్నారు. జుట్టుని దృఢంగా ఉంచేందుకు కొత్త చికిత్సలను రూపొందించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడవచ్చు. అంతేకాదు! జుట్టులోని కణజాలాన్ని గమనించడం ద్వారా, అదే తరహా కణజాలంతో కొత్తరకం లోహాలను ఉత్పత్తి చేయవచ్చని కూడా భావిస్తున్నారు. - నిర్జర.
    Cycling may be favorite pastime for many of us but it is certainly very useful in maintaining our health! As it is one of the easiest ways to exercise without producing fat bills, moreover it can be almost everywhere and any time during the year. The health benefits though are numerous, few to pen down are: The act of cycling involves the lower body. So, it strengthens and tones up the calf and thigh muscles. It also improvises the mobility of the hip and knee joints. Cycling effectively increases the stamina, thus you are able enough to fight against the physical strains more ably and for a longer time. Cycling does only good to your heart. It improves cardio-vascular fitness due to which our heart pounds steadily. Studies suggest that people who cycle at least 20 miles a week are least likely to suffer from heart diseases when compared to non-cycling people. Cycling is great of losing the extra pound you stare at! Steady cycling burns a great deal of calories. Cycling boosts our metabolic rates even after we have finished our ride thus, aiding more in calorie-loss! Any regular exercise is capable of reducing stress and depression. It improves the well-being and self esteem. Cycling outdoors is a awesome way of connecting with nature, which aids in rejuvenating the soul. As cycling involves every part of our body, the co-ordination among the body parts is improved! So, take some time out to indulge in a cycle ride. Take Care!! ...... SIRI
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.