ALSO ON TELUGUONE N E W S
ఆల్రెడీ అల్లు అర్జున్ పక్కన ఓ హీరోయిన్‌గా పూజా హెగ్డేని సెల‌క్ట్ చేశారు త్రివిక్ర‌మ్‌. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' తరవాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరితోనూ ఇంతకు ముందు ఆమె పని చేశారు. బన్నీ సరసన 'డీజే'లో నటించగా... త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' చేశారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా చోటు ఉంది. బన్నీ సరసన సెకండ్ హీరోయిన్ అన్నమాట. ఆ అవకాశం కేతికా శర్మకు దక్కిందని తెలిసింది. తెలుగులో ఆమెకు రెండో చిత్రమిది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' సినిమాలో ఈ అమ్మాయి నటిస్తుంది. మొదటి సినిమా విడుదలకు ముందు మరో అవకాశం, అదీ అల్లు అర్జున్ సినిమాలో రావడం అంటే గొప్ప విషయమే.   
  'మహర్షి' విడుదలకు ముందు మహేష్ బాబు ఓ ఫారిన్ ట్రిప్ వేశారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్, మొనాకో వెళ్లి వచ్చారు. హీరోగా నటించిన 25వ సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో దిగారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రచారం చేశారు. విడుదల తరవాత విమర్శకులు, సగటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ సినిమా హిట్టని ఒకటికి రెండుసార్లు కాలర్ ఎగరేశారు. ఎవరైనా సినిమా హిట్ కాదంటే మహేష్ ఒప్పుకోరేమో అనే స్థాయిలో ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో నేరుగా మహేష్ బాబును టార్గెట్ చేస్తూ ఎందుకీ ప్రచారం అని కొందరు కామెంట్ చేశారు. 'సక్సెస్ కే కాదు... సక్సెస్ మీట్స్ కి కూడా ఫుల్ స్టాప్స్ ఉండవు' అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సంగతి పక్కనపెడితే... మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ 'మహర్షి' అని నిర్మాతలు కూడా ప్రకటించారు. ఈ ఆనందంలో మహేష్ మరోసారి హాలీడే ట్రిప్ కి వెళ్తున్నారు. మహేష్ ఇండియాలో అందుబాటులో ఉండరు కాబట్టి 'మహర్షి' సక్సెస్ మీట్స్ కి ఇక ఫుల్ స్టాప్ పడినట్టే అనుకోవాలి.  
  తమిళ నటుడు జైతో అంజలి ప్రేమలో ఉందని కొన్నాళ్ల క్రితం వరకూ కోలీవుడ్, టాలీవుడ్ కోడై కూసింది. అందుకు తగ్గట్టుగా ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. అంజలి కోసం జై దోశలు కూడా వేశారు. ఏమైందో ఏమో... ఇద్దరి మధ్య చెందిందని, బ్రేకప్ అయిందని వార్తలు వచ్చాయి. 'లీసా' ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన అంజలి ఈ  విషయంపై పెదవి విప్పారు. "నేను ఎప్పుడూ ప్రేమలో ఉన్నానని చెప్పలేదు. నేను చెప్పని విషయాలపై స్పందించను. నేను స్పందించడం లేదంటే... నేను ఏమీ ప్రకటించలేదని అర్థం" అని జైతో లవ్, బ్రేకప్ గురించి అంజలి వ్యాఖ్యానించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం సోదరుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. బ్ర‌ద‌ర్‌కి పెళ్లి అయిన తరవాత తాను పెళ్లి చేసుకుంటానన్నట్టు అంజలి మాట్లాడారు. పెళ్లి తరవాత కచ్చితంగా నటించవచ్చని, ప్రేక్షకుల ఆలోచించే తీరులో మార్పు వచ్చిందన్నారామె. సో.. పెళ్లి తరవాత అంజలి నటిస్తారని ఊహించవచ్చు. 
  ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి ఖుషీగా ఉన్నారు. "హాయ్ డార్లింగ్స్... ఎలా ఉన్నారు? రేపు మీకొక స‌ర్‌ప్రైజ్ ఉంది. నా ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి" అని డైరెక్టుగా ప్రభాస్ ఒక వీడియో విడుదల చేయడంతో రెబల్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆ సర్‌ప్రైజ్‌ 'సాహో' గురించి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంట! అభిమాన హీరో సినిమాపై వచ్చే కొత్త అప్‌డేట్ ఎలా ఉంటుంది? సర్‌ప్రైజ్‌ ఏంటి? అని ప్రభాస్ అభిమానులు ఎదురు చూడటం లేదు. ఏదో ఒకటి వస్తున్నందుకు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే... సినిమా నుంచి ఏదో ఒక అప్‌డేట్ రాక‌పోతుందా? అని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి చూసి విసిగిపోయిన అభిమానులు.. రెండు మూడు రోజులుగా ప్రొడక్షన్ హౌస్, సినిమా పీఆర్వోల మీద సోషల్ మీడియాలో ఎటాక్ చేయడం స్టార్ట్ చేశారు. కామెంట్స్ తో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇప్పుడు ప్రభాస్ వీడియో విడుదల చేయడంతో శాంతించారు. మంగళవారం 'సాహో' కొత్త పోస్టర్ విడుదల చేయనున్నారని టాక్. సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.    
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నది. ఇందులో కథానాయికగా ఐదారు కన్నడ సినిమాలలో నటించిన కృతి శెట్టిని ఎంపిక చేసినట్టు మొన్న శనివారం ఒక ప్రకటన వచ్చింది. తెలుగు తెరకు మరో కొత్త భామను సుకుమార్ పరిచయం చేస్తున్నాడు అంటూ  సోషల్ మీడియాలో, ఇటు వెబ్ మీడియాలో కొందరు రాసుకొచ్చారు. అనుష్క, ప్రణీత, నభా నటేశ్, శ్రద్ధా శ్రీనాథ్ బాటలో మరో కన్నడ భామ తెలుగు తెరపైకి వస్తుందని  కొందరు సంబరపడ్డారు. అయితే, చాలామంది మరచిపోయిన విషయం ఏంటంటే... ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని ముందు అనుకోలేదు. దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ మనీషా రాజ్. సినిమా ప్రారంభోత్సవంలోనూ ఆమె సందడి చేసింది. అయితే ఆమెను తప్పించి కృతి శెట్టిని తీసుకున్నారు. సినిమాలో హీరోయిన్ ఎందుకు మారింది? అంటే... గోదావరి నేపథ్యంలో సాగర తీరం లో జరిగే కథతో 'ఉప్పెన' తెరకెక్కుతోంది. సముద్రంలో చేపల్ని వేటాడే జాలరి పాత్రలో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నాడు. కథానాయికది కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రే. మనీషా రాజ్ ఆ పాత్రకు సూట్ అవ్వలేదు అని, హీరో పక్కన కాస్త పెద్ద అమ్మాయిగా కనిపించిందని.... అందుకే కృతి శెట్టిని తీసుకున్నారట.  
  చుట్టూ ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ప్రపంచం ఎంత డిజిటల్ విప్లవాన్ని సాధించినా... పేపరు వాడకం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. 90 శాతానికి పైగా కాగితాలని చెట్ల నుంచి తయారుచేయాల్సిందే! ఇలా టన్నులకొద్దీ కాగితాలను తయారుచేయడానికి ఏటా 300 కోట్లకు పైగా చెట్లని నాశనం చేయవలసి వస్తోంది. ఇక కాగితం తయారీకి కావల్సిన నీటి సంగతి చెప్పనవసరం లేదు. ఒక కిలో కాగితం తయారుచేయడానికి 300 లీటర్ల నీరు కావాలి. ఇక కాగితం తళతళ్లాడిపోయేలా చేయడం దగ్గర నుంచీ దాని మీద ప్రింటింగ్ చేయడం వరకూ నానారకాల రసాయనాలనూ ఉత్పత్తి చేయక తప్పదు.   కాగితాన్ని ఉత్పత్తి చేసేందుకు కొన్ని చెట్లను ప్రత్యేకించి పెంచుతూ ఉంటారు. కానీ తయారీ కోసం నరికే చెట్లలో ఇవి కొద్ది శాతం మాత్రమే. కాబట్టి కాగితం వాడకాన్ని తగ్గించకపోతే నీరు, గాలి కలుషితం కావడం అటుంచి... భూమ్మీద చెట్టనేదే లేకుండా పోతుంది. మన వంతుగా తీసుకునే చిన్న చిన్న చర్యలు కూడా కాగితం వృధా కాకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు నిపుణులు.   - ఏటీఎం, మెడికల్ షాప్, సూపర్ మార్కెట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఒకో బిల్లు తెచ్చుకోవడం మనకి అలవాటు. కొనేది ఒకటి రెండు వస్తువులే అయినా, బిల్లు విషయంలో అనుమానం లేకపోయినా, స్క్రీన్ మీద అంతా కనిపిస్తున్నా... బిల్లు లేకుండా బయటకు రాలేం. ఈ బిల్లుల కోసం కాగితం తయారీ, వాటి మీద ఇంకు... రెండూ కూడా పర్యావరణానికి నష్టమే! ఇలాంటి చోట బిల్లు అవసరం లేదన్న ఒక్క మాట కాగితం వృధాని ఆపుతుంది.   - ఇప్పుడు ప్రతి పుస్తకమూ ఈ-బుక్ రూపంలో లభిస్తోంది. అయినా పాత అలవాటుని వదులుకోలేకనో, పుస్తకం ఇచ్చే సాంత్వన కోసమో జనం ఏటా కోట్ల పుస్తకాలు కొంటూనే ఉన్నారు. ఈ పద్ధతి మారేందుకు కొన్నాళ్లు పడుతుందేమో! కానీ మళ్లీ చదవాల్సిన అవసరం లేదు అన్న పుస్తకాన్ని మరొకరికి ఇచ్చేస్తే సరి.   - మన కంటి ముందున్న ప్రతి కాగితమూ ఈ లోకాన్ని నాశనం చేస్తూ పుట్టింది అన్న అవగాహన ఉన్నప్పుడు... చిన్నపాటి కాగితాన్ని కూడా వృధా చేయం. కాగితాన్ని రెండువైపులా వాడటం, ఏదన్నా నోట్స్ రాసుకునేందుకు చిన్నపాటి కాగితాలను ఉపయోగించడం లాంటి చర్యలు చాలా కాగితాన్నే ఆదా చేస్తాయి.   - ఇంట్లో ఓ నలుగురు చేరినా కూడా కాగితం ప్లేట్లు, పేపరు కప్పులు వాడేస్తుంటాం. ఇవి చూసేందుకు సోగ్గా కనిపించవచ్చు. కానీ పేపరు కప్పులలో ఏం పోసిన తడిసిపోకుండా ఉండేందుకు వాటిలో నానారకాల రసాయనాలు కలుపుతారు. వీటి వల్ల ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. పైగా వీటిని రీసైకిల్ చేయడం కూడా కష్టమైపోతుంది.   - ఆఫీసులో మనం ఎంత కాగితం వాడుతున్నామో అడిగేవారు లేకపోవచ్చు. పైగా చేతిలో ప్రింటర్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి అంతగా ఆలోచన లేకుండానే కిలోల కొద్దీ కాగితాన్ని వాడేస్తుంటాం. ఈమెయిల్స్, వర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా చక్కబెట్టే పనులకి కాగితాన్ని వాడకపోవడం, ప్రింట్ అవుట్ అవసరం అయినా చిన్నపాటి కాగితాలని ఉపయోగించడం, రెండువైపులా ప్రింట్ ఔట్ తీసుకోవడం వంటి చర్యలతో కాగితం వృధా కాకుండా ఉంటుంది. ఆపీసులో కాగితం వాడకానికి కూడా ఒక చిన్నపాటి ఆడిట్ జరిగితే... వీలైనంత వృధా తగ్గిపోతుంది. - నిర్జర.    
  అనగనగా భగవంతుడు సృష్టిని చేస్తున్నాడు. ముందరగా ఆయన ఓ కుక్కను సృష్టించాడు. ‘చూడూ నీకు ముప్ఫై ఏళ్ల ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా, నీది అనుకున్న ఇంటిని కాపలా కాస్తూ ఉండటం. నీ జోలికి ఎవరన్నా వస్తే వారి వెంట పడి అరిచి అరిచి మీదపడి కరవడం. సరేనా!’ అన్నాడు.   దానికి కుక్క ‘అరవడం, కరవడం గురించి వింటుంటే సరదాగానే ఉంది కానీ మరీ ముప్ఫై ఏళ్లపాటు అలా గడపడమే కష్టమనిపిస్తోంది. కాబట్టి ఓ పదేళ్లపాటు అలా జీవిస్తే చాలనిపిస్తోంది. మిగతా ఇరవై ఏళ్లూ మీరే ఉంచేసుకోండి’ అనేసింది. ‘సరే, నీ ఇష్టం!’ అంటూ కుక్కను భూమ్మీదకు వదిలాడు భగవంతుడు.   అలా కుక్కను సృష్టించిన తరువాత కోతిని సృష్టించాడు. ‘చూడూ నీకు నలభై ఏళ్ల ఆయుష్షుని ఇస్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా, నా కోతి చేష్టలతో జనాల దృష్టిని ఆకర్షించడమే. సరేనా!’ అన్నాడు. దానికి కోతి ‘జనాల దృష్టిని ఆకర్షించడం బాగానే ఉంటుంది. కానీ మరీ నలభై ఏళ్ల పాటు అలా గడపడం అంటే చిరాగ్గా ఉంటుంది. విసుగేసిపోతుంది. కాబట్టి ఓ ఇరవై ఏళ్లు పాటు జీవిస్తే చాలు. మిగతా ఇరవై ఏళ్లూ మీరే ఉంచేసుకోండి’ అనేసింది. ‘సరే, నీ మాటను ఎందుకు కాదనాలి!’ అంటూ కోతిని భూమ్మీదకు వదిలాడు దేవుడు.     ఈసారి ఆవు వంతు వచ్చింది. ‘నిన్ను సృష్టిస్తుంటే నాకే జాలిగా ఉంది. నీకు అరవై ఏళ్ల జీవితకాలం ఇస్తున్నాను. నువ్వు దూడలను కని పోషించాలి. అవసరమైతే రైతుకి తోడుగా పొలాల్లో పనిచేయాలి. వట్టిపోతే చావుకోసం ఎదురుచూస్తూ కూర్చోవాలి.’ అన్నాడు భగవంతుడు.   దానికి ఆవు ‘సరే! మీరు నా నుదుటిన ఎలా రాస్తే అలా జరుగుతుంది. కాకపోతే ఒక్క మేలు చేయండి దేవా! ఇన్నేసి కష్టాలను అన్నేసి ఏళ్లపాటు భరించడం నా వల్ల కాదు. అందుకని ఒక మూడో వంతు జీవితాన్ని మాత్రమే నాకు ఇచ్చి, మిగతా నలభే ఏళ్లూ మీరే తీసేసుకోండి’ అని వేడుకొంది.దానికి భగవంతుడు సరేనంటూ, ఆవుని భూగ్రహం మీదకు వదిలాడు.   ఇక మనిషి వంతు వచ్చింది. ‘బాబూ, నీకు 20 ఏళ్ల ఆయుష్షుని ఇస్తున్నాను! తిను, కష్టపడు, నిద్రపో, ఆడు, పాడు.... పండగచేస్కో. ఈ ప్రపంచంలోని జీవులన్నింటికీ నువ్వే యజమానవి’ అని ఆశీర్వదించాడు.     కానీ మనిషి ఎంతైనా స్వార్థపరుడు కదా! భగవంతుని చేతిలో ఆయుష్షు పోసుకుంటూనే తన స్వార్థాన్ని చూపించేశాడు ‘జీవితాన్ని అనుభవించడానికి మరీ ఇరవై ఏళ్లేనా! కనీసం నిండు నూరేళ్లయినా లేకపోతే అదేం జీవితం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం వందేళ్ల జీవితం కావల్సిందే!’ అని పట్టుపట్టాడు.   మనిషి మాటలకు ఏం చేయాలో దేవునికి పాలుపోలేదు. ‘సరే ఒక పని చేస్తాను. నా దగ్గర కుక్కవి ఓ ఇరవై ఏళ్లూ, కోతివి ఓ ఇరవై ఏళ్లూ, ఆవువి ఓ ఇరవై ఏళ్లూ మిగులుగా ఉన్నాయి. వాటన్నింటినీ నీ ఆయుష్షుకి కలిపితే వందేళ్లు పూర్తవుతుంది. కానీ తరువాత జరిగే పరిణామాలకి మాత్రం నాది బాధ్యత కాదు. సరేనా!’ అని అడిగాడు.   ‘ఓ దానిదేం భాగ్యం. నాకు వందేళ్ల ఆయువు ఉంటే చాలు’ అంటూ భూమ్మీదకి దూకేశాడు మనిషి. అలా మనిషి జీవితం వందేళ్లనుకుంటే అందులో ఇరవై శాతం మాత్రమే తనలా ఉంటాడట. మిగతా ఇరవై శాతం కాలాన్నీ తనది అనుకున్న ఆస్తిని కాపాడుకునేందుకు, తోటి వారి మీద ద్వేషంతో అరుస్తూ కరుస్తూ ఉండేందుకు ఉపయోగిస్తుంటాడు. మరో ఇరవై శాతం జీవితంలో చుట్టుపక్కల ఉన్న జనాలని ఎలాగైనా తనవైపు ఆకర్షించుకునే ప్రయత్నంలో గడిపేస్తూ ఉంటాడు. ఇక మిగిలిన జీవితమేమో బండచాకిరీ చేస్తూ, ఇతరుల కోసమే జీవిస్తూ ఉంటాడు.   ..Nirjara
  జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!   డబ్బు విలువ నేర్పుతుంది చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు విలువ తెలిసొస్తుంది.   మనుషుల విలువ నేర్పుతుంది ‘విజయానికి బంధువులు ఎక్కువ’ అని పెద్దలు అంటూ ఉంటారు. కాస్తంత కష్టం రాగానే తుపాకీ దెబ్బకి కూడా దొరక్కుండా మన చుట్టుపక్కల జనాలంతా కనిపించకుండా పోవచ్చు. అలాంటి కష్ట సమయాల్లోనే ఎవరు మనవారో, ఎవరు కాదో అర్థమవుతుంది. ఇతరుల దృష్టిలో మన విలువ ఏమిటో తెలిసొస్తుంది. ఎవరి తత్వం ఏమిటో బోధపడుతుంది.   వినయం విలువ నేర్పుతుంది అంతాబాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాము. మనంతటి వాడు లేడని మిడిసి పడుతూ ఉంటాము. ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే కానీ మనం కూడా సాధారణ మనుషులమే అని తెలిసిరాదు. కష్టాలకీ, కన్నీళ్లకీ, పరాజయాలకీ, పరాభవాలకీ ఎవ్వరూ అతీతం కాదని తెలిసొస్తుంది. అంతేకాదు! ఇతరులని కూడా ఇక నుంచి గౌరవంగా చూడాలనీ, వినయంతో మెలగాలనీ అనిపిస్తుంది.   లక్ష్యం విలువ నేర్పుతుంది కష్టపడితే ఏదీ కాళ్లదగ్గరకి రాదు. అలా వచ్చేదానికి విలువ ఉండదు. లక్ష్యం ఎంత అసాధ్యంగా ఉంటే దాని ఛేదనలో అంత తృప్తి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆ లక్ష్యాన్ని తప్పిపోయినప్పుడు దాని విలువ ఏమిటో తెలిసొస్తుంది. దాన్ని ఏలాగైనా ఛేదించి సాధించాలన్న పట్టుదలా పెరుగుతుంది.   జీవితం విలువ నేర్పుతుంది అప్పటివరకూ ఎడాపెడా సాగిపోయిన జీవితం పరాజయంతో ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అవుతుంది. ఆ క్షణంలో మనకి కాలం, కష్టం, కరుణ, దురలవాట్లు, సంతోషం, అడ్డంకులు, ప్రణాళికలు... వంటి అనేక విషయాల గురించి అవగాహన ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వం గురించీ, ఆలోచనా విధానం గురించి ఒక స్పష్టత కలుగుతుంది.   - నిర్జర.
  దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో ఎన్డీయేనే అధికారంలోకి వస్తాయని అంచనా వేశాయి. 'టుడేస్ చాణక్య' సర్వే కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్డీయే కూటమికి 350 సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేసింది. ఇక యూపీఏ కూటమి వంద సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది.     అయితే ఏపీలో మాత్రం 'టుడేస్ చాణక్య' సర్వే అంచనాలు భిన్నంగా ఉన్నాయి. మెజారిటీ సంస్థలు ఏపీలో వైసీపీదే హవా అని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 'టుడేస్ చాణక్య' మాత్రం ఏపీ లోక్ సభ ఎన్నికల్లో టీడీపీదే హవా అని అంచనా వేసింది. టీడీపీ 14 నుంచి 20 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశముందని, ఇక వైసీపీ 5 నుంచి 11 సీట్లు గెలిచే అవకాశముంది అభిప్రాయపడింది.     ఇక తెలంగాణ విషయానికొస్తే అన్ని సంస్థలు చెప్పినట్లే  'టుడేస్ చాణక్య' కూడా టీఆర్ఎస్ జోరు కొనసాగుతుందని వెల్లడించింది. టీఆర్ఎస్ 12 నుంచి 16 ఎంపీ సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేసింది.  
  ఏపీలో వైసీపీదే అధికారమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కొన్ని సర్వేలు మాత్రం టీడీపీ గెలుస్తుందని అభిప్రాయపడ్డాయి. అయితే ఏపీలో అంతో ఇంతో ప్రభావం చూపుతుందనుకున్న జనసేనకు ఒకటి రెండుకు మించి సీట్లు రావని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ అంచనాలపై జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌పై ఆందోళన చెందవద్దని..మే 23 వరకు వేచి చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ వన్‌టౌన్‌లో రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఎగ్జిట్‌ పోల్స్‌ను నేను పట్టించుకోను. మాకు ఎలాంటి ఆందోళన లేదు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా నిత్యం ప్రజాసేవలోనే ఉంటాం. అనవసరంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చి ప్రజల్లో మరింత ఉత్కంఠ కల్గిస్తున్నారు. ఓపికతో ఉంటే ఈ నెల 23న అసలు ఫలితమే వచ్చేస్తుంది. ఏ ఫలితం వచ్చినా ప్రజా సమస్యలపై పోరాడాలని మా పార్టీ నిర్ణయించింది. గెలుపోటములు సహజం. ప్రజల కోసం పనిచేయాలన్న భావనతో మేం ముందుకెళ్తున్నాం." అని లక్ష్మీనారాయణ తెలిపారు.
  ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఏపీలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చెప్పేశాయి. మెజారిటీ సంస్థలు ఏపీలో వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశముందని అంచనా వేసాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ముందు నుంచి వైసీపీనే గెలిచే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అయితే ఏపీలో ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములపై హాట్ హాట్ చర్చలు, విశ్లేషణలు జరిగాయి. ప్రధానంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం గురించి ఎక్కువగా చర్చలు జరిగాయి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఎన్నికల బరిలోకి దిగారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన లోకేష్ పోటీ చేసేందుకు మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇక్కడ జోరుగా ప్రచారం కూడా నిర్వహించారు. అయితే మంగళగిరిలో లోకేష్ గెలిచే అవకాశంలేదని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ తాజాగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం మంగళగిరిలో నారా లోకేష్ గెలుపు ఖాయమని చెబుతున్నాయి. ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వేలో కూడా మంగళగిరిలో టీడీపీయే గెలుస్తుందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాను బట్టి చూస్తే మంగళగిరిలో లోకేష్ గెలుస్తారు కానీ.. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం కష్టమే అనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
మన భారతదేశంలో లభించే రకరకాల పండ్లన్నింటిలోనూ మామిడికాయలు ఎంతో ప్రత్యేకమైనవి. పచ్చిమామిడికాయల నుంచి పండు మామిడికాయల వరకు ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి. చిన్న, పెద్ద అని తేడాలేకుండా ప్రతిఒక్కరు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు రకరకాల వంటకాలలోను మామిడిపండ్లను ఉపయోగిస్తారు. అందువల్లే దీనిని పండ్లకు రారాజుగా పేర్కొంటారు... మామిడి లో పోషక ఆహారాలు పుష్కలం. విటమిన్ c, విటమిన్ A, B 6 పుష్కలంగా ఉంటాయి.  ఇంకా , పొటాషియం, కాపర్, మెగ్నీషియం కూడా తగిన మొదతులోనే ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా దీంట్లోని ప్రో బయోటిక్ ఫైబర్ చాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని ఎక్కువ తినకూడదని, తింటే వేడిమి అని కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. కాని మామిడి ఎండాకాలం ఓ మహా ప్రసాదమే అనుకోండి దాని లోని ఆని ఔషద గుణాలకు. కొన్న మామిడి... ముఖ్య ప్రయోజనాలను చూద్దాం :- వేసవిలో వడదెబ్బ తగలడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు పచ్చి మామిడి రసాన్ని మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. నీరసంతో పాటూ, అలసట కూడా తగ్గుతుంది. వడదెబ్బ సమస్య నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. పచ్చిమామిడి కాయలో విటమిన్  సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి.  ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది. మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.
  వేసవి భగభగలకి ఒళ్లంతా పొగలు కక్కడం ఖాయం. కానీ ఆహారం విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు కూడా పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ఏ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే...   మితంగా ప్రొటీన్లు: ఒంట్లో వేడి చేసిందని చెబితే చాలామంది వైద్యులు ఒప్పుకోరు. కానీ కొన్ని పదార్థాలలో ఉండే అధిక ప్రొటీన్ల వల్ల... ఒంట్లోని జీవక్రియ (మెటబాలిజం) వేగం పెరుగుతుందనీ, దాంతో వేడి చేసిన అనుభూతి కలుగుతుందనీ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా అధిక ప్రొటీన్లు ఉండే కోడిగుడ్డు, బాదంపప్పు, ఓట్స్, మెంతులు, చేపలు వంటి ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెంకొంచెంగా తీసుకోమని సూచిస్తున్నారు.   నూనెపదార్థాలు: నూనె ఎక్కువగా ఉండే వేపుళ్లు, చిరుతిళ్ల వంటి పదార్థాలకు వేసవిలో దూరంగా ఉండటమే మంచిదట. నూనె పదార్థాలు త్వరగా జీర్ణం కావు. పైగా నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల చర్మం కూడా జిడ్డోడుతుందని తేలింది. అలా నూనెపదార్థాలు ఒంటి లోపలా బయటా కూడా చిరాకు కలిగిస్తాయన్నమాట.   మద్యపానం: వేసవి వచ్చిందంటే చాలు... ఆ పేరు చెప్పి పీపాలకు పీపాలు బీరు తాగేస్తుంటారు. ఒకవేళ బీరు దొరక్కపోతే ఎలాంటి మద్యానికైనా సిద్ధంగా ఉంటారు. బీరుతో సహా ఎలాంటి మద్యానికైనా dehydration కలిగించే లక్షణం ఉంది. అందుకనే మద్యం సేవించేటప్పుడు ఒళ్లంతా చెమటలు కక్కడం, మాటిమాటికీ మూత్రానికీ వెళ్లాల్సి రావడం జరుగుతుంది.   మామిడిపళ్లు: వేసవికాలంలో మామిడిపళ్లే గుర్తుకువస్తాయి. ఈ కాలంలో మాత్రమే దొరుకుతాయి కదా! అని ఆబగా లాగించేస్తుంటాం. కానీ మామిడిపళ్లు మోతాదుని మించితే.... విరేచనాలు తప్పవు. పైగా వీటికి వేడి చేసే గుణం కూడా ఉంది. అందుకనే నిరంతరం మామిడిపళ్లు తింటే పెదాలు పగలడం, సెగ్గడ్డలు రావడం జరుగుతుంది.   పాలు: పాల నుంచి వచ్చే పెరుగు, మజ్జిగలు వేసవిలో దాహాన్ని తీరుస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తాయి. కానీ నేరుగా చల్లటి పాలు తాగితే మాత్రం చిక్కులు తప్పవు. చాలామందికి పాలని జీర్ణం చేసుకునే సామర్థ్యం ఉండదు. పైగా చల్లటి పాలని తాగడం వల్ల, వాటిని తిరిగి శరీర ఉష్ణోగ్రతకి అనుగుణంగా మార్చేందుకు మరింత వేడిని ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇక టీ, కాఫీలలో ఉండే కెఫిన్కి కూడా డీహైడ్రేషన్ కలిగించే లక్షణం ఉంది. ఇవే కాదు మాంసాహారం, మసాలా పదార్థాలు, చపాతీలు... ఇవన్నీ కూడా వేసవి తాపాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందంటున్నారు. - నిర్జర.  
  All of us want to be healthy & fit. But more than healthy & fit people want to lose weight and look beautiful. So for all of them who are keen on losing weight, Veramachaneni Garu gives us 4 categories. To know them in detail, watch the video.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.