ALSO ON TELUGUONE N E W S
విజయ్ దేవరకొండ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమలో తేడా కొట్టింది. బ్రేకప్ అయ్యాడు. తర్వాత మరో అమ్మాయి ప్రేమలో పడ్డాడు. మళ్ళీ ఈ ప్రేమలో ఏవో సమస్యలు. మళ్ళీ బ్రేకప్ అయ్యాడు. ఈ బ్రేకప్ కహానీలు రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో! కథలో లవ్ బ్రేకప్స్ ఉన్నాయి కాబట్టి సినిమాకు 'బ్రేకప్' టైటిల్ ప‌ర్‌ఫెక్ట్ అని సినిమా యూనిట్ భావిస్తోందట. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు 'బ్రేకప్' టైటిల్ పరిశీలనలో ఉందట. ఇందులో విజయ్ దేవరకొండ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఫారిన్ బ్యూటీ ఇసాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముగ్గురితోనూ హీరో ప్రేమలో పడటం, బ్రేకప్ వంటివి సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందు 'డియర్ కామ్రేడ్'తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'గీత గోవిందం' తరవాత విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న మరోసారి నటిస్తున్న చిత్రమిది.   
  పండగలకు పబ్బాలకు షాపింగ్ మాల్స్‌లో స్పెషల్ ఆఫర్లు పెడతారు. వన్ ప్లస్ వన్, మూడు కొంటే రెండు ఉచితం, ఎంఆర్‌పి మీద ఫ్లాట్ డిస్కౌంట్ ఇలా! సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు దగ్గర ఇటువంటి ఆఫర్ ఒకటి ఉంది. ఎవరైనా దర్శకుడు ఆయనకు ఒక హిట్ ఇస్తే... ఆ దర్శకుడికి మహేష్‌తో మరో సినిమా చేసే అవకాశం వస్తుంది. ప్లాప్ ఇస్తే కష్టమే. అందుకు ఉదాహరణ... గుణశేఖర్, పూరి, కొరటాల, శ్రీకాంత్ అడ్డాల తదితరులు. తాజాగా ఈ లిస్టులో వంశీ పైడిపల్లి కూడా చేరాడు. గుణశేఖర్ దర్శకత్వంలో 'ఒక్కడు', 'అర్జున్', 'సైనికుడు' చేశాడు. 'పోకిరి' హిట్ తరవాత పూరి జగన్నాథ్‌కి 'బిజినెస్‌మేన్‌' అవకాశం ఇచ్చాడు మహేష్. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరవాత శ్రీకాంత్ అడ్డాలతో 'బ్రహ్మోత్సవం', 'శ్రీమంతుడు' తరవాత కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' చేశాడు. 'మహర్షి' దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి మహేష్ సూత్రప్రాయంగా అంగీకరించాడట. 'మహర్షి' టాక్‌తో సంబంధం లేకుండా మహేష్ బాబు సినిమాపై విపరీతంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా తరవాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రెండో సినిమా చేస్తాడో? మరో సినిమా చేసి వంశీతో సినిమా చేస్తాడో? ఎందుకంటే... పరశురామ్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు కూడా మహేష్ చుట్టూ తిరుగుతున్నారు.
  'సాహో' స‌ర్‌ప్రైజ్ వచ్చింది. సినిమాలో ప్రభాస్ లుక్ ఒకటి విడుదల చేశారు. సారీ.... ప్రభాస్ స్వయంగా తన లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. ఈ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకు స‌ర్‌ప్రైజ్ ఇచ్చిందా? లేదా? అనేది పక్కన పెడితే... లుక్‌తో పాటు ప్రభాస్ పెట్టిన కామెంట్‌తో ఓ స్పష్టత వచ్చింది. సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయని పుకార్లు వస్తున్న నేపథ్యంలో "ఆగస్టు 15న థియేటర్లలో యాక్షన్ మొదలవుతుంది" అని ప్రకటించడంతో అభిమానులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. మరి, స‌ర్‌ప్రైజ్ సంగతేంటి? హిట్టా... ఫట్టా?? స‌ర్‌ప్రైజ్ పేరుతో పోస్టర్ విడుదల చేశారంతే! అందులో ప్రభాస్ ఇంటెన్స్ లుక్ ఇచ్చాడు. మామూలుగా అయితే అభిమానులు నచ్చేదే. కానీ, ఈ లుక్ కంటే ఎక్కువ విషయాన్ని మేకింగ్ వీడియోస్ రూపంలో 'సాహో చాప్టర్ 1, చాప్టర్ 2'గా విడుదల చేశారు. వాటిలో చూపించిన యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ ముందు ఈ లుక్ పెద్ద స‌ర్‌ప్రైజ్ ఇవ్వలేదని చెప్పాలి. 'బాహుబలి' తరవాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో... 'సాహో'పై, ఈ సినిమా నుంచి ప్రతి అప్‌డేట్‌పై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.    
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితా రాజశేఖర్ దంపతుల రెండో కుమార్తె శివాత్మిక హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా 'దొరసాని'. తెలంగాణ నేపథ్యంలో 1980 కాలం నాటి కథతో ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోంది. కెవిఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శనివారం సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. జూలై 5న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత మధుర శ్రీధర్ తెలిపారు. 'అర్జున్ రెడ్డి'తో అనూహ్యంగా యువతలో క్రేజ్ తెచ్చుకున్న హీరో తమ్ముడు ఈ సినిమాలో హీరో కావడం... శివాత్మిక తల్లిదండులు ఇద్దరూ హీరో హీరోయిన్లు కావడంతో 'దొరసాని'పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతోంది. 'కథ అనుకున్నాక హీరో హీరోయిన్లను ఎంపిక చేసుకున్నారా? హీరో హీరోయిన్లను అనుకున్నాక కథ రాశారా?' అని అడిగితే... "ముందు కథ సిద్ధమైంది. తరవాత అమెరికా నుంచి వచ్చిన ఆనంద్ దేవరకొండను చూశా. పాత్రకు సూటవుతాడని కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చాం. ఇక, 'దొరసాని'గా శివాత్మిక అమేజింగ్ ఛాయిస్. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. ఫెంటాస్టిక్" అని మధుర శ్రీధర్ సమాధానం ఇచ్చారు.   
చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వాల‌నుకున్న‌ప్పుడు ఆయ‌న సెల‌క్ట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు డాషింగ్ డైర‌క్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్. ఈ సినిమాకు ఆటోజానీ అనే టైటిల్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసారు. రౌడీ అల్లుడులో బాగా ఫేమ‌స్ అయిన ఈ క్యారెక్ట‌ర్ నే తీసుకుని టైటిల్ పెట్టేసాడు పూరీ. పక్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం ఉంటుంద‌ని  అప్ప‌ట్లో చెప్పాడు పూరీ. ఈ చిత్రం చ‌ర్చ‌లు 2016లో జ‌రిగాయి. అయితే ఆ త‌ర్వాత అనుకోని కార‌ణాల‌తో ఆటోజానీ అట‌కెక్కేసింది. ఆ త‌ర్వాత చిరంజీవి కానీ, పూరీ కానీ  ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడ‌లేదు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు క‌థ అద్భుతంగా సెట్ అయినా సెకాండాఫ్ సెట్ కాక‌పోవ‌డంతో చిరంజీవి ఆటోజానీ నుంచి త‌ప్పుకున్నాడు.ఈ విష‌యాన్ని అప్ప‌ట్లో అన్న‌య్యే నేరుగా మీడియాకు చెప్పాడు.ఈ విష‌యంలో పూరీ కూడా కాస్త హ‌ర్ట్ అయ్యాడు. చిరంజీవి గారు నాతో నేరుగా చెప్పుంటే బాగుండేద‌ని కాస్త నొచ్చుకున్నాడు కూడా. అయితే అప్పుడు మ‌రిచిపోయిన సినిమాను ఇప్పుడు మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించ‌డానికి పూరీ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని తెలుస్తుంది. అన్నీ కుదిర్తే క‌థ‌లో కాస్త మార్పులు చేసి రామ్ చ‌ర‌ణ్ ను ఆటోజానీగా మార్చేయాల‌ని చూస్తున్నాడు ఈ డేరింగ్  డైరెక్ట‌ర్. మెగా వార‌సున్ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిందే పూరీ జ‌గ‌న్నాథ్. చిరుత సినిమాతో స‌క్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు రామ్ చ‌ర‌ణ్. దాన్ని ఆయ‌నే డైరెక్ట్ చేసాడు. దాంతో పూరీతో సినిమా అంటే చ‌ర‌ణ్ కూడా నో అనే స‌మ‌స్య లేదు. అయితే ఏది ఒకే చేయాల‌న్నా కూడా ముందు పూరీ జ‌గ‌న్నాథ్ ఒక్క హిట్ కొట్టాలి. ప్ర‌స్తుతం ఈయ‌న రామ్ హీరోగా ఇస్మార్ట్  శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇది కానీ హిట్ అయిందంటే మ‌ళ్లీ పూరీకి మంచి రోజులు వ‌చ్చిన‌ట్లే. అప్పుడు ఆటోజానీకి కూడా మంచి రోజులు వ‌స్తాయి. మ‌రి చూడాలిక ఏం జ‌ర‌గ‌బోతుందో తండ్రి కాద‌న్న సినిమాలో త‌న‌యుడు న‌టిస్తాడో లేదో అనేది ఇప్పుడు ఆస‌క్తీక‌రంగా మారింది.  
ఒక పిల్లవాడు కుక్కపిల్లలను అమ్మే షాపులోకి వచ్చాడు. ‘అంకుల్! నేను కుక్కపిల్లను కొనాలనుకుంటున్నాను. ఓ కుక్కపిల్లను కొనుక్కోవాలంటే ఎంత కావాలి?’ అని అడిగాడు. ‘కుక్కపిల్లను బట్టి 300 నుంచి 500 దాకా ఖర్చవుతుంది’ అని జవాబిచ్చాడు షాపు యజమాని.   ‘ప్రస్తుతానికి నా దగ్గర ఓ వంద రూపాయలే ఉన్నాయి కానీ, ఓసారి మీ దగ్గర ఉన్న కుక్కపిల్లను చూడవచ్చా!’ అని అడిగాడు పిల్లవాడు.   దానికి షాపు యజమాని పిల్లవాడిని లోపలికి తీసుకువెళ్లి, అక్కడ ఓ గదిలో ఆడుకుంటున్న కుక్కపిల్లలను చూపించాడు. వాటిలో ఒక కుక్కపిల్ల కదలకుండా అలాగే కూర్చుని ఉంది.   ‘ఆ కుక్కపిల్లకి ఏమైంది? ఏమన్నా జబ్బు చేసిందా!’ అని ఆందోళనగా అడిగాడు పిల్లవాడు. ‘జబ్బు కాదూ పాడూ కాదు! దానికి ఓ కాలు పనిచేయదు. కుంటుకుంటూ నడుస్తుంది’ అని చిరాగ్గా బదులిచ్చాడు యజమాని.   ‘అంకుల్! నాకు ఆ కుక్కపిల్లే కావాలి. దాని కోసం ఈ వంద రూపాయలు తీసుకోండి’ అన్నాడు పిల్లవాడు. ‘చవగ్గా వస్తుందని ఆ కుక్కపిల్ల కావాలనుకుంటున్నావేమో! అదెందుకూ పనికిరాదు. కావాలంటే ఉచితంగానే దాన్ని తీసుకుపో!’ అని కసురుకున్నాడు యజమాని.   ‘అబ్బే చవగ్గానో ఉచితంగానో వస్తుందని కాదు. దాన్ని నేను డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాను. ఇప్పుడు ఇచ్చే వంద రూపాయలే కాకుండా మళ్లీ వచ్చి మిగతా డబ్బులు కూడా ఇస్తాను’ అన్నాడు పిల్లవాడు.   పిల్లవాడి మాటలతో యజమానికి చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. ‘నీకేమన్నా పిచ్చా! ఆ కుక్కపిల్లనే కొనుక్కుంటానని అంటావేంటి? అది మిగతా కుక్కపిల్లల్లాగా పరుగులెత్తలేదు, గంతులు వేయలేదు... కనీసం చురుగ్గా నడవలేదు’ అని కోప్పడ్డాడు యజమాని.   యజమాని మాటలకి పిల్లవాడు ఒక నిమిషం పాటు ఏం మాట్లాడలేదు. ఆ తరువాత నిదానంగా తన ప్యాంటుని పైకి ఎత్తి చూపించాడు. అతని మోకాలి నుంచి అరికాలి వరకూ లోహపు పట్టీలు వేసి ఉన్నాయి. అప్పటిదాకా పిల్లవాడి అవిటితనాన్ని యజమాని గమనించనేలేదు. ‘శరీరంలో ఒక భాగం లేనంత మాత్రాన ఆ కుక్కపిల్ల విలువ తగ్గిపోవడం నాకిష్టం లేదు. పైగా అది కూడా నాలా పెద్దగా పరుగులెత్తలేదు కాబట్టి నాకు తోడుగా ఉంటుంది. నా బాధని తనన్నా అర్థం చేసుకుంటుంది’ అన్నాడు పిల్లవాడు కన్నీళ్లని ఆపుకుంటూ!   కష్టంలో ఉన్న జీవికి కావల్సింది ఓదార్పు, ప్రోత్సాహం.... అన్నింటికీ మించి ఆ కష్టాన్ని అర్థం చేసుకునే మనసు అని తెలిసొచ్చింది యజమానికి. ..Nirjara
ఏ సందర్భంలో అయినా గడగడా మాట్లాడేసినంత మాత్రాన మనకి వాక్చాతుర్యం ఉందని మురిసిపోవడానికి లేదు. ఎవరి ముందైనా కూడా జంకు లేకుండా ఉపన్యాసం దంచేసినంత మాత్రాన మనం గొప్ప వక్తలం అనుకోవడానికీ లేదు. మనం చెప్పే మాట అవతలివారికి వినపడాలి. అది స్పష్టంగా అర్థమవ్వాలి. స్వరం కూడా వినసొంపుగా ఉండాలి. అప్పుడే మనం పలికే పదానికి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఉత్త కంఠశోష మాత్రమే మిగులుతుంది. అందుకోసం కొన్ని చిట్కాలను పాటిస్తే తప్పక ఉపయోగం ఉంటుందంటున్నారు నిపుణులు.   సరైన శ్వాస: ఆరోగ్యంగా ఉండాలంటే గాఢంగా ఊపిరి పీల్చుకోవాలని అందరూ చెప్పే విషయమే! ఇలా ఊపిరితిత్తుల లోతుల నుంచి ఊపిరి పీల్చుకునే అలవాటు వల్ల మన మాటలో కూడా మార్పు వస్తుంది. మాటని బలంగా చెప్పగలుగుతాం. కావాలంటే గట్టిగా ఊపిరి తీసుకుని మాట్లాడి చూడండి... మీ మాటల్లోని మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది.   నిదానంగా: భయంతోనో, మనసులో మాటని త్వరత్వరగా చెప్పాలన్న ఉద్విగ్నతతోనో మనం హడావుడిగా మాట్లాడతాం. భాష మీద పట్టుంటే త్వరగా మాట్లాడగటం అన్న అపోహ కూడా చాలా మంది ఉంది. అందుకనే భారతీయులు ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు హడావుడిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. దీని వల్ల అసలుకే ఎసరు తప్పదు. తప్పులుతడకలుగా మాట్లాడటమో, తడబడటమో, మన మాట అవతలివారికి అర్థం కాకపోవడమో జరుగుతుంది. ఉపన్యాస కళ మీద మంచి పట్టు ఏర్పడే వరకు కాస్త ఆలోచించి నిదానంగా మాట్లాడటమే మంచిది.   రికార్డు చేసుకుని: ఎవరి మాటలు వారి చెవులకు అద్భుతంగానే తోస్తాయి. కానీ మన మాటలు అవతలివారికి ఎలా వినిపిస్తుందో గ్రహించం. అందుకోసం ఒక్కసారి మన మాటల్ని మనమే రికార్డు చేసుకుని వింటే మన శ్రావ్యమైన గొంతు మీద మనకి ఉన్న నమ్మకాలన్నీ పటాపంచలైపోతాయి. దాంతో ఎలాగైనా సరే మనం మాట్లాడే తీరుని మార్చుకోవాలన్న పట్టుదల ఏర్పడుతుంది.   గొంతు తెరచి: చాలామంది మాట్లాడుతుంటే ఊరికనే పెదాలని ఆడిస్తున్నట్లు కనిపిస్తుందే కానీ స్పష్టత ఉండదు. నోరు పూర్తిగా తెరిచి మాట్లాడకపోతే మన మాటలు గొణుగుతున్నట్లుగానే వినిపిస్తాయి. నోరు పూర్తిగా తెరుకుని మాట్లాడినప్పుడు పెదాలు కూడా విచ్చుకుంటాయి. నాలుకా, కింద దవడలు కూడా కదులుతూ ఉన్నప్పుడు పదాలను స్పష్టంగా, దృఢంగా పలకగలుగుతాం.   వ్యాయామం: సంగీత స్వరాల మీద పట్టు సాధించేందుకు మన పెద్దలు చన్నీళ్లలో గొంతు వరకూ మునిగి సాధన చేసేవారట. అంత కష్టం మనవల్ల కాదు కానీ స్వరం మెరుగుపడేందుకు చాలా వ్యాయామాలే ఉన్నాయి. ఉదాహరణకు Cicely Berry వ్యాయామం పేరుతో ఇంటర్నెట్లో శోధిస్తే కొన్ని పదాలు కనిపిస్తాయి. వీటిని కనుక పలుకుతూ ఉంటే మన ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే సంస్కృత శ్లోకాలని చదవడం, Tongue twistersని అభ్యసించడం వల్ల కూడా ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతారు. - నిర్జర.  
  చుట్టూ ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ప్రపంచం ఎంత డిజిటల్ విప్లవాన్ని సాధించినా... పేపరు వాడకం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. 90 శాతానికి పైగా కాగితాలని చెట్ల నుంచి తయారుచేయాల్సిందే! ఇలా టన్నులకొద్దీ కాగితాలను తయారుచేయడానికి ఏటా 300 కోట్లకు పైగా చెట్లని నాశనం చేయవలసి వస్తోంది. ఇక కాగితం తయారీకి కావల్సిన నీటి సంగతి చెప్పనవసరం లేదు. ఒక కిలో కాగితం తయారుచేయడానికి 300 లీటర్ల నీరు కావాలి. ఇక కాగితం తళతళ్లాడిపోయేలా చేయడం దగ్గర నుంచీ దాని మీద ప్రింటింగ్ చేయడం వరకూ నానారకాల రసాయనాలనూ ఉత్పత్తి చేయక తప్పదు.   కాగితాన్ని ఉత్పత్తి చేసేందుకు కొన్ని చెట్లను ప్రత్యేకించి పెంచుతూ ఉంటారు. కానీ తయారీ కోసం నరికే చెట్లలో ఇవి కొద్ది శాతం మాత్రమే. కాబట్టి కాగితం వాడకాన్ని తగ్గించకపోతే నీరు, గాలి కలుషితం కావడం అటుంచి... భూమ్మీద చెట్టనేదే లేకుండా పోతుంది. మన వంతుగా తీసుకునే చిన్న చిన్న చర్యలు కూడా కాగితం వృధా కాకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు నిపుణులు.   - ఏటీఎం, మెడికల్ షాప్, సూపర్ మార్కెట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఒకో బిల్లు తెచ్చుకోవడం మనకి అలవాటు. కొనేది ఒకటి రెండు వస్తువులే అయినా, బిల్లు విషయంలో అనుమానం లేకపోయినా, స్క్రీన్ మీద అంతా కనిపిస్తున్నా... బిల్లు లేకుండా బయటకు రాలేం. ఈ బిల్లుల కోసం కాగితం తయారీ, వాటి మీద ఇంకు... రెండూ కూడా పర్యావరణానికి నష్టమే! ఇలాంటి చోట బిల్లు అవసరం లేదన్న ఒక్క మాట కాగితం వృధాని ఆపుతుంది.   - ఇప్పుడు ప్రతి పుస్తకమూ ఈ-బుక్ రూపంలో లభిస్తోంది. అయినా పాత అలవాటుని వదులుకోలేకనో, పుస్తకం ఇచ్చే సాంత్వన కోసమో జనం ఏటా కోట్ల పుస్తకాలు కొంటూనే ఉన్నారు. ఈ పద్ధతి మారేందుకు కొన్నాళ్లు పడుతుందేమో! కానీ మళ్లీ చదవాల్సిన అవసరం లేదు అన్న పుస్తకాన్ని మరొకరికి ఇచ్చేస్తే సరి.   - మన కంటి ముందున్న ప్రతి కాగితమూ ఈ లోకాన్ని నాశనం చేస్తూ పుట్టింది అన్న అవగాహన ఉన్నప్పుడు... చిన్నపాటి కాగితాన్ని కూడా వృధా చేయం. కాగితాన్ని రెండువైపులా వాడటం, ఏదన్నా నోట్స్ రాసుకునేందుకు చిన్నపాటి కాగితాలను ఉపయోగించడం లాంటి చర్యలు చాలా కాగితాన్నే ఆదా చేస్తాయి.   - ఇంట్లో ఓ నలుగురు చేరినా కూడా కాగితం ప్లేట్లు, పేపరు కప్పులు వాడేస్తుంటాం. ఇవి చూసేందుకు సోగ్గా కనిపించవచ్చు. కానీ పేపరు కప్పులలో ఏం పోసిన తడిసిపోకుండా ఉండేందుకు వాటిలో నానారకాల రసాయనాలు కలుపుతారు. వీటి వల్ల ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. పైగా వీటిని రీసైకిల్ చేయడం కూడా కష్టమైపోతుంది.   - ఆఫీసులో మనం ఎంత కాగితం వాడుతున్నామో అడిగేవారు లేకపోవచ్చు. పైగా చేతిలో ప్రింటర్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి అంతగా ఆలోచన లేకుండానే కిలోల కొద్దీ కాగితాన్ని వాడేస్తుంటాం. ఈమెయిల్స్, వర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా చక్కబెట్టే పనులకి కాగితాన్ని వాడకపోవడం, ప్రింట్ అవుట్ అవసరం అయినా చిన్నపాటి కాగితాలని ఉపయోగించడం, రెండువైపులా ప్రింట్ ఔట్ తీసుకోవడం వంటి చర్యలతో కాగితం వృధా కాకుండా ఉంటుంది. ఆపీసులో కాగితం వాడకానికి కూడా ఒక చిన్నపాటి ఆడిట్ జరిగితే... వీలైనంత వృధా తగ్గిపోతుంది. - నిర్జర.    
  ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఏకంగా సుప్రీం కోర్టునే తప్పుపట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సుప్రీం కోర్టు రిగ్గింగ్‌కు పాల్పడుతోందా? అని వ్యాఖ్యానించారు. 100శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వీవీప్యాట్‌ స్లిప్పులన్నింటినీ లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు ఎందుకు అంగీకరించడం లేదు? రిగ్గింగ్ వ్యవహారంలో కోర్టు పాత్ర కూడా ఉందా? అని ట్వీట్ చేశారు. ఎన్నికల నిర్వహణకు మూడు నెలలు తీసుకున్నపుడు.. ఫలితాలకు కూడా మూడు రోజులు పడుతుందిగా అని ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, వాయువ్య ఢిల్లీ బీజేపీ ఎంపీగా ఉన్న ఉదిత్ రాజ్ ఆ పార్టీ తనకు టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఐఆర్‌ఎస్ అధికారి అయిన ఉదిత్ రాజ్ 2012లో ఇండియన్ జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. 2014లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అదే ఏడాది వాయువ్య ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ లో చేరారు.
  ఫలితాలకు ఒక్క రోజు ముందు కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబాలకు సన్నిహితంగా ఉండే శేఖర్ రెడ్డి అనే టీడీపీ మద్దతుదారుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. డోన్ మండలం, తాపల కొత్తూరులో శేఖర్ రెడ్డి టీవీఎస్‌పై వెళ్తుండగా.. ప్రత్యర్థులు దారిలో అడ్డగించి మొదట కర్రలతో దాడి చేశారు. అనంతరం బండరాయితో శేఖర్ రెడ్డి తలపై బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఎన్నికల ఫలితాలు వచ్చే ఒక రోజు ముందు ఈ హత్య జరగడంతో కర్నూలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ హత్య రాజకీయ కోణంలో జరిగిందా? లేక వ్యక్తిగత కారణాలతో జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌లను దింపారు.
  ఏపీలో ఏ పార్టీకి విజయం చేకూరనుందో రేపు అధికారికంగా తేలనుంది. అప్పటివరకు మిగిలిన ఈ కొద్ది గంటలు ఎవరి అంచనాలు వారివి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. మెజారిటీ సంస్థలు ఏపీలో వైసీపీదే అధికారమని అంచనా వేశాయి. ఒకటి రెండు సంస్థలు మాత్రం టీడీపీ అధికారం నిలబెట్టుకుంటుందని అంటున్నాయి. ఇక ఎంతోకొంత ప్రభావం చూపుతుందనుకున్న జనసేన రెండు మూడు సీట్లకు మించి గెలిచే అవకాశం లేదని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ ఎగ్జిట్ పోల్స్ వైసీపీలో ఆనందాన్ని, టీడీపీలో భయాన్ని, జనసేనలో నిరాశని మిగిల్చాయి. అయితే జ్యోతిష్య పండితులు మాత్రం ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్లు జనసేన మరీ అంత వీక్‌గా ఏమీ లేదట. గ్రహాలు వాటి మూమెంట్ ని బట్టి చూస్తుంటే.. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జనసేన మద్దతు తప్పనిసరి అంటున్నారు జ్యోతిష్య పండితులు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని.. అవి పూర్తిగా అబద్ధాలు చెబుతున్నాయని జ్యోతిష్య శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన శైలేంద్ర శర్మ అంటున్నారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు జరిగిన 7 దశలనూ పరిశీలిస్తే.. గ్రహాలు ఏ పార్టీకీ అనుకూలంగా లేవని ఆయన అంటున్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా సరే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ప్రధాని అయ్యే భాగ్యం లేదట. ఎన్డీయే పక్షాలన్నీ కలిసినా మేజిక్ ఫిగర్ రాదట. కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. జ్యోతిష్య పండితులు మాత్రం అటు కేంద్రంలోనూ, ఇటు ఏపీలోనూ హంగ్ తప్పదు అంటున్నారు. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో మరి కొద్ది గంటల్లో తెలుసుకుందాం.
  A research says that excess or continuous usage of cell phone can increase the risks of Brain Tumor. Though the exact number cannot be revealed, Dr. Ranganatham too warns the people who use cell phones excessively. To know in detail watch the video. https://www.youtube.com/watch?v=U5Du_HOHgl0  
  తలనొప్పి రాని మనిషెవరుంటారు! ఒకప్పుడైతే ఓ గంటా రెండు గంటలకు మించి తలనొప్పి బాధిస్తే, ఏదో ఒక చిట్కా వైద్యం చేసి దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించేవారు. మరీ తగ్గకపోతే, తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ మోతాదులో మందులను వేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఇలా తలనొప్పి మొదలైందో లేదో అలా ఓ భారీ మందుబిళ్లను చప్పరించేస్తున్నాము. దానివల్ల మన శరీరం నిదానంగా నొప్పి మాత్రలకు అలవాటుపడిపోతోందనీ, రాన్రానూ మోతాదుని పెంచితేనే కానీ ఆ మందులు పనిచేయవనీ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. తలనొప్పిలో 200కి పైగా రకాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. వీటిలో చాలావరకు ఆకలికో, ఒత్తిడి కారణంగానో, నిద్రలేమితోనో వచ్చే నొప్పులే! ఇక ‘తిక్క తిక్క’ సినిమాలు చూసిన తరువాత వచ్చే నొప్పులూ లేకపోలేదు. ఇలాంటి తాత్కాలిక తలనొప్పులకి మందుబిళ్లల జోలికి పోకుండా కొన్ని చిట్కాలను ప్రయత్నించి చూస్తే సరి.   నిదానించండి!: చాలావరకూ తలనొప్పులు మన రోజువారీ ఉన్న ఉరుకులు పరుగుల కారణంగానే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తలలో సన్నటి నొప్పి మొదలవగానే, కాస్త నిదానించేందుకు ప్రయత్నించండి. మీ ఉద్వేగాలను తగ్గించుకోండి. ఓ పది నిమిషాల పాటు మీ శ్వాసను గమనిస్తూ, వీలైనంత నిదానంగా శ్వాసను పీల్చుకునేందుకు ప్రయత్నించండి. వీలైతే కాసేపు ద్యానంలో మునిగిపోండి. లేదా ఏదన్నా మంచి సంగీతంలో లీనమయ్యేందుకు ప్రయత్నించండి.   నీళ్లు: రోజువారీ హడావుడిలో మునిగిపోయి చాలామంది తగినంత నీరు తీసుకోవడమే మర్చిపోతూ ఉంటారు. నిజానికి శరీరానికి తగినంత నీరు అందకపోయినా కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎంత పనిలో ఉన్నా, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు నీరు తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకోసారి మరీ చల్లటి నీరు తాగడం కూడా కొందరిలో తలనొప్పికి దారితీస్తుంది. పైగా చల్లటి నీటితో దాహం తీరేది కూడా తక్కువే!   వేణ్నీళ్లు- చన్నీళ్లు: మెడ దగ్గర కండరాలు బిగుసుకుపోయినట్లుండే తలనొప్పికి, మెడ వెనుక భాగంలో వేడి నీటి కాపడం పెట్టడం చాలా ఉపశమనంగా ఉంటుంది. అలా కాకుండా కణతల వద్ద మాత్రమే నొప్పి ఉంటే, కొన్ని మంచు ముక్కలను గుడ్డలో చుట్టి పెడితే తలనొప్పి నిదానిస్తుంది. మంచు ముక్కల వల్ల అక్కడి రక్తనాళాల వాపు తగ్గి రక్తప్రసారం తిరిగి యథాస్థితికి వస్తాయి. దీంతో తలనొప్పి కూడా ఉపశమించే అవకాశం ఏర్పడుతుంది.   చిన్నపాటి కదలికలు: మాడు మీద, కణతుల వద్దా మర్దనా చేస్తే తలనొప్పి నుంచి కాస్తైనా ఉపశమనం లభించడాన్ని గమనించవచ్చు. తలని రెండు భుజాల వైపుగా కదల్చడం, భుజాలను కూడా కిందకీ మీదకీ ఆడించడం వల్ల ఒత్తిడిలో ఉన్న కండరాలకి కాస్త విశ్రాంతిని ఇచ్చినట్లవుతుంది. ఓ నాలుగడులు అలా నడుచుకుంటూ వెళ్లినా ఉపయోగమే!   వంటింటి చిట్కాలు: తలనొప్పిని తరిమికొట్టే ఆయుధాలు మన వంటింట్లో చాలానే కనిపిస్తాయి. అల్లం లేదా పుదీనా ఆకులతో చేసిన తేనీరు పుచ్చుకున్నా, దాల్చిన చెక్కని పొడిచేసి కణతులకు పట్టించినా, లవంగ నూనెని వాసన చూసినా, నిమ్మరసం కలిపిన నీటిని తాగినా... తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మరో వైపు కాఫీ, మద్యం, చాక్లెట్‌ వంటి పదార్థాలు తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   - నిర్జర.  
మన భారతదేశంలో లభించే రకరకాల పండ్లన్నింటిలోనూ మామిడికాయలు ఎంతో ప్రత్యేకమైనవి. పచ్చిమామిడికాయల నుంచి పండు మామిడికాయల వరకు ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి. చిన్న, పెద్ద అని తేడాలేకుండా ప్రతిఒక్కరు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు రకరకాల వంటకాలలోను మామిడిపండ్లను ఉపయోగిస్తారు. అందువల్లే దీనిని పండ్లకు రారాజుగా పేర్కొంటారు... మామిడి లో పోషక ఆహారాలు పుష్కలం. విటమిన్ c, విటమిన్ A, B 6 పుష్కలంగా ఉంటాయి.  ఇంకా , పొటాషియం, కాపర్, మెగ్నీషియం కూడా తగిన మొదతులోనే ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా దీంట్లోని ప్రో బయోటిక్ ఫైబర్ చాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని ఎక్కువ తినకూడదని, తింటే వేడిమి అని కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. కాని మామిడి ఎండాకాలం ఓ మహా ప్రసాదమే అనుకోండి దాని లోని ఆని ఔషద గుణాలకు. కొన్న మామిడి... ముఖ్య ప్రయోజనాలను చూద్దాం :- వేసవిలో వడదెబ్బ తగలడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు పచ్చి మామిడి రసాన్ని మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. నీరసంతో పాటూ, అలసట కూడా తగ్గుతుంది. వడదెబ్బ సమస్య నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. పచ్చిమామిడి కాయలో విటమిన్  సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి.  ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది. మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.