దెబ్బలు నిజమైతే తీవ్ర పరిణామాలు.. హైకోర్టు సీరియస్ వార్నింగ్..
Published on: Sat May 15, 2021 7:37PM
ఘోరం. క్రూరం. దారుణం. పైశాచికత్వం. కక్ష కడితే.. మరీ ఇంతలా కొడతారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. మరీ ఇంత దారుణంగా హింసిస్తారా? పాదాలు నల్లగా కమిలేలా.. కాళ్లు వాచిపోయేలా.. ఓ రౌడీనో.. ఏ గుండానో కొట్టినట్టు క్రూరంగా కొడతారా? .. రఘురామ కృష్ణరాజు ఆరోపించినట్టు.. ఆయన కాళ్లకు అయిన గాయాలు పోలీసులు కొట్టినవే అయితే.. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా..
.jpg)
రఘురామకృష్ణరాజు కాళ్లకు అయిన గాయాల ఆధారాలను లాయర్లు కోర్టు ముందుంచారు. ఎంపీ కాలి గాయాలను చూసి రిమాండ్ రిపోర్టును సీఐడీ జడ్జి పెండింగ్లో పెట్టారు. చికిత్స కోసం రఘురామను వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు.
మరోవైపు, హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట కూడా వాదనలు కొనసాగుతున్నాయి. రఘురామను వెంటనే మెడికల్ బోర్డుతో పరీక్ష చేయించాలని, సెషన్స్ కోర్టు రికార్డ్ స్టేట్మెంట్ను తక్షణం ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

రఘురామకు కేంద్రం కల్పించిన వై కేటగిరి భద్రత కొనసాగించాలని ఆయన తరపు న్యాయవాది సీనియర్ లాయర్ ఆదినారాయణరావు కోరారు. రఘురామ కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలని కోరారు. మెడికల్ బోర్డు నివేదిక ఆదివారం ఉదయం 10:30లోపు ఇచ్చేలా చూడాలని కోర్టును కోరారు.
.jpg)


