సీబీఐ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం
Published on: Tue Sep 4, 2012 3:53PM
చేపచేప ఎందుకెండలేదంటే, నాకెవరో ఎండపడకుండా అడ్డమొచ్చారు అన్నట్టుగా ఉంది సీబీఐ అధికారుల తీరు. ఓబుళాపురం మైనింగ్ కేసు, ఎమార్ కేసుల్లో నిందితులైన శ్రీలక్ష్మి, విజయరాఘవలు తాము సీబీఐకి సమర్పించిన పత్రాల ప్రతులు కాపీలు కావాలని న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. వాళ్లు కోరిన పత్రాల కాపీల్ని అందజేయమని న్యాయస్థానంకూడా ఆదేశించింది. కానీ.. ఇప్పటివరకూ కాయితాలు నిందితుల చేతికి అందలేదు. ఈ విషయమై న్యాయమూర్తి సీబీఐ న్యాయవాదిని మూడుసార్లు ప్రశ్నించారు. సీబీఐ తరఫు న్యాయవాది ఇచ్చిన సమాధానం విని జడ్జ్ గారికి చిర్రెత్తుకొచ్చింది. సీబీఐ లాయర్ జడ్జ్ గారికి చెప్పిన కారణమేంటో తెలుసా... జిరాక్స్ మెషీన్ పనిచేయని కారణంగా నిందితులకు పత్రాల కాపీల్ని ఇవ్వడానికి ఆలస్యమౌతోందట.


