TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డుమీదే ప్రసవించిన మహిళ

Published on: Fri Aug 31, 2012 5:37PM

మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మహిళ రోడ్డుమీదే ప్రసవించింది. బొంరాస్‌పేట మండలానికి చెందిన తులసీభాయ్‌ ఉదయం కాన్పుకోసం తండ్రితో కలిసి వడిచర్ల నుండి తాండూరుకు బస్సులో బయలుదేరింది.  మధ్యాహ్నం 1.50 ని॥కు బస్టాండ్‌లో దిగిన కొద్దినిముషాలకే ఆమెకు నొప్పులు రావడంతో అక్కడికక్కడే బిడ్డని ప్రసవించింది. నెత్తుటిమడుగులో ఉన్న తన బిడ్డను ప్రక్కకి తీయమని ఆమె ప్రాధేయపడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. చాలా సేపటి తర్వాత 104 సిబ్బంది వచ్చి ఆ తల్లీబిడ్డలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.