TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

త్వరలో మరో నాలుగు న్యూస్‌ ఛానళ్ళు

Published on: Sat Aug 11, 2012 10:07AM

ఇప్పటికే ప్రసారమాద్యమాలన్నీ రాజకీయపార్టీలతో ముడిపడి ఉన్నాయి. ఏరాజకీయ పార్టీకి చెందని చానళ్లు రెండు మూడు కంటె రాష్ట్రంలో ఎక్కువ లేవని చెప్పవచ్చు . అయితే  చానళ్ల ప్రాముఖ్యతను గుర్తించిన వివిధ రాజకీయనాయకులు  తమ రాజకీయ ప్రయోజనాలకోసం త్వరలో మరో నాలుగు న్యూస్ ఛానళ్ల ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు ఒక ఛానల్‌ ఉండాలనే విషయాన్ని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి సాక్షి చానల్‌ను ప్రారంభించినప్పటికీ తరువాత జరిగిన పరిణామక్రమంలో అది వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఛానల్‌గా మారింది.



దీంతో కాంగ్రెస్‌కు ఒక ప్రత్యేక ఛానల్‌ కావాల్సి వచ్చింది. కాంగ్రెస్‌తో పాటు సిపిఐ,సిపియం,బిజెపిలు న్యూస్‌ ఛానళ్ళ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి.  కాంగ్రెస్‌కు కేరళలో ఇప్పటికే జైహింద్‌ పేరుతో ఛానల్‌ ఉంది. దానికి ఎఐసిసి ఆర్దిక సాయం చేసింది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఛానల్‌ ప్రాంరభించాలని రాష్ట్ర  నాయకులు అనుకుంటున్నారు. అధిష్టానం అనుమతిస్తే  అనుమతిస్తే బొత్స సత్యన్నారాయణ, చిరంజీవి ఈ ఛానల్‌ నిర్వహణాబాద్యతలు తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెబుతున్నారు. వారేకాకుండా మరికొంత మంది ఎంఎల్‌సీలు, ఎన్‌ఆర్‌ఐలు కూడా కాంగ్రెస్‌ ఛానల్‌కు చేయూత నిచ్చేందుకు  సంసిద్దత తెలియచేస్తున్నారు.

 



ప్రస్తుత ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రతీవిషయాన్నీ అధికార సభ్యులు ప్రపంచీకరణతో ముడిపెట్టడాన్ని నివారిస్తూ, ఇప్పుడున్న విధానాలకు ప్రత్యామ్నాయ పద్దతులను చూపాలంటే తమ విధివిధానాలకు కట్టుబడి ఉండే చానల్స్‌ను ప్రారంభించాల్సిన అవసరం ఉందని  ఉభయ కమ్యూనిస్టులు చెబుతున్నాయి. ఎన్ని కార్యక్రమాలను చేపట్టినా ప్రజల్లోకి వెళ్లకపోతే ఫలితం ఉండదని అందుకే తాముకూడా న్యూస్‌ ఛానల్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని బిజెపి నాయకుడు కిషన్‌రెడ్డి చెప్పారు.