Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గంజాయివనంగా మారుతున్న విశాఖ ఏజెన్సీ
posted on: Aug 11, 2012 10:12AM
అడ్డదారుల్లో డబ్బుసంపాదించుకోవాలను కుంటున్న వారికి విశాఖ ఏజెన్సీ బాగా కలిసొస్తుంది. గిరిజనుల బలహీనతలు గుర్తించి వారిని లోబరచుకొని కొంతమంది దళారులు గంజాయి పండిస్తున్నారు. వాటిని మహారాష్ట్ర, తమిళనాడుకు గుట్టుచప్పడుకాకుండా తరలించి క్యాష్ చేసుకుంటున్నారు. గంజాయితరలించడానికి గానూ ప్రత్యేకంగా ఏజెంట్లు ఉన్నారు. వారు బస్సులు, ట్రైయిన్లును ఉపయోగించుకుంటున్నారు.
పాడేరు ఇందుకు ముఖ్యకేంద్రంగా ఉందని తెలిసింది.ఏజెంట్లు సూట్‌కేసులు, లగేజీ బ్యాగులతో ఎక్కడికి పడితే అక్కడికి సులువుగా గంజాయిని తరలిస్తున్నారు. ఒకోసారి పోలీసులు కంటపడకుండా ఉండటానికి మినీ వ్యాన్‌లకు ఎప్పటికప్పుడు నెంబరు ప్లేట్లు కూడా మారుస్తున్నారు.ఈ మద్య తమిళనాడుసరిహద్దు ప్రాతంమైన చిన్నపన్నపాలెం దగ్గర ఎక్సైజ్, ప్రోహిబిషన్‌వారు కాపుకాసి నిందితులను పట్టుకున్నారు. అదే విదంగా పాడేరులో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి లాకప్‌నుండి కిటికీ ఊచలు వంచి పారిపోయినట్లు ఉదయాన్నే కనుగొన్నారు.
ఏలూరులో 20 లక్షల రూపాయల గంజాయితోపాటు నిందుతులను కూడా పోలీసులు పట్టుకున్నారు. వీరుకూడా తెల్లారేసరికి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.ఈ సంఘటన పలు అనుమాలను కలిగిస్తూ పోలీసుల చిత్తశుద్దిని శంకించేలా చేసింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను లోనూ, విశాఖ జిల్లా నర్సీపట్నంలోకూడా పలు మార్లు నిందుతులను పోలీసులు పట్టుకోవడంతో ఏజెన్సీ ఏరియాలో యధేచ్చగా గంజాయి సాగుజరుగుతున్నట్లు నిర్దారణ అవుతోంది.



.jpeg)


