TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అన్నీ కోతలే

Published on: Wed Aug 22, 2012 10:43AM

వర్షాలు తగ్గుముఖం పట్టడం, జలాశయాల్లో నీటిమట్టాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటం, రామగుండం ఎన్టీపిసిలో ఒక యూనిట్‌ ట్రిప్‌ కావడంతో మళ్ళీ విద్యుత్‌ కోత ప్రారంభం. ఇంటి అవసరాలతోపాటు, పరిశ్రమలకు సైతం ఈ కోత ప్రారంభమయింది. ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడగా పేరుపొందిన పటాన్‌చెరులో ఆదివారం నుండి పవర్‌ హాలిడే ప్రకటించారు.



రామగుండం ఎన్టీపిసిలో 550 మెగావాట్ల యూనిట్‌ ట్రిప్‌ కావడంతో  పారిశ్రామికవాడకు సరిపడినంత విద్యుత్‌ సరఫరా చేయలేకపోతున్నామని  ట్రాన్స్‌కో అధికారులు  తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి మెరుగైన తర్వాత మళ్ళీ పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఎప్పుడు సరఫరాచేసేది చెబుతామని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.


 అప్రకటిత కోత వల్ల   ముడిపదార్ధాలు పాడైపోయి  తీవ్రంగా నష్టపోయామని  పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోతవల్ల సుమారుగా 1075 చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల్లో ఉత్పాదన ప్రక్రియ నిలిచిపోయిందని తెలుస్తోంది. విద్యార్ధికి ఫీజు కోత, సామాన్యులకు రేషన్‌ కోత, నిరుద్యోగులకు ఉద్యోగాల్లో కోత ఇలా... అధికారంలోకి వచ్చిన నాటి నుంచి... మళ్ళీ ఎన్నికల ముందు వరకు అన్నిటా కోతలేనా? .. ఈ కోతలకు ముగింపు ఎప్పుడా అని సామాన్యులు ఎదురు చూస్తున్నారు.