జోహ్రా కన్నుమూత: రాష్ట్రపతి ప్రణబ్ ఆవేదన
Published on: Fri Jul 11, 2014 3:53PM

ప్రముఖ బాలీవుడ్ నటి జోహ్రా కన్నుమూత పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన చెందారు. జోహ్రా ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరుకున్నారు. ‘‘జోహ్రా మరణంతో కళ, సృజనాత్మక రంగాల్లో శూన్యత ఏర్పడింది’’ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. ఇంతకుముందే భారత ప్రధాని నరేంద్రమోడీ, అమితాబ్ బచ్చన్, మాధుర్ బండార్కర్ తదితర సినీ ప్రముఖులు, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తదితరులు జోహ్రాకు నివాళులు అర్పించారు.


