TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నా చిలిపి యంగ్ గర్ల్‌ఫ్రెండ్ చనిపోయింది: షారుఖ్

Published on: Fri Jul 11, 2014 5:35PM

 

తాను ఎప్పుడు కలసినా ఒక యంగ్ చిలిపి గర్ల్ ఫ్రెండ్‌ని కలిసిన అనుభూతిని కలిగించే సీనియర్ నటి జోహ్రా సెహగల్ మరణించడం తనకు ఎంతో బాధను కలిగిస్తోందని బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ ఖాన్ అన్నారు. జోహ్రా సెహగల్ అనేక చిత్రాలలో షారుఖ్‌కు బామ్మగా నటించారు. జోహ్రా మరణం మీద షారుఖ్ స్పందిస్తూ ‘‘నా దగ్గర ఎంతో చిలిపిగా వుండే నా యంగ్ గర్ల్ ఫ్రెండ్ జోహ్రా మరణించడం నాకు ఎంతో బాధని కలిగిస్తోంది. ఆమెకు 102 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఉత్సాహవంతమైన యువతిలా వుండేది. ఆమె ముఖం మీద ఎప్పుడూ నవ్వు చెరిగేది కాదు’’ అన్నారు.