TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జికా వైరస్‌ పేరుతో టాటా కారు!

Published on: Wed Feb 3, 2016 9:33AM


 

ప్రపంచాన్నంతా వణికిస్తున్న వైరస్‌ జికా. పుట్టబోయే పిల్లలను సైతం వదలని ఈ వైరస్‌ ఇప్పడు టాటా సంస్థని కూడా తాకింది. కారణం! టాటా మూడేళ్లపాటు కృషి చేసి రూపొందించిన కారుకి జికాని పోలిన పేరు పెట్టుకోవడమే! తమ కారు వేగంగా ఉంటుంది అన్నదానికి సూచనగా టాటా తన కొత్త కారుకి Zippy Car అన్న పేరుని నిర్ణయించింది. దీన్ని పొడి అక్షరాలలో ZICAగా మార్చి అదే బ్రాండుతో విపణిలోకి వెళ్లాలని ఆశించింది. కానీ ఈ పేరు Zika Virusకు దగ్గరగా ఉండటంతో ఇప్పుడు టాటాకి లేనిపోని తలనొప్పులు మొదలయ్యాయి.

ప్రచారం కోసం కావాలనే జికా వైరస్‌కు దగ్గరగా ఉన్న పేరుని ఎంచుకున్నారన్న విమర్శలూ మొదలయ్యాయి. విమర్శలే పనిచేశాయో లేకపోతే అలాంటి పేరు అసందర్భంగా ఉంటుందని తోచిందో కానీ ఇప్పుడు టాటా తన ZICA కారుకి మరో పేరుని వెతుక్కేనే పనిలో పడిపోయింది. కానీ అప్పటి వరకూ ఈ కారు పాత పేరుతోనే ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకూ డిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలో కూడా ఇదే పేరుతో ఈ కారుని ప్రదర్శించనున్నారు. ఈ కారు ఏమేరకు వ్యాపిస్తుందో చూడాలి మరి!