ఆసీస్ సూపర్ -8 అర్హతకు జింబాబ్వే గండం
posted on: Feb 17, 2026 10:25AM

టీ 20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా ఇప్పుడు కనీసం సూపర్-8లో అడుగుపెట్టడం ప్రశ్నార్ధకంగా మారింది. గ్రూపు మ్యాచుల్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన ఆసీస్ తన చివరి పోరుతో ఒమన్ తో ఈ నెల 20న తలపడనుంది. ఆ పసికూనపై గెలిచినా సూపర్-8కి అర్హత సాధిస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. ఇప్పటకే జింబాబ్వే రెండు విజయాలు సాధించి ఆసీస్ కంటే పాయింట్ల పట్టికలో ముందుంది. ఆఖరి రెండు మ్యాచుల్లో జింబాబ్వే ఒక్క విజయం నమోదు చేసినా సూపర్-8 దశకు చేరుతుంది. అదే జరిగితే ఆసీస్ ఆశలకు గండి పడటం ఖాయం
సోమవారం (ఫిబ్రవరి 16) శ్రీలంకతో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ పరాజయం పాలైంది. ఆసీస్ పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సూపర్-8కు దూసుకెళ్లింది. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 181 పరుగులు ఆలౌటైంది. శ్రీలంక కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 18 ఓవర్లలోనే 184 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రీలంక ఓపెనర్ పాథుమ్ నిశాంక 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేసిన బ్యాటర్ గా ఘనత సాధించడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.




.webp)


