TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక్కరు ఓటు వేయలే.. కుప్పంలో ఆసక్తికర పరిణామం..

Published on: Wed Nov 17, 2021 9:43AM

ఏపీలో ప్రతిష్టాత్మకంగా సాగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కుప్పంలో మున్సిపాలిటి ఎన్నికల పోస్టల్ బ్యాలెట్‌లో ఒక్కరంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగీ ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ మొత్తం ఖాళీగా ఉండిపోయింది. పోస్టల్ బ్యాలెట్ లేకపోవడంతో నేరుగా ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. 

ఇక కుప్పం కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసుల ఓవరాక్షన్ చేస్తున్నారు. మీడియాకు అనుమతి లేదు.. ఇక్కడికి రావొద్దంటూ ఆంక్షలు విధించారు. అంతేకాదు.. కెమెరా తీస్తున్న వీడియో గ్రాఫర్లపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. మీడియాపై ఆంక్షలేంటి..? అంటూ పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదు.