జకీర్ నాయక్ విషయంలో అనుకున్నదే జరిగింది..

 

వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ ప్రసంగాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా ఉన్నాయి అంటూ ఇప్పటికే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈయనపై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా ఇండియా వస్తే తనను ఎక్కడ పట్టుకుంటారో అన్న భయంతో భారత్ కు సైతం రావడానికి భయపడుతున్నారు. అయితే ఇప్పుడు అందరూ సందేహించినట్టే అయ్యింది. జకీర్‌ నాయక్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇటీవల ఆయన సంస్థలపై దాడులు జరపగా ఈ విషయం బయటపడింది. జకీర్ నాయక్‌ కు ఇస్లామిక్ రీసెర్చ్‌ పౌండేషన్(ఐఆర్ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ ఉన్న విషయం తెలిసిందే. దీనినుంచి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్కు చెందిన అబూ అనాస్ అనే వ్యక్తికి రూ.80,000 స్కాలర్ షిప్పుగా అందించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అనాస్ సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న సమయంలో అతడికి రాజస్థాన్‌ లోని టోంక్ లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో ఉపకార వేతనం రూపంలో జమ చేసినట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది. అనాస్ తొలుత తనకు స్కాలర్ షిప్పు ఇవ్వాలంటూ వెబ్‌ సైట్‌ ద్వారా దరఖాస్తు చేసు అతడిని ముంబయికి పిలిచి ఇంటర్వ్యూ చేసి ఈ డబ్బు మంజూరు చేశారు.

 

ఇదిలా ఉండగా అసలు అనాస్ సమాచారంతోనే ఎన్ఐఏ జకీర్ సంస్థపై దాడి జరిపింది. ఇటీవలే యువతను ఉగ్రవాదానికి ప్రేరేపిస్తున్న కారణంతో అనాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను విచారించగా ఈ వివరాలు చెప్పడంతో. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ జకీర్ సంస్థలపై దాడి చేసింది. మరి ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి. ముందు ఇంతకాలం తనకేమి తెలియదు అని బొంకిన జకీర్ దీనికి ఏం సమాధానం చెపుతారో చూడాలి.