TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్టీరింగ్ పట్టిన మైనర్.. క్షణాల్లో అదుపు తప్పిన కారు.. బైక్‌లపై బీభత్సం..!

Published on: Sun Aug 2, 2026 4:17PM

 

యూసఫ్ గూడలో కారు బీభత్సం..ఇద్దరికి తీవ్ర గాయాలు..!

కారు తాళాలు కారులోనే ఉన్నాయి.. డ్రైవింగ్‌పై అనుభవం లేదు.. అయినా సరే స్టీరింగ్ పట్టుకున్నాడు. కారు ముందుకు కదిలిన కొద్దిసేపటికే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వరుసగా బైక్‌లను డీ కొట్టుకుంటూ దూసుకె ళ్లింది. చివరకు రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. యూసఫ్ గూడ కార్మికనగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎల్లార్ కిషోర్ హైస్కూల్ సమీపంలో ఉదయం సాధారణంగానే రాకపో కలు సాగుతున్నాయి. రోడ్డుపక్కన కొన్ని ద్విచక్ర వాహనాలను వరుసగా నిలిపి ఉంచారు. ఇంతలో వేగంగా వచ్చిన బలెనో కారు ఒక్కసారిగా అదుపు తప్పి వరుసగా నిలిపి ఉంచిన ఏడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.

అంతటితో ఆగకుండా రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఒక్కసా రిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అక్కడికి చేరుకున్న వారికి ధ్వంసమైన బైక్‌లు, రోడ్డుపై పడిపోయిన బాధితులు కనిపించారు. బైక్‌పై కార్మికనగర్‌కు చెందిన సోదరులు రాజ్‌కుమార్ (60), ప్రభాకర్ (55) ప్రయాణిస్తు న్నారు. ఇద్దరూ కలిసి చర్చికి వెళ్తుండగానే కారు అత్యంత వేగంగా వెళ్లి వారి బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆస్ప త్రులకు తరలించారు. రాజ్‌కుమార్‌ను మాక్స్ ఎయిడ్ ఆస్పత్రికి, ప్రభాకర్‌ను స్టార్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. పోలీసుల ప్రాథ మిక దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బోరబండకు చెందిన  అలీ అహ్మద్ ఖాన్(17) ఈ కారును నడిపినట్లు తెలుస్తోంది. అతని స్నేహితుడు అద్దెకు తీసుకున్న కారును శుభ్రం చేసిన అనంతరం తాళాలు కారులోనే వదిలేసి వెళ్ళిపోయారు. 

దీంతో డ్రైవింగ్‌లో అనుభవం లేని అలీ అహ్మద్ ఖాన్ కారు నడిపేందుకు ప్రయత్నించాడు. కారు స్టార్ట్ చేసిన తర్వాత అదుపు కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్షణాల్లోనే కారు అదుపు తప్పి ఏడు బైక్‌లను ఢీకొట్టడం, ఆపై రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంతో మరోసారి మైనర్లు వాహనాలు నడపడం, వారికి వాహనాలు అందుబా టులోకి రావడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కారు ఎవరి పేరుతో అద్దెకు తీసుకున్నారు? మైనర్‌కు కారు తాళాలు ఎలా అందాయి? అతడు డ్రైవింగ్ చేస్తున్న విషయం స్నేహితులకు లేదా వాహన యజమానికి తెలుసా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Yusuf Guda Karmikanagar, Car accident, Ali Ahmed Khan, Crime news,  CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police