TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సుప్రీంలో వైయస్ విజయమ్మకు చుక్కెదురు

Published on: Mon Jan 16, 2012 1:46PM

న్యూఢిల్లీ:వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసును మరో హైకోర్టుకు బదలీ చేయాలని లేదా సుప్రీం కోర్టులోనే విచారణ జరిపించాలని విజయమ్మ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. పిటిషన్ తీరు న్యాయవ్యవస్థను కించపర్చేలా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను భంగపర్చకుండా ఉండేందుకు పిటిషన్ వెనక్కి తీసుకుంటారా లేదా తిరస్కరించమంటారా అని విజయమ్మ తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. దీంతో విజయమ్మ న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు నాట్ బిఫోర్ పద్ధతి అంతటా ఉన్నప్పుడు వేరే చోటకు బదలీ చేస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించింది. వేరే రాష్ట్రాలకు బదలీ చేస్తే అక్కడా ఇదే పద్ధతి ఉండదని నమ్మకమేమిటని ప్రశ్నించింది. వేసిన పిటిషన్ మొత్తం న్యాయవ్యవస్థపై దాడి చేసినట్లుగా కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యనించింది. ఇటువంటి పరిస్థితి తాము గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొంది.ఇటీవల హైకోర్టు చంద్రబాబు ఆస్తుల కేసు విచారణపై స్టే విధించిన విషయం తెలిసిందే.